జనసేన ఆధ్వర్యంలో, తెలంగాణ రాష్ట్ర వీర మహిళలు హైదరాబాద్‌లోని ప్రసిద్ధ బల్కంపేట శ్రీ ఎల్లమ్మ అమ్మవారి దేవాలయంలో "జనసేన బోనాల జాతర” అమ్మవారికి బోనం సమర్పించే కార్యక్రమం ప్రారంభమైంది.
#Bonalu#JanaSenaTelangana
తెలంగాణ ప్రభుత్వం నిర్మించి ఇచ్చే ఉచిత ఇళ్ల కోసం దరఖాస్తు చేసుకుని ఏళ్లు గడుస్తున్న తమకు ఇళ్లు కేటాయించట్లేదని, ఇచ్చిన వారికే మళ్ళీ మళ్ళీ ఇల్లు ఇచ్చి మా లాంటి పేదవారికి అన్యాయం చేస్తున్నారని చేవెళ్ల మహిళలు ఆవేదన వెలిబుచ్చారు.
చేవెళ్లలో జరిగిన జనసేన కార్యకర్తల ఆత్మీయ సమావేశంలో స్థానిక మహిళలు తమ గోడు చెప్పుకున్నారు. జనసేన అండగా నిలబడి తమకు ఇళ్లు కేటాయించే విధంగా కృషి చేయాలని కోరారు.
#ChaloChevella #Chevella #JanaSenaTelangana
ఆక్రమణకు గురైన భారత భూభాగాన్ని తిరిగి స్వాధీనం చేసుకునేందుకు జరిగిన యుద్ధంలో 527 మంది జవాన్లు వీరమరణం పొందారు.
కష్టమైన పరిస్థితుల్లో కూడా మన జవాన్లు త్రివర్ణ పతాకాన్ని నిలబెట్టారు, కార్గిల్ యుద్ధం భారత సైన్యం యొక్క ధైర్యం, పట్టుదల, దేశభక్తికి ప్రతీక.
#KargilVijayDiwas
ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారు ఎప్పుడూ దేశ ప్రయోజనాలనే మొదటి ప్రాధాన్యతగా భావించి సున్నితమైన అంశాలలో రాజకీయాలకు అతీతంగా దేశ ప్రజల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని నిర్ణయాలు తీసుకోవడం అభినందనీయం.
పార్టీ ప్రయోజనాలు, నాయకుల ప్రయోజనాల కంటే దేశ ప్రయోజనాలు, దేశ ప్రజల శ్రేయస్సుకు మొదటి ప్రాధాన్యతనిచ్చే నాయకత్వం నరేంద్ర మోదీ గారిది అయితే...పదేళ్లు రాష్ట్రాన్ని, రాష్ట్ర ప్రజలను, విద్యార్థుల భవిష్యత్తును విస్మరించి సొంత పార్టీకి, పార్టీ నాయకులకు, బినామీలకు, కాంట్రాక్టర్ల ప్రయోజనాలకు ప్రాధాన్యతనిచ్చే నాయకత్వం బీఆర్ఎస్ ది.
ఇలాంటి నిర్ణయాలే అధికారంలో ఉన్న పదేళ్లలో బీఆర్ఎస్ తీసుకుని ఉంటే అందరూ స్వాగతించేవారు. కానీ బీఆర్ఎస్కు పార్టీ ప్రయోజనాలే ముఖ్యం, తమ తప్పులను సమర్థించడంతో పదేళ్ల కాలం గడిపేసి నేడు అపరిచితుల్లాగా, అసలు అధికారం చూడనట్టు మళ్ళీ ప్రజలముందుకు వచ్చారు.
మీకు నిజంగా విద్యార్థుల శ్రేయస్సు పట్ల చిత్తశుద్ధి ఉంటే మీ హయంలో విద్యార్థులకు జరిగిన అన్యాయాలపై, పేపర్ లీక్ వంటి ఘటనల్లో మోదీ గారి లాంటి నిర్ణయాన్ని మీరు కూడా తీసుకుని మీ హయాంలో జరిగిన లేకేజీలపై ఎంక్వైరీ చేయమనగలరా?
@BRSparty@KTRBRS
ఎర్రచందనం అక్రమ రవాణా ముఠాలకు సహకరిస్తే ఎవరినైనా ఉపేక్షించం
•అంతరాష్ట్ర స్మగ్లర్లకు సహకరించిన ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ పాత్రపై లోతుగా దర్యాప్తు
•ఎర్ర చందనం అక్రమ రవాణాని అరికట్టేందుకు మరింత కఠిన చర్యలు
• ’ఆపరేషన్ అరణ్య’పై ఎప్పటికప్పుడు సమీక్షిస్తా
•ఉప ముఖ్యమంత్రి శ్రీ @PawanKalyan గారు
ఎర్రచందనం అక్రమ రవాణా ముఠాలకు సహకరిస్తే ఎవరినీ ఉపేక్షించేది లేదని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రివర్యులు, అటవీ పర్యావరణ శాఖల మంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారు హెచ్చరించారు. ఎర్రచందనం స్మగ్లింగ్‌ను నిరోధించేందుకు మరింత కఠినమైన ప్రణాళికలు రూపొందిస్తున్నట్లు స్పష్టం చేశారు. ఆపరేషన్ అరణ్య ద్వారా ఎర్ర చందనం స్మగ్లింగ్ ను ఏ విధంగా అరికడుతున్నదీ ఎప్పటికప్పుడు సమీక్షిస్తానని తెలిపారు. శనివారం, కడప జిల్లా అవధూత కాశినాయన మండల పరిధిలోని వరికుంట్ల గ్రామ సమీపంలోని జ్యోతి గుడి వద్ద రూ.1.5 కోట్ల విలువైన 78 ఎర్రచందనం దుంగలను స్వాధీనం చేసుకున్న ఘటనపై ఎర్రచందనం అక్రమ రవాణా నిరోధక దళం అధికారులతో మాట్లాడారు. ఇద్దరు అంతర్రాష్ట్ర స్మగ్లర్లతోపాటు వారికి సహకరిస్తున్న ఫారెస్ట్ బీట్ ఆఫీసర్‌ను అరెస్టు చేసిన విషయాన్ని ఉప ముఖ్యమంత్రివర్యులకు అధికారులు తెలియచేశారు. ఈ ఘటన పూర్వాపరాలను వివరించారు.
శనివారం తెల్లవారుజామున ఎర్రచందనం అక్రమ రవాణా నిరోధక దళం, స్టేట్ ఇంటెలిజెన్స్ బృందానికి అందిన కచ్చితమైన సమాచారం ఆధారంగా వరికుంట్ల గ్రామ సమీపంలో వాహనాల తనిఖీలు చేపట్టామన్నారు. ఈ సందర్భంగా బొలెరో మ్యాక్స్ ట్రక్కులో ఇంటి సామగ్రి ముసుగులో ఎర్రచందనం దుంగలను అక్రమంగా తరలిస్తున్న హర్యానాకు చెందిన ఇద్దరిని అదుపులోకి తీసుకున్నట్లు అధికారులు తెలిపారు. వారి వద్ద నుంచి రూ.1.5 కోట్ల విలువైన 78 ఎర్రచందనం దుంగలు, వాహనాన్ని స్వాధీనం చేసుకుని, సన్నీ, రమేష్ అనే ఇద్దరిని అరెస్టు చేసినట్లు వివరించారు. విచారణలో జ్యోతి ఫారెస్ట్ బీట్‌లో బీట్ ఆఫీసర్‌గా పనిచేస్తున్న మల్లికార్జునుడు అక్రమ రవాణా ముఠాలకు సహకరిస్తున్నట్లు గుర్తించామని, వెంటనే అతడిని కూడా అరెస్టు చేసి విచారిస్తున్నట్టు వెల్లడించారు. బెంగళూరు, హర్యానా, కోల్‌కతా ప్రాంతాల్లో వీరికి సహకరిస్తున్న మరికొందరు ప్రధాన సూత్రధారులను గుర్తించినట్లు తెలిపారు. ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి ఆ ప్రధాన సూత్రధారులను పట్టుకోవాలని ఈ సందర్భంగా శ్రీ పవన్ కళ్యాణ్ గారు ఆదేశించారు. బీట్ ఆఫీసర్ పాత్రపై సమగ్ర విచారణ జరిపి నివేదిక సమర్పించాలన్నారు.
జనసేన పార్టీ తెలంగాణ రాష్ట్ర కార్యాలయంలో జనవాణి కార్యక్రమంలో ప్రజల సమస్యలు స్వీకరించిన జనసేన వీరమహిళలు పైబోయిన లలిత నాయుడు, అనుపమ కొల్లూరి.
#JanaVaaniJanaSenaBharosa#JanaSenaTelangana
తెలంగాణలో జనసేన బలోపేతంకై నడుం బిగిద్దాం!
• అధ్యక్షులు వారి ఆదేశమే మన కర్తవ్యం
• శ్రీ పవన్ కళ్యాణ్ గారికి తెలంగాణపై మక్కువ ఎక్కువ
వేలాదిమంది ‘సాధక్’లు, లక్షలాదిమంది ‘ఉద్యమి’లు పార్టీకి మూలస్థంబాలు
• చేవెళ్ల సమావేశంలో జనసేన ప్రధాన కార్యదర్శి శ్రీ తాళ్లూరి రామ్
జనసేన అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు ఆదేశం మన కర్తవ్యంగా తెలంగాణ రాష్ట్రంలో జనసేనను బలోపేతం చేసేందుకు నడుం బిగిద్దాం అని ప్రధాన కార్యదర్శి శ్రీ తాళ్లూరి రామ్ స్పష్టం చేశారు. చేవెళ్ల పార్లమెంట్ నియోజకవర్గం కార్యకర్తల ఆత్మీయ సమావేశం చేవెళ్ళలోని ఏ.ఎం.ఆర్. గార్డెన్ వేదికపై శనివారం జరిగింది. చేవెళ్ళ నాయకులు శ్రీ చిరాగ్ ప్రజీత్ గౌడ్, శ్రీమతి తనూజ రెడ్డి అధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శి శ్రీ తాళ్లూరి రామ్ ముఖ్యఅథిధిగా హాజరై మాట్లాడారు. తెలంగాణ రాష్ట్రం అంటే శ్రీ పవన్ కళ్యాణ్ గారికి చాలా ఇష్టమని, ఆయన చేసే ప్రతి సినిమాలో తెలంగాణ బావనను ఏదో ఒక రూపంలో ప్రదర్శిస్తారని అన్నారు. తెలంగాణ రాష్ట్రంలో అనేక సమస్యలపై స్పందించి, వాటి పరిష్కారం కోసం అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు కృషి చేసారని చెప్పారు. వేలాది మంది ‘సాధక్’లు, లక్షలాది మంది ‘ఉద్యమి’లు పార్టీకి మూలస్థంబాలు అని వెల్లడించారు. 2014 నుండి పార్టీ కోసం బలంగా పనిచేస్తోన్న కార్యకర్తలను వేదికపైకి పిలిచి సత్కరించారు. యువత రాజకీయాల్లోకి రావాలి, సామాన్యుల నాయకులుగా ఎదగాలని నాలుగేళ్ల క్రితం మొయినాబాదులో జరిగిన సభలో అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు చెప్పారు. ఆ రోజు ఆ సభలో పార్టీలో చేరిన చేవెళ్ల స్థానిక యువకుడు ప్రజీత్ గౌడ్ ఈ రోజు నాయకుడిగా ఎదిగారని, శ్రీ పవన్ కళ్యాణ్ గారి ఆలోచన ఈ రోజు రుజువైందని సంతోషం వ్యక్తం చేశారు. వీరమహిళగా పార్టీలో చేరిన తనూజా రెడ్డి అనేక సమస్యలపై అధ్యయనం చేస్తూ నాయకురాలిగా ఎదుగుతోందని అన్నారు. జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శిగా అవకాశం కల్పించిన శ్రీ పవన్ కళ్యాణ్ గారికి రుణపడి ఉంటానని తెలిపారు. జనసేన ప్రచార కార్యదర్శి శ్రీ సాగర్ ఆర్.కె. నాయుడు మాట్లాడుతూ.. అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు ఒక్కరిగా మొదలై కోట్లాదిమంది కార్యకర్తలను ఉత్తేజితులను చేసిన విధానం చాలాగొప్పదని, జనసేనకు సమస్య చెప్పుకుంటే పరిష్కారం జరుగుతుందని ప్రజలు ఆలోచిస్తున్నారని అన్నారు. 2014 నుండి జనసేన జెండాను భుజాన వేసుకుని మోస్తున్న కార్యకర్తలను ప్రత్యేకంగా అభిందించారు.
రాష్ట్ర నాయకులు మచ్చా సుధాకర్, ముమ్మారెడ్డి ప్రేమ్ కుమార్, దామోదర్ రెడ్డి, మేకల సతీష్ రెడ్డి, అల్లాడి తనీష్, మీసాల శ్రీనివాసరావు, గడల శ్రీనివాసరావు, పొన్నూరు శిరీష, మిరియాల రామకృష్ణ, సురేష్ రెడ్డి, ఫరీద్, విజయ్, గుడిబండ రవి, జాగీర్దర్ (కర్ణాటక), ప్రేమ్ గాంధీ, ప్రభావతి, ఆకుల శ్రీకాంత్, సంతోష్ నాయక్, మహేష్, గోపాలకృష్ణ, రాము యాదవ్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా అనేకమంది స్థానిక యువకులు జనసేన పార్టీలో చేరారు.
#ChaloChevella #Chevella #JanaSenaTelangana
తెలంగాణ ఆత్మను ప్రతిబింబించే మహోన్నత సాంస్కృతిక వేడుక ఆషాఢ మాసం బోనాల పండుగ మహోత్సవాలను పురస్కరించుకుని, జనసేన ఆధ్వర్యంలో, తెలంగాణ రాష్ట్ర వీర మహిళల పర్యవేక్షణలో రేపు (జూలై 26న) ఆదివారం హైదరాబాద్‌లోని ప్రసిద్ధ బల్కంపేట శ్రీ ఎల్లమ్మ అమ్మవారి దేవాలయంలో "జనసేన బోనాల జాతర” అమ్మవారికి బోనం సమర్పించే కార్యక్రమం నిర్వహించబడుతుంది.
#JanaSenaBonalu #Bonalu #JanaSenaTelangana
వెయ్యి ఎకరాల్లో డ్రోన్ల సాయంతో సీడ్ బాల్స్
•మనుషులు అడుగుపెట్టలేని ప్రాంతాల్లో క్షీణించిన అడవుల పునరుద్ధరణ దిశగా అడుగులు
•రాష్ట్రవ్యాప్తంగా 6,500 హెక్టార్ల విస్తీర్ణంలో మానవ వనరుల సాయంతో లక్షల విత్తన బంతులు వెదజల్లే పక్రియ పూర్తి
•30 వేల హెక్టార్ల లక్ష్యాన్ని నిర్ణీత కాల వ్యవధితో పూర్తి చేయాలన్న శ్రీ పవన్ కళ్యాణ్ గారు
•సీడ్ బాల్స్ వెదజల్లడంతోపాటు మొలకలకు రక్షణ కల్పించే బాధ్యత తీసుకోవాలి
•సీడ్ బాల్స్ పంపిణీ, వెదజల్లే కార్యక్రమంపై అటవీశాఖ అధికారులతో సమీక్షించిన ఉప ముఖ్యమంత్రివర్యులు శ్రీ @PawanKalyan గారు
వర్షపాతం, నేలలో తేమ వంటి వాతావరణ పరిస్థితులను ఎప్పటికప్పుడు పరిశీలన చేసుకుంటూ రాష్ట్రవ్యాప్తంగా సీడ్ బాల్స్ పంపిణీ కార్యక్రమాన్ని వేగవంతం చేయాలని రాష్ట్ర ఉపముఖ్యమంత్రివర్యులు, అటవీ పర్యావరణ శాఖల మంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారు స్పష్టం చేశారు. అడవులు క్షీణించిన ప్రాంతాల్లో సీడ్ బాల్స్ జారవిడిచే కార్యక్రమాన్ని వేగవంతం చేసేందుకు మరిన్ని డ్రోన్ల సహాయం తీసుకోవాలన్నారు. రాష్ట్రంలో అటవీ పునరుద్ధరణ, 50 శాతం గ్రీన్ కవర్ లక్ష్యాల్లో సీడ్ బాల్స్ పంపిణీ కార్యక్రమం అత్యంత కీలక ప్రక్రియ అని తెలిపారు. జిల్లాల వారీగా సీడ్ బాల్స్ పంపిణీ, వెదజల్లే కార్యక్రమం, డ్రోన్ సాంకేతికత వినియోగంపై అటవీశాఖ ఉన్నతాధికారులతో శనివారం మధ్యాహ్నం సమీక్షించారు. రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటి వరకు ఎన్ని ఎకరాల్లో సీడ్ బాల్స్ వెదజల్లే ప్రక్రియ పూర్తయ్యింది? డ్రోన్ల సాయంతో ఎంత విస్తీర్ణంలో సీడ్ బాల్స్ జారవిడిచారు? తదుపరి లక్ష్యాలు తదితర అంశాలను ఈ సందర్భంగా అధికారులు శ్రీ పవన్ కళ్యాణ్ గారికి వివరించారు.
ఉపముఖ్యమంత్రివర్యుల ఆదేశాల మేరకు రాష్ట్రవ్యాప్తంగా 3 కోట్లకు పైగా సీడ్ బాల్స్ సిద్ధం చేయగా, ఇప్పటి వరకు 63 లక్షలకు పైగా సీడ్ బాల్స్ దాదాపు 6,500 హెక్టార్ల విస్తీర్ణంలో వెదజల్లే ప్రక్రియ పూర్తి చేసినట్టు అధికారులు తెలిపారు. అందులో మానవ వనరుల సాయంతో సుమారు 6 వేల హెక్టార్ల పరిధిలో 59 లక్షల సీడ్ బాల్స్ వెదజల్లినట్టు, మొట్టమొదటి సారి డ్రోన్ల సాయంతో అడవుల్లో లోయ ప్రాంతాలకి వెళ్లి సీడ్ బాల్స్ జారవిడిచినట్టు వివరించారు. సుమారు వెయ్యి ఎకరాల్లో డ్రోన్స్ ద్వారా సీడ్ బాల్స్ జార విడిచినట్లు తెలిపారు.అత్యధికంగా రాజమహేంద్రవరం సర్కిల్ పరిధిలో దాదాపు 28 లక్షల సీడ్ బాల్స్ వెదజల్లగా, అందులో డ్రోన్ సాయంతో 2.26 లక్షలు జారవిడిచినట్టు అధికారులు చెప్పారు. విశాఖ అటవీ డివిజన్లో 7.50 లక్షలు, కర్నూలు అటవీ ప్రాంతంలో 8.67 లక్షల సీడ్ బాల్స్ పంపిణీ ప్రక్రియ పూర్తి చేసినట్టు వెల్లడించారు. ప్రస్తుతం వాతావరణ పరిస్థితుల ఆధారంగా చింతూరు, పీటీ ఆత్మకూరు, గిద్దలూరు, మార్కాపురం, వైఎస్ఆర్ కడప డివిజన్లలో డ్రోన్ల ద్వారా సీడ్ బాల్స్ జారవిడిచే కార్యక్రమాన్ని కొనసాగిస్తున్నట్టు, మానవ వనరులు చేరుకోవడం కష్టంగా ఉండే అటవీ ప్రాంతాలను డ్రోన్ ద్వారా చేరుకోవడం సులభం అవుతుందని చెప్పారు.
ఈ సందర్భంగా శ్రీ పవన్ కళ్యాణ్ గారు మాట్లాడుతూ “ఎల్ నినో వల్ల ఏర్పడిన వర్షాభావ పరిస్థితులు సీడ్ బాల్స్ వెదజల్లే ప్రక్రియకు కొంత మేర ఇబ్బందులు కలిగించవచ్చు. వర్షాలు కురుస్తున్న ప్రాంతాల్లో మాత్రం జాప్యానికి తావు లేకుండా సీడ్ బాల్స్ వెదజల్లే కార్యక్రమాన్ని కొనసాగించాలి. అవసరం అయితే డ్రోన్ల సంఖ్య పెంచే విధంగా చర్యలు తీసుకోండి. అటవీ ప్రాంతాల్లో పచ్చదనం తగ్గిన చోట కచ్చితంగా అడవి పునరుద్ధరణ మొదలవ్వాలి. మానవ వనరులతో సీడ్ బాల్స్ వెదజల్లిన ప్రాంతాల్లో మొలకలు వస్తే, వాటిని సంరక్షించడం కోసం తగిన చర్యలు తీసుకోవాలి. 50 శాతం గ్రీన్ కవర్ సాధించాలన్న కూటమి ప్రభుత్వ లక్ష్యాల్లో సీడ్ బాల్స్ వెదజల్లే కార్యక్రమం అత్యంత ప్రధానమైనది. ఈ కార్యక్రమ నిర్వహణలో ఎవరూ అలక్ష్యంగా ఉండవద్దు. సీడ్ బాల్స్ చల్లి సరిపుచ్చకుండా, వేడి తీవ్రత ఎక్కువగా ఉండే అవకాశం ఉన్న నేపథ్యంలో మొక్కల పరిరక్షణ బాధ్యతను కూడా స్వీకరించాల”న్నారు.
చేవెళ్ల పార్లమెంట్ నియోజకవర్గం కార్యకర్తల ఆత్మీయ సమావేశం చేవెళ్ళలోని ఏ.ఎం.ఆర్. గార్డెన్ వేదికపై ప్రారంభమైనది. జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శి శ్రీ తాళ్లూరి రామ్ గారు, రాష్ట్ర నాయకులు, కార్యకర్తలు, వందలాదిమంది వీర మహిళలు, జనసైనికులు హాజరయ్యారు.
#ChaloChevella#Chevella #JanaSenaTelangana
చేవెళ్ల ఏ.ఎం.ఆర్. గార్డెన్ వేదికపై జరుగుతున్న చేవెళ్ల పార్లమెంట్ నియోజకవర్గం కార్యకర్తల ఆత్మీయ సమావేశంలో పాల్గొనేందుకు ర్యాలీగా బయలుదేరిన జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శి శ్రీ తాళ్లూరి రామ్ గారు, రాష్ట్ర నాయకులు, కార్యకర్తలు. ఈ సందర్భంగా చేవెళ్ళలోని 400 ఏళ్ల నాటి శ్రీ లక్ష్మి వేంకటేశ్వర స్వామి దేవస్థానం క్షేత్రంలో ప్రత్యేక పూజలు చేశారు.
#ChaloChevella #Chevella #JanaSenaTelangana
1999 కార్గిల్ యుద్ధంలో రణరంగంలో శత్రువులను ముప్పుతిప్పలు పెట్టి, శత్రు మూకలను తరిమికొట్టి మాతృభూమి రక్షణ కోసం తమ ప్రాణాలను అర్పించిన వీర జవాన్ల బలిదానం అమరం, అజరామరం. వారి త్యాగాలను స్మరించుకుంటూ, ప్రతి క్షణం దేశభక్తితో ముందడుగు వేద్దాం.
#KargilVijayDiwas
ఆధ్యాత్మిక చైతన్యానికి, ప్రకృతి ఆరాధనకు ప్రతీక ‘తొలి ఏకాదశి’
తెలుగు సంవత్సరంలో పండుగలకు నాంది పలికే తొలి ఏకాదశి పర్వదినాన రాష్ట్ర ప్రజలందరికీ శుభాలు కలగాలని కోరుకుంటూ హృదయపూర్వక శుభాకాంక్షలు.
#TholiEkadashi#JanaSenaTelangana
23.07.26 తేదీన సబ్బవరం మండలం, ఇరువాడ జి.ఎస్ కన్వెన్షన్ హాల్లో సబ్బవరం మేజర్ పంచాయతీ, పైడివాడ, పైడివాడ అగ్రహారం మరియు ఆరిపాక పంచాయతీల నుండి సుమారు 500 మంది నాయకులు మరియు కార్యకర్తలకు కండువాలు కప్పి జనసేన పార్టీలోనికి సాధరంగా ఆహ్వానించడం జరిగింది@JanaSenaParty@JSPShatagniTeam#jsp
చిన్నంపల్లి లో రెపరెపలాడిన జనసేన జెండా..
కళ్యాణదుర్గం నియోజకవర్గ సెట్టూరు మండలం చిన్నంపల్లి గ్రామంలో అట్టహాసంగా వేడుకలు...
జెండా ఆవిష్కరణ మహోత్సవానికి ముఖ్యఅతిథిగా హాజరైన జనసేన అనంతపురము ఉమ్మడి జిల్లా అధ్యక్షులు, అహుడ చైర్మన్ శ్రీ @tc_varun గారు...
గ్రామీణ స్థాయిలో పార్టీ బలోపేతానికి ప్రత్యేక కార్యాచరణ...
కళ్యాణదుర్గం నియోజకవర్గంలో జనసేన మరింత బలపడాలి...
ఔత్సాహిక నాయకులకు భవిష్యత్తులో సువర్ణ అవకాశాలు...
అహుడ పరిధిలో 900 కు పైగా పంచాయతీ కార్యదర్శులతో కలిసి పని చేస్తున్నాం...
విశేష అభివృద్ధి కార్యక్రమాల ద్వారా ప్రజలకు మరింత చేరువవుతున్నాం...
@JanaSenaParty అధినేత @APDeputyCMO, శ్రీ @PawanKalyan గారి ఆశయ సాధనే జనసైనికులకు మార్గదర్శకం...
శ్రీ TC Varun గారి సమక్షంలో భారీ సంఖ్యలో జనసేన పార్టీలోకి చేరికలు...
కళ్యాణదుర్గం ఇన్చార్జ్ శ్రీ బాల్యం రాజేష్ గారి ఆధ్వర్యంలో...
జనసేన కండువాలు కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించిన శ్రీ టీ.సీ.వరుణ్ గారు...
జై జనసేన.. పవన్ కళ్యాణ్ నాయకత్వం వర్ధిల్లాలి నినాదాలతో మార్మోగిన చిన్నంపల్లి...
ఈ కార్యక్రమంలో నియోజకవర్గ ఇంచార్జ్ లు, వివిధ శాఖల డైరెక్టర్లు, జిల్లా మరియు నగర కమిటీ నాయకులు, మండలాల అధ్యక్షులు, వీరమహిళలు, నాయకులు, జనసైనికులు తదితరులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.
జనసేన పార్టీ సంస్థాగత నిర్మాణంలో భాగంగా రాష్ట్రవ్యాప్తంగా 36 వేలకు పైగా వచ్చిన దరఖాస్తుల పరిశీలన, కమిటీల ఎంపిక ప్రక్రియను ప్రారంభించిన పార్టీ అధ్యక్షులు, గౌరవ ఉప ముఖ్యమంత్రి శ్రీ @PawanKalyan గారు.
అధ్యక్షులవారి స్వీయ పర్యవేక్షణలో ఆగస్టు 15 నాటికి రాష్ట్ర వ్యాప్తంగా కమిటీల నియామకం పూర్తి స్థాయిలో జరగనుంది.
#JSPMembershipToLeadership