ఆధ్యాత్మిక ప్రగతి దారులు
•100కుపైగా ప్రధాన క్షేత్రాలకు గ్రామీణ రోడ్ల అనుసంధానం
•రూ. 120 కోట్లతో 205 కిలోమీటర్ల పొడుగున ప్రధాన ఆలయ అనుసంధాన రోడ్లు
•ఐ.ఎస్.జగన్నాథపురం, అహోబిలం వంటి నరసింహ క్షేత్రాలకు రహదారి కళ
•వాడపల్లి కరకట్ట మార్గం, అర్థగిరి, గంగమ్మ జాతర రోడ్లకు కేటాయింపులు
•శ్రీ సత్యసాయి శత జయంతి ఉత్సవాల సందర్భంగా రోడ్ల నిర్మాణానికి రూ. 30 కోట్లు
•నిర్మాణం పూర్తి చేసుకున్న 40 శాతం రోడ్లు
•ఉప ముఖ్యమంత్రి శ్రీ @PawanKalyan గారి సంకల్పంతో భక్తులకి సౌకర్యం
‘రాష్ట్రవ్యాప్తంగా గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న పలు దేవాలయాలకు సరైన రహదారి సౌకర్యం లేని పరిస్థితులు ఉన్నాయి. వాడపల్లి లాంటి పుణ్యక్షేత్రాలకు రోజు రోజుకీ భక్తుల సంఖ్య అయితే పెరుగుతుంది గానీ, వారికి సరిపడ రోడ్డు సౌకర్యం మెరుగుపడడం లేదన్న అంశం ఉప ముఖ్యమంత్రివర్యులు శ్రీ పవన్ కళ్యాణ్ గారి దృష్టికి వచ్చింది. క్షేత్ర స్థాయి పర్యటనల్లో అలాంటి ఎన్నో ఆలయాలు ఆయన కంట పడ్డాయి. కొన్ని ఆలయాల దుస్థితిని ప్రజలు వినతపత్రాల రూపంలో శ్రీ పవన్ కళ్యాణ్ గారికి అందజేశారు. పంచాయతీరాజ్ శాఖ పరిధిలో దేవుని దర్శనానికి వెళ్లే దారి లేక భక్తులు పడుతున్న ఇబ్బందులను తొలగించాలని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రివర్యులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు సంకల్పించారు. పంచాయతీరాజ్ శాఖ ద్వారా దాదాపు 100కు పైగా ప్రధాన క్షేత్రాలను 205 కిలోమీటర్ల పొడుగున రోడ్లతో అనుసంధానించే ప్రక్రియకు శ్రీకారం చుట్టారు. జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం, వీబీ జీ రాం జీ, సాస్కీ తదితర నిధులతో బడి, గుడి, ఆసుపత్రి, పంట పొలాలకు వెళ్లే మార్గాల నిర్మాణానికి అత్యంత ప్రాధాన్యం ఇస్తూ ముందుకు తీసుకువెళ్తున్నారు. శ్రీ సత్యసాయి బాబా వారి శత జయంతి ఉత్సవాల సందర్భంగా ఆ జిల్లాలో పుట్టపర్తి అనుసంధాన రోడ్ల నిర్మాణానికి రూ. 30 కోట్లు కేటాయించారు. ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధతో చేపట్టిన గుడి బాట పనులు అత్యంత వేగంగా పూర్తి చేసే విధంగా శ్రీ పవన్ కళ్యాణ్ గారు ఎప్పటికప్పుడు సూచనలు చేస్తున్నారు.
ఇప్పటి వరకు రూ. 120 కోట్ల వ్యయంతో నిర్మిస్తున్న ఈ రహదారుల్లో 26 నిర్మాణం పూర్తి చేసుకుని ప్రారంభానికి సిద్ధంగా ఉన్నాయి. మరో 40 శాతం రహదారులకి సంబంధించిన పనులు 50 శాతం మేర పూర్తయ్యాయి. అందులో ప్రఖ్యాత శ్రీ లక్ష్మీ నరసింహ క్షేత్రం అంతర్వేది, అహోబిలం, మదనపల్లి నియోజకవర్గంలోని శ్రీ గట్టు వెంకటరమణ స్వామి ఆలయం, మారుమూలన ఉన్న ఆలయాలు దేవరాయ నల్లగంగమ్మ ఆలయం, మర్రిపూడి వద్ద ఉన్న పుడియగిరి శ్రీ లక్ష్మి నరసింహ స్వామి క్షేత్రం ఘాట్ రోడ్డు, సత్యవేడు నియోజకవర్గం పరిధిలోని సింగిరికోన, సోమేశ్వరం తలుపులమ్మలోవ మార్గం, ఐ.ఎస్ జగన్నాథపురం ఘాట్ రోడ్లు నిర్మాణం పూర్తయ్యాయి. శ్రీ పవన్ కళ్యాణ్ గారి చేతుల మీదుగా ఈ రోడ్లను ప్రారంభించి ప్రజలకు అందుబాటులోకి తెచ్చేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. సాస్కీ నిధులతో చేపట్టిన కోనసీమ తిరుమల వాడపల్లి కరకట్ట మార్గం, రూ. 3 కోట్లతో అర్థగిరి శ్రీ ఆంజనేయస్వామి ఆలయం రోడ్డు తెనాలి, రాయచోటి తదితర నియోజకవర్గాల్లో చేపట్టిన రోడ్లు, నిడదవోలులో ఆంజనేయస్వామి రోడ్డు, పూతలపట్టు నియోజకవర్గం తోటవారిపల్లి మల్లేశ్వరస్వామి ఆలయం తదితర రహదారుల పనులు వివిధ స్థాయిల్లో పురోగతిలో ఉన్నాయి. శ్రీ సత్యసాయి జిల్లాకు కేటాయించిన దాదాపు 72 కిలోమీటర్ల రోడ్లు సైతం వివిధ దశల్లో సనులు కొనసాగుతున్నాయి. పుణ్య క్షేత్రాలకు వెళ్ళే రోడ్ల నాణ్యతా ప్రమాణాల విషయంలో శ్రద్ధ వహించాలని శ్రీ పవన్ కళ్యాణ్ గారు అధికారులకు నిర్దేశం చేశారు. పంచాయతీరాజ్ శాఖ నిర్మించే రోడ్లు భక్తులకు సుదీర్ఘ కాలం ఉపయోగపడాలని సూచనలు చేశారు. క్షేత్ర స్థాయి పర్యటనల్లో నిర్మాణం పూర్తి చేసుకున్న ఆలయాల రోడ్ల నాణ్యతను స్వయంగా పరిశీలించి, భక్తులకు అందుబాటులోకి తీసుకువస్తామని అధికారులకి తెలియజేశారు. పంచాయతీరాజ్ శాఖ ఆధ్వర్యంలో మరిన్ని ఆలయాలకు రోడ్డు సౌకర్యం కల్పించేందుకు శ్రీ పవన్ కళ్యాణ్ గారి నాయకత్వలో ప్రణాళికలు రూపొందిస్తున్నారు.
ఉపముఖ్యమంత్రి శ్రీ @PawanKalyan గారి సంకల్పంతో భక్తుల సౌకర్యార్థం ప్రధాన ఆలయ అనుసంధాన రోడ్లు.
100 కు పైగా ప్రధాన క్షేత్రాలకు గ్రామీణ రోడ్ల అనుసంధానం.
రూ. 120 కోట్లతో 205 కి.మీ.ల మేర ప్రధాన ఆలయ అనుసంధాన రోడ్లు.
శ్రీ పవన్ కళ్యాణ్ గారి సూచనలకు అనుగుణంగా స్థానిక ఎన్నికలపై చర్చలు
స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి జనసేన పార్టీ అధ్యక్షులు శ్రీ @PawanKalyan గారి సూచనలకు అనుగుణంగా కూటమి భాగస్వామ్య పక్షాలతో చర్చించడం జరుగుతుంది. ఈ చర్చలు ప్రాథమిక దశలో ఉన్నాయి. కూటమి తరఫున అనుసరించాల్సిన కార్యాచరణపై చర్చిస్తున్నారు.
క్షేత్ర స్థాయి నుంచి సేకరించిన సమాచారాన్ని పారదర్శకంగా సమీక్షించిన మీదట జనసేన పోటీ చేసే స్థానాలు, అభ్యర్థులకు సంబంధించి శ్రీ పవన్ కళ్యాణ్ గారు తుది నిర్ణయం తీసుకుంటారు.
జనసేన పోటీ చేసే స్థానాలు ఇవే, పోటీ చేసే అభ్యర్థులు వీరే అంటూ సాగుతున్న ప్రచారాన్ని ఎవరూ విశ్వసించవద్దు. మరికొన్ని చోట్ల అభ్యర్థుల పేరుతో తీర్మానాలు చేస్తున్న విషయం పార్టీ కేంద్ర కార్యాలయం దృష్టికి చేరింది. పార్టీ విధివిధానాలు, క్రమశిక్షణను అందరూ పాటించాలి. జన సైనికులు, వీర మహిళల పోరాట స్ఫూర్తిని, వారి ఆత్మ గౌరవాన్ని నిలిపే విధంగా జనసేన పోటీ ఉంటుందని ఇటీవలి పార్టీ శాసన సభ పక్ష సమావేశంలో వెల్లడించిన విషయాన్ని పార్టీ శ్రేణులు గుర్తించాలి.
-జనసేన పార్టీ కేంద్ర కార్యాలయం
పులివెందుల తాగునీటి పథకానికి పునరుజ్జీవం.🙏
ఉప ముఖ్యమంత్రి శ్రీ @PawanKalyan గారి చొరవతో తీరుతున్న పులివెందుల నియోజకవర్గం, పరిసర ప్రాంత ప్రజల దాహార్తి.
జల్ జీవన్ మిషన్, అమరజీవి జలధారల కింద సుమారు రూ.280 కోట్ల కేటాయింపులు.
#PawanKalyanAneNenu
పులివెందుల తాగునీటి పథకానికి పునరుజ్జీవం!
ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారి ప్రత్యేక చొరవతో మెగా వాటర్ గ్రిడ్ పనులు వేగవంతం. జల్ జీవన్ మిషన్–అమరజీవి జలధార కింద సుమారు రూ.280 కోట్ల కేటాయింపులతో 96% పనులు, 99% పైప్లైన్ నిర్మాణం పూర్తి.
త్వరలో లక్షలాది మందికి స్వచ్ఛమైన తాగునీరు!
పులివెందుల త్రాగునీరు📍
• @PawanKalyan గారి చొరవతో రూ.280 కోట్లు
• 96% పనులు, 99% పైప్లైన్ పనులు పూర్తి
• 1,111 కి.మీ.లో 1,106 కి.మీ. పైప్లైన్ పూర్తి
• పులివెందుల, సింహాద్రిపురంలో 100% పనులు పూర్తి
• లింగాల మండలంలోని 24 ఆవాసాలకు తాగునీరు
• త్వరలో మిగిలిన పనులు పూర్తి
పులివెందుల లో ఓట్లేస్తే
బెంగళూరు పాలస్ లో
నీళ్లు తాగొచ్చు అని తెలుసు 😇
పులివెందుల పోటీ చెయ్యకపోయినా
పులివెందులకు నీళ్లు ఇవ్వొచ్చని
@pawankalyan గారు చెప్తేనే తెలిసింది
పులివెందుల తాగునీటి పథకానికి పునరుజ్జీవం
•ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారి చొరవతో తీరుతున్న పులివెందుల నియోజక వర్గం, పరిసర ప్రాంత ప్రజల దాహార్తి
•గత ప్రభుత్వం నిర్లక్ష్యం చేసిన మెగా వాటర్ గ్రిడ్ పథకంపై ఉప ముఖ్యమంత్రివర్యుల ప్రత్యేక దృష్టి
•జల్ జీవన్ మిషన్, అమరజీవి జలధారల కింద సుమారు రూ. 280 కోట్ల కేటాయింపులు
•96 శాతం ఓవరాల్ ప్రాజెక్టు పనులు.. 99 శాతం పైప్లైన్ నిర్మాణం పూర్తి
•తుది అంకానికి నీటి శుద్ధి ప్లాంట్ పనులు
•పులివెందుల పట్టణం, గ్రామీణం, సింహాద్రిపురం మండలాల్లో 100 శాతం పూర్తయిన పనులు
•లింగాల మండల పరిధిలో 24 ఆవాసాలకు తాగునీటి సరఫరా
జల్ జీవన్ మిషన్-అమరజీవి జలధార కింద రాష్ట్ర వ్యాప్తంగా చేపట్టిన తాగునీటి ప్రాజెక్టులను రాష్ట్ర ఉప ముఖ్యమంత్రివర్యులు శ్రీ @PawanKalyan గారు పారదర్శకంగా, రాజకీయాలకు అతీతంగా ముందుకు తీసుకువెళ్తున్నారు. గత ప్రభుత్వంలో ప్రారంభించి నిర్లక్ష్యం చేసిన పథకాలకు సైతం ప్రత్యేక ప్రాధాన్యమిచ్చి ముందుకు తీసుకువెళ్తున్నారు. వైఎస్సార్ కడప జిల్లా, పులివెందుల నియోజకవర్గంతోపాటు పరిసర ప్రాంతాల ప్రజలు ఎన్నో ఏళ్లుగా ఎదుర్కొంటున్న తాగునీటి సమస్యకు శాశ్వత పరిష్కారం చూపే దిశగా చేపట్టిన మెగా వాటర్ గ్రిడ్ పథకం నిర్మాణ పనులు త్వరతగతిన పూర్తి చేసేందుకు శ్రీ పవన్ కళ్యాణ్ గారు ప్రత్యేక శ్రద్ధతో చర్యలు చేపట్టారు. గత ప్రభుత్వ హయాంలో నిలిచిపోయిన పనులను తిరిగి గాడిలో పెట్టి వేగవంతంగా పూర్తి చేసేలా నిరంతరం పర్యవేక్షిస్తున్నారు. దాదాపు రూ. 426 కోట్ల విలువైన 96 శాతం పనులు పూర్తి చేసి నిబద్ధత చాటుకున్నారు.
• గత ప్రభుత్వ నిర్లక్ష్యమే కారణం
ఏడు మండలాల పరిధిలో ఐదున్నర లక్షల మంది ప్రజల దాహార్తి తీర్చే లక్ష్యంతో రూ. 480 కోట్ల అంచనా వ్యయంతో జల్ జీవన్ మిషన్ కింద ప్రారంభమైన పులివెందుల మెగా వాటర్ గ్రిడ్ పథకం పనులు గత ప్రభుత్వ హయాంలో తీవ్ర నిర్లక్ష్యానికి గురయ్యాయి. కేంద్ర ప్రభుత్వం నుంచి నిధులు సమృద్ధిగా ఉన్నప్పటికీ పనులను ముందుకు తీసుకువెళ్లే అంశంలో శ్రద్ధ చూపలేదు. చేపట్టిన పనుల్లో కూడా నాణ్యత లేదు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే జల్ జీవన్ మిషన్ పనుల మీద జరిగిన తొలి సమీక్షలోనే శ్రీ పవన్ కళ్యాణ్ గారు గత ప్రభుత్వం నిర్లక్ష్యం చేసిన పథకాలను సైతం ప్రాధాన్య క్రమంలో ముందుకు తీసుకువెళ్లాలని అధికారులకు సూచించారు. 2024లో కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టేనాటికి జల్ జీవన్ మిషన్ గడువు కూడా పూర్తి కావడంతో, కేంద్రం వద్ద ఉన్న మిగులు నిధులు ఖర్చు చేసేందుకు వీలు లేకుండా పోయింది. ఉప ముఖ్యమంత్రివర్యులు, కూటమి నాయకులు చేసిన ప్రయత్నాల ఫలంగా జల్ జీవన్ మిషన్ను మరో 4 ఏళ్ల పాటు పొడిగించేందుకు కేంద్రం అంగీకారం తెలపడంతో పులివెందుల మెగా తాగునీటి సరఫరా పథకం తిరిగి ఊపిరి పోసుకుంది.
అప్పటి నుంచి శ్రీ పవన్ కళ్యాణ్ గారి ప్రత్యేక చొరవతో దాదాపు రూ. 280 కోట్లు ఒక్క పులివెందుల పథకానికే కేటాయించి వేగంగా పనులు చేపట్టారు. గత ప్రభుత్వ హయాంలో అరకొర పైప్లైన్లు వేయడం మినహా పెద్దగా పనులేమీ పూర్తి కాలేదు. కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టిన తర్వాత 96 శాతం పనులు పూర్తి చేశారు. అందులో పులివెందుల, సింహాద్రిపురం మండలాలకు ఇప్పటికే ఈ పథకం ద్వారా తాగునీరు అందుతోంది. పులివెందుల పట్టణానికి సంబంధించిన పనులు కూడా 100 శాతం పూర్తయ్యాయి. లింగాల మండలం పరిధిలో 27 ఆవాసాలకు గాను 24 ఆవాసాలకు త్వరలో తాగునీరు అందుతోంది. వాటర్ గ్రిడ్ ప్రాజెక్టులో కీలకమైన ఇంటేక్ వెల్ పునరుద్ధరణ పనులు పూర్తి కాగా, 65 మిలియన్ లీటర్ల నీటి శుద్ధి ప్లాంట్లు కూడా అందుబాటులోకి వచ్చాయి. 1,111 కిలోమీటర్ల పైప్లైన్కు గాను 1,106 కిలోమీటర్ల నిర్మాణం పూర్తయ్యింది. ఓవర్హెడ్ ట్యాంకులు, గ్రౌండ్ లెవల్ రిజర్వాయర్ల నిర్మాణం కూడా దాదాపు తుది దశకు చేరింది. కూటమి ప్రభుత్వం తాగు నీరు వంటి ప్రజల ప్రాథమిక అవసరాలు తీర్చేందుకు రాజకీయాలకు అతీతంగా ముందుకు వెళ్లాలని శ్రీ పవన్ కళ్యాణ్ గారు చేసిన నిర్దేశం మేరకు పులివెందుల మెగా వాటర్ గ్రిడ్ పనులను గ్రామీణ తాగునీటి సరఫరా విభాగం అధికారులు వేగంగా ముందుకు తీసుకువెళ్తున్నారు.
మీరు దిగిపోయే నాటికి ఎంత శాతం పులివెందుల మెగా వాటర్ గ్రిడ్ ప్రాజెక్టు పూర్తి చేసారో చెప్పకుండా నెత్తికి స్టిక్కర్ వేసుకున్న పాత వీడియోలు పట్టుకొస్తే ఏం ఉపయోగం!
#ChorYSJagan
#PawanKalyanAneNenu
Under the special focus of Deputy Chief Minister Sri @PawanKalyan, around ₹280 crore has been allocated through Jal Jeevan Mission and Amarajeevi Jaladhara. Overall project works have reached 96% completion, with 1,106 of the planned 1,111 km pipeline completed.
Works are fully complete in Pulivendula Urban, Pulivendula Rural and Simhadripuram, while drinking water supply is being extended to 24 habitations in Lingala mandal. The remaining water treatment and storage infrastructure works are in their final stages.
పులివెందుల ప్రజల తాగునీటి కష్టాలకు శాశ్వత పరిష్కారం దిశగా మరో ముందడుగు!
ఉప ముఖ్యమంత్రి శ్రీ @PawanKalyan గారి ప్రత్యేక చొరవతో నిలిచిపోయిన మెగా వాటర్ గ్రిడ్ ప్రాజెక్టు పనులు శరవేగంగా కొనసాగుతున్నాయి. జల్ జీవన్ మిషన్–అమరజీవి జలధార కింద సుమారు ₹280 కోట్లతో 96% పనులు పూర్తి కాగా, 99% పైప్లైన్ నిర్మాణం పూర్తైంది.
ప్రజల ప్రాథమిక అవసరమైన స్వచ్ఛమైన తాగునీటిని ప్రతి ఇంటికీ అందించాలన్న కూటమి ప్రభుత్వ సంకల్పం కార్యరూపం దాలుస్తోంది.
పులివెందుల త్రాగునీటి సరఫరా ప్రాజెక్ట్ మీ 5 ఏళ్ల పాలనలో ₹182 కోట్ల రూపాయలు ఖర్చుపెట్టి, 40 % పనులు మాత్రమే పూర్తి చేస్తే, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక, కేవలం 2 ఏళ్లలోనే గౌ|| ఉప ముఖ్యమంత్రి, గ్రామీణ నీటి సరఫరా శాఖ మంత్రి శ్రీ @PawanKalyan గారి సారధ్యంలో ₹203 కోట్లు ఖర్చు పెట్టి, 56% పనులు పూర్తి చేశారు. దీనిపై చర్చకు సిద్ధమా జగన్?
ఇంకెన్నాళ్ళు ప్రజలను మోసం చేస్తావ్ @ysjagan?
#FekuJagan #YSRCheapPolitics
జనసేన పార్టీ నాయకులకు, శ్రేణులకు విజ్ఞప్తి:
సోషల్ మీడియా వేదికగా విభిన్నమైన విషయాల పట్ల మాట్లాడే సమయంలో, పోస్టులు చేసేటప్పుడు జనసేన పార్టీ నాయకులు, జనసైనికులు, వీర మహిళలు తగు జాగ్రత్తలు తీసుకోవాలని, వాడే భాష, భావ వ్యక్తీకరణ విషయంలో పరిధి దాటవద్దని పార్టీ అధ్యక్షులు శ్రీ @PawanKalyan గారు దిశానిర్దేశం చేశారు. అనవసర విషయాలపై ఇష్టానుసారం భాషను ఉపయోగించి మాట్లాడటం సరికాదని స్పష్టం చేశారు. ప్రసార మాధ్యమాలు, సోషల్ మీడియాలో మాట్లాడే సమయంలో జనసేన నాయకులు, జన సైనికులు, వీర మహిళలు కచ్చితంగా పార్టీ నిర్దేశించిన మార్గ దర్శకాలు పాటించాలి.
1. వ్యక్తిగత విషయాలు, వ్యక్తిగత దూషణల జోలికి వెళ్లవద్దు.
2. పార్టీల సిద్ధాంతాలు , మార్గ దర్శకాలకి అనుగుణంగా స్పందించాలి.
3. ఏదైనా విషయం మీద మాట్లాడే సమయంలో ఆవేశాలకు లోను కావద్దు. అసభ్య పదజాలాన్ని వాడవద్దు.
4. మహిళలను గౌరవించి మాట్లాడాలి.
5. పార్టీ అంతర్గత అంశాల పట్ల సోషల్ మీడియా వేదికగా ఇష్టానుసారం మాట్లాడరాదు. పార్టీ భావజాలాన్ని కించపరిచేలా మాట్లాడే వారిని పార్టీ ఉపేక్షించదు.
6. పార్టీ క్రమశిక్షణకి విఘాతం కలిగించేలా, జనసైనికుల్ని రెచ్చగొట్టేలా వ్యాఖ్యలు చేసే వారిపై జాగ్రత్తగా ఉండండి. వారి ప్రభావానికి లోను కావొద్దు.
7. కూటమి ప్రభుత్వ స్ఫూర్తిని నిలబెట్టేలా మాట్లాడాలి.
8. రాజకీయ శత్రువుల సోషల్ మీడియా ప్రచార వలలో పడొద్దు. పార్టీలో అంతర్గత విభేదాలు సృష్టించే కుట్రలను తిప్పికొట్టాలి.
9. పార్టీ అభ్యున్నతి, పార్టీ కోసం కష్టించి పనిచేసే జన సైనికులు, వీర మహిళల సంక్షేమం ఎల్లప్పుడూ అధ్యక్షుల వారి దృష్టిలో ఉంటుంది. సోషల్ మీడియాలో రకరకాల విష ప్రచారాలను తిప్పి కొట్టండి.
జనసేన పార్టీ కేంద్ర కార్యాలయం,
మంగళగిరి
స్వాతంత్ర్యం వచ్చి
79 సంవత్సరాలు గడిచినా కొత్తూరు మండలంలోని నివగం కూడలి నుంచి పాతపాడు గ్రామానికి వెళ్లే రహదారి మాత్రం రాలేదు.
కేవలం 3 రోజుల్లోనే రూ.1.5 కోట్లతో రహదారి మంజూరు చేసి ఎన్నో ఏళ్ల కలను నిజం చేశారు ఉప ముఖ్యమంత్రి @PawanKalyan గారు.
https://t.co/YHFhAaF4LQ
CSB IAS అకాడమీ డైరెక్టర్ శ్రీమతి బాలలత మల్లవరపు గారు, తన శిష్యుడు @mvrkteja IAS గారి గురించి చెప్పిన విషయాలు ప్రతి UPSC అభ్యర్థికి స్ఫూర్తిదాయకం.
అలప్పుజా సబ్ కలెక్టర్గా వరదల సమయంలో సుమారు 2 లక్షల మంది ప్రజలను రక్షించిన సేవాభావం, ఒక సంవత్సరం పాటు చూపిన క్రమశిక్షణ, పట్టుదలే ఆయన విజయానికి బలమైన పునాది.
ఒక సంవత్సరం పాటు… ప్రతిరోజూ ఉదయం 4:30 గంటలకే అకాడమీకి వచ్చి Answer Writing Practice చేసిన యువకుడు… నేడు లక్షల మందికి స్ఫూర్తిగా నిలిచిన IAS కృష్ణ తేజ గారు.
Heartiest congratulations to Kandula Jessie, the young daughter of a carpenter from Andhra Pradesh, on becoming the only student from our State selected among India's Top 20 for Mission ShakthiSAT, the world's first global all-girls lunar CubeSat mission.
Your remarkable journey from a Government school classroom to the threshold of a lunar mission proves that dreams are not defined by circumstances, but by determination, discipline, and hard work.
You are an inspiration to every girl, every Government school student, and every young dreamer across Andhra Pradesh. May your achievement ignite a passion for science, innovation, and space research in countless young minds.
Wishing you great success as you take this historic step towards your dream of serving the nation through ISRO. The future belongs to those who dare to dream and work relentlessly to achieve it.
- @PawanKalyan
#BetiBachaoBetiPadhao
#MissionShakthiSAT #STEM #AndhraPradesh #ISRO
ఇప్పటికైనా అటెన్షన్ కోసం పాకులాడే జర్నలిస్టులు, సామాజికవేత్తలు అని చెప్పుకునే స్వయంప్రకటిత మేధావులు ఇలాంటి అబద్ధాల మీద కథలు అల్లడం మానేసి నిజంగా జరిగే కబ్జాలపై, భూదోపిడిలపై మాట్లాడితే సమాజానికి కాస్తైనా మంచి చేసినవారు అవుతారు.
#PawanKalyanAneNenu
Leadership beyond Conventional Politics - An exclusive video !
• Getting Kumki Elephants from Karnataka
• Requesting Tigers from Maharashtra
• Seed balls for "HarithaAndhra"
• Great Green Wall of Andhra
• Farm Ponds, Cattle Troughs
• Swach Ratham
• Clearing Pending promotions in Panchayat Raj Department
• Palle Panduga & many more..