రాష్ట్రంలోని మత్స్యకారుల సంక్షేమం కోసం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన ఉచిత చేప పిల్లల పంపిణీ కార్యక్రమాన్ని ఈ నెల 26 వ తేదీన రాష్ట్ర వ్యాప్తంగా ప్రారంభించడం జరుగుతుంది.
డాక్టర్ BR అంబేడ్కర్ తెలంగాణ రాష్ట్ర సచివాలయంలోని చాంబర్ లో పశుసంవర్ధక శాఖ స్పెషల్ చీఫ్ సెక్రెటరీ అధర్ సిన్హా, మత్స్య శాఖ కమిషనర్ లచ్చిరాం భూక్యా లతో చేప పిల్లల పంపిణీ కి సంబంధించి సమీక్ష సమావేశం నిర్వహించడం జరిగింది.