నిరంజన్ ఇక లేడనే వార్త నా హృదయాన్ని తీవ్రంగా కలచివేసింది.
కొద్ది రోజుల క్రితం హనుమకొండలో నిరంజన్ ఇంటికి వెళ్లి కలిసిన ఆ క్షణాలు ఇంకా నా మదిలో సజీవంగానే ఉన్నాయి. తీవ్రమైన అనారోగ్యంతో పోరాడుతూనే నా కోసం ఎదురుచూసిన ఆ చిన్నారి… నన్ను చూడగానే అతని ముఖంపై విరిసిన ఆ చిరునవ్వు… ఇవన్నీ ఎప్పటికీ మరువలేని జ్ఞాపకాలుగా నిలిచిపోతాయి.
అతని శరీరం వ్యాధితో పోరాడినా, అతని మనసు మాత్రం అపారమైన ధైర్యంతో నిలిచింది. అంతటి బాధను అనుభవిస్తూ కూడా జీవితం పట్ల అతను చూపిన ఆశ, ఆత్మవిశ్వాసం ఎంతో విలువైనవి. అలాంటి ధైర్యవంతుడైన చిన్నారి ఇంత త్వరగా మనల్ని విడిచి వెళ్లిపోవడం ఎంతో బాధాకరం.
నిరంజన్ కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాను. తీరని దుఃఖాన్ని భరించే శక్తిని భగవంతుడు వారికి ప్రసాదించాలని ప్రార్థిస్తున్నాను.
ప్రియమైన నిరంజన్… నువ్వు చూపించిన చిరునవ్వు, ధైర్యం, నువ్వు పంచిన ప్రేమ నా హృదయంలో ఎప్పటికీ నిలిచిపోతాయి. నీ ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుడిని ప్రార్థిస్తున్నాను.
- @PawanKalyan
చైత్ర పౌర్ణమి నుండి ప్రారంభమయ్యే 41 రోజుల హనుమాన్ దీక్ష ముగింపు రోజైన వైశాఖ బహుళ దశమి పర్వదినాన మన తెలుగు రాష్ట్రాల్లో భక్తులు నిష్టతో, భక్తి శ్రద్ధలతో హనుమాన్ జయంతి జరుపుకుంటారు.
బుద్ధిర్బలం యశోధైర్యం నిర్భయత్వమరోగతా |
అజాడ్యం వాక్పటుత్వం చ హనుమత్ స్మరణాద్భవేత్ ||
ఆ పవనపుత్రుడు ఆంజనేయ స్వామి కరుణతో మీకు, మీ కుటుంబానికి సకల శుభాలు కలగాలని కోరుకుంటూ ప్రజలందరికీ హనుమాన్ జయంతి శుభాకాంక్షలు.
#HanumanJayanti
పాపం @ysjagan 😂😂😂🙏🏼
But fact is…మనం బతికే బతుకుని బట్టి మన చుట్టూ ఉన్న వాళ్ళు మనకి value ఇస్తారు 🤫 ఎప్పుడూ వాడ్ని వీడ్ని చంపుకుంటూ బూతులు తిట్టుకుంటూ బతికితే ఎవడిస్తాడు విలువ 💦
#ModiMeetsAandhi
ప్రజలకు మరింత విస్తృత సేవలు చేయాలంటే ఆరోగ్యం ఎంతో ముఖ్యం
•ఆరోగ్యాన్ని అశ్రద్ధ చేయవద్దు: శ్రీ @PawanKalyan గారికి గౌరవ ప్రధానమంత్రి శ్రీ @narendramodi గారు సూచనలు
•ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారి కుటుంబంతో ఆప్యాయంగా ముచ్చటించిన గౌరవ ప్రధానమంత్రి
•మార్క్ శంకర్ సొంతంగా రూపొందించి అందించిన వెల్కమ్, థాంక్యూ కార్డులు చూసి ముచ్చటపడ్డ శ్రీ మోదీ గారు
•ప్రఖ్యాత హిందీ కవి రాంధారీ సింగ్ దినకర్ జీ కవిత వినిపించిన అకీరా నందన్
•ఆద్య, పలీనా అంజని చదువులు గురించి అడిగిన శ్రీ మోదీ జీ
•శ్రీమతి అన్నా కొణిదెల గారితో సంభాషణాల్లో రష్యన్ పదాలు పలికిన గౌరవ ప్రధాన మంత్రి
‘ఎవరూ ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేయకూడదు. ప్రజా జీవితంలో ఉన్నవారు ఆరోగ్యంపట్ల శ్రద్ధ వహించాలి. మీరు ప్రజలకు మరింత విస్తృతంగా సేవలు అందించాల్సిన అవసరం ఉంది. అలా చేయాలంటే మీరు ఆరోగ్యంపట్ల జాగ్రత్త వహిస్తూ శ్రద్ధ చూపించాలి’ అని గౌరవ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారి హితవు చెప్పారు. ఆదివారం సాయంత్రం హైదరాబాద్ జూబ్లీ హిల్స్ లోని శ్రీ పవన్ కళ్యాణ్ గారి నివాసానికి శ్రీ నరేంద్ర మోదీ గారు విచ్చేశారు. శ్రీ పవన్ కళ్యాణ్ గారు, కుటుంబ సభ్యులు హార్ధిక స్వాగతం పలికారు. ఈ సందర్భంగా శ్రీ పవన్ కళ్యాణ్ గారి ఆరోగ్యం గురించి, శస్త్ర చికిత్స గురించి వాకబు చేసి పరామర్శించారు.
గత కొన్నేళ్లుగా సాగించిన పర్యటనల్లో దుమ్ము ధూళి రేగిపోయి - సైనస్ లోకి చేరిపోయి ఒక చిన్నపాటి గట్టి బాల్ మాదిరిగా మారిపోయి తీవ్ర ఇబ్బంది కలిగించి ఇన్ఫెక్షన్ అయిందని, కంటిపైనా ప్రభావం చూపిందని... ఆ క్రమంలో ఫంక్షనల్ ఎండోస్కోపిక్ సైనస్ సర్జరీ (ఫేస్) చేశారని శ్రీ పవన్ కళ్యాణ్ గారు తెలిపారు. ఇంకా ఏమైనా ఆరోగ్య సమస్యలు ఉన్నాయా అని శ్రీ మోదీ గారు అడిగారు. భుజాల దగ్గర మజిల్ కి గతంలో తగిలిన గాయాలు ఇప్పుడు ఇబ్బందిపెడుతున్నాయని, రొటేటర్ కఫ్ ఇంజ్యూరీ అని వైద్యులు తెలిపారని, వాటికి సర్జరీలు చేయాల్సి ఉందని, స్పైనల్ కార్డ్ కి సంబంధించి సమస్య ఉందని శ్రీ పవన్ కళ్యాణ్ తెలిపారు. ఈ సందర్భంగా శ్రీ నరేంద్ర మోదీ గారు హితవు చెబుతూ ‘ఆరోగ్యం విషయంలో అశ్రద్ధ వద్దు. మీరు ఈ సమాజానికి చేయాల్సింది ఎంతో ఉంది’ అని పలు సూచనలు చేశారు. శ్రీ పవన్ కళ్యాణ్ గారి సతీమణి శ్రీమతి అన్నా కొణిదెల గారితో మాట్లాడుతూ కొన్ని రష్యన్ పదాలు పలికారు. ప్రధానమంత్రి గారిని ఢిల్లీలో శ్రీ పవన్ కళ్యాణ్ గారు, శ్రీమతి అన్నా కొణిదెల గారు సందర్భాన్ని గుర్తు చేసుకున్నారు.
చిన్న కుమారుడు మార్క్ శంకర్ ఈ సందర్భంగా తాను రూపొందించిన హ్యాండ్ మేడ్ వెల్కమ్, థాంక్యూ కార్డులను శ్రీ మోదీ గారికి అందించారు. మార్క్ శంకర్ ను దగ్గరకు తీసుకొని ‘నీ గురించి మేమందరం ఎంతో కంగారుపడ్డాము. అగ్ని ప్రమాదంలో చిక్కుకొని సింగపూర్ లో నువ్వు ఎలా ఉన్నావో అని మేమంతా ఆందోళనపడి, నీ గురించే ఆలోచించేలా చేశావు కదరా బాబూ’ అంటూ ఆప్యాయంగా మాట్లాడారు.
•కఠినమైన హిందీ నేర్చుకోవడం మామూలు విషయం కాదు
అకీరా నందన్ తో మాట్లాడుతూ ఏం చేస్తున్నావు అని అడిగారు. ప్రస్తుతం మార్షన్ ఆర్ట్స్ నేర్చుకొంటున్నాను, అలాగే స్పోర్ట్స్ షూటింగ్ శిక్షణ పొందుతున్నాను అన్నారు. శ్రీ పవన్ కళ్యాణ్ గారి వైపు చూస్తూ ఇంట్లో ఒక మార్షల్ ఆర్ట్స్ స్టార్ ఉన్నారు... నువ్వూ అటు వైపే వెళ్తున్నావా అని చమత్కరించారు. ఈ సందర్భంగా- ప్రఖ్యాత హిందీ కవి రాంధారీ సింగ్ దినకర్ జీ కవితను వినిపించి, అందుకు సంబంధించి వివరాలను అకీరా నందన్ వినిపించారు. ఆ కవితకు ముగ్ధుడైన శ్రీ మోదీ గారు రాంధారీ సింగ్ దినకర్ జీ ఎంతో కఠినమైన హిందీ భాషను రాశారు.. కఠినమైన హిందీ నేర్చుకోవడం మామూలు విషయం కాదు అని చెప్పి అభినందించారు.
ఆద్య కొణిదెల ఏమి చదువుతున్నారో అడిగారు. ఈ సందర్భంగా ఆద్య – తన అమ్మమ్మ గారి వైపు గుజరాతీ మూలాలు ఉన్నాయని చెప్పారు. ఆద్యతో కూడా శ్రీ మోదీ గారు హిందీలో మాట్లాడారు. చిన్న కుమార్తె పలీనా అంజని ఇంగ్లీష్ లో మాట్లాడారు. హిందీ వచ్చా అని శ్రీ మోదీ గారు అడిగారు. తనకు హిందీ రాదు అని పలీనా తెలిపారు. ఈ సందర్భంగా పలీనా, శ్రీమతి అన్నా కొణిదెల గారితో మాట్లాడుతూ మళ్ళీ కలిసేటప్పటికి హిందీలో మాట్లాడాలి అని సరదాగా చెప్పారు.
సుమారు 20 నిమిషాలపాటు శ్రీ నరేంద్ర మోదీ గారు శ్రీ పవన్ కళ్యాణ్ గారు తోఉన్నారు. అనంతరం శ్రీ మోదీ గారికి శ్రీ పవన్ కళ్యాణ్ గారి కుటుంబం మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియచేసింది. ‘మీరు మా ఇంటికి వచ్చి చూపించిన అప్యాయతను, ప్రేమపూర్వక సంభాషణలను ఎప్పటికీ మరచిపోలేము’ అని ఇంటిల్లిపాదీ శ్రీ మోదీ గారికి చెప్పారు.
@PIB_India@IPR_AP@pibvijayawada
Today, Hon’ble Prime Minister Shri @narendramodi ji visited the residence of Hon’ble Deputy Chief Minister Shri @PawanKalyan garu in Hyderabad and personally enquired about his health during his recovery.
Hon’ble Deputy Chief Minister Shri Pawan Kalyan garu along with his wife Smt. Anna Konidala garu and children warmly received the Hon’ble Prime Minister during the visit.
Despite his demanding national responsibilities and hectic schedule, Hon’ble Prime Minister Shri Narendra Modi ji took time to personally visit and convey his heartfelt concern and blessings, reflecting his compassion, humility, and affectionate nature. His leadership continues to inspire millions across Bharat, not only through his vision for the nation but also through the personal care and concern he shows towards people treating everyone like family.
Hon’ble Deputy Chief Minister Shri Pawan Kalyan garu and his family conveyed their heartfelt gratitude to the Hon’ble Prime Minister for his gracious visit, kind concern, and blessings.
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారి నివాసానికి వెళ్లి, ఆయనతో పాటు ఆయన కుటుంబ సభ్యులను కలిశాను. పవన్ కళ్యాణ్ గారి యోగక్షేమాలు తెలుసుకుని, ఆయన సంపూర్ణ ఆరోగ్యంతో ఉండాలని ఆకాంక్షించాను.
@PawanKalyan
The BOSS and my GURU on sets of #Peddi...
It's one of the best memories ❤️
And yes...I've built a bit of muscle with my Peddi's inspiration 💪🏻😅
@KChiruTweets Sir @AlwaysRamCharan Sir ❤️❤️❤️🤗🤗🤗
my dear Hindus తిరుపతి లేడు మీద మాట్లాడట్లేదు ఎందుకంత భయం తప్పు జరిగినప్పుడు తప్పుని ప్రశ్నించడం మన హక్కు కాదా #GHANIBHAI ఒక ముస్లిమై నేను ప్రశ్నిస్తున్న నే మీ గొంతు ఎందుకు మూగబోయింది .... 😡 raise your voice save our God... 🙏🛕😭
#NoGheeInTTDLaddu
నీ మీద మతం ముద్ర వేసి ఏడుస్తారూ కానీ..!
ఆంధ్రాలో హిందువులు ఎప్పుడో వేరే మతం లోకి పోయారు. ! భయం గుండెల నిండా ఉంది అన్న @PawanKalyan 🥲🙏
నీ వంతు నువ్వు నిలబడు అంతే అన్న 🙃🥺
ప్రతీ భక్తుడిపై ధార్మిక బాధ్యత ఉంది...!
ప్రతీ సగటు హిందువు మనసులో ఉన్న అలసత్వం, నుంచి బయటకు రావాల్సిన సమయం వచ్చింది. మనందరిలో దేవుడిపై భయం ఉంది, ధర్మంపై గౌరవం ఉంది. కానీ హిందూ దేవతలను అవమానించినప్పుడు లేదా మన ధర్మాన్ని ఎగతాళి చేసినప్పుడు, మన బాధను మనలోనే దాచుకొని, “కర్మ చూసుకుంటుంది” అని అనుకొని మౌనంగా ముందుకు సాగుతున్నాము.
ఈ విధానం ఖచ్చితంగా మారాలి.
కులం, మతం, ప్రాంతం, భాషల ద్వారా మనం విడిపోయినట్టుగా కనిపించినా, మనందరి ధర్మం ఒకటే, దేవతలు ఒక్కరే. మన ధర్మం, మన విశ్వాసం తప్పుడు ఆలోచనలతో అపహాస్యం చేయబడినప్పుడు, మన వేదనను, బాధను బహిరంగంగా వ్యక్తపరచడం మన నైతిక బాధ్యత.
అలాంటి సందర్భాల్లో మౌనం పాటించడం మనందరి సహనాన్ని బలహీనంగా చూపిస్తుంది. మనం కేవలం భక్తులుగా మాత్రమే కాకుండా, మన ధర్మ పరిరక్షకులుగా మారాలి.
హిందూ ధర్మాన్ని కాపాడటం అంటే ఇతర మతాలకు వ్యతిరేకంగా ఉండటం కాదు.
కేవలం మన ధర్మాన్ని మనం రక్షించుకోవడమే
#NoGheeInTTDLaddu
#SanatanaDharmaRakshaBoard