ఆంధ్రప్రదేశ్ లో #group2 అభ్యర్థులు ఎమర్జెన్సీ కండిషన్లో ఉన్నారు. ఆదివారం మెయిన్స్ పరీక్ష. విద్యార్థుల చేతుల్లో పుస్తకాల్లేవు, కంటికి కునుకు లేదు. రోడ్లపైన ఉన్నారు. వైఎస్సార్సీపీ ప్రభుత్వం రోస్టర్ విధానంలో తప్పులతో 2023లో రిలీజ్ చేసిన గ్రూప్-2 నోటిఫికేషన్ రద్దు చెయ్యాలని కోరుతున్న 92 వేల మంది అభ్యర్థుల ఆవేదన అరణ్య రోధన కాకూడదు. @naralokesh గారూ, ఈ సమస్య మీ దృష్టికి వచ్చిందో లేదో, ఒక్క పది నిమిషాలు స్పెండ్ చేసి చూడండి. నాలుగు లక్షల నాలుగు వేల మంది రాసిన గ్రూప్-2 ఎగ్జామ్ నోటిఫికేష్లో తప్పులు ఉన్నా మీ ప్రభుత్వం మెయిన్స్ ఎగ్జామ్స్ కండెక్ట్ చేస్తే మరో పదేళ్ల దాకా కూడా ప్రభుత్వం ఈ నోటిఫికేషన్ ఉద్యోగాల భర్తీ ప్రక్రియ పూర్తి చేసే అవకాశమే ఉండదు. కోర్టులో అలాంటి అడ్డంకులు వస్తాయి. సింపుల్ సమస్య.. ఒక్క డైనమిక్ నిర్ణయం తీసుకుంటే చివరి క్షణంలో అయినా ఎగ్జామ్ క్యాన్సిల్ చేసి రోస్టర్ కరెక్ట్ చేసి నోటిఫికేషన్ ఇవ్వొచ్చు. ప్రభుత్వానికీ, నిరుద్యోగులకూ ఏ నష్టం ఉండదు. పైగా మరో ఐదారు లక్షల మంది కొత్తగా ఎగ్జామ్ రాయొచ్చు.. Please Watch it, It's Time to take a BIG Decition!
I’ve received numerous requests from Group 2 aspirants to postpone the examinations. I understand their concerns and, in consultation with our legal teams, we will explore all possible avenues to find a solution.
గ్రూప్-2 మెయిన్స్ కి అర్హత సాధించిన 92,250 మంది అభ్యర్థుల తరుపున కూటమి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. 2023 డిసెంబర్ 11న ఇచ్చిన నోటిఫికేషన్ రోస్టర్ విధానంలో తప్పులు ఉన్నాయని అభ్యర్థులు తీవ్ర ఆందోళనలో ఉన్నారు. తప్పులను సరిదిద్దకుంటే నష్టం జరుగుతుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. న్యాయపరమైన ఇబ్బందులతో నోటిఫికేషన్ రద్దయ్యే పరిస్థితులు ఉంటాయని చెబుతున్నారు. రోస్టర్ విధానంలో తప్పుల తడకతో ఝార్ఖండ్ లో నోటిఫికేషన్ రద్దయ్యి ఉద్యోగాలు పోయిన పరిస్థితులు ఇక్కడ కూడా ఎదురవుతాయని భయపడుతున్నారు.
తప్పులు సరిదిద్దాలని అభ్యర్థులు కోరుతుంటే, మరోవైపు అడ్వకేట్ జనరల్ సైతం కోర్టులో తప్పులు ఉన్నాయని ఒప్పుకుంటే, హడావిడిగా ఈ నెల 23న పరీక్ష నిర్వహించాల్సిన అవసరం ఏంటని కూటమి ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నాం. APPSC మొండిగా వ్యవహరించాల్సిన పరిస్థితి ఏంటి అని అడుగుతున్నాం. రాష్ట్ర వ్యాప్తంగా రోడ్లపై అభ్యర్థులు ఆందోళనలు చేస్తుంటే వారి విజ్ఞప్తి పట్టించుకోరా అని ప్రశ్నిస్తున్నాం. రోస్టర్ విధానంలో తప్పులు సరిదిద్దే అంశంపై, మెయిన్స్ పరీక్ష నిర్వహణపై కూటమి ప్రభుత్వం వెంటనే ప్రకటన చేయాలని, ఆందోళనలో ఉన్న మెయిన్స్ అభ్యర్థులను పిలిచి చర్చించాలని కాంగ్రెస్ పార్టీ పక్షాన ముఖ్యమంత్రి చంద్రబాబు @ncbn గారిని డిమాండ్ చేస్తున్నాం.
@PawanKalyan@BJP4Andhra