అమాత్యులు @jupallyk_rao అండతో ప్రభుత్వ ఖజానాను అడ్డంగా దోచుకోవటానికి అలవాటు పడిన కాంగ్రెస్ నేతలు కొల్లాపూర్ లోని కృష్ణా నది పరివాహక ప్రాంతం పెద్దవాగులో కోట్ల రూపాయలు విలువ చేసే ఇసుక అక్రమంగా రవాణా చేస్తున్నారు.
నార్లాపూర్-ముక్కిడి��ుండం గ్రామాల మధ్య వంతెన నిర్మాణం పేరుతో జరుగుతున్న కాంగ్రెస్ ఇసుకాసురుల అక్రమ దందా, ప్రభుత్వ అనుమతులు లేకుండానే కోట్ల విలువైన ఇసుకను అక్రమంగా తవ్వి, అక్రమంగా రవాణా చేస్తూ కోట్ల రూపాయల ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తున్నారు.
మంత్రి ఇలాకలో విచ్చలవిడిగా జరుగుతున్న ఇసుక మాఫియా ద్వారా వచ్చే కోట్ల రూపాయలు ఎవరి గల్లపెట్టిలోకి పోతున్నాయి? దీనికి మంత్రి జూపల్లి కృష్ణారావు సమాధా��ం చెప్పాలని #BRS డిమాండ్ చేస్తున్నది.
@revanth_anumula
@TelanganaCS
@TelanganaDGP
https://t.co/kHgcFAgLJC
ఇంత గొప్ప మనసున్న మారాజు ఇంత మంచి మనిషిని చట్టసభలకు పంపించకపోతే తప్పు మనదే అవుతుంది.... మిత్రులారా.. సమాజంలో గొప్ప మార్పు జరగచ్చేమో ఒకసారి ప్రయత్నం చేద్దాం సార్ నీ చట్టసభలకు పంపిద్దాం @RSPraveenSwaero @BRSNagarkurnool
నా మీద నమ్మకంతో రానున్న పార్లమెంటు ఎన్నికల సమరంలో నాగర్ కర్నూల్ పార్లమెంట్ స్థానానికి నన్ను @BRSparty అభ్యర్థిగా ప్రకటించిన తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి, భారాస అధినేత శ్రీ #KCR గారికి హృదయపూర్వక ధన్యవాదాలు.🙏
నేను మీ నమ్మకాన్ని వమ్ముచేయను.
పేద ప్రజలకిచ్చిన మాట తప్పను.
Thanks a million Sri KCR ji for trusting and declaring me as BRS candidate for NagarKurnool (SC) Parliamentary Constituency for upcoming General Election-2024.
శ్రేయోభిలాషులకు ఒక ప్రార్థన🙏:
నా రాజకీయ ప్రస్థానంలో ఇటీ��ల జరిగిన కొన్ని పరిణామాలు మిమ్ములను బాధ పెట్టి ఉోండవచ్చు. నా��ు కూడా బాధగానే ఉంది. ఒక ఉన్నతమైన లక్ష్య సాధన కోసం కొన్ని త్యాగాలు తప్పవు.
అయితే విషయాన్ని అర్థం చేసుకోకుండా, నా మీద సోషల్ మీడియా వేదికగా కొన్ని శక్తులు (కొంత మంది ఆప్తులతో సహా!) తీవ్రమైన దాడి చేసినయి. ఇంకా చేస్తూనే ఉన్నాయి. ఇలాంటి అనాగరికమైన దాడులు నాకు కొత్త కాదు. నన్ను, పేద ప్రజల జీవితాలను సమూలంగా మార్చాలన్న నా లక్ష్యం నుండి ఈ చిల్లర దాడులు దూరం చేయలేవు.👊
నన్ను దయచేసి నమ్మండి🙏
��ేను ఇన్నాళ్లూ నిస్వార్థంగా పీడిత ప్రజలకోసమే పనిచేశాను. చట్ట సభల్లో కూడా మీ గొంతుకగా ఉండాలనే లక్ష్యంతో ఎంతో విలువైన ఉద్యోగాన్ని సైతం వదలి రాజకీయాల్లోకి వచ్చాను. అసెంబ్లీలో బహుజనుల గొంతుకగా ఉండాలని రాత్రింబవళ్లు శ్రమించినా మొదటి ప్రయత్నంలో విఫలమయ్యాను.
తెలంగాణ వాదం -బహుజనవాదం రెండూ ఒకటేనని నమ్మి ఎంతో శ్రమించి శ్రీ కేసీఆర్ మ��ియు బెహన్జీ మాయావతి గార్లను ఒప్పించి తెలంగాణలో చారిత్రాత్మక పొత్తు ఏర్పాటయ్యేలా చూశాను. కానీ కొన్ని అనివార్య కారణాల వల్ల అది చివరి నిమిషంలో రద్దయినప్పటికీ, ఇచ్చిన మాట మేరకు విశాల తెలంగాణ ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకొని, దేశంలో కోట్లాది బహుజనుల బంగారు భవిష్యత్తు కోసం, భారత రాజ్యాంగ విలువల రక్షణ కోసం, కేసీఆర్ గారితోనే కలసి ప్రయాణించాలనుకున్నాను. బీజేపీ కుట్రల నుండి దేశాన్ని రక్షించే ధమ్ము-ధైర్యం కాంగ్రేసుకు ముమ్మాటికీ లేదు. అోందుకే నేను ఇటీవలే భారాసలో చేరాను.
ఈ యుద్దంలో కేసీఆర్ గారి మార్గదర్శనంలో సర్వశక్తులొడ్డి విజయం కోసం పోరాడతాను. దయచేసి మీరు కూడా నాతో రండి. మీకు చేతనైన సాయం చేయండి. మీ విలువైన సమయమివ్వండి. నాగర్ కర్నూల్ నియోజకవర్గానికి వచ్చి ‘కారు’ గుర్తుకు ఓటెయ్యమని ఇంటింటికి ప్రచారం చేయండి. లేదా మీ��ు తెలిసిన వారికందరికీ కనీసం ఫోన్ చేసయినా చెప్పండి.
నేను చట్టసభల్లో కూర్చుంటే మీరందరూ అక్కడ కూర్చున్నట్లే….
నేను నేను కాదు…నేను మీరే…
మనమందరమూ…🙏
ఛలో నాగర్ కర్నూల్✊
జైభీం…జై తెలంగాణ..జై భారత్
#KCROnceAgain
#RSP4NGKL
#SaveTelangana
#SaveConstitution
@KTRBRS
@BRSHarish
గత పదేళ్లలో కేసీఆర్ ప్రభుత్వం ₹6.71 లక్షల కోట్ల రూపాయల అప్పు చేసిందని గగ్గోలు పెట్టిన కాంగ్రేసు ప్రభుత్వం ఈ నాలుగు నెలల్లోనే ₹16,400 కోట్ల అప్పు చేసినట్లుగా వార్తలొస్తున్నయి! ఇంకా అనధికారికంగా కార్పొరేషన్ల పేరు మీద చేసే అప్పులు దీనికి ��ెండింతలు ఉంటయి. వాటిని బడ్జెట్లలో చూపించరు. అప్పుడు కనీసం మౌళిక సదుపాయాలైనా వచ్చినయ్, ఇప్పుడు వాటి ఊసే లేదు. కేవలం గ్యారంటీల గారడి మాత్రమే నడుస్తున్నది.
ఈ నాలుగు నెలల్లో మీరు చేసిన అప్పుల మీద కూడా ఏదీ దాచకుండా శ్వేత పత్రం విడుదల చేయండి.
@TelanganaCMO
తెలంగాణ ప్రజలకు నమస్కారం🙏
నేను నా రాజకీయ భవితవ్యం పై ఈ రోజు హైదరాబాదులో వందలాది శ్రేయోభిలాషులు, ఆప్తులు, అభిమానులందరితో మేధోమధనం జరిపాను. అట్టి సభలో రకరకాల అభిప్రాయాలు వచ్చాయి. కానీ నా మీద నమ్మకంతో నేను ఏ నిర్ణయం తీసుకున్నా నా వెంటనే నడుస్తామని మాట ఇచ్చిన అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు🙏
తెలంగాణ విశాల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకొని, దేశంలో లౌకికత్వాన్ని కాపాడడం కోసం, రాజ్యాంగ రక్షణ కోసం, బహుజనుల అభ్యున్నతి కోసం నేను రేపు తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి, బీఆరెస్ అధినేత
శ్రీ కేసీఆర్ గారి సమక్షంలో భారత రాష్ట్ర సమితిలో చేరుతున్నాను.
నేను ఎక్కడున��నా బహుజన మహనీయుల సిద్దాంతాన్ని గుండెలో పదిలంగా దాచుకుంటా. వాళ్ల కలలను నిజం చేసే దిశగా పయనిస్తా✊
దయచేసి నిండు మనసుతో ఆశీర్వదించండి.🙏
జై భీం. జై తెలంగాణ. జై భారత్
నిరుద్యోగుల న్యాయమైన డిమాండ్ల సాధన కోసం శాంతియుతంగా ఆమరణ దీక్ష చేస్తున్న అశోక్ సార్ ను రాత్రి అరెస్టు చేయడాన్ని ఖండిస్తున్నా. ఇదే శ్రద్ద మీరు రిక్రూట్మెంట్ మీద చూపి ఉంటే పరిస్థితి ఇంతగా దిగజారేది కాదు.
By the way, కింద ఫోటోల్లో ఉన్న వాళ్లు దీక్షల్లో ఉన్న నిరుద్యోగ బిడ్డలు. వీళ్లు నాలుగు నెలల క్��ితం కాంగ్రేసు అధికారంలోకి రావాలని రాష్ట్రం అంతా తిరిగారు!!!
#CongressCheatedTelangana
@TelanganaCMO
తెలంగాణ ప్రజలకు గొప్ప శుభవార్త!
బీయస్పీ - బీఆరెస్ ల కూటమి చర్చలపై నిన్న ఏర్పడిన సందిగ్దానికి బీయస్పీ జాతీయ అ���్యక్షురాలు బెహన్జీ మాయావతి గారు కొద్ది సేపటి క్రితమే తెరదించారు. ప్రస్తుతం బీఆరెస్ పార్టీ దేశంలో ఏ కూటమి లో లేనందున, బీయస్పీకి ఆ పార్టీతో పార్లమెంటు ఎన్నికల్లో తెలంగాణలో కలసి పనిచేయడానికి బెహన్జీ గారు అనుమతించారని బీయస్పీ హై కమాండ్ తెలిపింది.
త్వరలోనే పొత్తు విషయంలో తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి శ్రీ కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు గారి సమక్షంలో జరిగే తదుపరి చర్చలకు బీయస్పీ యం పీ, కేంద్ర సమన్వయకర్త, శ్రీ రాంజీ గారు బెహన్జీ దూతగా హాజరు కానున్నారు.
We immensely thank the National President of #BSP, former CM of UP, honourable Behenji, @Mayawati for giving go ahead for advance negotiations on alliance with @BRSparty (which is not part of any national alliance) in Telangana for upcoming general elections-2024.
Our Central Coordinator, hon’ble MP, Sri Ramji will arrive soon in Hyderabad to guide the party in this historic effort.
Dhanyawad🙏
*అవసరమనుక���ంటే నేనే కాల్చుకొని చనిపోత తప్పా...బహుజన వాదాన్ని చంపను - డాక్టర్ R.S.ప్రవీణ్ కుమార్ గారూ🙏🥹*
ఇది RSP గారి గొప్పతనం, RSP గారి లో మరో అంబేద్కర్ గారిని చూడవచ్చు.ఇప్పటికైనా ఆలోచన చేయండి..అందరం కలిసి RSP గారి వెంట నడిచి బహుజన రాజ్యాన్ని సాధించుకుందాం....
ఆర్ఎస్పీ గారి మీద అనుచిత వ్యాఖ్యలు చేసిన కొండ సురేఖ గారి యొక్క దిష్టిబొమ్మ దహనం చేయడం జరిగింది.ఆర్ఎస్పి గారికి తక్షణమే క్షమాపణలు చెప్పాలని బిఎస్పీ డిమాండ్ చేస్తుంది.
@RSPraveenSwaero ఆర్.ఎస్.పి గారు బహుజనుల పాలిట దేవుడు అయితాడు అని, వాళ్లందరికీ ఈ అవకాశాలు రావట్లేదని, ఆ బహుజన ద్రోహి ఆణిముత్యాలు ఈర్ష పడ���తున్నాయి సార్, ఇక ఆ రోజులు పోయినాయి, కచ్చితంగా బహుజన వ్యతిరేకులను తొక్కుకుంటూ ముందుకు పోతాం.
దేశంలో రాజ్యాంగానికి , లౌకికత్వానికి పొంచి ఉన్న పెను ముప్పును దృష్టిలో ఉంచుకొని, బహుజన సాధికారత-రక్షణ-భవిష్యత్తే లక్ష్యంగా, తెలంగాణ రాష్ట్ర ప్రయోజనాలను కాపాడడం కోసం రాబోయే పార్లమెంటు ఎన్నికల్లో BSP మరియు BRS తెలంగాణలో కలసి పనిచేయాలని నిర్ణయించుకున్నవి. ఈ చారిత్రాత్మక కూటమి���ి అనుమతించిన ఉక్కు మహిళ బెహన్జీ మాయావతి, తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి శ్రీ కేసీఆర్ గార్లకు, ఆశీర్వదించిన హృదయపూర్వక ధన్యవాదాలు.
రాజకీయ పార్టీలు తమ తమ సిద్దాంతాలు, బలాలు, బలహీనతలను దృష్టిలో ఉంచుకొని, రాజకీయ పరిస్థితులకు అనుగుణంగా, విజయం కోసం తమ వ్యూహాలను మార్చుకోవడం సర్వ సాధారణం. ఇప్పుడు అధికారంలో ఉన్న పార్టీలు, ప్రతి పక్షంలో ఉన్న పార్టీలు తమ ప్రస్థానంలో ఎక్కడో ఒక చోట పొత్తులతో ఎదిగినవే. దురదృష్టవశాత్తు కొందరికి ఇవి కనిపించడం లేదు. అప్పుడెప్పుడూ మాట్లాడని వీళ్లు కేవలం BRS-BSP కూటమిని నిందించడం హాస్యాస్పదం.
ఎన్నికల్లో పట్టుమని పది ఓట్లు రాని వాళ్లు, అంబేద్కర్, ఫూలే, కాన్షీరాం ల ఫోటోలు పెట్టుకుని ప్రజల దగ్గరికి వెళ్లే ధైర్యం లేని, వాళ్ల కోసం పోరాటం చేయలేని పిరికిపందలకు ఈ నిర్ణయాన్ని విమర్శించే అర్హత లేదు.
చివరిగా ఈ నిర్ణయం సరైందో కాదో చరిత్రనే సమాధానం చె��ుతుంది. నాతో పాటు చాలా రోజులు ప్రయాణించిన కొంత మంది తమ్ముళ్లు(వెంకటేష్ చౌహాన్, పిల్లుట్ల శ్రీను) వ్యక్తిగత కారణాలతో పార్టీని వీడారు.
మీకందరికీ ఒక సలహా.
మీకు వ్యక్తిగతంగా లాభం జరుగుతుందనుకుంటే నన్ను పర్సనల్గా విమర్శించండి. నో ప్రాబ్లం. తల్లి లాంటి మన పార్టీని కాదు. దాని వెనక ఎంతో మంది మహనీయుల త్యాగం ఉంది.
నేను మాత్రం మిమ్ములను నిందించలేను. మీ నిస్సహాయతను అర్థం చేసుకోగలను. మీరు నాతో పంచుకున్న అనేక విషయాలను నా గుండెలోనే దాచుకుంటా. కానీ మిమ్ములను, మన సమాజాన్ని ఈ స్థితికి తీసుకొచ్చిన శక్తులపై నేను నిరంతరం మొండిగా పోరాడుతూనే ఉంటాను✊
జై భీం.