ఎన్నికల ప్రచారంలో భాగంగా కడప పార్లమెంట్ పరిధిలో నిర్వహించిన రోడ్ షో కు, బహిరంగ సభకు తరలివచ్చి స్వాగతం పలికిన ప్రజలకు, అభిమానులకు, కార్యకర్తలకు ధన్యవాదాలు. మీ ఆశీర్వాదం ఉంటే ఎంతటి పోరాటానికైనా నేను సిద్ధం. నియంత పాలన అంతానికి కదలి రావాలి. వైయస్ఆర్ సంక్షేమ పాలన తిరిగి తీసుకురావాలి అది కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యం.
రాజశేఖర్ బిడ్డ ఈరోజు కడప ఎంపీ స్థానానికి పోటీ చేయడం జరుగుతుంది. కడప గడ్డ మీద న్యాయానికి, నేరానికీ జరుగుతున్న ఈ పోరాటంలో న్యాయం వైపు నిలబడతారని నమ్ముతున్నాను. పుట్టింటికి వచ్చిన ఆడబిడ్డను ఎలాగైతే ప్రేమగా చూసుకుంటారో.. అలాగే నన్ను కూడా మీ ఇంటి ఆడబిడ్డగా అక్కున చేర్చుకుంటారని ఆశిస్తున్నాను. అందుకే మే 13వ తేదీన జరిగే పోలింగ్లో ఎంపీ బ్యాలెట్ నమూనాలోని వరుస సంఖ్య '4' మీద 'హస్తం' గుర్తు బటన్ నొక్కి రాజశేఖర్ బిడ్డను ఆశీర్వదిస్తారని కొంగుచాచి అడుగుతున్నాను.
మనిషి మంచితనాన్ని గుర్తించడం రాజశేఖర్ రెడ్డి గారి నుంచి మీకు ఎందుకు రాలేదు జగనన్న?? ఏదైనా ఒక లావాదేవీ కోసం, లాభం కోసం ఆలోచన చేసే మనిషి కాదు ఆయన. అలాంటి వ్యక్తి బిడ్డని నేను. ఆయన హృదయానికి దగ్గరగా, ఆయన మాటలు వింటూ హృదయంలో హృదయంలా పెరిగాను. ఆయన ఆశయాల కోసం ఆ రకంగానే మీకు సహాయపడాలని నేను నిస్వార్థంగా త్యాగం చేశాను. మీ గెలుపు కోసం పని చేశాను.
ఈవీఎం మెషిన్ లో 2 నెంబర్ పై నొక్కండి..
మీ అమూల్యమైన ఓటును హస్తం గుర్తు పై వేసి నన్ను గెలిపించగలరని మనవి..
హస్తం పేద ప్రజల నేస్తం..✋✋
#AdminPost@realyssharmila