ప్రముఖ పుణ్యక్షేత్రం శ్రీశైలం వెళ్లే భక్తుల కోసం ప్రత్యేక టూర్ ప్యాకేజీని #TSRTC ప్రకటించింది. ప్రతి వీకెండ్‌కు సికింద్రాబాద్ జేబీఎస్ నుంచి ప్రత్యేక బస్సులను నడపాలని నిర్ణయించింది. రెండు రోజుల పాటు కొనసాగే ఈ టూర్.. ఈ నెల 22 నుంచి ప్రారంభమవుతుంది. ఈ ప్యాకేజీలో భాగంగా శ్రీశైలంలోని మల్లికార్జున స్వామి, భ్రమరాంబదేవి, సాక్షి గణపతి దర్శనంతో పాటు పాతాళగంగా, పాలధార, పంచధార, శిఖరం, శ్రీశైలం డ్యాం, తదితర ప్రాంతాలను సందర్శించవచ్చు. ఈ ప్యాకేజీ ధరను పెద్దలకు రూ.2700, పిల్లలకు రూ.1570గా టీఎస్ఆర్టీసీ యాజమాన్యం ఖరారు చేసింది.
ప్రతి శనివారం ఉదయం ఈ టూర్ ప్రారంభమవుతుంది. తొలి రోజు హైదరాబాద్ లోని జేబీఎస్ నుంచి ఉదయం 7 గంటలకు సూపర్ లగ్జరీ బస్సు బయలుదేరుతుంది. 8 గంటలకు ఎంజీబీఎస్ చేరుకుంటుంది. అక్కడి నుంచి మధ్యాహ్నం 1.30 గంటలకు శ్రీశైలానికి చేరుకుని.. బస కోసం నేరుగా హోటల్‌కు వెళ్తుంది. మధ్యాహ్న భోజనం పూర్తయ్యాక.. 3 గంటలకు పాతాళగంగకు ప్రయాణికులను తీసుకెళ్తారు. కృష్ణానదిలో బోటింగ్ కూడా చేయిస్తారు. సాయంత్రం 5 గంటలకు శ్రీ మల్లికార్జున స్వామి, శ్రీ భ్రమరాంబిక అమ్మ వారి దర్శనాన్ని భక్తులు చేసుకోవాలి. శీఘ్ర దర్శన సదుపాయం అక్కడ అందుబాటులో ఉంటుంది. రాత్రి భోజనం తర్వాత శ్రీశైలంలోనే హోటల్లో బస ఉంటుంది.
రెండో రోజు ఉదయం 5 నుంచి 8 గంటల వరకు భక్తులు ఆలయంలో అభిషేకం, ప్రత్యేక పూజలు చేసుకోవచ్చు. అనంతరం.. టిఫిన్ పూర్తవగానే హోటల్ చెక్అవుట్ చేయాలి. అక్కడి నుంచి శివాజి స్పూర్తి కేంద్రం, చెంచులక్ష్మి ట్రైబల్ మ్యూజియం సందర్శన ఉంటుంది. సాక్షి గణపతి ఆలయ దర్శనంతో పాటు పాలధార, పంచధార, శిఖరం, శ్రీశైలం డ్యాం, తదితర ప్రాంతాలను సందర్శిస్తారు. మార్గమధ్యంలో మధ్యాహ్న భోజనం చేసిన తర్వాత రాత్రి 7.30 గంటలకు ఎంజీబీఎస్‌కు, 8.30 గంటలకు జేబీఎస్‌కు బస్సు చేరుకుంటుంది.
రవాణా, వసతి, ఆలయ శీఘ్ర దర్శనం, శిఖరం ప్రవేశ రుసుం ప్యాకేజీలో చేర్చబడింది. ఆహారం, ఆలయంలో అభిషేకం, ప్రత్యేక పూజలు, ఇతర ఖర్చులను ప్రయాణికులే భరించాలి.
"ప్రముఖ శైవ క్షేత్రం శ్రీశైలంకు భక్తులు పెద్ద ఎత్తున వెళ్తుంటారు. హైదరాబాద్ నుంచి ప్రతి రోజు శ్రీశైలానికి 40 సర్వీసులను టీఎస్ఆర్టీసీ నడుపుతోంది. వీకెండ్లో భక్తుల రద్దీ ఎక్కువగా ఉంటోంది. ఈ నేపథ్యంలోనే శ్రీశైలం వెళ్లాలనుకునే వారికోసం ప్రత్యేకంగా టూర్ ప్యాకేజీని సంస్థ అందిస్తోంది.భక్తులకు సౌకర్యవంతంగా ఉండేందుకు ఈ ప్యాకేజీని యాజమాన్యం ప్రవేశపెట్టింది. ఈ ప్రత్యేక టూర్ ప్యాకేజీని భక్తలందరూ వినియోగించుకోవాలి. టీఎస్ఆర్టీసీ అధికారిక వెబ్సైట్ https://t.co/cpYkSGAM9t లోకి వెళ్లి మీ టికెట్లను బుకింగ్ చేసుకోవాలి. ఈ టూర్ ప్యాకేజీకి సంబంధించిన పూర్తి వివరాలకు టీఎస్ఆర్టీసీ కాల్ సెంటర్ నంబర్లు 040-69440000, 040-23450033ను సంప్రదించాలి." అని టీఎస్ఆర్టీసీ చైర్మన్, ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్దన్, సంస్థ ఎండీ వీసీ సజ్జనర్, ఐపీఎస్ సూచించారు.
#Srishailam @TSRTCHQ @SajjanarVC @Govardhan_MLA @puvvada_ajay@CTMOTSRTC @CTM_CDMT @PROTSRTC @YakaswamyChalla
మీ ఏటీఎం కార్డు పిన్ ను, క్రెడిట్, డెబిట్ కార్డు వివరాలను ఎట్టి పరిస్థితుల్లోనూ ఎవరితో పంచుకోకండి. ఒకవేళ ఇతరులకు షేర్ చేశారో మీ బ్యాంక్ ఖాతాలు గుల్లవుతాయి.
సైబర్ మోసానికి గురయితే వెంటనే 1930 కి కాల్ చేయండి. జాతీయ సైబర్ క్రైమ్ పోర్టల్ https://t.co/8bXWOF3Yc9 లో ఫిర్యాదు చేయండి.
#CyberSafetyTip #CyberSafeIndia #Cybercrime #ATM #Password #DebitCard #creditcard
తెలంగాణ వ్యాప్తంగా 101 ప్రాంతాల్లో మంగళవారం రక్తదాన శిబిరాలను టీఎస్ఆర్టీసీ ఏర్పాటు చేస్తోంది. 'ఒకరి రక్తదానం-ముగ్గురికి ప్రాణదానం’ అనే ట్యాగ్ లైన్ తో ఎంతో ప్రతిష్టాత్మకంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది. మానవతా దృక్పథంతో స్పందించి రక్తదానం చేయడానికి ముందుకు రావాలని సంస్థ తరపున కోరుతున్నాం. డిపో పరిధిలోని ప్రతి విద్యాసంస్థ నుంచి 20 నుంచి 30 మంది విద్యార్థులు పాల్గొని రక్తదాన శిబిరాలను విజయవంతం చేయాలని విజ్ఞప్తి చేస్తున్నాం.
@TSRTCHQ @PROTSRTC @Govardhan_MLA @puvvada_ajay@YakaswamyChalla
కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థైన అసోసియేషన్ ఆఫ్ స్టేట్ రోడ్ ట్రాన్స్‌ఫోర్ట్ అండర్‌టేకింగ్స్(ASRTU) ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ టి.సూర్య కిరణ్‌కు డాక్టరేట్ లభించింది. 'మార్కెట్ ధోరణి-టీఎస్ఆర్టీసీ ఉద్యోగుల పనితీరు' అనే అంశంపై ఆయన చేసిన పరిశోధనకు గాను వరంగల్‌లోని ప్రతిష్టాత్మక నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ(నిట్) డాక్టరేట్‌ను బుధవారం అందించింది. నిట్ మేనేజ్మెంట్ విభాగ అసోసియేట్ ఫ్రొఫెసర్ ప్రాన్సిస్ సుధాకర్ పర్యవేక్షణలో ఈ పరిశోధనను సూర్యకిరణ్ పూర్తి చేశారు. 1992లో ఆర్టీసీలో చేరిన ఆయన.. ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో డీఎం, డీవీఎం, ఆర్ఎం, తదితర హోదాల్లో పనిచేశారు. #TSRTC చీఫ్ పర్సనల్ మేనేజర్(సీపీఎం)గా విధులు నిర్వర్తించారు. ప్రస్తుతం డిప్యూటేషన్‌పై న్యూఢిల్లీలోని ఏఎస్ఆర్టీయూ ఈడీతో పాటు సెంట్రల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ రోడ్ ట్రాన్స్పోర్ట్(సీఐఆర్టీ) డైరెక్టర్‌గా పనిచేస్తున్నారు.
నిట్ తనకు డాక్టరేట్‌ను అందించడంతో హైదరాబాద్‌లోని బస్‌భవన్‌లో టీఎస్ఆర్టీసీ ఎండీ సజ్జనర్‌ను గురువారం సూర్యకిరణ్ మర్యాదపూర్వకంగా కలిశారు. డాక్టరేట్ ప్రతిని ఆయనకు అందజేశారు. ఈ సందర్భంగా సూర్యకిరణ్‌ను సజ్జనర్ అభినందించారు. టీఎస్ఆర్టీసీ ఉద్యోగుల పనితీరుపై పరిశోధన చేయడం ప్రశంసనీయమన్నారు. వరంగల్ నిట్‌తో టీఎస్ఆర్టీసీ చేసుకున్న అవగాహన ఒప్పందంలో భాగంగా సంస్థ అధికారులకు పీహెచ్‌డీలో ప్రవేశాలు కల్పిస్తున్నారని సజ్జనర్ తెలిపారు.
@PROTSRTC @asrtudelhi @Govardhan_MLA @puvvada_ajay
అద్దె బకాయిలు సకాలంలో చెల్లించని కారణంగా సుచిరిండియా హోటల్స్ అండ్ రిసార్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్ తో చేసుకున్న ఆర్టీసీ కళా భవన్ అద్దె కాంట్రాక్టును #TSRTC రద్దు చేసింది. ఆ భవన సముదాయాన్ని సంస్థ పూర్తిగా ఆధీనంలోకి తీసుకుంది. ఆ కళాభవన్ లో ఇప్పటికే వివాహా శుభకార్యాలకు బుకింగ్ చేసుకున్న వారు టీఎస్ఆర్టీసీకి చెందిన కోఠి కమ్యూనికేషన్ సెల్ నెంబర్ 9959226160ను సంప్రదించాలి. పని సమయాల్లో ఆర్టీసీ కళ్యాణ మండప కార్యాలయంలోనూ సంప్రదించవచ్చు.
@TSRTCHQ @PROTSRTC @Govardhan_MLA @puvvada_ajay
ಕರ್ನಾಟಕದ ಬೆಂಗಳೂರು, ಹುಬ್ಬಳ್ಳಿ ಮತ್ತು ದಾವಣಗೆರೆಗೆ ಪ್ರಯಾಣಿಸುವವರಿಗೆ ಸಿಹಿ ಸುದ್ದಿ. #TSRTC ಅವರ ಸೌಕರ್ಯಕ್ಕಾಗಿ ಹೊಸ ಲಹರಿ ಎಸಿ ಸ್ಲೀಪರ್, ಗರುಡ ಪ್ಲಸ್, ಸೂಪರ್ ಲಗ್ಜರಿ ಬಸ್ಗಳನ್ನು ವ್ಯವಸ್ಥೆ ಮಾಡಿದೆ. ನಿರ್ವಹಣೆಯು ಈ ಸೌಲಭ್ಯವನ್ನು ಬಳಸಿಕೊಳ್ಳಲು ಮತ್ತು ಸಾರ್ವಜನಿಕ ಸಾರಿಗೆ ವ್ಯವಸ್ಥೆಯನ್ನು ಉತ್ತೇಜಿಸಲು ಬಯಸುತ್ತದೆ.
కర్ణాటకలోని బెంగళూరు, హుబ్లీ, దావణగెరె ప్రాంతాలకు రాకపోకలు సాగించే వారికి శుభవార్త. వారి సౌకర్యార్థం కొత్త లహరి ఏసీ స్లీపర్, గరుడ ప్లస్, సూపర్ లగ్జరీ బస్సులను #TSRTC ఏర్పాటు చేసింది. ఈ సదుపాయాన్ని వినియోగించుకుని, ప్రజా రవాణా వ్యవస్థను ప్రోత్సహించాలని యాజమాన్యం కోరుతోంది.
For those traveling frequently between Bengaluru, Hubballi, and Davanagere in Karnataka, there's good news! #TSRTC has introduced new Lahari AC Sleeper and Garuda Plus buses for your convenience. The management encourages the public to use these services and support the public transportation system.
#Karnataka #Hyderabad #Bengaluru #hubballi #Davanagere
@KannadaPrabha@udayavani_web@prajavani @VVani4U @Vijaykarnataka@varthabharati@VishwavaniNews@DeccanHerald@THBengaluru@XpressBengaluru@KSRTC_Journeys
ప్రయాణికులకు #TSRTC తీపికబురు చెప్పింది. వేసవి నేపథ్యంలో గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ప్రయాణించే వారికి ఆర్టికభారం తగ్గించేందుకు కీలక నిర్ణయం తీసుకుంది. సాధారణ ప్రయాణికుల టి-24 టికెట్ ధరను రూ.100 నుంచి రూ.90కి తగ్గించింది. అంతేకాదు, కొత్తగా సీనియర్ సిటిజన్లకు టి-24 టికెట్ లో రాయితీ కల్పించాలని నిర్ణయించింది. వారికి రూ.80కే ఆ టికెట్ ను అందించనుంది. 60 ఏళ్ళు పైబడిన వారికే టి-24 టికెట్ లో 20 శాతం రాయితీ వర్తిస్తుంది. టికెట్ తీసుకునే సమయంలో వయసు ధ్రువీకరణ కోసం సీనియర్ సిటిజన్లు తమ ఆధార్ కార్డ్ ను బస్ కండక్టర్లకు విధిగా చూపించాల్సి ఉంటుంది. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ఈ కొత్త టి-24 టికెట్ ధరలు గురువారం నుంచి అమల్లోకి వస్తాయి.
హైదరాబాద్ లో ఎక్కువగా ప్రయాణించే వారి కోసం గతంలో టి-24 టికెట్ ను సంస్థ అందుబాటులోకి తీసుకువచ్చింది. ఆ టికెట్ ను కొనుగోలు చేస్తే సిటీ ఆర్డినరీ, మెట్రో బస్సుల్లో 24 గంటల పాటు ఎక్కడి నుంచి ఎక్కడికైనా ప్రయాణించవచ్చు. మొదట ఆ టికెట్ ధరను రూ.120గా నిర్ణయించింది. ప్రయాణికుల ఆర్థిక భారం తగ్గించేందుకు ఆ తర్వాత టి-24ని 100కి తగ్గించింది. ఒక లీటర్ పెట్రోల్ ధర కంటే తక్కువకే 24 గంటల పాటు ప్రయాణించే సదుపాయాన్ని కల్పించింది. తాజాగా సాధారణ ప్రయాణికులకు టి-24 టికెట్ ధరను రూ.90కి, సీనియర్ సిటిజన్లకు రూ.80కి తగ్గిస్తూ నిర్ణయం తీసుకుంది.
ఎండాకాలంలో ప్రయాణికుల సౌకర్యార్థం టి-24 టికెట్ పై 10 శాతం రాయితీని సంస్థ కల్పిస్తోందని, ఆ టికెట్ ను సీనియర్ సిటిజన్లకు రూ. 80కే అందించాలని నిర్ణయించిందని టీఎస్ఆర్టీసీ చైర్మన్, ఎమ్యెల్యే బాజిరెడ్డి గోవర్దన్, సంస్థ ఎండీ వీసీ సజ్జనర్, ఐపీఎస్ తెలిపారు. టి-24 టికెట్ కు మంచి స్పందన వస్తోందని, ప్రతి రోజు సగటున 25 వేల వరకు టికెట్లు అమ్ముడుపోతున్నాయని పేర్కొన్నారు. సిటీ పరిధిలో తిరిగే ఆర్డినరీ, మెట్రో బస్సుల్లోని కండక్టర్ల వద్ద ఈ టికెట్ అందుబాటులో ఉంటుందని, ప్రయాణికులందరూ ఈ సదుపాయాన్ని వినియోగించుకోవాలని వారు కోరారు.
మహిళలు, సీనియర్ సిటీజన్ల కోసం టి-6 టికెట్ ను ఇటీవల ప్రారంభించామని, రూ.50 కి ఆ టికెట్ ను కొనుగోలు చేస్తే ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు ప్రయాణించవచ్చని చెప్పారు. అలాగే, కుటుంబ సభ్యులు, స్నేహితుల సౌకర్యార్థం ఎఫ్-24 టికెట్ ను అందుబాటులోకి తెచ్చామని వివరించారు. రూ.300 చెల్లించి నలుగురు 24 గంటల పాటు ప్రయాణించచవచ్చని పేర్కొన్నారు. హైదరాబాద్ సిటీలో తీసుకువచ్చిన టి-24, టి-6, ఎఫ్-24 టికెట్లను కొనుగోలు చేసి.. క్షేమంగా, సురక్షితంగా గమ్యస్థానాలకు చేరుకోవాలని సూచించారు. మెరుగైన, నాణ్యమైన సేవలందిస్తోన్న టీఎస్ఆర్టీసీని ప్రజలు ఆదరించాలని సంస్థ చైర్మన్, ఎమ్యెల్యే బాజిరెడ్డి గోవర్దన్, ఎండీ వీసీ సజ్జనర్, ఐపీఎస్ కోరారు.
@PROTSRTC @way2_news@TV9Telugu@abntelugutv@SamayamTelugu @Govardhan_MLA @puvvada_ajay@sakshidaily
@Rkofficial069 @TSRTCHQ @tsrtcmdoffice @DMNZB2TSRTC @Govardhan_MLA @jaganbajireddy Regretted for the inconvinience caused to u sir, vl inquire nd initiate action against concerned pl.
#TSRTC కుటుంబం తరపున ముస్లింలందరికీ ఈద్ ముబారక్. అల్లా ఆశీస్సులు మీ అందరిపై ఎల్లప్పుడూ ఉండాలని సంస్థ మనసారా కోరుకుంటోంది.
#EidMubarak#EidMubarak2023
@TSRTCHQ @PROTSRTC
ప్రయాణికులకు ఎలక్ట్రిక్ ఏసీ బస్సులు అందుబాటులోకి రాబోతున్నాయి. వచ్చే నెలలో కొన్ని బస్సులను ప్రారంభించేందుకు #TSRTC ఏర్పాట్లు చేస్తోంది. విజయవాడ మార్గంలో తొలిసారిగా 50 ఎలక్ట్రిక్ ఏసీ బస్సులను వాడకంలోకి తేనుంది.హైదరాబాద్ లోని బస్ భవన్ ప్రాంగణంలో సోమవారం కొత్త ప్రోటో (నమూనా) ఎలక్ట్రిక్ ఏసీ బస్సును పరిశీలించడం జరిగింది.@TSRTCHQ @OlectraEbus @PROTSRTC
భారత రాజ్యాంగ నిర్మాతగా దేశ గమనాన్ని మార్చడంలో డాక్టర్ బీఆర్ అంబేద్కర్ పోషించిన పాత్ర ఎనలేనిది. ఆయన జీవితమే ఓ గొప్ప పాఠం. ఆయన చెప్పిన మాటలు తరతరాలకు ఆదర్శం. ఇవాళ అంబేద్కర్ జయంతి సందర్భంగా ఆ మహనీయుడికి ఘన నివాళి.
#AmbedkarJayanti2023#AmbedkarJayanti#Ambedkar
ప్రయాణికులకు శుభవార్త. హైదరాబాద్-విజయవాడ రూట్లో 10 శాతం రాయితీని #TSRTC కల్పిస్తోంది. ఆ మార్గంలో వెళ్లే సూపర్ లగ్జరీ, రాజధాని ఏసీ సర్వీసుల్లో రానుపోనూ ఈ రాయితీ వర్తిస్తుంది. ఈ నెల ౩౦ వరకు 10 శాతం డిస్కౌంట్ అమల్లో ఉంటుంది. ఈ రాయితీ వల్ల ఒక్కొక్కరికి రూ.40 నుంచి 50 వరకు ఆదా అవుతుంది. ఈ రాయితీని ప్రయాణికులు వినియోగించుకోవాలని సంస్థ కోరుతోంది. టికెట్ల రిజర్వేషన్ కోసం https://t.co/T98ngINDot ను సంప్రదించండి.
@TSRTCHQ @way2_news@TV9Telugu@NtvTeluguLive@abntelugutv@News18Telugu@SamayamTelugu