పొదుగు
అప్పారావు ఇన్స్టాగ్రామ్ తెరిచాడు, ఒక ఉత్తర భారతీయ రైతు తన ఆవు పొదుగు కింద కొడుకుని పెట్టి పాలు సరాసరి ఆ పిల్లాడి నోట్లో పడేట్లు సిరాలు పిసికాడు. ఆ పిల్లాడు నాలుకతో ఆ పెదాలు చప్పరిస్తూ ఒక వెడల్పైన చిరునవ్వు వదిలాడు. అప్పారావు క్యూట్ అనుకున్నాడు. ఒక లైక్ కొట్టాడు.
ఇన్స్టాగ్రామ్ అల్గారిథమ్ ఉత్తేజితం అయింది. తర్వాతి వీడియోలో ఒక తెల్ల జుబ్బా వేసుకున్న వ్యక్తి వ��నక బ్యాగ్రౌండ్లో రకరకాల మొక్కలు పెట్టి, “పాశ్చరైజేషన్ పాశ్చాత్య పద్ధతి, దేశీ ఆవు దేశీ పద్ధతి”, “ ప్యాకెట్ పాలు వద్దు, పొదుగు పాలు ముద్దు” అని ఒక గ్లాసు పాలు గడగడా తాగేశాడు. తాగేసి మీసాలకి అంటిన పాలు తుడుచుకుని, చేతికున్న కండలు చూపించాడు. మరో లైక్ వేసుకున్నాడు.
మరుసటిరోజు పొద్దున్నే ఒక చిన్న తపేలా పట్టుకెళ్లి శాల్లో కట్టేసిన గేదె దగ్గరికెళ్ళి, ఆ తపేలా తో తెచ్చిన నీళ్లతో రెండుసార్లు పొదుగుకి చల్లి, మిగతా నీళ్ళు అక్కడే గేదె పోసిన ఉచ్చలో పోసేసి, ఇక తపేలా నిండా పాలు పితికేశాడు. ఇంట్లోకి పట్టుకొచ్చి, వాళ్ళావిడ ముందు పహిల్వాన్ లాగా ఎత్తింది దించకుండా ఒక అరలీటరు పాలు తాగేశాడు, తాగేసి కండలు చూపించాడు ఆవిడకి. మరిగిద్దును కదా అందావిడ. పచ్చి పాలు తాగితే ఇక రాత్రంతా ఇ��్చికాలే అన్నాడు. ఆవిడ సిగ్గు పడింది.
మూడు రోజులు తాగాడు, నాలుగో రోజు కాళ్లలో తిమ్మిర్లు మొదలయ్యాయి. కండలు పెరుగుతున్నాయి అనుకున్నాడు. ఐదో రోజు ఆ తిమ్మిర్లు ఎక్కువయ్యి, నడక కష్టమైంది. ఊర్లో డాక్టరు ఇదేదో తేడాగా ఉంది, పట్నం పొమ్మన్నాడు. పట్నం వెళ్ళాక జనరల్ మెడిసిన్ డాక్టరు చూసాడు. అన్ని ప్రశ్నలూ వేశాడు. ఏదీ అంతు చిక్కలేదు. ఈ మధ్య ఏమన్నా తిండి మార్చావా అని అడిగితే పచ్చి పాల ప్రయోగం గురించి చెప్పాడు.
డాక్టరు వెంటనే నీ ప్రాణానికి ప్రమాదం ఆస్పత్రిలో చేరిపో అన్నాడు. వీడెవడో డబ్బులు దొబ్బేసేవాడిలా ఉన్నాడని అక్కడ్నుంచి బయటికొచ్చేసి ఆటో ఎక్కేశాడు ఊరికి. దార్లో ఇన్స్టాగ్రామ్లో తెల్ల జుబ్బా వాడికి పర్సనల్ మెసేజీ పెట్టాడు ఇలా ఉంది ఏం చెయ్యాలని. అదెళ్లి ఆ తెల్ల జుబ్బా అతని అకౌంటులో ఉన్న పదివేల డ��ఎమ్ముల్లో మునిగిపోయింది. ఊరెళ్లి ఆటో దిగి పట్టు తప్పి రోడ్డు మీద పడిపోయాడు. నిలబెట్టారు. మళ్లీ పడిపోయాడు. మంచం మీద వేశారు. ఊపిరి కష్టంగా ఉందన్నాడు కాసేపటికి. మళ్లీ అదే ఆటోలో అదే పట్నం డాక్టరు దగ్గరికి పట్టుకెళ్ళారు. ఈసారి డాక్టరుకి వద్దని కావాలని చెప్పడానికి అప్పారావుకి మాట రావట్లేదు. మాట పడిపోయింది. ఒంట్లో ఒక్కొక్కటే చచ్చుబడిపోతోంది.
డాక్టరు ఇక నోట్లో బడ్డు పెట్టి, మత్తు ఇంజ���క్షన్ ఇచ్చి వెంటిలేటర్ కి ��గిలించాడు. ఐసీయులో పెట్టాడు. అప్పారావు కూతురు ఏమైందని అడిగింది డాక్టర్ని. “మీ నాన్న పచ్చి పాలు తాగాడు. అందులో క్యాంపైలోబ్యాక్టర్ అని ఒక బాక్టీరియా కడుపులోకి చేరింది. దానికి మీ నాన్న రోగనిరోధక శక్తి యాంటీ బాడీస్ తయారు చేసింది. అవేమో మీనాన్న నాడుల్ని కొరికేశాయి. ఇప్పుడు మీ నాన్నకి ఊపిరి ఆడట్లేదు. కొంచెం కష్టమే.” అన్నాడు డాక్టరు.
ఆ తర్వాత ప్లాస్మా ఫెరెసిస్ అని రక్తం కడిగాడు, ఐవీ ఐ���ీ అని సెలైన్ ఎక్కించాడు. ఏది చేసినా అప్పారావు వెంటిలేటర్ వదిలి రాలేదు. డాక్టరే వెంటిలేటర్ లాగేసాడు. అప్పారావు పైకెళ్లిపోయాడు.
దండ వేసిన అప్పారావు ఫోటోని బ్యాగ్రౌండ్లో పెట్టి, “పొదుగు కోసం పైకెళ్లిపోయావా పెనిమిటీ!” అని పాట పాడుతూ వీడియో తీసి ఇన్స్టాగ్రామ్లో రీల్ పెట్టింది వాళ్లవిడ. ఈలోపు ఆ తెల్ల జుబ్బా వాడు “జిల్లేడు పాలు, కంటి చూపు” అని ఇంకొక రీలు వదిలాడు.
మందులు- వాటి పనితీరు.
ప్రతి మందుకీ మన ఒంట్లో కణాల మీద రిసెప్టార్లు ఉంటాయి. ఈ రిసెప్టార్లకి మందు అతుక్కున్నప్పుడు అవి ఉత్తేజం అవ్వటం కానీ, నిద్రపోవటం కానీ జరిగి కణంలో కొన్ని రసాయన చర్యలు జరుగుతాయి.
ముందు ఈ మందులు కడుపు, పేగుల్లో శోషించబడి ( అబ్సార్బ్) రక్తంలో కలిసి అవి కాలేయం గుండా వెళతాయి. ఈ కాలేయంలో చాలామందు నిర్వీర్యం అయిపోతుంది. అలా అయిపోగా మిగిలిన మందు గుండెకి చేరి అక్కడ్నుంచి ఒళ్లంతా వెళ్తుంది.
మందైతే ఒళ్లంతా వెళ్తుంది కానీ అది పనిచెయ్యవలసిన రిసెప్టార్లు మాత్రం ఒంట్లో కొన్ని భాగాల్లోనే ఉంటాయి. కాబట్టి ��క్కడ రిసెప్టార్లు ఉంటే అక్కడే పనిచేస్తుంది. ఉదా, ట్రామడోల్ మందు ఉందనుకోండి, అది మెదడులో ఉండే ఓపియాయిడ్ రిసెప్టార్ల మీద పనిచేస్తుంది. అక్కడ వాటిని ఉత్తేజం చేసి మెదడుకి నొప్పిని తీసుకెళ్లే దారులపై పనిచేసి నొప్పిని తగ్గిస్తాయి.
పోతే ఒకసారి రిసెప్టారుకి అతుక్కున్న మందులు, విడిపోవచ్చు. అలా విడిపోయినప్పుడు వాటి ప్రభావం కోల్పోతాయి. అలాగే విడిపోయినవి మళ్లీ రక్తంలో కలిసి కాలేయంలోకి వెళ్లి నిర్వీర్యం అవుతాయి. అక్కడ్నుంచి కిడ్నీలు వాటిని బయటికి మూత్రంలో పంపించేస్తాయి. కొన్నిసార్లు మందులు రిసెప్టార్లని చాలా గట్టిగా పట్టుకుంటాయి, అప్పుడు కణం కొత్తగా రిసెప్టార్లని తయారుచేసి పంపిస్తుంది. అప్పుడు వాటిని మళ్లీ పట్టుకోవడానికి మందులు కావాలి. అందువలన మనం రోజూ మందులు వేసుకోవాల్సి ఉంటుంది.
కొన్నిసార్లు మందులు మనకి అక్కర్లేని రిసెప్టార్ల మీద కూడా పనిచేస్తాయి, అందువలన సైడ్ ఎఫెక్టులు వస్తాయి. ఈ విధంగా మనకి కావాల్సిన రిసెప్టారు మీద మాత్రమే పనిచేసే మందుల్ని తయారుచేయటం కష్టం. అలాగే ఒక రిసెప్టారు ఒక అవయువంలో ఒక పనిచేస్తే ఇంకో అవయువంలో ఇంకో పని చేస్తుంది. మందు మాత్రం రిసెప్టారు ఎక్కడున్నా తగులుకుంటుంది అందువలన మనకి అక్కర్లేని భాగంలో పనిచెయ్యటం వలన సైడ్ ఎఫెక్టులు వస్తాయి. ఉదా, నొప్పి మాత్రలు మెదడులో ప్రోస్టాగ్లాండిన్స్ ని తగ్గించడం ద్వారా నొప్పిని తగ్గిస్తాయి, అయితే అలాగే కడుపులో కూడా తగ్గించెయ్యటం వలన కడుపులో మంట వస్తుంది సైడ్ ఎఫెక్టుగా. మళ్లీ ఆ మంట తగ్గించటానికి ఆసిడ్ రాకుండా తగ్గించే పాంటోప్రజాల్ ఇస్తారు. ఇలా అన్నమాట మందులు పనిచేస్తాయి.
నేను పైన చెప్పింది చాలా సరళమైనది. నిజానికి ఈ ఒక్క ప్రశ్న మీద ఒక పుస్తకం రాయవచ్చు.
దేవుడు వరమిచ్చినా.. పూజారి వరమివ్వని చందంగా ఉంది ఇరిగేషన్ శాఖలో 224 ఏఈ, 199 జెటివోలుగా ఎంపికైన అభ్యర్థుల పరిస్థితి
కష్టపడి చదివి ఉద్యోగం సాధించిన సంబురాన్ని లేకుండా చే��్తున్నది దుర్మార్గ కాంగ్రెస్ ప్రభుత్వం.
పది రోజుల్లో ఐదు సార్లు నియామక పత్రాల అందజేత కార్యక్రమాన్ని వాయిదా వేసి, వారి జీవితాలతో ఆడుకోవడం శోచనీయం.
కొండంత సంతోషంతో హైదరాబాద్ కు రావడం, నిరాశతో వెనుతిరిగి పోవడం విద్యార్థుల వంతు అవుతున్నది.
పెళ్ళి పేరు చెప్పి, పదో తరగతి ఫలితాలు వాయిదా వేయడం,
పూటకో కారణం చెబుతూ, నియామక పత్రాలు అందజేయకుండా తిప్పి పంపడం ఈ @TelanganaCMO ముఖ్యమంత్రికి, ప్రభుత్వానికి అలవాటుగా మారింది.
@revanth_anumula @UttamINC
ప్రచార ఆర్భాటం పక్కన బెట్టి, ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థులకు వెంటనే నియమక పత్రాలు అందించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం.
@BRSparty ప్రభుత్వ హయాంలో ఇచ్చిన ఉద్యోగ నోటిఫికేషన్ లో ప్రతిభ చాటి, ఏఈ, జెటివో లుగా నియామక పత్రాలు అందుకోబోతున్న అభ్యర్థులకు శుభాకాంక్షలు
#CongressFailedTelangana
డాక్టర్ గారితో ముఖాముఖి
డాక్టర్ గారూ!
ఏంట్రా చాలా రోజులకి.
ఏదో మీ దయవల్ల మీ అవసరం పడలేదు.
ఏంట్రా సెటైరా, పొగడ��తా!?
ఏదొకట్లేండి, ఇప్పుడూ అన్ని చక్కెరలూ తియ్యగా ఉంటాయా?
ఉండవు, కొన్ని చప్పగా ఉంటాయి.
అసలీ చక్కెరలు ఏంటి?
వీటినే కార్బోహైడ్రేట్స్ అంటారు. అన్నిటికంటే చాలా సరళమైంది గ్లూకోజ్. ఇక ఇందులో కర్బన పరమాణువు అటు తిరిగి, ఇటుతిరిగి, రెండేసి మూడేసి అంటుకుని అలా అలా గెలాక్టోజ్, లాక్టోస్, ఫ్రాక్టోజ్, సుక్రోస్, ��్లైకోజెన్ ఇలా రకరకాలుగా ఉంటుంది. కొన్ని తియ్యగా ఉంటాయి, కొన్ని ఉండవు.
అయితే ఇప్పుడు తియ్యగా లేనివి తిన్నా ఒంట్లో గ్లూకోజ్ పెరుగుతుందా?
పెరుగుతుంది, అసలేమవుద్ది అంటే మన తినే తిండిలో ఉండే ఈ చక్కెరలు రెండు రకాలు సరళమైనవి అంటే సింపుల్, సంక్లిష్టమైనవి అంటే కాంప్లెక్స్. ఈ సింపుల్ వి ఎక్కువ తింటే అంటే స్వీట్లు, కూల్ డ్రింకులు లాంటివి అన్నమాట, అందులోంచి గ్లూకోజ్ సరాసరి రక్తంలోకి వెళ���లిపోతుంది పెద్ద ఇబ్బంది లేకుండా, అలా రక్తంలో గ్లూకోజ్ స్థాయి తారాజువ్వాలా వెళ్లిపోతుంది. అదే కాంప్లెక్స్ వి తింటే అవి అరిగి, అందులోంచి గ్లూకోజ్ వచ్చేసరికి బాగా సమయం పట్టి మెల్లిగా గ్లూకోజ్ స్థాయి పెరుగుతుంది.
ఓహో, మరి వేగంగా పెరిగితే ముప్పేంటి?
అసలు ఏ ఆహారం అయినా ఇలా రక్తంలో గ్లూకోజ్ స్థాయిని పెంచే స్థోమతని గ్లైసీమిక్ ఇండెక్స్ అంటారన్నమాట. ఇలా ఒకేసారి గ్లూకోజ్ స్థాయి పెరిగితే దాన్ని తగ్గించటానికి ఒకేసారి ఎక్కువ మొత్తంలో ఇన్సులిన్ విడుదల అవుతుంది. ఈ ఇన్సులిన్ అనేది రకరకాల పనులు చేస్తుంది. ఈ గ్లూకోజ్ ని కండరాల్లోకి పంపటం, లేదా కాలేయంలో గ్లైకోజన్ లాగా దాయటం ఇలా అన్నమాట. అయితే విషయం ఏంటంటే ఇలా ఇన్సులిన్ ఎక్కువ స్థాయిలో ఉంటే అది పనిచేసే రిసెప్టార్లు కొన్నాళ్లకి మొరాయిస్తాయి అన్నమాట. అంటే నీకు ముందు ఒక పెగ్గుతో మత్తెక్కేది ఇప్పుడు హాఫ్ ఏస్తే గానీ రాదు కదా అలా అన్నమాట. దీన్ని ఇన్సులిన్ రెసిస్టెన్సు అంటారు. అంటే పనిచెయ్యకపోవడం అన్నమాట. అప్పుడు ఈ గ్లూకోజ్ అలాగే రక్తంలో ఉండిపోయి, రక్తం చిక్కబడటం, లవణాల స్థాయిలో మార్పులు రావటం, చిన్న చిన్న రక్తనాళాలు అవీ పాడవ్వడం, దానివలన కళ్లు, మెదడు, గుండె, కిడ్నీలు, కాళ్లు, నరాలు పాడవ్వడం లాంటిది జరుగుతుంది అన్నమాట. ఇదంతా జరగటానికి ఒక పది
పదిహేనేళ్లు పడుతుంది.
ఓహో, మీరు చెప్పాక తాగటం మానేశా కానీ, అది వేరే విషయం. అయితే ఇప్పుడు మనం ఏది తిన్నా గ్లూకోస్ అంత త్వరగా పెర��్కూడదు అంటారు. అంతేనా!
అవును, అందుకని ప్రాసెస్డ్ తినుబండరాలు తినకూడదు అన్ని ప్యాకేజీ ఫుడ్స్ - స్నాక్స్, బిస్కెట్లు, స్వీట్లు ఇలా చిట్టా చాలా పెద్దది. సాధారణంగా ఆహారం ఉడకబెట్టి తినొచ్చు లేదా పచ్చివి తినొచ్చు - పళ్లు, పప్పులు, తృణధాన్యాలు, కూరగాయలు ఇలా అన్నమాట.
అయితే ఇవెంత తిన్నా పర్లేదంటారు అయితే!
హ్మ్ అదీ కొంతవరకు సరి కాదు, ఎందుకంటే మొత్తంగా ఎంత తింటున్నావన్నది కూడా ముఖ్యం. ఎంద���కంటే ప్రతి వ్యక్తికీ వాళ్ల శరీర తత్వం బట్టి, వాళ్లు చేసే పని బట్టి రోజుకి ఇంత అని శక్తి అవసరం. అది ఆహారం నుంచే వస్తుంది. అయితే దానికంటే ఎక్కువ తింటే ఎక్కువ తిన్న చక్కెరలు కొంతవరకూ గ్లైకోజన్ లా మారినా మిగతా అంతా కొవ్వుగా మారి పొట్ట చుట్టూ చేరిపోతుంది. అంతే కాకుండా పైన చెప్పిన అవాయువాల చుట్టూ చేరిపోతుంది. తెగ ఇబ్బంది పెట్టేస్తుంది.
ఏంటి? చక్కెర కొవ్వుగా మారుతుందా?
అవును, మనం తినే నూనెలే కాకుండా చక్కెర కూడా కొవ్వుగా మారుతుంది. చక్కెర నిల్వలు తగ్గినప్పుడు ముందు గ్లైకోజన్ కరిగి తర్వాత మళ్లీ ఈ కొవ్వు కరిగి కీటోన్లుగా మారి అవి మళ్లీ శక్తికి పనికొస్తాయి. అదో పెద్ద కథ.
ఓహో, అయితే ఈ ఇన్సులిన్ రెసిస్టెన్స్ అనేదే డయాబెటీస్ కి మూలమా?
అవును, కొన్నిసార్లు ఇన్సులిన్ కావలసినంత తయారవ్వదు కూడా అది కూడా దయబేటీసే. అయితే ఈ ఇన్సులిన్ రెసిస్టెన్సు అనేది ఒక్క చక్కెరవ్యాధే కాకుండా, ఆడవాళ్లలో పిసిఓడి, అందర్లో ఊబకాయం, గుండె జబ్బులు, రోగనిరోధక శ��్తి తగ్గటం, క్యాన్సర్లు రావటం, ఆందోళన, దిగులు లాంటి మానసిక రోగాలకి ఇలా చాలావాటికి కారణం.
అమ్మ దీనమ్మ బత్తాయో! అయితే ఈ ఇన్సులిన్ రెసిస్టెన్సు తగ్గాలంటే?
సైడెఫెక్టులు లేని ఔషధం ఒకటుంది మరి.
ఆ అవునా, ఏంటది?
అదే వ్యాయామం. ప్రతిరోజూ ఒక నలభై నిమిషాలు చేస్తే మంచిది. ఏదో ఒక వ్యాయామం పరిగెత్తటం, బరువులెత్తటం, నాట్యం, ఆటలు ఇలా ఏదో ఒకటి. ఇది రోజూ మనం చేసే పనికి అదనం. పని వ్యాయామం కాదు.
ఓహో, ఇ��కా!?
ఇంకా మన ఆహారం మనం తయారు చేసుకోవడం. నూనెలు తగ్గించటం. కూరలు, పప్పులు ఎక్కువ తినటం. దుంపలు వాడకపోవడం. వేపుళ్లు, తీపి పదార్థాలు ఇవన్నీ దూరంగా ఉంచటం. ఎప్పుడో అరా ఒకటీ పర్లేదు. రోజూ కాదు.
ధర్మాత్ములు మీరు!
ధర్మం అని ఫీజు ఎగ్గొట్టేవు?
మీరు భలే జోకులేస్తారు డాక్టర్ గారూ! ఇదిగోండి మీకు ఫీజుతో పాటు కేజీ స్వీటుకూడా తెచ్చాను.
ఇప్పుడు వరకూ నీకు చెప్పిందేంట్రా!!
కొలస్ట్రాల్ గురించి.
కొన్ని అపోహలు తీరుద్దాం.
కొలెస్ట్రాల్ ఒంటికి అవసరం. మన కణాల చుట్టూ ఉండే పొర తయారవ్వటానికి, విటమిన్ డి, ఇంకా మిగతా చాలా హార్మోన్ల తయారీకి ఇలా చాలా రకాల పనులకి పనికొస్తుంది.
ఈ కొలస్ట్రాల్ మనదేహంలో అన్ని కణాల్లో తయారవుతుంది కానీ కాలేయం మాత్రమే ఎక్కువ తయారుచేసి రక్తంలోకి విడుదల చేస్తుంది. అలాగే మనం తినే కొవ్వు ఆహారంలో కూడా కొలెస్ట్రాల్ ఉంటుంది. ఇది కూడా ముందు కాలేయానికి చేరి అక్కడ్నుం��ి అన్నింటికీ వెళ్తుంది.
ఇకపోతే కొలెస్ట్రాల్ దానంతట అది రక్తంలో ప్రయాణించలేదు, దానికి కొన్ని వాహనాలు కావాలి అవే మన లిపిడ్ ప్రొఫైల్లో చూపించే హెచ్డిఎల్, ఎల్డీఎల్ మొదలైనవి.
విషయం ఏంటంటే కాలేయంలో ఉండే కొలెస్ట్రాల్ ఒంటి అవసరాల కోసం ఎల్డీఎల్ ద్వారా కండరాలకి మిగతా కణాలకి వెళ్తుంది. అలాగే కండరాలు మిగతా వాటి నుంచి హెచ్డిఎల్ ద్వారా కాలేయానికి వస్తుంది. ఇలా చేరిన అధిక కొలెస్ట్రాల్ ని కాలేయం పైత్యరసం ద్వారా మళ్లీ పేగుల్లోకి పంపించేసి బయటకు తోసేస్తుంది.
అంటే మనం ఎక్కువ కొలెస్ట్రాల్ తిన్నా, లేదా కొన్ని జన్యుకారణాల వలన కాలేయంలో ఎక్కువ తయారైనా అది అక్కడ్నుంచి ఒంట్లో మిగతా అవాయువాలకి వెళ్లి చేరుకుంట���ంది, అక్కడ పేరుకుంటుంది. అదే మనం తినడం తగ్గించి గట్టిగా వ్యాయామం చేస్తే ఒంట్లో మిగతా అవయువాల నుంచి కాలేయానికి పరిగెత్తి అక్కడ్నుంచి బయటకు పోతుంది.
అయితే ఇలా మిగతా అవాయువాల్లో ఈ కొలెస్ట్రాల్ పేరుకునే క్రమంలో కొన్నిసార్లు అక్కడికి వెళ్లే ముఖ్యమైన రక్తనాళాల గోడల్లో ఈ కొలెస్ట్రాల్ పేరుకుంటుంది. దానితో ఆ రక్తనాళంలో రక్తం వెళ్లే దారి తగ్గిపోతుంటుంది. దానివలన సున్నితంగా వెళ్లా��్సిన రక్తం అక్కడ సుడిగుండాలు కొడుతుంది. దాంతో పాటు ఉప్పెక్కువ తింటే రక్త పీడనం పెరిగి, ఆ కొవ్వు పేరుకున్న గోడ లోపల పగులుతుంది. రక్తానికి ఒక గమ్మత్తైన గుణం ఉంది. ఒంటి లోపలైనా బయటైనా ఎక్కడైనా పగులు ఉంటే వెంటనే గడ్డ కట్టేస్తుంది. అలాగే ఇక్కడ కూడా గడ్డ కట్టేస్తుంది. అలా గడ్డ కట్టే సమయంలో ఒకటి అక్కడ ��క్తనాళాన్ని పూర్తిగా మూసివేయవచ్చు లేదా ఆ గడ్డ అక్కడ్నుంచి ఊడి ఇంకోదగ్గరికి ప్రయాణం చేసి ఎక్కడైనా ఇరుగ్గా ఉన్న చోట ఆగిపోయి రక్తప్రసరణ ఆపెయ్యవచ్చు.
మన ఒంట్లో చాలా అవాయువాలకి వెళ్లే రక్తనాళాలు అంత్యనాళాలు అంటే అవొక్కటే ఆ అవాయువానికి లేదా అవయువంలో ఒక భాగానికి రక్తాన్ని పట్టికెళ్లేవి, అవి మూసుకుపోతే ఆ అవయువానికి ఆహారం, ఊపిరి ఆగిపోయినట్లే. ఇలాంటి అవాయువాల్లో ప్రధానమైనవి గుండె, మెదడు. వీటికి ఇలా రక్తం ఆగిపోతే గుండెపోటు లేదా పక్షవాతం వస్తుంది.
అయితే కొంతమంది కొవ్వులు తక్కువ తిన్నా వాళ్లలో కొన్ని జన్యుకారణల వలన కొలెస్ట్రాల్ ఎక్కువగా ఉంటుంది. ఇది చాలా తక్కువ మందిలో. కానీ ఎక్కువ మందిలో వేపుళ్ళు, నూనెలో మునిగివేగేవి తినటం, ఎక్కువ పంచదారతో చేసినవి తినటం, అలాగే నూనెలు ఎక్కువగా వాడి చేసే బిర్యానీలు తినటం వలన కొలెస్ట్రాల్ పెరుగుతుంది.
గుండెపోటు, పక్షవాతం న���వారణలో ముఖ్యమైనది కొలెస్ట్రాల్ ని నియంత్రించటం అని అధ్యయనాలు చెప్తున్నాయి. జీవనవిధానంలో మార్పులు తీసుకురావటం - వ్యాయామం చెయ్యటం, నూనెలు తగ్గించటం, ఉప్పు తగ్గించటం, తీపిపదార్ధాలు, కొవ్వుతో చేసినవి తినటం తగ్గించటం లేదా మాన��య్యటం చెయ్యాలి. అలాగే కొంతమందికి మందులు అవసరం. అవి వాడుకుంటే మంచిది. ప్రతి మూడు నుంచి ఆరునెలలకి ఒకసారి లిపిడ్ ప్రొఫైల్ చేయించుకోవాలి.
డాక్టర్ గారితో ముఖాముఖి
నిన్నే అడ్వాన్సుగా కట్టేసాను ఫీజు, ఇక మీరు దానిగురించి మరిచిపోండంతే!
ఇంకేం వచ్చావుగా మరి మొదలెట్టు.
అన్నం?
అన్నం తపేలాలో హస్తం తీసేసి ఒక పెద్ద చెంచా పెట్టు.
కూర?
నూనెతో వేపుళ్లు తీసేసి, ఆ ఉడికించిన కూరగిన్నెలో కొంచెం పెద్ద గరిటె పెట్టు.
పప్పు?
ఏదైనా పర్లేదు, ఉడకబెట్టి రెండు గరెట్లు వేసుకుని ఒక చెంచా నెయ్యి వేసుకో.
పెరుగు?
రోజుకి రెండు గరెట్లు.
గుడ్డు?
పిల్లలకైతే ఒకట్రెండు గుడ్��ు ఎలాగోలాగ తినిపించేయ్ ఆమ్లెట్టో, కైమానో, ఉడకబెట్టిందో. నీకైతే ఆ సౌలభ్యం లేదు, ఉడకబెట్టినవి పచ్చసొన తీసేసి పదైనా తినొచ్చు.
పాలు?
వెన్న తీసేసినవి నీకైతే, అది కూడా అరిగించుకోగలిగితే.
పళ్లు?
తొక్కలు, పిక్కలు తీసేసి మొత్తంగా తిను, పిండేసి రసం తీయకు. తొక్క తీయలేనివి బాగా కడుక్కోవాలి.
ఉప్పు?
అన్ని చెంచాలు, గరెట్లు తీసేసి, బొటనవేలికి చూపుడువేలికి మధ్య ఎంత ఉప్పు పడితే అంత వేసుకో వంట���ో.
ఆకుకూరలు?
ఎంత తింటే అంత మంచిది. బాగా కడుక్కోవాలి. తక్కువగా ఉడికించాలి.
జీడిపిక్కలు వగైరా?
ఒక గుప్పెడు రోజుకి.
టీ, కాఫీ, పంచదార?
ఒంటికి అవసరంలేదు , నీ నాలుకకే కావాలవి.
పచ్చళ్లు, వడియాలు, అప్పడాలు, ఐస్క్రీములు, కిళ్ళీలు, వక్కపొడి ఇతరత్రా?
శుభ్రంగా పనిచేసే కడుపుకి కన్నం వెయ్యడానికి కనుక్కున్నారు అవన్నీ.
ఎంత తినాలి?
వెలితి ఉండేంతగా.
ఎంత తాగాలి?
నీరిడి నీటి రంగులో వచ్చేంతగా. ఒక్క నీళ్లే. ఇంకేం తాగక్కర్లేదు.
మీరెందుకు ఎప్పుడూ ట్విట్టర్లో ఉంటారు?
అన్నం తినటం మానేసి ఇలా ఇతరుల బుర్ర తినే అడ్డమైన ప్రశ్నలు కూడా వేయకూడదు. ఫీజు టైమైంది. బయల్దేరు.