16.10.2026 శ్రీకాకుళం నియోజకవర్గం
గార మండలం శ్రీకూర్మం పంచాయతీ అయ్యవారిపేట గ్రామం శిమ్మ శ్రీనివాసరావు గారి కుమారుడు వివాహ ఆహ్వానం మేరకు నగర కార్పోరేషన్ పరిధిలో స్థానిక అరసవల్లిలో LN గ్రీన్ లో వారి వివాహ వేడుకలలో పాల్గొన్న *శ్రీకాకుళం నియోజకవర్గ మాజీ MLA గుండ లక్ష్మీదేవి గారు..
16.10.2026 శ్రీకాకుళం నియోజకవర్గం
రూరల్ మండలంలో శ్రీశ్రీశ్రీ దుర్గాదేవి శరన్నవరాత్రి మహోత్సవం సందర్భంగా సింగ్గుపురం గ్రామంలో వారి ఆహ్వానం మేరకు దేవీ నవరాత్రుల మహోత్సవ కార్యక్రమంలో పాల్గొనీ దుర్గాదేవిని దర్శించుకున్న శ్రీకాకుళం నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే గుండ లక్ష్మీదేవి గారు
ఈరోజు 15.10.2026 శ్రీకాకుళం నియోజకవర్గంలో శ్రీశ్రీశ్రీ దుర్గాదేవి శరన్నవరాత్రి మహోత్సవం సందర్భంగా స్థానిక అరసవిల్లి ఆదిత్య నగర్ కాలనీ దగ్గర వారి ఆహ్వానం మేరకు దేవీ నవరాత్రుల మహోత్సవ కార్యక్రమంలో పాల్గొనీ దర్శించుకున్న శ్రీకాకుళం నియోజకవర్గం మాజీ ఎమ్మెల్యే గుండ లక్ష్మీదేవి గారు.
ఈరోజు 15.10.2026 శ్రీకాకుళం నియోజకవర్గంలో శ్రీశ్రీశ్రీ దుర్గాదేవి శరన్నవరాత్రి మహోత్సవం సందర్భంగా స్థానిక అరసవిల్లిలో శ్రీశైన వీధిలో వారి ఆహ్వానం మేరకు దేవీ నవరాత్రుల మహోత్సవం కార్యక్రమంలో పాల్గొని దర్శించుకున్న *శ్రీకాకుళం నియోజకవర్గం మాజీ ఎమ్మెల్యే గుండ లక్ష్మీదేవి గారు..._*
_ ఈరోజు 15.10.2026 శ్రీకాకుళం నియోజకవర్గంలో శ్రీశ్రీశ్రీ దుర్గాదేవి శరన్నవరాత్రి మహోత్సవం సందర్భంగా Day&Night కూడలి దగ్గర Taxi stand యూనియన్ వారి ఆహ్వానం మేరకు దేవీ నవరాత్రుల మహోత్సవం కార్యక్రమంలో పాల్గొనీ *శ్రీకాకుళం నియోజకవర్గం మాజీ ఎమ్మెల్యే గుండ లక్ష్మీదేవి గారు..._*
_ ఈరోజు 12.10.2026 శ్రీకాకుళం నియోజకవర్గం రూరల్ మండలం పెద్దగనగళ్లవాని పేట పంచాయతీ ఖాజీపేట గ్రామంలో ఎరుపల్లి వారి రజస్వల ఫంక్షన్ హాజరైన *శ్రీకాకుళం నియోజకవర్గం మాజీ ఎమ్మెల్యే గుండ లక్ష్మీదేవి గారు..._*
_ ఈరోజు 13.10.2026 శ్రీకాకుళం నియోజకవర్గంలో
1.శ్రీకాకుళం నగర కార్పోరేషన్ పరిధిలో స్థానిక అరసవల్లిలో ఆదిత్య నగర్ కాలనీ 3వ లైన్ లో మంతిరెడ్డి రాంబాబు గారు మరణించారని తెలిసి వారివారి కుటుంబాలను పరామర్శించిన *శ్రీకాకుళం నియోజకవర్గం మాజీ ఎమ్మెల్యే గుండ లక్ష్మీదేవి గారు..._**
_ ఈరోజు 13.10.2026 శ్రీకాకుళం నియోజకవర్గం
1.శ్రీకాకుళం మండలంలో గేదలవానిపేట గ్రామంలో సాదు అప్పలనాయుడు గారి కుమార్తె నిత్యశ్రీ మరణించిందని తెలిసి వారివారి కుటుంబాలను పరామర్శించిన *శ్రీకాకుళం నియోజకవర్గం మాజీ ఎమ్మెల్యే గుండ లక్ష్మీదేవి గారు..._**
_ ఈరోజు 12.10.2026 శ్రీకాకుళం నియోజకవర్గం నగర కార్పొరేషన్ పరిధిలో స్థానిక కిమ్స్ హాస్పిటల్ రోడ్ లో గల క్రాంతి అపార్ట్మెంట్ ఆపోజిట్ లో సీపాన రమ గారికి యాక్సిడెంట్ అయిందని తెలుసుకొని వారిని పరామర్శించిన *శ్రీకాకుళం నియోజకవర్గం మాజీ ఎమ్మెల్యే గుండ లక్ష్మీదేవి గారు..._*
12.10.2026 శ్రీకాకుళం నియోజకవర్గం 1. గార మండలం బలరాంపురం గ్రామంలో వాసుపల్లి వారి నిశ్చితార్థ వేడుకల్లో పాల్గొని 2. నగర్ కార్పొరేషన్ పరిధిలో స్థానిక అరసవెల్లి ఆదిత్య నగర్ కాలనీలో పోలాకి వారి నూతన గృహప్రవేశం కు హాజరైన *శ్రీకాకుళం నియోజకవర్గం మాజీ ఎమ్మెల్యే గుండ లక్ష్మీదేవి గారు
ఈరోజు 29.03.2025
తెలుగుదేశం పార్టీ 43వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా అరసవిల్లి లో స్వగృహంలో పార్టీ నేతలు, కార్యకర్తలు,అభిమానులకు మాజీ మంత్రి వర్యులు గుండ అప్పల సూర్యనారాయణ గారు, శ్రీకాకుళం నియోజకవర్గం మాజీ ఎమ్మెల్యే గుండ లక్ష్మీదేవిగారు శుభాకాంక్షలుతెలిపారు.
#Gundalakshmidevi
ఈరోజు 29.03.2025
తెలుగుదేశం పార్టీ 43వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా అరసవిల్లి లో స్వగృహంలో పార్టీ నేతలు, కార్యకర్తలు,అభిమానులకు మాజీ మంత్రి వర్యులు గుండ అప్పల సూర్యనారాయణ గారు, శ్రీకాకుళం నియోజకవర్గం మాజీ ఎమ్మెల్యే గుండ లక్ష్మీదేవిగారు శుభాకాంక్షలుతెలిపారు.
#Gundalakshmidevi
ఈరోజు అరసవల్లి 05.04.2024 *శ్రీకాకుళం నగర్ కార్పొరేషన్ కు సంబంధించి 50డివిజన్ ఇన్చార్జిలు మరియు టిడిపి ముఖ్య నాయకులతో సమావేశం ఏర్పాటు చేసిన మాజీ మంత్రి గుండ అప్పల సూర్యనారాయణ గారు, మాజీ MLA గుండ లక్ష్మీదేవి గారు* ....
- కష్టకాలంలో అమ్మ వెంటే అండగా ఉంటాం
- గుండ కుటుంబంతోనే టీడీపీ పూర్వవైభవం
- అవాస్తవాలతో ప్రజలను మోసం చేయలేరు
- ప్రజలంతా గుండ లక్ష్మీదేవి నాయకత్వాన్ని కోరుకుంటున్నారు
- అవాస్తవ సర్వేలతో అధినేత చంద్రబాబును మోసం చేయడం తగదు
- ఇప్పటికైనా వాస్తవాలు గుర్తించినందుకు కౄతజ్ఞతలు
- ఎవరెన్ని కుట్రలు చేసినా ఓటు వేయించేది క్యాడర్ మాత్రమే
- నియోజకవర్గ కార్యకర్తల సమావేశంలో అమ్మకు బాసటగా ఏకాభిప్రాయం
- అధినేత నిర్ణయం కోసం అంతటా ఉత్కంఠ... సరైన నిర్ణయం తీసుకుంటారని ఆశాభావం
- శ్రీకాకుళం అభ్యర్థిని ప్రకటించి పదిరోజులు దాటినా అతనికి ముఖం చాటేస్తున్న ముఖ్య క్యాడర్
(శ్రీకాకుళం)
ఆ కుటుంబానికి నాలుగు దశాబ్దాల ప్రజాభిమానం... ఒక నాయకుడు చేసిన కుట్రలకు పార్టీతో పాటు పార్టీని నమ్ముకుని జెండాలు మోసిన కార్యకర్తలు సైతం ఇబ్బందులు పడే రోజులు భవిష్యత్‌లో వస్తాయని కార్యకర్తలంతా గుర్తించారు. టీడీపీలో సంక్షోభాలు కొత్త కానప్పటికీ నిస్వార్థ, నిజాయితీ రాజకీయాలకు గుండ కుటుంబం పెట్టని కోట. వారు ప్రతి ఎన్నికల్లోనూ అధినేత ఆదేశాలు తూచాగా కార్యక్రమాలు చేస్తూ పార్టీ విజయానికి ప్రతి ఎన్నికల్లో టీడీపీ జండా ఎగురవేసేందుకు అకుంఠిత దీక్షతో పని చేశారు. ఏనాడూ కుట్ర రాజకీయాలు, అసమ్మతి ప్రోత్సహించని రాజకీయ కుటుంబంగా జిల్లాలోనూ, రాష్ట్రంలోనూ గుండ కుటుంబానికి మంచి పేరు ఉంది. కనీసం తెలియని కొత్త వ్యక్తికి, క్యాడర్‌తో సత్సంత్సంబంధాలు లేని అసమ్మతి వ్యక్తికి శ్రీకాకుళం నియోజకవర్గ టీడీపీ టిక్కెట్ కొంతమంది అవాస్తవాలు అధినేత చెవికి చేరవేయడంతోనే జరిగిన పొరపాటుతోనే ఇప్పటికీ క్యాడర్ భావిస్తున్నారు. ఆ విశ్వాసంతోనే వారంతా గుండ లక్ష్మీదేవికి అండగా నిలిచారు. మా రాజకీయ జీవితం మీతోనే అంటూ బాసటగా ఉన్నారు. కార్యకర్తలు, క్యాడర్ అభిప్రాయాలను పరిగణలోకి తీసుకోవాలని టిక్కెట్ కేటాయింపులో జరిగిన తప్పిదాన్ని అదినాయకత్వం సరి చేయాలంటూ ఎంతో క్రమశిక్షణగా వారు రాష్ట్ర పార్టీ నాయకత్వానికి కోరుతున్నారు. ఈ నేపథ్యంలోనే ఎన్నికల వరకు అమ్మ వెంటే నిలుస్తామని తిరిగి టీడీపీ నియోజకవర్గంలో పూర్వవైభవం తీసుకు వస్తామని కార్యకర్తలు స్పష్టం చేస్తున్నారు. పార్టీలో పదవుల కంటే అమ్మ నాయకత్వంలోనే మా జీవితాలు ఆనందంగా ఉంటాయని వారంతా అధినేత నిర్ణయం కోసం ఎదురుచూస్తున్నారు. నేడో, రేపో కార్యకర్తల ఆకాంక్షల మేరకు టిక్కెట్ కేటాయింపులో జరిగిన తప్పిదాన్ని అధినేత చంద్రబాబే సరి అమ్మ లక్ష్మీదేవికి న్యాయం చేసేలా నియోజక వర్గ ఎమ్మెల్యే అభ్యర్థిగా ప్రకటిస్తారని వారంతా పూర్తి విశ్వసం వ్యక్తం చేస్తున్నారు. అదే అభిప్రాయాన్ని అరసవల్లిలో గుండ దంపతుల నివాసంలో జరిగిన నియోజకవర్గ ముఖ్య కార్యకర్తలు, నాయకుల సమావేశంలో అన్ని అంశాలను చర్చించారు. ఏది ఏమైనప్పటికీ వారంతా గుండ కుటుంబానికి బాసటగా నిలవడం సిక్కోలు రాజకీయాల్లో ఓ చరిత్ర ఆ కుటుంబానికి కార్యకర్తల మనసుల్లో ఉండే సుస్థిర స్థానం స్పష్టం చేస్తోంది. అటువంటి ఆదరణ ఉన్న గుండ లక్ష్మీదేవికి అభ్యర్థిగా ప్రకటిస్తేనే ధర్మానకు ధీటైన రాజకీయాలకు ఎన్నికల్లో విజయం సాధిస్తారని కొత్త వ్యక్తితో ప్రయోగాలు చేస్తే అది దిద్దుకోలేని తప్పే కాకుండా పార్టీకి భారీ మూల్యం తప్పదని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. తానే నియోజకవర్గ అభ్యర్థినంటూ కొ్త్త వ్యక్తి నగరంలో, రూరల్‌లో, ప్రచారం చేస్తున్న టీడీపీ ముఖ్యనాయకులు, క్రమశిక్షణ కలిగిన కార్యకర్తలు అమ్మ గుండ లక్ష్మీదేవికి అండగా నిలవడం సిక్కోలు రాజకీయాల్లో గుండ కుటుంబం సంపాదించుకున్న ఆస్తి. వారే ఆ కుటుంబానికి సర్వస్వం.
*అరసవల్లిలో 04.04.2024 శ్రీకాకుళం నియోజకవర్గం గార మండల టిడిపి ముఖ్య నాయకులతో సమావేశం ఏర్పాటు చేసిన మాజీ మంత్రి గుండ అప్పలసూర్యనారాయణ గారు, శ్రీకాకుళం నియోజకవర్గం మాజీ MLA గుండ లక్ష్మీదేవి గారు*
*నిన్నటి రోజు పార్టీ అధిష్టానం వర్గం శ్రీకాకుళం నియోజకవర్గంలో నాయకులు,కార్యకర్తలు మనోభావాలు తెలుసుకోవడానికి మరొకసారి ముందస్తు సమాచారం లేకుండా రహస్యంగా సర్వే చేయడం మాకు చాలా ఆనందంగా ఉంది. టిడిపి జాతీయ అధ్యక్షులు చంద్రబాబు గారికి మరికొంత సమయం అవసరము గా భావిస్తున్నాము. అందుకే చంద్రబాబు గారి తాలూకా తుది నిర్ణయం మా దంపతులకు అనుకూలంగా వస్తుంది అని భావిస్తున్నాము. అందుకు మీరంతా సహకరించాలని గార మండల నాయకులు,కార్యకర్తలు కోరారు.*
శ్రీకాకుళం నియోజకవర్గం అరసవల్లి 27.03.2024
సాయంత్రం శ్రీకాకుళం *అసెంబ్లీ నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ అభ్యర్థి విషయంలో పునః పరిశీలనలో భాగంగా పార్టీ మొదటి అడుగు* ఐవిఆర్ఎస్ కాల్స్ అవ్వగా, మరల ఈరోజు రెండో అడుగుగా క్రమశిక్షణ గల కార్యకర్తలు అభీష్టం మేరకు తెలుగుదేశం పార్టీ ఎన్నికలకు సంబంధించి *జోనల్ కోఆర్డినేటర్ గా ఉన్న శ్రీనివాస్ రెడ్డి గారు ఈరోజు సాయంత్రం శ్రీకాకుళం నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ ఇంచార్జ్, మాజీ శాసన సభ్యురాలు గుండ లక్ష్మీదేవి గారి దంపతులను కలియడం జరిగింది.* ఈ సందర్భంలో అక్కడికి చేరుకున్న పార్టీ నియోజకవర్గ స్థాయి ముఖ్య నాయకులు , కార్యకర్తలు ,పార్టీ అభిమానులు వారి అభిప్రాయాలు కూడా ఆయన ఎంతో ఓపికతో వినడం వారు తెలియజేసిన పై సమాచారాన్ని అధిష్టానం దృష్టికి నా వంతుగా తీసుకెళ్లి మీ అందరికీ మంచి జరిగే విధంగా నిర్ణయం వచ్చేటట్లు తన వంతు కృషి చేస్తానని ఈ సందర్భంగా తెలియజేశారు...
*ఈరోజు 25.03.2024 శ్రీకాకుళం నగర్ కార్పొరేషన్ సంబంధించి 50 డివిజన్ లు ఇంచార్జిలతో మరియు నగరానికి సంబంధించి ముఖ్య నాయకులతో L/N గ్రీన్స్ కన్వెన్షన్ హాల్లో సమావేశం నిర్వహించిన మాజీ మంత్రి గుండ అప్పలసూర్యనారాయణ గారు, శ్రీకాకుళం నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ ఇంచార్జి మాజీ MLA గుండ లక్ష్మీదేవి గారు.....*
*శ్రీకాకుళం నియోజకవర్గానికి సంబంధించి ఇన్చార్జిగా నియమించిన మాజీ శాసన సభ్యురాలు లక్ష్మీదేవి నాయకత్వంలో పార్టీ ఆశయాలను ప్రతిబింబించే విధంగా క్రమశిక్షణతో గత ఐదు సంవత్సరాలు నడుచుకున్నామని వివరించారు. అయితే గత రెండు సంవత్సరాల నుంచి మాకు రాష్ట్ర పార్టీ అధ్యక్షుడు అచ్చం నాయుడు సహకారం ఉందని చెప్పుకుంటూ పార్టీలో కొందరు మనందరిపై తిరుగుబాటు చర్యలు చేయడం ప్రజలందరికీ తెలుసు ఇది దాయలేని నిజమని స్పష్టం చేశారు. ఇంఛార్జి గా లక్ష్మీదేవి ఈ విషయంలో పరిస్థితులు చక్కదిద్దమని అనేకమార్లు రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు దృష్టికి తీసుకెళ్లినప్పటికీ ఎటువంటి చర్యలు తీసుకోకుండా, మనందరికీ ఆశా భంగం గానే మిగిల్చారని చెప్పారు. నియోజకవర్గంలో పార్టీని రెండు గ్రూపులుగా విడదీసినటువంటి నాయకుడిపై క్రమశిక్షణ చర్యలు లేకుండా బహుమతులుగా ఈ రకంగా సీటు ఇవ్వడం తీవ్ర నిరాశకు గురి చేసిందని వివరించారు. ఈ విషయంలో మేము ఏ చర్య తీసుకోలేకుండా పోయే సందర్భంలో పార్టీ అధినాయకత్వం కలుగజేసుకుని ప్రత్యామ్నాయం ఆలోచన చేయాలని చెప్పారు. ఇదే విషయాన్ని మేము అందరం దపా , దపా లుగా తెలియజేస్తున్నాని, అయితే మేము ఏనాడు కూడా ఆశయం కోసమే పనిచేసామే తప్ప, ఎవరి మీద ప్రతీకారం తీర్చుకోవడానికి పనిచేయలేదని వివరించారు.*
* శ్రీకాకుళం నియోజకవర్గం దద్దరిల్లిన సభ.... గుండ లక్ష్మి దేవి వెంటే క్య్యాడర్..... తరలివచ్చిన గుండ సైన్యం........*
పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు గారు విజన్ గల నాయకుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ఇంకా సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలతో పరుగులు తీస్తారు అన్న విషయంలో మనకు ఎటువంటి సందేహాలు లేవు అందుకే గతంలో స్వర్గీయ ఎన్టీ రామారావు గారి నుంచి ప్రస్తుతం ఆయన నాయకత్వంలో గత 40 సంవత్సరాల పైచిలుక నుంచి క్రమశిక్షణతో పార్టీ కార్యక్రమాలు మనం అందరం కలిసికట్టుగా చేపడుతూ పార్టీ నిర్మాణంలో భాగస్వాములము అయ్యామని గుండ దంపతులు తెలియజేశారు. చాలామంది మనపై సుదీర్ఘ రాజకీయాల్లో ఉన్నప్పటికీ అవినీతి మరకలు లేని విధంగా వ్యవహరించాము అంటే పార్టీ గొడుగులో ఆర్థిక ప్రయోజనం కోసం గాని, వ్యక్తిగత ఎజెండాల కోసం గాని లేకుండా గడిపాము అన్నది స్పష్టం. అదే మన అందరి బలం ఇదే మనకు మన అధినేతకు, పార్టీకి బంధం. మన నియోజకవర్గానికి సంబంధించి ఇన్చార్జిగా నియమించిన మాజీ శాసన సభ్యురాలు లక్ష్మీదేవి నాయకత్వంలో పార్టీ ఆశయాలను ప్రతిబింబించే విధంగా క్రమశిక్షణతో గత ఐదు సంవత్సరాలు నడుచుకున్నాము. అయితే గత రెండు సంవత్సరాల నుంచి మాకు రాష్ట్ర పార్టీ అధ్యక్షుడు అచ్చం నాయుడు సహకారం ఉంది అని చెప్పుకుంటూ పార్టీలో కొందరు మనందరిపై తిరుగుబాటు చర్యలు చేయడం ప్రజలందరికీ తెలుసు ఇది దాయలేని నిజం. ఇంఛార్జి గా లక్ష్మీదేవి గారు ఈ విషయంలో పరిస్థితులు చక్కదిద్దమని అనేకమార్లు రాష్ట్ర అధ్యక్షుడు అచ్చం నాయుడు దృష్టికి తీసుకెళ్లినప్పటికీ ఎటువంటి చర్యలు తీసుకోకుండా, మనందరికీ ఆశా భంగం గానే మిగిల్చారు. అయితే ప్రస్తుతం లక్ష్మీదేవి గారికి పార్టీ టికెట్ ఇవ్వనంత మాత్రాన మీరు నిర్దేశించిన విధానాల్లో లక్ష్మీదేవి గారి వెనుక పడ్డారు అందుకే మరోక వ్యక్తికి అభ్యర్థిగా ఇస్తే మాకు ఆశాభంగం లేదు గాని నియోజకవర్గంలో పార్టీని రెండు గ్రూపులుగా విడదీసినటువంటి నాయకుడిపై క్రమశిక్షణ చర్యలు లేకుండా బహుమతులుగా ఈ రకంగా ఇవ్వడం తీవ్ర నిరాశకు గురవుతున్నాము. ఈ విషయంలో మేము ఏ చర్య తీసుకోలేకుండా పోయే సందర్భంలో పార్టీ అధినాయకత్వం కలుగజేసుకుని ప్రత్యున్మయ ఆలోచన చేయాలని, ఇదే విషయాన్ని మేము అందరం దపా , దపా లుగా తెలియజేస్తున్నాము. అయితే మేము ఏనాడు కూడా ఆసయం కోసమే పనిచేసామే తప్ప, ఎవరి మీద ప్రతీకారం తీర్చుకోవడానికి పనిచేయలేదని అటువంటి సందర్భంలో మా పట్ల ఉన్న అభిమానంతో మీరంతా మమ్మల్ని ఇండిపెండెంట్ గా పోటీ చేయమని చెబుతున్న సందర్భంలో గతంలో మా సుదీర్ఘ రాజకీయ జీవితంలో ఎన్నో ఆటుపోట్లు మీ అందరి సహకారంతో దాటే విధంగానే, ఈసారి కూడా ఈ పరిస్థితుల నుంచి మనమందరం దాటడానికి ఇంకా లోతుగా అధ్యయనం చేసి రానున్న ఒకటి రెండు రోజుల్లో కార్యచరణ మీ దృష్టికి తీసుకు వస్తాం అని తెలియజేస్తున్నాము.