Gkvasantha,GVMC ఫ్లోర్ లీడర్,33వ వార్డ్ కార్పొరేటర్.
ఉత్తరాంధ్ర బిడ్డను, వెనుకబడిన,వెనకకు నెట్టబడిన నా ప్రాంత అభివృద్ధి కోరుకునే యువతను✊🙏
JANASENA PARTY
విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రమాద ఘటనలో తీవ్రంగా గాయపడిన క్షతగాత్రులను, వారి కుటుంబ సభ్యులను పరామర్శించిన ఉప ముఖ్యమంత్రి @PawanKalyan గారు. అన్ని విధాలా ప్రభుత్వం అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు.
ఆసుపత్రిలో అందుతున్న చికిత్సకు సంబంధించి, గాయపడిన వారి ఆరోగ్య పరిస్థితిని వైద్యులను అడిగి తెలుసుకున్నారు.
#VizagSteelPlant #Visakhapatnam
పెదపెంకి గ్రామంలో పారిశుధ్య నిర్వహణ, సౌకర్యాల కల్పనపై శ్రీ @PawanKalyan గారి సమీక్ష సమావేశం.
* గ్రామంలో రూ.6.18 కోట్లతో మ్యాజిక్ డ్రెయిన్లు, రోడ్ల నిర్మాణం చేపట్టినట్లు అధికారులు తెలిపారు.
* 2018లో ఫైలేరియా సమస్య తన దృష్టికి వచ్చినప్పుడు బాధ కలిగించిందని, త్వరలో గ్రామాన్ని స్వయంగా సందర్శిస్తానని కూడా ఉప ముఖ్యమంత్రివర్యులు పేర్కొన్నారు.
పదవిగా కాదు బాధ్యతగా భావిస్తాను
•మా పార్టీ అధ్యక్షులు, ఉప ముఖ్యమంత్రి శ్రీ @PawanKalyan గారికి కృతజ్ఞతలు
జనసేన పార్టీ తరఫున రాజ్యసభ అభ్యర్థిగా ఎంపిక చేసినందుకు మా పార్టీ అధ్యక్షులు, గౌరవ ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారికి హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలియచేస్తున్నాను. కూటమి తరఫున నా అభ్యర్థిత్వానికి మద్దతు తెలిపిన గౌరవ ప్రధాన మంత్రి శ్రీ @narendramodi గారికి, గౌరవ ముఖ్యమంత్రి శ్రీ @ncbn గారికి ప్రత్యేక ధన్యవాదాలు.
జనసేన పక్షాన శ్రీ పవన్ కళ్యాణ్ గారు నాకు పదవి కాదు బలమైన బాధ్యత అప్పగించారని భావిస్తున్నాను. ప్రజల ఆకాంక్షలకు తగ్గ విధంగా, రాష్ట్ర అభివృద్ధి కోసం కృషి చేస్తాను. సాధారణ పౌరుడి గొంతు రాజ్యసభలో వినిపించడమే నా లక్ష్యంగా పని చేస్తాను. శ్రీ పవన్ కళ్యాణ్ గారు నాపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకొంటాను.
(లింగమనేని రమేశ్)
జనసేన పార్టీ నిర్మాణ సమాచార సేకరణ కమిటీల నియామకం
• కేడర్ ఆధారిత నాయకత్వ వ్యవస్థను మరింత పటిష్ఠం చేయడమే లక్ష్యం
• జనసైనికుల నుంచే భవిష్యత్ నాయకత్వాన్ని తీర్చిదిద్దే వినూత్న ప్రక్రియకు శ్రీకారం
• క్షేత్రస్థాయి సమాచారాన్ని పరిశీలించి పార్టీ బాధ్యతల కేటాయింపుపై తుది నిర్ణయం
• 25 పార్లమెంట్, 175 అసెంబ్లీ నియోజకవర్గాల్లో పార్టీ నిర్మాణాన్ని బలోపేతం చేసే కసరత్తు
• పార్టీ కోసం అంకితభావంతో పనిచేసిన జనసైనికులను గుర్తించేందుకు ప్రత్యేక కమిటీల ఏర్పాటు
• దశాబ్దన్నర క్రితమే రూపుదిద్దుకున్న జనసేనాని ఆలోచనకు కార్యరూపంగా ఈ కమిటీలు.
జనసేన పార్టీని సంస్థాగతంగా మరింత బలోపేతం చేసి, క్షేత్రస్థాయిలో పనిచేస్తున్న జనసైనికులు, సాధకులు, నాయకులకు తగిన గుర్తింపు, బాధ్యతలు కల్పించే దిశగా పార్టీ అధ్యక్షులు శ్రీ @PawanKalyan గారు రాష్ట్రవ్యాప్తంగా 25 పార్లమెంట్, 175 అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో “జనసేన పార్టీ నిర్మాణ సమాచార సేకరణ కమిటీలను” నియమిస్తూ నిర్ణయం తీసుకున్నారు.
జనసైనికుల నుంచే భవిష్యత్ నాయకత్వాన్ని తీర్చిదిద్దాలనే లక్ష్యంతో ఏర్పాటు చేసిన ఈ కమిటీలు క్షేత్రస్థాయిలో పనిచేస్తున్న నాయకుల సేవలు, నాయకత్వ లక్షణాలు, పార్టీ పట్ల అంకితభావం వంటి అంశాలపై సమాచారాన్ని సేకరించి పార్టీ అధ్యక్షుల వారి పరిశీలనకు సమర్పించనున్నాయి.
ప్రతి పార్లమెంట్ నియోజకవర్గానికి మొత్తం 28 మంది సభ్యులతో కమిటీని ఏర్పాటు చేశారు. ఇందులో ఒక పరిశీలకుడు, ముగ్గురు సీనియర్ నాయకులు, ప్రతి సంవత్సరం క్రమం తప్పకుండా సభ్యత్వ నమోదు కార్యక్రమంలో చురుకుగా పాల్గొన్న ముగ్గురు సాధకులు కలిపి 7 మంది ప్రధాన సభ్యులతో పాటు, వారితో సమన్వయం చేస్తూ పనిచేసే 21 మంది సాధకులతో ఈ కమిటీ రూపుదిద్దుకుంది. ప్రతి కమిటీకి పరిశీలకులుగా సీనియర్ నాయకులను నియమించారు. అలాగే ఈ కమిటీలలో వీరమహిళలకు కూడా తగిన ప్రాధాన్యం కల్పించడం జరిగింది..
పార్టీ అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు ఈ కమిటీల కూర్పును స్వయంగా సమీక్షించి ఆమోదించారు. కమిటీలు సేకరించిన సమాచారాన్ని సమగ్రంగా పరిశీలించి, పార్టీ ముఖ్య నాయకుల అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకున్న అనంతరం పార్టీ బాధ్యతల కేటాయింపుపై తుది నిర్ణయాన్ని స్వయంగా తీసుకోనున్నారు.
క్షేత్రస్థాయిలో కష్టపడిన ప్రతి జనసైనికుడికి గుర్తింపు లభించాలన్న లక్ష్యంతో, దశాబ్దన్నర క్రితమే రూపుదిద్దుకున్న ఆలోచనకు కార్యరూపం ఇస్తూ జనసేన పార్టీ అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు ఈ వినూత్న ప్రక్రియకు శ్రీకారం చుట్టారు.
#JSPForNewAgePolitics
సకల జనుల సంకల్పం... అమరుల త్యాగాల రూపం... మన తెలంగాణ
"నా తెలంగాణ కోటి రతనాల వీణ!" అని దాశరథి గారు పలికిన అక్షర సత్యం ,స్వేచ్ఛా గీతమై మ్రోగిన రోజు పుష్కరం క్రితం ఈ రోజు.
ఈ సందర్భంగా తెలంగాణ ప్రజలందరికీ హృదయపూర్వక రాష్ట్ర అవతరణ దినోత్సవ శుభాకాంక్షలు.
తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం అనేది దశాబ్దాల పాటు సాగిన ప్రజల ఆకాంక్షలకు, ఆత్మగౌరవ పోరాటానికి, త్యాగాలకు ప్రతిఫలంగా నిలిచిన చారిత్రాత్మక ఘట్టం.
తెలంగాణ సాధన కోసం తమ జీవితాలను అంకితం చేసిన ఉద్యమకారులు, విద్యార్థులు, మేధావులు, కళాకారులు, ఉద్యోగులు, రైతులు మరియు అమర వీరులకు నా వినమ్ర నివాళులు.
తెలంగాణ గడ్డ పోరాటాల పుట్టినిల్లు. ఇక్కడి గాలిలో పౌరుషం ఉంటుంది, నీటిలో ఉద్యమ ప్రవాహం ఉంది, నేలలో అమరుల రక్తం ఉంది.సమ్మక్క-సారలమ్మల స్ఫూర్తి నుంచి, కొమురం భీమ్ వంటి మహనీయుల త్యాగాల వరకు, ఈ భూమి స్వాభిమానానికి, న్యాయం కోసం చేసే పోరాటాలకు ప్రతీకగా నిలిచింది. భాష, సంస్కృతి, సంప్రదాయాలు, జానపద కళలు, సాహిత్య సంపదతో భారతదేశ వైవిధ్యంలో తెలంగాణాది ఒక విశిష్టమైన స్థానం.
తెలంగాణ సమాజం ఎదుర్కొన్న ప్రధాన సమస్యల పట్ల నాకు ఎప్పటినుంచో ప్రత్యేకమైన ఆవేదన, బాధ్యతాభావం ఉన్నాయి. ఫ్లోరోసిస్ బాధిత ప్రాంతాల పరిస్థితి, గిరిజనుల హక్కులు, రైతుల సమస్యలు, నిరుద్యోగ యువత ఆశలు, విద్యా మరియు ఆరోగ్య రంగాల్లోని సవాళ్లు ఇవన్నీ రాజకీయ అంశాలకంటే ముందుగా మానవీయ అంశాలుగా నేను భావించాను. ప్రజల కష్టాలు ఏ ప్రాంతానివైనా, అవి మన అందరి బాధ్యత అనే నమ్మకం నాది.
ఈ రోజు తెలంగాణ దేశంలో ఐటీ, ఔషధ పరిశ్రమలు, వ్యవసాయం, పారిశ్రామికాభివృద్ధి, స్టార్టప్ వ్యవస్థ, విద్యా రంగాల్లో తన ప్రత్యేక ముద్రను వేసుకుంటోంది. అయితే అభివృద్ధి ఫలాలు చివరి వ్యక్తి వరకు చేరినప్పుడే ఆ అభివృద్ధి సంపూర్ణమవుతుంది. గ్రామీణ ప్రాంతాలు, గిరిజన తండాలు, వెనుకబడిన వర్గాలు, మహిళలు, యువత, చిన్న రైతులు కూడా సమాన అవకాశాలతో ముందుకు సాగే తెలంగాణ నిర్మాణమే మనందరి లక్ష్యంగా ఉండాలి.
తెలంగాణ అంటే అపారమైన ఆత్మీయత, అపూర్వమైన సంస్కృతి, అద్భుతమైన మానవ సంబంధాల సమాహారం.తెలంగాణ ప్రజల ఆశయాలు, ఆత్మగౌరవం, సమగ్ర అభివృద్ధి లక్ష్యాల సాధనకు జనసేన పార్టీ సంపూర్ణ నిబద్ధతతో పనిచేస్తుంది..
12వ రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా తెలంగాణ మరింత ప్రగతి సాధించాలని, ప్రతి కుటుంబంలో సంతోషం నిండాలని, యువతకు విస్తృత అవకాశాలు లభించాలని, రైతు సంక్షేమం బలోపేతం కావాలని, మహిళలు మరింత సాధికారత పొందాలని, సామాజిక న్యాయం మరియు సమగ్రాభివృద్ధితో తెలంగాణ దేశానికి ఆదర్శంగా నిలవాలని మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తున్నాను.
జై తెలంగాణ! జై హింద్!
#TelanganaFormationDay
ప్రజల కోసం తన కష్టార్జితాన్ని, వ్యక్తిగత జీవితాన్ని, సినీ కెరీర్ను సైతం త్యాగం చేసిన జనసేన పార్టీ అధినేత, గౌరవ ఉప ముఖ్యమంత్రి శ్రీ @PawanKalyan గారిపై భూ కబ్జా అంటూ అవాస్తవ ప్రచారాలు చేయడం రాజకీయ దివాళాకోరుతనానికి నిదర్శనం.
రాజకీయంగా ఎదుర్కోలేక, ప్రజల్లో పెరుగుతున్న ఆదరణను జీర్ణించుకోలేక, ఆంధ్రప్రదేశ్లో తిరస్కరణకు గురైన ఒక క్రిమినల్ రాజకీయ పార్టీకి మద్దతుగా తెలంగాణలోని కొందరు పెయిడ్ యూట్యూబ్ ఛానల్స్, స్వయం ప్రకటిత మేధావులు, ఎర్నలిస్టులు, చిల్లర నాయకులు కలిసి దుష్ప్రచారాలకు దిగటం సిగ్గుచేటు.
పవన్ కళ్యాణ్ గారి శంకర్ పల్లి ఫాం హౌస్ పై వాస్తవాలు:
• 15-12-2014న ట్రాన్స్ఫర్ ఆఫ్ ప్రాపర్టీ యాక్ట్, 1882 సెక్షన్ 54 ప్రకారం చట్టబద్ధంగా భూమి కొనుగోలు జరిగింది.
• రిజిస్ట్రేషన్ యాక్ట్, 1908 సెక్షన్ 17 ప్రకారం రిజిస్టర్డ్ సేల్ డీడ్ నమోదైంది. రిజిస్టర్డ్ డాక్యుమెంట్ అంటే చట్టబద్ధ యాజమాన్యానికి అధికారిక సాక్ష్యం.
• FTL నిబంధనలు నిర్మాణాలపై వర్తిస్తాయి కానీ యాజమాన్య హక్కులపై కాదు.
• శిఖం పట్టా భూమి అంటే వ్యక్తిగత యాజమాన్య హక్కులు కలిగిన భూమి. దానిని "ప్రభుత్వ భూమి"గా చిత్రీకరించడం అజ్ఞానం లేదా ఉద్దేశపూర్వక మోసం.
• మ్యుటేషన్లు, ఖాతా నంబర్లు, సబ్-డివిజన్లు అన్నీ తెలంగాణ రెవెన్యూ చట్టాల ప్రకారమే జరిగాయి. ఒక వ్యక్తికి ఒకే ఖాతా ఉండాలనే చట్టం ఎక్కడా లేదు.
• Registered Sale Deed = Lawful Ownership.
• Mutation = Statutory Revenue Process.
• Multiple Khatas = Legally Recognized Situation.
• FTL Restrictions = Construction Rules, Not Ownership Restrictions.
అన్ని ప్రభుత్వ రికార్డులు, చట్టబద్ధ పత్రాలు ఒక వైపు ఉంటే... కొంతమంది పెయిడ్ ఆర్టిస్టులు తప్పుడు కథనాలు ప్రచారం చేస్తున్నారు.
పెయిడ్ ఎర్నలిస్టులకు శతఘ్ని సవాల్:
భూ కబ్జా జరిగిందని ఆరోపిస్తున్న వారు ఒక్క ఆధారం అయినా ప్రజల ముందుంచాలి. చట్టబద్ధంగా కొనుగోలు చేసిన, రిజిస్ట్రేషన్ పొందిన భూమిని "కబ్జా"గా చిత్రీకరించడం మా అధినేత వ్యక్తిగత పరువుకు భంగం కలిగే చర్యకు పాల్పడిన వారు, తెర వెనుక మిమ్మల్ని నడిపిస్తున్న చిల్లర నాయకులు ఎవరైనా సరే బయటకు వచ్చి ఇది తప్పు అని నిరూపించగలరా?
వాస్తవాలను వక్రీకరించి ప్రజలను మభ్యపెట్టే ప్రయత్నాలు ఎంత చేసినా, శ్రీ పవన్ కళ్యాణ్ గారి నిబద్ధతను, ప్రజల నమ్మకాన్ని, జనసేన ప్రయాణాన్ని దెబ్బతీయలేవు.
అవిపవన్ కళ్యాణ్ గారి మీద
పవన్ కళ్యాణ్ గారిపై అబద్ధపు ఆరోపణలు చేయడం అంటే హిమాలయ శిఖరాన్ని గులకరాయితో కూల్చేయాలని ప్రయత్నించినట్టే.
#EndofCheapPaidArtists
ఈ రోజు 27-05-2026
33వ వార్డు లో జీవీఎంసీ మాజీ ఫ్లోర్ లీడర్ కార్పొరేటర్ భీశెట్టి వసంత లక్ష్మి(GK) గారు ఆధ్వర్యంలో వెంకటేశ్వర మెట్ట మీద జనవాణి కార్యక్రమం ఏర్పాటు చేయడం ప్రజల నుంచి అర్జీలు స్వీకరించడం జరిగింది.
@JanaSenaParty@PawanKalyan@mnadendla
కలుషిత జలాలు గోదావరిలో కలిపేస్తుంటే అధికారులు ఏం చేస్తున్నారు?
గలగలా గోదారి… అని గీతం ఆలపిస్తాము… ఇంత కాలుష్యం ఉంటే ఏమని ఆలపించాలి?
* ఆంధ్ర పేపర్ మిల్స్ యాజమాన్యానికి నోటీసులు ఎందుకు ఇవ్వలేదు?
* రూ. 13 కోట్ల బకాయిలను రాబట్టలేరా?
* ప్రజల ముందు సమాధానం చెప్పాల్సింది మేము
* పుష్కరాల్లో పన్నీరు స్నానం చేయించక్కర్లేదు… కెమికల్ స్నానం చేయించకూడదు కదా
* ఇంతటి కీలక సమస్యలను నా దృష్టికి తీసుకురండి క్యాబినెట్లో చర్చించి నిర్ణయం తీసుకుంటాం
* ఆంధ్ర పేపర్ మిల్స్ పరిశ్రమ కాలుష్యాన్ని ప్రత్యక్షంగా… తూర్పులంక లాగూన్స్ వరకు వెళ్లి మరీ పరిశీలించిన ఉప ముఖ్యమంత్రివర్యులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు
‘మా తెలుగుతల్లికి.. రాష్ట్ర గీతంలో గల గలా గోదారి అని గుండెల నిండా ఆర్తితో ఆలపిస్తాం.. ఇక్కడకు వచ్చి చూస్తే గోదావరి వెలవెలబోతూ.. కాలుష్యంతో నిండిపోతూ కనిపిస్తోంది. ఏమని ఆలపించాలి. ఇంతటి కాలుష్యం కలుస్తున్న నీటిలో మన పిల్లలను స్నానం చేయించే సాహసం చేస్తామా..? ఇంత దారుణంగా కలుషిత జలాలు గోదావరిలోకి ప్రత్యక్షంగా కలుస్తున్నా అధికారులు ఇంకా మీనమేషాలు ఎందుకు లెక్కిస్తున్నారు?’ అని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రివర్యులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. పారిశ్రామిక అభివృద్ధికి కూటమి ప్రభుత్వం అధిక ప్రాధాన్యత ఇస్తోంది… పరిశ్రమలను ప్రోత్సహించాలని రాయితీ ధరలకు భూములను కేటాయిస్తున్నాం.. ప్రభుత్వం ఎంత సహకరిస్తున్నా, పరిశ్రమలకు కనీసం పర్యావరణ స్పృహ లేకపోతే ఎలా అని ప్రశ్నించారు. రాజమహేంద్రవరం ఆంధ్ర పేపర్ మిల్స్ లిమిటెడ్ పరిశ్రమ గోదావరిలోకి వదులుతున్న కాలుష్య జలాలను శ్రీ పవన్ కళ్యాణ్ గారు మంగళవారం ఉదయం ప్రత్యక్షంగా పరిశీలించారు. కలుషిత నీటిని శుద్ధి చేసి గోదావరిలోకి విడుదల చేయాలి. తూర్పు లంకలోని లాగూన్స్ (మడుగులు)లో వీటిని వదులుతారు. శ్రీ పవన్ కళ్యాణ్ గారు ఉదయాన్నే వెంకట నగరం ఘాట్ నుంచి పడవలో లాగూన్స్ వరకూ వెళ్లి ప్రత్యక్ష పరిశీలన చేశారు. కాలుష్య నియంత్రణ మండలి మొబైల్ కిట్లతో నీటిలో కాలుష్య కారకాలు ఎంత ఉన్నాయి అన్నది అక్కడికక్కడే పరీక్షలు చేయించారు.
ఈ సందర్భంగా శ్రీ పవన్ కళ్యాణ్ గారు స్పందిస్తూ- ప్రత్యక్షంగా గోదావరిలోకి కాలుష్య జలాలు ఈ స్థాయిలో కలుస్తున్నా ఇప్పటి వరకు కాలుష్య నియంత్రణ మండలి అధికారులు ఎందుకు స్పందించలేదని, కనీసం నోటీసులు ఎందుకు ఇవ్వలేదని కాలుష్య నియంత్రణ మండలి ఈఈ శ్రీ శంకర్ నాయక్ ను ప్రశ్నించారు. ఎప్పటికప్పుడు తనిఖీలు చేసి కాలుష్య శుద్ధి ఎలా జరుగుతుంది అన్న వివరాలు తెలుసుకుంటున్నారా? క్షేత్రస్థాయిలోకి వచ్చి ఈ మడుగులను ఎన్నిసార్లు పరిశీలించారు అని ప్రశ్నించారు. గోదావరి మధ్యలోని తూర్పులంకలో అతి పెద్ద మడుగులలో కాలుష్య కారకాలు ఉన్న నీటిని నిల్వ చేసి తర్వాత, గోదావరిలోకి ఇంకిపోయేలా చేయడం ఏమిటన్నారు. మడుగుల్లోని నీరు మొబైల్ కిట్ లో మరోసారి పరీక్షలు చేయించారు. అక్కడ గుర్రపు డెక్క భారీగా పేరుకొని ఉందంటే కచ్చితంగా జలాలు కలుషితం అయినట్లే కదా అన్నారు.
*పెండింగ్ బకాయి రాబట్టలేరా?*
కూటమి ప్రభుత్వం పరిశ్రమలకు స్నేహపూర్వక భాగస్వామిగా ఉంటుంది. రాష్ట్రానికి మరిన్ని పెట్టుబడులు వస్తే, యువతకు ఉపాధి దొరుకుతుందని, రాష్ట్ర ప్రగతి పరుగులు పెడుతుందని భావిస్తాం. అయితే ఇంత స్నేహపూర్వక వాతావరణంలో రాయితీలపై భూములు కేటాయిస్తున్నా సరే పరిశ్రమలు కాలుష్యం నివారణ విషయంలో సరైన దృష్టి పెట్టడం లేదు అనిపిస్తుంది. గాలి, నీరు కాలుష్యం విషయంలో ప్రతి పరిశ్రమ కాలుష్య నియంత్రణ మండలి నిబంధనలు తప్పనిసరిగా పాటించాలి. ఆంధ్ర పేపర్ మిల్స్ యాజమాన్యం ప్రభుత్వానికి పన్నులు రూపేణా చెల్లించాల్సిన రూ. 13 కోట్ల బకాయిలను వెంటనే రాబట్టేలా జిల్లా యంత్రాంగం పనిచేయాలి. ప్రభుత్వం నుంచి రాయితీలు పొందుతూ బకాయిలు కట్టకపోతే ఎలా? దీనిపై సీరియస్ గా స్పందించండి. అలాగే ప్రతి ఏటా కాలుష్య నియంత్రణకు యాజమాన్యం ఎంత మేర చిత్తశుద్ధితో చర్యలు తీసుకుంటుందో..? పరిశీలించండి. ఇంత దారుణంగా కళ్ళముందే కాలుష్యం జరుగుతున్న ఇప్పటివరకు కాలుష్య నియంత్రణ మండలి అధికారులు యాజమాన్యానికి ఎందుకు నోటీసు ఇవ్వలేదో కూడా నివేదిక ఇవ్వండి అని ఆదేశించారు.
*ప్రజలకు సమాధానం చెప్పాల్సింది మేము*
‘క్షేత్రస్థాయిలో పరిస్థితులు చక్కదిద్దాల్సింది అధికారులైతే, ప్రజాక్షేత్రంలో సమాధానం చెప్పాల్సింది ప్రజా ప్రతినిధులుగా మేము. గోదావరి కాలుష్యం మీద నా కార్యాలయానికి ఫిర్యాదులు వస్తున్నాయి. అసలు నిబంధనలు క్షేత్రస్థాయిలో అమలు అవుతున్నాయా? పరిస్థితి చూస్తే దారుణంగా ఉంది. ప్రజలు ఏదైనా మమ్మల్ని ప్రశ్నిస్తారు. వారికి సమాధానం చెప్పాల్సింది మేము.
ఈ రోజు 27-05-2026
33వ వార్డు లో జీవీఎంసీ మాజీ ఫ్లోర్ లీడర్ కార్పొరేటర్ భీశెట్టి వసంత లక్ష్మి(GK) గారు ఆధ్వర్యంలో వెంకటేశ్వర మెట్ట మీద జనవాణి కార్యక్రమం ఏర్పాటు చేయడం ప్రజల నుంచి అర్జీలు స్వీకరించడం జరిగింది.
@JanaSenaParty@PawanKalyan@mnadendla
Warm birthday wishes to Hon’ble Union Minister for @MORTHIndia Shri @nitin_gadkari Ji, the man driving India’s infrastructure revolution at unmatched speed and scale.
From world-class highways to transformative connectivity, your vision is not just building roads, but shaping the future of a stronger and more aspirational Bharat.
May you continue to inspire the nation with your dynamic leadership, innovation, and unwavering commitment to public service.
Wishing you good health, happiness, and many more years in service of the nation.
ఈరోజు మాజీ మంత్రివర్యులు శ్రీ పల్లె రఘునాథ్ రెడ్డి గారి నివాసానికి వెళ్ళి వారిని, పుట్టపర్తి ఎమ్మెల్యే శ్రీమతి పల్లె సింధుర రెడ్డి గారిని మరియు వారి కుటుంబ సభ్యులను మర్యాదపూర్వకంగా కలవడం జరిగింది.
@PalleSindhura
గోదావరి గలగల కాదు... కాలుష్యంతో విలవిల
•రోడ్లు కంటే ముందు గోదావరి జలాల శుద్ధి జరగాలి
•నదిని మురికిగా ఉంచి భక్తులను స్నానాలు చేయమనడం వంచించడమే
•పారిశ్రామికవేత్తల మాటల్లో నియమాలు… చేతల్లో ఉల్లంఘనలు
•ఆంధ్ర పేపర్ మిల్లు సంస్థ నిబంధనలను ఉల్లంఘించింది
•కనీసం పన్ను బకాయిలు కూడా చెల్లించలేదు
•పర్యావరణ పరిరక్షణలో పారిశ్రామికవేత్తలు బాధ్యతతో ఉండాలి
•రాజమహేంద్రవరం నగరపాలక సంస్థ కార్యాలయంలో గోదావరి నది కాలుష్యం, పుష్కరాల సన్నద్ధతపై జిల్లా అధికారులతో సమీక్ష నిర్వహించిన ఉప ముఖ్యమంత్రి శ్రీ @PawanKalyan గారు
‘ఒకప్పుడు గలగలా ప్రవహించిన గోదావరి తల్లి, నేడు పారిశ్రామిక వ్యర్థాల కాలుష్యంతో విలవిలలాడుతోంది. నదిని మురికిగా ఉంచి, భక్తులను పవిత్ర స్నానాలు చేయమనడం ప్రజలను వంచించడమే అవుతుంది. ఇంత కలుషిత నీటిలో స్నానాలు చేస్తే పుణ్యం వస్తుందో లేదో తెలియదు కానీ, జబ్బులు రావడం మాత్రం ఖాయమ’ని ఉప ముఖ్యమంత్రి, పర్యావరణ, అటవీ శాఖల మంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారు ఆవేదన వ్యక్తం చేశారు. పుష్కరాల కోసం రోడ్లు, రంగులు వేయడం కంటే ముందు గోదావరి నది కాలుష్యాన్ని తగ్గించాలని అధికారులకి స్పష్టం చేశారు. రాజమహేంద్రవరం నగరపాలక సంస్థ కార్యాలయంలో గోదావరి నది కాలుష్యం, పుష్కరాల సన్నద్ధతపై జిల్లా అధికారులతో ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహిస్తారు.
ఈ సమావేశానికి ముందు తూర్పు లంక లాగూన్స్ పరిశీలించారు. అక్కడి నుంచి తిరిగి వస్తూ నల్లా ఛానెల్ ను మరోసారి పరిశీలించారు. కన్వేయర్ బెల్ట్ మీద మురుగు నీరు శుద్ధి ప్రక్రియ ముందుకు వెళ్లకపోవడం గుర్తించారు. దీనిపై అధికారుల నుంచి వివరణ తీసుకున్నారు.
అనంతరం నిర్వహించిన సమీక్ష సమావేశంలో రాష్ట్ర ఆహార, పౌర సరఫరాల శాఖ మంత్రి శ్రీ నాదెండ్ల మనోహర్ గారు, పర్యాటక శాఖ మంత్రి శ్రీ కందుల దుర్గేష్ గారు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా శ్రీ పవన్ కళ్యాణ్ గారు మాట్లాడుతూ... “ఒక వైపు పుణ్య నది గోదావరిలో స్నానం చేస్తే పుణ్యం వస్తుందని భక్తులకు చెబుతూ.. మరో వైపు భారీ స్థాయిలో మురుగు నీటిని నేరుగా నదిలోకి వదలడం అత్యంత హాస్యాస్పదం, దారుణం. స్నానం చేస్తే పుణ్యం వస్తుందో రాదో తెలియదుగానీ... జబ్బులు వచ్చే ప్రమాదం మాత్రం పొంచి ఉంది. రాజమండ్రి నగరం నుంచి ప్రతి రోజూ 75 మిలియన్ లీటర్ల మురుగునీరు వస్తుంటే, అందులో కేవలం 30 మిలియన్ లీటర్లను మాత్రమే శుద్ధి చేస్తున్నారు. మిగిలిన 45 మిలియన్ లీటర్ల మురికినీటిని ఎటువంటి శుద్ధి లేకుండానే నేరుగా గోదావరి నదిలోకి వదిలేస్తున్నారు. గోదావరి తల్లి మన తప్పులన్నింటినీ భరిస్తూ ప్రవహిస్తోంది కాబట్టి సరిపోయింది. కానీ పవిత్రమైన పుష్కర స్నానాలు ఆచరించేందుకు దేశం నలుమూలల నుంచి వచ్చే భక్తులు మురుగు నీటిలో స్నానం చేస్తున్నామనే భావన కలగకూడదు.
*మురుగునీటి శుద్ధికి బడ్జెట్ ఎక్కడ?*
రాబోయే పుష్కరాల కోసం అన్ని రకాల వసతులు, రోడ్లు, ఘాట్ల నిర్మాణం, మౌలిక వసతులు కోసం దాదాపు రూ.8,000 కోట్ల బడ్జెట్ ప్రతిపాదనలు అధికారులు సిద్ధం చేసుకున్నారు. భక్తులకు అన్ని వసతులు కల్పిస్తున్నాం కానీ, వారు స్నానం చేసే గోదావరి నదిని శుభ్రంగా ఉంచే మురుగునీటి శుద్ధికి మాత్రం పైసా బడ్జెట్ కేటాయించలేదు. రోజూ 45 ఎంఎల్డీ మురుగునీరు నేరుగా నదిలోకి వెళ్తుంటే.. దాన్ని ఆపడానికి బడ్జెట్ పెట్టకుండా, మిగతా వసతులకు రూ. 8,000 కోట్లు ఖర్చు పెడితే ఏం లాభం?
కొన్నేళ్ల క్రితం ఏలూరులో తాగునీరు కలుషితమై, ప్రజలు వింత వ్యాధి బారిన పడి పది మంది వరకు ప్రాణాలు కోల్పోయారు. ఇలాంటి ఘటనలను దృష్టిలో పెట్టుకొని అప్రమత్తంగా ఉండాలి. గోదావరి నదిలోకి మురుగు నీరు కలవకుండా నిరోధించేందుకు, అత్యుత్తమ టెక్నాలజీతో వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్ల నిర్మాణానికి నిధులు కేటాయించాలి.
*వాళ్లది బాధ్యత లేని నిర్లక్ష్యం*
నిన్న జరిగిన సమావేశంలో పారిశ్రామికవేత్తలు తాము అన్ని నిబంధనలూ కచ్చితంగా పాటిస్తున్నామని చెప్పారు. కానీ ఈ రోజు ఆంధ్ర పేపర్ మిల్లు పరిసరాల్లో క్షేత్రస్థాయికి వెళ్లి చూస్తే వారు చెప్పిన మాటలకు, అక్కడ ఉన్న పరిస్థితులకు ఎక్కడా పొంతన లేదు. పరిశ్రమ నుంచి వస్తున్న రసాయన వ్యర్థ జలాల కోసం కనీసం ఒక కాంక్రీట్ కెనాల్ కూడా నిర్మించలేదు. విషపు నీటిని నేరుగా వదిలేయడం వల్ల చుట్టుపక్కల భూగర్భజలాలు పూర్తిగా కలుషితమైపోతున్నాయి. ఈ రసాయన మురికి నీరంతా నేరుగా పవిత్ర గోదావరిలో కలవడం వల్ల నదిలో విపరీతంగా గుర్రపుడెక్క పెరిగిపోతోంది. నది పర్యావరణ వ్యవస్థ సర్వనాశనమవుతోంది. ఇన్ని తప్పులు చేస్తూ, తిరిగి మమ్మల్ని ఇబ్బందిపెడుతున్నారు అని ఆ పరిశ్రమ వాళ్ళు మాట్లాడుతున్నారు.
కోట్లు అర్జిస్తున్నా... రూ. 13 కోట్ల టాక్స్ కట్టలేదు
ఆంధ్రా పేపర్ మిల్లు సంస్థ రూ.500 కోట్ల భారీ లాభాలు గడిస్తున్నా, ప్రభుత్వానికి కట్టాల్సిన రూ.13 కోట్ల పన్ను బకాయిలను మాత్రం చెల్లించడం లేదు.