Honouring the Brave Police Martyrs
On Police Commemoration Day, I paid heartfelt tributes to the police martyrs at Hanumakonda, along with district officials, public representatives, police personnel, and martyrs’ families.
The courage and sacrifice of 25 police personnel of the Warangal Police Commissionerate who laid down their lives in the line of duty remain an enduring inspiration.
I also interacted with their families and reaffirmed the department’s commitment to their welfare.
Their sacrifice is eternal; their service, our inspiration.
#WarangalPolice #PoliceMartyrs #TelanganaPolice #PoliceCommemorationDay
ట్రాఫిక్ ఆంక్షలు – వరంగల్ పోలీస్ కమిషనరేట్
ఇందుమూలంగా వరంగల్, హనుమకొండ మరియు కాజీపేట ప్రాంతాల పౌరులకు, ప్రయాణికులకు తెలియజేయునది ఏమనగా, తేదీ 17-10-2026న ఉదయం 04:00 గంటల నుండి 10:00 గంటల వరకు హాఫ్ మారథాన్ పరుగు నిర్వహించబడుతున్నందున, ప్రజలకు మరియు ప్రయాణికులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా క్రింది ట్రాఫిక్ ఆంక్షలు విధించడమైనది.
1. హైదరాబాద్ నుండి హనుమకొండకు వచ్చే వాహనాలు/బస్సులు:
ఫాతిమా జంక్షన్ నుండి మదర్ థెరిసా సెంటర్ మీదుగా ఎడమవైపునకు మళ్లి, వడ్డేపల్లి చర్చి – తులసి బార్ – కేయూసీ జంక్షన్ – నయీంనగర్ – సీపీఓ జంక్షన్ మీదుగా హనుమకొండ బస్టాండ్‌కు చేరుకోవాలి.
2. హనుమకొండ నుండి హైదరాబాద్‌కు వెళ్లే వాహనాలు/బస్సులు:
అశోక జంక్షన్ మీదుగా ములుగు రోడ్డు – పెద్దమ్మగడ్డ – కేయూసీ – తిరుమల బార్ – వడ్డేపల్లి చర్చి – ఫాతిమా సెంటర్ – కాజీపేట మీదుగా హైదరాబాద్‌కు వెళ్లాలి.
3. హనుమకొండ నుండి కరీంనగర్‌కు వెళ్లే వాహనాలు/బస్సులు:
అశోక జంక్షన్ మీదుగా ములుగు రోడ్డు – పెద్దమ్మగడ్డ – కేయూసీ మీదుగా వెళ్లాలి.
4. ఖమ్మం నుండి హనుమకొండకు వచ్చే వాహనాలు/బస్సులు:
సీఎస్ఆర్ గార్డెన్ జంక్షన్ వద్ద డైవర్షన్ తీసుకొని, పోతన జంక్షన్ మీదుగా హనుమకొండకు వెళ్లాలి.
గమనికలు:
1. 100 ఫీట్ల రోడ్డుపై ఒకవైపు మాత్రమే వాహనాల రాకపోకలకు అనుమతి ఉంటుంది.
2. తేదీ 17-10-2026న ఉదయం 04:00 గంటల నుండి 10:00 గంటల వరకు క్రింది మార్గాల్లో వాహనాల రాకపోకలకు అనుమతి ఉండదు:
- సీఎస్ఆర్ గార్డెన్ జంక్షన్ నుండి అదాలత్ వైపు.
- అంబేద్కర్ జంక్షన్ నుండి కాలేజీ జంక్షన్ వరకు.
- ఫాతిమా జంక్షన్ నుండి ఎన్ఐటీ వైపు.
ప్రజలు, ప్రయాణికులు ఈ ట్రాఫిక్ ఆంక్షలను గమనించి, పోలీసులకు సహకరించాలని కోరడమైనది.
ఇట్లు,
ఎన్. శ్వేత, ఐపీఎస్
పోలీస్ కమిషనర్,
వరంగల్ పోలీస్ కమిషనరేట్.
@TelanganaDGP@TelanganaCOPs
ఆటపాటలతో అంబరాన్నంటిన బతుకమ్మ సంబరాలు
వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలోని వివిధ పోలీస్ స్టేషన్లలో విధులు నిర్వహిస్తున్న మహిళా కానిస్టేబుళ్ల నుంచి ఉన్నతాధికారుల వరకు అందరి కోసం గురువారం సాయంత్రం హనుమకొండ పోలీస్ హెడ్‌క్వార్టర్స్‌లో బతుకమ్మ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకల్లో @cpwarangal ఎన్. శ్వేత, ఐపీఎస్, సెంట్రల్ జోన్ డీసీపీ దార కవితతో కలిసి ఉత్సాహంగా పాల్గొన్నారు.
పోలీస్ కమిషనర్, సెంట్రల్ జోన్ డీసీపీ స్వయంగా సంప్రదాయ బతుకమ్మ పాటలు ఆలపిస్తూ, మహిళా సిబ్బందితో కలిసి నృత్యాలు చేసి వారిలో ఉత్సాహాన్ని నింపారు.
ఈ సందర్భంగా పోలీస్ కమిషనర్ మాట్లాడుతూ, మనం ఎంత ఆధునిక జీవనశైలికి అలవాటు పడినా మన మూలాలను, సంస్కృతి సంప్రదాయాలను ఎట్టి పరిస్థితుల్లోనూ మరచిపోకూడదని పేర్కొన్నారు. విధి నిర్వహణలో నిరంతరం బాధ్యతలు నిర్వర్తించే పోలీసు సిబ్బందికి ఇటువంటి సాంస్కృతిక కార్యక్రమాలు ఆహ్లాదాన్ని, మానసిక ఉల్లాసాన్ని అందిస్తాయని అన్నారు. హైదరాబాద్ వంటి మహానగరాలతో పోలిస్తే వరంగల్‌లో బతుకమ్మ ఉత్సవాలను ఎంతో ఘనంగా, సంప్రదాయబద్ధంగా నిర్వహించడం సంతోషకరమని తెలిపారు. బతుకమ్మ ఉత్సవాలు తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాల గొప్పతనాన్ని చాటుతూ ప్రజల్లో ఉత్సాహాన్ని నింపుతున్నాయని పేర్కొన్నారు.
ఉత్తమ బతుకమ్మలకు బహుమతుల ప్రదానం
వివిధ రకాల సహజ సిద్ధమైన పూలతో ఆకర్షణీయంగా బతుకమ్మను రూపొందించిన భరోసా సెంటర్ సిబ్బందికి మొదటి బహుమతిని ప్రదానం చేశారు. అలాగే, బతుకమ్మ పాటలు ఆలపించిన సుబేదారి పోలీస్ స్టేషన్‌కు చెందిన మహిళా కానిస్టేబుల్ స్వప్నను పోలీస్ కమిషనర్ అభినందించి, ఆమెకు ప్రత్యేక బహుమతిని అందజేశారు.
సంప్రదాయానికి అనుగుణంగా, వినూత్న రీతిలో పోలీస్ హెడ్‌క్వార్టర్స్‌లో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన నీటి కొలనులో మహిళా సిబ్బంది తమ బతుకమ్మలను నిమజ్జనం చేశారు. ఈ సందర్భంగా భక్తిశ్రద్ధలతో గంగాప్రవేశం నిర్వహించి, గౌరమ్మకు భక్తిపూర్వకంగా వీడ్కోలు పలికారు.
ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించేందుకు సహకరించిన పోలీస్ కమిషనర్ ఎన్. శ్వేత, ఐపీఎస్, సెంట్రల్ జోన్ డీసీపీ దార కవిత, అడిషనల్ డీసీపీ (పరిపాలన) రాయల ప్రభాకర్ రావు, అడిషనల్ డీసీపీ (ఏఆర్) సురేష్, అడిషనల్ డీసీపీ (ఏఆర్) వేముల శ్రీనివాస్, అడ్మిన్ ఆర్ఐ స్పర్జన్ రాజ్, వెల్ఫేర్ ఆర్ఐ సతీష్, ఎం.టి. ఆర్ఐ శ్రీధర్, ఆర్ఎస్ఐ శ్రావణ్‌తో పాటు ఇతర సిబ్బందికి మహిళా సిబ్బంది ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.
@TelanganaDGP@TelanganaCOPs #Bathukamma #WarangalPolice
విదేశీయుల రాకపోకల వివరాల నమోదు తప్పనిసరి – నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు
వరంగల్ పోలీస్ కమిషనర్ ఎన్. శ్వేత, ఐపీఎస్
వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో విదేశీయులకు వసతి కల్పించే హోటళ్లు, హాస్టళ్లు, అద్దె గృహాల యజమానులు, విద్యా, వైద్య సంస్థల నిర్వాహకులు ఇమ్మిగ్రేషన్ అండ్ ఫారినర్స్ యాక్ట్–2025లోని సెక్షన్ 8 ప్రకారం, విదేశీ పౌరులు, OCI కార్డుదారులు, నేపాల్, భూటాన్ దేశస్థులు సహా విదేశీయుల రాకపోకలకు సంబంధించిన వివరాలను వారు వచ్చిన లేదా వెళ్లిన 24 గంటల్లోపు ఆన్లైన్ పోర్టల్‌లో ఫారమ్–III (గతంలో ఫారమ్–C) ద్వారా తప్పనిసరిగా నమోదు చేయాలని వరంగల్ పోలీస్ కమిషనర్ ఎన్. శ్వేత, ఐపీఎస్ సూచించారు.
విదేశీయుల వివరాలను నిర్దేశిత సమయంలో నమోదు చేయకపోతే ఇమ్మిగ్రేషన్ అండ్ ఫారినర్స్ యాక్ట్–2025లోని సెక్షన్ 23(బి) ప్రకారం చర్యలు తీసుకునే అవకాశం ఉందని కమిషనర్ తెలిపారు. వ్యక్తిగత లేదా వాణిజ్య వసతి నిర్వాహకులకు ప్రతి ఉల్లంఘనకు కనీసం రూ.50,000 జరిమానా, విద్యా, వైద్య సంస్థలకు కనీసం రూ.1,00,000 జరిమానా విధించడంతోపాటు నేర విచారణను ఎదుర్కోవాల్సి ఉంటుందని పేర్కొన్నారు.
@TelanganaDGP@TelanganaCOPs
వరంగల్ పోలీస్ కమిషనరేట్ లో పోలీస్ అమరవీరుల సంస్మరణ దినోత్సవం, పోలీస్ ఫ్లాగ్ డే సందర్భంగా అక్టోబర్ 21 నుంచి 31వ తేదీ వరకు వివిధ కార్యక్రమాలు నిర్వహించబడుతున్నవి. ప్రతీ విభాగంలో ప్రతిభ కనబరిచిన మొదటి ముగ్గురు విజేతలకు అవార్డులు అందజేయడంతో పాటు రాష్ట్రస్థాయి పోటీల్లో పాల్గొనే అవకాశం కల్పించనున్నారు.
1). వ్యాసరచన పోటీలు(తెలుగు/ఇంగ్షీషు/ఉర్దూ బాషలల్లో)
(పేపర్ మీద వ్యాసాలు వ్రాసి, ఫోటో తీసి, PDF గా మార్చి, తేదీ:24-10-2026 లోపు ఆన్లైన్ ద్వారా పంపవలెను, వ్యాసం 500 పదాలకు మించకూడదు.).
Registration link: https://t.co/1JJWMDJtt8
i)12 వ తరగతి విద్యార్దుల వరకు:
అంశం:
1). Role of citizens and Police in preventing cybercrime (నేరాల నివారణలో పోలీసు-పౌరుల యొక్క పాత్ర) ( سائبر کرائم کی روک تھام میں پولیس اور شہریوں کا کردار)
2). Drugs Menace : Role of Police in prevention and how students can stay away from drugs (డ్రగ్స్ నిర్వహణ: నివారణలో పోలీసుల పాత్ర మరియు విద్యార్ధులు డ్రగ్స్ నుండి ఎలా దూరంగా ఉండగలరు.),( منشیات کی روک تھام میں پولیس کا کردار اور طلبہ منشیات سے کیسے دور رہ سکتے ہیں؟)
ii). డిగ్రీ & ఆ పై తరగుతుల వారికి :
1). Role of Police in combating misuse of social media ( సోషల్ మీడియా దుర్వినియోగాన్ని అరికట్టడంలో పోలీసుల పాత్ర )( سوشل میڈیا کے غلط استعمال کی روک تھام میں پولیس کا کردار)
2). My Role on making Telangana Drug free state( తెలంగాణను డ్రగ్స్ రహిత రాష్ట్రం గా తీర్చి దిద్దడంలో నా పాత్ర), ( تلنگانہ کو منشیات سے پاک ریاست بنانے میں میرا کردار)
2). షార్ట్ ఫిల్మ్స్ పోటీలు-( చివరి తేదీ:23-10-2026)
పోలీస్ అమరవీరుల త్యాగాలు, పోలీసుల విధులు, ప్రతిభ, ప్రజల రక్షణ వంటి అంశాలపై యువత, ఔత్సాహిక ఫోటోగ్రాఫర్లు మూడు నిమిషాలకు మించని షార్ట్ ఫిల్మ్‌ను పెన్‌డ్రైవ్‌లో భధ్రపరిచి అందజేయాలి.
ఎంపికైన మూడు ఉత్తమ షార్ట్ ఫిల్మ్‌లు, రాష్ట్రస్థాయి పోటీలకు డీజీపీ కార్యాలయం, హైదరాబాద్‌కు పంపించబడుతుంది. ఆసక్తి గల వారు తమ ఎంట్రీలను అక్టోబర్ 23వ తేదీ సాయంత్రంలోగా హన్మకొండ పోలీస్ హెడ్ క్వార్టర్ లో PRO గారికి అందించవలెను.
3). ఫోటోగ్రఫీ పోటీలు-( చివరి తేదీ:23-10-2026)
పోలీస్ అమరవీరుల త్యాగాలు, పోలీసుల విధులు, ప్రతిభ, ప్రజల రక్షణ వంటి అంశాలపై యువత, ఔత్సాహిక ఫోటోగ్రాఫర్లు మూడు ఫోటోలు 10×8 అంగుళాల పరిమాణంలో సమర్పించాలి.
ఎంపికైన మూడు ఉత్తమ ఫోటోలను రాష్ట్రస్థాయి పోటీలకు డీజీపీ కార్యాలయం, హైదరాబాద్‌కు పంపించబడుతుంది. ఆసక్తి గల వారు తమ ఎంట్రీలను అక్టోబర్ 23వ తేదీ సాయంత్రంలోగా హన్మకొండ పోలీస్ హెడ్ క్వార్టర్ లో PRO గారికి అందించవలెను.
4). ఆర్టికల్స్ మరియు ఫీచర్స్(వ్యాసాలు/విశేష వ్యాసాలు/ముఖ్య అంశాలు):-( చివరి తేదీ:19-10-2026)
పోలీసు త్యాగాలు మరియు పోలీసు సంబంధిత వృత్తిపరమైన కృషి అనే అంశంపై ప్రముఖ రచయితలు మరియు పాత్రికేయులు రాసిన వ్యాసాలు, స్వీకరించి తేదీ:21-10.2026 నుండి ఒక వారం రోజుల పాటు తెలుగు ఇంగ్లీష్ మరియు ఉర్దూ వార్తాపత్రికలలో ప్రచురించబడును.
కావున ఔత్సాహిక రచయితలు మరియు పాత్రికేయులు రాసిన వ్యాసాలు అక్టోబర్ 19వ తేదీ సాయంత్రంలోగా హన్మకొండ పోలీస్ హెడ్ క్వార్టర్ లో PRO గారికి అందించవలెను.
@TelanganaDGP@TelanganaCOPs
#FlagDay2026
Addressed young girls below 18 years of age, highlighting the importance of being aware of their rights, personal safety and cyber security.
I urged them to stay vigilant on social media, report harassment without fear, and seek assistance from SHE Teams whenever necessary.
I thank Dr. Radhika for sensitising girls on their health and Mr. Barupati Gopi, Psychologist for motivating the girls with empowering words.
I sincerely thank all the girls, their parents, members of the Girls’ Associations (Baalika Sanghaalu) and Collector Warangal, DRDO Warangal and the distinguished guests for their participation and support.
@TelanganaDGP@TelanganaCOPs
Yesterday evening while proceeding to the 10th Bn NDRF, Vijayawada, to participate in the CBRN Regional Competition, the personnel of the 1st Bn of @tgspbnshq TG Special Police SDRF team noticed a civilian who had been hit by a car near ORR Exit No. 14. He was Sai Teja a resident of Warangal and working as an intern in Tukkuguda.
The team immediately provided first aid to the injured person, arranged for his transportation to the hospital by ambulance, and informed his family about the incident.
The team’s prompt response and timely assistance helped ensure that the injured civilian received immediate medical attention.
@fasi_adeeb@TelanganaDGP@cpwarangal@HiWarangal@CVAnandIPS@acpnarsampet Khanapur PS registered an FIR & traced the girls. While returning, both minors reported consuming an unknown toxic substance &were admitted to MGM. They are under treatment. Investigation is underway, Suspects will face strict legal action. Avoid any rumours as victims are minors
Passenger safety is a priority for @warangalpolice.
Privileged to launch the “Abhaya – My Taxi Safe” App to enhance the safety of women and passengers.
Auto and cab operators are encouraged to register their vehicles and display the designated safety stickers obtained through their nearest Traffic Police Station.
Warangal Police – Committed to Safe & Secure Journeys.
@TelanganaDGP
#AbhayaMyTaxiSafe
Honoured to inaugurate the 12th State-Level Athletics Championship at JNS Stadium, Hanumakonda.
JNS Stadium is a valuable facility for nurturing sporting talent. I urge all participants to make the best use of it and give their best.
Participation is itself a mark of achievement. Best wishes to all the participants.
#WarangalPolice #AthleticsChampionship
@TelanganaDGP@TelanganaCOPs
Went for an aerial survey with Hon’ble Minister Ponnam Prabhakar garu and senior officials at 3 pm to assess the movement of idol-laden vehicles and the immersion arrangements across the CURE area.
Observed that the number of vehicles on the roads is less than expected. Our teams may have a long night ahead. After coming back instructed all unit officers to talk to the organisers and speed up.
Will brief the media at 7:30 pm today on the situation across the entire state.
Taking ‘Sanghamitra’ program further across the commissionerate, today it was launched at Kaloji Kala Kshetram, Hanamkonda, to strengthen anti-drug awareness across Hanamkonda district.
Through women’s SHGs, MEPMA members and volunteers, the message will reach 1.60 lakh members and every family, empowering communities to protect our youth from drugs and ganja.
Citizens are urged to report information on drug use, sale or supply. Informants’ identities will be kept confidential, with suitable rewards for valuable information.
This is only the beginning, in the coming months we will closely work with Sanghamitras for Drug Free and Safe Warangal.
Say NO to Drugs – Say YES to Life.
#Sanghamitra #WarangalPolice #SayNoToDrugs #DrugFreeSociety
@TelanganaDGP@TelanganaCOPs@EAGLE_TELANGANA
Participated in a four-day training programme for police trainers of the Bhadradri Zone on effective crowd management during festivals, processions and other law and order related instances.
The training will empower them with skills and strategies for professional and respectful approach while handling law and order issues.
@dgptelangana@telanganacops
Participated in the launch of “Sanghamithra” along with @Collector_WGL, in partnership with SHG women, VOAs, MEPMA and the public.
Our aim is to spread the anti-drug message to 1.17 lakh members and, through them, to every household, building a safer, drug-free society.
Say NO to Drugs – Say YES to Life.
#Sanghamithra #WarangalPolice #SayNoToDrugs #DrugFreeSociety @TelanganaDGP@TelanganaCOPs@warangalpolice
.@CBCWarangal ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ‘హర్ ఘర్ తిరంగా’పై రెండు రోజుల ప్రచార కార్యక్రమం @Collector_HNK చాహత్ బాజ్‌పాయ్, @cpwarangal కమిషనర్ ఎన్. శ్వేత కాకతీయ ప్రభుత్వ కళాశాల లో నేడు ప్రారంభించారు.