The overall buzz for #LENIN across Telangana appears to be quite limited. With just one day left before release, everything now hinges on the morning show word of mouth.
The only positive factor at the moment is the affordable ticket pricing, which could encourage walk-in audiences if the film opens with strong talk.
#AkhilAkkineni
చెరిగిపోని నీ చిరునవ్వు. ఈ ప్రపంచం ఉన్నంత కాలం సజీవంగానే ఉంటుంది PEDDAYYA 🛐
మీ 77 వ జయంతి నాడు మిమ్మల్ని స్మరించుకుంటూ.
JOHAR YSR 🥹🙇🏻♀️ 💔
WE LOVE FOREVER NEVER END ♥️
#LegendaryYSRJayanthi#YSRLivesON
భూమన కరుణాకర్ రెడ్డి కామెంట్స్..
ప్రైవేట్ వెబ్ సైట్లో తిరుమల టిటిడి గదులు బుకింగ్...
టిటిడి వసతి గదుల వ్యవహారంలో భారీ లోపాలు
అగోడ (Agoda) యాప్‌లో తిరుమల వసతి గదులు విక్రయానికి పెట్టారు
రూ.1,000 గదులను ఆన్లైన్లో రూ.18,000 వరకు విక్రయిస్తున్నారని వెల్లడి
ఆదిత్య బిర్లా, పాంచజన్యం, వకుళమాత గెస్ట్ హౌస్ గదులు ఆన్లైన్ లో ప్రత్యక్షం
అగోడ యాప్‌కు సంబంధించిన వీడియో ఆధారాలను విడుదల చేసిన భూమన
లోపాలను ఎత్తిచూపితే తమపైనే విమర్శలు చేస్తున్నారని ఆరోపణ
నకిలీ యాప్‌ల నియంత్రణపై టిటిడి ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని ప్రశ్న
గతంలో తాము 48 నకిలీ వెబ్సైట్లపై ఫిర్యాదు చేసి మూసివేయించామని గుర్తు చేసిన భూమన
రూ.1,000 గదిని రూ.18 వేల వరకు విక్రయిస్తున్నారన్న భూమన
అగోడ యాప్‌కు సంబంధించిన వీడియోలను విడుదల చేసిన భూమన
టిటిడి లోపాలు ఎత్తిచూపితే తమపై విమర్శలు చేస్తున్నారు
నకిలీ బుకింగ్‌లను గుర్తించడంలో విజిలెన్స్ విఫలమైంది
నవనీతమ్మ వ్యవహారంలో సీఎం, టిటిడి చైర్మన్ వ్యాఖ్యలను తప్పుబట్టిన భూమన
వృద్ధురాలికి దర్శనం కల్పించడం తప్పు కాదన్న భూమన
పాదయాత్ర చేయలేదని ఎలా నిర్ధారించారో చెప్పాలని ప్రశ్న
పూర్తి వివరాలు తెలుసుకోకుండా వ్యాఖ్యలు చేశారు...
నవనీతమ్మ పేరుతో రాజకీయ ప్రచారం చేస్తున్నారు
సీఎం, టిటిడి చైర్మన్ ప్రకటనల్లో భిన్న సమాచారం ఉందన్న భూమన
నవనీతమ్మ వ్యవహారంపై సీసీటీవీ ఫుటేజ్ విడుదల చేయాలని డిమాండ్
నకిలీ యాప్‌లతో భక్తులు మోసపోతున్నా చర్యలు లేవని ప్రశ్న
నకిలీ యాప్‌ల నియంత్రణపై టిటిడి దృష్టి పెట్టాలని సూచన
తమ హయాంలో 48 నకిలీ వెబ్సైట్లు మూసివేయించాం భూమన
మాట తప్పని... మడమ తిప్పని మహానేత వైఎస్ఆర్..!
రాజసానికి చిరునామా రాజన్న..
పేదవాడికి పెద్దన్న రాజన్న..
రైతన్నకు భరోసా రాజన్న..
ఉచిత విద్యుత్, పంట రుణమాఫీ, ఫీజు రీయింబర్స్మెంట్, ఆరోగ్యశ్రీ వంటి విప్లవాత్మక పథకాలను ప్రవేశపెట్టి లక్షలాది కుటుంబాల్లో వెలుగులు నింపిన మహోన్నత వ్యక్తి...
భౌతికంగా మన మధ్య లేకపోయినా, ఆయన సంక్షేమ పాలన ప్రతి పేదవాడి గుండెల్లో నేటికీ సజీవంగా ఉంది.
శ్రీ రాహుల్ గాంధీ గారిని ప్రధాన మంత్రిగా చేయాలన్న మీ కలను తప్పక సాకారం చేస్తాము రాజన్న.. అదే మీకు మేమందించే నిజమైన నివాళి!
ప్రజా సంక్షేమానికే జీవితాన్ని అంకితం చేసి, కాంగ్రెస్ పార్టీకి విశిష్ట సేవలందించి, కోట్లాది ప్రజల హృదయాల్లో చిరస్థాయిగా నిలిచిన మహానేత డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి జయంతి సందర్భంగా ఆ మహనీయుడికి ఘన నివాళులు.
జోహార్ వైఎస్ఆర్..!
#YSR #YSRJayanthi #JoharYSR
నమస్తే అక్కా, నమస్తే చెల్లి..." అంటూ తెలుగు ప్రజల గుండెల్లో చెరగని ముద్ర వేసిన మహానేత, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి డాక్టర్ వై.ఎస్. రాజశేఖర రెడ్డి గారి జయంతి సందర్భంగా ఆయనకు ఘన నివాళులు. 💐
రైతు పక్షపాతిగా వ్యవసాయానికి ఉచిత విద్యుత్, పేదల ప్రాణాలు నిలబెట్టిన 'ఆరోగ్యశ్రీ', నిరుపేద విద్యార్థుల జీవితాల్లో వెలుగులు నింపిన 'ఫీజు రీయింబర్స్ మెంట్', బీడు భూములకు ప్రాణం పోసిన 'జలయజ్ఞం'.. ఇలా ఆయన వేసిన ప్రతి అడుగు బడుగు, బలహీన వర్గాల అభ్యున్నతి కోసమే..
కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతాలకు కట్టుబడి, నిజమైన 'ఇందిరమ్మ రాజ్యాన్ని' పేదవాడి గడప వరకు చేర్చిన ఆయన పాలన మాకు ఎప్పటికీ స్ఫూర్తిదాయకం.
నాడు ఆయనతో కలిసి నడిచిన క్షణాలు, ఆయన వద్ద నేర్చుకున్న ప్రజాసేవా పాఠాలు నా రాజకీయ ప్రస్థానంలో ఎప్పటికీ మరువలేనివి. ఆ మహానేత ఆశయ సాధనకై మా ప్రభుత్వం నిరంతరం శ్రమిస్తూనే ఉంటుంది.
జోహార్ వైఎస్సార్..🙏
My heartfelt tributes to former Chief Minister of Andhra Pradesh, Dr. Y. S. Rajasekhara Reddy Garu, a staunch Congress stalwart, on his birth anniversary.
His pathbreaking welfare schemes and people-centric reforms continue to inspire us.
#YSR#AndhraPradesh
సంక్షేమ పాలనకు నిలువెత్తు రూపం
అభివృద్ధి పథకాల అమలులో చెరగని సంతకం
మాట తప్పని మనిషి, మడమ తిప్పని సాహసి
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి దివంగత నేత
డాక్టర్ వై.ఎస్. రాజశేఖర రెడ్డి గారి జయంతి సందర్భంగా ఆ మరపురాని మహానేతకు ఇవే మా ఘన నివాళులు 🙏
#YSRajasekharaReddyJayanti #YSRJayanti
Governor of Andhra Pradesh Sri S. Abdul Nazeer paid tributes to Dr. Y.S. Rajasekhara Reddy, former Chief Minister of United Andhra Pradesh, on his birth anniversary.
ఆరోగ్యశ్రీ… 108 అంబులెన్స్ సేవలు… ఫీజు రీయింబర్స్మెంట్… ఇందిరమ్మ ఇళ్లు… రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం… పీవీఎన్ఆర్ ఎక్స్‌ప్రెస్‌వే… ఔటర్ రింగు రోడ్డు.. రాజీవ్ రహదారి… ఇంకా ఎన్నో…
ఇవి కేవలం పథకాలు, అభివృద్ధి పనులు మాత్రమే కాదు… *డాక్టర్ వై.ఎస్. రాజశేఖర్ రెడ్డి గారి* దూరదృష్టికి, ప్రజా సంక్షేమ పాలనకు చిరస్మరణీయ చిహ్నాలు.
ఆయన జయంతి సందర్భంగా ఆ మహానేతకు నా ఘన నివాళులు. ఆయన ఆశయాలు, ప్రజాసేవా స్ఫూర్తి నిరంతరం స్ఫూర్తినిస్తూనే ఉంటాయి.
*దామోదర్ రాజనర్సింహ*
వైద్య ఆరోగ్య కుటుంబ సంక్షేమ మరియు శాస్త్ర సాంకేతిక శాఖల మంత్రి వర్యులు
తెలంగాణ ప్రభుత్వం
#YSRJayanti
ఎవరిని అడిగి చెప్పాలి పెద్దాయనా... నీ గురించి?
ఆగకుండా కొట్టుకుంటున్న పేదోడి గుండెను అడగాలా?
పెద్ద చదువులు చదివి, ఉన్నత శిఖరాలను అధిరోహించిన పేదోడి బిడ్డలను అడగాలా?
జలజలా పారే జలయజ్ఞం ప్రాజెక్టుల గేట్లను అడగాలా?
ఉచిత విద్యుత్‌తో పచ్చని పంటలకు ప్రాణం పోసిన రైతు పంపుసెట్లను అడగాలా?
కుయ్.. కుయ్.. అంటూ వేలాది ప్రాణాలను కాపాడిన 108, 104 అంబులెన్సుల సైరన్‌ను అడగాలా?
ఎవరిని అడగమంటావు పెద్దాయనా?
నీ గురించి తెలియని గుండె ఈ నేలపై ఉందా?
నిన్ను తన ఒడిలో శాశ్వతంగా దాచుకున్న నల్లమల అడవికే నీ గొప్పతనం తెలుసు పెద్దాయనా.
అందుకేనేమో...
తాను ఎప్పటికీ పచ్చగా ఉండాలంటే..
నువ్వు తన ఒడిలోనే ఉండాలని ప్రకృతి నిర్ణయించుకుంది.
అందుకే నిన్ను మనకు దూరం చేసి..
తనలో శాశ్వతంగా కలుపుకుంది.
పేదల కన్నీటి విలువ తెలిసిన నాయకుడివి..
ప్రతి నిరుపేద గుండెల్లో చిరంజీవిగా నిలిచిన మహానేతవు.
నీకు 'జయంతి' అని చెప్పడం కూడా నా మనసుకు నచ్చడం లేదు పెద్దాయనా..
నీ వంటి మహానేతకు నివాళి అర్పించడానికి 'జయంతి' అనే పదం చాలదు..
నీ కోసం ఒక కొత్త పదమే పుట్టాలి.
జోహార్ వైఎస్సార్.
#77thYSRJayanthi #YSRJayanthi #YSRLivesOn #YSRForever #YSRajasekharReddy #ChevireddyBhaskarReddy
ప్రజానేత, దివంగత మహానేత డా. వై.ఎస్. రాజశేఖర రెడ్డి గారికి జయంతి సందర్భంగా ఘన నివాళులు.
ప్రజల సంక్షేమమే పరమావధిగా భావించి, రైతులు, పేదలు, మహిళలు, విద్యార్థులు, ప్రతి వర్గం ప్రజల అభ్యున్నతికి ఎన్నో సంక్షేమ పథకాలను అమలు చేసి ప్రజల హృదయాల్లో చిరస్థాయిగా నిలిచిన మహానాయకులు.
రాజన్న జయంతి సందర్భంగా ఆ మహానేత డా. వై.ఎస్. రాజశేఖర్ రెడ్డి గారికి నా ఘన నివాళులు.
రాజకీయాన్ని అధికారంగా కాదు… ప్రజల జీవితాల్లో వెలుగులు నింపే బాధ్యతగా నిర్వచించిన నాయకుడు వైఎస్సార్. రైతులకు ఉచిత విద్యుత్, పేదలకు ఆరోగ్యశ్రీ, ఇందిరమ్మ ఇళ్లు, ఫీజు రీయింబర్స్మెంట్, పింఛన్లు, పావలా వడ్డీ, 108 అంబులెన్స్ సేవలు, జలయజ్ఞం వంటి ఎన్నో సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలతో కోట్లాది కుటుంబాల్లో ఆశను నింపిన మహోన్నత ప్రజానేత.
నాపై ఆయన చూపిన విశ్వాసం, ఉమ్మడి రాష్ట్రంలో ఐటీ మంత్రిగా పనిచేసే అవకాశం కల్పించడం, హైదరాబాద్ అభివృద్ధికి అందించిన దిశానిర్దేశం, నల్లగొండకు ముఖ్యంగా ఎస్ఎల్బీసీ వంటి కీలక ప్రాజెక్టుల పట్ల చూపిన చిత్తశుద్ధి నా ప్రజాసేవకు ఎప్పటికీ స్ఫూర్తి.
ప్రజలే కేంద్రబిందువుగా ఉండే పాలనే నిజమైన పరిపాలన అని తన జీవితంతో నిరూపించిన రాజన్న ఆశయాలను ముందుకు తీసుకెళ్లడం మనందరి బాధ్యత. రాజన్న చూపిన ప్రజాసంక్షేమ మార్గంలో నడుస్తూ రైతు, పేద, బడుగు, బలహీన వర్గాల అభ్యున్నతికే నా కర్తవ్యాన్ని అంకితం చేస్తూ.. నిబద్ధత గల నేత శ్రీ @RahulGandhi గారు దేశ ప్రధానిగా దేశానికి సేవలందించాలని రాజన్న ఆకాంక్షించిన విలువలు, ఆశయాల సాధన కోసం నిరంతరం కృషి చేస్తూనే ఉంటాను..
రాజన్న ఆశయాలు చిరస్థాయి… ఆయన స్ఫూర్తి శాశ్వతం.
జోహార్ వైఎస్సార్….
#Ysr
@INCIndia
On his birth anniversary, we fondly remember and pay our tributes to Former Andhra Pradesh Chief Minister Y. S. Rajasekhara Reddy.
A visionary and compassionate leader, he dedicated his life to the welfare and progress of the people of Andhra Pradesh. His unbridled commitment to farmers, the poor, and the marginalised, along with his immense dedication to the Congress party, remains an enduring legacy.
కొంతమంది నాయకులు అధికారాన్ని గెలుస్తారు…
కానీ మీరు ప్రజల హృదయాలను గెలిచారు.
అందుకే మీ జయంతి ఒక తేదీ కాదు… కోట్లాది మంది మనసుల్లో ఒక భావోద్వేగం.
#77thYSRJayanthi#FarmersDay