కోట్లాది తెలుగు ప్రజల అభిమానాన్ని సంపాదించి, వారి హృదయాల్లో చిరస్థాయిగా నిలిచిపోయిన మహానటుడు సూపర్ స్టార్ కృష్ణగారు. పలు రంగాల్లో తనదైన ముద్ర వేసిన బహుముఖ ప్రజ్ఞాశాలి ఆయన. విప్లవ వీరుడు అల్లూరి సీతారామరాజు పాత్రలో ఆయన ప్రదర్శించిన అభినయం చిరస్మరణీయం. నేడు కృష్ణగారి జయంతి సందర్భంగా నివా��ులు.
తెలుగు సినీ పరిశ్రమకు నటుడిగా, దర్శకుడిగా, సాహసోపేత నిర్మాతగా విశిష్ట సేవలందించిన పద్మభూషణ్ కృష్ణ గారి జయంతి సందర్భంగా ఆయనను స్మరించుకుంటున్నాం. నూతన సాంకేతికతలను తెలుగు సినిమాకు పరిచయం చేస్తూ సినీ రంగ అభివృద్ధికి విశేషంగా కృషి చేసిన ఆయన సేవలు చిరస్మరణీయం. అభిమానుల హృదయాల్లో శాశ్వత స్థానం సంపాదించిన ఆ మహానటుడికి ఘన నివాళులు.