ఏళ్ల తరబడి సాగు చేసుకుంటున్న మేడిగూడకు చెందిన రైతు భావనే పార్వతీబాయికి సాత్నాల మండల పరిధిలోని మాంగుర్ల శివారులోని 35 సర్వే నంబరులో పట్టా ఇచ్చినప్పటికీ క్షేత్రస్థాయిలో స్వాధీనం చూపలేదు.
ఈ విషయాన్ని అధికారులు జిల్లా కలెక్టర్ రాజర్షిషా దృష్టికి తీసుకెళ్లడంతో సమగ్ర సర్వే నిర్వహించి వాస్తవాలను పరిశీలించిన, అనంతరం పాత 35 సర్వే నంబరు పట్టాను రద్దు చేసి, ప్రస్తుతం సాగులో ఉన్న 59 సర్వే నంబరులోని 4 ఎకరాల భూమినే అధికారికంగా కేటాయిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. అర్ధ శతాబ్ద కాలం నాటి సమస్య పరిష్కారం కావడంతో సదరు రైతు కుటుంబం బుధవారం కలెక్టర్ ను తన క్యాంపు కార్యాలయంలో కలిసి కృతజ్ఞతలు తెలిపింది.
ఈ కార్యక్రమంలో సాత్నాల మండల తహసీల్దార్ రామారావు, లబ్ధిదారు కుమారుడు భావనే దత్తు, తదితరులు పాల్గొన్నారు.
#Adilabad #GovernmentOfTelangana #IPRTELANGANA #TelanganaRising2047 #TelanganaRising #Telangana
@TelanganaCMO@TelanganaCS@CPRO_TGCM@Bhatti_Mallu@INC_Ponguleti@jupallyk_rao@seethakkaMLA@RajarshiShahIAS@ANI@PIBHindi@PIB_India@MIB_India@PTI_News@DCsofIndia@DDNewslive@DDNational@IasTelangana@IPRTelangana@IasTelangana@IPRTelangana@PIBHyderabad
ప్రతి నెల తనిఖీలో భాగంగా బుధవారం స్థానిక శాంతినగర్‌లోని ఈవీఎం, వీవీప్యాట్ యంత్రాల గోదాంను జిల్లా కలెక్టర్ రాజర్షిషా తనిఖీ చేశారు.
ఈ సందర్భంగా గోదాం వద్ద చేపట్టిన భద్రతా ఏర్పాట్లు, సీసీటీవీ నిఘా, పరిశుభ్రతను పరిశీలించి అధికారులకు పలు సూచనలు చేశారు.
ఈ తనిఖీల్లో జిల్లా ఎన్నికల విభాగం పర్యవేక్షణ అధికారి నలంద ప్రియ, నాయబ్ తహసీల్దార్ మధుసూదన్, సిబ్బంది పాల్గొన్నారు.
#CEOTelangana #ECI
@ECISVEEP@SpokespersonECI@CEO_Telangana@TelanganaCMO@TelanganaCS@IPRTelangana
ప్రత్యేక ఓటరు జాబితా సవరణ కార్యక్రమం, పోలింగ్ కేంద్రాల హేతుబద్ధీకరణ, సంబంధిత అంశాలపై బుధవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులతో జిల్లా కలెక్టర్ రాజర్షిషా సమీక్ష సమావేశం నిర్వహించి దిశ నిర్దేశం చేశారు.
ఈ సమావేశంలో ఆర్డిఓ జగదీశ్వరరావు, తహసీల్దార్ శ్రీనివాస్, ఎన్నికల విభాగం పర్యవేక్షకురాలు నలందప్రియ, వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులు, ఇతర రెవెన్యూ అధికారులు, సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.
#SIR2026 #CEOTelangana #ECI #VoterAwareness #EnumerationForm #EnumerationPhase #SpecialIntensiveRevision
@ECISVEEP@SpokespersonECI@CEO_Telangana@dcotelangana@TelanganaCMO@TelanganaCS@IPRTelangana@PIB_India@PIBHyderabad@airnewsalerts@AirHyderabad