తెలంగాణ సోదర సోదరీమణులారా,
కోట్లాది మంది ఆశల రూపమైన గులాబీ సైనికులారా, నిజాన్ని నిర్భయంగా చాటే మీడియా మిత్రులారా..
ఇవాళ తెలంగాణ గడ్డపై ఒక వికృతమైన రాజకీయ క్రీడ జరుగుతోంది. పద్నాలుగేళ్ల సుదీర్ఘ పోరాటంతో, ఢిల్లీ పీఠాన్ని గడగడలాడించి మన స్వరాష్ట్ర స్వప్నాన్ని సాకారం చేసిన నాయకుడు కేసీఆర్. ఒక తండ్రిలా ఈ రాష్ట్రాన్ని అక్కున చేర్చుకుని, పడావు పడ్డ తెలంగాణను ప్రగతి బాటలో నడిపించిన మహోన్నత శిల్పి కేసీఆర్. ఆయన ఎప్పుడూ బిరుదుల కోసం పాకులాడలేదు, సన్మానాల కోసం తపించలేదు. ఎందుకంటే, తెలంగాణ ప్రజల శ్రేయస్సు, సంక్షేమమే ఆయనకు నిజమైన సన్మానం, సత్కారం.
ఉద్యమ సారథిగా పద్నాలుగేళ్లు చారిత్రాత్మక పోరాటం చేసినా తొలి ముఖ్యమంత్రిగా తెలంగాణ పల్లె పల్లెను పచ్చగ చేసినా.. ఆయన గుండె చప్పుడు అనుక్షణం తెలంగాణనే !
కానీ, నేడు అధికారం చేతిలో ఉందనే అహంకారంతో, తన వైఫల్యాలను, తన ప్రభుత్వ అవినీతిని కప్పిపుచ్చుకోవడానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కేసీఆర్ మీద, ఆయన వ్యక్తిత్వం మీద విషం చిమ్ముతున్నాడు. ఇది కేవలం ఒక వ్యక్తి మీద దాడి కాదు.. తెలంగాణ పోరాట చరిత్ర మీద జరుగుతున్న దాడి!
రేవంత్ రెడ్డి 'తిట్ల ట్రాప్'లో పడకండి! మున్సిపల్ ఎన్నికల సందర్భంగా చర్చ జరగాల్సింది మన వార్డుల్లో మౌలిక వసతుల మీద, రోడ్ల మీద, డ్రైనేజీల మీద, ఇంటింటికీ అందాల్సిన పథకాల మీద. కానీ రేవంత్ రెడ్డి తెలివిగా తన బూతు పురాణంతో అసలు చర్చను పక్కదోవ పట్టిస్తున్నాడు. ఈ విషపు వలలో మనం పడకూడదు. మన చర్చ, మన నిలదీత కేవలం ప్రజల కన్నీటి మీదనే ఉండాలి.
ఒక్కటంటే ఒక్కటి కూడా పూర్తిగా అమలు కాని ఆరు గ్యారంటీల గురించి నిలదీయండి. ఆ నమ్మకద్రోహం మీద యుద్ధంలా చర్చను మార్చండి.
ఎరువుల కోసం క్యూ లైన్లలో పడరాని పాట్లు పడిన అన్నదాతల ఆవేదన గురించి, రైతు భరోసా అందక ప్రైవేట్ వడ్డీ వ్యాపారుల కోరల్లో చిక్కుకున్న రైతన్నల కష్టాల గురించి అడగండి.
ఫీజు రీయింబర్స్మెంట్ రాక చదువులు ఆగిపోతున్న బిడ్డల మానసిక ఘర్షణకు గురుకులాల్లో విషాహారం తిని అల్లాడిపోతున్న పసి ప్రాణాలకు బాధ్యత ఎవరిదని రేవంత్ రెడ్డిని గల్లా పట్టి అడగండి.
రిటైర్మెంట్ బెనిఫిట్స్ రాక ఆఫీసుల చుట్టూ తిరుగుతున్న వృద్ధుల మనోవేదనకు, డీఏలు లేక, పీఆర్సీ ఊసే లేక నలిగిపోతున్న ఉద్యోగుల ఘర్షణకు గొంతుకగా మీరు నిలవండి.
సింగరేణి బొగ్గు స్కామ్, విద్యుత్ కుంభకోణాల వెనుక ఉన్న అసలు దొంగలెవరో ఇంటింటికీ వెళ్లి వివరించండి.
మన తెలంగాణ నీటి వాటాను పక్క రాష్ట్రాలకు ధారాదత్తం చేస్తున్న రేవంత్ రెడ్డి అనే 'కోవర్టు' ద్రోహంపై నిప్పులు చెరగండి.
ప్రజల తీర్పే.. కేసీఆర్ కు ఇచ్చే అసలైన గౌరవం! పదేళ్ల ఉజ్వల ప్రగతి తర్వాత, ఈ రెండేళ్లలో తెలంగాణ అనుభవిస్తున్న ఈ దుర్గతికి కారణాలను ప్రజల ముందుకు తీసుకెళ్లండి.
రేవంత్ రెడ్డి గాలి మాటలకు, గాయిగత్తర బూతులకు కాలం చెల్లింది. సమస్యల నుంచి పారిపోవడానికి ఆ అసమర్థుడు వేస్తున్న పాచిపోయిన పాచికలను తిప్పికొట్టండి.
తెలంగాణ ప్రజల గుండెల్లో కేసీఆర్ ఒక ధ్రువతార. ఆయన కీర్తి, ఆయన స్ఫూర్తి నిరంతరం వెలుగులీనుతూ మనకు మార్గదర్శనం చేస్తూనే ఉంటుంది.
తెలంగాణ బిడ్డలారా.. చీకటి ఉన్నంత కాలం అబద్ధం ఆటలాడుతుంది.. కానీ సూర్యోదయం కాగానే తోకముడిచి పారిపోతుంది. తెలంగాణకు ఇది గ్రహణ కాలం. రేవంత్ అనే రాహువు తెలంగాణను కబళిస్తున్న కాలం. ఇప్పుడు రాష్ట్ర ప్రజలను రక్షించుకోవాల్సిన బాధ్యత మన భుజస్కంధాలపై ఉంది. రేవంత్ రెడ్డి అసమర్థ పాలనపై, ఆయన చేస్తున్న ద్రోహంపై ఈ మున్సిపల్ ఎన్నికల్లో ప్రశ్నలను పిడుగుల్లా కురిపిద్దాం.
మన దృష్టిని ప్రజల సమస్యల మీదనే ఉంచుదాం.. మనకు ప్రాణసమానమైన తెలంగాణను ప్రజాస్వామ్యాన్ని కంటికి రెప్పలా కాపాడుకుందాం.
జై తెలంగాణ! జై జై తెలంగాణ !! జై కేసీఆర్!
A man who didn’t cower under Delhi’s pressure, a man who didn’t for even a second stray away from the long battle for Telangana, a man who didn’t wince despite all the hardships for this state, a man who stood strongly against all evil forces. He will not be shaken by your cheap tactics today
KCR is invincible
Fools cannot understand history, let alone create it
You shiver at his name.
You have no stature to take his name.
You may spew poison today, but he is indestructible
He is the history of Telangana, and you wouldn’t even be a footnote
Jai KCR!
Jai Telangana ✊
రేవంత్ వస్తున్నాడు అని ఖమ్మంలో అరెస్టుల పర్వం..
ఖమ్మం రూరల్ మండలంలో బిఆర్ఎస్, సీపీఎం నేతలను తెల్లవారుజామున అరెస్టు చేసిన పోలీసులు..
రాష్ట్రంలో ఫరిడవిల్లుతున్న ప్రజాస్వామ్యం🤷
@KTRBRS@BRSparty@KonathamDileep@BRSHarish
రెండో దశ పంచాయతీ ఎన్నికల్లోనూ - అద్వితీయ ఫలితాలు సాధించిన గులాబీ శ్రేణులకు హృదయపూర్వక శుభాకాంక్షలు.
కాంగ్రెస్ మంత్రులు, ఎమ్మెల్యేల నియోజకవర్గాల్లోనూ సత్తాచాటిన బీఆర్ఎస్ పార్టీ నేతలు, కార్యకర్తలకు ప్రత్యేకంగా అభినందనలు.
అడ్డదారిలో గద్దెనెక్కిన కాంగ్రెస్ పార్టీకి రాష్ట్రంలో ఇక కాలం చెల్లిందని పల్లె ప్రజలు తమ ఓటు ద్వారా మరోసారి తేల్చిచెప్పారు.
ప్రభుత్వ పెద్దలు ప్రాతినిథ్యం వహించే నియోజకవర్గాల్లోనూ అధికార పార్టీ కోటలు బీటలు వారడం, రాష్ట్రంలో మారుతున్న రాజకీయ ముఖచిత్రానికి నిదర్శనం.
రేవంత్ రెండేళ్ల పరిపాలనా వైఫల్యాలకు తోడు, గ్యారెంటీల అమలులో చేసిన ఘోరమైన మోసాలే, కాంగ్రెస్ కు ఉరితాళ్లుగా మారి ఆ పార్టీని ప్రజాక్షేత్రంలో కూకటివేళ్లతో పెకిలిస్తున్నాయి.
పార్టీ గుర్తు లేని ఎన్నికల్లోనే అధికార పార్టీ దుస్థితి ఇలా ఉంటే, ఇక పార్టీ గుర్తుపై జరిగే స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ కు ఇంతకన్నా ఘోర పరాభవం తప్పదు.
అరాచక పాలనతో తెలంగాణ బతుకుచిత్రాన్ని ఛిద్రంచేస్తున్న రేవంత్ రెడ్డికి పంచాయతీ ఎన్నికల్లో వస్తున్న ఈ ఫలితాలు చెంపపెట్టులాంటివి.
నాడు బీఆర్ఎస్ హయాంలో జరిగిన పంచాయతీ ఎన్నికల్లో అధికార పక్షం ఏకపక్షంగా విజయం సాధిస్తే, నేడు కాంగ్రెస్ సగం పంచాయతీలను కూడా గెలవకపోవడం, పల్లె పల్లెనా అధికారపార్టీపై పెల్లుబుకుతున్న ప్రజాగ్రహానికి స్పష్టమైన సంకేతం.
కాంగ్రెస్ అంటే అభయహస్తం కాదు, రిక్త హస్తం అని రెండేళ్ల పాలనలోనే తేలిపోయిన నేపథ్యంలో ఇక సీఎం రేవంత్ అసమర్థ పాలనలో అసెంబ్లీ ఎన్నికల నాటికి అధికార పార్టీ అడ్రస్ గల్లంతు కావడం కాయం.
రెండేళ్లుగా కాంగ్రెస్ సర్కారు చేస్తున్న అరాచకాలు, మోసాలు, అవినీతి కుంభకోణాలపై అనునిత్యం బీఆర్ఎస్ సాగిస్తున్న సమరాన్ని గుండెల నిండా ఆశీర్వదిస్తున్న తెలంగాణ సమాజానికి శిరస్సు వంచి పాదాభివందనలు.
కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణను కాంగ్రెస్ కబందహస్తాల నుంచి విడిపించే ఈ పోరాటాన్ని తమ భుజాలపై మోస్తున్న గులాబీ సైనికులను పార్టీ కంటికి రెప్పలా కాపాడుకుంటుంది. కష్టకాలంలో బీఆర్ఎస్ వెన్నంటి నిలిచిన ప్రతిఒక్కరి ఉజ్వల రాజకీయ భవిష్యత్తుకు తప్పకుండా పార్టీ బంగారు బాటలు వేస్తుంది.
జై తెలంగాణ
రేపు నిరసన కార్యక్రమాలతో దద్దరిల్లనున్న తెలంగాణ
రాష్ట్రవ్యాప్తంగా రాస్తారోకోలు, ధర్నాలకు పిలుపు
తెలంగాణ తెచ్చిన కేసీఆర్ పై కాంగ్రెస్ చేస్తున్న కుట్రలకు భగ్గుమంటున్న తెలంగాణ సమాజం
@KTRBRS@BRSHarish@BRSparty@BRSParty_News
ఇది ఆరడుగుల బుల్లెట్టు 🔥🔥
సింహం సింగిల్ గానే వస్తుందన్నట్లు కాళేశ్వరంపై కాంగ్రెస్ తప్పుడు ప్రచారాన్ని అసెంబ్లీ సాక్షిగా ఆధారాలతో సహా తిప్పికొట్టిన మాజీ మంత్రి @BRSHarish