ఆమ్మ వారి గుడికి వెళ్ళి, "అమ్మా! అకలి." అని, స్వామివారి గుడికివెళ్ళి,"తండ్రీ, రక్షించు!",అంటే చాలేమో?
ఏమైనా, దేవుడిని ఏమి అడిగినా ఇస్తాడు. ఏమీ అడగకపోతే అన్నీ ఇస్తాడు.
#నేను_దేవుడు_మాదీ_మాదీ_బరంపురం_మీది_తెనాలైతే_నేనేం_ఛైను
ఏదో కావాలని కోరుకుని, దేవుణ్ణి పొగుడుతూ చేసే ప్రార్థనలంటే నాకు అంతగా గిట్టదు. కానీ మన మంత్రాలన్నీ అలాగే ఉన్నాయి అనిపిస్తుంది. దేవుడికి థాంక్స్ చెప్తూ (పొగడ్త = థాంక్స్ అంటే వాదించను గానీ..) చేసే ప్రార్థనలు ఏవీ లేవా? రావా?
#నేను_దేవుడు_మాదీ_మాదీ_బరంపురం_మీది_తెనాలైతే_నేనేం_ఛైను
వేసవి మిట్ట మధ్యాహ్నం మండుటెండలో నడుస్తూనో, వర్షాకాలం కుంభవృష్టిలో తడుస్తూనో, శీతాకాలపు వణికించే చలిలో నా ఆనవాలుని ఊడుస్తూనో, నా కోసం నీ దగ్గిర నలుసంత జ్ఞాపకం ఉంచు.
#అంతర్వాహిని
ఇలా నాథమునులు మధురకవి ఆళ్వార్ రాసిన గురుస్తుతిని జపించి, కాలగర్భంలో కలిసిపోయిన 4,000 దివ్య పాశురాలను మళ్లీ ఈ లోకానికి అందించారు. అందుకే శ్రీవైష్ణవ గురు పరంపరలో నాథమునులను మొదటి ఆచార్యుడిగా కొలుస్తారు.
నమ్మాళ్వార్ నాథమునులకు తాను రచించిన నాలుగు ప్రబంధాలను అనుగ్రహించారు, వారితో పాటు మిగిలిన 11 మంది ఆళ్వారులు రచించిన పాశురాలన్నింటినీ కలిపి, మొత్తం 4,000 పాశురాలను (నాలాయిర దివ్య ప్రబంధం) నాథమునుల హృదయంలో స్ఫురించేలా జ్ఞానాన్ని ప్రసాదించారు.
నాథమునులు ఆ మాటలను పూర్తిగా నమ్మి, నమ్మాళ్వార్నే తన సర్వస్వంగా భావించి, ఆ చింతచెట్టు కింద యోగ ముద్రలో కూర్చున్నారు. ఆయన మనసంతా నమ్మాళ్వార్పైనే నిలిపి, ఆ 11 పాశురాలను నిరంతరాయంగా 12,000 సార్లు పఠించారు.
"నువ్వు నమ్మాళ్వార్ ధ్యానం చేస్తూ, ఆయన తపస్సు చేసిన చింతచెట్టు (తిరుప్పుళి ఆళ్వార్) కింద కూర్చుని, ఈ 'కణ్ణినుణ్ శిరుత్తాంబు' లోని 11 పాశురాలను 12,000 సార్లు అత్యంత భక్తితో జపించు. అప్పుడు నీకు నమ్మాళ్వార్ అనుగ్రహం లభిస్తుంది." అని...
కానీ ఆయన నాథమునులకు ఒక రహస్యాన్ని చెప్పారు. మధురకవి ఆళ్వార్ తన గురువైన నమ్మాళ్వార్ను కీర్తిస్తూ రాసిన 11 పాశురాల "కణ్ణినుణ్ శిరుత్తాంబు" అనే ప్రబంధాన్ని ఉపదేశించారు.
అది విన్న నాథమునులు ఆశ్చర్యపోయి, "మిగిలిన 990 పాశురాలు ఎక్కడ ఉన్నాయి?" అని ఆ భక్తులను అడిగారు. కానీ వారికి వాటి గురించి ఏమీ తెలియదు. కానీ ఆ పాశురాలలో నమ్మాళ్వార్ జన్మస్థలం 'కురుకూర్' (ప్రస్తుత ఆళ్వార్ తిరునగరి) అని ఉండటం చూసి, నాథమునులు నేరుగా ఆ ఊరికి చేరుకున్నారు.
ఒకరోజు నాథమునులు కుంభకోణంలోని శార్ఞ్గపాణిస్వామి దేవాలయంలో ఉన్నప్పుడు, కొందరు భక్తులు నమ్మాళ్వార్ రాసిన 'తిరువాయిమొళి' లోని పది పాశురాలను పఠించడం విన్నారు. ఆ పాశురాల చివరలో "ఆయిరత్తుళ్ ఇప్పత్తు" (ఈ వెయ్యి పాశురాలలో ఈ పది) అనే పదం వచ్చింది.
శ్రీవైష్ణవ సంప్రదాయంలో అత్యంత ప్రాముఖ్యత కలిగిన ఘట్టాలలో నాథమునులు దివ్యప్రబంధాన్ని (4000 పాశురాలు) తిరిగి ఎలా వెలికితీశారనే కథ ఆసక్తికరమైంది. తాతగారు నాకు చిన్నపుడు ధ్యానం నేర్పిస్తూ చెప్పిన కథ ఇది. అప్పట్లో కళ్ళు మూసుకుని పైకి గంభీరంగా నెమ్మదిగా అష్టాక్షరి చెప్పటమే ధ్యానం నాకు.