బోనాల పండుగ సందర్భంగా లాల్ దర్వాజా సింహవాహిని మహంకాళి అమ్మవారికి బోనం సమర్పించి, తల్లిని దర్శించుకున్నాను.
తెలంగాణ ప్రజలందరిపై అమ్మవారి కరుణాకటాక్షాలు ఉండాలని, ప్రతి ఇంటా సుఖసంతోషాలు, ఆయురారోగ్యాలు, శాంతి వెల్లివిరియాలని ప్రార్థించాను.
మగ్గంపై అద్భుతాలు సృష్టిస్తూ భారతీయ చేనేతకు ప్రపంచవ్యాప్తంగా ప్రత్యేక గుర్తింపు తీసుకొచ్చిన ప్రతి నేతన్నకు వందనాలు
తమ నైపుణ్యంతో ప్రపంచ వేదికపై తమకంటూ సుస్థిర స్థానాన్ని సంపాదించుకున్న చేనేత అక్కాచెల్లెళ్లకు, అన్నదమ్ముళ్లకు జాతీయ చేనేత దినోత్సవ శుభాకాంక్షలు
#NationalHandloomDay
తెలంగాణ రాష్ట్ర సాధనే ఏకైక లక్ష్యంగా జీవితం మొత్తం అంకితభావంతో పని చేసిన మహనీయుడు ప్రొఫెసర్ జయశంకర్ సార్.
తెలంగాణకు జరుగుతున్న అన్యాయాలను నిరంతరం ప్రశ్నిస్తూ, తెలంగాణ రాష్ట్ర అవసరాన్ని నొక్కి చెప్పేవారు. తెలంగాణ ప్రజలు ఆత్మగౌరవంతో తమను తాము పాలించుకోవాలని పరితపించేవారు. ఆ క్రమంలోనే ఎల్లప్పుడూ ఉద్యమ స్ఫూర్తిని జనంలో రగిలించిన గొప్ప మేధావి ప్రొఫెసర్ జయశంకర్ సార్ జయంతి సందర్భంగా ఆ మహనీయుడికి ఘన నివాళులు.
సాధించిన తెలంగాణలో అన్ని వర్గాలకు సమాన అవకాశాలు దక్కాలని, సామాజిక తెలంగాణ కావాలన్న వారి ఆశయాన్ని స్ఫూర్తిగా తీసుకొని, సామాజిక తెలంగాణ సాధనకై తెలంగాణ రక్షణ సేన నిరంతరం పోరాడుతుంది.
#TRS4SocialJustice
"If we get onto the streets, Delhi will come to a standstill."
A direct warning to Congress & BJP: Clear the BC Reservation Bills by the next Budget Session, or thousands of TRS warriors will march to Delhi. Just like GenZ proved, bulldozing politics will no longer work! ✊
Thousands stood shoulder to shoulder at the Social Justice Telangana Sankalpa Sabha, pledging our commitment to these key resolutions:
- Launch a nationwide movement uniting BC communities until 50% reservation in legislative bodies is ensured
- Confer the Bharat Ratna on Mahatma Jyotiba Phule and Savitribai Phule
- Install a statue of Prof. Jayashankar at Tank Bund and recommend him for the Padma Bhushan
- Ensure zero diversion of constitutional SC funds. Every rupee should be used for SC welfare and development
- Issue special recruitment notifications to fill all SC backlog posts in Central and State governments
- Guarantee complete forest rights for Adivasis and secure reservation benefits for plain-area tribal communities
- Pass 33% women’s reservation in Parliament immediately, without linking it to delimitation
- Enactment of the Waqf Board Act and ensuring economic self-reliance for Muslims
- Measures to secure economic self-reliance for Sikhs and Christians
- Guarantee full and equal rights for Transgender individuals
- Increase of pensions for Persons with Disabilities as promised, and granting of them co-option member reservations
The fight for social justice begins now!
#TRS4SocialJustice
آج کا یہ جلسہ کوئی عام جلسہ نہیں ہے، یہ جلسہ ہماری زندگیوں میں تبدیلی لانے ولا جلسہ ہے۔
اگر کسی قوم کو آگے بڑھنا ہے تو اسے تین چیزوں کی سب سے زیادہ ضرورت ہوتی ہے۔
پہلی چیز تعلیم۔دوسری چیز فینانشیل ایمپاورمنٹ اور تیسری چیز پولیٹیکل ایمپاورمنٹ۔ تعلیم ہوگی تو شعور آئے گا۔فینانشیل ایمپاورمنٹ ہوگی تو خودداری آئے گی اور سیاسی نمائندگی ہوگی تو انصاف ملے گا۔
میری دلی خواہش ہے کہ مسلم خواتین کی آواز ایوانوں میں گونجے اور وہ قانون ساز بنیں۔
#TRS4SocialJustice
We do not choose where we are born, but we do choose what we fight for.
I hereby pledge my life to every community that has been left in shambles, neglected for decades, and systematically underrepresented in our political institutions. We will not stop until complete social justice is delivered to all! ✊
#TRS4SocialJustice
సిరిసిల్ల జిల్లా నేరెళ్ల బాధితుడు స్వర్గీయ గంధం గోపాల్ కుటుంబ సభ్యులను పరామర్శించడానికి బంజారాహిల్స్ లోని తన నివాసం నుండి నేరెళ్లకు బయలుదేరిన తెలంగాణ రక్షణ సేన పార్టీ అధ్యక్షురాలు శ్రీమతి కల్వకుంట్ల కవిత గారు
విద్యార్థుల విజయాన్ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తన ఖాతాలో వేసుకోవడం సిగ్గుచేటు. యువతకు ఇచ్చిన హామీలపై ఎక్కడ నిలదీస్తారోనని మీరే ఊరేగింపులు చేస్తారా?
తెలంగాణ యువతకు ఎన్నో హామీలు ఇచ్చి మోసం చేసిన చరిత్ర మీది. ఇకనైనా ఇచ్చిన మాట నిలబెట్టుకోకపోతే తెలంగాణ యువత మిమ్మల్ని గద్దె దించటం ఖాయం.
BJP isn't the Bharatiya Janata Party. It's the BRITISH "Jahil" Party.
The British crushed dissent to protect their rule. Today, this government responds to peaceful protests with lathis and intimidation. The rulers have changed, but the playbook looks disturbingly familiar.
Freedom was won so citizens could question those in power; not fear them.
The brutality unleashed on students in Delhi shook the conscience of the nation. History remembers the lathis. It also remembers who ordered them.
Why is this government so afraid of students raising their voices?
The time has come to rise, unite, and defend the democracy our ancestors laid down their lives for. I call upon Gen Z to enter public life, join politics, and become the change India deserves.
#DelhiProtest #PoliceBrutality #BritishJahilParty
తెలంగాణ ఉద్యమకారుల గుర్తింపు కమిటీ సమావేశానికి హాజరైన తెలంగాణ రక్షణ సేన చీఫ్ కల్వకుంట్ల కవిత గారు.
ఈ సందర్భంగా అమరజ్యోతి భవనం ఆవరణలోని తెలంగాణ తల్లి విగ్రహానికి పూల మాల వేసిన కల్వకుంట్ల కవిత గారు.
A new political era has begun and the revolution is unstoppable.
Telangana Rakshana Sena (@TRSparty_HQ ) has taken another decisive step toward transforming Telangana’s political landscape. We are deeply humbled by the overwhelming affection shown by the people of Korutla.
TRS will work tirelessly to champion every citizen’s dreams and achieve true Samajika Nyaya Telangana. ✊
#SamajikaNyayaTelangana #TelanganaRakshanaSena #Korutla
కోరుట్లలో నిర్వహించిన పాంచజన్య సంకల్ప సభలో పాల్గొన్న తెలంగాణ రక్షణ సేన చీఫ్ కల్వకుంట్ల కవిత గారు.
తెలంగాణ రక్షణ సేనలో చేరిన బీజేపీ సీనియర్ నేత డాక్టర్ రఘు మరియు వారి అనుచరులు
ఈ సందర్భంగా కల్వకుంట్ల కవిత గారు మాట్లాడుతూ..
🔹సూపర్ ఎల్ నినో అని హెచ్చరించినా ఈ ప్రభుత్వానికి సోయి లేదు
🔹రేవంత్ రెడ్డి నిర్లక్ష్యంతో గోదావరిలో 418 టీఎంసీలకు 93 టీఎంసీలే ఉన్నాయి
🔹సాగు నీళ్లు కాదు అసలు తాగు నీళ్లకే దిక్కు లేని పరిస్థితి తెచ్చారు
🔹కాళేశ్వరం ప్రాజెక్ట్ విషయంలో బీఆర్ఎస్, కాంగ్రెస్ లు రాజకీయాలు చేస్తున్నాయి
🔹మేడిగడ్డతో సంబంధం లేకుండా నీళ్లు ఎత్తిపోసే అవకాశం ఉన్న వినియోగించుకోవడం లేదు
🔹ఏదీ అడిగినా ఎగ్గొట్టటం, ఎదురుదాడి చేయటమే ఈ ప్రభుత్వ విధానం
🔹బీఆర్ఎస్ లో అవినీతిని ప్రశ్నిస్తే ఓర్వలేక కొన్ని గుంటనక్కలు నన్ను పార్టీ నుంచి పంపిచేశాయి
🔹తెలంగాణ ప్రజలు, అస్తిత్వం కోసం తెలంగాణ రక్షణ సేన ఏర్పాటు చేశాను
🔹కోరుట్లలో డాక్టర్ రఘు గారితో సహా చాలా మంది సీనియర్ నేతలు టీఆర్ఎస్ లో చేరటం సంతోషంగా ఉంది.
🔹రఘు గారి చేరికతో కోరుట్లలో టీఆర్ఎస్ కు వెయ్యి ఏనుగుల బలం వచ్చింది.
🔹రాష్ట్రంలో బీజేపీ, బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలు ఉండగా కొత్త పార్టీ అవసరముందా అనే ప్రశ్న చాలా మంది వచ్చే
ఉంటుంది.
🔹కానీ ఉన్న పార్టీలు మనకు కావాల్సిన పనులు చేసుంటే కొత్త పార్టీ అవసరం లేకుండే?
🔹నేను బీఆర్ఎస్ లో ఉన్నప్పుడు ఆ పార్టీలో జరిగిన అవినీతి సహా ఇతర అంశాల గురించి పార్టీలో అంతర్గతంగా చెప్పాను.
🔹అయితే కొన్నింటిపై యాక్షన్ తీసుకున్నారు. కొన్నింటిపై మాత్రం యాక్షన్ తీసుకోలేదు.
🔹ఎప్పుడైతే నేను అవినీతి సహా బీసీల గురించి మాట్లాడటం మొదలుపెట్టానో నాపై కుట్ర చేశారు.
🔹కొన్ని గుంటనక్కలు ఓర్వలేక కుట్ర చేసి నన్ను బయటకు పంపారు.
🔹ఏ ఆడబిడ్డ అయిన సరే పుట్టినిట్లు, మెట్టినిల్లు, రాష్ట్రం, దేశం బాగుండాలని కోరుకుంటుంది.
🔹కానీ అవినీతిని మాత్రం సహించదు. ఎప్పుడైతే అవినీతి గురించి మాట్లాడానో నన్ను పార్టీ నుంచి పంపించేశారు.
🔹20 ఏళ్ల పాటు పార్టీ కోసం పనిచేస్తే నన్ను మోసం చేసి పార్టీ నుంచి పంపించేశారు.
🔹అప్పుడు నేను ఇంట్లోనే ఉండాలా? ప్రజలకు సేవ చేయాలా? అని ఆలోచించాను.
🔹చాలా మంది అంతర్జాతీయ ప్రముఖులతో మాట్లాడను. ఆ తర్వాతే రాజకీయంగా సేవ చేయాలని ముందుకు వచ్చాను.
🔹ఎవరి కోసం పార్టీ పెట్టాలనుకున్నానో వాళ్లందరినీ కూడా అడిగాను.
🔹అందరూ తెలంగాణ రాకముందు తమ బతుకు ఎలా ఉందో ఇప్పుడు అలాగే ఉందని చెప్పారు.
🔹చాలా మందికి తెలంగాణ రాకముందు వచ్చిన ఆదాయమే వస్తుంది. కానీ పప్పులు, ఉప్పులు ఇలా అన్ని రేట్లు పెరిగిపోయాయి.
🔹వారందరి జీవితాల్లో మార్పు రావాలన్న సంకల్పంతో నేను పార్టీ పెట్టాను.
🔹అధర్మంపై యుద్ధం చేసే ముందు శ్రీ కృష్ణుడు పాంచజన్యం పూరించాడు.
🔹ఆయన స్ఫూర్తితోనే నేను కూడా పేదల కోసం ఐదు కీలక అంశాలను పెట్టుకొని దానికి పాంచజన్యం అనే పేరు పెట్టుకున్నాను.
🔹ముఖ్యంగా ఉచిత విద్య అనేది మనకు కావాల్సి ఉంది. ఇప్పుడు ఉచిత విద్య ఉంది.
🔹కానీ గద్దర్ గారు చెప్పినట్లు విద్యార్థులు ఉంటే టీచర్లు ఉండరు. టీచర్లు ఉంటే విద్యార్థులు ఉండరు.
🔹విద్యార్థులు చెట్టు కింద కూర్చొని పొద్దు తిరుగుడు పువ్వులా తిరిగే పరిస్థితి ఉంది.
🔹ప్రభుత్వ విద్య సరిగా లేకపోవటంతోనే ఎంత పేదవారైనా సరే తమ పిల్లల్ని ప్రైవేట్ స్కూళ్లలోనే చదివిపిస్తున్నారు.
🔹కానీ ప్రైవేట్ లో భారీగా ఫీజులు వసూలు చేస్తున్నారు. దీంతో పేదవారిపై భారం పడుతోంది.
🔹అందుకు మీకు మాట ఇస్తున్నా. మీ పిల్లలు ఎంత పెద్ద స్కూళ్లో చదివిన సరే ఫీజు టీఆర్ఎస్ ప్రభుత్వమే కడుతుంది.
🔹ఇక వైద్యం విషయం కూడా అంతే. సూది ఉంటే దూది ఉండదు. దూది ఉంటే సూది ఉండదు.
🔹ఆరోగ్యశ్రీ లో మోచేతి వైద్యం ఉంటే అరచేతికి ఉండదు. అనేక రూల్స్ అందులో ఉన్నాయి.
🔹ప్రైవేట్ కు వెళ్తే లక్షలాది రూపాయలు ఖర్చు అవుతోంది.
🔹ఎంత పెద్ద జబ్బైనా సరే ఉచిత వైద్యం అందిస్తాం. ఎంత ఖర్చైనా సరే ప్రభుత్వమే భరిస్తుంది.
🔹నేను ఉచిత విద్య, వైద్యం ఇస్తా అని అనగానే అన్ని పార్టీల్లో ఉన్న అన్నలంతా ఎక్కడి నుంచి ఇస్తావంటున్నారు.
🔹మీరు అవినీతిని బంద్ చేస్తే చాలు ఉచిత విద్య, వైద్యం అందించవచ్చు.
🔹మా అమ్మ పంతంతో నేను చిన్నప్పుడు ఇంగ్లీష్ మీడియంలో చదివి ఆ తర్వాత అమెరికాలో చదువుకున్నాను.
🔹నాకు పూర్తిగా అవగాహన ఉంది. లెక్కలతో సహా నేను అధ్యయనం చేశాక మాట ఇచ్చాను.
🔹ఇప్పుడున్న బడ్జెట్ లోనే ఉచిత విద్య, వైద్యం అందించవచ్చు.
🔹ఇక యువతకు ఈ ప్రభుత్వం ఒక్క రూపాయి కూడా ఇవ్వటం లేదు.
🔹డిగ్రీలు, పీజీ లు చేసిన వారు కూడా ఖర్చుల కోసం వాళ్ల తల్లితండ్రుల మీద ఆధారపడాల్సిన పరిస్థితి.
🔹కానీ నేను మాత్రం మన యూత్ ను నమ్ముతాను. వాళ్లు ఒక్క ఐడియాతో వస్తే వాళ్లకు ప్రోత్సాహం అందిస్తాం.
🔹ఎలాంటి గ్యారంటీ లేకుండా 2 లక్షల నుంచి 20 కోట్ల వరకు వారికి రుణాలు ఇస్తాం.
🔹ఒక గూగుల్, అమెజాన్, మైక్రోసాప్ట్ లాంటి సంస్థలు స్థాపించేలా చేస్తాం.
🔹పెద్ద పెద్ద సంస్థలు స్థాపించిన వారంతా గొప్పవాళ్లేమీ కాదు. వాళ్ల దేశంలో ఆయా ప్రభుత్వాలు వాళ్లను ప్రోత్సహిస్తే వాళ్లు ఎదిగారు.
🔹ఇక ఈ ప్రభుత్వం రైతులను కూడా మోసం చేస్తోంది.
🔹వాళ్లకు ఇచ్చింది తక్కువ, ఎగ్గొట్టింది ఎక్కువ అన్నట్లు ఉంది.
🔹అధికారంలోకి వచ్చిన రెండు రోజుల్లోనే ప్రతి ఒక్కరికీ రెండు లక్షల రూపాయలు మాఫీ చేస్తామని రేవంత్ రెడ్డి మాట ఇచ్చాడు.
🔹కానీ 50 శాతం రైతులకు అసలు ఇప్పటికీ రుణం మాఫీ కాలేదు. రైతులంటే ప్రభుత్వానికి అంత చులకనగా ఉంది.
🔹వారికి యూరియ కోసం యాప్ పెట్టారు. మనం కొట్లాడితే ఇప్పుడు మీ సేవ అంటున్నారు.
🔹అంటే రైతులు ఎద్దు, ఎవుసం ఇడిచి పెట్టి మీ సేవకు పోవాలా?
🔹అందుకే నేను రైతు రాజు కావాలని అంటున్నా. మా ప్రభుత్వం వస్తే రైతును రాజు చేసి చూపిస్తాం.
🔹ప్రతి ప్రభుత్వ ఆఫీసు లో రైతుల కోసం ప్రత్యేక కౌంటర్ ఏర్పాటు చేస్తాం.
🔹ఎమ్మార్వో, ఆర్డీవో, పోలీస్ స్టేషన్ ఎక్కడైనా రైతుల కోసం సపరేట్ కౌంటర్ ఉంటుంది.
🔹ఇక మా ఐదో అంశం సామాజిక న్యాయం. సమాజంలో అన్ని వర్గాలకు సామాజిక న్యాయం దక్కాలి.
🔹ఈ ప్రభుత్వం ఫ్రీ బస్ అని మహిళలకు పెట్టింది. అప్పటి నుంచి బస్సును బస్టాండ్ లో కాకుండా కొంత దూరంలో ఆపుతున్నారు.
🔹బస్టాండ్ లో బస్ కోసం వేచి చూస్తున్న వికలాంగులకు ఇబ్బంది అవుతోంది. వికలాంగులకు ఫ్రీ బస్సు ఇవ్వాలి.
🔹బీసీ సోదరులకు 50 శాతం రిజర్వేషన్ కోసం మేము రైల్ రోకో చేస్తే 42 శాతం చేస్తామన్నారు.
🔹కానీ ఆ బిల్లు ముందుకు వెళ్లేందుకు రేవంత్ రెడ్డి ప్రయత్నం చేయటం లేదు.
🔹సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ బర్త్ డే లకు, ఊ, ఆ అంటే ఢిల్లీకి వెళ్లే రేవంత్ రెడ్డి...బీసీ బిల్లు కోసం మాత్రం ఢిల్లీకి వెళ్లటం లేదు.
🔹మేము ఎస్సీ, ఎస్టీ, బీసీ ల కోసం పోరాటం చేస్తాం. వారి నిధులు వాళ్ల కోసమే ఖర్చు చేయాలని టీఆర్ఎస్ పోరాటం చేస్తుంది.
🔹ఇక లంబాడాలు లేని మొదటి కేబినెట్ 70 ఏళ్లలో ఈ ప్రభుత్వంలో ఉండటం సిగ్గుచేటు.
🔹మైనార్టీల కోసం కూడా మేము పోరాటం చేస్తాం. క్రిస్టియన్స్ కోసం ప్రత్యేక వింగ్ ఉన్న పార్టీ మాదే.
🔹గతంలో ముస్లింలు చాలా ప్రభుత్వ ఉద్యోగాల్లో ఉండేవాళ్లు.
🔹కానీ ఇప్పుడు వాళ్ల కుటుంబంలో ప్రతి ఒక్కరూ పనిచేస్తే గానీ కుటుంబ బతకలేని పరిస్థితి వచ్చింది.
🔹ముస్లింలు రాజకీయంగా, ఆర్థికంగా సాధికారిత సాధించాల్సిన అవసరముంది.
🔹మేము పార్టీ ప్రారంభించగానే చాలా మంది ముస్లింలు మాకు మద్దతు తెలిపారు.
🔹తెలంగాణలో గంగా జమునా తెహజీబ్ కొనసాగించేందుకు మనమంతా పోరాటం చేద్దాం.
🔹ముస్లింలను మా పార్టీలోకి ఇంకా పెద్ద ఎత్తున రావాలని ఆహ్వానిస్తున్నా.
🔹సామాజిక న్యాయం కోసం మనమంతా పోరాటం చేద్దాం.
🔹భారత దేశాన్ని జంబో ద్వీపం అంటారు. అంటే బంజో అంటే నేరేడు పండు.
🔹ఈ ఏడాది నేరేడు విరగకాసింది. నేరేడు విరగకాస్తే కరువు వస్తుందని సంకేతం.
🔹ఏడు నెలల క్రితమే సూపర్ ఎల్ నినో వస్తుందని వాతావారణ నిపుణులు హెచ్చరించారు.
🔹కానీ రేవంత్ రెడ్డి ప్రభుత్వం పూర్తిగా అలసత్వం, నిర్లక్ష్యంగా వ్యవహరించింది.
🔹ఏ మాత్రం ముందస్తు ఏర్పాట్లు చేయలేదు. ఇప్పటికే మన దగ్గర 40 శాతం లోటు వర్షపాతం ఉంది.
🔹గోదావరి నదిపై 57 రిజర్వాయర్ల ద్వారా 418 టీఎంసీలు నిల్వ చేసుకునే అవకాశం ఉంటే 93 టీఎంసీలు మాత్రమే ఉన్నాయి.
🔹ఈ ప్రభుత్వానికి నీళ్లు, వ్యవసాయం మీద ఏ మాత్రం సోయి లేదు.
🔹ప్రభుత్వ తప్పిదం కారణంగా మెట్ పల్లి, కోరుట్ల లో 2 వేల 5 వందల ఎకరాల్లో పంటలు నష్టపోయే పరిస్థితి ఉంది.
🔹కాళేశ్వరం ఏడో ప్యాకేజ్ పూర్తి చేయకపోవటంతో ఇబ్రహీం పట్నంలో వేల ఎకరాలు నష్టపోయే పరిస్థితి వచ్చింది
🔹ముఖ్యమంత్రి ని నిందిస్తూ ఇటీవలే ఒక రైతు సూసైడ్ చేసుకున్నాడు.
🔹రేవంత్ రెడ్డి మాటలకు ఒక రిటైర్డ్ ఇంజనీర్ వెక్కి వెక్కి ఏడ్చిన పరిస్థితి.
🔹కాళేశ్వరం విషయంలో బీఆర్ఎస్, కాంగ్రెస్ లు రాజకీయం చేస్తున్నాయి.
🔹మేడిగడ్డతో సంబంధం లేకుండా మనం నీళ్లను ఎత్తిపోసుకోవచ్చు.
🔹కానీ మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజ్ ల కారణంగా భద్రాచలం మునిగిపోతుందని ముఖ్యమంత్రి అంటున్నాడు.
🔹ఆయనకు నీళ్ల సోయి లేదు. భద్రాచలం మునిగిపోతుందని ఎవరు చెప్పారో అర్థం కావటం లేదు.
🔹రాముల వారి మీద ఒట్టు అని రేవంత్ ఇటీవల మాట్లాడాడు. ఆయన ఆ ఒట్టు అంటే అది ఫట్ అన్నట్లే అర్థం.
🔹ఈయన రాముల వారి కళ్యాణం రోజు రాముల వారిని దండం పెట్టుకోని డబ్బులు అడిగితే ఆయనే భయపడ్డాడు.
🔹డబ్బుల సంగతి తర్వాత లక్ష్మణా ముందు మన చెప్పులు దాచి ఉంచి అని చెప్పాడు.
🔹అంటే మన ముఖ్యమంత్రి వస్తే చెప్పులు కూడా దాచుకునే పరిస్థితి ఉంది.
🔹ఈ ప్రభుత్వంలో ఏదీ అడిగినా ఎగ్గొట్టటం, ఎదురుదాడి చేయటమే ఉంది.
🔹కచ్చితంగా ఈ ప్రభుత్వాన్ని ప్రశ్నించాలంటే టీఆర్ఎస్ ను ఆశీర్వదించండి.
🔹తంగేడు, గుమ్మడి, గౌరమ్మ పువ్వు జెండా మనది. కచ్చితంగా మీ దీవెనలు మాకు కావాలి.
🔹కంఠంలో ప్రాణం ఉండగా బీఆర్ఎస్ లోకి వెళ్లను
🔹తన కంఠంలో ప్రాణం ఉన్నంత వరకు బీఆర్ఎస్ లోకి వెళ్లేది లేదని తెలంగాణ రక్షణ సేన చీఫ్ కల్వకుంట్ల కవిత స్పష్టం చేశారు. కోరుట్ల సభ అనంతరం ఆమె మీడియాతో చిట్ చాట్ చేశారు.
🔹తెలంగాణ రక్షణ సేన వచ్చే ఎన్నికల్లో బలమైన శక్తిగా నిలబడుతుందని అన్నారు.
🔹ఇరిగేషన్ ప్రాజెక్టులు, నది జలాల విషయంలో ఏమాత్రం సోయి లేని ముఖ్యమంత్రి పాలనలో ఉండటం తెలంగాణ చేసుకున్న దురదృష్టం అన్నారు.
రేవంత్ రెడ్డి ప్రభుత్వ స్కూళ్ల జోలికొస్తే ప్రజలు మీ ప్రభుత్వాన్ని పడగొడుతరు
ప్రభుత్వ విద్యను పూర్తిగా ప్రైవేట్ పరం చేసే కుట్రలను తిప్పికొడుతాం
గ్రామాల్లోకి కార్పొరేట్ స్కూళ్లకు రెడ్ కార్పేట్ వేసి ఆహ్వానిస్తున్నరు
ఇంటిగ్రేటెడ్ స్కూళ్ల టెండర్లలో గోల్ మాల్ చేసి మేఘా, కేఎంవీ సంస్థలకే సగం పనులు ఇచ్చారు
- టీఆర్ఎస్ చీఫ్ కల్వకుంట్ల కవిత గారు
🔹ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రభుత్వ విద్యను పూర్తిగా ప్రైవేట్ పరం చేసే కుట్ర చేస్తున్నాడు
🔹విద్యా కమిషన్ రిపోర్ట్ పేరుతో 27 వేల స్కూళ్లను 4 వేలకు కుదించే ప్రయత్నం జరుగుతోంది.
🔹దీన్ని తెలంగాణ రక్షణ సేన మొదటి నుంచి వ్యతిరేకిస్తూనే ఉంది.
🔹తాజాగా యంగ్ ఇండియా ఇంట్రిగ్రేడేట్ స్కూల్స్ పేరుతో ఒక్కో స్కూల్ కు 146 కోట్లు ఖర్చు పెట్టనున్నారు.
🔹మొత్తం 72 స్కూళ్లకు గానూ సగానికి పైగా మేఘా, కేఎంవీ అనే సంస్థలకే ఇచ్చారు.
🔹వాళ్లు 5 శాతం ఎక్సెస్ కోట్ చేయటంతో ప్రభుత్వంపై 6 వందల కోట్లకు పైగా భారం పడుతోంది.
🔹72 స్కూళ్ల కోసం దాదాపు 11 వేల కోట్లు ఖర్చు చేస్తామని చెబుతున్నారు.
🔹కానీ ఇంకా రెండున్నరేళ్లలో ఈ స్కూల్స్ నిర్మాణం పూర్తి అవటం సాధ్యం కాదు.
🔹ఒక్కో స్కూల్ నిర్మాణానికి కనీసం మూడేళ్లకు పైగా పడుతుంది.
🔹రెవెన్యూ డివిజన్ లో స్కూల్ నిర్మిస్తే మళ్లీ విద్యార్థులు వెళ్లేందుకు బస్సులు పెట్టాలి.
🔹ఆ బస్సులను కూడా మీరు మేఘా సంస్థకే ఇస్తారని స్పష్టంగా తెలుస్తోంది.
🔹మొత్తంగా తెలంగాణ గ్రామాల్లోకి రెడ్ కార్పేట్ వేసి ప్రైవేట్ స్కూళ్లను ఆహ్వానిస్తున్నారు.
🔹బడ్జెట్ స్కూళ్లకు ఇవ్వాల్సిన బకాయిలు ఇవ్వకుండా వాటిని చంపేస్తున్నారు.
🔹పైగా యంగ్ ఇండియా స్కూల్స్ రెండు సంస్థలకే ఇచ్చారు. అంటే స్పష్టంగా టెండర్లలో రింగ్ అయ్యారని తెలిసిపోతోంది.
🔹కాంగ్రెస్ ఎంపీకి చెందిన వెలుగు పేపర్ లోనే ఈ విషయాన్ని రాశారు.
🔹టెండర్లలో జరిగిన గోల్ మాల్ పై ముఖ్యమంత్రి కచ్చితంగా ప్రజలకు స్పష్టత ఇవ్వాలి.
🔹గుడి ఎంత ముఖ్యమో బడి కూడా అంతే ముఖ్యం. కానీ స్కూల్స్ స్టార్ట్ అయి నెల గడిచినప్పటికీ ఇప్పటికీ యూనిఫామ్స్ రాలేదు.
🔹మొత్తం స్కూళ్లను కుదిస్తామని చెబుతున్నారు. మరి ఉన్న టీచర్లను ఏం చేస్తారు? కొత్తగా టీచర్ల రిక్రూట్ మెంట్ చేయరా?
🔹ప్రభుత్వ విద్యను ప్రైవేట్ పరం చేస్తామంటే తెలంగాణ రక్షణ సేన ఎట్టి పరిస్థితుల్లో ఊరుకోదు.
🔹ఇక మధ్యాహ్న భోజనంలో పెట్టే గుడ్డుకు ఆరు రూపాయలే ఇస్తున్నారు. బయట గుడ్డు రేటు 8 రూపాయలు ఉంది.
🔹ప్రభుత్వం మూడు రోజులు కాకుండా ఐదు రోజులు గుడ్డు పెట్టాలి. దాని ధరను 8 రూపాయలకు పెంచాలి.
🔹పిల్లలకు పెడతామన్న బ్రేక్ ఫాస్ట్ పెట్టటం లేదు. యూనిఫాం లు ఇవ్వటం లేదు.
🔹ప్రభుత్వ పాఠశాలల జోలికి వస్తే ప్రజలు ఈ ప్రభుత్వాన్నే పడగొడుతారు.
🔹ఇంటిగ్రేడేట్ స్కూల్ పేరుతో ఎక్కడో, ఏదో ఊర్లో స్కూల్స్ పెడితే ఆడ పిల్లలు నష్టపోతారు.
🔹వారి తల్లితండ్రులు దూరంగా ఉండే స్కూళ్లలో పిల్లలను చేర్పించరు.
🔹అందుకే ఊర్లలోనే స్కూల్స్ ఉండాలి. గ్రామ సర్పంచ్ లు దీని కోసం ఫైట్ చేయాలి.
🔹ఇంటిగ్రేటేడ్ స్కూల్స్ పేరుతో వాటిని ఎప్పటికీ కడతారో తెలియదు గానీ ఉన్న స్కూళ్లను మూసేసే కుట్ర చేస్తున్నారు.
#TRS
తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వ విద్యను ప్రైవేటీకరించేందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కుట్ర పన్నుతున్నారు. విద్యా కమిషన్ రిపోర్ట్ పేరుతో రాష్ట్రంలోని 27 వేల ప్రభుత్వ పాఠశాలలను 4 వేల పాఠశాలలకు కుదించే ప్రయత్నాన్ని తెలంగాణ రక్షణ సేన వ్యతిరేకిస్తుంది.
ముఖ్యమంత్రి చర్యలను చూస్తుంటే, తెలంగాణ గ్రామాల్లోకి ప్రైవేట్ కార్పొరేట్ స్కూళ్లను రెడ్ కార్పెట్ పరిచి స్వాగతం పలుకుతున్నట్టుగా కనిపిస్తోంది. బడ్జెట్ స్కూళ్లకు ఇవ్వాల్సిన బకాయిలు ఇవ్వకుండా వాటిని చంపేస్తున్నారు. ఇంటిగ్రేటేడ్ స్కూల్స్ భవనాలు ఎప్పటికీ కడతారో తెలియదు గానీ ఉన్న పాఠశాలలను మూసి వేసే కుట్రలు చేస్తున్నారు. ప్రభుత్వ పాఠశాలల జోలికి వస్తే ప్రజలు ఈ ప్రభుత్వాన్నే పడగొడుతారు.
కోరుట్లలో నిర్వహించబోయే పాంచజన్య సంకల్ప సభకు, హైదరాబాద్లోని తన నివాసం నుండి కోరుట్లకు బయలుదేరిన తెలంగాణ రక్షణ సేన పార్టీ అధ్యక్షురాలు శ్రీమతి కల్వకుంట్ల కవిత గారు.
A proud day for India and a defining milestone in our nation's space journey. It is also a moment of immense pride for Telangana.
Heartiest congratulations to the team at Skyroot Aerospace. This remarkable achievement reflects the vision, determination, and scientific excellence of our innovators. Wishing the entire team continued success as they propel India's space ambitions to even greater heights.
Jai Hind! 🇮🇳🚀