ఇలాంటి చారిత్రాత్మక నిర్ణయం తీసుకున్న బెహన్జీ మాయావతి గారికి హృదయపూర్వక ధన్యవాదములు🙏
బహుజనులారా, 99% ఉండి కూడా ఇన్నాళ్లూ బానిసలుగా బతుకుతూ బిచ్చమెత్తుతున్నాం. అన్ని పార్టీల్లో దొరల జెండాలను,ఎజెండాలను మోస్తనే ఉన్నం. ఇప్పుడైనా మన రాజ్యం తెచ్చుకుందాం. రాండి. బీయస్పీలో చేరండి.🙏🙏
మాతో రోజూ బహుజన యాత్రలో పాల్గొంటున్న బహుజన సైనికులకు ఈ రోజు చికెన్ వండి వడ్డించినం. చాలా ఆనందంగా ఉంది ఈ పని చేసినందుకు.
आज बहुजना यात्रा में हमारे बहुजन सैनिकोंकों खाना (चिकन) पखाकें खिलाया। तेलंगाना में बहुजन राज लागू में आये तक मेहनत करेंगे हम। #bahujanyatra
కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా చింతలమానేపల్లి మండలం దిందా గ్రామం వద్ద ఉధృతంగా ప్రవహిస్తున్న దిందా వాగు పరిశీలించాను. దిందా ప్రజలకు వర్షాకాలం అంటేనే భయం. ప్రతీ ఏడాది వర్షాకాలంలో దిందా వాగు ఉధృతికి ఇక్కడి ప్రజలకు రాకపోకలు బంద్,పాఠశాలకు సెలవు ప్రకటిస్తున్నారు. నెల రోజులపాటు ఇక్కడి ప్రజలు బాహ్య ప్రపంచానికి దూరంగా జలదిగ్బంధంలోనే బతుకుతున్నారు. ఎవరైనా వృద్ధులు,చిన్నారులు,గర్భిణీ స్త్రీలు వైద్యం కోసం ఆసుపత్రికి వెళ్లాలంటే ప్రాణాలు అర చేతిలో పెట్టుకొని నాటు పడవ సాయంతో ప్రమాదకరంగా వాగు దాటాల్సిందే. గతంలో ఈ వాగు దాటుతూ ఒక MBA విద్యార్థి మృతి చెందారు.
2017 లో దిందా-కేతిని మధ్య వాగుపై రూ.2 కోట్లతో హై లేవల్ వంతెన నిర్మాణం మంజూరైంది.దీనికి స్థానిక ఎమ్మెల్యే కోనేరు కోనప్ప భూమి పూజ చేసి,ఏళ్లు గడుస్తున్నా పనులు ప్రారంభానికి నోచుకోలేదు. వాగు ఉప్పొంగుతున్న సమయంలో ప్రత్యామ్నాయంగా పడవ ఏర్పాటు చేయడంలో స్థానిక ఎమ్మెల్యే,రాష్ట్ర ప్రభుత్వం ఘోరంగా విఫలమైంది.
ముఖ్యమంత్రి కేసీఆర్ కేవలం కాంట్రాక్టర్ల కమిషన్ల కోసమే ప్రజలకు అవసరం లేని సెక్రటేరియట్,రింగ్ రోడ్, ఆకాశహర్మ్యాల లాంటి భవన నిర్మాణాలకు వేలకోట్లు బడ్జెట్ కేటాయిస్తున్నారు. కానీ మారుమూల అటవీ ప్రాంతంలో నివసించే పేద ప్రజల అభివృద్ధిని మాత్రం గాలికి వదిలేశారు.తక్షణమే CM-SDF నిధుల కింద నిధులు మంజూరు చేసి దిందా-కేతిని వంతెన నిర్మించాలని బీఎస్పీ డిమాండ్ చేస్తుంది.
@TelanganaCMO
నేటి వరకు తెలంగాణలో పోలీసులకు మరియు ఇతర ఉద్యోగులకు ఇంకా జీతాలు రాలేదు. PRC అరియర్లు కేవలం రెండే ఇచ్చారు. మూడు సరెండర్ లీవులు ఇంకా పెండింగులో ఉన్నాయి. లోన్లు తీసుకున్న వాళ్లవి EMI లు కట్టలేక CIBIL రేటింగులు పడిపోతున్నాయి. పిల్లల ఫీజులు సకాలంలో కట్టనందుకు స్కూళ్ల యాజమాన్యాలు పిల్లలను అవమానిస్తూ పుస్తకాలివ్వకుండా వెనక్కు పంపిస్తున్నారు. ఇంక ఇళ్ల కిరాయి గురించి అయితే చెప్పనక్కరలేదు. ఆరోగ్య భద్రత అనారోగ్యంతో మంచాన పడ్డది!!!!
ముఖ్యమంత్రి అసత్యాల-భ్రమల సభలన్నింటికీ బలవంతంగా బందోబస్తు వేసి, మా లాంటి ప్రతిపక్ష పార్టీల నాయకులందరినీ అక్రమంగా రాత్రికి రాత్రే అరెస్టు చేయిస్తున్నరు. ఫాం హౌసుల లాంటి ప్రైవేటు ఆస్తులకు కూడా బలవంతంగా వందల మంది పోలీసు కమాండోలను బందోబస్తుకు అక్రమంగా వినియోగిస్తున్నరు. ఈ బందోబస్తుల TA లు ఏవీ ఇంతవరకు రావడం లేదు!!
ఇంత గొడ్డు చాకిరీ చేసినా పోలీసులు, హోంగార్డుల మీద కనికరం కలగడం లేదు సీయం గారికి. ఇందుకోసమేనా కానిస్టేబుల్ కిష్టయ్య ముదిరాజ్ త్యాగం చేసింది? మన సకల జనుల సమ్మెలు ఈలాంటి హృదయం లేని పాలకుల కోసమే చేసినమా?? ఎక్కడ పోయిండ్రు పాలాభిషేక యూనియన్ సోదరులు? పాలకులు MLC పదవుల ఆశ చూపి మీ నోళ్లు కట్టేశారా??
పోలీసన్నలారా, ఉద్యోగ మిత్రులారా, మన బహుజనరాజ్యంలో మిమ్ముల కంటికి రెప్పలా కాపాడుకుంటం. జైభీం.✊
#LiberateTelangana
#KCRfailedTelangana
బాబాసాహెబ్ అంబేద్కర్, ఛత్రపతి శివాజీ మహారాజ్, సాహు మహారాజ్, మహాత్మ జ్యోతిరావు ఫూలే, సావిత్రి బాయి ఫూలే, మాన్యశ్రీ కాన్షీరాం, కొమురం భీంల వాదంతో, వారసులతో పునీతమైన సిర్పూర్-కాగజ్ నగర్ గడ్డపై చారిత్రాత్మక బహుజన యాత్రలో స్థానిక ప్రజల నుండి ఆశీర్వాదం తీసుకున్నాను.🙏 సిర్పూర్ గడ్డను వలస వాదుల- దోపిడి దొరల నిరంకుశ పాలన నుండి విముక్తం చేసే దాకా విశ్రమించేది లేదు.
बाबसाहब अंबेडकर, छत्रपति शिवाजी महाराज, साहू महाराज, महात्मा फुले, सावित्री बाई फुले, कोम्रम भीम, मान्यवर कांशीराम का विचार धारा से पुनीत हुआ सो सिरपुर काग़ज़नगर इलाक़ा में बहुजन यात्रा में लोगोंका आशीर्वाद माँगा।
#BahujanYatra #Sirpur
@Mayawati@ramjigautambsp@AnandAkash_BSP
ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపకులు, సామాజిక ఉద్యమకారుడు,
మంద కృష్ణ మాదిగ గారికి హార్దిక జన్మదిన శుభాకాంక్షలు.💐💐💐
తెలుగునేలపై గడిచిన మూడు దశాబ్దాలుగా ఎన్నో సామజిక ఉద్యమాలకు, మిలిటెంట్ పోరాటాలకు ఊపిరిలూదిన ఉద్యమకారుడు. జాతుల అస్థిత్వ ఉద్యమాలలో తెలుగునేలపై ఆయన నడిపిన సామాజిక ఉద్యమం ఇంకో వందేళ్ళైనా చరిత్రలో చెరిగిపోని సంతకం. వారు ఆయురారోగ్యాలతో, సుఖ సంతోషాలతో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. తెలుగు నేల పై బహుజన రాజ్య స్థాపన కోసం జరుగుతున్న మహా పోరాటంలో మమేకం కావాలని అభిలషిస్తున్నాను.
ఇప్పుడే ప్రముఖ గాయకుడు కీ.శే. సాయిచంద్ గారి పార్థివ దేహానికి వనస్థలిపురం శ్మశానవాటిక వద్ద బీయస్పీ నాయకులం అందరం నివాళులు అర్పించాము. కుల్కచర్లలో స్వేరో జ్ఞాన యాత్ర ముగింపు సభలో సాయిచంద్, నేను రిటైర్ అయిన తరువాత ఇద్దరం కలిసి పనిచేద్దమన్నడు. అంబేద్కర్ కలలు కన్న రాజ్యాన్ని తెద్దమన్నడు. అది తీరని కల లాగానే మిగిలిపోయింది.
తరువాత నేను వెంటనే IPS నుండి స్వచ్ఛందంగా వైదొలిగి బీయస్పీలో చేరిన.
తను #TRS లో చేరి MLC అభ్యర్థిత్వాన్ని ఖరారు చేసుకున్నడు. బీ ఫారం కూడా తెచ్చుకున్నడు. కానీ అగ్రవర్ణ భూస్వాముల కుట్రలకు బలైండు. తద్వారా సాయిచందు స్థానంలో కూచకుళ్ల దామోదర్ రెడ్డి MLC అయ్యిండు. సాయిచందును వెన్నుపోటు పొడిచెందవరో తెలంగాణ అంతటికీ తెలుసు.. నేను చెప్పను.
నేను ఆనాడే సాయితో మాట్లాడి ఆత్మగౌరవ చిరునామా ఐన బీయస్పీకి రమ్మని అడిగిన, తను కొంతకాలం తర్వాత వస్తా అని అన్నాడు. మన ఏలికలు ఏమనుకున్నారో, తర్వాత ఆయనను ప్రాధాన్యత లేని గిడ్డంగుల కార్పోరేషన్ కు ఛైర్మన్ గా నియమించిండ్రు.
నాగర్ కర్నూలులో కూడా హైదరాబాదు యశోద లాగా వైద్య సదుపాయాలుండింటే సాయిచందు సజీవంగా ఉండి మళ్లీ తన గళంతో మనల్ని సమ సమాజం వైపు నడిపించేవాడేమో! ఇది ఇప్పటి పాలకుల హయాంలో జరుగుతుందనుకోవడం కేవలం భ్రమనే.
ఎంతో మంది సినీ ప్రముఖులకు అధికార లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించిన తెలంగాణ ప్రభుత్వానికి, తన జీవితాన్ని పాటకు అంకితం చేసి, తెలంగాణ ఉద్యమానికి, అంబేద్కర్ భావజాలానికి ఊపిరూదిన ప్రజా గాయకుడు సాయిచందుకు కూడా అదే గౌరవం ఇవ్వాలన్న ఆలోచన రాకపోవడం దురదృష్టం. అహంకారపూరితం.
గూఢ అంజయ్య గారికి, సాయన్న గారికి ఇదే అవమానం జరిగింది. ఇప్పుడు @BRSparty లో ఉండి వివిధ పదవుల్లో ఇరుక్కపోయిన బహుజన బిడ్డలు దీనిని గుర్తించండి. అప్రమత్తంగా ఉండండి. గొంతెత్తండి. కరివేపాకులు కాకండి. కనీసం సాయిచంద్ కుటుంబంలో ఒకరికి అయినా ఎమ్మెల్సీ (MLC) పదవి ఇవ్వాలని డిమాండ్ చేయండి.
ఇది రాజకీయం కాదు. నిప్పు లాగా రాజుకొనే నిఖార్సైన నిజం. అర్పేస్తే ఆరిపోని లక్షల గుండెల్లో రగులుతున్న జ్వాల.
జోహార్ ప్రజా గాయకుడు సాయిచంద్.✊
Love You. Miss You Bro.
.#KCR ji,
నిన్న నిరుద్యోగుల తరపున పోరాడుతున్న బహుజనబిడ్డలు 42 మంది మీద మీ పోలీసులు అక్రమ కేసులు పెట్టిండ్రు. ఈ దుర్మార్గాన్ని మా తెలంగాణ బహుజన సమాజం మరవదు గాక మరవదు. రేపటి బహుజనరాజ్యంలో అమరవీరుల స్థూపం దగ్గర బహిరంగ ప్రజా విచారణకు సిద్దం కండి.✊
TSPSC లో ఇంటి దొంగలను తక్షణమే అరెస్టు చేయాలని,కమీషన్ పూర్తి ప్రక్షాళన తరువాతనే గ్రూప్-1,ఇతర పరీక్షలను నిర్వహించాలని #TSPSC ముందు నిరసన చేస్తున్న #BSP కార్యకర్తలు, నిరుద్యోగులపై పోలీసు దౌర్జన్యాన్ని ఖండిస్తున్నాం. మీకు ధమ్ముంటే KCR-KTRలను అరెస్టు చేయండి, మమ్ములను కాదు.
తెలంగాణ దశాబ్ది (దోపిడి) సంబురాలలో భాగంగా ఎక్కడ చూసిన KCR-DGP ఫ్లెక్సీలే దరశనమిస్తున్నవి. ఎక్కడా ప్రాణ త్యాగం చేసిన కానిస్టేబుల్ కిష్టయ్య ముదిరాజ్, పదవీ త్యాగం చేసిన DSP నళిని, ఆంధ్ర పాలకులను ఎదిరించిన ARPC శ్రీనివాస్ గౌడ్ ల గురించి ఎవరు మాట్లాడ్తలేరు! ఎందుకు? వీళ్లు బహుజన బిడ్డలనేనా చిన్న చూపు? అట్లనే
హోం గార్డుల వేతనాలు, రెక్యులరైజేషన్ ఏమైంది? పోలీసుల మూడు సరెండర్ లీవులు ఏమైనవి? @TelanganaCMO@TelanganaDGP
2014 మే 25 (సరిగ్గా ఇదే రోజు) ఉదయం దాదాపుగా 7:30AM కు కోచ్ శేఖర్ బాబు ఎవరెస్టు బేస్ క్యాంపు నుండి మన తెలంగాణ బిడ్డలు పూర్ణ-ఆనంద్ లు ఎవరెస్టు శిఖరం మీద కాలు మోపిండ్రని ఫోన్ చేసిండు. ఆ ఉద్విగ్న క్షణాలను నేనెప్పటికీ మరచిపోలేను.
తరతరాల అణచివేతను, బలవంతంగా రుద్దబడ్డ ఆత్మన్యూనతాభావాన్ని తలదన్ని ఈ చిన్నారులు చావుకైనా తెగించి( ఆ సీజన్ లో 18 మంది పర్వతారోహకులు 10 నిముషాల్లోనే చనిపోయారు!) చరిత్రను తిరగరాసిన రాసింది ఈ రోజే. దాని తరువాత ఈ అణచివేయబడ్డ వర్గాల్లో చాలా మార్పులొచ్చినయి. వాటి గురించి చెప్పడానికి ఒక్కరోజు, ఒక్క పేజి చాలదు. అందుకే ఈ రోజు కేవలం స్వేరోలకే కాదు, యావత్తు ప్రపంచ పేద ప్రజలందరికీ మరి ముఖ్యంగా విద్యార్థులకు, వారి తల్లితండ్రులకు, వారి ఉపాద్యాయులకు నిజంగా విజయోత్సవం. అందుకే అందరికీ విక్టరీ డే శుభాకాంక్షలు.
వాలెంటైన్స్ డే వల్ల మన జీవితాలు మారతాయో లేదో నేను చెప్పలేని కానీ స్వేరో విక్టరీ డే వల్ల మాత్రం మన పిల్లల జీవితాలు సమూలంగా మారే అవకాశముందని నా బలమైన నమ్మకం.
Today is Swaeroes Victory Day.
On this day, Poorna and Anand not only set their tiny feet on the peak of Mt Everest, but also placed Architect of Indian Constitution-Babasaheb Dr BR Ambedkar’s Portrait on the top of it. All Swaeroes observe this day as a Victory Day. To celebrate this rare moment, Swaero students and their families go to higher place in their locality with Indian National Flag and Swaero Flag and recite Swaero Ten Commandments (which #KCR’s Government unofficially banned in all the schools sadly !) and make a resolution to achieve their goals in their life,come what may.
“You will be what you will to be”- James Allen
నిస్వార్ధ ప్రభుత్వ అధికారి గా ఉండి గురుకులాల్లో గొప్ప విద్య అందించిన Dr R S Praveen Kumar గారికి 🙏🙏💐💐
ఫుల్ సాంగ్👌👌👇👇
https://t.co/5CMjCK5zLz
@AllIndiaBSP@BITCELL_BSP @BSP4Telangana @bsp_ts@bspindia