Visiting Dr. B.R. Ambedkar’s house at 10 King Henry’s Road, London, where Babasaheb lived in 1921–22, was a deeply moving and inspiring experience.
The Ambedkar Museum preserves his enduring ideals of constitutionalism, equality, a casteless society and social justice. Ms Santosh Dass MBE, Chair of the Anti-Caste Discrimination Alliance (ACDA), shared valuable insights into Babasaheb’s life in the #UK
As I wrote in the visitor’s diary: “Visiting Dr Ambedkar House is like a pilgrimage. The inspiration is for a lifetime. I feel renewed dedication for social justice.”
It was truly one of life’s great moments to connect with the personal history of one of the greatest Indians ever born.
#BRAmbedkar
బోనాల ఉత్సవాల సందర్భంగా ఉజ్జయిని మహంకాళి అమ్మవారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు చేశాను.. రాష్ట్రంలో సమృద్ధిగా వర్షాలు కురిసి, ప్రజలు పాడిపంటలతో, ఆయురారోగ్యాలతో , సుఖశాంతులతో సుభిక్షంగా ఉండేలా చూడాలని అమ్మవారిని ప్రార్థించాను.
#BonaluFestival#UjjainiMahankali
ఎంసీఆర్ హెచ్ ఆర్ డి బోధి పెవిలియన్ లో యాదగిరి గుట్ట ఆలయ అభివృద్ధి పైన ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించాను.
గుట్ట లో హరే రామ హరే కృష్ణ ఫౌండేషన్ కోసం మార్కెట్ రేట్ ప్రకారం భూమి కేటాయించాలని సూచించాను. వివిధ మఠాలకు భూముల కేటాయింపు పైన ఒక విధానం రూపొందించాలని ఆదేశించాను.
భూముల కేటాయింపు పైన తిరుమల అనుసరిస్తున్న విధానాన్ని అధ్యయనం చేయాలని చెప్పాను.
యాదగిరి గుట్ట ఆలయం నిర్మాణం పైన ఇంజనీర్ల కమిటీ ఇచ్చిన నివేదిక పైన అధ్యయనంచేసి వారం లో నివేదిక ఇవ్వాలని స్పష్టం చేశాను. పబ్లిక్ - ప్రైవేట్ విధానం లో టూరిజం సర్క్యూట్ ఏర్పాటు చేయాలని ఆదేశించాను.
#Yadagirigutta #TempleDevelopment
MCRHRD లోని బోధి పెవిలియన్ లో మూసీ రివర్ ఫ్రంట్ పై ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించాను.
రివర్ బెడ్ లో ఉన్న వారికి డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు కేటాయించే అంశాన్ని ప్రాధాన్యంగా తీసుకోవాలని ఆదేశించాను. భూ సేకరణలో ఆసక్తి ఉన్నవారికి టీడీఆర్ ఇవ్వాలని సూచించాను. గాంధీ సరోవర్ ప్రాజెక్టు కోసం తీసుకున్న డిఫెన్స్ భూముల్లోని నిర్మాణాలను రాష్ట్ర ప్రభుత్వమే తరలించాల్సిన అవసరం ఉంటుందని అధికారులకు స్పష్టం చేశాను. మూసీ రివర్ ఫ్రంట్ ఎక్స్ పీరియన్స్ సెంటర్ ను నెక్లెస్ రోడ్డులో ప్రజల సందర్శన కోసం ఏర్పాటు చేయాలని చెప్పాను. ఇక్కడ సందర్శన కోసం వచ్చే ప్రజల నుండి అభిప్రాయ సేకరణ తీసుకునే వ్యవస్థను ఏర్పాటు చేయాలని అధికారులకు సూచించాను.
#MusiRiverfront #MusiRejuvenation #Hyderabad #PrajaPalana #UrbanTransformation
హైదరాబాద్ మెట్రో ఫేజ్-I స్వాధీనం.. ఫేజ్-II విస్తరణపై ఉన్న ఆటంకాలను తొలగించేందుకు రైల్వే శాఖ మంత్రి శ్రీ అశ్వినీ వైష్ణవ్, కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి శ్రీ కిషన్ రెడ్డి, పట్టణ వ్యవహారాల శాఖ మంత్రి శ్రీ మనోహర్ లాల్ ఖట్టర్ తో సుదీర్ఘంగా చర్చించాను.
ఈ సందర్బంగా హైదరాబాద్ మెట్రో ఫేజ్- I వాల్యూయేషన్... ఫేజ్-I స్వాధీనానికి అవసరమైన రుణ సేకరణ.. రుణ సంస్థ ఎంపిక... మెట్రో ఫేజ్-II విస్తరణ.. నిర్మాణ వ్యయం... అందుకు అవసరమైన రుణ సేకరణ అంశాలను అధ్యయనం చేసేందుకు కన్సల్టెంట్ ను నియమించాలని నిర్ణయించాం. దీనికి కన్సల్టెంట్గా SBICAPSని ఎంపిక చేశాం. ఈ సంస్థ ఇచ్చే నివేదిక ఆధారంగా భవిష్యత్ కార్యాచరణ చేపట్టాలని నిర్ణయించాం.
#HyderabadMetro #MetroExpansion #Telangana #UrbanMobility #Hyderabad #MetroPhase2
ఈ రోజు ఢిల్లీలో కేంద్ర రక్షణ శాఖ మంత్రి శ్రీ రాజ్ నాథ్ సింగ్ తో భేటీ అయ్యాను. ప్రతిష్ఠాత్మక గాంధీ సరోవర్ ప్రాజెక్టుకు రక్షణ శాఖ భూములు బదలాయించినందుకు కృతజ్ఞతలు తెలిపాను.
ఆదిలాబాద్ ఎయిర్పోర్ట్ అభివృద్ధికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం భూ సేకరణ, యుటిలిటీస్ బదలాయింపు వంటి అంశాల్లో పూర్తి సహకారం అందిస్తామని కేంద్ర మంత్రికి తెలిపాను.
రాష్ట్రంలోని మహబూబ్నగర్ జిల్లా దేవరకద్ర సమీపంలో డీఆర్డీవో/డీఆర్డీఎల్ ఎంచుకున్న ప్రదేశంలో వారికి సంబంధించిన కీలకమైన ప్రాజెక్ట్ను త్వరగా మంజూరు చేయాలని కేంద్ర మంత్రికి విజ్ఞప్తి చేశాను.
ఈ రోజు ఢిల్లీలో కేంద్ర రైల్వే శాఖ మంత్రి శ్రీ అశ్వనీ వైష్ణవ్ తో మరో కేంద్ర మంత్రి శ్రీ కిషన్ రెడ్డి తో కలిసి భేటీ అయ్యాను. హైదరాబాద్ మెట్రో ఫేజ్ -2కు నిర్మాణం, రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న చర్యలు, నిధుల సమీకరణ పై చర్చించాం.
#HyderabadMetroPhase2#MetroExpansion
#TelanganaDevelopment
#TelanganaRising2047
Live: Hon'ble CM Revanth Reddy participates in the Inauguration of Telangana Public School and the launch of the Breakfast Scheme at Arutla. https://t.co/XdKl45Xt9V
Live: Chief Minister Shri Revanth Reddy lays the foundation stone for the Koheda International Fruit Market and Sub-Registrar Office. https://t.co/aR4Y01Vrlb
రైతులు ఎంతో కాలంగా ఎదురు చూస్తోన్న కోహెడ లో ఇంటిగ్రేటెడ్ ఫ్రూట్ మార్కెట్, ఇంటిగ్రేటెడ్ సబ్ రిజిస్టార్ ఆఫీస్ కాంప్లెక్స్ లకు శంకుస్థాపన చేశాను. ఇన్నాళ్లు రేకుల షెడ్డుల్లో, కనీస సౌకర్యాలు కొరవడిన పండ్ల మార్కెట్ స్థానంలో ఆధునాతన సౌకర్యాలతో, రైతులకు సకల సదుపాయాలతో ఈ మార్కెట్ ను నిర్మించబోతున్నాం.
ఈ కార్యక్రమంలో మంత్రులు శ్రీ తుమ్మల నాగేశ్వర రావు, శ్రీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, శ్రీ శ్రీధర్ బాబు, శాసన మండలి చీఫ్ విప్ శ్రీ పట్నం మహేందర్ రెడ్డి, ఎంపీ లు శ్రీ వేం నరేందర్ రెడ్డి, శ్రీ చామల కిరణ్ కుమార్ రెడ్డి, స్థానిక శాసన సభ్యుడు శ్రీ మల్ రెడ్డి రంగా రెడ్డి , శ్రీ నవీన్ యాదవ్ , శ్రీ కసిరెడ్డి నారాయణ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
#KohedaFruitMarket
#IntegratedFruitMarket
#AgricultureDevelopment
#ModernMarketInfrastructure
#TelanganaDevelopment
#PrajaPalana
#TelanganaProgress
#IntegratedSubRegistrarOffice
#Koheda
ప్రాణహిత - చేవేళ్ల ప్రాజెక్టులో భాగంగా తుమ్మిడిహెట్టి వద్ద బ్యారేజ్ నిర్మించే కార్యాచరణ వేగవంతం చేయాలని నీటిపారుదల శాఖ అధికారులను ఆదేశించాను.
ఈ రోజు ఎంసీహెచ్ఆర్డీలో ఈ ప్రాజెక్టు పై సమీక్ష నిర్వహించాను. ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్ట్ మీద ఇప్పటికే ప్రభుత్వం సుమారు రూ. 11 వేల కోట్లు ఖర్చు చేసిందని, కొన్ని చోట్ల కాల్వల నిర్మాణం కూడా జరిగిందని అధికారులు వివరించారు.
మహారాష్ట్రతో చర్చించి 150 మీటర్ల ఎత్తుతో బ్యారేజీ నిర్మిస్తే కనీసం 100 టీఎంసీలు వినియోగించుకునే అవకాశం ఉంటుందని ఇంజనీరింగ్ నిపుణులు సూచించారు. మహారాష్ట్రలో ఎక్కువ ముంపు లేకుండా మధ్యేమార్గంగా 150 మీటర్ల ఎత్తు నిర్మిస్తే తక్కువ ఖర్చు తో నీటిని తీసుకునే వీలుందని వారు స్పష్టం చేశారు.
ప్రాజెక్ట్ ప్రాధాన్యత దృష్ట్యా వెంటనే మహారాష్ట్ర తో సంప్రదింపులు జరపాలని, మహారాష్ట్రలో బీజేపీ ప్రభుత్వం ఉన్నందున వారితో సంప్రదింపులు, పరిష్కార సాధన కోసం రాష్ట్రం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న కేంద్ర మంత్రి శ్రీ కిషన్ రెడ్డికి వెంటనే లేఖ రాసి, ఆయన సహకారం తీసుకోవాలని నీటిపారుదల శాఖ మంత్రి శ్రీ ఉత్తమ్ కుమార్ రెడ్డికి సూచించాను.
మేడిగడ్డ బ్యారేజ్ పునరుద్దరణ చర్యల్లో భాగంగా చేపడుతున్న జియో టెస్టింగ్ పనులను వేగంగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించాను.
#IrrigationProjects #WaterManagement #TelanganaIrrigation
#Medigadda #BarrageConstruction
Warm birthday wishes to State Government Advisor Sri @mohdalishabbir garu.
May Almighty bless him with good health and long life as he continues to serve the people and contribute to the state’s development with dedication and commitment.
#HappyBirthday