దాడులపై సమగ్ర విచారణ జరిపి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలి
హైదరాబాద్: బీజేపీ రాష్ట్ర కార్యాలయం, నల్గొండ జిల్లా బీజేపీ కార్యాలయం, బీజేపీ నల్గొండ జిల్లా అధ్యక్షులు డా. నాగం వర్షిత్ రెడ్డి గారి నివాసంపై కాంగ్రెస్ కార్యకర్తలు వరుసగా జరిపిన దాడులపై సమగ్ర విచారణ జరిపి, దాడులకు పాల్పడిన వారిపై కఠినమైన చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కోరుతూ బీజేపీ నాయకులు తెలంగాణ డీజీపీకి ఫిర్యాదు చేశారు.
ఈ సందర్భంగా బీజేపీ శాసనసభ పక్ష ఉపనేత శ్రీ పాయల్ శంకర్ గారు, బీజేపీ తెలంగాణ రాష్ట్ర ఉపాధ్యక్షులు డా. కల్యాణ్ నాయక్ గారు, రాష్ట్ర కార్యదర్శులు డా. రవికుమార్ గారు, శ్రీ కొప్పు బాషా గారు, రాష్ట్ర అధికార ప్రతినిధులు శ్రీ తాడూరి శ్రీనివాస్ గారు, శ్రీ అభిషేక్ జగిని గారు, శ్రీ అశోక్ ముస్తాపురే గారు, బీజేపీ సీనియర్ నాయకులు శ్రీ గూడూరు నారాయణ రెడ్డి గారు డీజీపీని కలిసి ఫిర్యాదు అందజేశారు.
బీజేపీ కార్యాలయాలు, పార్టీ నాయకుల నివాసాలపై జరిగిన దాడులను వారు తీవ్రంగా ఖండించారు. రాజకీయ విభేదాలను పక్కనపెట్టి, ప్రజాస్వామ్య విలువలను కాపాడాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని పేర్కొన్నారు.
దాడులకు పాల్పడిన వారిని గుర్తించి, పూర్తి స్థాయిలో విచారణ జరిపి, ఎలాంటి రాజకీయ ఒత్తిళ్లకు తావులేకుండా చట్ట ప్రకారం కఠిన చర్యలు తీసుకోవాలని డీజీపీని కోరారు.
ప్రజాస్వామ్యంలో హింసకు తావులేదు. బీజేపీ కార్యాలయాలు, నాయకులు, కార్యకర్తలపై దాడులను సహించేది లేదని నాయకులు స్పష్టం చేశారు.
@BJP4Telangana
I strongly condemn the attack on the BJP office in Hyderabad by Youth Congress workers and the vandalism carried out in the name of political protest.
Political differences are part of democracy, but attacking or damaging a political party’s office, burning effigies, and resorting to intimidation are completely unacceptable.
Protests have a place in democracy; violence and vandalism do not.
Those responsible must be identified and dealt with strictly as per law. There can be no compromise on the rule of law, regardless of political affiliation.
@BJP4India@INCIndia@BJYMinTG@BJP4Telangana@TelanganaDGP
🚨 బీజేపీ కార్యాలయానికి తాళాలు వేసిన నల్గొండ పోలీసులు!
బీజేపీ కార్యాలయానికి తాళాలు వేసి, కారణం ఏమిటని ప్రశ్నిస్తే పోలీసులే కాంగ్రెస్ కార్యకర్తల్లా వ్యవహరిస్తున్న తీరు తీవ్రంగా ఆక్షేపణీయం.
చట్టాన్ని కాపాడాల్సిన పోలీసులు పక్షపాతంగా వ్యవహరించడం ప్రజాస్వామ్యానికి ప్రమాదకరం.
👉 పోలీసుల తీరు వెంటనే మారాలి!
👉 ప్రజాస్వామ్య హక్కులను కాపాడాలి!
👉 రాజకీయ ఒత్తిళ్లకు తలొగ్గకుండా చట్టాన్ని సమానంగా అమలు చేయాలి!
భారతీయ జనతా పార్టీ — ప్రజల పక్షాన, ప్రజాస్వామ్యం కోసం! 🚩