మా పార్టీ సీనియర్ నాయకులు, నాకు పితృసమానులైన ముద్రగడ పద్మనాభంగారి మరణవార్త నన్ను తీవ్రంగా కలచివేసింది.
ఇటీవల అనారోగ్యానికి గురైన ఆయన క్రమంగా కోలుకుంటున్నారనే వార్త మాకు ఎంతో ధైర్యాన్నిచ్చింది. సంపూర్ణ ఆరోగ్యంతో తిరిగి మన మధ్యకు వస్తారని ఆశిస్తున్న సమయంలోనే ఆయన ఇలా శాశ్వతంగా దూరం కావడం అత్యంత బాధాకరం.
ఐదు దశాబ్దాల సుదీర్ఘ రాజకీయ ప్రస్థానంలో ఎంపీగా, మంత్రిగా, ఎమ్మెల్యేగా ప్రజలకు చిరస్మరణీయమైన సేవలందించిన ముద్రగడగారు విలువలకు కట్టుబడి రాజకీయాలు చేశారు. పదవులకన్నా ప్రజలనే గొప్పగా భావించారు. తన జీవితాంతం పేదల బతుకుల్లో మార్పు కోసం తపించారు.
ముఖ్యంగా కాపు సామాజికవర్గానికి పెద్దదిక్కుగా నిలిచి, వారి సంక్షేమం కోసం అలుపెరగని పోరాటం చేశారు. తాను నమ్మిన మాటకు కట్టుబడి నిలబడే తత్వం, మంచికోసం ఎంతదూరమైనా వెళ్లే ధైర్యం ఆయన సొంతం. ఆత్మగౌరవానికి, నిజాయితీకి, వ్యక్తిత్వానికి ఆయన నిలువెత్తు రూపం.
ముద్రగడగారి మరణం ఆయన కుటుంబానికే కాదు.. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి, ఆయనను అభిమానించే లక్షలాది మందికి తీరని లోటు.
ఈ విషాద సమయంలో ఆయన కుటుంబసభ్యులకు ధైర్యాన్ని ప్రసాదించాలని, ముద్రగడగారి ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుణ్ని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తున్నాను. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ తరఫున ముద్రగడగారికి ఘనంగా నివాళులు అర్పిస్తున్నాను.
Wishing you a very HappyBirthday Mega film writer Chinnikrishna garu your visionary story telling redefined cinema.May this year bring you boundless creativity and unparalleled success.May God Bless you @KChiruTweets @alluarjun @idhavish @dirbobby
ఈ ఎన్నికల్లో మన పార్టీ కార్యకర్తలందరూ గొప్ప పోరాట స్ఫూర్తిని చాటారు. రేపు జరగనున్న కౌంటింగ్ ప్రక్రియలో కూడా అదే స్ఫూర్తిని కొనసాగిస్తూ... ప్రజలు మనకు వేసిన ప్రతి ఓటునూ మన పార్టీ ఖాతాలోకి వచ్చేలా అప్రమత్తంగా వ్యవహరించి మన పార్టీకి అఖండ విజయాన్ని చేకూరుస్తారని ఆశిస్తున్నాను.
జూన్ 4న 2019 కి మించిన భారీ విజయంతో చరిత్ర తిరగరాయనున్న జగనన్న🔥
జూన్ 9న ఉదయం 9 గంటల 38 నిమిషాలకు ప్రమాణ స్వీకార మహోత్సవానికి సిద్ధంగా ఉండండి ✊🏻
#YSRCPWinningBig#YSJaganAgain
నిన్న జరిగిన ఎన్నికల్లో మండుటెండలు సైతం లెక్కచేయకుండా నాకు ఆశీస్సులు ఇవ్వడానికి సునామీలా తరలివచ్చిన నా అవ్వతాతలకు, నా అక్కచెల్లెమ్మలకు, నా అన్నదమ్ములకు, నా రైతన్నలకు, నా ఎస్సీ, నా ఎస్టీ, నా బీసీ, నా మైనారిటీలకు, నా యువతీయువకులందరికీ పేరుపేరునా శిరస్సు వంచి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను.
మన @YSRCParty గెలుపుకోసం చెమటోడ్చి శ్రమించిన నా కార్యకర్తలందరికీ హృదయపూర్వక కృతజ్ఞతలు.
ఇప్పటివరకు సాగిన మన సుపరిపాలన, మరింత మెరుగ్గా కొనసాగుతుందని హమీ ఇస్తున్నాను.
Please do watch Vyooham movie and post on your time line about the movie.
There is zero buzz on social media..
We need to support the team.
Use hashtag #Vyooham