డీఎస్సీ–2025 నియామకాల్లో అక్రమాల వ్యవహారం రోజురోజుకూ మరింత బట్టబయలవుతోంది. రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి మరిన్ని కొత్త ఆధారాలు, వాస్తవాలు వెలుగులోకి వస్తున్నాయి. అవన్నీ డీఎస్సీలో తీవ్ర అక్రమాలను బయటపెడుతూ, @ncbn వెన్నుపోటు పార్టీ సమాధానం చెప్పాల్సిన అనేక ప్రశ్నలను లేవనెత్తుతున్నాయి.
ఆ ప్రశ్నలకు సమాధానం చెప్పి, నిజాలను నిగ్గు తేల్చేందుకు సీబీఐ విచారణకు అంగీకరించాల్సిన ప్రభుత్వం.. స్వతంత్ర దర్యాప్తును తిరస్కరిస్తోంది. మరోవైపు ప్రశ్నిస్తున్న గొంతులను అణచివేసే మార్గాన్ని వెన్నుపోటు పార్టీ ఎంచుకుంది. డీఎస్సీ నియామకాల అక్రమాలపై గొంతెత్తుతున్న ప్రతిపక్షంతో పాటు, కొన్ని మీడియా సంస్థలు, సామాజిక కార్యకర్తలు, వ్యక్తులకు సంబంధించిన సామాజిక పోస్టులు, ఖాతాలను మెటా సామాజిక మాధ్యమాలైన ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ లో నియంత్రిస్తున్నారు. ‘చట్టపరమైన ఆదేశాలు’ అంటూ వాటిని తొలగించడం లేదా జియోబ్లాక్ చేయడం జరుగుతోంది. ఆ ఆంక్షల బారిన పడిన ఖాతాలు, పేజీలు, ఫేస్బుక్లో సాక్షి టీవీ, ఇన్‌స్టాగ్రామ్‌లో సాక్షి డిజిటల్, బిగ్ టీవీ, జగనన్న కనెక్ట్స్‌తో పాటు, డీఎస్సీ స్కామ్‌పై ప్రశ్నిస్తున్న ఇతర వ్యక్తిగత హ్యాండిల్స్ కూడా ఉన్నాయి.
వెన్నుపోటు పార్టీ ప్రభుత్వం అనుసరిస్తున్న ఈ వ్యవహారం కేవలం డీఎస్సీ స్కామ్తోనే ఆగిపోవడం లేదు. వెన్నుపోటు పార్టీ ప్రభుత్వ అవినీతి, వైఫల్యాలు, అమలు కాని సూపర్ సిక్స్, సూపర్ సెవెన్ ఎన్నికల హామీలు, నిరంకుశత్వం, అధికార దుర్వినియోగంపై ప్రశ్నిస్తున్న ప్రతి ఒక్కరినీ లక్ష్యంగా చేసుకుంటున్నారు. ప్రశ్నలకు సమాధానం చెప్పలేక, ప్రశ్నించిన వారి గొంతు నొక్కేస్తున్నారు. ఇది పరిపాలన కాదు. నియంతృత్వ సెన్సార్షిప్!
వాక్ స్వాతంత్య్రం, భావ ప్రకటన స్వేచ్ఛ భారత రాజ్యాంగం కల్పించిన ప్రాథమిక హక్కులు. ప్రశ్నలు రాజకీయంగా ఇబ్బందికరంగా ఉన్నాయనే కారణంతో ప్రతిపక్షం, మీడియా, సామాజిక కార్యకర్తలు, పౌరుల గొంతు నొక్కే అధికారం ఏ ప్రభుత్వానికీ లేదు.
చంద్రబాబు గారూ.. మీరు భయపడుతున్నది ప్రశ్నలకా? లేక వాటి సమాధానాలకా? డీఎస్సీ నియామకాల్లో ప్రతిరోజూ కొత్తగా వెలుగు చూస్తున్న ఆధారాలు ఒకవేళ అవాస్తవమైతే.. ప్రజల ముందుకు వచ్చి వాస్తవాలతో వాటిని ఖండించండి. ఆ పని చేయడం లేదు. ఇంకా సీబీఐ విచారణను కూడా ఎందుకు తిరస్కరిస్తున్నారు? అక్రమాలను బయట పెడుతున్న వారి గొంతు ఎందుకు అణచివేస్తున్నారు? వారి పోస్టులు, ఖాతాలను ఎందుకు నియంత్రిస్తున్నారు? ఒక్క విషయం గుర్తుంచుకోండి. ఒక పోస్టును తొలగించినంత మాత్రాన ఆధారాలు చెరిగిపోవు. ఒక ఖాతాను బ్లాక్ చేసినంత మాత్రాన నిజాన్ని పాతిపెట్టలేరు. ప్రతిపక్షాన్ని రాజకీయంగా ఎదుర్కోండి. ప్రజలకు ప్రజాస్వామ్యబద్ధంగా సమాధానం చెప్పండి. రాజ్యాంగబద్ధంగా పాలించండి.
డీఎస్సీ పరీక్ష రాయకుండానే, ఉపాధ్యాయ అర్హత పరీక్ష–‘టెట్’లో ఉత్తీర్ణులు కాకుండానే కొందరికి ఉపాధ్యాయ ఉద్యోగాలు ఇచ్చి.. మిమ్మల్ని మీరు ఎలా సమర్థించుకుంటారు? డీఎస్సీలో స్పోర్ట్స్ కోటా భర్తీ కోసం కొత్తగా జీఓలు జారీ చేశారు. ఆ నియామకాలు పూర్తి చేయగానే, ఆ జీఓలు రద్దు చేశారు. అయినప్పటికీ ఆ జీఓల ద్వారా నియమితులైన అభ్యర్థులు ఉద్యోగాల్లో కొనసాగుతున్నారు. అంటే అక్రమ నియామకాలకు ముందు గేట్లు తెరిచి.. ఆ నియామకాలు పూర్తయ్యాక వాటిని మూసివేశారు. ఇదంతా అవినీతిని సూచించడం లేదా?
అందుకే నియంతృత్వ సెన్సార్‌షిప్‌లో భాగంగా నియంత్రించిన ప్రతి సామాజిక మాధ్య ఖాతాను, పోస్టును, కంటెంట్‌ను తక్షణమే పునరుద్ధరించాలని డిమాండ్ చేస్తున్నాను. అలాగే అందరూ లేవనెత్తుతున్న ప్రశ్నలన్నింటికీ స్పష్టమైన సమాధానాలు చెప్పాలి.
చంద్రబాబు గారికి, ఆయన ప్రభుత్వానికి నేను ఒక సవాల్ చేస్తున్నాను. డీఎస్సీ-2025 నియామకాలు నిజాయతీగా, పారదర్శకంగా జరిగాయని మీరు అనుకుంటే వెంటనే సీబీఐ విచారణకు ఆదేశించండి. స్వతంత్ర దర్యాప్తు ద్వారా నిజానిజాలు తేల్చండి. అలాగే డీఎస్సీ నియామకాల్లో అక్రమాలు జరిగినట్లు ఆధారాలతో సహా బయటపడుతున్నందున, వాటికి నైతిక బాధ్యత వహిస్తూ విద్యా శాఖ మంత్రి నారా లోకేష్ తన పదవికి రాజీనామా చేయాలి.
ఇంకా..
వెంటనే సామాజిక మాధ్యమాల ఖాతాలు పునరుద్ధరించండి.
వాటి సెన్సార్షిప్ను ఆపండి.
అన్ని ప్రశ్నలకు సమాధానం చెప్పండి.
సీబీఐ విచారణకు ఆదేశించండి.
అంతా పారదర్శకంగా జరిగినప్పుడు, దాచుకోవడానికి ఏమీ లేనప్పుడు మీకెందుకింక భయం?
Hello India!
The DSC 2025 recruitment scam is unravelling day by day, with fresh evidence and facts surfacing from different parts of the state, exposing serious irregularities and raising questions that the @ncbn -led TDP coalition government must answer. Instead of answering these questions and agreeing to a CBI inquiry to bring out the truth, the TDP coalition government is denying an independent probe and choosing to silence the voices raising these questions. Posts and accounts of Opposition parties, media platforms, social activists and individuals raising their voices against the DSC recruitment scam on Meta’s social media platforms, Facebook and Instagram, are being restricted, removed or geo-blocked, with Meta citing “legal requirements.” The accounts and pages affected by these restrictions include Sakshi TV on Facebook, Sakshi Digital on Instagram, BIG TV on Instagram, Jagananna Connects on Instagram and other individual handles raising these questions, among others. And it does not stop with the DSC scam. Anyone questioning the TDP coalition government over corruption, failures, broken Super Six and Super Seven election manifesto promises, high-handedness or abuse of power is being targeted. When you cannot answer the questions, you silence the questioners. This is not governance; this is censorship.
Freedom of speech and expression are fundamental rights guaranteed by the Constitution of India, and no government has the right to muzzle the Opposition, media, activists or citizens merely because their questions are politically inconvenient.
Chandrababu Naidu, what are you afraid of: the questions or the answers? If the evidence surfacing every day in the DSC recruitment is false, come before the people and disprove it with facts. Why are you denying a CBI inquiry? Why silence those exposing these alleged irregularities? Why restrict their posts and accounts? Deleting a post cannot delete evidence. Blocking an account cannot bury the truth. Face the Opposition politically, answer the people democratically and govern constitutionally.
How can you justify yourself when you had given teacher jobs without even having to write DSC exams!
How can you justify yourself when you had given teacher jobs without even passing TET (Teacher Eligibility Test)!
Issuing Sports quota GOs & post-recruitment cancelling those Sports quota GOs & yet candidates appointed under those GOs remain recruited, opening the gates and post-recruitment, shutting down the gates- all reeking of corruption!
I demand the immediate restoration of every account, post and piece of content restricted in this censorship drive and clear answers to these questions. I also challenge Chandrababu Naidu and his government: if you claim the DSC 2025 recruitment was clean and transparent, order a CBI investigation. Let an independent investigation establish the truth. Education Minister Nara Lokesh must take responsibility for the alleged irregularities and resign from his post.
Restore the accounts. Stop the censorship. Answer these questions. Order the CBI probe. If you have nothing to hide, what are you afraid of?
#MegaDSCScam
#SaveDemocracy
@AshwiniVaishnaw@GoI_MeitY@HMOIndia@Meta@MIB_India@facebook@instagram
.@ncbn గారూ, ఎక్కడ ఏ సమస్య వచ్చినా అనుకూలంగా మార్చుకుని దోచుకునే మార్గాలను వెతుక్కోవడం మీకు వెన్నతో పెట్టిన విద్య. లేని కొరత సృష్టించి వ్యాపారులకు సహకరిస్తూ మీరు లాభపడడం అలవాటుగా మారింది. విత్తనాలు, ఎరువులు, యూరియా మొదలు, వంట గ్యాస్ వరకు మన రాష్ట్రంలో అదే జరిగింది.
తాజాగా ఆ జాబితాలో పెట్రోల్, డీజిల్ చేరింది. కృత్రిమ కొరత సృష్టించి, దాని ద్వారా దోచుకునే పర్వానికి కూటమి నాయకులు సిద్ధమయ్యారు.
నిజానికి పొరుగున ఉన్న తమిళనాడు, కర్నాటక, తెలంగాణలో ఎక్కడా పెట్రోల్, డీజిల్ కొరత లేదు. సరఫరాలో సంక్షోభం లేదు.
కానీ, ఇక్కడ డీలర్లు, కూటమి నాయకులు కుమ్మక్కవడంతో పెట్రోల్, డీజిల్ కొరత ఏర్పడింది. అయిదు రాష్ట్రాల ఎన్నికలు పూర్తి కాగానే, ధరలు పెంచుతారని భావిస్తున్న డీలర్లు పెట్రోల్, డీజిల్ బ్లాక్ చేస్తున్నారు. వారితో కూటమి నాయకులు జత కట్టారు. అంతా కలిసి దోపిడీకి సిద్ధమయ్యారు.
అయినా నిజం ఒప్పుకోకుండా, సరఫరా మరింత తగ్గుతుందన్న భయంతో వాహనదారులు పెద్ద ఎత్తున పెట్రోల్, డీజిల్ కొనుగోలు చేస్తున్నందువల్ల డిమాండ్ పెరిగి, కొరత ఏర్పడిందని కుంటి సాకులు చెబుతున్నారు.
వాస్తవం ఏమిటన్నది మీక్కూడా తెలుసు. అందుకే పెట్రోల్, డీజిల్ సంక్షోభంపై సమగ్రమైన రివ్యూ కూడా చేయకుండా, కేవలం లీకులతో సరి పెడుతున్నారు.
రాష్ట్రంలో పెట్రోల్, డీజిల్ ఉద్దేశపూర్వక కొరత వల్ల అన్ని వర్గాల వారు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. దీంతో పరిస్థితులు దారుణంగా మారుతున్నాయి. ఈ కృత్రిమ కొరత రైతులను కూడా తీవ్ర నష్టాలకు గురి చేస్తోంది. ట్రాక్టర్లు, వ్యవసాయ యంత్రాలకు తగిన డీజిల్ అందక కార్యకలాపాలు నిల్చిపోతున్నాయి. రబీ పంటల కోత కాలంలో ఈ సంక్షోభం మరింత తీవ్రమైంది. కోత యంత్రాలకు రోజుకు సుమారు 100 నుంచి 160 లీటర్ల డీజిల్ అవసరం ఉండగా, సరఫరా లేకపోవడంతో యంత్రాలు పొలాల్లోనే నిలిచిపోతున్నాయి.
చేపలు మరియు రొయ్యల పెంపకంలో ఉపయోగించే ఏరిఏటర్లు కూడా డీజిల్‌పై ఆధారపడటంతో, ఆక్వా రైతులు కూడా ఇబ్బంది పడుతున్నారు.
ఇప్పటికైనా పరిస్థితిని చక్కదిద్దకపోతే ప్రజలు మీకు తగిన గుణపాఠం చెబుతారు.
@ncbn garu, whenever any issue arises anywhere, you have mastered the art of turning it to your advantage and finding ways to exploit it. Your modus operandi is , enable traders who created artificial shortages to profiteer, and there by generate economic gains for coalition leaders. From seeds, fertilizers, and urea to cooking gas, this pattern has been seen across our state.
Now, petrol and diesel have been added to that list. Coalition leaders are preparing for yet another round of exploitation by enabling creation of artificial shortage.
In reality, there is no shortage of petrol or diesel in neighboring states like Tamil Nadu, Karnataka, and Telangana. There is no supply crisis there.
However, here in our state, a shortage has been created due to collusion between dealers and coalition leaders. Anticipating a price hike after the completion of elections in five states, dealers are hoarding petrol and diesel. Coalition leaders have joined hands with them, and together they are preparing for large-scale profiteering.
Yet, instead of admitting the truth, they are offering weak excuses claiming that fear of further supply reduction has led vehicle owners to purchase fuel in large quantities, increasing demand and causing the shortage.
You are fully aware of the reality. That is precisely why, not even one proper review of the petrol and diesel crisis has been conducted, the issue is being managed merely through selective leaks.
Due to this artificial shortage, people from all sections of society are facing severe difficulties, and the situation is becoming increasingly grim. Farmers are among the worst affected. Due to the lack of adequate diesel, tractors and agricultural machinery are coming to a halt. During the crucial Rabi harvesting season, this crisis has become even more severe. Harvesting machines require approximately 100 to 160 liters of diesel per day, but due to lack of supply, they are lying idle in the fields.
Aquaculture farmers are also facing hardships, as aerators used in fish and shrimp farming depend on diesel.
Even now, if the situation is not corrected, people will teach you a fitting lesson.
సామాజిక న్యాయం, సమానత్వం, స్వేచ్ఛ కోసం శ్రమించిన రాజ్యాంగ రూపశిల్పి డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్. ఆయన ఆలోచనలు, విలువలు మన సమాజానికి మార్గదర్శకం. అంబేద్కర్ గారిని స్మరించుకోవడం అంటే ఆయన వారసత్వాన్ని ఆచరణలో పెట్టడం. ఆయన చూపిన బాటలో నడుస్తూ సమాన హక్కుల సమాజాన్ని నిర్మిద్దాం. దేశ ప్రజలకు అంబేద్కర్ జయంతి శుభాకాంక్షలు #AmbedkarJayanthi #JaiBhim
ఒక నాయకుడు చేసిన పాదయాత్ర రాష్ట్ర చరిత్రను తిరగరాయగలదని నిరూపించింది నాడు నాన్న చేపట్టిన పాదయాత్ర. నాకు బాగా గుర్తు ఏప్రిల్ 9, 2003లో ఎర్రటి ఎండలో ప్రజల కష్టాల్లో పాలుపంచుకునేందుకు నాన్న చేపట్టిన ఆ పాదయాత్ర రాష్ట్ర ప్రజల హృదయాల్లో ధైర్యం నింపింది. నేనున్నాననే భరోసా ఇచ్చింది. నాన్నకు రాష్ట్రం మొత్తం మద్దతుగా నిలిచి ముఖ్యమంత్రిని చేసింది. నాన్న సీఎం కాగానే ఉచిత విద్యుత్ ఫైల్‌పై తొలి సంతకం చేసిన దగ్గరి నుంచి ఆయన తీసుకు వచ్చిన ఎన్నో సంస్కరణలు, పథకాలు రాష్ట్ర రూపు రేఖలు మార్చేశాయి. రైతును రాజుగా నిలిపాయి. అక్కచెల్లెమ్మలు వారి సొంత కాళ్లపై నిలబడేలా చేశాయి. బడుగు, బలహీన వర్గాలకు బతుకుపై భరోసానిచ్చాయి. ఎంతో మంది పేద పిల్లలు డాక్టర్లుగా, ఇంజినీర్లుగా, కలెక్టర్లుగా అయ్యేలా చేశాయి. ఎన్నో సాగునీటి, తాగునీటి ప్రాజెక్టులు పూర్తి అయ్యాయి. ఆంధ్రుల జీవనాడి అయిన పోలవరం ప్రాజెక్టు పనులను పరుగులు పెట్టించారు. విద్య, వైద్యం, వ్యవసాయం, పారిశ్రామిక రంగాల్లో నాన్న వేసిన ఆ ముద్రను ఎవరూ చెరిపేయలేనిది. నాన్న చేపట్టిన పాదయాత్ర నేటికి 23 ఏళ్లు అయిన సందర్భాన్ని గుర్తు చేసుకుంటూ నా ఈ ప్రయాణం కొనసాగుతుంది.
Words uttered: “If tomorrow YS Jagan Mohan Reddy says that your wives are not your wives, they would blindly believe it and even go to the extent of treating their own wives as sisters and shamelessly look for marriage alliances; such are the spineless leaders in the YSR Congress Party!”
These words were uttered by Vemuri Radha Krishna on ABN Channel. Using such repulsive language and dragging women into political discourse is not criticism; it is a disgraceful and demeaning attack on women that raises serious questions about the kind of partisan journalism being practiced.
We strongly condemn these remarks and emphasize that such statements are a deliberate attempt to insult women and distort public discourse. The real issue is that, unable to counter the “MAVIGUN” proposal politically, Chandrababu Naidu and his aligned media have resorted to diversion, misinformation, propaganda, and abuse.
We held peaceful protests demanding strict action against Radha Krishna and his unconditional apology. Despite such offensive remarks, our cadre showed restraint and did not resort to violence, demonstrating our commitment to democratic values.
Instead of condemning this disgusting narrative, @ncbn, @naralokesh, and @PawanKalyan backed and amplified these remarks. This reflects their clear misogynistic attitude. We demand immediate action against Radha Krishna and strongly condemn these leaders for supporting such a toxic and outrageous utterances.
“ రేపు వైయస్ జగన్ మోహన్ రెడ్డి మీ భార్యలను మీ భార్యలు కాదని చెబితే, మీరు దాన్ని నమ్మి, మీ సొంత భార్యలను అక్కచెల్లెళ్లుగా భావించి మరీ పెళ్లి సంబంధాలు చూసే స్థాయికి దిగజారిపోతారు. అంతగా వెన్నెముకలేని నాయకులు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు!” అంటూ వేమూరి రాధాకృష్ణ ఏబీఎన్ ఆంధ్రజ్యోతి ఛానల్ లో వ్యాఖ్యానించారు.
మహిళలను ఉద్దేశించి ఇలాంటి అసహ్యకరమైన, దిగజారిన భాషను ఉపయోగించడం, వారిని రాజకీయ చర్చల్లోకి లాగడం విమర్శ కానే కాదు. ఆ వ్యాఖ్యలు మహిళలను అవమాన పరచడమే కాకుండా, వారిని కించపరిచేలా చేసిన దాడిగానే భావించాలి. ఎలాంటి వివక్ష పూరిత జర్నలిజం చేస్తున్నారన్నదానిపై ఈ వ్యాఖ్యలు తీవ్రమైన ప్రశ్నలను లేవనెత్తుతున్నాయి.
ఈ వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నాము. ఇవి మహిళలను అవమానించడానికే కాదు, ప్రజల్లో “MAVIGUN” ప్రతిపాదనపై జరుగుతున్న చర్చను దారి మళ్లించడానికి ఉద్దేశపూర్వకంగా చేసిన ప్రయత్నం. “MAVIGUN” ప్రతిపాదనను రాజకీయంగా ఎదుర్కోలేక, చంద్రబాబు, ఆయనకు అనుకూలంగా ఉన్న మీడియా ప్రజల దృష్టిని మళ్లించే ప్రయత్నం చేస్తోంది. దీంట్లో భాగంగా తప్పుడు ప్రచారాలు చేయడమే కాకుండా దూషణలకు కూడా దిగారు.
మేము శాంతియుతంగా నిరసనలు చేపట్టి, రాధాకృష్ణపై కఠిన చర్యలు తీసుకోవాలని, ఆయన క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశాము. ఇంత తీవ్రమైన వ్యాఖ్యలు చేసినప్పటికీ, మా నాయకులు, కార్యకర్తలు ఎక్కడా హింసకు పాల్పడకుండా, శాంతియుతంగా, ప్రజాస్వామ్య విలువలను కాపాడుతూ అత్యంత సంయమనంతో వ్యవహరించారు.
ఈ జుగుప్సాకర వ్యాఖ్యలను ఖండించకుండా, చంద్రబాబు, నారా లోకేష్, పవన్ కళ్యాణ్‌లు ఈ వ్యాఖ్యలకు మద్దతు ఇవ్వడం, మహిళల పట్ల వారికి ఉన్న అవమానకర ధోరణిని, ద్వేషభావాన్ని చూపిస్తోంది. రాధాకృష్ణపై తక్షణ చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నాము. బాధ్యతారహిత, విషపూరిత వ్యాఖ్యలను సమర్థించిన నాయకుల వైఖరిని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం.
పల్నాడు జిల్లా చర్లగుడిపాడులో టీడీపీ గూండాల చేతిలో ఎలా దారుణంగా వైయస్ఆర్ సీపీ కార్యకర్తలు, బీసీ సామాజిక వర్గానికి (పద్మశాలి) చెందిన కాకుమాను భావనా రిషి, భువనగిరి శ్రీనివాసరావులు హత్యకు గురయ్యారో వైయస్ జగన్ గారికి వివరించిన బాధిత కుటుంబ సభ్యులు
బాధితుల్ని పరామర్శించి.. అండగా ఉంటానని భరోసా ఇచ్చిన వైయస్ జగన్ గారు
#TDPAntiBC
2019 ముందు చంద్రబాబు తయారుచేసిన మాస్టర్ ప్లాన్ ను ఇప్పుడు ఎందుకు మారుస్తున్నట్టు? అమరావతి అతి గొప్ప రాజధాని అని ఊదరగొట్టిన చంద్రబాబు ఇప్పుడెందుకు మున్సిపాలిటీగా మిగిలిపోతుందని అంటున్నాడు. ఏ స్కాముల వల్ల నిర్మాణ వ్యయం అడుగుకు రూ.11,000 నుండీ రూ.14,000 కు ఎగబాకుతోంది?
-వైయస్ జగన్ గారు, వైయస్ఆర్ సీపీ అధ్యక్షులు
#YSJaganPressMeet
#SadistChandraBabu
#CBNFailedCM
#MosagaduBabu
మిస్టేక్ ఆఫ్ ఫాక్ట్ గా కొట్టివేయడాన్ని సవాల్ చేసిన ఆళ్ల రామకృష్ణారెడ్డి
న్యాయ చరిత్రలో ఇవాళ ఒక చీకటి రోజు.
ఐఏఎస్ 164 స్టేట్మెంట్లు ఏమయ్యాయి.
సీఐడీ ఛార్జిషీట్ ఏమైంది.
ప్రభుత్వం మారగానే నిందితులు నిజాయితీపరులైపోయారా.
-ఆళ్ల రామకృష్ణారెడ్డి
ఏడేళ్లు నువ్వు సీఎంగా ఉండి.. లక్ష ఎకరాల అమరావతిలో ఇప్పటి వరకు కట్టింది ఎంత చంద్రబాబూ?
ఏ దేశానికి పోతే.. ఆ దేశం బొమ్మలు చూపిస్తూ ఇదిగో అమరావతి ఇలా ఉంటుందని చెప్తావు. కానీ ఆచరణలో అవి కనిపించవు
కనీసం అమరావతి రైతులకు ఇచ్చిన హామీలనైనా నెరవేర్చావా చంద్రబాబూ?
-వైయస్ జగన్ గారు, వైయస్ఆర్సీపీ అధ్యక్షులు
#YSJaganPressMeet
#YSRCPForAll
#SadistChandraBabu
#CBNFailedCM
#MosagaduBabu
బెజవాడ దుర్గమ్మ ఆలయ హుండీ లో దొంగలు బంగారం కొట్టేస్తున్నారు..
అయ్యా పవన్ కళ్యాణ్ మీరు మెట్లు కడిగిన తర్వాత,కొత్త బోర్డ్ ఏర్పడ్డాక ఇలా జరగడం 4 వ సారి అంట సార్..
ఏం దోషం జరిగిందో ఏమో!!
అమ్మా దుర్గమ్మతల్లి మీ భక్తుల కానుకలు మీరే కాపాడుకోవాలి తల్లి..🙏
@PawanKalyan@JanaSenaParty
చంద్రబాబుకు చిత్తశుద్ధి లేదు.. నిజాయతీ అంతకంటే లేదు
బాబు దృష్టిలో పరిపాలన అంటే దోపిడీ, అవినీతి చేయడమే
విజన్.. సంపద సృష్టి అంటూ కొత్త పేర్లు పెట్టి స్కామ్‌ల ద్వారా దోపిడీకి పాల్పడుతుంటాడు
-వైయస్ జగన్ గారు, వైయస్ఆర్సీపీ అధ్యక్షులు
#YSJaganPressMeet#SadistChandraBabu
#CBNFailedCM
#MosagaduBabu