YS Sharmila Reddy met with Rahul Gandhi at 10 Janpath today Sources say she is going to Rajya Sabha for congress party.
#YSSharmila#RAjyasabha#Congress
UPIని దేశవ్యాప్తంగా ప్రోత్సహించి… ఇప్పుడు అదే డిజిటల్ పేమెంట్స్‌పై కొత్త ఛార్జీలు ఎందుకు?
అక్టోబర్ 15 నుంచి ₹2,000కు మించిన కొన్ని Merchant UPI Transactionsపై 0.4% MDR అమల్లోకి రానుంది. ఈ ఛార్జీ నేరుగా వినియోగదారుడిపై కాకుండా Merchantపై పడుతుంది.
ప్రశ్న ఒక్కటే — చిన్న వ్యాపారులు, డిజిటల్ పేమెంట్స్‌పై ఆధారపడే వ్యాపార వ్యవస్థపై ఈ కొత్త ఖర్చు ప్రభావం ఎలా ఉంటుంది?
#INCAndhra #UPI #DigitalIndia #AndhraPradesh #MerchantMDR #IndianNationalCongress
इंदौर का 'भारत जोड़ो मैदान' इतिहास रचने को तैयार है।
आज यहां से नेता विपक्ष श्री @RahulGandhi के साथ हजारों युवा मोदी सरकार के छात्र विरोधी एजुकेशन सिस्टम के खिलाफ आवाज बुलंद करेंगे।
📍 मध्य प्रदेश
#ChhatronKiGoonj
అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు. ఆది దేవుడు ఆ విఘ్నేశ్వరుడు మీ విఘ్నాలను, దోషాలను తొలగించి, అష్ట ఐశ్వర్యాలను, సకల సుఖాలను, ప్రశాంతతను ప్రసాదించాలని, తలపెట్టిన ప్రతి పని ఎటువంటి ఆటంకాలు లేకుండా పూర్తవ్వాలని మహా గణపతిని మనస్పూర్తిగా ప్రార్థిస్తున్నా. పార్వతీ తనయుడు మీ ఇంట్లో కొలువై ఉండాలని, మీ జీవితంలో కొత్త వెలుగులు నింపాలని ఆశిస్తున్నా.
నాన్న స్వర్గీయ వైఎస్ రాజశేఖరరెడ్డి గారి ఆశీస్సులతో నా కుమార్తె వైఎస్ అంజిలి రెడ్డి - సోమల రఘురామ్ రెడ్డిల పరిశుద్ధ వివాహ మహోత్సవం YSR కుటుంబంలో మరో సంతోషకరమైన క్షణం. ఇరువురి కలయిక దైవ సంకల్పం. నూరేళ్ల జీవితానికి శుభారంభం.
ఈ నెల 24న నిశ్చితార్థం, నవంబర్ 25న పరిణయం, అలాగే డిసెంబర్ 5న రిసెప్షన్ వేడుక శుభవార్తను దేవుడి ఆశీర్వాదంతో నాన్న ఘాట్ వేదికగా మీతో పంచుకోవడం అత్యంత ఆనందదాయకం.
కాబోయే నూతన వధూవరుల దాంపత్య జీవితం కన్నుల పండుగగా, సుఖసంతోషాలతో సాగాలని, అంజిలి రెడ్డి, రఘురామ్ రెడ్డిల తొలి వివాహ ఆహ్వాన పత్రికను నా కుటుంబ సభ్యులతో, మరియు రఘురామ్ తల్లిదండ్రులతో కలిసి ఇడుపులపాయలోని నాన్న YSR ఘాట్ వద్ద ఉంచి ఆశీస్సులు తీసుకోవడం జరిగింది. నాన్న దీవెనలు బిడ్డల జీవితాలకు కొండంత అండ. ఆయన చూపిన సన్మార్గం వారికి ఎల్లప్పుడూ ఆదర్శప్రాయం.
An 11 year old boy, Taushik, died under mysterious circumstances at his school. His mother, Moulabi, fought for six long months for justice. A heartless government ignored her pleas, and she has now died by suicide. Yet, the authorities remain unmoved.
This is the injustice meted out when the victims are poor and powerless. Would the authorities have been this callous if it were the child of a powerful family?
APCC Working President @MastanValiINC garu led a Rasta Roko demanding justice and called for a fair and impartial investigation, an FIR against those responsible, and immediate action against the school management and officials whose negligence contributed to this double tragedy.
The Congress will not stop fighting until Taushik’s family gets justice.
ఎన్నికల ముందు మాట ఒకలా... గెలిచిన తర్వాత మాట మరోలా!
“ధరలు తగ్గిస్తాం” అని హామీ ఇచ్చారు.
అధికారంలోకి వచ్చాక మాత్రం “ధరలు పెరుగుతాయి... మనం ఏం చేయలేం” అంటున్నారు.
మరి ఎన్నికల ముందు ఇచ్చిన హామీలు ఎవరి కోసం?
అవసరాన్ని బట్టి మాట మార్చడమేనా పవన్ కళ్యాణ్ గారి రాజకీయం?
ప్రజలకు కావాల్సింది మాటలు కాదు... ధరల నుంచి ఉపశమనం.
#PawanKalyan
#APPolitics
#PriceRise
#IncAndhra
#IndianNationalCongress
UPI was meant to make digital payments easier and cheaper for every Indian. Instead, the Modi regime is now burdening it with a 0.4% MDR on transactions above ₹2000.
At a time when unemployment, job insecurity and inflation are already hurting households, this additional cost will hit the poor, marginalised, middle class and small traders the hardest.
The government cannot promote UPI as the symbol of Digital India while simultaneously making it more expensive to use. The common man needs relief, not another burden.
Withdraw the UPI MDR.
#UPI #StopUPIMDR
చంద్రబాబు గారు @ncbn “అబద్ధాల పురుషోత్తముడు”. దివంగత కాంగ్రెస్ ముఖ్యమంత్రి YSR కష్టాన్ని కాజేయడంలో ఉత్తమరత్న. తానే ఉద్ధరించినట్లు ..ఉత్తరాంధ్ర మీద ప్రేమున్నట్లు చెప్పుకోవడంలో ఘనాపాటి. ఆనాడు జలయజ్ఞాన్ని విభేదించి, పోలవరానికి వ్యతిరేకమని పబ్లిక్ గా చెప్పి , నేడు జలం జీవం జీవితం లాంటి పెద్ద మాటలు చెప్పడం మీకే చెల్లింది. కాలువలు అనవసరం అని వాదించిన మీరే.. మహానేత తవ్వించిన అవే కాలువల్లో నీళ్లు పారిస్తూ .. సాగు, బాగు మీ నినాదంగా ప్రకటించుకోవడం దెయ్యాలు వేషాలు మార్చినట్లు ఉంది.
బాబు గారు నిర్లక్ష్యం చేసిన పోలవరాన్ని ఆంధ్రప్రదేశ్ జలప్రదాయని అని గుర్తించిన నేత డాక్టర్ YSR. ప్రాజెక్ట్ కోసం కుడి, ఎడమ కాలువలు తవ్వించడంలో రాజశేఖర్ రెడ్డి గారి కృషి అనీర్వచనీయం. పోలవరం డ్యామ్ పనులకంటే ముందుగానే 90 శాతం కాలువల పనులన్నీ YSR హయాంలోనే పూర్తి చేశారని రాష్ట్రంలో ఎవరిని అడిగినా చెప్తారు. అది మహానేత కష్టమని కొనియాడుతారు. 2004 లోనే పరిపాలన అనుమతులు సాధించి, ఆనాడే రూ. 2680 కోట్లు నిధులు కేటాయించి, భూసేకరణ పూర్తి చేసి, 2009 వరకే ప్రధాన పనులన్నీ పూర్తి చేసిన ఘనత YSR ది. కాలువల్లో తుప్పలు, చెత్తాచెదారం తొలగించి ఏకంగా కాలువను తవ్వించిన అభినవ కాటన్ గా ఇప్పుడు చంద్రబాబు గారు తనను తాను వర్ణించుకోవడం నీచపు చర్య.
ఇవ్వాళ పురుషోత్తమపట్నం, పుష్కర లిఫ్ట్ నుంచి ఎత్తిపోతల ద్వారా ఎడమ కాలువలో గోదావరి జలాలు పారుతున్నాయి అంటే కాంగ్రెస్ హయాంలో ముఖ్యమంత్రి రాజశేఖర్ రెడ్డి గారి జలయజ్ఞం ద్వారా పడ్డ కష్టానికి ప్రతిఫలం. పారుతున్న ప్రతి నీటిబొట్టు ఆనాడు YSR సారధిగా ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వ పాలనకు, పనితీరుకు నిదర్శనం.
దివంగత ముఖ్యమంత్రి YSR తవ్వించిన కాలువల్లో సైఫన్ ల, ఆక్విడక్ట్ ల విషయంలో మైనర్ పనులు చేయించి మొత్తం కాలువకే చంద్రబాబు కష్టంలా కలరింగ్ ఇచ్చుకోవడం కరెక్ట్ కాదు.
అందుకే మళ్లీ చెప్తున్నాం. పోలవరం కాలువల కాయకష్టం YSR ది.. కలరింగ్ చంద్రబాబుది.
@INC_Andhra
అందరికీ శ్రీకృష్ణ జన్మాష్టమి శుభాకాంక్షలు. నంద గోపాలుడు మీ జీవితంలో సరైన మార్గం చూపించాలని, బాధలను, కష్టాలను తొలగించి, మనోధైర్యాన్ని నింపాలని, ఈ పర్వదినాన ఆయురారోగ్యాలు, భోగభాగ్యాలు, విజయాలను ప్రసాదించాలని మనస్పూర్తిగా ఆ గోవిందుడిని ప్రార్థిస్తున్నా.