అనునిత్యం మాలో స్ఫూర్తిని నింపుతూ మార్గదర్శనం చేస్తున్న మన నాయకుడు @PawanKalyan గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు 🌷🌷.
దేశం హితం, రాష్ట్రం వికాసం కోరుకొనే మీ నాయకత్వం... యువతలో చైతన్యాన్ని నింపే మీ పోరాటం... ప్రజా సేవే పరమావధిగా భావించే మీ సేవా భావం... మా అందరికీ ఆదర్శనీయం.
సంపూర్ణ ఆయురారోగ్యాలను ప్రసాదించి… మరింత సేవ చేసే శక్తిని, విజయాలను అందించాలని శ్రీ వేంకటేశ్వర స్వామి వారిని ప్రార్థిస్తున్నాను.🙏🏻
#HBDJanaSenaniPawanKalyan
@JanaSenaParty
పిఠాపురం పట్టణం అభివృద్ధికి రూ.308.24 కోట్లు
•ఉప ముఖ్యమంత్రి శ్రీ @PawanKalyan గారి చొరవతో అభివృద్ధి పనులు
•రూ. 200 కోట్లతో భూగర్భ మురుగు నీటి వ్యవస్థ
•ఏలేశ్వరం నుంచి పిఠాపురానికి తాగునీరు
•రూ. 59.52 కోట్లతో కొత్త పైప్‌లైన్, ట్యాంకుల నిర్మాణం
•పిఠాపురం పట్టణంలో దాదాపు 5 వేల కొత్త తాగునీటి కనెక్షన్లు
•త్వరలోనే సిద్ధం కానున్న తడి చెత్త ప్లాంట్
•కోట్లాది రూపాయలతో రహదారులు, కాలువల నిర్మాణం
ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారి ప్రత్యేక చొరవతో పిఠాపురం పట్టణ అభివృద్ధి కొత్త దిశగా పయనిస్తోంది. పట్టణ ముఖచిత్రాన్ని సమూలంగా మార్చే లక్ష్యంతో భూగర్భ మురుగు నీటి వ్యవస్థ, పారిశుద్ధ్య సదుపాయాలు, మురుగు నీటి శుద్ధి కేంద్రాలు, రహదారులు, కాలువలు, నైపుణ్యాభివృద్ధి కేంద్రం, పార్కుల అభివృద్ధి, తాగునీటి సరఫరా వంటి కీలక మౌలిక వసతుల కోసం మొత్తం రూ.308.24 కోట్ల విలువైన అభివృద్ధి పనులు వివిధ దశల్లో కొనసాగుతున్నాయి. ఈ భారీ నిధులు, సమగ్ర ప్రణాళికలతో పిఠాపురాన్ని ఆధునిక సదుపాయాలతో కూడిన ఆదర్శ పట్టణంగా తీర్చిదిద్దే దిశగా అభివృద్ధి పనులు వేగంగా ముందుకు సాగుతున్నాయి.
*మురుగు నీటి సమస్యకు శాశ్వత పరిష్కారం*
పిఠాపురం ప్రజల చిరకాల కోరిక అయిన అండర్‌గ్రౌండ్ డ్రైనేజీ ఏర్పాటుకు రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యతనిచ్చింది. డిప్యూటీ సీఎం శ్రీ పవన్ కళ్యాణ్ గారి ప్రత్యేక చొరవతో ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్టు కోసం ప్రభుత్వం రూ.200 కోట్ల నిధులను మంజూరు చేసింది. ఈ ప్రాజెక్టు ద్వారా పిఠాపురం మున్సిపాలిటీ పరిధిలో సుమారు 120 కిలోమీటర్ల మేర భూగర్భ మురుగునీటి పైప్లైన్లను నిర్మించనున్నారు. అలాగే, పట్టణంలోని ప్రధాన చెరుకుల కాలువకు ఇరువైపులా అండర్‌గ్రౌండ్ డ్రైనేజీ లైన్లను ఏర్పాటు చేసేలా ప్రణాళికలు సిద్ధం చేశారు. ఈ ప్రాజెక్టు పూర్తిస్థాయిలో అందుబాటులోకి వస్తే, పిఠాపురం పట్టణంలో దశాబ్దాలుగా కొనసాగుతున్న మురుగు నీటి సమస్యకు శాశ్వత పరిష్కారం లభించనుంది. దోమల నివారణకు తోడ్పడటంతోపాటు పట్టణ పరిశుభ్రత మెరుగుపడి, ప్రజారోగ్య పరిరక్షణలోనూ గణనీయమైన మార్పు చోటు చేసుకోనుంది. పిఠాపురం ప్రజల సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకుని ఈ ఈ ప్రతిష్టాత్మక అండర్‌గ్రౌండ్ డ్రైనేజీ ప్రాజెక్టుకు రూ.200 కోట్ల నిధులను కేటాయించిన ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి, సహకరించిన పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి శ్రీ పొంగూరు నారాయణ గారికి శ్రీ పవన్ కళ్యాణ్ గారు ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపారు.
*రోజుకు రెండు పూటలా సురక్షితమైన తాగు నీరు*
పిఠాపురం పట్టణంలో తాగు నీటి సమస్యను శాశ్వతంగా పరిష్కరించేందుకు రూ. 59.52 కోట్ల భారీ బడ్జెట్‌తో పనులను వేగవంతంగా జరుగుతున్నాయి. అమృత్ 2.0లో భాగంగా రూ. 57.37 కోట్లు, టిడ్కో గృహ నిర్మాణ పథకం ఇళ్లకు నీటి సరఫరా కోసం రూ. 2.15 కోట్లను కేటాయించారు. పట్టణానికి మొత్తం 120.19 కి.మీ. పైప్‌లైన్ అవసరం కాగా, ప్రస్తుతం ఉన్న 72.90 కి.మీ. లైన్లో 35 కి.మీ. దెబ్బతిన్నట్లు గుర్తించారు. దీని కోసం కొత్తగా, అదనంగా 82.29 కిలోమీటర్ల మేర పైప్‌లైన్ పనులను ప్రతిపాదించారు. పట్టణంలో 600 కిలోలీటర్ల సామర్థ్యం గల భారీ ఎత్తైన నీటి నిల్వ ట్యాంకు నిర్మాణ పనులు ముమ్మరంగా సాగుతున్నాయి. మరో 400 కిలోలీటర్ల సామర్థ్యం గల నీటి నిల్వ ట్యాంకు నిర్మాణం త్వరలోనే ప్రారంభం కానుంది. పట్టణ ప్రజల కోసం కొత్తగా దాదాపు 5 వేల తాగునీటి కొళాయి కనెక్షన్లు ఇవ్వనున్నారు. పిఠాపురం పట్టణానికి రోజువారీ నీటి కొరత లేకుండా ఏలేశ్వరం జలాశయం నుంచి రోజుకు 55 లక్షల లీటర్ల నీటిని తరలించేందుకు ఒక ప్రధాన పైప్‌లైన్ ఏర్పాటు జరుగుతోంది. పిఠాపురం పట్టణ ప్రజల రోజువారీ నీటి అవసరమైన 80 లక్షల లీటర్లను దృష్టిలో ఉంచుకుని, రోజుకు రెండు పూటలా సురక్షితమైన తాగునీటిని అందించడమే లక్ష్యంగా ఈ పనులు వేగంగా కొనసాగుతున్నాయి.
శాస్త్రీయంగా వ్యర్థాల నిర్వహణకు ఏర్పాట్లు*
పిఠాపురం పురపాలక సంఘం పరిధిలో పట్టణ పరిశుభ్రత, వ్యర్థాల శాస్త్రీయ నిర్వహణ కోసం స్వచ్ఛ భారత్ మిషన్ రెండో దశ కింద పనులు ముమ్మరంగా సాగుతున్నాయి. ఇందులో భాగంగా రూ. 4 కోట్లతో తడి చెత్త నిర్వహణ కేంద్రం, రూ.1.43 కోట్లతో మల వ్యర్థాల శుద్ధి కేంద్రం ఏర్పాటు చేస్తున్నారు. తడి చెత్త నిర్వహణ కేంద్రం పనులు మరో రెండు నెలల్లో పూర్తికానున్నాయి. పట్టణంలోని 18,468 ఇళ్ల నుంచి ప్రతిరోజూ 25 టన్నుల చెత్తను సేకరిస్తున్నారు. తడి చెత్త నిర్వహణ కేంద్రం పనులు వేగవంతం అవుతున్నాయి. ఇది అందుబాటులోకి వస్తే రోజుకు వచ్చే 25 టన్నుల చెత్తను పూర్తిస్థాయిలో శాస్త్రీయంగా నిర్వహించే అవకాశం ఉంటుంది. అలాగే పట్టణంలో గతంలో పేరుకుపోయిన భారీ మొత్తంలో ఘన వ్యర్థాలను కూడా గణనీయంగా తగ్గిస్తున్నారు. ఈ పనులు పూర్తిస్థాయిలో అందుబాటులోకి వస్తే చెత్త సమస్య తగ్గడంతోపాటు పర్యావరణ పరిరక్షణ, ప్రజారోగ్య పరిస్థితులు మెరుగుపడనున్నాయి.
A long-pending issue is finally seeing the light of hope !!
After years of waiting and struggle, the Venkannapalem - Chodavaram BT Road work is now in progress.
For the people of these villages, this is not just a road it is a path to better education, healthcare, livelihoods, connectivity and opportunities.
A long-standing demand is finally turning into visible development on the ground.
Heartfelt gratitude to the NDA Government for turning years of waiting into meaningful development and bringing new hope to the people.
Years of waiting. One road.
A thousand new hopes.
రాయలసీమ మొత్తo లో కడప జిల్లా రోడ్ల కోసం highest funds(876 crs) allot చేసిన @PawanKalyan 👏
రాయలసీమ లో overall గా
40,837 Farm ponds
41,614 చెరువుల ద్వారా 50K+ acres అదనపు భూమిని సాగు
15K+ మినీ గోకులాలు
Multi Village scheme (Dhone)
Water grid పథకాలు
పల్లె పండుగ- 4,523 crs
హిందూ సంప్రదాయంలో రావి చెట్టు (అశ్వత్థ వృక్షం) మరియు వేప చెట్టు (నింబ వృక్షం)లను ఒకే చోట కలిపి నాటడం, వాటికి కళ్యాణం జరిపించడం ఎంతో పవిత్రమైనదిగా భావిస్తారు. ఈ జంట వృక్షాలను పూజించడం వెనుక ఆధ్యాత్మిక మరియు ఆరోగ్య కారణాలు ఉన్నాయి. AP GREEN Executive Committee Chairperson గా బాధ్యతలు స్వీకరించిన తర్వాత గౌ. రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి @PawanKalyan గారి జన్మదినం సందర్భంగా మొదటి కార్యక్రమంగా ఈ పవిత్ర కార్యక్రమాన్ని సతీసమేతంగా నిర్వహించిన MLC @NagaBabuOffl గారు.
• ఆధ్యాత్మిక ప్రాముఖ్యత:
లక్ష్మీనారాయణుల రూపం:
రావి చెట్టు: పురుష శక్త్యత్మకమైన శ్రీ మహావిష్ణువు స్వరూపంగా పరిగణించబడుతుంది (రావి చెట్టు మొదట్లో బ్రహ్మ, మధ్యలో విష్ణువు, పైన శివుడు కొలువై ఉంటారని నమ్మకం).
వేప చెట్టు: స్త్రీ శక్త్యత్మకమైన శ్రీ మహాలక్ష్మి లేదా గౌరీ దేవి / శక్తి స్వరూపంగా పూజిస్తారు.
ఈ రెండింటినీ కలిపి పెంచి వివాహం జరిపించడం (అశ్వత్థ కళ్యాణం) వల్ల లక్ష్మీనారాయణులను ఒకే చోట ఆరాధించిన ఫలితం దక్కుతుంది.
• ఆరోగ్య మరియు శాస్త్రీయ ప్రయోజనాలు:
స్వచ్ఛమైన ప్రాణవాయువు: రావి చెట్టు నిరంతరం (రాత్రి వేళల్లో కూడా) విస్తారంగా ఆక్సిజన్ విడుదల చేస్తుంది.
రోగనిరోధక శక్తి: వేప చెట్టు సహజ సిద్ధమైన యాంటీ-బ్యాక్టీరియల్, యాంటీ-వైరల్ గుణాలు కలిగి ఉంటుంది.
పరిశుద్ధమైన గాలి: ఈ రెండు చెట్లు కలిసి ఉన్న చోట వీచే గాలిని పీల్చడం వల్ల శ్వాసకోశ సమస్యలు నయమై, మానసిక ప్రశాంతత చేకూరుతుంది.
#APGREEN
జనసేన పార్టీ శ్రేణులకు, అభిమానులకు, శ్రేయోభిలాషులకు శుభాకాంక్షలు.
ఆంధ్రప్రదేశ్ సొసైటీ ఫర్ గ్రీనింగ్ అండ్ రీఫారెస్టేషన్ ఫర్ ఎకలాజికల్ ఎన్రిచ్మెంట్ (AP GREEN) ఎగ్జిక్యూటివ్ కమిటీ చైర్‌పర్సన్‌గా ఈ నెల ఆగస్టు 28వ తేదీ, శుక్రవారం ప్రమాణ స్వీకారం చేయనున్నాను.
జనసేన పార్టీ అధ్యక్షులు, ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి శ్రీ @PawanKalyan గారు అందుబాటులో లేని కారణంగా, ప్రమాణ స్వీకార కార్యక్రమాన్ని అత్యంత నిరాడంబరంగా, సాదాసీదాగా నిర్వహించాలని నిర్ణయించుకున్నాను.
ఈ కార్యక్రమానికి కేవలం కుటుంబ సభ్యులు, అత్యంత సన్నిహితులు, కొద్దిమంది శ్రేయోభిలాషులు మాత్రమే హాజరవుతున్నారు.
అందువల్ల జనసేన పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, శ్రేయోభిలాషులు ఎవరూ ప్రత్యేకంగా ఈ కార్యక్రమానికి హాజరై ఇబ్బందులు పడవద్దని, ప్రేమపూర్వకంగా విజ్ఞప్తి చేస్తున్నాను.
నాకు అభినందనలు తెలియజేయాలని భావిస్తున్న ప్రతి ఒక్కరినీ త్వరలోనే స్వయంగా, పేరుపేరునా కలుసుకుంటాను. మీ అందరి ప్రేమ, అభిమానం, ఆశీర్వాదాలు నాకు ఎల్లప్పుడూ బలాన్ని ఇస్తాయి.
ఈ బాధ్యతను నాపై ఉంచినందుకు, నాపై విశ్వాసం ఉంచిన ప్రతి ఒక్కరికీ హృదయపూర్వక ధన్యవాదాలు.
మరోసారి మీ అందరికీ నా హృదయపూర్వక కృతజ్ఞతలు.
మీ,
@NagaBabuOffl
ఆంధ్రప్రదేశ్ శాసనమండలి సభ్యులు
AP GREEN ఎగ్జిక్యూటివ్ కమిటీ చైర్పర్సన్.
#PawanKalyanAneNenu
Under the special focus of Deputy Chief Minister Sri @PawanKalyan, around ₹280 crore has been allocated through Jal Jeevan Mission and Amarajeevi Jaladhara. Overall project works have reached 96% completion, with 1,106 of the planned 1,111 km pipeline completed.
Works are fully complete in Pulivendula Urban, Pulivendula Rural and Simhadripuram, while drinking water supply is being extended to 24 habitations in Lingala mandal. The remaining water treatment and storage infrastructure works are in their final stages.
మన ఏకైక మెగాస్టార్ @KChiruTweets గారికి జన్మదిన శుభాకాంక్షలు! 👑❤️
మీరు మాకు కేవలం హీరో మాత్రమే కాదు... కోట్లాది మంది గుండె చప్పుడు, ఎప్పటికీ చెరగని ఎమోషన్! బాస్ ఎప్పటికీ బాసే. మీరు నిండు నూరేళ్ళు ఆయురారోగ్యాలతో వర్ధిల్లాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం! 🔥
#HBDMegastarChiranjeevi
Planting trees on the occasion of Annayya’s birthday felt truly happy and meaningful. Instead of celebrating with something temporary, planting a tree is a beautiful way to create something that grows, gives life, and benefits everyone for years to come.
I believe everyone should plant a tree on the occasion of their loved ones’ birthdays. It’s a small gesture today that leaves a lasting gift for tomorrow. 🌳
Happy Birthday, Annayya! ❤️May your legacy continue to grow and inspire, just like these trees. @KChiruTweets
I extend my deepest gratitude and sincere thanks to Hon’ble Chief Minister Sri Nara Chandrababu Naidu Garu and Hon’ble Deputy Chief Minister Sri Pawan Kalyan Garu for placing immense trust in me and nominating me as the Chairperson of the Executive Committee of the Andhra Pradesh Society for Greening & Reforestation for Ecological Enrichment (AP-GREEN), accorded with Cabinet-rank status.
Plantation and nature conservation have always been my personal passion. Tree planting is not merely an activity to me, but a lifelong commitment to giving back to Mother Earth.
I view this position not just as a protocol post or symbolic honor, but as a great duty and sacred responsibility toward making Andhra Pradesh greener, healthier, and ecologically vibrant.
Under the visionary leadership of CM Chandrababu Naidu Garu and Deputy CM Pawan Kalyan Garu, I promise to dedicate myself wholeheartedly to transforming Andhra Pradesh into a clean, green, and climate-resilient state for present and future generations.
@ncbn@PawanKalyan