A special and heartfelt shoutout to my dear brother, Vijay! Emerging as the single largest party in your very first election is impressive. Wishing you immense strength and success as you embark on this new chapter of service. God be with you.
My sympathies are with Didi. Congratulations to BJP and others.
@TVKVijayHQ@MamataOfficial@BJP4India
Congratulations @actorvijay sir.
First doubted and then crowned.
Happened at our home and now it’s happening in our neighbouring home.
Underdog winning is always absolute cinema ( or should I say absolute politics ?) :)
Hope great things follow for the people of Tamil Nadu who have made their decision clear.
పులివెందుల నియోజకవర్గంలోని ఒక చిన్న జడ్పీటీసీ సీటును లాక్కునేందుకు, రాజంపేటలో మరో చిన్న ఒంటిమిట్ట ZPTC సీటును బలవంతంగా చెరబట్టేందుకు ఒక గూండా మాదిరిగా చంద్రబాబు అరాచకాలు చేసి, ప్రజాస్వామ్యాన్ని ఖూనీచేశారు. రాష్ట్రాన్ని రౌడీల రాజ్యందిశగా నడిపిస్తున్నారు. ముఖ్యమంత్రిగా తనకున్న అధికారాన్ని దుర్వినియోగంచేస్తూ, అధికారులను చెప్పుచేతల్లోకి తీసుకుని, పోలీసులను వా���ుకుని ఈ ఎన్నికను తీవ్రవాదుల మాదిరిగా హైజాక్ చేశారు. ప్రజాస్వామ్యాన్ని తీవ్రంగా గాయపరిచిన ఈరోజు నిజంగా ఒక బ్లాక్ డే. పులివెందుల, ఒంటిమిట్ట ZPTC ఉప ఎన్నికలను రద్దుచేయాలని, కేంద్ర బలగాల ఆధీనంలో తిరిగి ఎన్నిక నిర్వహించాలని రాష్ట్ర ఎన్నికల సంఘాన్ని డిమాండ్ చేస్తున్నాం.
@ncbn గారు సీట్లో ఉండగా రాష్ట్రంలో ప్రజాస్వామ్యం అన్నది ఒక డొల్ల మాత్రమే అని, ఈ రాష్ట్రంలో రాజ్యాంగం, చట్టం, న్యాయం, ధర్మం, నిబంధనలు, ప్రజాస్వామ్య పద్ధతులు అన్నవి ఒట్టిమాటలేనని, వ్యవస్థలనేవి కేవలం అలంకార ప్రాయం మాత్రమేనని మరోమారు రుజువైంది. ప్రజలు నిర్భయంగా, స్వేచ్ఛగా ఓట్లేసేలా చూడ్డం, ఆమేరకు ప్రజలకు సహకరిస్తూ, తగిన సదుపాయాలు ఇస్తూ, ప్రశాంత వాతావరణాన్ని కల్పించడం అన్నది ప్రభుత్వ విధి. కాని, చంద్రబాబుగారు ప్రభుత్వాన్ని వాడుకుని తన ప్రభుత్వ సిబ్బంది, పోలీసులచేతే ఏకంగా రిగ్గింగ్ చేయించారు. మరి దీన్ని ఎన్నిక అని ఎలా అనగలుగుత��ం? చంద్రబాబుగారు.. ఓట్లను రిగ్గింగ్ చేయగలరేమో కాని, ప్రజల హృదయాలను కాదు.
ఎన్నికలు ఏవైనా ఏ గ్రామంలో ఓటర్లకు అదే గ్రామంలో పోలింగ్ నిర్వహించడం అన్నది గతం వరకూ పాటిస్తున్న విధానం. కాని చంద్రబాబుగారి ఆదేశాల మేరకు పులివెందుల ZPTC పరిధిలోని పలు గ్రామాల పోలింగ్ బూత్‌లను అటు ఇటు మారుస్తూ, 2 కి.మీ, 4 కి.మీ.ల దూరానికి మార్చినప్పుడే క్షుద్ర రాజకీయానికి నాందిపడింది. పోలింగ్ సందర్భంగా ఉదయం 5:30-6:00 గంటలకే వైయస్సార్సీపీకి చెందిన ఏజెంట్లు బూత్‌ల దగ్గరికి వెళ్లేసరికి, అప్పటికే బయట నియోజకవర్గాలకు చెందిన వందలమంది టీడీపీ కార్యకర్తలు ప్రతి బూత్ వద్దా 400-500 మంది వచ్చి ఆక్రమించారు.
టీడీపీ మంత్రులు, ఎమ్మెల్యేలు గ్రామాల వారీగా పంచుకుని మరీ అరాచకాలకు పాల్పడ్డారు. మంత్రి సవిత, ఆమెకు సంబంధించిన మనుషులు ఎర్రిపల్లిలో తిష్టవేస్తే, ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి నల్లపురెడ్డి పల్లెకు భారీగా జమ్మలమడుగుకు చెందిన కార్యకర్తలను, నాయకులను పంపాడు. మరో టీడీపీ ఎమ్మెల్యే పుత్తా చైతన్య ఇ.కొత్తపల్లిలో వందలమంది తన కార్యకర్తలతో అక్కడే మకాం వేశాడు. పోలింగ్ బూత్‌లకు వైయస్సార్సీపీ ఏజెంట్లు వెళ్తే, వారిపై దాడులు చేసి, వారిని కొట్టి ఏజెంట్ల ఫారాలు లాక్కుని, చించేశారు. బీటెక్ రవి పులివెందుల ఓటరు కాకపోయినా కనంపల్లెలో తిష్టవేసి దౌర్జన్యాలు చేశాడు. ఇక్కడ వైయస్సార్సీపీ ఏజెంట్లను లాగిపడేశారు. చివరకు వైయస్సార్సీపీ ఏజెంట్లు లేకుండానే ఈ పోలింగ్ జరిగింది.
ఎవరైనా ఓటరు బూత్వైపునకు వచ్చినా, వచ్చినవారు వైయస్సార్సీపీ ఓటరు అయినా, న్యూట్రల్ ఓటరు అయినా, అప్పటికే బూత్చుట్టూ తిష్టవేసిన వందలమందితో కూడిన టీడీపీ గ్యాంగులు వారిని అడ్డుకుని, బెదిరించి, భయపెట్టి వెనక్కి పంపేశారు. కచ్చితంగా టీడీపీ ఓటరు అయితేనే బూత్‌లోకి లోపలికి పంపేవారు. తిప్పిపంపిన ఓటర్ల వద్దనుంచ��� ఓటరు స్లిప్పులను లాక్కుని టీడీపీ కార్యకర్తలే దొంగ ఓట్లు వేశారు. ఇలా ఓట్లేసిన ఇతర నియోజకవర్గాలకు చెందిన వారిని వైయస్సార్సీపీ వాళ్లు గుర్తించారు. ఇది అన్యాయమని ప్రశ్నించడానికి కనీసం 5గురు వైయస్సార్సీపీ వాళ్లు వెళ్లినా వారిని పోలీసులు తరిమితరిమి కొట్టారు. మహిళా ఏజెంట్లపైనకూడా దాడులు చేశారు. కాని బయట మండలాలకు, నియోజకవర్గాలకు చెందిన టీడీపీ వాళ్లు వందలమంది ఒకే చోట ఉన్నా.. పట్టించుకోలేదు. వాళ్లు ఒకేచోట ఉండడమే కాదు, బూత్లవద్దే షామియానాలు వేసుకుని అక్కడే తిష్టవేసినా, వాళ్లెవరూ ఆ నియోజకవర్గాలకు చెందినవారు కాకపోయినా పోలీసులు అడ్డుకోలేదు. పోలీసులు కరడుగట్టిన టీడీపీ కార్యకర్తలమాదిరిగా పనిచేశారు.
స్వేచ్ఛగా ��్రజలు ఓట్లేయడానికి కాపలాకాయాల్సిన డీఎస్పీలు, సీఐలు, ఎస్సైలు ఇతర పోలీసులు, చంద్రబాబుగారి తప్పుడు ఆదేశాలకు తలొగ్గుతూ, టీడీపీ వాళ్లు చేసే దాడులు, దౌర్జన్యాలకు దగ్గరుండి కాపలా కాశారు. ప్రశాంతంగా పోలింగ్ జరిగేలా చూడాల్సిన డీఐజీ కోయ ప్రవీణ్, టీడీపీ మాజీ ఎంపీ రామ్మోహనరావుగారి సమీప బంధువు. పచ్చచొక్కా వేసుకుని దగ్గరుండి ఎన్నికల అక్రమాలను ప్రోత్సహించారు. మరి దీన్ని ఎన్నిక అని ఎవరై��ా అనగలుగుతారా? మరి ఎందుకు ఈ ఎన్నికలు జరపడం?
అసలు చంద్రబాబుకు ప్రజలు ఎందుకు ఓట్లేస్తారు? ఆయన ఏం మంచి చేశాడని ఓట్లేస్తారు. 15నెలల ఆయన పాలనలో వ్యవసాయం, విద్య, వైద్యం, ఆరోగ్యం, లా అండ్ ఆర్డర్, పారదర్శకత, పారిశ్రామిక రంగాలు తీవ్రంగా ధ్వంసమయ్యాయి. రాష్ట్రం మొత్తం తిరోగమనంలో ఉంది. ప్రతి కుటుంబం తన కాళ్లమీద తాను నిలబడేలా వారికి భరోసా ఉండేలా మా ప్రభుత్వం నాటి పథకాలన్నింటినీ, ఆ స్కీములు అ��్నిటినీ రద్దుచేయడమే కాదు, తాను ఇస్తానంటూ ఎన్నికల్లో చెప్పిన సూపర్ సిక్స్, సూపర్ సెవెన్‌లనూ మోసాలతో, అబద్ధాలతో ఎగరగొట్టేశాడు. ఇప్పుడు ఏగ్రామానికి వెళ్లినా, ఏ ఇంటికి వెళ్లినా చంద్రబాబునాయుడును, ఆ పార్టీకి చెందిన వారికి, ఇచ్చిన హామీలు ఏమయ్యాయని ప్రజలు రివర్స్‌లో ప్రశ్నిస్తున్నారు. మరోవైపు సుమారు రూ.19వేల కోట్ల మేర కరెంటు ఛార్జీలతో బాదుడే బాదుడు. మరోవైపు మట్టి, ఇసుక, సిలికా, క్వార్ట్జ్, లెటరైట్, లిక్కర్, చివరకు కరెంటు కొనుగోలు ఒప్పందాలు, లంచాలకోసం శెనక్కాయలకు, బెల్లాలకు భూములు అప్పనంగా ఇవ్వడం మొదలు, మొబలైజేషన్ అడ్వాన్స్‌ల పేరిట పనులు జరక్కుండానే, రేట్లు పెంచి ఇవ్వడం మొదలు, రాజధాని నిర్మాణాల పేరిట విచ్చలవిడిగా అవినీతికి పాల్పడుతున్నారు. ఏ రైతుకూ, ఏ పంటకూ గిట్టుబాటు ధర లేదు, విద్యాదీవెన, వసతి దీవెన లేదు, ఆస్పత్రులకు వెళ్తే ఏ పేదవాళ్లకూ ఆరోగ్యశ్రీ లేదు. స్కూళ్లలో నాడు-నేడు ��ేదు, ట్యాబుల్లేవు, టోఫెల్ పీరియడ్స్తోపాటు ఇంగ్లిషు మీడియం లేదు. మరి ఇలాంటి అబద్ధాలు, మోసాలు, అవినీతి పాలన చేస్తున్న చంద్రబాబుగారికి ప్రజలు ఓట్లెందుకు వేస్తారు?
పోనీ ప్రజలు తనకే ఓట్లేస్తారని అనుకున్నప్పుడు చంద్రబాబుగారు, ఇన్ని దౌర్జన్యాలు, అరాచకాలు చేయాల్సిన అవసరం ఏమొచ్చింది? తనకే ఓట్లేస్తారని అనుకున్నప్పుడు , ఆ ధైర్యం, నమ్మకం ఉన్నప్పుడు నిర్భయంగా తమ ఓటుహక్కును వినియోగి��చుకునేలా ఓటర్లను స్వేచ్ఛగా వదిలేసేవారు కదా? ఓటర్లు ఉన్న దగ్గరే పోలింగ్ బూత్‌లు పెట్టేవాడు కదా? ఆ నమ్మకం లేదు కాబట్టే చంద్రబాబుగారు ఈ అరాచకాలన్నీ చేశారు. రెండు చిన్న ZPTC స్థానాలను లాక్కోవడానికి మొత్తం ప్రభుత్వ యంత్రాంగాన్ని, పోలీసు బలగాలను వాడుకుని, ఇన్ని అరాచకాలు చేసి గెలవాలనిచూస్తే దాంతో సాధించేది ఏముంటుంది?
2017 నంద్యాల అసెంబ్లీ ఉప ఎన్నికలో కూడా చంద్రబాబుగారు ఇదే తరహా కుట్ర���ో అరాచకాలు చేశారు. ప్రతి వీధికో ఎమ్మెల్యేను పెట్టారు, ప్రతి వార్డుకో మంత్రిని పెట్టి, విచ్చలవిడిగా అక్రమాలకు పాల్పడ్డారు. ఆరోజు ఆ ఉప ఎన్నికల్లో 27వేల ఓట్లతో గెలిచామంటూ సంబరాలు చేసుకున్నారు, మా పార్టీ పనైపోయిందని, జగన్ పని అయిపోందని టీడీపీకి చెందిన ప్రతి ఒక్కరితోనూ మాట్లాడించారు. ఏడాదిన్నర తర్వాత జరిగిన అదే నంద్యాల ఎన్నికల్లో వైయస్సార్సీపీ 34,560 ఓట్లతేడాతో ఘన విజయం సాధించింది. చంద్రబాబుగారి పార్టీ పూర్తిగా క్లీన్‌బౌల్డ్ అయ్యింది. అవ్వాళ్టి ఎన్నికతో పోలిస్తే ఇవాళ పులివెందుల ఈ రెండు ZPTC ఉప ఎన్నికల్లో అంతకుమించి అరాచకాలు ���ేశారు. 2019 తరహాలోనే భవిష్యత్తులోకూడా అదే స్థాయిలో పులివెందులసహా రాష్ట్ర ప్రజలు కచ్చితంగా స్పందించి, చంద్రబాబుకు బుద్ధిచెప్తారు.
పులివెందుల, ఒంటిమిట్ట జడ్పీటీసీ స్థానాల్లో ఇవాళ ఇన్ని అక్రమాలు జరిగినా, అడ్డుకోవాల్సిన వ్యవస్థలన్నీ మౌనందాల్చడం విచారకరం. ప్రతి బూత్‌కు సంబంధించి వెబ్‌కాస్టింగ్‌ను వైయస్సార్సీపీ అభ్యర్థికి ఇవ్వాలని, పోలింగ్ బూత్ ఆవరణలో సీసీ ఫుటేజీని కూడా ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నాం. ఆ ఫుటేజీ ఇస్తే మేమే విశ్లేషించి ఎవరెవరు బయటనుంచి వచ్చి ఓట్లేశారో కూడా గుర్తించి ఎన్నికల ��ంఘానికి ఇస్తాం. రాజ్యాంగ వ్యవస్థల మీద మాకున్న విశ్వాసంతో, ఎన్నికల అక్రమాలపై సాక్ష్యాలు, ఆధారాలతో న్యాయస్థానాల దృష్టికి తీసుకెళ్తాం. నిజంగా ప్రజాస్వామ్యాన్ని కోరుకునేవారంతా ఈ అన్యాయాన్ని నిలదీస్తూ, కేంద్రబలగాల ఆధ్వర్యంలో, వారి భద్రత నడుమ తిరిగి ఎన్నిక నిర్వహించాలని కోరుతాం.
విజయవాడ తూర్పు నియోజకవర్గంలో రీకాలింగ్ చంద్రబాబుస్ మేనిఫెస్టో క్యూ ఆర్ కోడ్ ద్వారా డాక్యుమెంటరీ విడుదల చేసిన ఎన్టీఆర్ జిల్లా వైయస్ఆర్ సీపీ అధ్యక్షులు దేవినేని అవినాష్ గారు, జిల్లా పార్లమెంట్ నియోజకవర్గ పరిశీలకులు మోదుగుల వేణుగోపాల్ గారితో కలిసి పాల్గొనడం జరిగింది
చంద్రబాబు, పవన్ కల్యాణ్ లు ప్రజలకు హామీలు ఇచ్చి మోసం చేశారు
వైయస్ జగన్ గారి కన్నా ఎక్కువ హామీలు అమలు చేస్తామని బాండ్ పేపర్లు ఇచ్చి మోసం చేశారు
ఈ ఏడాది కాలంలో అధికారంలో ఉండి మీరు చేసిందేంటి @ncbn, @PawanKalyan ?
17.06.2025
తాడేపల్లి
రేపు (18.06.2025) మాజీ ముఖ్యమంత్రి, వైఎస్సార్సీపీ అధినేత శ్రీ వైయస్ జగన్ పల్నాడు జిల్లా రెంటపాళ్ళ పర్యటన
ఆత్మహత్య చేసుకున్న ఉపసర్పంచ్ ��ాగమల్లేశ్వరరావు కుటుంబానికి పరామర్శ..
@AjayMadugulaYCP@RenukaCCongress@ysjagan@RenukaCCongress మాజీ ముఖ్యమంత్రి @ysjagan గారి గురించి మాట్లాడుతున్నావ్ అనే విషయాన్నీ గుర్తుపెట్టుకో నోటికి వచ్చినట్లు మాట్లాడితే ఊరుకునేదే లేదు.మీరు చేసిన వ్యాఖ్యలు తీవరంగా ఖండిస్తున్నాము.
మీరు చేసిన వ్యాఖ్యలు వెన్నకు తీసుక��వాలి అని డిమాండ్ చేస్తున్న..
అమ్మ @RenukaCCongress నువ్వు ఎలా పార్లమెంట్ సభ్యురాలివి అయ్యావు తల్లి నువ్వు ఒక చరిత్ర సృష్టించిన మాజీ ముఖ్యమంత్రి @ysjagan గారి గురించి మాట్లాడుతున్నావ్ అనే విషయాన్నీ గుర్తుపెట్టుకో నోటికి వచ్చినట్లు మాట్లాడితే ఊరుకునేదే లేదు.మీరు చేసిన వ్యాఖ్యలు తీవరంగా ఖండిస్తున్నాము.