ఆంధ్రప్రదేశ్‌లో సామాన్యుడి జీవితం అంటే రోజురోజుకూ పెరుగుతున్న ఖర్చులతో పోరాటం!
⛽ పెట్రోల్ ధర ₹117.61
🔥 గ్యాస్ సిలిండర్ ₹966.50
🍚 బియ్యం ధరలపై ప్రభుత్వం గరిష్ఠ ధరల నియంత్రణ విధించాల్సిన పరిస్థితి.
🛒 పప్పులు, నూనెలు, కూరగాయల ధరలపై నిరంతర పర్యవేక్షణ అవసరం.
ప్రజలకు కావాల్సింది హామీలు మాత్రమే కాదు… అందుబాటులో ఉండే నిత్యావసర వస్తువులు, సరసమైన ధరలు!
ప్రభుత్వం ప్రజలపై పడుతున్న ఆర్థిక భారాన్ని తగ్గించేందుకు మరింత బాధ్యతగా వ్యవహరించాలి.
#AndhraPradesh #CostOfLiving #PublicIssues
2029లో కూటమి ప్రభుత్వం ఉంటుందని అనుకోవడం లేదు!
పవన్ కళ్యాణ్‌పై పర్యావరణవేత్త బొలిశెట్టి సత్యనారాయణ ఫైర్!
రుషికొండ విషయంలో నాడు గళమెత్తిన పవన్.. నేడు విశాఖలో పదికిపైగా కొండలు ధ్వంసమవుతుంటే ఎందుకు మౌనం?
రుషికొండకు ఒక న్యాయం.. సింహాచలం కొండలకు మరో న్యాయమా?
సింహాచలం కొండలపై జరుగుతున్న విధ్వంసంపై పవన్ కళ్యాణ్ ఎందుకు స్పందించడం లేదు?
గన్నవరం నియోజకవర్గంలో మండలాలు, గ్రామాల వారీగా గెలుపు, మెజారిటీల లెక్క ఇది!
ఈ లెక్కలు చూసుకుని టీడీపీకి నియోజకవర్గం మొత్తం మీద 21,000 పైగా మెజారిటీ ఉంది అనుకుని సంబర పడుతున్నారు!! కానీ కొన్ని పాయింట్లు అంగీకరించాలి!
* గన్నవరం, బాపులపాడు మండలాలు ఒకప్పుడు టీడీపీకి స్ట్రాంగ్ ఓటింగ్ ఉన్న ప్రాంతాలు ఎందుకు పోతున్నాయి..!?
* ఒకవేళ నియోజకవర్గాల పునర్విభజనలో విజయవాడ రూరల్ సెపరేట్ అయితే, గన్నవరం సీటు టీడీపీ వదులుకోవాల్సిందేనా..!?
* జెడ్పీటీసీ ఓడిపోయాక బీజేపీ సింబల్ మైనస్, అభ్యర్థి మైనస్ అన్నారు.. ఇప్పుడు సర్పంచిలు కూడా ఇంతగా పోవడం ఎవరి మైనస్..!?
ఓవరాల్ గా నాకు తెలిసింది ఏమిటంటే.. అక్కడ టీడీపీ నాయకత్వం బాగుంది, కార్యకర్తలు బలంగా ఉన్నారు. కానీ వారిని సమర్ధవంతంగా వినియోగించుకోవడం, సమన్వయం చేయడంలో ఎమ్మెల్యే గారు ఫెయిల్ అవుతున్నారు..
ఎమ్మెల్యే గారు వ్యక్తిగతంగా మంచి వ్యక్తి.. ఖర్చుకి వెనుకాడరు.., అభివృద్ధి బాగానే చేస్తున్నారు..!కానీ......
ఎమ్మెల్యే గారి ఏకపక్ష వైఖరి.., ఎవరు చెప్పినా వినకపోవడం.., తాను అనుకుంటే తప్ప ఎవరికీ దొరకపోవడం.., అవసరంలో కూడా ఎవరి కాల్స్ ఆన్సర్ చేయకపోవడం.., అవసరం లేని మొండితనం.., డబ్బు ఖర్చు గురించి పదే పదే మాట్లాడడం.., క్యాడర్ మేనేజ్మెంట్ సరిగా లేకపోవడం.., మీడియా కమ్యూనికేషన్ వ్యవస్థ లేకపోవడం.., పబ్లిక్ రిలేషన్స్ అంతంతగానే ఉండడం.., కొందరితో మాత్రమే మాట్లాడి అంతా తెలుసు అనుకోవడం.., మొదటిసారి మాత్రమే గెలిచి 20 ఏళ్ల సీనియర్ అన్నట్టు వ్యవహరించడం.. ఇలా చిన్న చిన్నవే కానీ పెద్ద ప్రతికూలతలు ఉన్నాయి!! అందుకే ఇలాగే పరిస్థితి కొనసాగితే ఈ సీటు వైసీపీ జేబులోకి చేరడం ఖాయం...!!!👍
అదనంగా 88 అసెంబ్లీ స్థానాలు
నియోజకవర్గాల పునర్విభజన బిల్లుకు కేంద్ర కేబినెట్ ఆమోదం
175 నుంచి 263కు ఏపీ అసెంబ్లీ స్థానాలు
25 నుంచి 37 లేదా 38కి లోక్‌సభ సీట్లు
మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు.. పెరగనున్న ఎస్సీ, ఎస్టీ స్థానాలు
26 నుంచి 39కి చేరనున్న మంత్రివర్గ కోటా
దేశంలో 543 నుంచి 850కు పెరగనున్న లోక్‌సభ స్థానాలు
ఇందులో 270 స్థానాలు మహిళలకు రిజర్వేషన్
ఒక్కో శాసనసభ స్థానం పరిధిలో సగటు ఓటర్ల సంఖ్య 1.60 లక్షలు
రాష్ట్రాల్లో నియోజకవర్గాల పునర్విభజనకు 2011 జనాభా లెక్కలే ప్రాతిపదిక
1/2
నిహారిక కొణిదెలకి రాడిసన్ కేసుతో సంబంధం ఉందా?
రాడిసన్ హోటల్‌కు సంబంధించిన డ్రగ్స్ కేసులో యోగానంద్ కుమారుడి పేరు ప్రస్తావనకు వచ్చిన నేపథ్యంలో సోషల్ మీడియాలో చర్చ మొదలైంది. ఈ క్రమంలో నిహారిక కొణిదెల పేరును కూడా ప్రస్తావిస్తూ కొందరు నెటిజన్లు పోస్టులు చేస్తున్నారు. #radissondrugcase
షర్మిల ఇంట వివాహ వేడుకకు ముఖం చాటేసిన నలుగురు సీఎంలు
కనీసం షర్మిల సొంత పార్టీ కాంగ్రెస్ సీఎంలు కూడా హాజరుకాకపోవడంపై సోషల్ మీడియాలో విస్తృత చర్చ
డామేజ్ కంట్రోల్‌పై దృష్టి సారించిన షర్మిల
పెళ్లి పూర్తయిన తరువాత షర్మిల కుటుంబాన్ని కలిసిన కర్ణాటక సీఎం డీకే శివ కుమార్.. నెట్టింట మళ్లీ చర్చ
🚨 డీలిమిటేషన్ అంటే ఏమిటి? ఇప్పుడు ఎందుకు తెరపైకి వచ్చింది?
◆ జనాభాకు అనుగుణంగా రాజకీయ ప్రాతినిధ్యం కల్పించడమే డీలిమిటేషన్ ఉద్దేశం
◆ దేశవ్యాప్తంగా ఇప్పటివరకు నాలుగుసార్లు డీలిమిటేషన్ కమిషన్ల ఏర్పాటు
◆ 1976లో సీట్ల పునఃకేటాయింపును నిలిపివేసిన ఇందిరాగాంధీ ప్రభుత్వం
◆ 2001లో మరో 25 ఏళ్లు పొడిగించిన వాజ్‌పేయి ప్రభుత్వం
◆ కొత్త జనగణన కోసం వేచి చూడకుండా డీలిమిటేషన్‌కు కేంద్రం ప్రతిపాదన
◆ దక్షిణాది రాష్ట్రాల రాజకీయ ప్రాతినిధ్యంపై ప్రధానంగా చర్చ
జనాభాలో వచ్చిన మార్పులకు అనుగుణంగా లోక్‌సభ, అసెంబ్లీ నియోజకవర్గాల సంఖ్యను, వాటి సరిహద్దులను పునర్నిర్ణయించే ప్రక్రియను డీలిమిటేషన్ అంటారు. ప్రజలకు దాదాపు సమానమైన రాజకీయ ప్రాతినిధ్యం కల్పించడం దీని ప్రధాన ఉద్దేశం. రాజ్యాంగంలోని ఆర్టికల్ 81, 82, 170 అధికరణలు నియోజకవర్గాల కేటాయింపు, పునర్విభజనకు సంబంధించిన నిబంధనలను నిర్దేశిస్తున్నాయి.
🔷 దేశంలో నాలుగుసార్లు డీలిమిటేషన్ కమిషన్లు
▪️ స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత దేశవ్యాప్తంగా 1952, 1963, 1973, 2002 సంవత్సరాల్లో నాలుగుసార్లు డీలిమిటేషన్ కమిషన్లను ఏర్పాటు చేశారు. 1951, 1961, 1971 జనగణనల ఆధారంగా జరిగిన పునర్విభజనల్లో నియోజకవర్గాల సరిహద్దులతోపాటు లోక్‌సభ స్థానాల సంఖ్యలోనూ మార్పులు జరిగాయి. 1971 జనగణన తర్వాత దేశవ్యాప్తంగా రాష్ట్రాలవారీగా లోక్‌సభ స్థానాల విస్తృత పునఃకేటాయింపు జరగలేదు.
🔷 1976లో డీలిమిటేషన్‌పై పరిమితి ఎందుకు?
▪️ జనాభా నియంత్రణలో మెరుగైన ఫలితాలు సాధించిన రాష్ట్రాలు రాజకీయంగా నష్టపోకుండా ఉండేందుకు 1976లో ఇందిరాగాంధీ ప్రభుత్వం 42వ రాజ్యాంగ సవరణ తీసుకొచ్చింది. 2000 సంవత్సరం తర్వాత జరిగే తొలి జనగణన వరకు రాష్ట్రాలవారీగా లోక్‌సభ స్థానాల పునఃకేటాయింపును నిలిపివేసింది. జనాభా నియంత్రణ పాటించిన రాష్ట్రాలకు రాజకీయ ప్రాతినిధ్యం తగ్గకుండా చూడటం దీని ప్రధాన ఉద్దేశం.
🔷 మరో 25 ఏళ్లు పొడిగించిన వాజ్‌పేయి ప్రభుత్వం
▪️ 2001లో అటల్ బిహారీ వాజ్‌పేయి ప్రభుత్వం 84వ రాజ్యాంగ సవరణ ద్వారా ఈ పరిమితిని మరో 25 ఏళ్లు పొడిగించింది. 2026 తర్వాత జరిగే తొలి జనగణన గణాంకాలు ప్రచురించే వరకు సీట్ల పునఃకేటాయింపు అవసరం లేదన్న నిబంధనను తీసుకొచ్చింది.
▪️ 2002లో డీలిమిటేషన్ కమిషన్‌ను ఏర్పాటు చేసినప్పటికీ, రాష్ట్రాలవారీగా లోక్‌సభ, అసెంబ్లీ స్థానాల సంఖ్యను మార్చలేదు. 2003లో చేసిన 87వ రాజ్యాంగ సవరణకు అనుగుణంగా 2001 జనగణన ఆధారంగా నియోజకవర్గాల సరిహద్దులను, ఎస్సీ, ఎస్టీ రిజర్వేషన్లను మార్చారు. 2008లో ఈ ప్రక్రియ పూర్తయింది. 2009 సార్వత్రిక ఎన్నికలు కొత్త నియోజకవర్గాల ఆధారంగా జరిగాయి.
🔷 కరోనా వల్ల డీలిమిటేషన్ వాయిదా పడిందా?
▪️ 2011లో దేశవ్యాప్తంగా చివరిసారిగా జనగణన జరిగింది. 2021లో జరగాల్సిన జనగణన కరోనా కారణంగా వాయిదా పడింది. అయితే డీలిమిటేషన్‌పై రాజ్యాంగపరమైన పరిమితికి కరోనా కారణం కాదు. కరోనా రాకుండా 2021లో జనగణన జరిగి ఉన్నప్పటికీ రాష్ట్రాలవారీగా సీట్ల పునఃకేటాయింపు తప్పనిసరి అయ్యేది కాదు. 2026 తర్వాత జరిగే తొలి జనగణన ఆధారంగా పునర్విభజన చేయాలన్న నిబంధన 2001లోనే రాజ్యాంగంలో పొందుపరిచారు.
🔶 ఇప్పుడు కేంద్రం తీసుకొస్తున్న డీలిమిటేషన్ ఏమిటి?
▪️ ప్రస్తుత రాజ్యాంగ నిబంధనల ప్రకారం 2027 జనగణన గణాంకాలు ప్రచురించిన తర్వాత డీలిమిటేషన్ చేపట్టాలి. అయితే కొత్త జనగణన గణాంకాల కోసం వేచి చూడకుండా 2011 జనాభా లెక్కల ఆధారంగా డీలిమిటేషన్ చేపట్టేందుకు కేంద్రం గత ఏప్రిల్‌లో రాజ్యాంగ సవరణ బిల్లును తీసుకొచ్చింది.
▪️ ప్రస్తుతం 543 లోక్‌సభ స్థానాలు ఉండగా, రాజ్యాంగపరమైన గరిష్ఠ పరిమితిని 850కి పెంచాలని ప్రతిపాదించింది. ఇందుకోసం 131వ రాజ్యాంగ సవరణ బిల్లు, డీలిమిటేషన్ బిల్లు, కేంద్రపాలిత ప్రాంతాల చట్టాల సవరణ బిల్లును ప్రవేశపెట్టింది.
🔶 మహిళా రిజర్వేషన్లతో ముడిపడిన డీలిమిటేషన్
▪️ 2023లో 106వ రాజ్యాంగ సవరణ ద్వారా లోక్‌సభ, అసెంబ్లీల్లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు కల్పించారు. అయితే కొత్త జనగణన గణాంకాల ప్రచురణ, డీలిమిటేషన్ తర్వాతే ఈ రిజర్వేషన్లు అమల్లోకి వచ్చేలా నిబంధన పెట్టారు.
▪️ 2029 సార్వత్రిక ఎన్నికలకు ముందే మహిళా రిజర్వేషన్లను అమలు చేయాలన్నది కేంద్రం ప్రకటించిన లక్ష్యం. దీనికోసం కొత్త జనగణన పూర్తయ్యే వరకు వేచి ఉండకుండా డీలిమిటేషన్ చేపట్టేందుకు రాజ్యాంగ సవరణను ప్రతిపాదించింది. ప్రస్తుత నియోజకవర్గాల సంఖ్య ఆధారంగానే మహిళా రిజర్వేషన్లు అమలు చేసేందుకు రాజ్యాంగ సవరణ చేయవచ్చన్నది ప్రతిపక్షాల వాదన.
🔶 దక్షిణాది రాష్ట్రాల ఆందోళన ఎందుకు?
▪️ జనాభా నియంత్రణలో దక్షిణాది రాష్ట్రాలు మెరుగైన ఫలితాలను సాధించాయి. మరోవైపు ఉత్తరాదిలోని పలు రాష్ట్రాల్లో జనాభా గణనీయంగా పెరిగింది. తాజా జనాభా ప్రాతిపదికన లోక్‌సభ స్థానాలను పునఃకేటాయిస్తే దక్షిణాది రాష్ట్రాల రాజకీయ ప్రాతినిధ్య నిష్పత్తి తగ్గే అవకాశం ఉంది.
▪️ ప్రస్తుతం దేశంలోని 543 లోక్‌సభ స్థానాల్లో ఆంధ్రప్రదేశ్‌కు 25, తెలంగాణకు 17, తమిళనాడుకు 39, కర్ణాటకకు 28, కేరళకు 20 స్థానాలు ఉన్నాయి. ఈ ఐదు రాష్ట్రాలకు కలిపి 129 స్థానాలు ఉన్నాయి. మొత్తం లోక్‌సభలో దక్షిణాది ఐదు రాష్ట్రాల వాటా 23.76 శాతం.
▪️ సీట్ల సంఖ్య పెరిగినప్పటికీ, మొత్తం లోక్‌సభలో తమ ప్రాతినిధ్య శాతం తగ్గకూడదన్నది దక్షిణాది రాష్ట్రాల ప్రధాన డిమాండ్.
🔶 అన్ని రాష్ట్రాలకూ 50 శాతం సీట్ల పెంపు?
▪️ దక్షిణాది రాష్ట్రాల అభ్యంతరాలను పరిష్కరించేందుకు అన్ని రాష్ట్రాలకూ దాదాపు సమాన నిష్పత్తిలో 50 శాతం లోక్‌సభ స్థానాలను పెంచే విధానం తాజాగా చర్చలోకి వచ్చింది.
▪️ ఈ విధానాన్ని అనుసరిస్తే ప్రస్తుతం ఉన్న 543 లోక్‌సభ స్థానాలు సుమారు 815కు పెరుగుతాయి. ఆంధ్రప్రదేశ్‌లో 25 నుంచి 37–38కి, తెలంగాణలో 17 నుంచి 25–26కి, తమిళనాడులో 39 నుంచి 58–59కి, ఉత్తరప్రదేశ్‌లో 80 నుంచి 120కి స్థానాలు పెరిగే అవకాశం ఉంటుంది.
▪️ దీనివల్ల రాష్ట్రాల మధ్య ప్రస్తుతం ఉన్న రాజకీయ ప్రాతినిధ్య నిష్పత్తిలో పెద్దగా మార్పులు రావు. అయితే ఈ విధానంపై ఇంకా అధికారిక తుది నిర్ణయం వెలువడలేదు.
🔶 తెలుగు రాష్ట్రాలకు డీలిమిటేషన్ ప్రాధాన్యం
▪️ 2014 ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టంలోని సెక్షన్ 26 ప్రకారం ఆంధ్రప్రదేశ్‌లో అసెంబ్లీ స్థానాలను 175 నుంచి 225కి, తెలంగాణలో 119 నుంచి 153కి పెంచాల్సి ఉంది.
▪️ రాజ్యాంగంలోని ఆర్టికల్ 170 నిబంధనల కారణంగా ఇప్పటివరకు ఈ పెంపు జరగలేదు. 2025లో సుప్రీంకోర్టు కూడా ప్రస్తుత రాజ్యాంగపరమైన పరిమితులు కొనసాగుతున్నంతవరకు అసెంబ్లీ స్థానాల పెంపు సాధ్యం కాదని స్పష్టం చేసింది. దేశవ్యాప్త డీలిమిటేషన్ చేపడితే తెలుగు రాష్ట్రాల్లో అసెంబ్లీ స్థానాల పెంపు అంశం కూడా ప్రాధాన్యం సంతరించుకుంటుంది.
🔴 గత ఏప్రిల్‌లో వీగిపోయిన బిల్లు
▪️ 2026 ఏప్రిల్ 17న లోక్‌సభలో రాజ్యాంగ సవరణ బిల్లుపై జరిగిన ఓటింగ్‌లో అనుకూలంగా 298 మంది, వ్యతిరేకంగా 230 మంది ఓటేశారు. రాజ్యాంగ సవరణకు అవసరమైన 352 ఓట్లు లభించలేదు. దీంతో 54 ఓట్ల కొరతతో బిల్లు వీగిపోయింది.
▪️ ప్రస్తుతం మారిన రాజకీయ సమీకరణాలు, కొన్ని ప్రాంతీయ పార్టీల నుంచి షరతులతో కూడిన మద్దతు సంకేతాల నేపథ్యంలో మరోసారి బిల్లును తీసుకొచ్చేందుకు కేంద్రం ప్రయత్నిస్తోంది.
⚖️ బిల్లు నెగ్గకపోతే రాజ్యాంగ ప్రక్రియకు భంగం కలిగినట్టేనా?
▪️ డీలిమిటేషన్ రాజ్యాంగబద్ధమైన ప్రక్రియ. అయితే ప్రస్తుతం కేంద్రం ప్రతిపాదిస్తున్న విధానంలోనే డీలిమిటేషన్ జరగాలన్న రాజ్యాంగపరమైన నిర్బంధం లేదు.
▪️ రాజ్యాంగ సవరణ బిల్లు ఆమోదం పొందకపోయినా ప్రస్తుతం అమల్లో ఉన్న రాజ్యాంగ నిబంధనలు కొనసాగుతాయి. 2027 జనగణన గణాంకాలు ప్రచురించిన తర్వాత ఆర్టికల్ 82, 170 ప్రకారం డీలిమిటేషన్ చేపట్టవచ్చు.
📌 డీలిమిటేషన్‌ను సమర్థించడం, కేంద్రం ప్రతిపాదిస్తున్న డీలిమిటేషన్ విధానాన్ని సమర్థించడం రెండూ వేర్వేరు అంశాలు. ప్రస్తుత బిల్లు నెగ్గకపోయినా రాజ్యాంగబద్ధమైన డీలిమిటేషన్ ప్రక్రియకు భంగం కలగదు.
ప్రభుత్వాలు పర్యావరణాన్ని రక్షించి అభివృద్ధిని చేయాలి.
చంద్రబాబు పర్యావరణాన్ని విధ్వంసం చేస్తున్నాడు అభివృద్ధి చేసేది ఏమీ లేదు.
విశాఖలో 10 కొండలు కు గుండు కకొడుతున్న పవన్ కళ్యాణ్ ఎందుకు స్పందించడం లేదు.
2029 కూటమి అనేది అధికారంలోకి రాదు.
- బొలిశెట్టి సత్యనారాయణ
🚨
India Today in 1979 in their article said:
"Where Journalism Ends, Eenadu Begins"..
ప్రచారం కోసం వార్తలను వక్రీకరించి వేయడం అనే ఒరవడి సృష్టించింది ఈనాడు పత్రికే!
#Eenadu
చదువుతో బడుగు, బలహీన వర్గాల జీవితాలను మార్చవచ్చని, మహిళా విద్యతో సమాజం పురోగమిస్తుందని నమ్మి, ఆచరణలో చూపిన గొప్ప సంఘ సంస్కర్త మహాత్మా జ్యోతిరావు పూలే గారు. అణగారిన వర్గాలు ఆత్మగౌరవంతో జీవించేలా, సమాన అవకాశాలు పొందేలా ఆయన సాగించిన పోరాటం ఎప్పటికీ స్ఫూర్తిదాయకం. నేడు ఆ మహనీయుడి వర్ధంతి సందర్భంగా నివాళులర్పిస్తున్నాను.
విదేశీ గళాల్లో అన్నమయ్య సంకీర్తన.. అద్భుతం!.
స్విట్జర్లాండ్‌లో జరిగిన సోల్స్బర్గ్ ఫెస్టివల్–2026లో ప్రముఖ గాయక బృందం ‘చాంటిక్లీర్’ ఆలపించిన అన్నమయ్య సంకీర్తన ‘బ్రహ్మమొక్కటే.. పరబ్రహ్మమొక్కటే’.
పదకవితా పితామహుడు శ్రీ తాళ్లపాక అన్నమాచార్యులు రచించిన ఈ సంకీర్తన విదేశీ గాయకుల గళాల్లో వినిపించడం ప్రతి తెలుగు వారికీ గర్వకారణం.
భాషలు, దేశాలు వేరైనా భక్తికి ఎల్లలు లేవు!
#Annamacharya #BrahmamOkkate #TeluguCulture #IndianMusic