My heartfelt congratulations to @SmtSudhaMurty garu on being nominated to the Rajya Sabha on International Women’s Day. Her invaluable contributions as a philanthropist, social worker, entrepreneur and author are immeasurable. I earnestly hope that she achieves even greater heights in her future endeavors.
అంతర్జాతీయ మహిళా దినోత్సవానికి ఒక రోజు ముందుగా నేడు అక్కచెల్లెమ్మల ఖాతాల్లో వైయస్ఆర్ చేయూత సాయాన్ని విడుదల చేశాం. దేశంలో మరెక్కడా లేనివిధంగా మహిళా సాధికారత విషయంలో మన ప్రభుత్వం చిత్తశుద్ధి చూపుతోంది. 45 నుంచి 60 ఏళ్ళ మధ్య వయస్సు ఉన్న అక్కచెల్లెమ్మల చేతిలో డబ్బు పెడితే వారి కుటుంబాలు బాగుపడతాయని ఈ పథకాన్ని ప్రవేశపెట్టాం. నేటితో కలిపి నాలుగు విడతల్లో ఒక్కొక్కరి ఖాతాల్లో రూ.75 వేలు జమ చేశామని చెప్పేందుకు గర్వపడుతున్నాను. #YSRCheyutha
We will have a practical, pragmatic 10 year vision and roadmap for Vizag, the executive capital of Andhra Pradesh.
I assure everyone, post the upcoming elections, my swearing in ceremony for my second term as the Chief Minister will be in Vizag and I will be staying in Vizag.
This, is my commitment to Vizag!
#VisionVisakha
‘తాకట్టులో సచివాలయం’ శీర్షికతో 03–03–2024న ఆంధ్రజ్యోతి దినపత్రికలో ప్రచురించిన వార్త పూర్తిగా అవాస్తవం. ఇలాంటి నిరాధారమైన కథనాన్ని ప్రచురించినందుకు ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియాకు ఫిర్యాదు చేయటం జరుగుతుంది.
– రాష్ట్ర సచివాలయంలోని అయిదు భవనాలు హెచ్డీఎఫ్సీ బ్యాంకుకు తాకట్టు పెట్టినట్లు వచ్చిన వార్త పూర్తిగా వాస్తవ విరుద్ధం. ఐసీఐసీఐ, హెడ్ డీఎఫ్సీ బ్యాంకుల నుండి ఏపీ సీఆర్డీఏ ఎలాంటి రుణమూ పొందలేదు. రాష్ట్ర సాధారణ పరిపాలన శాఖ నుంచి ఈ విషయమై ఏపీ సీఆర్డీఏకు ఎలాంటి ప్రతిపాదనా రాలేదు. కనార్టియం బ్యాంకులు, హడ్కోల నుంచి ఏపీ సీఆర్డీఏ పొందిన రుణాన్ని ముఖ్యమైన మౌలిక సదుపాయాల కోసం వినియోగించడం జరిగింది.
– రాయపూడిలోని అఖిల భారత సర్వీసు అధికారుల క్వార్టర్స్ జీవోఎంఎస్ నెంబరు: 332, తేదీ: 15.10.2018 ప్రకారం రూ.2,060 కోట్ల రుణాన్ని కన్టార్టియం బ్యాంకులైన యూనియన్ బ్యాంకు ఆఫ్ ఇండియా, బ్యాంకు ఆఫ్ బరోడా, ఇండియన్ బ్యాంకు మంజూరు చేశాయి. ఇందులో రూ.1,955 కోట్లు మాత్రమే ఇప్పటి వరకు సీఆర్డీఏకు రిలీజ్ చేయటం జరిగింది.
– 2017లో హడ్కో రూ.1275 కోట్ల రుణాన్ని మౌలిక సదుపాయాల కోసం మంజూరు చేసింది. అందులో రూ.1,151 కోట్లు మాత్రమే సీఆర్డీఏకు రిలీజ్ చేసింది. రాష్ట్ర ప్రభుత్వం కంఫర్ట్ లెటర్ జారీ చేయటం జరిగింది. ఏపీ సీఆర్డీఏ సచివాలయ భవనాలను తాకట్టు పెట్టి ఎలాంటి రుణమూ పొందలేదు. ఈ వార్త పూర్తిగా అవాస్తవం.
An article containing misleading information about the housing projects of the Government of AP, has been published on Telugu Daily Eenadu.
- A Total of 31.19 lakh house sites has been registered in the name of the women beneficiaries that costs around 75,000 Cr market value of the house sites, given @ 2.5 lakhs per house sites (Minimum).
- A total of 21.75 lakh houses sanctioned in the house sites given till now
- A Total of 8,92,986 houses has been completed and handed over to the beneficiaries (including TIDCO houses)
- 90 bags of cement and 480 Kgs of steel materials are provided to the beneficiaries per house
Coming to other major allegations raised by the Eenadu news daily, details are given below.
Based on the misrepresented details in an article in Eenadu, housing department has decided to serve legal notice for the misleading and defamatory news published on the AP government.
కుప్పం నియోజకవర్గానికి నీరందించే ఒక గొప్ప కార్యక్రమాన్ని నేడు మన ప్రభుత్వంలో నిర్వహించాం. హంద్రీ-నీవా సుజల స్రవంతిలో భాగంగా 672 కిలోమీటర్ల దూరంలో ఉన్న శ్రీశైలం ప్రాజెక్ట్ నుంచి కృష్ణా నది నీటిని కుప్పానికి తీసుకువచ్చాం. 2022 సెప్టెంబర్ 23న ఇదే కుప్పంలో మాట్లాడుతూ ఈ ప్రాంతానికి కృష్ణా జలాలు తీసుకొస్తానని మాటిచ్చాను.
నేడు ఆ మాటను నిలబెట్టుకున్నాను.
ఇంత దూరాన్ని దాటుకుని, ఏకంగా 1,600 అడుగులు పైకెక్కి నేడు కృష్ణమ్మ కుప్పంలోకి ప్రవేశించడం చరిత్రలో సువర్ణాక్షరాలతో లిఖించదగ్గ రోజని చెప్పేందుకు గర్వపడుతున్నాను. ఈ కృష్ణా జలాలను నిల్వ చేసేలా 1 టీఎంసీ సామర్థ్యంతో రూ.535 కోట్లతో రెండు రిజర్వాయర్లను, 0.6 టీఎంసీల సామర్థ్యంతో రూ.215 కోట్లతో పాలార్ ప్రాజెక్ట్‌ను పూర్తిచేసి, మరోసారి ఏర్పడబోయే మన ప్రభుత్వంలో అందుబాటులోకి తీసుకొస్తాం.
విశాఖపట్నంలో నిన్న (25.02.2024) ప్రారంభించిన ఫ్లోటింగ్ బ్రిడ్జ్ తెగిపోయిందని సోషల్ మీడియాలో జరుగుతున్న దుష్ప్రచారం పూర్తిగా అవాస్తవమని VMRDA మెట్రోపాలిటన్ కమిషనర్ ఒక ప్రకటనలో తెలిపారు.
ఫ్లోటింగ్ బ్రిడ్జి పైకి వాస్తవంగా 26.02.2024 నుండి సందర్శకులను అనుమతించాలని భావించినప్పటికీ, వాతావరణ మార్పుల రీత్యా సముద్ర ప్రవాహాలు తీవ్రంగా ఉండటం వల్ల నేడు సందర్శకులను ఫ్లోటింగ్ బ్రిడ్జ్ పైకి అనుమతించ లేదు. సముద్ర ప్రవాహాల తీవ్రత రీత్యా ఫ్లోటింగ్ బ్రిడ్జ్ నిర్వాహకులు “T” పాయింట్ (వ్యూ పాయింట్) ను బ్రిడ్జ్ నుంచి విడదీసి దాని పటిష్టతను పరిశీలించేందుకు, ఏంకర్ (anchor) లకు దగ్గరగా జరిపి నిలిపి ఉంచారు. ఆ విధంగా బ్రిడ్జ్, వ్యూ పాయింట్ ల మధ్య ఏర్పడిన ఖాళీ ప్రాంతాన్ని ఫొటో తీసి “ఫ్లోటింగ్ బ్రిడ్జ్” తెగిపోయిందన్న వార్త సోషల్ మీడియాలో ప్రచారం చేస్తున్నారని మా దృష్టికి వచ్చింది. ఇది పూర్తిగా దుష్ప్రచారం, అవాస్తవం. ఫ్లోటింగ్ బ్రిడ్జ్ నుండి దాని “T” జంక్షన్ వ్యూ పాయింట్ ను సాధారణ మాక్ డ్రిల్ లో భాగంగా మాత్రమే విడదీసి వేరు చేశారు. సముద్ర ప్రవాహాలు తీవ్రంగా (హై టైడ్) ఉన్నప్పుడు ఇది సాధారణంగా చేపట్టే సాంకేతిక పరిశీలనలో భాగమని, భవిష్యత్తులో కూడా అవసరమైన సందర్భాల్లో ఇలాంటి మాక్ డ్రిల్స్ చేపట్టడం జరుగుతుందని VMRDA మెట్రోపాలిటన్ కమిషనర్ చెప్పారు.
‘కోర్టులకూ కత్తెర.. భూ హక్కులకు పాతర’ అంటూ 24–02–2024న ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్‌పై ఈనాడు దినపత్రిక అవాస్తవాలతో తప్పుడు కథనాన్ని ప్రచురించింది. ప్రజల స్థిరాస్తులకు ఎంతో మేలు చేసే ఈ చట్టంపై అపోహలు సృష్టించి వారిలో భయాందోళనలు రేకెత్తించాలన్న ఉద్దేశంతో ఈ కథనం రాసినట్టు స్పష్టం అవుతోంది. ఈనాడు ఆరోపణలు, వాటిపై వాస్తవాలను ఫ్యాక్ట్ చెక్ ద్వారా పొందుపరుస్తున్నాం.
ఆరోపణ: టైటిలింగ్ యాక్ట్ ద్వారా కోర్టులకూ కత్తెర వేశారు? కోర్టుల పరిధి లాగేసి అధికారులకే హక్కుల నిర్ణయాధికారం ఇచ్చారు.
వాస్తవం: ఇది పూర్తిగా అవాస్తవం. కోర్టుల పరిధి యథాతథంగా ఉంటుంది. కోర్టుల అధికారాలపై ఎలాంటి నియంత్రణగాని, ఆ అధికారాలను కుదించడంగాని జరగలేదు. రికార్డ్ ఆఫ్ టైటిల్స్‌లో నమోదైన వివరాలపై, ఏదైనా కోర్టులో అప్పీలు, లేదా రివిజిన్ పిటిషన్ ఫైల్ చేసినట్లయితే, ఆవ్యక్తి కచ్చితంగా టీఆర్‌వోకు తెలియజేయాలని మాత్రమే చట్టం చెప్తోంది. ఏదైనా కోర్టులో ఆ భూమికి సంబంధించి ప్రస్తుతం వివాదం ఉంటే ఆ వివరాలను టైటిల్ రిజిస్ట్రేషన్ అధికారికి తెలియజేస్తే ఆ భూమి, సంబంధిత వివాదాల వివరాలను రిజిష్టర్‌లో నమోదు చేస్తారు. ఇవి పూర్తిగా సంబంధిత కోర్టుల్లో పరిష్కారం అయ్యాకే కోర్టు ఆదేశాల మేరకు తుది వివరాలను రిజిస్టర్లో పొందుపరుస్తారు.
ఆరోపణ: భూ హక్కులకు పాతర వేశారు.
వాస్తవం: భూ యజమాలకు కంక్లూజివ్ టైటిట్స్ ఇచ్చి, రాష్ట్ర ప్రభుత్వం గ్యారెంటీ ఇస్తుంటే భూ హక్కులకు పాతర అంటూ ఈనాడు తప్పుడు కథనం రాసింది. ఇప్పుడు అమల్లో ఉన్న ఆర్.ఓ.ఆర్. చట్టాన్ని ఆధునీకరించి, వాస్తవ పరిస్థితులను ప్రతిబింబించేలా రీసర్వే ద్వారా తుది యాజమాన్య హక్కుల వివరాలు (ఆర్.ఎల్.ఆర్.) ప్రచురిస్తారు. రీ సర్వే తుది ప్రకటన (13 నోటిఫికేషన్) ద్వారా ఆయా ప్రాంతాల్లోని భూముల యాజమాన్య వివరాలు ప్రచురిస్తారు. వాటిని మీ భూమి పోర్టల్ ద్వారా ప్రజలకు అందుబాటులో ఉంచుతున్నారు. కాబట్టి భూ హక్కులకు ఎలాంటి ప్రమాదం లేదు. సెక్షన్ 12 ఆఫ్ ఎల్టీ యాక్ట్ ప్రకారం రికార్డులు పూర్తయ్యాకే భూ యాజమాన్య హక్కుల వివరాలు నోటిఫై చేస్తారు.
ఆరోపణ: ప్రజల స్థిరాస్తికి ఎసరు
వాస్తవం: ఇదీ పూర్తిగా అవాస్తవం. ఈ చట్టం ద్వారా ప్రజల స్థిరాస్తికి పూర్తి భద్రత లభిస్తుంది. ఇప్పుడున్న ప్రిజెమ్టివ్ టైటిల్ వ్యవస్థలో భూమిపై స్వాధీనానుభవం ఉన్నప్పటికీ, రెవిన్యూ రికార్డుల్లో పేరు నమోదు కాకపోతే, ఆ వ్యక్తి ఆస్తి హక్కులకు ఇబ్బంది కలగొచ్చు. రీసర్వే ద్వారా స్వాధీనానుభవంలో ఉండి, హక్కు భుక్తం కలిగిన వ్యక్తుల వివరాలు రీసర్వే ద్వారా రెవిన్యూ రికార్డుల్లో నమోదు చేస్తున్నారు. రీసర్వే పూర్తయిన గ్రామాల్లో సెక్షన్–12 ప్రకారం భూ యాజమాన్య హక్కులను నోటిఫై చేస్తారు. 2 ఏళ్ల తర్వాత ఆ వివరాలపై ఎలాంటి వివాదాలూ లేకపోతే ఆ భూమిపై వారికి కంక్లూజివ్ టైటిల్ వస్తుంది. తద్వారా ప్రభుత్వ గ్యారెంటీ వారికి లభిస్తుంది.
ఆరోపణ: కుంపటి రాజేసిన టైటిలింగ్ యాక్ట్
వాస్తవం: ఇదీ పూర్తిగా అవాస్తవం. గత ప్రభుత్వం హయాంలో వెబ్‌ల్యాండ్ అనే విధానాన్ని పెట్టి తప్పులతడకగా రికార్డులు నమోదుచేసి, కక్షపూరితంగానో లేక దురుద్దేశంతోనో ఆంక్షల జాబితాలో చేర్చి భూ యజమానులను తీవ్ర ఇబ్బందులకు గురిచేశారు. అప్పుడు చెలరేగిన కుంపట్లు చల్లార్చేలా, వాటన్నింటినీ సరిచేసేలా ఈ ప్రభుత్వం రీసర్వే సహా కొత్త చట్టాన్ని తీసుకువచ్చింది.
ఆరోపణ: భూ కబ్జాదారులకు వరంగా కొత్త చట్టం
వాస్తవం: ఇదీ పూర్తిగా అవాస్తవం. ప్రస్తుతం అమల్లో ఉన్న విధానాల ద్వారా ప్రజలు అవస్థలు పడుతున్నారు. ఎవరికీ క్లియర్ టైటిల్స్ లేవు. దశాబ్దాల తరబడి వీటికి పరిష్కారాలు దొరక్క యాజమానులు అష్టకష్టాలు పడుతున్నారు. వీటిని ఆసరాగా తీసుకుని బలహీనులనూ, అమాయకులనూ మోసం చేయడమో, మరో రకంగానో బలమున్నవారు రకరకాల పత్రాలు సృష్టించి, ఉన్న రికార్డులను ఫోర్జరీ చేసి, దొంగ రిజిస్ట్రేషన్లు చేసి వారి పొట్టకొడుతున్నారు. కొత్త చట్టం ప్రకారం (రీ–సర్వేలో భాగంగా) ప్రతి భూభాగం అక్షాంశాలు, రేఖాంశాల ఆధారంగా హక్కుదారులను నిర్ధారిస్తారు. ఈ రికార్డులను తారుమారు చేయడం, ఫోర్జరీ చేయడం అసాధ్యం.
ఆరోపణ: తనఖాపెట్టి అప్పు తీసుకునే దస్తావేజుని సైతం టైటిలింగ్ చట్టం ప్రకారం టీఆర్‌వోకు తెలియజేయాలి, అనుమతి తీసుకోవాలి. అప్పుడే ఈ తాకట్టు చెల్లుతుంది. దీంతో ప్రజలు అప్పులు తీసుకున్న విషయం కూడా రిజిస్టర్‌లోకి ఎక్కుతుంది. ఈ విధానం పౌరుల వ్యక్తిగత గోప్యతకు భంగం కలిగించడమే.
వాస్తవం: ఇది ముమ్మాటికీ అసత్యం. ఈ చట్టంలో భాగంగా తాకట్టు వివరాలు, జీపీఏ, విల్లు వివరాలు తప్పనిసరిగా నమోదు చేయాలన్న నిబంధన కొనుగోలు చేస్తున్న వ్యక్తికి, క్లెయిమెంట్‌కు (లబ్ధిదారునకు) నష్టం జరగకూడదనే ఉద్దేశంతో పెట్టారు. ఇదేమీ కొత్తగా పెట్టింది కాదు. ఉదాహరణకు ఇప్పటికే ఒకరు తమ స్థిరాస్తిని బ్యాంకులో తనఖా పెడితే, బ్యాంకుల వారు రిజిస్ట్రేషన్ డిపార్ట్మెంట్కు అధికారికంగా తెలియజేస్తున్నారు. తద్వారా కొనుగోలు చేసే వ్యక్తికి నష్టం జరక్కుండా, వివాదాలు రాకుండా పారదర్శకంగా వివరాలు అందుబాటులో ఉంటాయి. ఇవే జాగ్రత్తలను ఇప్పుడున్న చట్టంలో తీసుకుంటున్నారు.
ఆరోపణ: వైకాపా ప్రభుత్వ బాధ్యతారాహిత్య చర్య
వాస్తవం: ఇది పూర్తిగా అవాస్తం. పశ్చిమ దేశాల్లో అమల్లో ఉన్న టైటిల్ గ్యారంటీ చట్టాన్ని తీసుకురావటంలో భాగంగా భారత ప్రభుత్వం 1989లో డి.సి.వాద్వా కమిటీని నియమించింది. ఇటీవల కాలంలో నీతి ఆయోగ్, ఇతర ఉన్నత స్థాయి కమిటీల సలహాల ప్రకారం, నమూనా టైటిలింగ్ యాక్ట్‌ను నీతిఆయోగ్ ప్రవేశపెట్టింది. ఈ చట్టం మార్గదర్శకాలకు అనుగుణంగా, రాష్ట్ర అవసరాలను పరిగణనలోనికి తీసుకొని ఈ చట్టాన్ని రూపొందించారు. రెండేళ్లకుపైగా సుదీర్ఘ కసరత్తు తర్వాత కేంద్ర ప్రభుత్వంలోని సంబంధిత శాఖలు, విభాగాల సలహాల మేరకు చట్టంలో మార్పులు చేర్పులు చేసి గౌరవ రాష్ట్రపతి గారి ఆమోదముద్ర పొందటం జరిగింది. ఈ చట్టం రూపకల్పనంలో ఇన్ని వ్యవస్థలు భాగస్వామ్యం ఉంటే బాధ్యతారాహిత్యంగా పేర్కొనడం దురుద్దేశపూర్వకం.
ఆరోపణ: సొంతవారి కోసం రికార్డులు సృష్టించే ఎత్తుగడ
వాస్తవం: ఇదీ పూర్తిగా అవాస్తవం. జగనన్న భూ హక్కు భూ రక్ష పథకం కింద ప్రజలందరి సమక్షంలో రీసర్వే చేసి, హక్కులు నిర్ధారించి ప్రచురిస్తున్నారు. దీనిపై అభ్యంతరాలుంటే వాటినీ స్వీకరించి, విచారించి, పరిష్కరిస్తున్నారు. ఆ తర్వాత తుది జాబితా ప్రచురిస్తారు. ఈ మొత్తం ప్రక్రియలో భూ యజమానులకు ప్రతి దశలోనూ పూర్తి సమాచారం ఉంటుంది. ఇలా రికార్డ్స్ తయారీ పూర్తయ్యాకే సెక్షన్ 12(ఎ) ఆఫ్ ఎల్టీ యాక్ట్ కింద యజమాన్య హక్కులను ప్రచురిస్తారు. ఇలా ప్రచురించిన వివరాలపై ఏవైనా అభ్యంతరాలు వస్తే వాటిని విచారించి, పరిష్కరించి కంక్లూజివ్ రైట్స్‌తో తుది జాబితాను ప్రకటిస్తారు. భూ యజమానుల భాగస్వామ్యంతోనే ఈ రికార్డులను రూపొందించడం జరుగుతుంది. ఎవరికోసం ఏ రికార్డు రూపొందించాలన్నా ఒకే విధానం ఉంటుంది. ఒక్కొక్కరికి ఒక్కోలా ఉండదు. అందువల్ల సొంతవారి కోసం ఎత్తుగడ అనడం అవాస్తవం.
ఆరోపణ: అభ్యంతరాలొచ్చాక సలహాలు స్వీకరిస్తామంటూ కల్లబొల్లి మాటలు.
వాస్తవం: అభివృద్ధి చెందిన దేశాల్లో ఇప్పటికే అమల్లో ఉన్న భూ యాజమాన్య చట్టాలను పరిశీలించి, వివిధ ఉన్నత స్థాయి కమిటీల సలహాలతో ఈ చట్టం తయారు చేశారు. దీన్ని అమల్లోకి తీసుకురావడంలో భాగంగా ప్రజలకు సులువుగా అర్థమయ్యేలా, అందుబాటులో ఉండేలా రూల్స్ తయారీకి ల్యాండ్ అథారిటీ సలహాలు, సంప్రదింపులు చేపట్టింది. నూతన సాంకేతిక పరిజ్ఞానంపై అవగాహన పెంచడం, దీన్ని వాడుకోవడంలో ఎదురయ్యే సాధకబాధకాలను పరిశీలించి, వాటిని నివారించే ప్రక్రియలో భాగంగానే ఈ సలహాలు సంప్రదింపులు చేపట్టింది. దీన్నీ తప్పుబడుతూ ఈనాడు అవాస్తవాలు రాసింది.
ఆరోపణ: మీకు భూమి ఉంది, కొత్తగా ఏర్పాటుచేసిన రిజిష్టర్‌లో పేరు లేదనే సాకుతో ఇప్పుడున్న పత్రాలను చెల్లని కాగితాల కింద లెక్కగడితే...
వాస్తవం: ఇదీ పూర్తిగా అవాస్తవం. భూ యజమానులకు కంక్లూజివ్ రైట్స్ ఇవ్వడానికి రీ సర్వే, ల్యాండ్ టైటిల్ యాక్ట్ చట్టం అనే రెండు ప్రక్రియలను ప్రభుత్వం పాటిస్తోంది. వీటి అమల్లో భాగంగా తయారుచేసే కొత్త రికార్డులన్నీ భూ యజమాని వద్ద ఇప్పుడున్న పత్రాలు, రికార్డుల్లోని వివరాలే ఆధారాలుగా, మార్గదర్శకంగా ఉంటాయి. కొత్త రిజిస్టర్లో కొత్త వివరాలు, సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించి నిర్ధారించిన హద్దులు పొందుపరుస్తారు. రెండేళ్ల తర్వాతే వివాదాల్లేని భూములకు కంక్లూజివ్ టైటిల్ లభిస్తుంది. కొత్త రికార్డు తయారై భూమికి సంబంధించి ఇప్పుడున్న అనేక రికార్డుల స్థానంలో ఒకే ఒక్క పత్రం వస్తుంది. అంతవరకూ ఇప్పుడున్న రికార్డులన్నీ చెల్లుబాటవుతాయి. ఒకవేళ అన్నిపత్రాలు ఉండికూడా రికార్డుల్లో నమోదు కాకపోతే అప్పిలేట్ అథారిటీ వద్ద దరఖాస్తు చేసుకుని, ఆ సమస్యకు పరిష్కారం పొందవచ్చు.
ఆరోపణ: భూ వివాదాల విచారణ అధికారాన్ని సివిల్ కోర్టుల నుంచి తీసేసి ప్రభుత్వం నియమించే అధికారులకు అప్పగిస్తే? వారికే శిక్షలు విధించే అధికారం కూడా కట్టబెడితే ఇంతకంటే అరాచకం మరొకటి ఉంటుందా?
వాస్తవం: భూమితో ఎలాంటి సంబంధం లేని ఒక వ్యక్తి కేవలం వివాదాన్ని సృష్టించే ఉద్దేశంతో సివిల్ కోర్టులో కేసు వేస్తే దానివల్ల నిజమైన భూహక్కుదారుడు కోర్టుల చుట్టూ తిరగాల్సి వస్తోంది. ఈ సమస్యను పరిష్కరించే దిశగా చేసిన తాజా చట్టం ప్రకారం సివిల్ ప్రొసీజర్ కోడ్ కింద కాకుండా సహజ న్యాయ సూత్రాలకు లోబడి వివాదాల్లో ఉన్న భూములపై విచారణ కొనసాగుతుంది. దీనివల్ల సమ్మరీ ఎంక్వయిరీ అనగా, భూమికి చుట్టుపక్కల ఉన్న రైతులు, ఊరి పెద్దలు, గ్రామసభ, సంబంధిత హక్కుదారులు మొదలైనవారితో విచారణ జరిపి హక్కు నిర్ధారణ చేస్తారు. దీనివల్ల వివాదం పరిష్కారం త్వరగా జరుగుతుంది. అప్పటికీ సంతృప్తి చెందకపోతే హైకోర్టును ఆశ్రయించవచ్చు.
అలాగే శిక్షల విషయంలోనూ ఈనాడు దినపత్రిక తప్పుడు ప్రచారం చేస్తోంది.ఎవరైనా భూములకు సంబంధించి తప్పుడు సమాచారం ఇచ్చినా, దురుద్దేశంతో సమాచారం ఇచ్చినా దాన్ని నేరంగా పరిగణిస్తారు. అధికారులు శిక్ష విధిస్తారనే మాట చట్టంలో ఎక్కడా లేదు. దీనికి లేనిపోనివి ఆపాదించి వక్రీకరణలతో ఈనాడు దినపత్రిక రాసింది.
ఆరోపణ: మీ భూమికి సంబంధించి హైకోర్టులోను సుప్రీంకోర్టులోను నడిచిన కేసు పూర్తయింది. తీర్పు వచ్చిన 15 రోజుల్లోగా ఆ వివరాలను ప్రభుత్వానికి అందించాలి. లేదంటే ఆ తీర్పునకు విలువ లేదని ప్రభుత్వం అంటే అది నియంతృత్వం కాక ప్రజాస్వామ్యం అంటారా? హైకోర్టు, సుప్రీంకోర్టు తీర్పులను సైతం అమలు చేయడం సాధ్యం కాదంట!
వాస్తవం: ఇదీ పూర్తిగా అవాస్తవం. భూ యాజమాన్య హక్కులు పూర్తి పారదర్శకంగా నిర్వహించడం ఎల్టీ యాక్ట్ ఉద్దేశం. కోర్టు ఇచ్చిన ఆదేశాలు వెంటనే తెలియజేస్తేనే కదా, ఆ ఆదేశాలకు విలువ, గౌరవం ఇచ్చినట్టు అవుతుంది? అంతేకాకుండా వాటిని అమలు చేయడానికికూడా ఆస్కారం ఉంటుంది. కోర్టు ఉత్తర్వుల వివరాలు తెలిస్తేనే కదా రికార్డులు పారదర్శకంగా, అప్ టు డేట్‌గా ఉండేది? అలాకాకపోతే రికార్డుల్లో పాత వివరాలతోనే లావాదేవీ జరిగితే.. కోర్టు తీర్పు ద్వారా న్యాయం జరిగిన వ్యక్తికి, ఆ న్యాయాన్ని నిరాకరించినట్టే కదా? న్యాయబద్ధంగా రికార్డులు ఉండడం, కోర్టు ఆదేశాలను సత్వరమే పాటించడం, ఆమేరకు భూ యజమానులకు మేలు చేయడం తప్పు అని ఈనాడు రాస్తోంది. ఇందులో నియంతృత్వానికి తావేలేదు.
ఆరోపణ: న్యాయ వ్యవస్థలకే ముకుతాడు వేసేలా, న్యాయాధికారుల హక్కులను లాక్కునేలా, హైకోర్టు, సుప్రీంకోర్టు తీర్పులను బేఖాతరు చేసేలా, సివిల్ ప్రొసీజర్ కోడ్‌ను తోసిరాజనేలా రాష్ట్ర ప్రభుత్వం భూ యాజమాన్య హక్కు చట్టం తీసుకొచ్చింది.
వాస్తవం: కేసు వేసే వ్యక్తి హైకోర్టు లేదా సుప్రీంకోర్టును ఆశ్రయించడానికి స్వేచ్ఛ ఉంది. తుది రికార్డు తయారయ్యేంత వరకూ కూడా ఏ స్థాయి కోర్టుల్లో ఎలాంటి వివాదం ఉన్నా, ఎలాంటి వ్యాజ్యాలు ఉన్నా వాటిని కోర్టు పరిధిలో ఉన్న భూమి అంటూ స్పష్టంగా పేర్కొనడం జరుగుతుంది. కోర్టు ఆదేశాలు వచ్చేవరకూ వాటి కంక్లూజివ్ టైటిల్స్ ఇవ్వరు. కోర్టుల అధికారాన్ని లాక్కున్నారని ఈనాడు రాసింది పూర్తిగా అవాస్తవం.
ఆరోపణ: న్యాయశాస్త్ర పరిజ్ఞానం లేని అధికారులకు భూ యాజమాన్య హక్కులను నిర్ణయించే అధికారాన్ని కట్టబెడుతూ బాధ్యతారాహిత్యంగా వ్యవహరించింది?
వాస్తవం: బ్రిటిష్ కాలం నుంచీ భూపరిపాలనా వ్యవస్థ అధికారుల కిందే ఉంది. భూ పరిపాలనా వ్యవస్థల ఆధారంగానే ప్రభుత్వాల పునాదులు ఏర్పడ్డాయి. ల్యాండ్ సీలింగ్ యాక్ట్, ఎస్టేట్ ఇనాం యాక్ట్, అసైన్మెంట్ యాక్ట్, సర్వే, ఆర్వోఆర్ యాక్ట్ం వంటి చట్టాలకింద హక్కుల నిర్వహణను ప్రభుత్వంలోని అధికారులే చేసుకుంటూ వస్తున్నారు. ఏ ప్రభుత్వం ఉన్నా అధికారులకే ఈ భూపాలనా అధికారాలను నిర్వహిస్తూ వచ్చారు. హక్కుల నిర్ధారణ, రికార్డుల నిర్వహణ, క్షేత్రస్థాయి పరిశీలనలో ఈ విభాగాలకు శతాబ్దానికిపైగా అనుభవం ఉంది. వారికి నైపుణ్యంలేదని, అవగాహన లేదని చెప్పడం ఈనాడు దినపత్రిక అవాస్తవాలు రాసింది. ఈ ప్రభుత్వం వచ్చాక సర్వేయర్లు, గ్రామ సచివాలయాలు, సమగ్ర సర్వే రూపంలో భూ పరిపాలనా వ్యవస్థ మరింత బలపడింది.
ఆరోపణ: ఈ చట్టంలో సెక్షన్ –5 టైటిల్ రిజిస్ట్రేషన్ ఆఫీసర్ నియామకం గురించి తెలియజేస్తుంది. ఏ వ్యక్తినైనా టీఆర్వోగా నియమించవచ్చని చెప్తోంది. రాజకీయ నేతల చెప్పుచేతల్లో ఉన్నవారిని నియమిస్తే టైటిల్ రిజిస్టర్లో అసలు యజమానులకు బదులు, ఇతరుల పేర్లు చేర్చి భూ కబ్జాలకు ఊతం ఇస్తారనే భయం ఉంది?
వాస్తవం: ప్రజలను ఆందోళనకు గురిచేయడానికి ఈనాడు ఇలాంటి విష ప్రచారం చేస్తోంది. భూ యాజమాన్యంపై ప్రభుత్వం ప్రతిష్టాత్మక చట్టాన్ని తీసుకువచ్చింది. ఎలాంటి లోపాలు లేకుండా, రికార్డులు తారుమారు చేయకుండా, నకిలీలు సృష్టించకుండా, కబ్జాలకు తావులేకుండా అన్ని జాగ్రత్తలూ తీసుకుంటోంది. ప్రపంచంలోని అత్యుత్తమ సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగిస్తోంది. ఏ అధికారి అయినా తప్పనిసరిగా నిర్ధారిత ప్రక్రియను పాటించాలే తప్ప, తనకు ఇష్టం వచ్చినట్టు చేయలేరు. ఎవరిని ల్యాండ్ టైటిల్ రిజిస్ట్రేషన్ ఆఫీసర్‌గా నియమించాలన్నది అథారిటీ నిర్ణయిస్తుంది. దీనికి సంబంధించిన రూల్స్‌ను అథారిటీ తయారు చేస్తోంటే ఈనాడు తప్పుడు వార్తలు రాస్తోంది.
ఆరోపణ: అధికార పార్టీ నేతలు ఒత్తిడితో నిరక్షరాస్యులు, రైతుల భూములను ఇతర పేర్లపై మార్చేయవచ్చు. ఏదైనా ఆస్తి తమదే అని అంటూ ఎవరైనా తప్పుడు క్లైయిమ్ దాఖలు చేస్తే సంబంధిత ఆస్తి వివాదంలో ఉన్నట్లు డిస్ప్యూట్ రిజిస్టర్లో టీఆర్ఓ నమోదు చేస్తారు. వెంటనే సమస్య ల్యాండ్ టైటిలింగ్ ఆఫీసర్, జాయింట్ కలెక్టర్ హోదాకు తగిన అధికారి వద్దకు చేరుతుంది. అక్కడ తేలే వరకు ఆ ఆస్తిపై ఎలాంటి లావాదేవీలకు క్రయ విక్రయాలకు అవకాశం ఉండదు. అంటే గిట్టని వ్యక్తులు తప్పుడు ఒప్పందాన్ని తయారుచేసి డిస్ప్యూట్ రిజిస్టర్లో ఆ విషయాన్ని నమోదు చేయిస్తే అసలైన యజమాని తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోవాల్సి ఉంటుంది.
వాస్తవం: కంక్లూజివ్ టైటిల్స్ రాత్రికే రాత్రే ఇవ్వరు. రీసర్వే ప్రక్రియ పూర్తయ్యాకే ఈ టైటిల్స్ ఇస్తారు. దీనికి రెండేళ్లపైనే పడుతుంది. వివాదాలు లేని భూములనే టైటిల్ ఆఫ్ రిజిస్టర్లో నమోదుచేస్తారు. దీని తర్వాత కూడా కంక్లూజివ్ టైటిల్స్ సమయంలో ఎవరు అభ్యంతరం వ్యక్తం చేయవచ్చు? దేన్ని వివాదంగా చూడాలి? అన్న విషయాలను అథారిటీ తన రూల్స్‌లో స్పష్టంగా పేర్కొంటుంది. ఈ రూల్స్ ప్రస్తుతం తయారవుతున్నాయి.
ఆరోపణ: రికార్డుల్లో ఒకసారి పేరు చేర్చాక ఎవరూ అభ్యంతరం చెప్పకపోతే రెండేళ్ల తర్వాత ఆ పేరు గల వ్యక్తి యజమాని అవుతాడు.రిజిస్టర్లో పేర్లను చేర్చే క్రమంలో కొందరు అధికారులు, రాజకీయ నేతలు చెప్పినట్లుగా తయారు చేసే అవకాశం ఉంది. రిజిస్టర్లో ఎవరి పేరు నమోదు చేశారో నిరక్షరాస్యులు, రైతులు సులువుగా తెలుసుకోలేరు. పైగా టైటిల్ రిజిస్టర్‌ను ఆన్లైన్లో ఉంచుతామని చట్టంలో పేర్కొనలేదు. సర్టిఫికెట్లు, పహానిల ప్రస్తావనే లేదు. అందుకే అధికారులు రిజిస్టర్లను గోప్యంగా ఉంచి అవినీతికి పాల్పడతారని ఆందోళన నెలకొంది.
వాస్తవం: భూ హక్కు చట్టం సెక్షన్ 57 ప్రకారం ఈ చట్టం కింద చేసే ప్రతి పనిని పారదర్శకతకోసం, మానవ తప్పిదాలు, పొరపాట్లు, ఉద్దేశపూర్వక చర్యలు లేకుండా ఉండేందుకు ఆన్లైన్లో చేయాలని చెబుతుంది. అంటే ఒక పేరు చేర్చాలన్నా, తీయాలన్నా ఏది జరగాలన్నా ఆన్లైన్లో అందరికీ అందుబాటులో, అందరూ చూసేలా ఉంచుతారు. ఈ చట్టంలో సెక్షన్ 57, 58, 59 లలో ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ యాక్ట్ 2000 కింద ఎవరూ మార్పులు చేయడానికి వీల్లేకుండా అన్నిరకాల సెక్యూరిటీ ఫీచర్లతో ఉన్న కంప్యూటర్ సిస్టం తయారు చేయాల్సిందిగా నిర్దేశించడం జరిగింది. ఈ చట్టం కింద జరిపే ప్రతి వ్యవహారాన్ని, ప్రతి నిమిషం ఎవరైనా, ఎక్కడైనా చూసుకునే అవకాశం ఉన్నందున అధికారులు, రాజకీయ నేతలు ప్రమేయానికి ఆస్కారమే లేదు. వివాదాలకు ఆస్కారం లేకుండా భూ యజమానికి కంక్లూజివ్ టైటిల్ ఇస్తారు. దీనికి ప్రభుత్వం గ్యారంటీ కూడా ఇస్తుంది.
ఆరోపణ: ఆస్తులకు సంబంధించిన దస్తావేదులు ప్రస్తుతం యజమానుల దగ్గరే ఉంటాయి. క్రయవిక్రయాల సమయంలో వాటిని అధికారంగా వాడుకోవచ్చు. తాజా చట్టం ప్రకారము ఈ దస్తావేజులకు విలువే ఉండదు. మీరే యజమాని అంటూ టీఆర్వోలో ఇచ్చే ధ్రువపత్రమే చెల్లుబాటు అవుతుంది. రిజిస్ట్రేషన్ కార్యాలయాల్లో చట్ట ప్రకారం లక్ష రూపాయలను స్టాంప్ డ్యూటీగా చెల్లించి అధికారంగా పొందిన దస్తావేజులకు విలువ లేకుండా టీఆర్వో ఇచ్చే ధ్రువపత్రానికి అధిక ప్రాధాన్యం ఇవ్వడం అభ్యంతరకరం.
వాస్తవం: ఇదీ పూర్తిగా అవాస్తవం. సెక్షన్ 12 ప్రకారం ప్రచురించిన టైటిల్ ఆఫ్ రిజిస్టర్లో వివరాలపై అభ్యంతరాలుంటే రెండేళ్లలోపు పూర్తి వివరాలతో ఎల్‌టీఏవో వద్ద కానీ, సివిల్ కోర్టులో కానీ దావా వేయవచ్చు. ఎల్‌టీఏవో ఉత్తర్వుల ప్రకారం లేదా కోర్టు ఆదేశాలను అనుసరించి టైటిల్ ఆఫ్ రిజిస్టర్లో వివరాలు నమోదు చేస్తారు. హక్కులు నిర్ధారణ అయి, టైటిల్ ఆఫ్ రిజిస్టర్లో వివరాలు నమోదయ్యే వరకు మన దగ్గర ఉన్న పత్రాలు పదిలంగా ఉంచుకోవచ్చు. ఇవి హక్కుల నిర్ధారణకు ఆధారాలుగా పరిగణిస్తారు. టైటిల్ ఆఫ్ రిజిస్టర్లో నమోదైన రెండేళ్ల తరవాత ఆ భూమిపై సంపూర్ణ హక్కు లభిస్తుంది. అనేక రికార్డుల స్థానే ఒకే ఒక్క హక్కు పత్రం వస్తుంది. ఇప్పటివరకూ యజమానులకు సంబంధించిన భూములపై 1బీ, పాసుపుస్తకం, అడంగల్, రిజిస్ట్రేషన్ డీడ్ రూపంలో అనేక పత్రాలున్నాయి. వీటిస్థానే ఒకే శాశ్వత హక్కుపత్రం వస్తుంది. రికార్డులన్నీ అప్ డేట్‌గా ఉంటాయి. ఎవ్వరూ టాంపర్ చేయలేని రీతిలో పటిష్ట కంప్యూటర్ వ్యవస్థ ద్వారా నిక్షిప్తం అవుతాయి. ఇంతటి పారదర్శక, పటిష్ట ప్రక్రియపై ఈనాడు అవాస్తవాలు రాస్తోంది.
ఆరోపణ: రాష్ట్రంలోని ప్రతి ఒక్కరూ తమ స్థిరాస్తి వివరాలను టైటిల్ రిజిస్టర్లు నమోదు చేయించుకోవాల్సిందే. అధికారులను దారిలోకి తెచ్చుకొని ఎవరైనా ప్రభుత్వ, దేవాదాయ భూములకు యజమానిగా టైటిల్ రిజిస్టర్లో వారి పేరు చేర్పించుకుంటే దాని గురించి పట్టించుకునే వాళ్ళు ఉండరు. రిజిస్టర్లు అధికారులు అధీనంలో ఉంటాయి కాబట్టి బయటకు తెలిసే అవకాశం ఉండదు. పేరు మార్పును రెండేళ్ల వరకు ఎవరూ పట్టించుకోకుంటే ఆ తర్వాత భూములపై యాజమాన్య హక్కులు వారికే దఖలు పడతాయి. అదే జరిగితే అధికారం, ధనబలం, కండబలం ఉన్న వ్యక్తుల చేతుల్లోకి దేవాదాయ, ప్రభుత్వ భూములు వెళ్ళిపోతాయి. ప్రైవేట్ వ్యక్తుల మాదిరిగా ప్రభుత్వ అధికారులు ముందుకు వచ్చి ఆ భూముల కోసం పోరాటం చేసే పరిస్థితి ఉండదు.
వాస్తవం: అవలక్షణాలను వ్యవస్థ నుంచి ఏరిపారేసేందుకు ప్రభుత్వం కృషిచేస్తోంటే ఈనాడు దినపత్రిక అది వద్దన్నట్టు అవాస్తవాలు రాస్తోంది. భూ పరిపాలనా వ్యవస్థలో అధికార బలం, ధనబలం లాంటి అంశాలకు చోటు ఉండకూడదనే వివాదాల్లేని రీతిలో కంక్లూజివ్ టైటిల్స్ అందించే ప్రక్రియ ఈ చట్టం ద్వారా జరుగుతోంది. రిజిస్టర్ ఆఫ్ టైటిల్స్ అనేది భావితరాలకు భూహక్కులకు సంబంధించి ఒక ముఖ్యమైన రిజిస్టర్. దీని తయారీలో తీసుకునే జాగ్రత్తల వల్ల ఇది అత్యంత పకడ్బందీగా ఉంటుంది. దీనితో పాటుగా తయారుచేసే రిజిస్టర్ ఆఫ్ డిస్ప్యూట్స్, రిజిస్టర్ ఆఫ్ చార్జెస్ అండ్ కోవినంట్స్ వల్ల భూములపై ఉన్న అన్ని రకాల చార్జీలు, వివాదాలు ఒక దగ్గరికి వస్తాయి. దేవాదాయ, వక్ఫ్, ప్రభుత్వ, ప్రైవేటు భూములు ఏవైనా వాటిని నిర్దేశించిన పద్ధతిలోనే రిజిస్టర్ ఆఫ్ టైటిల్స్‌లో నమోదు చేస్తారు. దీంతోపాటు తయారుచేసే మిగతా రెండు రిజిస్టర్ల వల్ల సదరు భూమిపై ఉన్న అన్ని చార్జీలు, రుణాలు, ఒకే దగ్గర తెలియడం వల్ల ఆ భూమికి సంబంధించి సింగిల్ సోర్స్ ఆఫ్ ట్రూత్‌గా ఈ రిజిస్టర్ ఆఫ్ టైటిల్స్‌ను పరిగణించవచ్చు. ఈ రికార్డులు ఎవరో ఒక అధికారి చేతిలో ఉండవు. ఆన్లైన్లో ఇంటర్నెట్ ఉన్న ప్రతివారూ చూడొచ్చు. భూమిపై ఏ విధమైన మార్పు జరిగినా ఎవరైనా ఎప్పుడైనా వెంటనే తెలుసుకునే అవకాశం ఉంటుంది.
Chief Minister Sri YS Jagan Mohan Reddy congratulated #ISRO team for the successful launch of GSLV F-14 and placing INSAT 3DS satellite into the intended orbit.
The Chief Minister wished ISRO all success in future endeavours.
"పట్టాల రిజిస్ట్రేషన్ పేరిట మాయాజాలం" అంటూ 12–02–2024న ఈనాడు దినిపత్రికలో వచ్చిన వార్త పూర్తిగా అవాస్తవం. ‘నవరత్నాలు – పేదలందరికీ ఇళ్లు’ పథకంలో భాగంగా ఇంటి స్థలంతో పాటు, ఇల్లు కూడా కట్టించి ఇస్తామని హామీ ఇచ్చింది వైయస్ జగన్ గారి ప్రభుత్వం. ఇచ్చిన మాట కంటే మిన్నగా 31 లక్షల 19 వేల మంది నిరుపేదలకు ఇళ్లస్థలాలు ఇచ్చి అందులో 22 లక్షల ఇళ్లు మంజూరు చేసింది. ఇళ్ల నిర్మాణం కూడా వేగంగా జరిగేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంది. ప్రస్తుతం చేస్తున్న రిజిస్ట్రేషన్ ప్రక్రియ వల్ల లబ్ధిదారులకు ఎన్నో ప్రయోజనాలున్నాయి.
– ప్రభుత్వం ఇచ్చిన పట్టా రిజిస్ట్రేషన్ చేయడం వల్ల బ్యాంకుల్లో తక్కువ వడ్డీకి రుణం తెచ్చుకునే సౌలభ్యం లబ్ధిదారుకు వస్తుంది.
– ప్రభుత్వమే రిజిస్ట్రేషన్ చేస్తుంది కాబట్టి బ్యాంకులు రుణం మంజూరు చేస్తాయి.
– డాక్యుమెంట్ రిజిస్టర్ అయి ఉంటుంది కాబట్టి డేటాబేస్‌లో ఈ వివరాలన్నీ పదిలంగా భద్రపరచబడి ఉంటాయి.
– ఎప్పుడంటే అప్పుడు సర్టిఫైడ్ కాపీ పొందే వీలుంటుంది.
– ఫోర్జరీ చేస్తారనిగానీ, ట్యాంపర్ చేస్తారనిగానీ భయం లేదు.
– అమ్మే సమయంలో ఈ డాక్యుమెంట్ ఒకటే ఉంటే సరిపోతుంది.
– ఎలాంటి లింక్ డాక్యుమెంట్లు అవసరం లేదు.
– నేరుగా రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు.
ఇలా పేదలకు ఇంత లబ్ధి చేకూరుతుంటే... దీన్ని రిజిస్ట్రేషన్ మాయాజాలం అంటూ ఈనాడు దినపత్రిక తప్పుడు రాతలు రాసింది.
‘నవరత్నాలు – పేదలందరికీ ఇళ్లు’ పథకంలో భాగంగా మొదటి దశలో కృష్ణా జిల్లా కంకిపాడు మండలం గొడవర్రులో మొదటి దశ ఒకటో లేఔట్లో 53 ఎకరాల 33 సెంట్లు 3045 మంది లబ్ధిదారులకు, రెండో లేఔట్లో 29 ఎకరాల 66 సెంట్ల భూమిలో 777 మంది లబ్ధిదారులకు, మొత్తం 4822 మంది లబ్ధిదారులకు 82 ఎకరాల 99 సెంట్ల భూమిలో ఇంటి పట్టాలిచ్చింది రాష్ట్ర ప్రభుత్వం. ఇందుకోసం ప్రైవేట్ అధీనంలో ఉన్న భూమిని మొత్తం 43 కోట్ల 93 లక్షల 17 వేల రూపాయల వ్యయంతో కొనుగోలు చేసింది. కొనుగోలు చేసిన భూమిని విజయవాడ మున్సిపల్ అథారిటీస్‌కి లేఅవుట్ డెవలప్మెంట్ కోసం అందించింది. రెవెన్యూ అధికారులు విజయవాడ మున్సిపల్ అథారిటీస్ గుర్తించిన లబ్ధిదారులకు పట్టాలు కూడా పంపిణీ చేశారు.
ఈనాడు రాసింది: ఏ ప్లాటు ఎక్కడో గుర్తించడమే కష్టం
లబ్దిదారులు వారి ప్లాట్ ఎక్కడ ఉందో గుర్తించలేని స్థితిలో ఉన్నాయి అన్నది పూర్తిగా అవాస్తవం. ఇవి కేవలం ఈనాడు తప్పుడు రాతలు. రాష్ట్రంలో ఇళ్ల స్థలాలు ఇచ్చినప్పుడే ప్లాట్లు విభజన చేసి, సరిహద్దు రాళ్లు వేయడం జరిగింది. అలాగే లబ్ధిదారులను వారి వారి ప్లాట్లలో ఫొటోలు తీసుకుని జియో ట్యాగ్ చేయడం జరిగింది. ప్లాట్‌లో నిలబడి ఫొటో దిగారంటే లబ్ధిదారులకు వారి ప్లాట్ ఎక్కడ ఉందో తెలుసునని అర్థమవుతోంది. ఈనాడు దినపత్రిక ఈ వాస్తవాలేవీ చెప్పకుండా, స్థానికంగా పరిశీలన కూడా చేయకుండా అవాస్తవాలు రాసింది.
ఈనాడు రాసింది: ఇది పేదలను బురిడీ కొట్టించే పన్నాగం కాదా?
ఇది కూడా పూర్తిగా అవాస్తవం. ఎందుకంటే గుంటూరు జిల్లాలో పేరేచర్ల లేఔట్లో 18,090 మందికి పట్టాలు ఇచ్చి, 9219 ఇళ్లను మంజూరు చేసింది ప్రభుత్వం. ఇంకా 6152 ఇళ్ళకు సంబంధించి రెండో విడత గృహ నిర్మాణ కార్యక్రమంలో ఇళ్ల నిర్మాణాలకు ప్రతిపాదనలు ఇవ్వడం జరిగింది. ఇప్పటికే మంజూరైన ఇళ్లలో 1230 ఇళ్ల నిర్మాణం పూర్తికాగా, 486 ఇళ్లు రూఫ్ లెవెల్లోనూ, 6626 ఇళ్లు బేస్మెంట్ స్థాయిలోనూ ఉన్నాయి. కాగా మూడో ఆప్షన్ కింద ఇళ్ల నిర్మాణం చేయడానికి పదిమంది కాంట్రాక్టర్లను నియమించి, మూడు ఇటుక తయారీ కేంద్రాలను ఏర్పాటు చేసింది ప్రభుత్వం. ఈ లేఔట్లో ప్రతిరోజు సుమారు 1000 మంది కార్మికులు నిర్మాణ పనిలో నిమగ్నమై ఉన్నారు. కాగా ఈనాడు పత్రిక కేవలం ప్రభుత్వంపై దుష్ప్రచారం చేసేందుకే అవాస్తవాలను ప్రచురిస్తోంది.
‘కుంభకర్ణుడి వారసులు ఇనాం భూములకు సైంధవులు’ అంటూ 10–02–2024న ఈనాడు దినపత్రికలో ప్రచురించిన కథనం పూర్తిగా అవాస్తవం. ప్రభుత్వం దీన్ని ఖండిస్తోంది. దీనికి సంబంధించిన వాస్తవాలను ఫ్యాక్ట్‌చెక్ రూపంలో కింద పొందుపరుస్తున్నాం.
– నిజానికి కుంభకర్ణుడిలా వ్యవహరించింది గత ప్రభుత్వమే. అనేకమంది రైతులు, కులవృత్తులు చేసుకునే బడుగు బలహీన వర్గాల వారికి శరాఘాతంలా ఇనాం భూముల విషయంలో 2013లో గత ప్రభుత్వమే చట్టం చేసింది. 2019 ఎన్నికలకు రెండు నెలల ముందువరకూ అసలు ఆ విషయాన్నే గత ప్రభుత్వం పట్టించుకోలేదు. అలాంటి గత ప్రభుత్వం గొప్పగా చేసినట్టుగా, ఇప్పుడు ఈ ప్రభుత్వం వాటిని తొలగిస్తూ ముందుకు సాగుతుంటే నిద్రపోయినట్టుగా ఈనాడు దినపత్రిక తప్పుడు కథనం ద్వారా ప్రజలను పక్కదోవ పట్టించేందుకు ప్రయత్నిస్తోంది.
– ఆంధ్రప్రదేశ్ (ఆంధ్ర ఏరియా) ఇనామ్స్ (ఎబాలిషన్ అండ్ కన్వర్షన్ ఇన్ టు రైత్వారీ) చట్టం – 1956 ప్రకారం ఇనాం భూములకు రైత్వారీ పట్టాను రైతులు / ఇనాందారులు / కౌలుదారులకు మంజూరు చేసేందుకు 07.01.1948ని పరిగణన తేదీగా నిర్ణయించారు.
– ఆంధ్రప్రదేశ్ (ఆంధ్ర ఏరియా) ఇనామ్స్ (ఎబాలిషన్ అండ్ కన్వర్షన్ ఇన్ టు రైత్వారీ) చట్టం – 1956లో పొందుపరిచిన దేవాదాయ ఇనాం భూములు / సర్వీస్ ఇనాం భూములు / సంస్థల భూములు / ధార్మిక భూములకు సంబంధించిన చట్టం దుర్వినియోగమవుతున్నందున సుప్రీంకోర్టు పరిశీలన, తదుపరి ఉత్తర్వుల ఫలితంగా, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 2013లో ఇనాం భూమి ఎబాలిషన్ చట్టానికి సవరణ చేసింది. ఈ సవరణలో 14.12.1956 నుండి రెట్రాస్పెక్టీవ్గా వర్తించబడేలా ఉత్తర్వులు జారీ చేసింది.
– దీనిపై గత ప్రభుత్వం ఏమాత్రం దృష్టిసారించలేదు. 2014 నుంచి 2019 వరకూ ఈ విషయంలో ఎలాంటి శ్రద్ధా తీసుకోలేదు. గత ప్రభుత్వం మొద్దు నిద్ర పోయింది. గత ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేకపోవడంవల్ల, కేవలం ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని, 2019 ఎన్నికలకు కేవలం 2 నెలలముందు ఆర్డినెన్స్ 2, 2019ను తీసుకొచ్చింది. ఈ ఆర్డినెన్స్‌లో కూడా లోపాల వల్ల అది చట్టబద్ధతను పొందలేకపోయింది. ఈలోగా ఆర్డినెన్స్ గడువు కూడా ముగిసిపోయింది. దేవాదాయ శాఖ భూములకు, గ్రామ సర్వీసు ఇనాం భూములకు గల వ్యత్యాసాన్ని గుర్తించడంలో గత ప్రభుత్వం పూర్తిగా విఫలమైంది. దీనిపై లోతైన పరిశీలన చేసి, ఆయా వర్గాలకు మేలు చేయాలన్న తలంపు ఏ కోశానా కనిపించలేదు.
– రీ సర్వే ప్రక్రియలో భాగంగా రైతుల నుండి వచ్చిన అభ్యర్థనల మేరకు ప్రభుత్వం జీఓ ఎమ్ఎస్ నంబర్ 310 రెవెన్యూ (ల్యాండ్–1) శాఖ తేదీ 19.07.2023 ను జారీచేసింది. దీని ప్రకారం ఆంధ్రప్రదేశ్ (ఆంధ్ర ఏరియా) ఇనామ్స్ (ఎబాలిషన్ అండ్ కన్వర్షన్ ఇన్ టు రైత్వారీ) చట్టం – 1956 ప్రొవిజన్స్ చట్టానికి అమెండ్మెంట్ యాక్ట్ –16 అఫ్ 2013 ఈ కింద భూముల్లో ఉన్న రైతులకు ఊరటనిచ్చేలా చర్యలు తీసుకుంది.
– ప్రస్తుత ప్రభుత్వం దూరదృష్టితో దేవాలయ భూములు, చారిటబుల్ ఇనాం భూములు, గ్రామ సర్వీసు ఇనాం భూములను విడదీసి ప్రత్యేకంగా ఉత్తర్వులు జారీ చేసి అనేకమంది రైతులకు, బడుగు బలహీనవర్గాల వారికి ఊరటనిచ్చేలా చర్యలు తీసుకుంది. ఈ భూములకు సంబంధించి గతంలో రైత్వారీ పట్టాలు ఉన్నట్టయితే వారికి హక్కులు కల్పిస్తూ 2023, జులై 19న జీవో నంబర్ 310ని జారీచేసింది.
– గ్రామంలో వృత్తులు, కులవృత్తులు చేసుకుంటున్న వారికి, విలేజెస్ సర్వీస్ ఇనామ్స్ / రైత్వారీ పట్టాలు గతంలో జారీచేసిన పట్టాలు చెల్లుబాటు అవుతాయి. అలాంటి పట్టాదారు / లీగల్ హెయిర్స్ / పర్చేజర్స్ను పట్టాదారులాగా రెవెన్యూ రికార్డులో పొందుపరుస్తారు. తదుపరి అవసరమైన రీ సర్వే రికార్డుల్లో కూడా పొందుపరుస్తారు. దీనివల్ల వారికి పూర్తి హక్కులు దఖలు పడతాయి. తద్వారా వారి జీవన స్థితిగతుల్లో గణనీయమైన మార్పులు వస్తాయి.
– యాక్ట్–16 అఫ్ 2013 లోని ప్రొవిజన్స్ మేరకు జీఓ ఎమ్ఎస్ నంబర్ 310 అమలు చేయడం ద్వారా సుమారుగా 1,13,610 మంది రైతులకు చెందిన 1,37,250.18 ఎకరాల భూమి రూపేణా ఆయా రైతులకు లబ్ది చేకూరింది.
– రైతుల కళ్లల్లో ఆనందం చూడలేక, ఈ ప్రభుత్వ ప్రతిష్టను దెబ్బతీసే ఉద్దేశంతో ఈనాడు దినపత్రిక ప్రచురించిన తప్పుడు కథనాన్ని ప్రభుత్వం ఖండిస్తోంది.
యాక్ట్ 16 ఆఫ్ 2013 గురించి ఈనాడు దినపత్రికలో ప్రచురించినవన్నీ అసత్యాలే.
జీఓ ఎమ్ఎస్ నంబర్ 310 తేదీ 19.07.2023 ప్రకారం ప్రభుత్వం ఎండోడ్ ఇనామ్ ల్యాండ్స్ / ఇన్స్టిట్యూషనల్ ఇనామ్ ల్యాండ్స్ / చారిటబుల్ ఇనామ్ ల్యాండ్స్ / విలేజ్ ఆర్టిశాన్స్ / విలేజ్ సర్వీస్ ఇనామ్స్కు తేడాను స్పష్టీకరించడమైనది.
‘వినాశకాలే విలీనబుద్ధి’ అంటూ 10–02–2024న ఈనాడు దినపత్రికలో ప్రచురితమైన కథనం పూర్తిగా అవాస్తవం. కేవలం ప్రభుత్వంపై బురదజల్లేందుకే ఈ తప్పుడు కథనాన్ని ప్రచురించారు. వాస్తవం ఏంటంటే ఈ ప్రభుత్వం ఒక్క బడిని కూడా మూసేయలేదు. విద్యాశాఖలోని ఏ అధికారినీ సంప్రదించకుండా ఇలాంటి తప్పుడు కథనాలు రాయడం దురదృష్టకరం. ఇకమీదట ఇలాంటి తప్పుడు కథనాలు రాస్తే ప్రభుత్వం చట్టపరమైన చర్యలు తీసుకుంటుంది.
– ఇక, వాస్తవం ఏంటంటే... 2014–19 మధ్య గత ప్రభుత్వంలో 1785 పాఠశాలలను మూసేశారు. అలా మూసేసిన బడులను ఈ ప్రభుత్వం వచ్చాక తెరిచింది.
– రాష్ట్రంలో విద్యార్థులకు నాణ్యమైన విద్య అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన సంస్కరణలు జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో ప్రశంసలు అందుకున్నాయి. ఎంతోమంది జాతీయ, అంతర్జాతీయ ప్రతినిధులు మన రాష్ట్రాన్ని సందర్శించి మన విద్యార్థులు, టీచర్లతో కలిసి మాట్లాడారు. మన ప్రభుత్వం తీసుకొచ్చిన సంస్కరణలను ప్రశంసించారు.
విద్యారంగంలో విప్లవాత్మక సంస్కరణలు:
వైయస్ జగన్ గారి ప్రభుత్వం విద్యారంగంలో విప్లవాత్మక సంస్కరణలు చేపట్టింది.
మనబడి నాడు – నేడు ద్వారా ప్రభుత్వ బడులను అన్ని సౌకర్యాలతో సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దింది. పేదరికం చదువుకు అడ్డంకి కాకూడదని అమ్మ ఒడి పథకాన్ని అమలుచేస్తోంది. ప్రభుత్వ బడుల్లో ఇంగ్లీష్ మీడియం ప్రవేశపెట్టింది. బైలింగువల్ పాఠ్యపుస్తకాలు పిల్లలకు ఇస్తోంది. బైజూస్ కంటెంట్‌ను విద్యార్థులకు చేరువ చేసింది. మూడో తరగతి నుంచే సబ్జెక్ట్ టీచర్లను అందుబాటులోకి తెచ్చింది. 8వ తరగతి విద్యార్థులకు అత్యాధునిక ట్యాబ్‌లు అందిస్తోంది. ఆరు నుంచి ఆ పై తరగతుల విద్యార్థుల కోసం తరగతి గదుల్లో ఇంటరాక్టివ్ ఫ్లాట్ ప్యానళ్లు ఏర్పాటుచేసింది. జగనన్న విద్యాకానుక ద్వారా నాణ్యమైన యూనిఫారాలు, షూ, బెల్ట్, సాక్సులు ఇస్తోంది. ప్రభుత్వ బడుల్లో సీబీఎస్ఈ విధానం, ఐబీ విధానాలను తీసుకొచ్చింది.
స్కూల్ మ్యాపింగ్‌కు సంబంధించిన వాస్తవాలు:
– చిన్నారుల్లో వయసుకు తగ్గ విద్యా నైపుణ్యాలు ఉండటం లేదని వివిధ అధ్యయనాలు చెబుతున్నాయి.
– అందువల్ల 1 – 2 తరగతుల బోధన, అభ్యాసంపై దృష్టి కేంద్రీకరించింది ప్రభుత్వం.
– బీఈడీ, గ్రాడ్యుయేషన్ పూర్తిచేసిన టీచర్లను 3వ తరగతి ఆపై విద్యార్థులకు సబ్జెక్ట్ టీచర్లుగా నియమించి విద్యార్థులకు అత్యుత్తమ బోధన, అభ్యసన పద్ధతులు అందిస్తోంది,.
– ప్రైమరీ, హైస్కూళ్ల టీచర్లు, ప్రధానోపాధ్యాయులు ప్రభుత్వ చర్యలను స్వాగతిస్తున్నారు.
– సమగ్ర అధ్యయనం తర్వాతే 2021లో ఈ సంస్కరణలకు శ్రీకారం చుట్టింది రాష్ట్ర ప్రభుత్వం.
– 2022–23 విద్యా సంవత్సరంలో కిలోమీటరులోపు ఉన్న 8,643 ప్రాథమిక, యూపీ పాఠశాలలను గుర్తించి వీటిలో 4,943 పాఠశాలలను సమీపంలోని 3,557 ప్రీ హై స్కూళ్లు, హైస్కూళ్లతో మ్యాపింగ్ చేసింది.
– దీనివల్ల 3 నుంచి 5 తరగతులకు చెందిన 2,43,540 మంది విద్యార్థులకు బీఈడీ అర్హత గల సబ్జెక్టు టీచర్లతో విద్యాబోధన అందుతోంది. ఫలితంగా పిల్లల్లో అభ్యాసన సామర్థ్యాలు మెరుగుపడుతున్నాయి.
– మౌలిక సదుపాయాలు, సరిపడినన్ని క్లాస్‌రూములు ఉన్నచోటే మ్యాపింగ్ చేశారు. అంతేకాకుండా ఏ ఒక్క పాఠశాలనూ ఈ ప్రభుత్వం మూసేయలేదు.
– మ్యాపింగ్ చేసిన ఉన్నత పాఠశాలల్లో 3 నుంచి పదో తరగతి వరకు బోధన చేసేందుకు 66,245 మంది సబ్జెక్టు ఉపాధ్యాయులు కావాలి. ఇందులో 59,663 మంది ఇప్పటికే పనిచేస్తున్నారు.
– ఈ విద్యా సంవత్సరంలో పదోన్నతి ద్వారా 6,582 మంది సబ్జెక్ట్ టీచర్లను మ్యాప్ చేసిన హైస్కూళ్లకు పంపించారు.
– నాడు–నేడు రెండో దశలో 13,868 అదనపు తరగతి గదులు నిర్మిస్తున్నారు.
వాస్తవాలు ఇలా ఉంటే... పూర్తి అసత్యాలతో ఈనాడు దినపత్రిక కథనం ప్రచురించింది.
దివంగత మాజీ ప్రధాని శ్రీ పీవీ నరసింహారావు గారికి కేంద్ర ప్రభుత్వం భారతరత్న పురస్కారాన్ని ప్రకటించడం సంతోషకరం. ఏకైక తెలుగు ప్రధాని నరసింహారావు గారికి దేశ అత్యున్నత పురస్కారం లభించడం తెలుగు మాట్లాడే వారందరికీ గర్వకారణం.
అలాగే మాజీ ప్రధాని చౌదరీ చరణ్ సింగ్ గారికి, మాజీ ఉప ప్రధాని ఎల్కే అద్వానీ గారికి, బీహార్ మాజీ ముఖ్యమంత్రి కర్పూరీ ఠాకూర్ గారికి, వ్యవసాయ శాస్త్రవేత్త ఎం.ఎస్.స్వామినాథన్ గారికి భారతరత్న పురస్కారాలను ప్రకటించడం భారతీయులుగా మనందరం గర్వపడాల్సిన విషయం.
‘కంటైనర్లలో డబ్బు తరలింపు’
– తప్పుడు ప్రచారంపై ఫ్యాక్ట్‌చెక్
దేశ రక్షణ శాఖకు సంబంధించిన సామాగ్రిని పోలీసు, ఆర్మీకి చెందిన ఉన్నతాధికారులు, సిబ్బంది ఎస్కార్ట్‌తో చెన్నైకి తరలిస్తుంటే రూ.వేలకోట్లు నగదు తరలిస్తున్నారంటూ సోషల్ మీడియాలో దుష్ప్రచారం చేయడం సరికాదని కడప డీఎస్పీ ఎం.డి. షరీఫ్ పేర్కొన్నారు. దేశ రక్షణకు సంబంధించి సామాగ్రిని తరలించే సమయంలో పక్కా ప్రణాళికతో భద్రతా ఏర్పాట్లు ఉంటాయని ఆయన తెలిపారు. ఆ సామాగ్రి వెళ్తున్న రూటులో ఎలాంటి అవాంతరాలు లేకుండా చూడాలన్న జిల్లా ఎస్పీ సిద్ధార్థ్ కౌశల్ గారి ఆదేశాలు, రక్షణ శాఖ విజ్ఞప్తి మేరకు ఆర్మీ అధికారుల ఎస్కార్ట్‌తో పాటు పోలీస్ ఎస్కార్ట్ కూడా ఇవ్వడం జరిగిందని ఆయన తెలిపారు. వాస్తవాలు ఇలా ఉంటే రూ.వేలకోట్లు నగదు తరలిస్తున్నారంటూ సోషల్ మీడియా వేదికగా అసత్యాలు, అభూత కల్పనలు ప్రచారం చేయడాన్ని తీవ్రంగా పరిగణిస్తున్నామని, ఇలా దుష్ప్రచారం చేసిన వారిపై చర్యలు తీసుకుంటామని డీఎస్పీ ఎం.డి. షరీఫ్ హెచ్చరించారు.
#FactCheck on the misleading news published on TV5 regarding large containers of cash being transported in the police protection.
The News is absolutely fake as the DSP of @Kadapa_Police have given clarification on the convoy of the defense forces. The convoy was given police escort, as per the request from the department.
సత్యం, అహింస తన ఆయుధాలుగా స్వతంత్ర పోరాటం చేసి, జాతిపితగా నిలిచారు మహాత్మా గాంధీ గారు. ఆయన కలలుగన్న గ్రామ స్వరాజ్యాన్ని మన ప్రభుత్వంలో గ్రామ సచివాలయ వ్యవస్థ ద్వారా సాకారం చేశాం. నేడు ఆయన వర్థంతి సందర్భంగా ఘనంగా నివాళులు అర్పిస్తున్నాను.