తాడేపల్లి
రేపు వైఎస్సార్సీపీ ముఖ్య నాయకులతో శ్రీ వైయస్ జగన్ సమావేశం
ప్రజా సమస్యలు, పార్టీ బలోపేతం, స్థానిక ఎన్నికల సన్నద్ధతపై దిశానిర్దేశం
రేపు (25.08.2026, మంగళవారం) ఉదయం 11 గంటలకు తాడేపల్లిలోని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర కార్యాలయంలో పార్టీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి శ్రీ వైయస్ జగన్ అధ్యక్షతన ముఖ్య నాయకుల సమావేశం జరగనుంది.
ఈ సమావేశంలో రీజనల్ కోఆర్డినేటర్లు, జిల్లా పార్టీ అధ్యక్షులు, 175 అసెంబ్లీ నియోజకవర్గాల సమన్వయకర్తలు, రాష్ట్ర ప్రధాన కార్యదర్శులు (కోఆర్డినేషన్, అనుబంధ విభాగాలు), స్టేట్ డిప్యూటీ జనరల్ సెక్రటరీలు పాల్గొననున్నారు.
రాష్ట్రంలో నెలకొన్న ప్రజా సమస్యలు, పార్టీ బలోపేతం, స్థానిక సంస్థల ఎన్నికలకు సన్నద్ధత, తాజా రాజకీయ పరిణామాలు, ఎస్ఐఆర్ ప్రక్రియ తదితర కీలక అంశాలపై సమావేశంలో విస్తృతంగా చర్చించనున్నారు.
ఈ అంశాలపై పార్టీ నాయకులకు శ్రీ వైయస్ జగన్ దిశానిర్దేశం చేయనున్నారు.
విజయ సాయి రెడ్డి మీరు అధికారం కోల్పోగానే .... కేసులకు భయపడి ఉచ్చ పోసుకుని పారిపోయిన మీరు ....వైఎస్సార్సీపీలో ధైర్యంగా నిలబడిన సాధారణ అభిమానుల కాలి గోటికి సరితూగగలరా..?
జానకమ్మ గారికి ఘన నివాళి.
తన తొలి సినిమా `షావుకారు` పేరునే తన ఇంటి పేరుగా మార్చుకున్న నటి జానకమ్మ గారు. ఏడు దశాబ్దాలకు పైగా పలు భాషల్లో తన విలక్షణ నటనతో ప్రేక్షకుల హృదయాల్లో చెరగని ముద్ర వేశారు.
ఆమె కన్నుమూత దక్షిణ భారత చిత్రసీమకు తీరని లోటు. జానకమ్మ గారి ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుడిని ప్రార్థిస్తూ, ఆమె కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాను.
సీన్ ఒక్కటే.. కానీ స్క్రిప్ట్ లు మాత్రం రెండు...!
ఎవరి చెవిలో పూలు పెట్టడానికి మీ పోలీసులతో ఇలా అబద్ధాలు చెప్పిస్తున్నారు @ncbn, హోంమంత్రి @Anitha_TDP ?
దర్శిలో గంజాయితో పోలీసులు అడ్డంగా దొరికిపోయారు. దీన్ని ఒప్పుకుంటే జనం మీ మొహాన ఉమ్మేస్తారని ఇలా బుకాయిస్తున్నారా బాబూ ?
#CBNFailedCM
హే రామ్…!
గంజాయి, మద్యం అక్రమ రవాణాను అరికట్టాల్సిన పోలీసుల వాహనంలోనే గంజాయి, మద్యం బాటిళ్లు కనిపిస్తే… రాష్ట్రంలో పరిస్థితులు ఎంత దారుణంగా దిగజారిపోయాయో చెప్పడానికి ఇంతకంటే సాక్ష్యం ఇంకేం కావాలి?
@ncbn గారూ… అసలు రాష్ట్రాన్ని ఎక్కడికి తీసుకెళ్తున్నారు? ప్రజలకు రక్షణ కల్పించాల్సిన పోలీసు వ్యవస్థలోనే, అక్రమాలను అడ్డుకోవాల్సిన యంత్రాంగంతోనే అక్రమాలు చేయిస్తుంటే, వాటిలోనే అవినీతి చోటుచేసుకుంటే ప్రజలు ఎవరిని నమ్మాలి? ఎవరికి ఫిర్యాదు చేయాలి?
ప్రకాశం జిల్లా, అద్దంకి మండలం, శంఖవరప్పాడు వద్ద జరిగిన దాన్ని ఏదో ఒక్క ఘటనగా కొట్టిపారేయలేం. రెండేళ్లుగా వ్యవస్థలను ప్రజలకోసం కాకుండా రాజకీయ కక్షసాధింపులకు, ప్రత్యర్థుల గొంతు నొక్కడానికి, మీ రెడ్‌బుక్ రాజ్యాంగాన్ని అమలు చేయడానికి, మీ ఎమ్మెల్యేలతో కలిసి కలెక్షన్లు తెచ్చిపెట్టుకోవడానికి, వాడుకున్న ఫలితమే ఈ పతనం. వ్యవస్థలను రాజకీయ ప్రయోజనాలకు, మీ కలెక్షన్లకు వాడుకుంటే చివరకు అవి ఎంతగా భ్రష్టుపడతాయో ఈ ఘటన కళ్లకు కడుతోంది.
ఈనేపథ్యంలో, ఇద్దరు ఎస్సైలు ప్రయాణిస్తున్న కారు, తాగిన మత్తులో ఉన్న డ్రైవర్ ఒక ఆటోను ఢీకొట్టడం, ఆటోలో ఉన్నవాళ్లు తీవ్రంగా గాయపడ్డం, యాక్సిడెంట్ అయిన తర్వాత ఆ కారును చుట్టుముట్టడం, ఆ కారులో ఉన్న ఇద్దరు ఎస్సైలు మత్తులో ఉన్న పరిస్థితిలో ఉండడం, ఆ కార్ డిక్కీలో గంజాయి, మద్యం, పోలీస్ యూనిఫాం దొరకడం, చివరకు అక్కడున్న ప్రజలే జర్నలిస్టులుగా మారి, జరిగిన ఘటనను వీడియో తీసి వాస్తవాలను ప్రజల ముందుంచే ప్రయత్నం చేస్తే, “వీడియోలు తీయొద్దు, కేసులు పెడతాం” అని అక్కడకు చేరుకున్న మరో సీఐ, బెదిరిస్తున్నారంటే మీ పాలనలో పరిస్థితి ఏ స్థాయికి చేరిందో అర్థమవుతోంది. నిజాన్ని బయటపెట్టడమే నేరమా? ప్రశ్నించడమే తప్పా?
ఈ ఇద్దరు పోలీసు అధికారులు ప్రైవేటు పార్టీలు నిర్వహించారని, మద్యం, గంజాయి అక్కడ వాడారని, ఆ పార్టీలో పలువురు టీడీపీ నేతలు పాల్గొన్నారన్న సమాచారం మరింత దిగ్భ్రాంతి కలిగిస్తోంది. ఘటనా స్థలం నుంచి కారులో ఉన్న ఆ ఇద్దరు పోలీసు అధికారులను స్థానిక టీడీపీ నాయకులు తప్పించారన్న ఆరోపణలు కూడా అత్యంత తీవ్రమైనవి. నిష్పక్షపాతంగా పనిచేయాల్సిన వ్యవస్థతో అధికార పార్టీ నాయకుల కుమ్మక్కు ఎంత లోతుకు వెళ్లిందో ఈ ఘటన బయటపెడుతోంది. అలాంటప్పుడు రాష్ట్రంలో పోలీస్స్టేషన్లలో కేసుల నమోదు నుంచి విచారణ వరకు నిష్పక్షపాతంగా జరుగుతుందని ఎవరైనా నమ్ముతారా?
చంద్రబాబుగారూ… రోజూ గంటలకొద్దీ పైకి నీతి కబుర్లు చెబుతూ, లోపల రాజకీయ కుట్రలు, కక్షసాధింపులతో వ్యవస్థలను విషపూరితం చేస్తే ఫలితాలు ఇలాగే ఉంటాయి. రాజకీయ ప్రత్యర్థులపై కేసులు పెట్టడం, వారిని వేధించడం మీద చూపిస్తున్న శ్రద్ధలో కనీసం కొంతైనా శాంతిభద్రతలపై, పోలీసు వ్యవస్థ ప్రక్షాళనపై పెట్టండి.
ఈ ఘటనను కూడా మీకున్న మీడియా బలంతో కప్పిపుచ్చకండి. డైవర్ట్ చేయకండి. నిష్పక్షపాత విచారణ జరిపించి, తప్పుచేసినవారు ఎంతటివారైనా చర్యలు తీసుకోండి. ఘటనను నిలదీసిన ప్రజలపై మళ్లీ రెడ్‌బుక్ ప్రయోగించకుండా, వీడియోలు తీసిన వారిని వేధించకుండా నిజాయితీగా వ్యవహరించండి.
English Version- https://t.co/71sNSrlUV6
.@ncbn గారూ… ప్రభుత్వ ఉద్యోగులపై, అందులోనూ టీచర్లపై మరీ ఇంత కక్షగడతారా?
మొదటి రోజు వైయస్సార్ కడప, రెండో రోజు అనంతపురం, సత్యసాయి జిల్లాలకు చెందిన ఐదుగురు ఉపాధ్యాయ సంఘాల టీచర్లను ఎందుకు సస్పెండ్ చేశారు? వారు ఏం నేరం చేశారు? వారు ఉద్యోగంలో చేరే నాటికి లేని టెట్ ఇప్పుడు ఇన్ని సంవత్సరాల తర్వాత రాయాలి, అన్న టెట్ నిబంధన వల్ల లక్ష మందికిపైగా సీనియర్ టీచర్లు ఇబ్బందులు పడుతున్నారు. ఆ నిబంధన నుంచి తమను మినహాయించాలని కోరుతూ, వారికి మద్దతు ఇస్తున్న ఎంపీలతో కలిసి కేంద్ర ప్రభుత్వానికి వినతిపత్రం ఇవ్వడమే నేరమా?
మీ రెడ్‌బుక్ అరాచక జంగిల్‌రాజ్ చివరకు ప్రభుత్వ టీచర్లనూ వదిలిపెట్టడం లేదు.
చంద్రబాబుగారూ… అసలు ఈ టెట్ నిబంధనను తొలగించాలని కేంద్రాన్ని కోరాల్సింది మీరు కాదా? ఎన్డీయేలో భాగస్వామిగా ఉన్న మీరు అసెంబ్లీలో తీర్మానం చేసి కేంద్రంపై ఒత్తిడి ఎందుకు తీసుకురాలేదు?
మీరు చేయాల్సిన పని చేయలేదు. సీనియర్ టీచర్ల సమస్యను గాలికి వదిలేశారు. తమ సమస్యను మా పార్టీ ఎంపీల సహకారంతో తామే కేంద్రం దృష్టికి తీసుకెళ్లేందుకు ప్రయత్నిస్తే మాత్రం వారిపై రాజకీయ ముద్ర వేస్తారా? సస్పెన్షన్లు విధిస్తారా?
మీరు చేయలేని పని వారు చేయడానికి ప్రయత్నించడమే తప్పా?
వినతిపత్రం ఇవ్వడమే నేరమా? దానికి సస్పెన్షన్ విధిస్తారా?
ఒక సమస్యను పరిష్కరించాల్సిన ప్రభుత్వం, అదే సమస్యను రాజకీయ కోణంలో చూసి టీచర్లకు రాజకీయాలను అంటగట్టడం దారుణం. మరీ ఇంతగా దిగజారి వ్యవహరిస్తారా?
ఉద్యోగుల విషయంలో మీ మోసం కూడా ఇదే స్థాయిలో ఉంది.
మేనిఫెస్టోలో ఉద్యోగులకు ఇచ్చిన హామీలన్నింటినీ పూర్తిగా గాలికి వదిలేశారు. ప్రభుత్వం వచ్చిన వెంటనే IR ప్రకటిస్తామన్నారు. మెరుగైన PRC ఇస్తామన్నారు. ప్రభుత్వం వచ్చి మూడో ఏడాది నడుస్తోంది ! IR లేదు! PRC లేదు! 5 DAలు పెండింగ్ !
CPS/OPSను పునఃసమీక్షిస్తామంటూ ఉద్యోగులకు ఆశ చూపారు. చివరకు CPSకు ప్రత్యామ్నాయంగా మేం ప్రకటించిన GPSను కూడా అమలు చేయకుండా ఉద్యోగులను త్రిశంకుస్వర్గంలో పెట్టారు.
ఉద్యోగులకు ఇవ్వాల్సిన PRC బకాయిలు, పెండింగ్ డీఏలు, GPF, APGLI, మెడికల్ రీయింబర్స్మెంట్, రిటైర్మెంట్ బెనిఫిట్స్, సరెండర్ లీవ్స్ లేదా ఎన్‌క్యాష్‌మెంట్ లీవులు… ఇలా దాదాపు రూ. 35వేల నుంచి రూ.40 వేల కోట్ల బకాయిలు పెట్టారు.
తమకు న్యాయంగా రావాల్సిన డబ్బుల కోసం ఉద్యోగులు ఎదురుచూస్తుంటే ఒక్క పైసా ఇవ్వరు. కానీ వారికి సస్పెన్షన్లను బహుమానంగా ఇస్తున్నారు.ఇదేనా ఉద్యోగుల పట్ల మీ గౌరవం? ఇదేనా టీచర్ల పట్ల మీ బాధ్యత?
అధికారం ఉందనే అహంకారంతో, నియంతృత్వ విధానాలతో మీరు చెలరేగిపోతున్న తీరును ప్రజలు గమనిస్తున్నారు చంద్రబాబుగారూ. చివరకు మీ నీడను కూడా మీరు భరించలేని స్థాయికి వెళ్లిపోయారు.
వెంటనే ఆ ఐదుగురు టీచర్లపై విధించిన సస్పెన్షన్లను ఎత్తివేయండి. వారికి క్షమాపణ చెప్పి చేసిన తప్పును సరిదిద్దుకోండి. లేకపోతే ఈ అంశాన్ని అత్యంత సీరియస్‌గా తీసుకుంటాం. ఈ అన్యాయమైన సస్పెన్షన్లను సవాల్ చేసే కార్యక్రమంలో ఆ టీచర్లకు న్యాయపరంగా పూర్తిగా అండగా నిలుస్తాం. వారికి భరోసా ఇస్తాం. అన్యాయాన్ని ప్రశ్నించే ప్రతి గొంతుకూ వైయస్సార్సీపీ అండగా నిలుస్తుంది.
English Version- https://t.co/sOEVCHAgLb
Warm birthday wishes to Union Finance Minister Smt. Nirmala Sitharaman Ji. Wishing you good health, happiness and a fulfilling life.
Nirmala Sitharaman
@nsitharaman
@ysjagan *ముద్రగడ మృతిపై వైఎస్ జగన్మోహన్రెడ్డి గారు దిగ్ర్భాంతి*
*ముద్రగడ మరణం నన్ను తీవ్రంగా కలచివేసింది*
*ప్రజలకోసం ముద్రగడ చేసిన సేవలు చిరస్మరణీయం*
*ముద్రగడ కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతి*
వైఎస్.జగన్ మోహన్ రెడ్డి గారు
మా పార్టీ సీనియర్ నాయకులు, నాకు పితృసమానులైన ముద్రగడ పద్మనాభంగారి మరణవార్త నన్ను తీవ్రంగా కలచివేసింది.
ఇటీవల అనారోగ్యానికి గురైన ఆయన క్రమంగా కోలుకుంటున్నారనే వార్త మాకు ఎంతో ధైర్యాన్నిచ్చింది. సంపూర్ణ ఆరోగ్యంతో తిరిగి మన మధ్యకు వస్తారని ఆశిస్తున్న సమయంలోనే ఆయన ఇలా శాశ్వతంగా దూరం కావడం అత్యంత బాధాకరం.
ఐదు దశాబ్దాల సుదీర్ఘ రాజకీయ ప్రస్థానంలో ఎంపీగా, మంత్రిగా, ఎమ్మెల్యేగా ప్రజలకు చిరస్మరణీయమైన సేవలందించిన ముద్రగడగారు విలువలకు కట్టుబడి రాజకీయాలు చేశారు. పదవులకన్నా ప్రజలనే గొప్పగా భావించారు. తన జీవితాంతం పేదల బతుకుల్లో మార్పు కోసం తపించారు.
ముఖ్యంగా కాపు సామాజికవర్గానికి పెద్దదిక్కుగా నిలిచి, వారి సంక్షేమం కోసం అలుపెరగని పోరాటం చేశారు. తాను నమ్మిన మాటకు కట్టుబడి నిలబడే తత్వం, మంచికోసం ఎంతదూరమైనా వెళ్లే ధైర్యం ఆయన సొంతం. ఆత్మగౌరవానికి, నిజాయితీకి, వ్యక్తిత్వానికి ఆయన నిలువెత్తు రూపం.
ముద్రగడగారి మరణం ఆయన కుటుంబానికే కాదు.. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి, ఆయనను అభిమానించే లక్షలాది మందికి తీరని లోటు.
ఈ విషాద సమయంలో ఆయన కుటుంబసభ్యులకు ధైర్యాన్ని ప్రసాదించాలని, ముద్రగడగారి ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుణ్ని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తున్నాను. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ తరఫున ముద్రగడగారికి ఘనంగా నివాళులు అర్పిస్తున్నాను.
నా పార్టీ కాకపోయినా...
ఆరోగ్యం విషయంలో రాజకీయాలు లేవు.
పవన్ కళ్యాణ్ గారు త్వరగా కోలుకోవాలని భగవంతుని ప్రార్థిస్తున్నాను 🙏
Get Well Soon Pawan Kalyan Garu
పార్టీలు వేరు కావచ్చు
కానీ మనిషిగా బాధ అందరిదీ ఒకటే.
పవన్ కళ్యాణ్ గారు త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నాను
@PawanKalyan
రాహుల్ గాంధీని ఎవరైనా తిట్టినా ఫీల్ కాదు… కూటమి ప్రభుత్వాన్ని ఎవరైనా ఏమైనా అంటే మాత్రం… మైక్ ముందు మొదటి వరుసలో నిలబడేది మా అక్కే! 😄🔥
అక్క… నువ్వు కాంగ్రెస్‌లో ఉన్నావో… కూటమి కూటమి అధికార ప్రతినిధివో… తెలుగు ప్రజలు ఇప్పటికీ కన్ఫ్యూజన్లో ఉన్నారు అక్క!” 😜