#Srisailam
ఇష్టకామేశ్వరి ఆలయం సందర్శన తాత్కాలికంగా నిలిపివేత ...
అటవీ శాఖ - చెంచు డ్రైవర్ల మధ్య వివాదంతో ఇష్టకామేశ్వరి ఆలయం సందర్శన నిలిపివేత...
చెంచుల జీపులను సందర్శనకు వినియోగిస్తున్న అటవీశాఖ అధికారులు...
ఇష్టకామేశ్వరి ఆలయంకి వెళ్లే భక్తుల టికెట్లను వెనక్కిచ్చేసిన అటవీశాఖ సిబ్బంది...
వివాదం సద్దుమణిగిన తరువాత యాత్ర పునః ప్రారంభిస్తామంటున్న ఫారెస్ట్ అధికారులు...
కుమ్మెర మల్లన్న జాతర ఘటన బాధితులను పరామర్శించేందుకు
నాగర్ కర్నూల్ బయలుదేరిన బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ @KTRBRS మరియు పార్టీ నేతలు
జిల్లా కేంద్రంలోని అంబేద్కర్ చౌరస్తా వద్ద కొనసాగుతున్న ధర్నా శిబిరంలో కుమ్మెర బాధితులను పరామర్శించి.. ఘటనపై బాధితులతో మాట్లాడి వివరాలు అడిగి తెలుసుకోనున్న కేటీఆర్
నాగర్కర్నూల్ జిల్లా కుమ్మెర మల్లన్న జాతరలో కాంగ్రెస్ గూండాలు చేసిన దాడిలో మరణించిన 2 నెలల పసిపాప కుటుంబాన్ని ఈరోజు స్వయంగా కలిసి పరామర్శించి, న్యాయం జరిగే వరకు పోరాటం చేస్తామని మాటిచ్చిన బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్.
@KTRBRS
నాగర్కర్నూల్ జిల్లా కుమ్మెర మల్లన్న జాతరలో కాంగ్రెస్ గూండాల దాడిలో మృతి చెందిన రెండు నెలల పసిపాప కుటుంబాన్ని పరామర్శించిన బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్.. వారి కుటుంబానికి అండగా ఉంటామని, వారికి పది లక్షలతో ఇల్లు కట్టిస్తామని హామీ ఇచ్చి తక్షణ సహాయంగా లక్ష రూపాయల ఆర్థిక సహాయం అందించారు.
ఆ కుటుంబానికి న్యాయం చేయాలని ఆందోళన చేస్తున్న అన్ని వర్గాల నాయకులను, కార్యకర్తలను కలిసి కుటుంబానికి సంఘీభావం తెలిపారు.
మరోసారి మానవత్వం చాటిన కేటీఆర్
కుమ్మెర జాతర ఘటనలో చనిపోయిన చిన్నారి కుటుంబాన్ని ఆదుకుంటామని భరోసా
ఆర్థికంగా సహాయం అందించడమే కాకుండా ఇల్లు కట్టిస్తామని మాట ఇచ్చిన కేటీఆర్
అలాగే సర్కార్ స్పందించి.. పసిగుడ్డు ప్రాణాలు తీసుకున్న వారిని శిక్షించాలని డిమాండ్..
శ్రీశైలం మల్లన్న దర్శనానికి కాలినడకన భక్తులు.. కర్ణాటక నుంచి డోర్నాల మీదుగా వేలాది మంది భక్తుల పాదయాత్ర.. మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు ప్రారంభంకానున్న నేపథ్యంలో.. శ్రీశైలం మల్లన్న దర్శనానికి భక్తుల పాదయాత్ర.. ఆత్మకూరు సమీపంలోని వెంకటాపురం నుంచి అటవీ మార్గం ద్వారా వెళ్లేందుకు అనుమతి నిరాకరణ
#AndhraPradesh #Srisailam
తెలంగాణ ప్రజలకు సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు.. భోగి, మకర సంక్రాంతి, కనుమ పండుగ శుభాకాంక్షలు.. రాష్ట్ర రైతాంగం సుభిక్షంగా వర్ధిల్లాలని ఆకాంక్షించిన బీఆర్ఎస్ అధినేత కేసీఆర్
#telangana#Hyderabad#Sankranthi2026#KCR
విజయవాడ: ఇంద్రకీలాద్రిపై భక్తుల సౌకర్యార్థం నూతన సంస్కరణలు. రూ.500 అంతరాలయ దర్శన టికెట్కు ఇచ్చే ఉచిత లడ్డు ఇకపై స్కానింగ్ పాయింట్ వద్దే పంపిణీ. దర్శనం అనంతరం వేరే కౌంటర్ల వద్ద వేచి ఉండాల్సిన అవసరం లేకుండా మార్పు. ప్రతి టికెట్ స్కాన్ అయిన వెంటనే లడ్డు అందజేసే విధానం అమలు.
#BreakingNews #TeluguNews #AndhraPradesh #Vijayawada
తిరుమలలో ఘనంగా ముక్కోటి ఏకాదశి వేడుకలు.. శ్రీవారి ఆలయంలో తెరుచుకున్న ఉత్తర ద్వారం.. ఉత్తర ద్వార తలుపులను తెరిచి ప్రత్యేక పూజలు చేసిన అర్చకులు
#AndhraPradesh#TTD#tirumala#MukkotiEkadasi
కర్నూలు: మంత్రాలయంలో ప్రైవేట్ లాడ్జీల దందా.. మంత్రాలయానికి భారీగా పోటెత్తిన భక్తులు, వసతులు లేక తీవ్ర ఇబ్బందులు.. ఇదే అదునుగా దోచుకుంటున్న ప్రైవేట్ లాడ్జీలు.. ఆధ్యాత్మిక క్షేత్రాన్ని వ్యాపార కేంద్రంగా మార్చిన దళారులు.. భక్తులు అధిక సంఖ్యలో రావడంతో రేట్లు భారీగా పెంచిన ప్రైవేట్ లాడ్జీల నిర్వాహకులు..
#kurnool #Mantralayam #AndhraPradesh #Privatelodges
తిరుమలలో భారీగా భక్తుల రద్దీ.. టోకేన్ లేని భక్తుల సర్వదర్శనానికి 18 గంటల సమయం.. నిన్న శ్రీవారిని దర్శించుకున్న 80,113 మంది భక్తులు.. నిన్న తలనీలాలు సమర్పించిన 31,683 మంది భక్తులు.. నిన్న శ్రీవారి హుండీ హుండీ ఆదాయం రూ.3.71 కోట్లు
#TTD#TTDUpdate#Tirumala#Tirupati
నంద్యాల: శ్రీశైలం మల్లన్నకు కార్తీకమాసంలో రికార్డు స్థాయిలో హుండీ ఆదాయం. 33 రోజులకు రూ.7 కోట్ల 27 లక్షల 26 వేల 400 నగదు. 117 గ్రాముల బంగారం, 7 కేజీల వెండి, విదేశీ కరెన్సీ లభ్యం. గతేడాదితో పోలిస్తే ఈ ఏడాది కోటి 30 లక్షలు అధికంగా మల్లన్న హుండీ ఆదాయం. కార్తీకమాసంలో హుండీ ఆదాయం ఈ స్థాయిలో రావడం మొదటిసారి కావడం విశేషం.
#BreakingNews #TeluguNews #AndhraPradesh #APNews #Srisailam