పల్లె పండుగ రోడ్డు తవ్వేసిన వారిపై నాన్ బెయిలబుల్ కేసులు
• రెవెన్యూ రికవరీ యాక్ట్ కింద చర్యలకు ఉప ముఖ్యమంత్రివర్యుల ఆదేశం
• ప్రభుత్వ ఆస్తులకు నష్టం కలిగించేవారి పట్ల కఠినంగా వ్యవహరించాలన్న శ్రీ @PawanKalyan గారు
తిరుపతి జిల్లా, పుల్లంపేట మండల పరిధిలోని అనంతసముద్రం, పాపక్కగారిపల్లె గ్రామాల మధ్య పల్లెపండుగ కార్యక్రమం ద్వారా నిర్మించిన రోడ్డును ధ్వంసం చేసిన ఘటనను రాష్ట్ర ఉప ముఖ్యమంత్రివర్యులు, పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారు తీవ్రంగా పరిగణించారు. ప్రభుత్వ ఆస్తులు ధ్వంసం చేసిన వైసీపీ నాయకుడు సుబ్బారెడ్డిపై చట్ట ప్రకారం కఠిన చర్యలు తీసుకోవాలని ఇంజనీరింగ్ అధికారులను ఆదేశించారు. సోమవారం రోడ్డు ధ్వంసం, తదుపరి చర్యలపై పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ ఇంజనీరింగ్ ఉన్నతాధికారులతో సమీక్షించారు. వారం రోజుల క్రితం పల్లెపండుగ 3.0 ద్వారా రూ. 4.75 కోట్లతో నిర్మించిన రోడ్డును సుబ్బారెడ్డి అనే వ్యక్తి,
వెంకటసుబ్బారెడ్డి అనే మరో వ్యక్తి సాయంతో 100 మీటర్ల మేర ట్రాక్టర్‌తో దున్నేశారని, గ్రామస్థులు ఇచ్చిన సమాచారం మేరకు ఎఫ్ఐఆర్ నమోదు చేసినట్టు అధికారులు వివరించారు. సాయంత్రంలోపు అరెస్టు చేసి మెజిస్ట్రేట్ ముందు హాజరుపరుస్తామని తెలిపారు.
ఈ సందర్భంగా బాధ్యులపై తీసుకోవాల్సిన చర్యలపై శ్రీ పవన్ కళ్యాణ్ గారు అధికారులకు దిశానిర్దేశం చేశారు. ప్రజలకు సౌకర్యం కలిగించే ప్రభుత్వ ఆస్తులను ధ్వంసం చేయడం క్షమించరాని నేరమని, పల్లెపండుగ రోడ్డు ధ్వంసం చేసిన వ్యక్తిపై నాన్ బెయిలబుల్ సెక్షన్ల కింద కేసులు పెట్టాలని ఆదేశించారు. ప్రజా ధనంతో నిర్మించిన రహదారిని ధ్వంసం చేయడం అనేది దుర్మార్గపు చర్య అనీ, ఆ చర్యలకి పాల్పడ్డ నాయకులు, వారి వెనుక ఉన్నవారినీ కూడా చట్టం ముందు నిలబెట్టాలని స్పష్టం చేశారు. ప్రజల సౌకర్యం కోసం ప్రభుత్వం ఇచ్చే మౌలిక సదుపాయాలుకి ఎవరు నష్టం చేశారో వారి నిజ స్వరూపం అందరికీ తెలియచేయాలి అన్నారు.
అనంతసముద్రం, పాపక్కగారిపల్లె గ్రామాల మధ్య రోడ్డును ధ్వంసం చేసిన వ్యక్తులపై రెవెన్యూ రికవరీ యాక్ట్ ని వర్తింపజేసి జరిగిన నష్టాన్ని వసూలు చేసే విధంగా చర్యలు తీసుకోవాలని దిశా నిర్దేశం చేశారు.
@AndhraPradeshCM@PIB_India@IPR_AP@pibvijayawada
ప్రజాధనంతో వేసిన రోడ్డును ట్రాక్టర్‌తో దున్నేశారు.. డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఆగ్రహం
తిరుపతి జిల్లా పుల్లంపేట మండలంలో రూ.4.75 కోట్ల పల్లెపండుగ రోడ్డు 100 మీటర్ల మేర ధ్వంసం
బాధ్యులపై నాన్ బెయిలబుల్ కేసులు.. నష్టం మొత్తం రెవెన్యూ రికవరీ యాక్ట్ కింద వసూలు చేయాలని ఆదేశం
ప్రభుత్వ ఆస్తులు ధ్వంసం చేస్తే కఠిన చర్యలు తప్పవని పవన్ స్పష్టం చేశారు
#PawanKalyan #TV5News