త్రిప్రయార్ శ్రీ రామస్వామి వారిని దర్శించుకున్న శ్రీ @PawanKalyan గారు
•ఆలయ సంప్రదాయాన్ని అనుసరించి స్వామి వారికి ప్రత్యేక పూజలు
•శ్రీకృష్ణునికి, శ్రీరామ స్వామి, అయ్యప్పస్వామి వారికి పట్టు వస్త్రాల సమర్పణ
•దీపాలంకరణ, మీనుట్టు, వేది వజిపాడు సేవల్లో పాల్గొన్న ఉప ముఖ్యమంత్రివర్యులు
సుప్రసిద్ధ శ్రీరామ క్షేత్రం, నాలాంబలం యాత్రలో విఖ్యాతిగాంచిన క్షేత్రాల్లో ఒకటిగా పేరు పొందిన కేరళం రాష్ట్రంలోని త్రిప్రయార్ శ్రీ రామస్వామి వారిని ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రివర్యులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు దర్శించుకున్నారు. శుక్రవారం సాయంత్రం ఆలయంలో విశిష్ట సేవల్లో ఒకటిగా పేరున్న దీపారాధన సేవలో పాల్గొన్నారు. ఒక్క రోజు దీపారాధన సేవకు విరాళం అందించి, స్వయంగా దీపాలు వెలిగించి సేవలో పాల్గొన్నారు. ఆలయం ప్రధాన ద్వారం ఎదురుగా, శ్రీకృష్ణ మందిరంలో ఏర్పాటు చేసిన ప్రధాన దీపాల్లో జ్యోతి ప్రజ్వలన గావించారు. దీపారాధనతోపాటు ఆలయ సంప్రదాయాలను అనుసరించి మీనుట్టు, వేది వజిపాడు సేవల్లోనూ శ్రీ పవన్ కళ్యాణ్ గారు పాల్గొన్నారు. శంఖుచక్రాలతోపాటు ధనుస్సు, హారం ధరించిన శ్రీ రామస్వామి వారి అద్భుత రూపాన్ని దర్శించి, సంధ్యాకాల అర్చనలు నిర్వహించారు. శ్రీరామ స్వామి వారితో పాటు ఆలయ ప్రాంగణంలో ఉన్న శ్రీకృష్ణునికి, అయ్యప్ప స్వామకి పట్టు వస్త్రాల సమర్పించారు. అనంతరం గర్భాలయంలో మూలవిరాట్టుకి కుడివైపు ఉన్న దక్షిణా మూర్తికి, నైరుతి దిక్కున ఉన్న వినాయకుడికి, అనంతపద్మనాభ స్వామి వారి శయన రూపానికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ మేల్ శాంతి(ప్రధాన అర్చకులు) శ్రీ రామన్ తిరుమేని గారు పూజ అనంతరం శ్రీ పవన్ కళ్యాణ్ గారికి తీర్థ ప్రసాదాలు, ఆశీర్వచనాలు అందించారు. అంతకు ముందు శ్రీరామ స్వామి క్షేత్రానికి విచ్చసిన శ్రీ పవన్ కళ్యాణ్ గారికి కొచ్చిన దేవస్థానం బోర్డు ఛైర్మన్, శ్రీరామ స్వామి ఆలయ కమిటీ, దేవాదాయ శాఖ కమిషనర్, ఆలయ అడ్మినిస్ట్రేటర్, అర్చక స్వాములు ఆలయ మర్యాదలతో స్వాగతం పలికారు.
•తీర్వా నదిలో చేపలకి ఆహారం.. వేది వజిపాడు సేవకు విరాళం
శ్రీరామ స్వామి వారి దర్శనానికి ముందు ఆలయ సంప్రదాయాన్ని అనుసరించి అదే ప్రాంగణంలో ఉత్తర దిక్కున ఉన్న శ్రీకృష్ణుని శ్రీ పవన్ కళ్యాణ్ గారు దర్శించుకున్నారు. అనంతరం మీనుట్టు (చేపలకు ఆహారం అందించడం) సేవలో పాల్గొన్నారు. తీర్వా నదికి ఆలయం అనుకుని ఉండడంతో, ఆ నదిలో చేపలకి ఆహారం అందించడం ఆచారంగా వస్తోంది. ఇక్కడ చేపలకు ఆహారం అందించి మత్స్యావతార రూపుడైన విష్ణుమూర్తికి స్వయంగా ఆహారం అందించినట్టు భక్తులు భావిస్తారు. స్వామి దర్శనానంతరం వేడి వజిపాడుగా పిలిచే బాణాసంచ పేల్చే సేవలో పాల్గొన్నారు. త్రిప్రయార్ ఆలయం తెరిచి ఉన్నంత సమయం బాణాసంచా పేల్చడం ఇక్కడ ఆచారం. సీతాదేవి ఆచూకి లభించిన విషయాన్ని తన పొలికేక ద్వారా శ్రీ ఆంజనేయ స్వామి వారు శ్రీరాముడికి చేరవేయగా, రామస్వామి బాణాసంచ పేలుడుతో బదులిచ్చినట్టు పురాణాలు చెబుతున్నాయి. దాన్నే త్రిప్రయార్ శ్రీరామస్వామి ఆలయంలో నేటికీ పాటిస్తున్నారు. వేది వజిపాడుగా పిలిచే ఈ సేవలో పాల్గొన్న శ్రీ పవన్ కళ్యాణ్ గారు, 1,001 టపాసులు పేల్చేందుకు అయిన మొత్తాన్ని విరాళంగా సమర్పించారు. చివరిగా శ్రీ శాస్తగా భక్తులు కొలుచుకునే అయ్యప్పస్వామిని దర్శించుకుని తీర్థప్రసాదాలు స్వీకరించారు.
త్రిప్రయార్ లోని శ్రీరామ స్వామి విగ్రహం ద్వాపర యుగంలో శ్రీకృష్ణుడిచే పూజలందుకున్నట్టు పురాణాలు చెబుతున్నాయి. ద్వారకానగరం సముద్ర గర్భంలో కలసిపోయిన అనంతరం రామ, లక్ష్మణ, భరత, శత్రుఘ్నుల విగ్రహాలు కేరళం తీరానికి కొట్టుకువచ్చినట్టు చరిత్ర చెబుతోంది. కేరళంలో ఆలయానికి సమీపంలో ఆయుర్వేద వైద్యం చేయించుకుంటున్న శ్రీ పవన్ కళ్యాణ్ గారు శుక్రవారం స్వామి సేవలో పాల్గొన్నారు.
Pawan kalyan ravadam valla road ayina vachindi anta.. inthaka mundu road kuda ledu anta … papam water kuda levu… chustuntene baadhestundi.
Edaina cheyandayya twaraga @PawanKalyan@APDeputyCMO@AkasaRamanaa
Aruku Valley, Vizag
DyCM Shri.@pawankalyan welcomed five multitracking railway projects worth ₹10,021 crore, adding nearly 540 km of new capacity.He said the Arakkonam–Renigunta 3rd & 4thLine will strengthen connectivity to Tirupati & Rayalaseema,boost tourism,trade & logistics,and ease congestion.
"...its just a stupid Inference Engine"
how did Shankar write such technical terms around 2008-09?
the concepts of neural network and inference were not even evolved back then. The paper that claimed GPUs are better than CPUs for training was published only in 2009
పని పూర్తయ్యే వరకు కాదు.. ప్రజలకు ఫలితం అందే వరకూ పర్యవేక్షణ ఉండాలి
•పిఠాపురం ప్రగతిపై ఉప ముఖ్యమంత్రి శ్రీ @PawanKalyan గారు ప్రత్యేక సమీక్ష
•ప్రతి అభివృద్ధి పనిపై ఆరా.. నిర్ణీత గడువులో పూర్తి చేయాలని ఆదేశాలు
•అంగన్వాడీ, రైతు సేవా కేంద్రాలు, ఆయుష్మాన్ ఆరోగ్య మందిర్ నిర్మాణాలకు వేగవంతం చేయాలి
•శ్మశాన వాటికల్లో మౌలిక సదుపాయాలు తప్పనిసరి
•పాఠశాలలు, సంక్షేమ హాస్టళ్ల పనుల పురోగతిపై ఆరా
•ఆర్వోబీ నిర్మాణంపై ప్రత్యేక దృష్టి పెట్టాలని ఆదేశం
•చేనేత, మత్స్యకారుల అభివృద్ధి పనులను వేగవంతం చేయాలి
•పారిశుధ్య మౌలిక వసతులకు అధిక ప్రాధాన్యత
•ఆయుష్ మెడికల్ కాలేజీ ప్రక్రియను వేగవంతం చేసి, ప్రాజెక్టును ముందుకు తీసుకెళ్లాలని ఉప ముఖ్యమంత్రివర్యులు ఆదేశం
పిఠాపురం నియోజకవర్గంలో జరుగుతున్న అభివృద్ధి పనుల పురోగతిపై ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారు ప్రత్యేక దృష్టి సారించారు. నియోజకవర్గవ్యాప్తంగా చేపట్టిన వివిధ అభివృద్ధి, మౌలిక వసతుల పనుల స్థితిగతులను అధికారులను అడిగి తెలుసుకున్నారు. కేరళంలో చికిత్స పొందుతున్న శ్రీ పవన్ కళ్యాణ్ గారు అక్కడి నుంచి సమీక్ష నిర్వహించారు. ప్రజలకు ప్రత్యక్షంగా ఉపయోగపడే పనులను ప్రాధాన్యత క్రమంలో వేగంగా పూర్తి చేయాలని ఆదేశించారు. సమీక్ష సందర్భంగా అధికారులు వివిధ శాఖల పరిధిలో జరుగుతున్న పనుల పురోగతిని ఉప ముఖ్యమంత్రి గారికి వివరించారు. ఏ పనులు పూర్తయ్యాయి, ఏవి పురోగతిలో ఉన్నాయి, తదుపరి కార్యాచరణ ఏ చర్యలు తీసుకోవాల్సి ఉంది లాంటి అంశాల గురించి ఆయన అధికారులను అడిగి తెలుసుకున్నారు. పెండింగ్లో ఉన్న పనులను గుర్తించి, అవసరమైన పరిపాలనా, సాంకేతిక ప్రక్రియలను పూర్తి చేసి నిర్ణీత గడువులోగా పనులను పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని స్పష్టం చేశారు.
• పాఠశాలల అభివృద్ధి, మౌలిక వసతులపై సమీక్ష
నియోజకవర్గంలోని పాఠశాలలకు రక్షణ గోడల నిర్మాణం ఎంత వరకు పూర్తయిందని అధికారులను శ్రీ పవన్ కళ్యాణ్ గారు అడిగి తెలుసుకున్నారు. అధికారులు పాఠశాలలవారీగా పనుల పురోగతిని వివరించగా, మిగిలిన పనులను కూడా వేగవంతం చేసి విద్యార్థులకు సురక్షితమైన వాతావరణం కల్పించాలని ఆదేశించారు. పాఠశాలల అప్గ్రేడేషన్, అదనపు తరగతి గదులు, ఆటస్థలాల అభివృద్ధి, రక్షణ గోడల కోసం రూ.3.5 కోట్లతో చేపట్టిన పనుల వివరాలను అధికారులు ఆయనకు వివరించారు. అదేవిధంగా, యు. కొత్తపల్లి మండలం మూలపేటలోని జిల్లా పరిషత్ పాఠశాలలో రూ.1.34 కోట్ల అంచనా వ్యయంతో నిర్మించనున్న ఎనిమిది అదనపు తరగతి గదుల పనుల ప్రక్రియను వేగవంతం చేసి, విద్యార్థులకు అవసరమైన మౌలిక వసతులను త్వరితగతిన అందుబాటులోకి తీసుకురావాలని శ్రీ పవన్ కళ్యాణ్ గారు సూచించారు. వీధి దీపాలు, సీసీ డ్రైనేజీలు, రోడ్లు, తాగునీరు, పారిశుధ్యానికి సంబంధించిన పనుల పురోగతిని అధికారులు వివరించారు. ప్రజలు ఎక్కువగా ఇబ్బందులు ఎదుర్కొంటున్న ప్రాంతాలను గుర్తించి అక్కడి పనులకు ప్రాధాన్యత ఇవ్వాలని శ్రీ పవన్ కళ్యాణ్ గారు చెప్పారు. గ్రామీణ ప్రాంతాల్లో చెరువుల ఆధునికీకరణ పనుల పరిస్థితిని కూడా అడిగి తెలుసుకుని, పనులు పూర్తయిన వెంటనే ప్రజల వినియోగంలోకి తీసుకురావాలని ఆదేశించారు.
• సంక్షేమ హాస్టళ్లపై ప్రత్యేక దృష్టి
శ్మశాన వాటికల నిర్మాణం, అభివృద్ధి పనుల వివరాలను అధికారులు ఉప ముఖ్యమంత్రి గారికి వివరించారు. శ్మశాన వాటికల్లో ట్యాపులు, తాగునీటి సదుపాయం, పారిశుధ్యం తదితర కనీస వసతులను మెరుగుపరచాలని శ్రీ పవన్ కళ్యాణ్ గారు స్పష్టం చేశారు. ముఖ్యంగా ఎస్సీ జనాభా అధికంగా ఉన్న ప్రాంతాల్లోని శ్మశాన వాటికలను గుర్తించి, అక్కడి మౌలిక వసతుల అభివృద్ధి పనులకు ప్రాధాన్యత ఇవ్వాలని అధికారులను ఆదేశించారు. అదేవిధంగా సంక్షేమ వసతి గృహాల్లో జరుగుతున్న మరమ్మతులు, అభివృద్ధి పనులపై సమీక్షించి, పెండింగ్ పనులను త్వరితగతిన పూర్తి చేసి విద్యార్థులకు మెరుగైన వసతులు అందించాలని ఆదేశించారు. అంగన్వాడీ కేంద్రాలు, రైతు సేవా కేంద్రాలు, ఆయుష్మాన్ ఆరోగ్య మందిర్ ల నిర్మాణాలపై అధికారులు పురోగతిని వివరించారు. నిలిచిపోయిన పనులకు కారణాలను తెలుసుకున్న శ్రీ పవన్ కళ్యాణ్ గారు, అవసరమైన అనుమతులు, ప్రక్రియలను పూర్తి చేసి ప్రజా సేవలకు ఉపయోగపడే కేంద్రాలను త్వరగా అందుబాటులోకి తీసుకురావాలని ఆదేశించారు. (1/3)
@PIB_India@IPR_AP@pibvijayawada
ఆ టైంలో పవన్ కళ్యాణ్ గారు వచ్చాకే మా టీడీపీ పార్టీ కి , కార్యకర్తలకు ధైర్యం వచ్చింది. ఆయన వల్లే బయటికి ధైర్యంగా రాగలిగాం, ప్రశాంతంగా తిరగగలిగాం - టీడీపీ MLC & TDP State Spoke Person కావలి గ్రీష్మా గారు. ❤️
#PawanKalyan#NDA
I resigned from Anthropic today. I spent the last three years doing pretraining research at both OpenAI and Anthropic. Neither company is acting responsibly. They are racing straight to self-improving superintelligence and gambling with our lives. More thoughts below.