Retweet And Spred This One!✅️
TTD నెయ్యిలో జంతు కొవ్వు లేదని స్పష్టం చేసిన ED.
CBI ఆధ్వర్యంలోని SIT మరియు ED దర్యాప్తులోనూ.
TTD శ్రీవారి ప్రసాదంలో ఉపయోగించిన నెయ్యిలో జంతు కొవ్వు ఉపయోగించినట్లు ఆధారాలు లేవని స్పష్టం.
ఈడీ దర్యాప్తులో నెయ్యిలో రసాయనాలు, వృక్ష ఆధారిత పదార్థాలతో కల్తీ చేసినట్లు నిర్ధారణ.
🚨 #TDPScams
ప్రొద్దుటూరు కరెంట్ ఆఫీసులో పనిచేసే సుబ్బారాయుడు అనే వ్యక్తి ఇటీవల ప్రమాదవశాత్తు మరణిస్తే.. అతని ఇన్సూరెన్స్ డబ్బుల్ని టౌన్ బ్యాంక్ చైర్మన్‌తో కలిసి టీడీపీ నేత ఈవీ సుధాకర్ రెడ్డి కాజేశారు
సుబ్బారెడ్డి కూతురు సుచరిత పేరు మీద.. ఒక మహిళ సాయంతో బ్యాంక్‌లో అకౌంట్ ఓపెన్ చేయించి ఆ డబ్బుల్ని కొట్టేశారు
ఇలా ఏ ఏ బ్యాంక్‌ల్లో టీడీపీ నేతలు మోసాలు చేశారో.. విచారిస్తే తెలుస్తుంది
-రాచమల్లు శివప్రసాద్ రెడ్డి గారు, ప్రొద్దుటూరు మాజీ ఎమ్మెల్యే
#ScamsterBabu
BIG TV Shows All Data Proofs With Names And Castes!✅️
BC' లు నుంచి OC' లుగా మారిన అభ్యర్థులు.
రెవెన్యూ అధికారుల పాత్రపై అనుమానాలు.
కులాలను మార్చేసి EWS కోటాలో ఉద్యోగం.
ఆత్మకూరు మండలంలో ఐదుగురు.
చాగలమర్రి మండలంలో ఒకరు.
1.మారుబోతుల సౌజన్య
2.సంకుల కేశవులు
3.వెంకట లక్ష్మీదేవి
4.నిమ్మగడ్డ రేవతి
5.సంకుల కేశవులు
2019 లో BC 2026 లో OC గా మార్చుకొని ఉద్యోగాలు పొందారు.
డీఎస్సీ–2025 నియామకాల్లో అక్రమాల వ్యవహారం రోజురోజుకూ మరింత బట్టబయలవుతోంది. రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి మరిన్ని కొత్త ఆధారాలు, వాస్తవాలు వెలుగులోకి వస్తున్నాయి. అవన్నీ డీఎస్సీలో తీవ్ర అక్రమాలను బయటపెడుతూ, @ncbn వెన్నుపోటు పార్టీ సమాధానం చెప్పాల్సిన అనేక ప్రశ్నలను లేవనెత్తుతున్నాయి.
ఆ ప్రశ్నలకు సమాధానం చెప్పి, నిజాలను నిగ్గు తేల్చేందుకు సీబీఐ విచారణకు అంగీకరించాల్సిన ప్రభుత్వం.. స్వతంత్ర దర్యాప్తును తిరస్కరిస్తోంది. మరోవైపు ప్రశ్నిస్తున్న గొంతులను అణచివేసే మార్గాన్ని వెన్నుపోటు పార్టీ ఎంచుకుంది. డీఎస్సీ నియామకాల అక్రమాలపై గొంతెత్తుతున్న ప్రతిపక్షంతో పాటు, కొన్ని మీడియా సంస్థలు, సామాజిక కార్యకర్తలు, వ్యక్తులకు సంబంధించిన సామాజిక పోస్టులు, ఖాతాలను మెటా సామాజిక మాధ్యమాలైన ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ లో నియంత్రిస్తున్నారు. ‘చట్టపరమైన ఆదేశాలు’ అంటూ వాటిని తొలగించడం లేదా జియోబ్లాక్ చేయడం జరుగుతోంది. ఆ ఆంక్షల బారిన పడిన ఖాతాలు, పేజీలు, ఫేస్బుక్లో సాక్షి టీవీ, ఇన్‌స్టాగ్రామ్‌లో సాక్షి డిజిటల్, బిగ్ టీవీ, జగనన్న కనెక్ట్స్‌తో పాటు, డీఎస్సీ స్కామ్‌పై ప్రశ్నిస్తున్న ఇతర వ్యక్తిగత హ్యాండిల్స్ కూడా ఉన్నాయి.
వెన్నుపోటు పార్టీ ప్రభుత్వం అనుసరిస్తున్న ఈ వ్యవహారం కేవలం డీఎస్సీ స్కామ్తోనే ఆగిపోవడం లేదు. వెన్నుపోటు పార్టీ ప్రభుత్వ అవినీతి, వైఫల్యాలు, అమలు కాని సూపర్ సిక్స్, సూపర్ సెవెన్ ఎన్నికల హామీలు, నిరంకుశత్వం, అధికార దుర్వినియోగంపై ప్రశ్నిస్తున్న ప్రతి ఒక్కరినీ లక్ష్యంగా చేసుకుంటున్నారు. ప్రశ్నలకు సమాధానం చెప్పలేక, ప్రశ్నించిన వారి గొంతు నొక్కేస్తున్నారు. ఇది పరిపాలన కాదు. నియంతృత్వ సెన్సార్షిప్!
వాక్ స్వాతంత్య్రం, భావ ప్రకటన స్వేచ్ఛ భారత రాజ్యాంగం కల్పించిన ప్రాథమిక హక్కులు. ప్రశ్నలు రాజకీయంగా ఇబ్బందికరంగా ఉన్నాయనే కారణంతో ప్రతిపక్షం, మీడియా, సామాజిక కార్యకర్తలు, పౌరుల గొంతు నొక్కే అధికారం ఏ ప్రభుత్వానికీ లేదు.
చంద్రబాబు గారూ.. మీరు భయపడుతున్నది ప్రశ్నలకా? లేక వాటి సమాధానాలకా? డీఎస్సీ నియామకాల్లో ప్రతిరోజూ కొత్తగా వెలుగు చూస్తున్న ఆధారాలు ఒకవేళ అవాస్తవమైతే.. ప్రజల ముందుకు వచ్చి వాస్తవాలతో వాటిని ఖండించండి. ఆ పని చేయడం లేదు. ఇంకా సీబీఐ విచారణను కూడా ఎందుకు తిరస్కరిస్తున్నారు? అక్రమాలను బయట పెడుతున్న వారి గొంతు ఎందుకు అణచివేస్తున్నారు? వారి పోస్టులు, ఖాతాలను ఎందుకు నియంత్రిస్తున్నారు? ఒక్క విషయం గుర్తుంచుకోండి. ఒక పోస్టును తొలగించినంత మాత్రాన ఆధారాలు చెరిగిపోవు. ఒక ఖాతాను బ్లాక్ చేసినంత మాత్రాన నిజాన్ని పాతిపెట్టలేరు. ప్రతిపక్షాన్ని రాజకీయంగా ఎదుర్కోండి. ప్రజలకు ప్రజాస్వామ్యబద్ధంగా సమాధానం చెప్పండి. రాజ్యాంగబద్ధంగా పాలించండి.
డీఎస్సీ పరీక్ష రాయకుండానే, ఉపాధ్యాయ అర్హత పరీక్ష–‘టెట్’లో ఉత్తీర్ణులు కాకుండానే కొందరికి ఉపాధ్యాయ ఉద్యోగాలు ఇచ్చి.. మిమ్మల్ని మీరు ఎలా సమర్థించుకుంటారు? డీఎస్సీలో స్పోర్ట్స్ కోటా భర్తీ కోసం కొత్తగా జీఓలు జారీ చేశారు. ఆ నియామకాలు పూర్తి చేయగానే, ఆ జీఓలు రద్దు చేశారు. అయినప్పటికీ ఆ జీఓల ద్వారా నియమితులైన అభ్యర్థులు ఉద్యోగాల్లో కొనసాగుతున్నారు. అంటే అక్రమ నియామకాలకు ముందు గేట్లు తెరిచి.. ఆ నియామకాలు పూర్తయ్యాక వాటిని మూసివేశారు. ఇదంతా అవినీతిని సూచించడం లేదా?
అందుకే నియంతృత్వ సెన్సార్‌షిప్‌లో భాగంగా నియంత్రించిన ప్రతి సామాజిక మాధ్య ఖాతాను, పోస్టును, కంటెంట్‌ను తక్షణమే పునరుద్ధరించాలని డిమాండ్ చేస్తున్నాను. అలాగే అందరూ లేవనెత్తుతున్న ప్రశ్నలన్నింటికీ స్పష్టమైన సమాధానాలు చెప్పాలి.
చంద్రబాబు గారికి, ఆయన ప్రభుత్వానికి నేను ఒక సవాల్ చేస్తున్నాను. డీఎస్సీ-2025 నియామకాలు నిజాయతీగా, పారదర్శకంగా జరిగాయని మీరు అనుకుంటే వెంటనే సీబీఐ విచారణకు ఆదేశించండి. స్వతంత్ర దర్యాప్తు ద్వారా నిజానిజాలు తేల్చండి. అలాగే డీఎస్సీ నియామకాల్లో అక్రమాలు జరిగినట్లు ఆధారాలతో సహా బయటపడుతున్నందున, వాటికి నైతిక బాధ్యత వహిస్తూ విద్యా శాఖ మంత్రి నారా లోకేష్ తన పదవికి రాజీనామా చేయాలి.
ఇంకా..
వెంటనే సామాజిక మాధ్యమాల ఖాతాలు పునరుద్ధరించండి.
వాటి సెన్సార్షిప్ను ఆపండి.
అన్ని ప్రశ్నలకు సమాధానం చెప్పండి.
సీబీఐ విచారణకు ఆదేశించండి.
అంతా పారదర్శకంగా జరిగినప్పుడు, దాచుకోవడానికి ఏమీ లేనప్పుడు మీకెందుకింక భయం?
.@ncbn గారూ… ఇప్పటికే ఉన్న పురుషోత్తపట్నం నుంచి, ఆ ఇప్పటికే ఉన్న పంపులతో గోదావరి నీటిని ఎత్తి, ఇప్పటికే ఉన్న పోలవరం ఎడమ కాలువలో వదిలి, దాన్ని చూపించి “పోలవరం నీళ్లు తెచ్చేశాం” అంటూ డప్పు కొట్టుకోవడం ఏంటి? పోలవరం రిజర్వాయర్ నుంచి గ్రావిటీ ద్వారా వస్తున్న నీళ్లు ఇవి కావనీ మీకూ తెలుసు, అందరికీ తెలుసు. కానీ ప్రచారం మాత్రం వేరే లెవల్. నీళ్లు పురుషోత్తపట్నానివి… కాలువ వైయస్సార్ హయాంలో నిర్మించినది… క్రెడిట్ కోసం ఆరాటం మాత్రం మీదా? ఇదేం మ్యాజిక్?
సాగునీటి ప్రాజెక్టుల విషయంలో మీరు వరుసగా చేస్తున్న పబ్లిసిటీ ఈవెంట్లన్నీ ప్రజలను మభ్యపెట్టడానికే కదా? మొన్న వెలిగొండ… ఇవాళ పోలవరం ఎడమ కాలువ… ఇంకోరోజు ఇంకోటి. మీరు మొదలుపెట్టని, మీరు పూర్తిచేయని ప్రాజెక్టులకు మీ పేరు చెప్పుకోవడం, మీ అనుకూల మీడియాతో వాటి సృష్టికర్తలు మీరు అన్నట్టుగా భజన చేయించుకోవడం మీకు అలవాటే. ఒకవేళ అరకొర పనులు చేసినా, అవి కూడా అంచనాలు పెంచేసి దోచేయడానికే. ఏ సాగునీటి ప్రాజెక్టును తీసుకున్నా మీ మోడస్ ఆపరెండీ, మీ ధోరణి, మీ నైజం ఇదే.
పురుషోత్తపట్నం పంపుల ద్వారా విడుదల చేస్తామంటున్నది 3,500 క్యూసెక్కుల నీళ్లు, ఈ ప్రాజెక్ట్, ఈ పంపులు కొత్తవికాదు కదా? ఇప్పటికే ఉన్నవే కదా? మరెందుకు ఈ డ్రామా? అసలు పోలవరం ఎడమ కాలువకు సంబంధించిన ప్రధాన పనుల్లో 79% పనులు వైయస్సార్‌గారి హయాంలోనే పూర్తైతే, ఇప్పుడు ఆ పనులన్నింటి మీద నిలబడి “అంతా నేనే చేశా” అని చెప్పుకోవడం చంద్రబాబుగారూ మీకే చెల్లింది!
పోలవరం ప్రాజెక్టు విషయంలో 2014–19 మధ్య మీరు చేసిన డ్రామాలు, చెప్పిన అబద్ధాలు, చేసిన తప్పిదాలు, అవినీతి, దోపిడీ… ఇవన్నీ రాష్ట్రానికి శాపంలా మారాయన్నది ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ముందుచూపు, సరైన ప్రణాళిక, ప్రాధాన్యతలు పాటించకుండా, పద్ధతీపాడూ లేకుండా మీరు తప్పులు చేస్తే, ఆ చేసిన తప్పులను సరిదిద్దడానికి మా ఐదేళ్ల పాలనలో అష్టకష్టాలు పడాల్సి వచ్చింది. స్పిల్‌వే, కాఫర్ డ్యాం పనులను అరకొరగా చేసి ప్రాజెక్టును చెల్లాచెదురు చేశారు. చివరకు స్పిల్‌వేకు పనులు పూర్తికాకుండానే, నదీ ప్రవాహాన్ని డైవర్ట్ చేయకుండానే, మెయిన్డ్యాం పునాది పనుల్లో భాగమైన డయాఫ్రంవాల్ చేపట్టారు. మీరు చేసిన తప్పుల వల్ల, మీ నిర్వాకాల వల్ల ప్రాజెక్టు ఆలస్యం కావడం ఒక్కటే కాకుండా, వరదల వల్ల వచ్చిన నీరు, అప్పటికి పాక్షికంగా చేసిన స్పిల్‌వే ద్వారా డైవర్ట్ కాక, ఎగున అరకొరగా చేసిన కాఫర్ డ్యాంవల్ల, ఆ గ్యాప్‌ల ద్వారా నీరు చొచ్చుకుని వచ్చి, మెయిన్ డ్యాం కింద పునాదులు, అంటే డయాఫ్రంవాల్ కొట్టుకుపోయి నష్టంకూడా జరిగింది.
వీటన్నింటినీ సరిదిద్దుతూ ముందుగా అప్రోచ్ ఛానల్, స్పిల్ ఛానల్, స్పిల్‌వే పనులు, కాఫర్ డ్యాంలను పూర్తిచేసి, ఆ తర్వాత మెయిన్ డ్యాం ప్రాజెక్టులో అత్యంత సంక్లిష్టమైన పనులను ఒక్కొక్కటిగా ముందుకు తీసుకెళ్లాం, ప్రణాళికా బద్ధంగా. పోనీ ఇప్పుడైనా సవ్యంగా చేస్తున్నారంటే అదీ లేదు. ప్రాజెక్టును మళ్లీ సుడిగుండంలోకి నెడుతున్నారు.
అన్నింటికంటే ముఖ్యంగా పోలవరం ఎత్తు సంగతి తేల్చండి చంద్రబాబుగారూ. పోలవరం FRL 45.72 మీటర్లు అయితే, నీటినిల్వను 41.15 మీటర్లకే పరిమితం చేస్తున్నారు. తాము 41.15 మీటర్ల వరకే నిధులిస్తామని కేంద్రం చెబుతోంది. మరి పూర్తి స్థాయి ప్రాజెక్టు ఎలా పూర్తవుతుంది? పూర్తి సామర్థ్యంతో నీటిని ఎలా నిల్వ చేస్తారు? నిర్వాసితులకు ప్యాకేజీ ఎప్పుడు చెల్లిస్తారు? ఈ ప్రశ్నలకు మీ సమాధానం ఏమిటి చంద్రబాబుగారూ?
మరోవైపు ఉత్తరాంధ్రకు గొప్ప మేలు చేసినట్టుగా మాట్లాడుతున్నారు. పురుషోత్తపట్నం పంపుల నుంచి వచ్చే నీళ్లతోనే ఉత్తరాంధ్రకు మేలు జరిగిపోతుందా? ఉత్తరాంధ్ర సుజల స్రవంతి సంగతేంటి? ఈ స్కీంకు వైయస్సార్ గారు 2009లోనే రూ.7,214.10 కోట్ల పరిపాలనా అనుమతి ఇస్తే, మా ప్రభుత్వంలో మారిన ధరలు, భూసేకరణ, నిర్మాణ వ్యయాలను పరిగణనలోకి తీసుకుని 2022లో రూ.17,050.20 కోట్లకు అంచనాలను సవరించి పరిపాలనాపరమైన అనుమతి ఇచ్చాం. కీలకమైన Package-1, Package-2 పనులను టెండర్లు, అగ్రిమెంట్ల దశ వరకు తీసుకెళ్లాం. భూసేకరణకు ప్రత్యేక యూనిట్లు కూడా ఏర్పాటు చేశాం. మరి మీ ప్రభుత్వం వచ్చాక ఉత్తరాంధ్ర సుజల స్రవంతిని ఎందుకు పట్టించుకోవడం లేదు? ఉత్తరాంధ్ర మీద ప్రేమ ప్రసంగాల్లోనేనా?
చంద్రబాబుగారూ… పోలవరం విషయంలో డ్రామాలు మానండి. పనులపై దృష్టిపెట్టండి. 41.15 మీటర్లు కాకుండా, 45.72 మీటర్ల నిర్దేశిత ఎత్తులో పోలవరాన్ని పూర్తిచేయండి. దీనివల్ల పూర్తిస్థాయి స్టోరేజీ సాధ్యపడుతుంది, తద్వారా పూర్తిస్థాయిలో నీటిని నిల్వచేయడంతోపాటు, పూర్తి గ్రావిటీతో కుడి, ఎడమ కాలువల ద్వారా నీళ్లు అందించగలుగుతాం. అప్పుడు పురుషోత్తపట్నం, పుష్కర ఎత్తిపోతలతో సంబంధం లేకుండానే గ్రావిటీతోనే పోలవరం ఎడమకాల్వతోపాటు, కుడికాల్వకు నీళ్లు పుష్కలంగా పంపగలం. మరి ఇదిచేయకుండా ఇన్ని డ్రామాలు ఎందుకు?
#YSRPolavaram
Retweet And Spread This Facts!✅️
జగన్ వెలుగొండ ప్రాజెక్టు కోసం చేసిన ఏం చేశారో అద్భుతంగా వివరించిన 10TV!
18.8 కిలోమీటర్లు, 9 మీటర్ల వెడల్పుతో రెండు టన్నెల్ నిర్మాణం పూర్తి చేసింది జగన్
Alert! Alert! Alert! 🚨
వరి పంటలు సాగు చేయవద్దంటూ రైతులకు టీడీపీ ఎమ్మెల్యే వరదరాజులు రెడ్డి హెచ్చరిక..!
-రాయలసీమకు నీళ్లు ఇచ్చే ఉద్దేశం @ncbn కు లేదన్న టీడీపీ ఎమ్మెల్యే వరదరాజులు రెడ్డి
-కేసీ కెనాల్ రైతులు ఆశలు పెట్టుకోవద్దు
రాయలసీమకు నీళ్లు ఇచ్చే పరిస్థితి లేదని తేల్చేసిన చంద్రబాబు ప్రభుత్వం
#TDPAntiFarmers
#SadistChandraBabu
రాయలసీమకు సాగునీరిచ్చే ఆలోచన లేదు
- ప్రొద్దుటూరు ఎమ్మెల్యే వరదరాజులురెడ్డి
తెలంగాణ, ఏపీ విద్యుత్ ఉత్పత్తికి అధిక ప్రాధాన్యం ఇస్తోందని స్పష్టత
శ్రీశైలంలో మిగిలిన నీళ్లు నాగార్జునసాగర్, పులిచింతలకు విడుదల చేస్తోందన్న ఎమ్మెల్యే
రాయలసీమలో ముఖ్యంగా కేసీ కెనాల్ రైతులు ఆశలు పెట్టుకోవద్దంటూ హెచ్చరిక
శ్రీశైలంలో నీళ్లున్నాయని...మనకూ నీళ్లు వస్తాయని ఆశ పడొద్దు
ప్రభుత్వానికి కేసీ కెనాల్‌కు నీళ్లు వదిలే ఆలోచన లేదు.. భవిష్యత్తులో కూడా నీళ్లు రావని టీడీపీ ఎమ్మెల్యే స్పష్టీకరణ
నేను అధికారులు, మంత్రులతో మాట్లాడా.. వాళ్లు సాగునీరు ఇచ్చేది లేదని స్పష్టంగా చెప్పారు
రైతులు వరి పంటలు వేయవద్దు... అరుతడి పంటలు కూడా వర్షాలొస్తే వేసుకోండన్న టీడీపీ ఎమ్మెల్యే
.@ncbn గారూ… ప్రాణాలు కాపాడే జూనియర్ డాక్టర్లను రోడ్డెక్కించి, పేద రోగుల ప్రాణాలతో చెలగాటమాడతారా?
రాష్ట్రంలోని 19 ప్రభుత్వ మెడికల్ కాలేజీలకు చెందిన దాదాపు 9 వేల మంది ఇంటర్న్లు, పీజీలు, సూపర్ స్పెషాలిటీ, సీనియర్ రెసిడెంట్ డాక్టర్లు రెండు వారాలుగా ఆందోళన చేస్తున్నా మీరు ఎందుకు స్పందించడం లేదు? నిబంధనల ప్రకారం జనవరి 1 నుంచి అమలుకావాల్సిన స్టైపెండ్ సవరణను ఎందుకు నిలిపివేశారు?
జూనియర్ డాక్టర్లకు జీవో నంబర్ 287 నిర్దేశించిన 15శాతం కంటే అధికంగా మా హయాంలో 42.4 శాతం పెంచాం. సూపర్ స్పెషాల్టీ కోర్సును అభ్యసిస్తున్న వారిని సీనియర్ రెసిడెంట్స్‌గా గురిస్తూ, వారి విజ్ఞప్తినికూడా పరిగణలోకి తీసుకుని నిర్దేశించిన దానికంటే పెంచి, మొత్తంగా 77శాతం వారికి పెంచాం. ఆయుష్ విభాగానికి చెందిన జూనియర్ డాక్టర్లకు కూడా అల్లోపతి జూనియర్ డాక్టర్ల తరహాలోనే స్టైపెండ్ పెంచాం. పెరిగిన ధరలు, ద్రవ్యోల్బణం, జీవన వ్యయాన్ని పరిగణనలోకి తీసుకుని 15 శాతం కంటే మెరుగైన పెంపు ఇవ్వాలని జూనియర్ డాక్టర్లు కోరుతుంటే, కేవలం 3 నుంచి 5 శాతం మాత్రమే పెంచుతామని చెప్పడం అన్యాయం కాదా?
జూనియర్ డాక్టర్ల శ్రమతోనే ప్రభుత్వ బోధనాసుపత్రుల్లో వైద్యసేవలు నడుస్తున్నాయి. ఇప్పుడు సమ్మె కారణంగా క్యాజువాలిటీ, ఐసీయూ, లేబర్ రూమ్ వంటి అత్యవసర సేవలకూ అంతరాయం ఏర్పడి పేద రోగులు తీవ్రంగా ఇబ్బందిపడుతున్నారు. ఈ పరిస్థితికి మీ ప్రభుత్వ మొండివైఖరే కారణం కాదా చంద్రబాబుగారూ?
ఇప్పటికే మీరు పెట్టిన బకాయిలతో ఆరోగ్యశ్రీ నెట్ వర్క్ ఆస్పత్రులు చేతులు ఎత్తేశాయి. మరోవంక ప్రభుత్వ వైద్యరంగాన్ని మీరు దారుణంగా దెబ్బతీశారు. దేశ చరిత్రలో ఎక్కడా లేనివిధంగా మేం ఒకేసారి 17 కొత్త ప్రభుత్వ మెడికల్ కాలేజీలను తీసుకొచ్చి, ఐదింటిని పూర్తిచేసి క్లాసులుకూడా ప్రారంభిస్తే, మరో కాలేజీని క్లాసులకు సిద్ధంచేసి, మొత్తంగా ఆరు అందుబాటులోకి తెచ్చాం. మిగిలిన వాటిని పూర్తిచేయాల్సిందిపోయి, వాటిని తెగనమ్మడానికి ప్రయత్నిస్తున్నారు. ఇదిసరిపోక ప్రభుత్వ బోధనాసుపత్రులు, ఇతర ఆస్పత్రుల్లో మిగిలిన నాడు–నేడు పనులను మీరు నిలిపివేశారు. WHO/GMP ప్రమాణాలు ఉండే మందులు లేక గవర్నమెంటు ఆస్పత్రులు విలవిల్లాడుతున్నాయి. జీరో వేకెన్సీ పాలసీకి మంగళం పాడారు. వైద్యరంగంలో మేం నియమించిన 50 వేల మంది సిబ్బందిని క్రమంగా తగ్గిస్తున్నారు.
ఫ్యామిలీ డాక్టర్ విధానానికి గండికొట్టారు. సీహెచ్‌సీల్లో స్పెషలిస్ట్ డాక్టర్లను తొలగించారు. విలేజ్, అర్బన్ క్లినిక్‌లను నిర్వీర్యం చేశారు. ఆరోగ్యశ్రీని దారుణంగా దెబ్బతీసి రూ.3 వేల కోట్లకుపైగా బకాయిలు పెట్టారు. ప్రజారోగ్య వ్యవస్థలో మీరు సృష్టించిన విధ్వంసం అంతా ఇంతా కాదు. ఇప్పుడు జూనియర్ డాక్టర్ల విషయంలోనూ అహంకారంతో వ్యవహరిస్తూ, మిగిలిన వైద్యసేవలను కూడా పేదలకు దూరం చేస్తున్నారు.
చంద్రబాబుగారూ… ఇప్పటికైనా అహంకారం వీడండి. జూనియర్ డాక్టర్ల ప్రతినిధులను వెంటనే చర్చలకు పిలిచి, వారి న్యాయమైన డిమాండ్లను పరిష్కరించండి. తగిన స్థాయిలో స్టైపెండ్‌ను పెంచి, సమ్మెను విరమింపజేసి, ప్రభుత్వ ఆస్పత్రుల్లో పేద రోగులకు ఎలాంటి ఇబ్బందులూ లేకుండా చూడండి.
ఇవిగో మా హయాంలో మేం పెంచిన స్టైపెండ్ వివరాలు- https://t.co/CA1rqb7lnk
𝗧𝗵𝗲 𝗣𝗹𝗶𝗴𝗵𝘁 𝗼𝗳 𝗚𝗼𝘃𝗲𝗿𝗻𝗺𝗲𝗻𝘁 𝗦𝗰𝗵𝗼𝗼𝗹𝘀 𝗶𝗻 𝗔𝗻𝗱𝗵𝗿𝗮 𝗣𝗿𝗮𝗱𝗲𝘀𝗵: 𝗔 𝗖𝗿𝗶𝘀𝗶𝘀 𝗼𝗳 𝗘𝗻𝗿𝗼𝗹𝗺𝗲𝗻𝘁 𝗮𝗻𝗱 𝗣𝘂𝗯𝗹𝗶𝗰 𝗘𝗱𝘂𝗰𝗮𝘁𝗶𝗼𝗻
𝗧𝗵𝗲 𝗥𝗲𝗮𝗹𝗶𝘁𝘆 𝗕𝗲𝗵𝗶𝗻𝗱 𝘁𝗵𝗲 𝗘𝗻𝗿𝗼𝗹𝗺𝗲𝗻𝘁 𝗖𝗹𝗮𝗶𝗺𝘀 𝗼𝗳 𝘁𝗵𝗲 𝗚𝗼𝘃𝗲𝗿𝗻𝗺𝗲𝗻𝘁
The UDISE + Data for AY (Academic year) 2025-26 brings to light a very dangerous trend in the State of Andhra Pradesh. There is a clear reduction in the number of enrolments during AY 2025-26, when compared with AY 2023-24, the last year of our Government, particularly in Government schools. The State Government has repeatedly claimed that over 1.10 lakh students have shifted from private schools to government schools, portraying it as evidence of growing public confidence in government education. This is in line with their party's philosophy of making most unjustifiable claims and ones which are very clearly exposed and contradicted by official statistics and figures.
If government schools were indeed witnessing such a large influx of students, the overall enrolment in government schools should have increased. Instead, the UDISE plus (Unified District Information system for School Education, Ministry of Education, Government of India) comparison between AY 2023-24 and AY 2025-26 shows that government school enrolment fell from 40,50,116 to 34,93,450 students, a decline of 5,56,666 students. At the same time, the number of government schools have also been reduced from 45,000 to 44,222, while government-aided schools declined from 991 to 797. What is also noteworthy is that during the same period, the enrolment of students in schools operating under private management have increased from 45,53,380 in 2023-24 to 48,40,296 in 2025-26. Therefore, the enrolment in Government and Government aided schools has come down and the enrolment in private schools has increased. This clearly demonstrates the plight of Government schools in AP and proves that the claim of the State Government is incorrect.
An important aspect that deserves attention is that, the Andhra Pradesh private education sector is dominated by institutions such as Narayana, Sri Chaitanya, Bhashyam, Vignan, and GITAM. The @ncbn Government has close unholy association with these institutions and is therefore clearly weakening the education in Government sector to support the growth of private sector educational institutions.
The statistics indicate a very worrisome trend of quality education being made inaccessible to students who are unable to afford to enroll in private schools.
𝗔 𝗧𝗿𝗮𝗻𝘀𝗳𝗼𝗿𝗺𝗮𝘁𝗶𝘃𝗲 𝗘𝗿𝗮 𝗶𝗻 𝗚𝗼𝘃𝗲𝗿𝗻𝗺𝗲𝗻𝘁 𝗦𝗰𝗵𝗼𝗼𝗹 𝗘𝗱𝘂𝗰𝗮𝘁𝗶𝗼𝗻:
During the period of the YSRCP regime between 2019-24, the number of reforms and transformative steps initiated have brought about substantial improvements in the education system.
The Mana Badi - Nadu Nedu initiative had modernized the infrastructure across 56,703 government schools, welfare hostels, and junior colleges by upgrading facilities like furniture, drinking water, sanitation, classrooms and so forth. Phase I, covering 15,715 schools, was completed, while Phase II extended these improvements to 22,344 schools and Phase III was underway by June 2024.
Free Tabs with pre-loaded BYJU's content were provided to 8th class students and their teachers.
English medium was made medium of instruction from primary level and to make transition seamless, bilingual textbooks and oxford dictionary were made available to all students. This is most pertinent, considering the reality that our children must be capable of competing in global arena.
Further, 62,000 IFPs were installed in every classroom from 6th class and above to boost digital education.
45,000 smart TVs were installed in every school having classes from 1st to 5th.
With respect to TOEFL, a subject was introduced from class 3 onwards to help students develop spoken English skills. An MOU to this effect was singed with American Educational Testing Services (ETS) to provide international certification for TOEFL.
Further, a major reform was initiated, to enable students to compete and succeed at global level. IB (international baccalaureate) was planned to be introduced and work in this regard had commenced with capacity building and providing training in IB system to teachers, school heads, MEOs and other faculty.
The emphasis of the YSRCP Government was on making quality education accessible to everyone.
Jagan Talks With All Data Proofs!✅️
First MERIT List లో నవీన్ పేరు ఉంది.
Second MERIT List లో నవీన్ పేరు ఎందుకు లేదు.
లోకేష్ చెబుతున్న మాట సర్టిఫికెట్స్ వెరిఫికేషన్ కు రాలేదని తీసేసాం అంటున్నాడు.
అదే నవీన్ అనే వ్యక్తి కోర్టులో నాకు కాల్ లెటర్ రాలేదు అని ఎందుకు కేసు వేశాడు.
- జగనన్న
హే రామ్…!
గంజాయి, మద్యం అక్రమ రవాణాను అరికట్టాల్సిన పోలీసుల వాహనంలోనే గంజాయి, మద్యం బాటిళ్లు కనిపిస్తే… రాష్ట్రంలో పరిస్థితులు ఎంత దారుణంగా దిగజారిపోయాయో చెప్పడానికి ఇంతకంటే సాక్ష్యం ఇంకేం కావాలి?
@ncbn గారూ… అసలు రాష్ట్రాన్ని ఎక్కడికి తీసుకెళ్తున్నారు? ప్రజలకు రక్షణ కల్పించాల్సిన పోలీసు వ్యవస్థలోనే, అక్రమాలను అడ్డుకోవాల్సిన యంత్రాంగంతోనే అక్రమాలు చేయిస్తుంటే, వాటిలోనే అవినీతి చోటుచేసుకుంటే ప్రజలు ఎవరిని నమ్మాలి? ఎవరికి ఫిర్యాదు చేయాలి?
ప్రకాశం జిల్లా, అద్దంకి మండలం, శంఖవరప్పాడు వద్ద జరిగిన దాన్ని ఏదో ఒక్క ఘటనగా కొట్టిపారేయలేం. రెండేళ్లుగా వ్యవస్థలను ప్రజలకోసం కాకుండా రాజకీయ కక్షసాధింపులకు, ప్రత్యర్థుల గొంతు నొక్కడానికి, మీ రెడ్‌బుక్ రాజ్యాంగాన్ని అమలు చేయడానికి, మీ ఎమ్మెల్యేలతో కలిసి కలెక్షన్లు తెచ్చిపెట్టుకోవడానికి, వాడుకున్న ఫలితమే ఈ పతనం. వ్యవస్థలను రాజకీయ ప్రయోజనాలకు, మీ కలెక్షన్లకు వాడుకుంటే చివరకు అవి ఎంతగా భ్రష్టుపడతాయో ఈ ఘటన కళ్లకు కడుతోంది.
ఈనేపథ్యంలో, ఇద్దరు ఎస్సైలు ప్రయాణిస్తున్న కారు, తాగిన మత్తులో ఉన్న డ్రైవర్ ఒక ఆటోను ఢీకొట్టడం, ఆటోలో ఉన్నవాళ్లు తీవ్రంగా గాయపడ్డం, యాక్సిడెంట్ అయిన తర్వాత ఆ కారును చుట్టుముట్టడం, ఆ కారులో ఉన్న ఇద్దరు ఎస్సైలు మత్తులో ఉన్న పరిస్థితిలో ఉండడం, ఆ కార్ డిక్కీలో గంజాయి, మద్యం, పోలీస్ యూనిఫాం దొరకడం, చివరకు అక్కడున్న ప్రజలే జర్నలిస్టులుగా మారి, జరిగిన ఘటనను వీడియో తీసి వాస్తవాలను ప్రజల ముందుంచే ప్రయత్నం చేస్తే, “వీడియోలు తీయొద్దు, కేసులు పెడతాం” అని అక్కడకు చేరుకున్న మరో సీఐ, బెదిరిస్తున్నారంటే మీ పాలనలో పరిస్థితి ఏ స్థాయికి చేరిందో అర్థమవుతోంది. నిజాన్ని బయటపెట్టడమే నేరమా? ప్రశ్నించడమే తప్పా?
ఈ ఇద్దరు పోలీసు అధికారులు ప్రైవేటు పార్టీలు నిర్వహించారని, మద్యం, గంజాయి అక్కడ వాడారని, ఆ పార్టీలో పలువురు టీడీపీ నేతలు పాల్గొన్నారన్న సమాచారం మరింత దిగ్భ్రాంతి కలిగిస్తోంది. ఘటనా స్థలం నుంచి కారులో ఉన్న ఆ ఇద్దరు పోలీసు అధికారులను స్థానిక టీడీపీ నాయకులు తప్పించారన్న ఆరోపణలు కూడా అత్యంత తీవ్రమైనవి. నిష్పక్షపాతంగా పనిచేయాల్సిన వ్యవస్థతో అధికార పార్టీ నాయకుల కుమ్మక్కు ఎంత లోతుకు వెళ్లిందో ఈ ఘటన బయటపెడుతోంది. అలాంటప్పుడు రాష్ట్రంలో పోలీస్స్టేషన్లలో కేసుల నమోదు నుంచి విచారణ వరకు నిష్పక్షపాతంగా జరుగుతుందని ఎవరైనా నమ్ముతారా?
చంద్రబాబుగారూ… రోజూ గంటలకొద్దీ పైకి నీతి కబుర్లు చెబుతూ, లోపల రాజకీయ కుట్రలు, కక్షసాధింపులతో వ్యవస్థలను విషపూరితం చేస్తే ఫలితాలు ఇలాగే ఉంటాయి. రాజకీయ ప్రత్యర్థులపై కేసులు పెట్టడం, వారిని వేధించడం మీద చూపిస్తున్న శ్రద్ధలో కనీసం కొంతైనా శాంతిభద్రతలపై, పోలీసు వ్యవస్థ ప్రక్షాళనపై పెట్టండి.
ఈ ఘటనను కూడా మీకున్న మీడియా బలంతో కప్పిపుచ్చకండి. డైవర్ట్ చేయకండి. నిష్పక్షపాత విచారణ జరిపించి, తప్పుచేసినవారు ఎంతటివారైనా చర్యలు తీసుకోండి. ఘటనను నిలదీసిన ప్రజలపై మళ్లీ రెడ్‌బుక్ ప్రయోగించకుండా, వీడియోలు తీసిన వారిని వేధించకుండా నిజాయితీగా వ్యవహరించండి.
English Version- https://t.co/71sNSrlUV6
“దిశ”ను ఉపసంహరించుకుంటూ చంద్రబాబు ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం ఆంధ్రప్రదేశ్‌లో మహిళలు, చిన్నారులకు ఒక చీకటి రోజు. మహిళల భద్రతకు అండగా నిలిచిన ఒక సమగ్ర రక్షణ వ్యవస్థను రాజకీయ ఈర్ష్యతో నిర్వీర్యం చేయడం అత్యంత దురదృష్టకరం.
మహిళలు, చిన్నారులపై నేరాలు, దర్యాప్తులో జాప్యం, న్యాయప్రక్రియలో ఆలస్యం వంటి సమస్యలకు పరిష్కారంగా వైయస్సార్సీపీ ప్రభుత్వం “దిశ”ను తీసుకొచ్చింది. నేరం జరగకుండా నిరోధించడం నుంచి, నేరం జరిగితే వెంటనే స్పందించడం, బాధితులకు రక్షణ, వేగంగా దర్యాప్తు, ఫోరెన్సిక్ ఆధారాల సేకరణ, చార్జిషీటు, ప్రత్యేక కోర్టుల ద్వారా సత్వర న్యాయం వరకు ఒక సమగ్ర వ్యవస్థను నిర్మించాం.
దిశలో భాగంగా మహిళలు ప్రమాదంలో ఉన్నప్పుడు SOS బటన్ నొక్కినా, ఫోన్‌ను 5 సార్లు షేక్ చేసినా నిమిషాల వ్యవధిలో పోలీసులు స్పందించే వ్యవస్థ తీసుకొచ్చాం. 1.51 కోట్ల మంది దిశ యాప్‌ను డౌన్లోడ్ చేసుకున్నారు. దిశ ద్వారా వచ్చిన 31,607 అత్యవసర కాల్స్‌ను అప్పట్లో మా ప్రభుత్వంలో పోలీసులు పరిష్కరించారు.
18 ప్రత్యేక మహిళా పోలీస్స్టేషన్లు ఏర్పాటు చేశాం. ప్రతి గ్రామ, వార్డు సచివాలయంలో మహిళా పోలీసును అందుబాటులోకి తీసుకొచ్చి 13,500 మందితో క్షేత్రస్థాయి భద్రత, రిపోర్టింగ్ వ్యవస్థను నిర్మించాం. 900 ద్విచక్ర వాహనాలు, 163 నాలుగు చక్రాల వాహనాలతో ప్రత్యేక పెట్రోలింగ్ ఏర్పాటు చేశాం.
నేరస్తులు ఎట్టి పరిస్థితుల్లోనూ తప్పించుకునే అవకాశం లేకుండా ఈ కేసుల దర్యాప్తులో శాస్త్రీయ ఆధారాలకు ప్రాధాన్యం ఇస్తూ ఆరు నగరాల్లో ఫోరెన్సిక్ వ్యవస్థను బలోపేతం చేశాం. సత్వర విచారణ కోసం 13 ప్రత్యేక POCSO కోర్టులు, 12 మహిళా ప్రత్యేక కోర్టులు ఏర్పాటు చేశాం. 2,17,467 మంది లైంగిక నేరస్తుల వివరాలతో ప్రత్యేక డేటాబేస్‌ను రూపొందించాం.అందుకనే దిశ విజయవంతగా మహిళలకు, చిన్నారులకు గొప్ప భద్రతా సేవలను అదించింది.
2017లో మహిళలపై నేరాల దర్యాప్తుకు సగటున 156 రోజులు పట్టగా, 2022 నాటికి అది 28 రోజులకు తగ్గించగలిగారు.
164 అత్యాచారం కేసులు, 378 లైంగిక నేరాల కేసుల్లో కేవలం 7 రోజుల్లోనే ఛార్జిషీట్లు దాఖలు చేశారు. తీవ్రమైన కేసుల్లో 51 శాతానికిపైగా నిందితులను 48 గంటల్లోపు అరెస్టు చేశారు.
గతంలో DNA నివేదికలకు నెలలు పట్టేది. దిశ ఫోరెన్సిక్ వ్యవస్థతో వాటిని రోజుల్లోనే అందించే పరిస్థితి తీసుకొచ్చాం. 214 కేసుల్లో నిందితులకు శిక్షలు పడ్డాయి.
మే 2024 నాటికి మహిళలపై నేరాలు 27 శాతం తగ్గాయి. వార్షిక సగటు కేసులు 14,338 నుంచి 10,426కు తగ్గాయి.
ఇదీ దిశ ఇచ్చిన భరోసా. ఇవీ దిశ సాధించిన ఫలితాలు. అందుకే 19జాతీయ అవార్డులను మా ప్రభుత్వ హయాంలో “దిశ’’ గెలుచుకుంది. “దిశ” అనేది కాగితాల మీదున్న పేరు కాదు. ప్రమాదంలో ఉన్న మహిళ SOS నొక్కిన క్షణం నుంచి, నిందితుడికి శిక్ష పడే వరకు ఆమెకు అండగా ఉండే సజీవమైన మహిళా రక్షణ నెట్వర్క్.
ఇప్పుడు చంద్రబాబు ప్రభుత్వం “BNS (భారతీయ న్యాయ సంహిత) చాలు, దిశ అవసరం లేదు” అంటోంది. మహిళల కోసం ప్రత్యేకంగా రూపొందించిన SOS వ్యవస్థ, ప్రత్యేక మహిళా పోలీస్స్టేషన్లు, గ్రామ స్థాయి నుంచే మహిళా పోలీసులు, ప్రత్యేక పెట్రోలింగ్, లైంగిక నేరస్తుల డేటాబేస్, వేగవంతమైన ఫోరెన్సిక్ వ్యవస్థ, ప్రత్యేక ప్రాసిక్యూషన్, ప్రత్యేక కోర్టులు, నిర్ణీత సమయంలో దర్యాప్తు! న్యాయం అనే లక్ష్యానికి BNS ప్రత్యామ్నాయం ఎలా అవుతుంది?
మహిళలు, చిన్నారులపై తీవ్రమైన దారుణాలు జరిగినప్పుడు 7 పని రోజుల్లో పోలీసు దర్యాప్తు, ఛార్జ్‌షీట్ దాఖలైన తర్వాత 14 పని రోజుల్లో కోర్టు విచారణ పూర్తి చేసేలా దిశ ద్వారా తీసుకొచ్చిన ప్రభుత్వం కూడా వైయస్సార్సీపీదే. 21 రోజుల్లోగా బాధితులకు న్యాయం అందించాలన్న అలాంటి లక్ష్యాన్ని కూడా ఈ ప్రభుత్వం విమర్శించడం మరింత బాధాకరం.
ఆ లక్ష్యం వెనుక ఉద్దేశం ఒక్కటే, దర్యాప్తులో జాప్యం ఉండకూడదు. విచారణలో ఆలస్యం ఉండకూడదు. మహిళలు, చిన్నారులపై నేరాలను అత్యంత ప్రాధాన్యతతో వేగంగా విచారించాలి. నేరం చేస్తే చట్టం వేగంగా, కఠినంగా స్పందిస్తుందనే భయం నేరస్తుల్లో ఉండాలి. అలాంటి వ్యవస్థను మరింత బలోపేతం చేయాల్సింది పోయి, వేగంగా న్యాయం అందించాలనే లక్ష్యాన్నే తప్పుపట్టడం మహిళలకు ఏ సందేశం పంపుతోంది? మహిళలు, చిన్నారులకు సకాలంలో న్యాయం జరగాలని కోరుకోవడమే ఈ ప్రభుత్వానికి అభ్యంతరమా?
“దిశ”ను ఉపసంహరించుకోవడం ద్వారా @ncbn ప్రభుత్వం నేరస్తుల్లో చట్టంపై ఉన్న భయాన్ని తగ్గిస్తోంది. బాధిత మహిళల్లో ప్రభుత్వంపై ఉన్న విశ్వాసాన్ని దెబ్బతీస్తోంది. మహిళలు తమ రక్షణ కవచంగా భావించిన వ్యవస్థను లేకుండా చేస్తోంది.
మంత్రివర్గం ఈ నిర్ణయాన్ని తక్షణమే వెనక్కి తీసుకోవాలి.
దిశను రద్దు చేయడం కాదు-రక్షించాలి.
దిశను నిర్వీర్యం చేయడం కాదు-మరింత బలోపేతం చేయాలి.
English Version- https://t.co/40y4wquoK9
జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా రాష్ట్రంలోని నేతన్నలు, చేనేత కళాకారులు, వారి కుటుంబ సభ్యులందరికీ హృదయపూర్వక శుభాకాంక్షలు.
చేనేత అనేది కేవలం ఒక వృత్తి కాదు. మన సంస్కృతికి, సంప్రదాయానికి, తెలుగు వారి కళా నైపుణ్యానికి నిలువెత్తు ప్రతీక. అందుకే 2019-24 మధ్య మా ప్రభుత్వంలో నేతన్నల జీవితాల్లో వెలుగులు నింపాలని, వారి కుటుంబాలకు ఆర్థిక భరోసా కల్పించాలని ప్రతి అడుగులోనూ వారికి అండగా నిలిచాం.
`వైయస్ఆర్ నేతన్న నేస్తం` పథకం ద్వారా అర్హత కలిగిన ప్రతి చేనేత కుటుంబానికి ఏటా రూ.24 వేల చొప్పున ఐదేళ్లలో రూ.1.20 లక్షలను నేరుగా వారి బ్యాంక్ ఖాతాల్లో జమ చేశాం. ఈ ఒక్క పథకం ద్వారానే రూ.969.77 కోట్లు అందించాం. నేతన్నల పింఛన్ల కోసం రూ.1,396.45 కోట్లు, ఆప్కో పాత బకాయిల చెల్లింపునకు రూ.468.84 కోట్లు వెచ్చించాం. వివిధ సంక్షేమ పథకాల ద్వారా మొత్తంగా రూ.3,706.16 కోట్ల సాయం అందించి నేతన్నలకు ఆర్థికంగా, సామాజికంగా మద్దతుగా నిలిచాం.
చేనేత మగ్గాలకు ఉచిత విద్యుత్, పవర్‌లూమ్స్‌కు రాయితీ విద్యుత్ అందించాం. నేతన్నలు తయారుచేసే వస్త్రాలకు దేశ, విదేశాల్లో మార్కెట్ కల్పించేందుకు ప్రముఖ ఈ-కామర్స్ సంస్థలతో ఒప్పందాలు చేసుకుని, వారి ఉత్పత్తులకు అంతర్జాతీయ గుర్తింపు తీసుకురావడానికి కృషి చేశాం.
కానీ @ncbn ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రెండేళ్ల పాటు నేతన్న నేస్తాన్ని నిలిపివేసింది. ఏడాదికి రూ.25 వేలు అందిస్తామన్న ఎన్నికల హామీని గాలికొదిలేసింది. హ్యాండ్లూమ్స్కు నెలకు 200 యూనిట్లు, పవర్‌లూమ్స్‌కు 500 యూనిట్లు ఉచిత విద్యుత్ ఇస్తామని చెప్పి వాటినీ గాలికి వదిలేసింది. 1,03,534 కుటుంబాలకు పథకం వర్తింపజేస్తామని ప్రకటించి, ఇప్పుడు కేవలం 71,536 కుటుంబాలకు ఇస్తున్నట్లుగా ప్రకటనలు చేస్తోంది. చివరికి వారిలో ఎంతమందికి అందుతుందో చూడాలి. జీఎస్టీ రీయింబర్స్మెంట్ హామీని కూడా అమలు చేయడం లేదు.
నేతన్నల హక్కుల కోసం, వారి సంక్షేమం కోసం, చేనేత రంగ పరిరక్షణ కోసం వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎల్లప్పుడూ మీకు అండగా ఉంటుందని మాట ఇస్తూ మరొక్కసారి మీ అందరికీ శుభాకాంక్షలు.
#NationalHandloomDay
#YSRNethannaNestham
నారాసుర పాలనలో పరాకాష్టకు అరాచకం!
దాడి చేసినవారికి రక్షణ… బాధితులపై కేసులతో రాజకీయ కక్ష!
@ncbn గారూ.. రాష్ట్రంలో ఇవాళ ఏం జరుగుతోంది? దాడి చేసినవారు అధికారపార్టీ వాళ్లయితే వారికి రక్షణ! దాడికి గురైనవారు వైయస్సార్సీపీ వాళ్లయితే వారిపైనే కేసులు ! బాధితులకు అండగా నిలబడితే ప్రజాప్రతినిధులపైనా కేసులు ! ప్రశ్నిస్తే అరెస్టులు ! నిలదీస్తే అర్ధరాత్రి తలుపులు బద్దలుకొట్టడం! ఇదేనా ప్రజాస్వామ్యం?ఇదేనా న్యాయం? ఇదేనా చట్టం?
చంద్రబాబుగారూ… నేను సూటిగా అడుగుతున్నాను. ఆలూరు బీసీ ఎమ్మెల్యే విరూపాక్షి ఏమైనా ఉగ్రవాదా? ప్రజల చేత ఎన్నుకోబడిన ఒక ఎమ్మెల్యే ఇంటిపై అర్ధరాత్రి 2.45 గంటలకు భారీ పోలీసు బలగాలతో దాడి చేయాల్సిన అవసరం ఏమొచ్చింది? ఇంటి తలుపులు బద్దలుకొట్టి, ఎమ్మెల్యే విరూపాక్షిని, ఆయన కుమారుడు చంద్రశేఖర్‌ను అరెస్టు చేసిన తీరు చూస్తే రాష్ట్రంలో అసలు రూల్ ఆఫ్ లా అనేది ఉందా? అని అనిపిస్తోంది.
చిప్పగిరి మండలం నేమకళ్లులో వైయస్సార్సీపీ నాయకుడి ఇంటిపై టీడీపీవాళ్లు దాడిచేస్తే, తన ప్రాణాలకు ప్రమాదం ఉందని, తన కుటుంబాన్ని కాపాడాలని ఆ నాయకుడు ఎమ్మెల్యే విరూపాక్షికి కాల్చేశాడు. ఒక కార్యకర్త ప్రాణభయంతో సహాయం కోరితే స్పందించడం ఎమ్మెల్యే చేసిన నేరమా? బాధిత కుటుంబానికి అండగా నిలబడటం తప్పా? చివరకు పరామర్శించేందుకు వెళ్లిన విరూపాక్షిపైనే టీడీపీ శ్రేణులు రాళ్లతో దాడి చేశాయి. ఆ దాడిలో ఆయన సోదరుడు శ్రీరాముడు గాయపడ్డారు. నిజంగా చట్టం పనిచేస్తే ఎవరిని అరెస్టు చేయాలి? దాడి చేసినవారిని అరెస్టు చేయాలా? దాడికి గురైన ఎమ్మెల్యేను అరెస్టు చేయాలా? కానీ ఈ ప్రభుత్వంలో దాడి చేసినవారికి రక్షణ లభిస్తోంది. దాడికి గురైన ఎమ్మెల్యేనే నిందితుడిగా మార్చి ఆయనపైన, కార్యకర్తలపైన హత్యాయత్నం కేసులు బనాయిస్తున్నారు.
ఎమ్మెల్యే ఇంట్లోని సీసీటీవీ హార్డ్‌డిస్కులను పోలీసులు ఎందుకు తీసుకెళ్లారు? అర్ధరాత్రి పోలీసులు చేసిన దౌర్జన్యానికి సంబంధించిన దృశ్యాలు బయటకు వస్తాయనే భయమా? తలుపులు ఎలా బద్దలుకొట్టారో… కుటుంబ సభ్యులను ఎలా భయపెట్టారో… ఎమ్మెల్యేను ఎలా అరెస్టు చేశారో… ప్రజలకు తెలియకూడదనే హార్డ్‌డిస్కులను తీసుకెళ్లారా? చంద్రబాబుగారూ… సాక్ష్యాలను కాపాడాల్సిన పోలీసులతోనే సాక్ష్యాలను మాయం చేయించే ప్రయత్నం చేస్తున్నారా?
శ్రీకాకుళం జిల్లాలోనూ ఇదేరకంగా అరాచకం చేస్తున్నారు. ఒక రోడ్డు ప్రమాదాన్ని రాజకీయ కక్షతో హత్య కేసుగా మార్చారు. మాజీ మంత్రి సీదిరి అప్పలరాజును అరెస్టు చేశారు. ఆయన కుటుంబాన్ని పరామర్శించేందుకు నేను వెళ్లినప్పుడు సంఘీభావంగా లక్షలాదిగా ప్రజలు తరలివచ్చారు. ఆ ప్రజాస్పందనను చూసి మీ ప్రభుత్వం భయపడింది. ఆ భయంతోనే ఒక వీడియో క్లిప్‌ను వక్రీకరించారు. చింతాడ రవికుమార్‌పై తీవ్రమైన సెక్షన్లతో కేసులు పెట్టారు. అనేకమంది నాయకులపై అక్రమ కేసులు నమోదు చేశారు. నాయకులు ప్రజల మధ్యకు వెళ్తే కేసులు. ప్రజలు నాయకులను కలిస్తే కేసులు. ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే కేసులు. ప్రతిపక్షానికి మద్దతు పలికితే కేసులు. ఇది ప్రజాస్వామ్యమా? లేక మీ పోలీసు రాజ్యమా? లేక జంగిల్ రాజ్యమా?
గుంటూరు ఈస్ట్ మాజీ ఎమ్మెల్యే షేక్ మొహ్మద్ ముస్తఫా, ఆయన కుమారుడిపైనా ఇదే రాజకీయ కక్షసాధింపు కొనసాగుతోంది. ఒక వ్యాపార వివాదంలో సంబంధిత వ్యక్తిని, లారీలను పోలీస్ స్టేషన్‌కు అప్పగించినప్పటికీ… తిరిగి ముస్తఫాపైనే కిడ్నాప్ కేసు పెట్టారు. పోలీసులకు అప్పగించిన వ్యక్తిని కిడ్నాప్ చేశారని కేసు పెట్టడం ఎక్కడి న్యాయం? కేవలం వైయస్సార్సీపీ నాయకుడని కేసు పెడతారా?
రాష్ట్రంలోని Gen-Z తరం ఇవాళ ప్రభుత్వాన్ని గట్టిగా ప్రశ్నిస్తూ పోరాటాలు చేస్తోంది. డీఎస్సీ–2025 అక్రమాలపై సీబీఐ విచారణ ఎందుకు జరపడం లేదు? అక్రమాలకు బాధ్యత వహిస్తూ విద్యాశాఖ మంత్రి లోకేష్ ఎందుకు రాజీనామా చేయడం లేదు? విద్యార్థులకు చెల్లించాల్సిన రూ.9,500 కోట్ల విద్యాదీవెన, వసతిదీవెన బకాయిలు ఎందుకు చెల్లించడం లేదు? నెలకు రూ.3 వేల నిరుద్యోగ భృతి ఇస్తామని చెప్పి ఎందుకు మోసం చేశారు? మూడేళ్లకు ఒక్కో నిరుద్యోగికి బకాయిపడ్డ రూ.1.08 లక్షలు ఎప్పుడు చెల్లిస్తారు? అని. కాని, ఈ ప్రశ్నలకు మీ దగ్గర మీ తనయుడు లోకేష్ దగ్గర సమాధానం లేదు. అందుకే ప్రజల దృష్టిని మళ్లించేందుకు అక్రమ కేసులు పెడుతున్నారు. అర్ధరాత్రి అరెస్టులు చేస్తున్నారు. పోలీసు దౌర్జన్యాలకు పాల్పడుతున్నారు.
చంద్రబాబుగారూ… గుర్తుపెట్టుకోండి. అధికారం శాశ్వతం కాదు. పోలీసు బలం శాశ్వతం కాదు. అక్రమ కేసులు శాశ్వతం కాదు. ఎన్ని కేసులు పెట్టినా… ఎన్ని అర్ధరాత్రి అరెస్టులు చేసినా… ఎన్ని తలుపులు బద్దలుకొట్టినా… ఎన్ని పోలీసు బలగాలను దించినా… వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ వెనక్కి తగ్గదు. బాధితులకు అండగా నిలుస్తాం. అన్యాయాన్ని నిలదీస్తాం. అరాచక పాలనపై పోరాడుతాం. మీరు అరెస్టులు చేయగలరేమో కానీ కార్యకర్తల గుండెల్లో ఉన్న ధైర్యాన్ని బద్దలుకొట్టలేరు. ప్రజల వేస్తున్న ప్రశ్నలనూ ఆపలేరు.
English Version- https://t.co/9f3rhT4DOo
A project built by one, but claimed by another, that’s the story of Bhogapuram Airport. The Work was done by YSRCP. The publicity belongs to Chandrababu!
"𝗖𝗿𝗲𝗱𝗶𝘁 𝗪𝗶𝘁𝗵𝗼𝘂𝘁 𝗖𝗼𝗻𝘁𝗿𝗶𝗯𝘂𝘁𝗶𝗼𝗻: 𝗧𝗵𝗮𝘁 𝗜𝘀 𝗖𝗵𝗮𝗻𝗱𝗿𝗮𝗯𝗮𝗯𝘂'𝘀 𝗕𝗿𝗮𝗻𝗱 𝗼𝗳 𝗣𝗼𝗹𝗶𝘁𝗶𝗰𝘀"
It is a matter of great happiness that the Bhogapuram Alluri Sitarama Raju International Airport, which is set to become another jewel in the crown of North Andhra, is ready for inauguration. There is no doubt that this airport will play a crucial role in the development of North Andhra.
The inauguration of the airport by the Hon'ble Prime Minister Shri @narendramodi Ji will bring international recognition to Bhogapuram. As a result, the airport will gain wider visibility across India and abroad, creating greater opportunities for business, commerce, and tourism.
However, at the very same time, @ncbn is making every possible attempt to steal the credit for the Bhogapuram Airport. Despite having made no contribution, he wants all the recognition for himself and is indulging in nothing short of credit theft.
Mr. Chandrababu, at least ask your own conscience what you have actually done for the Bhogapuram Airport. Apart from hurriedly laying a foundation stone just a month before the 2019 elections, despite having done nothing, what exactly did you contribute to this project?
From signing the concession agreement with GMR in June 2020 for the construction of the airport, to land acquisition, rehabilitation and resettlement (R&R), site clearance, obtaining NOCs, security clearances, water supply, power supply, internal roads, aeronautical services, and financial closure, every critical process was completed during our government's tenure. Can you deny that, Mr. Chandrababu?
Most importantly, we completed the land acquisition that you failed to complete. We provided rehabilitation to the displaced people from four villages. Our government spent Rs 967 crore on land acquisition and R&R, Rs 75 crore for bringing water to the airport, Rs 134.5 crore for infrastructure, Rs 7.29 crore for alternative roads, and Rs 2.35 crore for the substation, making a total investment of Rs 1,200 crore. So, what exactly did you do, Mr. Chandrababu?
It is because we completed all these works, secured every approval, obtained every NOC, and provided all the required infrastructure that, despite facing the unprecedented COVID pandemic, we were able to commence construction and take the runway works to a crucial stage by the time of the 2024 elections. The terminal construction was also progressing rapidly.
It was in recognition of our government's extensive efforts that we had announced that flight operations from Bhogapuram would commence by June 2026. We can proudly say that the airport is ready for inauguration today only because of the work carried out by our government.
But, Mr. Chandrababu, you did nothing then, and you are doing nothing now. Even today, there is no proper road connectivity for passengers to reach the airport quickly from Visakhapatnam city. The airport may be ready, but there is still no road that enables people to reach it from the city in a short time. At the time of the foundation stone laying for the Bhogapuram Airport, we strongly persuaded the Central Government to sanction a 55-km, six-lane highway, 77 metres wide, at a cost of Rs 6,300 crore, to provide fast connectivity from Visakhapatnam city to the airport. Union Minister @nitin_gadkari Ji himself announced the sanction of this road at the event, and he continues to hold the same portfolio even today. Mr. Chandrababu, your party is in power at the Centre, and you are also in power in the State. Yet, even after two years, there has been no progress on this road. Today, passengers travelling to Bhogapuram Airport are forced to undergo immense hardship. That reflects your sincerity, it was the same then, and it remains the same now.
Please stop claiming credit without doing the work, seeking recognition without putting in the effort, and appropriating the hard work of others. At nearly 80 years of age, it is time you gave up this habit.
Details attached - https://t.co/Tb1siVSfEE
#CreditChorBabu
Taking moral responsibility for the NEET paper leak, Union Education Minister Dharmendra Pradhan ji resigned, setting a benchmark for political accountability under the NDA Government.
We now ask the same question in Andhra Pradesh. Will Education Minister Nara Lokesh of the NDA Government in Andhra Pradesh accept moral responsibility for the serious irregularities surrounding the DSC examination process (which involved around 3.5 lakh aspirants) and resign from his post? Or will Chief Minister N. Chandrababu Naidu of the NDA Government shield his son instead of upholding the very standards of accountability that the NDA claims to believe in?
‘నీట్ ప్రశ్నపత్రం లీకేజీకి నైతిక బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేశారు. ఇది ఎన్డీఏ కూటమి ప్రభుత్వంలో నైతికత, బాధ్యతాయుతమైన జవాబుదారీతనానికి ప్రతీకగా నిలుస్తోంది’.
‘ఇప్పుడు ఇదే ప్రశ్నను మన ఆంధ్రప్రదేశ్‌లో కూడా అడుగుతున్నాం. దాదాపు 3.5 లక్షల మంది టీచర్ అభ్యర్థుల భవిష్యత్తును ఫణంగా పెడుతూ, డీఎస్సీ పరీక్ష నిర్వహణలో జరిగిన అంతులేని అక్రమాలకు నైతిక బాధ్యత వహిస్తూ, రాష్ట్రంలో అదే ఎన్డీఏ కూటమి ప్రభుత్వంలో విద్యా శాఖ మంత్రిగా ఉన్న @naralokesh తన పదవికి రాజీనామా చేస్తారా? లేక అదే ఎన్డీఏ ప్రభుత్వం గొప్పగా చెప్పుకునే ప్రమాణాలు, విలువలు, జవాబుదారీతనానికి పూర్తిగా పాతర వేస్తూ, సీఎం @ncbn తన కొడుకు పదవిని కాపాడుకుంటారా?
#NaraLokeshMustResign
BREAKING NEWS
రాష్ట్రానికి జగన్ అవరోధం కాదు రాయలసీమ రత్నం.
ఈ అంశంపై ప్రజల దగ్గర రెఫరెండానికి కూటమి సిద్ధమా.
మేము ఓడిపోతే రాష్ట్రంలో వైసీపీ పోటీ చేయదు.
- రాచమల్లు