This is the Official Twitter account of Doordarshan News, Andhra Pradesh.The News is broadcast daily through DD Saptagiri at 8AM, 1PM,5PM, 7PM and 09.30PM.
స్వచ్ఛత హి సేవా కార్యక్రమంలో పాల్గొన్న కేంద్ర మంత్రి ఎల్. మురుగన్
♦న్యూఢిల్లీ ఐఐఎంసీలో 'స్వచ్ఛత హి సేవా 2026'లో పాల్గొన్న ఎల్. మురుగన్.
♦'ఏక్ దిన్, ఏక్ ఘంటా, ఏక్ సాథ్' శ్రమదానంలో పాల్గొని మొక్కలు నాటిన కేంద్ర మంత్రి.
#SwachhataHiSeva2026#LMurugan#IIMCNewDelhi
‘స్వచ్ఛతే సేవ’లో భాగస్వామ్యం కండి
♦సోషల్ మీడియాలో సమయం వృథా చేయకుండా సమాజ హితానికి కేటాయించాలి.
♦దేశవ్యాప్తంగా కొనసాగుతున్న 'స్వచ్ఛత హి సేవా' కార్యక్రమంలో భాగస్వామ్యం కావాలి.
#SwachhataHiSeva2026#CleanIndia#SwachhBharat
♦సాలూరును చెత్తరహిత పట్టణంగా తీర్చిదిద్దడమే లక్ష్యంగా ఉండాలని రాష్ట్ర మహిళా, శిశు సంక్షేమం, గిరిజన సంక్షేమ శాఖ మంత్రి గుమ్మిడి సంధ్యారాణి పిలుపునిచ్చారు.
♦సాలూరు పట్టణంలో నిర్వహించిన "ఏక్ దిన్-ఏక్ ఘంటా-ఏక్ సాథ్" పారిశుధ్య కార్యక్రమంలో మంత్రి పాల్గొన్నారు.
#SwachhataHiSeva2026
♦స్వచ్ఛతతోనే సంపూర్ణ ఆరోగ్యం సాధ్యమౌతుందని రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక శాఖా మంత్రి కందుల దుర్గేష్ అన్నారు.
♦నిడదవోలు పట్టణంలో నిర్వహించిన స్వచ్ఛతా హి సేవా కార్యక్రమంలో మంత్రి పాల్గొన్నారు.
#SwachhataHiSeva2026
♦విజయవాడ రైల్వే స్టేషన్ పరిసరాలలో స్వచ్ఛత హి సేవ కార్యక్రమన్ని నిర్వహించారు.
♦DRM మోహిత్ సోనాకీయ, ఇతర రైల్వే అధికారులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
#SwachhataHiSeva2026
♦పింఛన్ల పంపిణీ చేయడం ద్వారా రాష్ట్రంలో పేదలకు ఆర్థిక భద్రత కల్పిస్తున్నామని ముఖ్యమంత్రి @ncbn తెలిపారు.
♦బాపట్ల జిల్లా రేపల్లెలో ఎన్టీఆర్ భరోసా పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో మాట్లాడుతూ.. సీఎం అంటే కామన్ మ్యాన్‌లా పనిచేయాలని తాను భావిస్తానని స్పష్టంచేశారు.
♦ఈగల్ ఆంధ్రప్రదేశ్ బ్రేక్ ది సైలెన్స్-కాల్ ఈగల్ 1972 అనే క్యాంపెయిన్ ప్రారంభించటం జరిగిందని ఈగల్ విభాగం ఐజి ఆకె రవికృష్ణ తెలిపారు.
♦డ్రగ్స్, గంజాయి నియంత్రణపై తీసుకొంటున్న చర్యలపై ఆయన దూరదర్శన్ తో మాట్లాడుతూ..రాష్ట్రంలో ఉన్న యువతీ, యువకులు మత్తు పదార్థాలకు బానిసలు కావద్దన్నారు.
♦కేంద్ర శాస్త్ర, సాంకేతిక శాఖ సహాయ మంత్రి @DrJitendraSingh మాట్లాడుతూ.. యూపీఎస్సీ నియామకాల్లో పారదర్శకత పెరిగిందని, దీంతో ప్రజల్లో సంస్థపై విశ్వాసం మరింత బలపడిందన్నారు.
♦గత 12 ఏళ్లలో యూపీఎస్సీ ద్వారా సుమారు 65 వేల నియామకాలు జరిగాయని తెలిపారు.
♦యూపీఎస్సీ ఏర్పాటై 100 ఏళ్లు పూర్తయిన సందర్భంగా ప్రధాని శతాబ్ది స్మారక నాణెం, తపాల బిళ్ల, భారతదేశంలో UPSC.. పబ్లిక్ సర్వీస్ కమిషన్ల విధానాలను తీర్చిదిద్దిన 100 కీలక తీర్పులు అనే పుస్తకాన్ని ఆవిష్కరించారు.
♦యూపీఎస్సీ 100 ఏళ్ల ప్రస్థానంలో తరాలు, ప్రభుత్వాలు, సాంకేతికత, సిలబస్‌లు మారినా.. ఈ సంస్థపై ప్రజల విశ్వాసం మాత్రం చెక్కుచెదరలేదని ప్రధానమంత్రి @narendramodi తెలిపారు.
♦న్యూఢిల్లీలోని భారత్ మండపంలో జరిగిన యూపీఎస్సీ శతాబ్ది వేడుకల్లో ఆయన పాల్గొన్నారు.
♦ఫ్లై దుబాయ్ పైలట్ కెప్టెన్ స్మిత్ చూపిన ధైర్యం దేశానికి గర్వకారణమని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రశంసించారు.
♦ప్రస్తుతం స్మిత్ చికిత్స పొందుతున్నారని తెలిపారు.
♦స్మిత్ తండ్రి భూపేంద్ర, తల్లి గీత, భార్య సోనల్తో తాను మాట్లాడినట్లు ప్రధాని వెల్లడించారు.
♦అనంతరం విమానంలో ఉన్న మరో ఇద్దరు పైలట్లు బాధ్యతలు చేపట్టి సౌదీ అరేబియాలోని టబుక్‌లో విమానాన్ని సురక్షితంగా ల్యాండ్ చేశారు.
♦ఈ ఘటనలో 174 మంది ప్రాణాలను కెప్టెన్ స్మిత్ మచ్చర్ కాపాడినట్లు ఇజ్రాయెల్ అధికారులు తెలిపారు.
♦సుమారు 17,400 అడుగుల మేర విమానం కిందకి పడిపోతున్న తరుణంలో మచ్చర్ కాక్‌పిట్ తలుపు తెరవడంతో ప్రయాణికులు, సిబ్బంది లోపలికి వెళ్లి దాడికి పాల్పడిన కో-పైలట్‌ను అదుపులోకి తీసుకున్నారు.
♦కర్నూలు నగరంలో తుంగభద్రా నది ఒడ్డున నిర్వహించిన ‘మన నగర పరిశుభ్రత’ కార్యక్రమంలో రాష్ట్ర వాణిజ్య, పరిశ్రమల శాఖ మంత్రి టీజీ భరత్ పాల్గొన్నారు.
♦పరిసరాలను స్వయంగా శుభ్రం చేశారు.
♦ఈ కార్యక్రమంలో మున్సిపల్ అధికారులు, సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు.
#SwachhataHiSeva2026
♦స్వచ్ఛత హి సేవ కార్యక్రమంలో భాగంగా.. విజయనగరం కలెక్టరేట్లో ‘స్వచ్ఛాంధ్ర-స్వర్ణాంధ్ర’ కార్యక్రమాన్ని నిర్వహించారు.
♦కలెక్టరేట్ ఉద్యోగులు, మున్సిపల్ కార్మికులు పెద్ద సంఖ్యలో పాల్గొని శ్రమదానం చేశారు.
#SwachhataHiSeva2026