జనసేన పార్టీ అధ్యక్షులు మరియు గౌ|| ఉప ముఖ్యమంత్రివర్యులు "శ్రీ పవన్ కళ్యాణ్" గారి జన్మదిన పురస్కరించుకొని ఆయన పిలుపు మేరకు గ్రామంలో మొక్కలు నాటడం జరిగింది, తాటిగూడ గ్రామంలో గరివిడి మండల జనసేన పార్టీ అధ్యక్షులు పెద్ది వెంకటేష్ గారు
#HappyBirthdayPawanKalyan#CleanAndhraGreenAndhra
శుక్రవారం సాయంత్రం మంగళగిరిలో నిర్వహించే ‘జనసేన ఆత్మీయ సమావేశం’ ఏర్పాట్లను పరిశీలించిన జనసేన పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్, రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి శ్రీ @mnadendla గారు.
పర్యావరణాన్ని పరిరక్షించే అభివృద్ధి ప్రస్థానం - జనసేన విధానం
జనసేన పార్టీ ఆవిర్భావం నుండి పర్యావరణ పరిరక్షణ కోసం మాట్లాడటమే కాకుండా పార్టీ ప్రాధమిక సిద్ధాంతాలలో చేర్చి, మన నుడి - మన నది, మట్టి వినాయకుడు, క్లీన్ గోదావరి, భీమవరం డంపింగ్ యార్డ్, పారిశ్రామిక కాలుష్యం, కాకినాడ బీచ్ కలుషిత వ్యర్థాల నియంత్రణ వంటి చర్యలు చేపడుతూనే, మరోవైపు 50% పచ్చదనం పెంపొందించేలా ప్రభుత్వం తరపున తీర ప్రాంతాన్ని పరిరక్షించేందుకు 1053 కి.మీ గ్రేట్ గ్రీన్ వాల్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ మడ అడవుల పెంపకం, 5 కోట్ల సీడ్ బాల్స్, నగర వనాలు వంటి చర్యలు గౌ|| ఉప ముఖ్యమంత్రి శ్రీ @PawanKalyan గారు చేపట్టారు.
మన ఇంటినే కాదు, మన పరిసరాలు, మన చెరువులు, నదులు, సముద్రాలను పరిరక్షించుకుందాం, కాలుష్యం బారి నుండి కాపాడుకుందాం, భావి తరాలకు స్వచ్ఛమైన గాలిని తాగునీటిని అందిద్దాం.
#SayNoToPollution #CleanAndhraGreenAndhra #JSPForNewAgePolitics
మిమ్మల్ని రాజకీయంగా ఓడించే నాయకుడు ఈ భారతదేశంలో లేడు... రాబోడు... దేశం కోసం మీరు పడిన శ్రమ, చేసిన త్యాగం, చూపించిన అంకితభావానికి సాటి ఎవరూ లేరు....
మీరు స్వయంగా వద్దనుకుంటేనే అధికారం మీ చేతుల నుంచి వెళ్తుంది... కానీ మీరు దేశం కోసం పనిచేసేంత వరకు, మేమంతా మీ వెంటే ఉంటాం @narendramodi గారు - @PawanKalyan
#BhogapuramAirport
#ModiHonoursAlluri
#AlluriSitaramaRajuAirport
#CitizenCouncil#JSPForNewAgePolitics
Citizen Council - Need of the Hour!
• It's very simple. Create a WhatsApp group with 1,000 members. At least then politicians will take it seriously, considering those votes.
• We have caste and religious groups on WhatsApp, so why can't we have groups that can protect law and order?
"జనసేన పార్టీ నిర్మాణ సారథుల సమాచార సేకరణ కమిటీ" ముఖ్య ఉద్దేశం
• జనసేన సాధక్ స్థాయి నుండి నాయకత్వాన్ని తయారుచేయడం
• ఈ కమిటీ సభ్యులు కేవలం పార్టీ నిర్మాణంలో వివిధ కమిటీల్లో పనిచేయాలనుకునే వారి వివరాలు సేకరించడం
• పార్లమెంట్, అసెంబ్లీ, మండల, గ్రామ స్థాయితో పాటుగా, వివిధ పార్టీ విభాగాల్లో సేవలు అందించాలనే వారి నుండి దరఖాస్తులు స్వీకరించడం
• ఈ కమిటీలు సేకరించిన వివరాలను పార్టీ అధ్యక్షులు శ్రీ @PawanKalyan గారి దృష్టికి తీసుకురావడం
• ఈ కమిటీకి పార్టీలో పోస్టులు నిర్ణయించే అధికారం లేదు
• ఈ కమిటీలు తాత్కాలికంగా, కేవలం ఈ ప్రక్రియ ముగిసే వరకు మాత్రమే పనిచేస్తాయి.
• పార్టీలో వివిధ హోదాల్లో సేవలు అందించాలి అనుకునే ఔత్సాహికులకు ఈ కమిటీల్లో చోటు కల్పించకుండా, వారు దరఖాస్తు చేసుకునే అవకాశం కల్పించడం జరిగింది.
#JSPForNewAgePolitics #JSPMembershipToLeadership
మంగళగిరి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారిని దర్శించుకున్న శ్రీ @PawanKalyan గారు
మంగళగిరి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారిని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రివర్యులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు బుధవారం ఉదయం దర్శించుకున్నారు. స్వామి వారికి పట్టు వస్త్రాలు సమర్పించి, అష్టోత్తరాలతో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం కొండ ఎగువన కొలువైన శ్రీ పానకాల లక్ష్మీనరసింహస్వామి వారి ఆలయాన్ని సందర్శించారు. పానకాల స్వామి వారికి పట్టువస్త్రాలతోపాటు పానకం నైవేద్యంగా సమర్పించి పూజలు చేశారు. ఆలయ అర్చకులు వేదాశీర్వచనాలు, స్వామివారి తీర్థప్రసాదాలు అందజేశారు.
అంతకు ముందు శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి వారిని దర్శించుకునేందుకు విచ్చేసిన శ్రీ పవన్ కళ్యాణ్ గారికి ఆలయ అధికారులు, ధర్మకర్తల మండలి సభ్యులు మంగళవాద్యాలతో స్వాగతం పలికారు. రాష్ట్ర మెడికల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ మెంట్ కార్పోరేషన్ శ్రీ చిల్లపల్లి శ్రీనివాస్ గారు తదితరులు శ్రీ పవన్ కళ్యాణ్ గారితో ఉన్నారు.
ప్రజా ప్రతినిధిగా ప్రజలను కులాలవారీగా చూడను. తప్పు చేసిన వాడు ఏ కులం వాడైనా తప్పే అని అధ్యక్షులు @PawanKalyan గారు చెప్తే, రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న వైసీపీ నాయకులను పట్టుకొచ్చి పవన్ కళ్యాణ్ గారిని తిట్టే పని పెట్టుకున్నారు.
పవన్ కళ్యాణ్ గారిని తిడితే జగన్ మోహన్ రెడ్డి గారి దృష్టిలో పడతారేమో కానీ, కాపు కులం పేరు చెప్పుకుని పవన్ కళ్యాణ్ గారిని తిడితే కదా ప్రజలు మిమ్మల్ని రాజకీయ సమాధి చేసేది. మీరు అదే కొనసాగిస్తే మళ్ళీ అదే పునరావృతం అవుతుంది.
జగన్ మోహన్ రెడ్డి గారి మెప్పు కోసం మీరు పడుతున్న తపన పవన్ కళ్యాణ్ గారికి ఏమీ నష్టం కాదు. కాపు ప్రజానీకం అంతా చూస్తోంది. 2 సంవత్సరాల క్రితం మీకు బుద్ధి చెప్పారు, ఇప్పటికీ అదే పంథాలో వెళ్తే మీకు మనుగడ కూడా ఉండదు.
- జనసేన పార్టీ ఉమ్మడి విశాఖపట్నం రూరల్ జిల్లా అధ్యక్షులు పెందుర్తి నియోజకవర్గం శాసనసభ సభ్యులు శ్రీ పంచకర్ల రమేష్ బాబు.