మాదిగ నవ నిర్మాణ సమితి (MNS) రాష్ట్ర అధ్యక్షులు,ఉస్మానియా విద్యార్థి ఉద్యమ నాయకులు,పరిశోధక విద్యార్థి పాల్వాయి నగేష్ బహుజన్ సమాజ్ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు డా.ఆర్.ఎస్ ప్రవీణ్ కుమార్ సమక్షంలో బీఎస్పీలో చేరారు.
2018 అసెంబ్లీ ఎన్నికల్లో బహుజన లెఫ్ట్ ఫ్రంట్ (BLF) కూటమి తరపున సూర్యాపేట జిల్లా తుంగతుర్తి నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేశారు.
@RSPraveenSwaero
ఏ వర్గాలకు ఎన్ని టికెట్లు ఇవ్వాలన్నది ఆయా పార్టీల భావజాలాల మీద ఆధారపడి ఉంటది. నిన్న BRS పార్టీ విడుదల చేసిన 115 అభ్యర్థుల జాబితాలో బీసీలకు తీవ్ర అన్యాయం జరిగిందన్న కామెంట్లను చూశాను.
ఇది వాస్తవమే కానీ…
1. దోపిడి దొరలు వాళ్ల స్వప్రయోజనాల కోసం పార్టీ పెట్టినపుడు వాళ్ల జండాలు మనమే కదా మోసినం.
2. వాళ్ల గడీల ముందు దర్శనం కోసం నానాపాట్లు మనమే కదా పడ్తున్నది.
3. వాళ్ల మెప్పు కోసం యువ సేనలను మనమే కదా ఏర్పాటు చేసుకున్నది!
4. పులులు గడ్డి తిని బతుకుతాయని ఇంత అమాయకంగా ఎట్ల నమ్ముతున్నాం?
అందుకే….
మనం కేసీఆర్ నో, ఇంకెవరినో విమర్శించి లాభం లేదు. అర్జంటుగా వాళ్ల దోపిడి గడీల నుండి బయటపడండి. వాళ్ల బుజ్జగింపులకు, తాయిలాలకు మోసపోకండి. గ్రామ గ్రామాన కులాల వారిగా ఈ దోపిడి దొరలను ఓడిస్తామని తీర్మానం చేయండి.
రాష్ట్రాన్ని కుటుంబ పాలన నుండి విముక్తి చేయాలని జరుగుతున్న బహుజన ఉద్యమంలో లక్షలాదిగా మమేకం కండి. బీసీలకు జనాభా నిష్పత్తి ప్రకారం సీట్లిచ్చే ఏకైక పార్టీ #BSP మాత్రమే.
సీట్లొచ్చిన బహుజన బిడ్డల వెనుక అందరం ఒక్కటిగా నిలబడి ఇంటికొక రూపాయైనా విరాళమిచ్చి వీళ్లను మూకుమ్మడిగా గెలిపించుకుందాం రండి. దొరల దోపిడి సామ్రాజ్యాన్ని కూలగొడదాం. కదం తొక్కండి. పండుగ సాయన్న, సర్వాయి పాపన్న, చిట్యాల ఐలమ్మ, దొడ్డి కొమురన్న, బెల్లి లలితక్క, మారోజు వీరన్న, మరెంతో మంది వీర యోధులు దొరలతో తలపడలేదా??
వందకు 99 మందిమి మనముండి ఒక్కనికి భయపడుడేంది??? బిచ్చమెత్తుడేంది???తన్నులు తినుడేంది????
తెలంగాణ బీయస్పీ కార్యాలయం హైదరాబాదు, లక్డీకాపూల్ లో ఉంటది. దాని తలుపులు ఎప్పుడు తెరచే ఉంటయి. 🙏
📞 9777909777
#LiberateTelangana
#VR99
#SelfRespect
#Kanshiram
అధికారం,పదవులు ఈయనకు కొత్త కాదు. ఈయన అతిధిగా వస్తేనే గొప్ప గొప్ప వాళ్ళు గొప్ప ఆతిథ్యం ఇవ్వడం స్వయంగా చూసి చెప్తున్నా,ఈయన నిరాడంబరత, నిజాయితీ, కృషి, సామాన్యునికి అధికారం అందించడం కోసమే.ఈయన మీద అవాకులు చెవాకులు పేలే అవకాశవాద చెంచాగాళ్లకు ఈయన గొప్పతనం ఏం తెల్సు? అసలైన నాయకుడు #RSP
నిన్న కోకాపేట
రేపు బుద్వేల్
ఎల్లుండి RRR…
చివరికి ఇక మిగిలేది నీ భూమి,నా భూమి మాత్రమే.
#KCR పాలనలో పేద ప్రజలకు చివరకు గోచి గుడ్డ కూడా మిగిలే పరిస్థితి లేదు.
నిజానికి బుద్వేల్ లో 255 ఎకరాల అసైండ్ భూములు ప్రభుత్వం కుట్రపూరితంగా, చట్టవిరుద్ధంగా HMDA,రంగారెడ్డి జిల్లా కలెక్టర్,టూరిజం డిపార్ట్మెంట్ ప్రయివేట్ వ్యక్తులతో కలిసి పేదలనుండి బలవంతంగా గుంజుకున్నవే. ఈ అక్రమాలను నేను గత జూలై 31న ఆధారాలతో సహా మీడియా ముందు బయటపెట్టాను.
సుప్రీంకోర్టు మార్గదర్శకాలకు అనుగుణంగా అసైన్డ్ భూములకు హక్కు పత్రాలు ఇవ్వాల్సింది పోయి,దేశంలో ఎక్కడా లేని విధంగా #KCR ప్రభుత్వం పట్టపగలే అసైండ్ భూములను బహిరంగంగా వేలం వేసి,
అపర కుభేరులకు కట్టబెడుతున్నది. ప్రభుత్వమే పేద రైతులను మభ్యపెట్టి, భయపెట్టి వాళ్లకు 500 గజాల జాగా బిచ్చ వేయడం అనైతికం,చట్టవిరుద్ధం.
ఈ భూమికి ఎంత రేటున్నా సరే అది 100 రూపాయలు ఉన్నా...100 కోట్లున్న అది 99% ఉన్న బహుజనుల ఆస్తి.(SC,ST,BC, Minority,అగ్రవర్ణాల పేదలు) ఈ వేలంలో వచ్చే ప్రతి పైసా కూడా అసైన్డ్ భూమి హక్కుదారులైన పేద రైతులకే చెందుతుంది.
ఇదే న్యాయం.
పేద రైతుల వద్ద అసైండ్ భూమి ఉంటే ధరణి పోర్టల్ లో నిషేధిత జాబితాలో (POT) పెడుతున్న ప్రభుత్వం,అవే భూములను ప్రభుత్వం బలవంతంగా గుంజుకొని,వందల కోట్లకు వేలం వేసి ప్రయివేట్ కంపెనీలకు కట్టబెట్టడం ఎంత వరకు న్యాయం?
ఈ భూములన్నీ న్యాయబద్ధంగా పేదల భూములే కదా!
అసైండ్ భూములను వేలంలో వందల కోట్లు గుమ్మరించి కొంటున్న KCR, KTR బినామీలకు నేను ఇచ్చే సలహా ఒక్కటే... తొందరపడకండి, 'చేతులు కాలాక ఆకులు పట్టుకుంటే' లాభం లేదు. త్వరలో రాబోయే బహుజన రాజ్యంలో చట్టవిరుద్దంగా జరిగిన అసైండ్ భూముల వేలాన్ని (కోకాపేటలో అక్రమంగా @BRSparty కు కేటాయించిన 13 ఎకరాలతో సహా) రద్దు చేసి,ఆ భూములను తిరిగి పేద రైతులకు పంచుతాం.
మేము చేసే ఈ భూ పోరాటంపై మీరు ఎన్ని వందల మంది పోలీసు బలగాలను దించి మమ్ములను బెదిరించినా,కిరాయి హంతక ముఠాలకు కోట్లాది రూపాయల సుపారీ చెల్లించి,మమ్ములను అంతం చేయాలని చూసినా మా లాడాయి ఆగదు.
తెలంగాణలో #KCR భూదందాలకు వచ్చే మూడు నెలల్లో తెరదించబోతున్నాం. అప్పుడు మీ అక్రమ ఫామ్ హౌస్ లు,లగ్జరీ విల్లాలను,రాజప్రసాదాలను కూడా స్వాధీనం చేసుకొని పేద ప్రజలకు రాజ్యాంగబద్ధంగా పంచుతాం. ఇదే తథ్యం.
గుర్తుంచుకోండి! మేం 99% ఉన్నాం.
మీరున్నది 1% మాత్రమే.
న్యాయబద్దంగా మేము గెలవాలి,గెలుస్తాం.
సత్యం,న్యాయం,ధర్మం మా వైపే ఉన్నాయి.
అసైండ్ భూముల వేలం ద్వారా వచ్చిన ప్రతిపైసాను పేదరైతులకు పంచేదాక
మాట తప్పం,మడమ తిప్పం.✊
#VR99%
#Time4Blue
#LiberateTelangana
తెలంగాణలో ఈ రోజు వరకు మెజారిటీ ప్రభుత్వ ఉద్యోగస్తులకు అకౌంట్లలో జీతాలు పడలే! పాలు, కరెంట్ బిల్, కిరాణం, బండి పెట్రోల్, పిల్లల స్కూల్ ఫీజులు అన్నింటికి జీతమే ఆధారం. పొద్దున్నే పాలు పోసే అతని దగ్గర కూడా ఉద్యోగస్తులకు విలువ లేదు. ఇంకా జీతాలు పడలేదా అని విసుక్కుంటున్నారు. మన ముఖ్యమంత్రి గారేమో తెలంగాణ ను బంగారం లాగా చేసిన అని చెప్పుకుంట మహారాష్ట్రలో తిరుగుతున్నరు😀
ఎక్కడున్నరు పాలాభిషేకాలు చేసిన యూనియన్ సోదరులు?
ఎన్నికలు సమీపిస్తున్నయని షరా మామూలుగా అన్ని దోపిడి పార్టీలు మళ్లీ బీసి సమావేశాల్ని పెడుతున్నయి. ఆత్మీయ సమ్మేళనాలు-దావత్లను జరుపుతున్నవి. అక్కడికి వెళుతున్న BC నాయకులు జనాభా దామాషా ప్రకారం MLA, MP సీట్లు తెచ్చుకోగలుగుతారా? ఒక సారి చరిత్ర పుటలను తిరగేస్తే నిజం తెలుస్తుంది. మన సీట్లు మనం తెచ్చు కోలేనపుడు ఈ కీలక సమావేశాలు ఎవరి కోసం? కేవలం కీలు బొమ్మలను తయారుచేసుకోవడం కోసమేనా ? ఒక్కసారి ఆలోచించండి🙏
ఈ సారి కూడా ఈ దోపిడి దొరలు నియోజకవర్గాల వారిగా BC వర్గాలకు చెందిన ఆశావాహులను పిలిపించి సీట్లు ఇవ్వకుండా ఏవేవో ఆశలు కలిపించి కూల్ చేసి వాపసు పంపిస్తారు. నీ దగ్గర డబ్బులు లేవు, క్యాడర్ లేదని చిన్నబుచ్చుతరు. కేసులున్నయని భయపెట్టిస్తరు…మీ కులపోళ్లే నీకు ఓటేయరని అవమానిస్తరు…మళ్లీ వాళ్ల జెండాలు మోయబెడతారు. వాళ్ల రహస్య ఎజెండాలు మాత్రం మనకు తెలియకుండా జాగ్రత్త పడతారు.
తిరుగుబాటు చేస్తే తమ పత్రికల్లో ఛానల్స్‌లో అసత్య కథనాల సీరియల్లను ప్రసారం చేసి బదునాం చేస్తరు. ఇంకా ఎన్నో కుట్రలు ఉన్నయి. ఉదాహరణకు
సూర్య దినపత్రిక ఎందుకు మరుగున పడ్డదో తెలుసా? అది కేవలం బీసీలు నడిపిస్తున్నారు వల్లనే…మరి మిగతా దినపత్రికలు దేదీప్యమానంగా ఎందుకు వెలుగుతున్నయి? గమనించండి.
అందుకే… మనకు మన బహుజనరాజ్యం కావాలి.
మనం పథకాలకు లబ్దిదారులం కాదు,
అధికారానికి హక్కుదారులం కావాలి.
రండి.. కలుద్దాం.. నిలుద్దాం.. గెలుద్దాం..✊
జైభీం-జై ఫూలే.
ప్రత్యేక తెలంగాణలో అమరుల ఆకాంక్షలు నెరవేరాయా?
1. తెలంగాణ మలిదశ ఉద్యమానికి 1200 మంది అమరులయ్యారని పదే,పదే చెబుతున్న ముఖ్యమంత్రి #KCR అమరుల కుటుంబాలను ఎందుకు గుర్తించలేదు? గుర్తించకుండా అడ్డుకున్నది ఎవరు?
2. హుస్సేన్ సాగర్ సమీపంలో తెలంగాణ అమరవీరుల స్మారక స్థూపాన్ని నిర్మించింది ఎవరు?
3. అమరవీరుల స్మారక స్థూపాన్ని నిర్మించడానికి తెలంగాణకు చెందిన ఏ ఒక్క తెలంగాణ కన్స్ట్రక్షన్ కంపెనీ ముందుకు రాలేదా? లేదా 30% కమీషన్ రాదని తెలంగాణ కంపెనీలకు టెండర్ కేటాయించలేదా?
4. ఆంధ్ర కాంట్రాక్టర్లు (KPC Project Limited ) కట్టిన అమరవీరుల స్మారక స్తూపంతో వందలాది మంది అమరుల ఆత్మలు ఘోషిస్తున్నాయి.
5. అమరవీరుల స్మారక స్థూపం నిర్మాణానికి ఎంత కాలం పట్టింది? మీరు నిత్యం విందుల్లో మునిగితేలే ప్రగతి భవన్, మీరు ఎన్నడూ ఆఫీసుకు రాని సెక్రెటరీయేట్ నిర్మాణానికి పట్టిన కాలం ఎంత?
6. మలిదశ తెలంగాణ ఉద్యమంలో తొలి అమరుడు శ్రీకాంతాచారి ప్రాణత్యాగం చేసింది ఇందుకోసమేనా?
7. 60 ఏళ్లు అంద్రోళ్లతో కొట్లాడి సాధించుకున్న తెలంగాణ ఇదేనా?ఉస్మానియా,కాకతీయ విశ్వవిద్యాలయాల విద్యార్థులు కొట్లాడి,ప్రాణత్యాగాలు చేసింది ఇందుకోసమేనా?
వందలాది అమరవీరుల త్యాగాల మీద గద్దెనెక్కిన కేసీఆర్, అధికారంలోకి వచ్చిన తర్వాత అమరుల త్యాగాలను మరిచాడు. తెలంగాణ సంపదను కమిషన్లకు కక్కుర్తి పడి, ఆంద్రా కాంట్రాక్టర్లకు కట్టబెట్టి దోపిడీ పాలన కొనసాగిస్తున్నారు.
తెలంగాణ విద్యావంతులారా,
ఉద్యమకారులారా,మేధావులారా,,
వచ్చే ఎన్నికల్లో @BRS పార్టీని ఓడించి, #KCR ను గద్దెదించాలి.రాష్ట్రంలో బహుజన రాజ్యం స్థాపిస్తేనే అమరుల ఆకాంక్షలు నెరవేరుతాయి.తెలంగాణలో #KCR దోపిడి పాలనను కూల్చేందుకు బీఎస్పీ నిరంతరం పోరాడుతుంది.👊
#KCRFailedTelangana
ఎన్నో ఏళ్ల పోరాటం తరువాత కనీసం ఇప్పుడైనా తెలంగాణ పోలీసు బిడ్డలు, 2009 బ్యాచ్ ఎస్సైలకు ఎట్టకేలకు ప్రమోషన్ ఇచ్చినందులకు @TelanganaDGP గారికి పోలీసు కుటుంబాల తరపున ధన్యవాదాలు.
అట్లనే పెండింగు లో ఉన్న మూడు సరెండర్ లీవులు, హోంగార్డుల వేతనాల పెంపు సంగతి కూడా జెర చూడండి సారూ..🙏
ఇద్దరూ యూనివర్సిటీ ప్రొఫెసర్లే,
ఇద్దరిపై ఒకే ఆరోపణలు- ఒకే కేసు నమోదైంది.
చట్టం (UAPA) కూడా ఒకటే.
ఇద్దరూ తాము నమ్మిన సిద్దాంతం కోసం పని చేస్తున్న వారే.
కానీ వీరిద్దరి కులాలు మాత్రం వేరు.
ఒకరిది అణచివేయబడ్డ ఎస్సీ- మాదిగ కులం.
మరొకరిది ఆధిపత్య బ్రాహ్మణ కులం.
ఒకరి ఇంటిని పోలీసులు చుట్టుముట్టి బలవంతంగా ఎత్తుకెళ్లారు.
మరొకరి ఇంటిని మాత్రం పోలీసు నీడ కూడా తాకలేదు, తాకనీయలేదు.
ఒకరేమో UAPA కేసులో అరెస్టై, 4 నెలలు జైలు జీవితం గడిపారు.
మరొకరిపై అదే కేసు నమోదై,రాజకీయ, మేధావుల ఒత్తిళ్లతో కేసు నుండి తప్పించబడ్డారు.
ఒకరి మీద కేసు పెడితే కమ్యూనిస్టు నాయకులతో సహా,
ఏ రాజకీయ పార్టీ నాయకుడు నోరు మెదపలేదు, మంద క్రిష్ణ మాదిగ తప్ప. పతాక శీర్షికల్లో కథనాలు, బ్రేకింగ్ న్యూస్ లు రాలేదు.
మరొకరి మీద కేసు పెడితే మాత్రం స్వయంగా రాష్ట్ర ముఖ్యమంత్రే స్పందించారు.
కేసీఆర్ పాలనలో వీరిద్దరికి వేర్వేరు న్యాయం జరిగింది. కులానికో న్యాయమని మరోసారి రుజువైంది.
బహుశా..మనువాదం,కులతత్వం అంటే ఇదేనేమో!
నేడు ప్రొ.హరగోపాల్ పై కేసు పెడితేనే ముఖ్యమంత్రి కేసీఆర్ స్పందించేలా ఒత్తిడి తెచ్చిన కుహనా మేధావులు,ఆధిపత్య రాజకీయ పార్టీల అధినేతలు నాడు ప్రొ.కాశీం అరెస్టుపై ఇంతే స్థాయిలో ప్రభుత్వంపై ఎందుకు ఒత్తిడి చేయలేదు?అప్పుడు సుందరయ్య విజ్ఞాన కేంద్రం ఖాళీ గా లేదా? విరసం కళ్యాణ రావు లాగా, ఖాసీం కూడా అంటరాని వసంతమయ్యాడా?
ఉస్మానియా విశ్వవిద్యాలయం విసి,రిజిస్ట్రార్ అనుమతి లేకుండానే పోలీసులు క్యాంపస్ లోకి ప్రవేశించి ప్రొ.కాశీం ఇంటి మీద దాడి చేసి,తలుపులు బద్దలు కొట్టి,కుటుంబ సభ్యులను భయభ్రాంతులకు గురి చేస్తే నేటి స్పందించే హృదయాలు నాడు ఎందుకు సడన్ గా మూగబోయినయి?
రాజ్యహింసపై స్పందించడంలో కూడా కులం ఉంటుందా? మేధావులు,ప్రజా సంఘాలకు నేతృత్వం వహించే వ్యక్తులకు కుల వివక్ష ఉందనడానికి ఇది నిదర్శనం కాదా?
నాడు కేసీఆర్ స్పందిస్తే ప్రో.కాశీం జైలుకు వెళ్లేవాడు కాదు, నేడు ఈ అనుమానాలకు తావుండేది కాదు కదా!
ఈ ప్రశ్నలు కేవలం ప్రో.కాశీం కోసం అడిగేవి మాత్రం కావు. అన్యాయంగా UAPA గ్యాస్ చాంబర్లలో జీవచ్ఛవాలవుతున్న సిర్పూరులోని ఆదివాసి నాయకుడు సోయం చిన్నయ్య (గోండు తెగ) లాంటి ఎందరో పీడిత ప్రజల కోసం అడుగుతున్నవి.
ఇలాంటి వివక్ష లేని సమాజం కోసమే దేశంలో బహుజన్ సమాజ్ పార్టీ ఆవిర్బవించింది.
బహుజన రాజ్యంలో కులానికో న్యాయం, మతానికో న్యాయం ఉండదు.
ప్రజాస్వామిక గొంతుకలపై, పీడిత ప్రజలపై అక్రమకేసులు పెట్టి,అణిచివేసే రాజ్య హింస అంతకంటే ఉండదు. అవును బరాబర్ ఉండదు. ఇది కేవలం నా మాట కాదు. కోట్లాది మంది తెలంగాణ ప్రజల గుండె చప్పుడు.
జై భీం.✊
By the way, I am not a caste chauvinist, but would love to discuss on both hard and soft, seen and unseen discrimination in every sphere based on incontrovertible facts.
.#BSP మొదటినుండీ ఇదే చెబుతున్నది. 2022 Group-1 టాపర్ ఎవరో CM KCR గారి నోటి నుండే వినాలని ఎదురు చూస్తున్నది. కానీ ఆయన మాత్రం దాన్ని గురించి మాట్లాడకుండా సంబురాలు జరుపుకోండి అంటున్నడు. #KCRFailedTelangana
గ్రూప్-1 తో సహా అన్ని ప్రశ్నాపత్రాలను మాస్టర్కీలతో సహా లీక్ చేసి నల్ల బజారులో అమ్ముకొని, మళ్లీ అవే పరీక్షలను పారదర్శకంగా నిర్వహిస్తామంటున్న ఇప్పటి TSPSC ఛైర్మన్ మరియు సభ్యులను నిజంగా నమ్మవచ్చా?
Can we really TRUST the TSPSC Chairman and members who are prime suspects in Question Paper Leakage Scandal?
ఇట్ల స్వార్థపూరిత రాజకీయాలకు అమాయక విద్యార్థులు బలైతరు. ఇంకా బలి ఐతూనే ఉన్నరు…ఈ విద్యార్థి జీవితం నాశనం కాకుండా చూడాల్సిన బాధ్యత ప్రభుత్వానిదే.
#TelanganaIsLeaking#BJPBRSPlayingWithLives
#NDTVని అదాని కొనుక్కొని గొంతునొక్కినట్లే తెలంగాణలో#ToliVelugu చానల్ ను మన పాలకులు దోపిడీ సొమ్ముతో కొనుక్కొని మడమ తిప్పని అమ్ముడుపోని యువ జర్నలిస్టు రఘు గొంతునులుముతున్నరు.ఇప్పుడు తెలంగాణ సమాజమంతా రఘు లాంటి నిఖార్సైన జర్నలిస్టుల వెనక నిలబడాల్సి ఉంది. #WeStandWithRaghuJournalist
బహుజన రాజ్యాధికారమే అంతిమ లక్ష్యంగా ఒక భుజాన సంచి,పాత సైకిల్, కాళ్లకు చెప్పులు లేకుండా విద్యార్థులను,ఉద్యోగులను పోగేసి అంబేద్కర్ ఆలోచనను తెలియజేసిన మేధావి. బోధించు,సమీకరించు,పోరాడు అనే నినాదంతో బహుజన రాజ్యాన్ని స్థాపించిన మాన్యశ్రీ కాన్షీరాం గారి జయంతి సందర్భంగా శుభాకాంక్షలు #BSP