Hon’ble Chief Minister Sri A. Revanth Reddy, along with Irrigation Minister Sri N. Uttam Kumar Reddy, met Chhattisgarh CM Sri Vishnu Deo Sai in Raipur and urged him to expedite the NOC for the Sammakka Sagar Barrage at Tupakulagudem, Mulugu district.
CM Sri Vishnu Deo Sai ji responded positively and assured early action.
The completed 6.94 TMC barrage will help meet irrigation and drinking water needs in drought-prone and tribal regions of Telangana. The state is also ready to provide compensation for the land affected in Chhattisgarh.
The CM appealed for early NOC and other statutory clearances in the larger public interest.
@vishnudsai@ChhattisgarhCMO
#SammakkaSagarBarrage #Mulugu #GodavariRiver #Telangana
ములుగు జిల్లా తుపాకులగూడెం వద్ద గోదావరి నదిపై బహుళ ప్రయోజనాల సమ్మక్క సాగర్ బ్యారేజీకి సంబంధించి వెంటనే నిరభ్యంతర పత్రం జారీ చేయాలని ముఖ్యమంత్రి శ్రీ @revanth_anumula గారు ఛత్తీస్‌గఢ్ ముఖ్యమంత్రి శ్రీ @vishnudsai గారికి విజ్ఞప్తి చేశారు.
✅ముఖ్యమంత్రి గారు నీటిపారుదల శాఖ మంత్రి @UttamINC గారితో కలిసి రాయ్‌పూర్‌లో ఛత్తీస్‌గఢ్ ముఖ్యమంత్రి విష్ణుదేవ్ సాయి గారితో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా సమ్మక్క సాగర్ ప్రాజెక్టుకు సంబంధించిన వివరాలను తెలియజేసి #NOC జారీ చేయాలని కోరారు.
✅ఈ విషయంలో ఛత్తీస్‌గఢ్ ముఖ్యమంత్రి గారు సానుకూలంగా స్పందించారు. ఎన్ఓసీ ప్రక్రియను త్వరగా పూర్తి చేస్తామని హామీ ఇచ్చారు.
✅ఎల్‌నినో ప్రభావం, వర్షాభావ పరిస్థితుల నేపథ్యంలో తెలంగాణలో నీటి అవసరాలు పెరిగే అవకాశం ఉందని ముఖ్యమంత్రి గారు సమగ్రంగా వివరించారు. సమ్మక్క సాగర్ బ్యారేజీలో నీటిని నిల్వ చేసుకునేందుకు అనుమతి ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. ప్రాజెక్టుకు సంబంధించిన మిగిలిన అనుమతులకూ సహకరించాలని కోరారు.
✅తొలుత కాంతనపల్లి వద్ద ప్రతిపాదించిన ఈ ప్రాజెక్టు వల్ల ఆ ప్రాంతంలో 11,408 ఎకరాల భూమి ముంపునకు గురయ్యే అవకాశం ఉందని అంచనా వేశారు. తద్వారా 17 ఆదివాసీ గ్రామాల ముంపుతో పాటు భద్రత, మౌలిక సదుపాయాలపై కూడా ప్రభావం పడుతుందని గుర్తించారు. దాంతో ముంపు ప్రాంతాన్ని తగ్గించేందుకు బ్యారేజీ నిర్మాణ ప్రదేశాన్ని తుపాకులగూడెంకు మార్చారు.
✅ప్రాజెక్టు అధ్యయనం కోసం ఛత్తీస్‌గఢ్ ప్రభుత్వం కోరిన మేరకు రూ. 9.883 కోట్లను తెలంగాణ ప్రభుత్వం ఏప్రిల్‌లోనే చెల్లించింది. ఐఐటీ ఖరగ్‌పూర్ తన నివేదికను జూలై 30న ఛత్తీస్‌గఢ్ ప్రభుత్వానికి సమర్పించింది.
✅తుపాకులగూడెం వద్ద చేపట్టడం వల్ల ఛత్తీస్‌గఢ్‌లో సుమారు 33 ఎకరాలు ముంపునకు గురవుతాయని ఐఐటీ ఖరగ్‌పూర్ అధ్యయనంతో తేలింది. భారీ వరదల సమయంలో కూడా ప్రభావిత ప్రాంతం వంద ఎకరాలకు మించదు.
✅ములుగు జిల్లా తుపాకులగూడెం వద్ద సమ్మక్క సాగర్ బ్యారేజీ నిర్మాణం పూర్తయింది. బ్యారేజీలో పూర్తిస్థాయి నీటి మట్టం +83 మీటర్ల వద్ద దీని నిల్వ సామర్థ్యం 6.94 టీఎంసీలు. కరువు ప్రభావిత, వెనుకబడిన, గిరిజన ప్రాంతాల సాగు, తాగునీటి అవసరాలకు గోదావరి జలాలను వినియోగించాలనేది ఈ ప్రాజెక్టు లక్ష్యం.
✅ఛత్తీస్‌గఢ్‌లో భూసేకరణ, పరిహారం, పునరావాసానికి అవసరమైన నిధులను నిబంధనల ప్రకారం చెల్లించేందుకు తెలంగాణ ప్రభుత్వం సిద్ధంగా ఉందని ముఖ్యమంత్రి గారు తెలిపారు.
✅ప్రాజెక్టు నిర్మాణం పూర్తయిన నేపథ్యంలో ప్రజా ప్రయోజనాల దృష్ట్యా ఎన్ఓసీని త్వరగా జారీ చేయాలని కోరారు. మిగిలిన అనుమతుల ప్రక్రియను కూడా వేగవంతం చేయాలని ఈ సందర్భంగా విజ్ఞప్తి చేశారు.
@ChhattisgarhCMO
#SammakkaSagarBarrage #Mulugu #Thupakulagudem #GodavariRiver #SammakkaSaralammaProject
Hon’ble Chief Minister Shri A. Revanth Reddy expressed deep shock over the tragic bus accident in Uttarakhand’s Tehri Garhwal district. He extended his heartfelt condolences to the bereaved families of those who lost their lives and prayed for the speedy recovery of the injured.
#UttarakhandAccident
He emphasised leveraging this prestigious national event to showcase Telangana’s achievements in infrastructure development and to promote the Invest Telangana Global Summit and the Khelo India event being hosted by the Government of Telangana.
Chief Secretary Shri @sjaju1, IAS reviewed the arrangements for the 85th Indian Roads Congress, scheduled to be held from the 19th of this month. He directed officials to ensure foolproof arrangements and provide a seamless experience for all delegates.
తెలంగాణ వేదికగా వచ్చే డిసెంబరు 11 నుంచి 22వ తేదీ వరకు నిర్వహించనున్న 8వ ‘ఖేలో ఇండియా యూత్ గేమ్స్ - 2026’ అధికారిక లోగో, మస్కట్లను ముఖ్యమంత్రి శ్రీ @revanth_anumula గారు, కేంద్ర క్రీడలు, యువజన వ్యవహారాల శాఖ మంత్రి శ్రీ @mansukhmandviya గారు ఆవిష్కరించారు.
🏅ఢిల్లీలో కేంద్ర మంత్రి అధికారిక నివాసంలో జరిగిన ఈ కార్యక్రమంలో రాష్ట్ర క్రీడా, యువజన సర్వీసుల శాఖ మంత్రి శ్రీ @Vakiti_srihari, మంత్రి శ్రీ @UttamINC, రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు (క్రీడలు) శ్రీ @apjithender, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శ్రీ @sjaju1 గారితో పాటు ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
🏅హైదరాబాద్‌తో పాటు రాష్ట్రంలోని వివిధ జిల్లా కేంద్రాల్లో #KheloIndiaYouthGames2026 నిర్వహణకు స్టేడియాలు సిద్ధం చేసినట్లు ముఖ్యమంత్రి గారు వివరించారు. 27 క్రీడాంశాల్లో 7 వేల మందికి పైగా క్రీడాకారులు పోటీపడనున్నారని తెలిపారు.
🏅మూడేళ్లలోనే రాష్ట్ర క్రీడా బడ్జెట్‌ను రూ. 113 కోట్ల నుంచి రూ. 465 కోట్లకు పెంచినట్లు సీఎం గారు కేంద్ర మంత్రి దృష్టికి తీసుకెళ్లారు. రాష్ట్రంలో ఇప్పటికే 61 మినీ స్టేడియాల నిర్మాణం పూర్తి కాగా, మరో 15 స్టేడియాల పనులు వివిధ దశల్లో ఉన్నాయని తెలిపారు.
@kheloindia@satg_sports
#KheloIndiaYouthGames #KheloIndiaTelangana #Hyderabad
The official logo and mascot of the prestigious sporting event, scheduled to take place in Telangana from December 11–22, 2026, were unveiled in New Delhi by Hon’ble Chief Minister Shri @revanth_anumula and Union Minister for Youth Affairs and Sports Shri @mansukhmandviya ji.
With over 7,000 athletes expected to compete across 27 sporting disciplines, the Games will celebrate the incredible talent, energy and sporting spirit of India's youth.
Highlighting the state's commitment to sports development, the Chief Minister noted that Telangana's sports budget has increased significantly from ₹113 crore to ₹465 crore in just three years. Construction of 61 mini stadiums has been completed, with work on another 15 progressing.
With world-class sporting infrastructure and extensive preparations underway, #Telangana is all set to welcome the nation's young champions and make #KheloIndiaYouthGames2026 a grand celebration of sportsmanship, excellence and achievement!
@kheloindia
#KheloIndia #SportsInTelangana #YouthGames #SportsExcellence #TelanganaRising
ఢిల్లీ: తెలంగాణలో పెండింగ్‌లో ఉన్న ప్రాజెక్టుల అనుమతులు, అంతర్రాష్ట్ర వివాదాల పరిష్కారానికి సహకరించాలని ప్రధానమంత్రి శ్రీ @narendramodi గారికి ముఖ్యమంత్రి శ్రీ @revanth_anumula గారు విజ్ఞప్తి చేశారు. తాము అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రాజెక్టుల పనులు వేగవంతం చేశామని, భూ నిర్వాసితులకు పరిహారాన్ని వేగంగా అందజేస్తున్నామని ప్రధానమంత్రికి వివరించారు.
✅శ్రీ నరేంద్ర మోదీ గారితో ముఖ్యమంత్రి గారు ప్రధానమంత్రి అధికారిక నివాసంలో సమావేశమయ్యారు. సమావేశంలో కేంద్ర క్రీడా, యువజన వ్యవహారాల శాఖ మంత్రి శ్రీ @mansukhmandviya, రాష్ట్ర నీటి పారుదల శాఖ మంత్రి శ్రీ @UttamINC, రాష్ట్ర క్రీడా, యువజన సర్వీసుల శాఖ మంత్రి శ్రీ @Vakiti_srihari పాల్గొన్నారు.
✅ప్రాణహిత నదిపై #Tummidihatti ప్రాజెక్టుకు +152 మీటర్ల వద్ద నిర్మించేందుకు మహారాష్ట్ర ప్రభుత్వాన్ని ఒప్పించాలని ప్రధానమంత్రి గారికి విజ్ఞప్తి చేశారు. ఇటీవల మహారాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ @Dev_Fadnavis తో భేటీ అయిన విషయాన్ని ఈ సందర్భంగా ప్రధాని దృష్టికి తీసుకెళ్లారు.
✅మహారాష్ట్రలో ముంపునకు అవసరమైన పరిహారం ఇచ్చేందుకు తాము సిద్ధంగా ఉన్నామని తెలిపారు. తెలంగాణ సాగునీటి అవసరాల దృష్ట్యా తుమ్మిడిహెట్టికి మహారాష్ట్రను ఒప్పించాలని ముఖ్యమంత్రి గారు కోరారు.
✅తుమ్మిడిహెట్టి ప్రాజెక్టుతో తెలంగాణలోని వెనుకబడిన, గిరిజన ప్రాంతాల సాగు, తాగునీటి అవసరాలకు గ్రావిటీ ద్వారా నీటిని వినియోగించుకునే అవకాశం కలుగుతుందని తెలిపారు.
✅డాక్టర్ ఎస్. జైపాల్‌రెడ్డి పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకం (#PRLIS), సీతమ్మ సాగర్ బహుళార్థసాధక ప్రాజెక్టు (#SSMP), డిండి ఎత్తిపోతల పథకం (#DLIS) లపై రాష్ట్ర ప్రభుత్వం భారీగా వ్యయం చేసినా పర్యావరణ, ఇతర చట్టబద్ధమైన అనుమతులు పెండింగ్‌లో ఉండటంతో తాగునీటి ప్రయోజనాలు అందడం లేదని ప్రధానమంత్రి గారికి వివరించారు.
✅పర్యావరణ అనుమతుల విషయంలో ఇటీవల సుప్రీంకోర్టు సానుకూల తీర్పు ఇచ్చినందున ఏమాత్రం ఆలస్యం లేకుండా పర్యావరణ, ఇతర అనుమతులు ఇచ్చేలా చూడాలని విజ్ఞప్తి చేశారు.
✅సాస్కి (Scheme for Special Assistance to States for Capital Investment) కింద తెలంగాణకు అదనంగా రూ. 5,000 కోట్లు మంజూరు చేయాలని సీఎం గారు కోరారు. తెలంగాణలో 70 నుంచి 90 శాతం మేర పూర్తయిన ప్రాజెక్టులకు ఈ నిధులు వినియోగించుకుంటామని చెప్పారు.
✅ఈ ఆర్థిక సంవత్సరంలోనే ఈ నిధులు మంజూరు చేస్తే కొత్త ఆయకట్టుతో పాటు స్థిరీకరించిన ఆయకట్టుకు సాగునీరు సరఫరా చేసేందుకు వీలవుతుందని తెలిపారు. ఫలితంగా రైతుల ఆదాయం, గ్రామీణ ఉపాధి అవకాశాలు, ఆహార ధాన్యాల ఉత్పత్తి పెరుగుతుందన్నారు.
✅సమ్మక్క సాగర్ ప్రాజెక్టుకు సంబంధించిన డీపీఆర్‌ను ఇప్పటికే కేంద్ర జల సంఘానికి (#CWC) సమర్పించామని ప్రధానమంత్రి గారికి తెలియజేశారు. ఈ ప్రాజెక్టుతో ఛత్తీస్‌గఢ్‌లో ముంపునకు గురయ్యే భూమి, గ్రామాల వివరాలను అంచనాకు పూర్తిస్థాయి నీటిమట్టం (FRL), బ్యాక్ వాటర్ స్థాయి గుర్తింపుతో కూడిన సమగ్ర సర్వేకు రూ.9.88 కోట్లు చెల్లించిన విషయాన్ని ప్రధాని దృష్టికి తీసుకెళ్లారు.
✅ఛత్తీస్‌గఢ్‌కు భూ పరిహారం చెల్లించేందుకు తాము సిద్ధంగా ఉన్నామని, ఆ రాష్ట్రం నుంచి నిరభ్యంతర పత్రం (NOC) త్వరగా జారీ అయ్యేలా చూడాలని విజ్ఞప్తి చేశారు.
✅ప్రధానమంత్రి కృషి సించాయి యోజన (#PMKSY) కింద ఇంటిగ్రేటెడ్ సమ్మక్క సాగర్ ప్రాజెక్టు-సీతారామ ఎత్తిపోతల పథకానికి రూ.5,183 కోట్లు, మోడికుంట వాగుకు రూ.392 కోట్లు, చిన్న కాళేశ్వరం ప్రాజెక్టుకు రూ.171 కోట్లు, చనాకా-కొరాటా బ్యారేజీకి రూ.103 కోట్లు మంజూరు చేయాలని కోరారు.
✅హైదరాబాద్‌లో డిసెంబరు నెలలో నిర్వహించనున్న ‘ఖేలో ఇండియా యూత్ గేమ్స్ - 2026’ ప్రారంభ, ముగింపు వేడుకలకు ముఖ్య అతిథిగా హాజరుకావాలని శ్రీ నరేంద్ర మోదీ గారిని ముఖ్యమంత్రి గారు ఆహ్వానించారు. ఆహ్వాన పత్రికను అందించడంతో పాటు యూత్ గేమ్స్ లోగో, మస్కట్ల గురించి వివరించారు.
✅డిసెంబర్ 11 నుంచి 22వ తేదీ వరకు జరగనున్న #KheloIndiaYouthGames భవిష్యత్తులో ఆసియా క్రీడలు, ఒలింపిక్స్ వంటి ప్రతిష్ఠాత్మక అంతర్జాతీయ పోటీల్లో భారత్ తరఫున ప్రాతినిధ్యం వహించేందుకు యువ క్రీడాకారులకు ఇదొక చక్కని వేదిక కానుందని తెలిపారు.
✅2002లో జాతీయ క్రీడలు, 2007లో ప్రపంచ మిలిటరీ క్రీడలను విజయవంతంగా నిర్వహించిన చరిత్ర తెలంగాణకు ఉందని వివరించారు.
#Telangana #IrrigationProjects #WaterResources #KheloIndiaYouthGames2026
తెలంగాణలో పెట్టుబడులు పెట్టేందుకు వచ్చే పారిశ్రామికవేత్తలకు ప్రభుత్వం సంపూర్ణ సహకారం అందిస్తుందని, రాష్ట్రంలో విధానపరమైన గందరగోళం లేదని ముఖ్యమంత్రి శ్రీ @revanth_anumula గారు తెలిపారు. తెలంగాణకు పాలసీ పెరాలసిస్ లేదని, పెట్టుబడులకు అవసరమైన భూములు, నీళ్లు, అనుమతులు, మౌలిక సదుపాయాలు కల్పించేందుకు ప్రత్యేక విధానాలు రూపొందించామని చెప్పారు.
✅విద్య, వైద్యం, పరిశ్రమలు, సేవారంగాల్లో రాష్ట్రాన్ని అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్లడమే తమ లక్ష్యమని చెప్పారు. తెలంగాణకు ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు రావడంతో పాటు హైదరాబాద్‌కు పెద్ద ఎత్తున పెట్టుబడులు రావడంలో #ISB, నల్సార్ వంటి విద్యాసంస్థలు కీలక పాత్ర పోషిస్తున్నాయని అన్నారు.
✅#Hyderabad లో నెలకొల్పనున్న ఇన్స్టిట్యూట్ ఆఫ్ పబ్లిక్ హెల్త్ సైన్సెస్ (#PHFI) శంకుస్థాపన కార్యక్రమంలో ముఖ్యమంత్రి గారు పాల్గొన్నారు. ఈ సందర్భంగా నిర్వహించిన సమావేశంలో మాట్లాడుతూ, పీహెచ్ఎఫ్ఐ 2 జూన్ 2028 నాటికి నిర్మాణం పూర్తి చేసి, ప్రారంభించాలని చెప్పారు. అందుకు ప్రభుత్వం అన్ని రకాలుగా సహకరిస్తుందని హామీ ఇచ్చారు.
✅పీహెచ్ఎఫ్ఐ హైదరాబాద్‌కు అంతర్జాతీయ స్థాయిలో మరింత గుర్తింపు తీసుకొస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ సంస్థ అభివృద్ధికి అవసరమైన సహకారం అందించడమే కాకుండా, తాను స్వయంగా బ్రాండ్ అంబాసిడర్‌గా ఉంటానని ప్రకటించారు.
✅వైద్య రంగంలో హైదరాబాద్‌కు అంతర్జాతీయ గుర్తింపు తీసుకొచ్చేందుకు పీహెచ్ఎఫ్ఐ దోహదపడుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ఇప్పటికే సనత్‌నగర్ టిమ్స్ ఆస్పత్రిని ప్రారంభించుకున్నామని, మిగతా టిమ్స్ ఆస్పత్రులను కూడా అందుబాటులోకి తీసుకొస్తామని తెలిపారు.
✅గోషామహల్లో ఉస్మానియా ఆస్పత్రిని కొత్తగా నిర్మిస్తున్నామని, ఆస్పత్రుల అభివృద్ధి కోసం మొత్తం రూ. 12 వేల కోట్లు ఖర్చు చేస్తున్నామని వెల్లడించారు. దేశంతో పాటు మధ్యప్రాచ్య, ఆసియా దేశాలు కూడా పెట్టుబడుల కోసం హైదరాబాద్ వైపు చూస్తున్నాయని చెప్పారు.
✅జవహర్లాల్ నెహ్రూ గారు ప్రధానమంత్రిగా విద్య, నీటిపారుదల రంగాలకు ప్రాధాన్యం ఇచ్చారని చెబుతూ, ఆ కాలంలో నెలకొల్పిన ప్రఖ్యాత సంస్థలు, ప్రాజెక్టుల గురించి వివరించారు. వాటి కారణంగానే దేశంలో దేశం ఆహార కొరత నుంచి మిగులు ఆహార ధాన్యాల స్థాయికి చేరుకుందని చెప్పారు.
✅#Telangana లోని మారుమూల గ్రామానికి చెందిన విద్యార్థి కూడా న్యూయార్క్ వరల్డ్ ట్రేడ్ సెంటర్లో పనిచేసే వారితో పోటీపడే స్థాయికి ఎదగాలని ముఖ్యమంత్రి గారు ఆకాంక్షించారు.
✅పెట్టుబడిదారులు, విద్యాసంస్థల విషయంలో తమకు ఎలాంటి వివక్ష లేదన్నారు. ప్రపంచ ప్రఖ్యాత విశ్వవిద్యాలయాలు హైదరాబాద్‌లో తమ కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నాయని, ఇక్కడే అంతర్జాతీయ స్థాయి విద్య అందుబాటులోకి వస్తోందని చెప్పారు.
✅తెలంగాణను 2047 నాటికి అభివృద్ధి చెందిన రాష్ట్రంగా తీర్చిదిద్దేందుకు #TelanganaRising2047 విజన్‌ను రూపొందించామని గుర్తుచేశారు. క్యూర్, ప్యూర్, రేర్ అనే మూడు జోన్లుగా రాష్ట్ర అభివృద్ధి ప్రణాళికలను వివరించారు. పెట్టుబడులను ఆకర్షించాలన్న లక్ష్యంతో డిసెంబర్ 7, 8, 9 తేదీల్లో #InvestTelanganaGlobalSummit నిర్వహించనున్నట్లు వెల్లడించారు.
✅రాష్ట్రంలో పెట్టుబడులకు అనుకూలమైన వాతావరణం ఉందని, పారిశ్రామికవేత్తలు ఎలాంటి సందేహాలు లేకుండా పెట్టుబడులు పెట్టవచ్చని భరోసా ఇచ్చారు.
✅1960వ దశకంలో నెహ్రూ, ఇందిరాగాంధీ చొరవతో హైదరాబాద్‌లో ఐడీపీఎల్ ఏర్పాటు కావడం వల్లే రాష్ట్రంలో ఫార్మా రంగానికి పునాదులు పడ్డాయని గుర్తుచేశారు. పరిశోధన, అభివృద్ధికి ప్రాధాన్యత ఇవ్వడం వల్ల హైదరాబాద్ ఫార్మా రంగంలో ప్రపంచ స్థాయి గుర్తింపు సాధించిందన్నారు.
✅దేశంలోని బల్క్ డ్రగ్స్ ఉత్పత్తిలో 40 శాతం హైదరాబాద్‌లోనే జరుగుతోందని తెలిపారు. ప్రపంచ ప్రఖ్యాత ఫార్మా సంస్థ ఎలీ లిల్లీ హైదరాబాద్‌లో ఒక బిలియన్ డాలర్ల పెట్టుబడి పెట్టేందుకు ముందుకొస్తోందని చెప్పారు. అనేక అంతర్జాతీయ సంస్థలు గ్లోబల్ కేపబిలిటీ సెంటర్లను హైదరాబాద్‌లో ఏర్పాటు చేస్తున్నాయని తెలిపారు.
✅ఆరోగ్యశ్రీ, ముఖ్యమంత్రి సహాయనిధి ద్వారా ప్రతి ఏటా సుమారు రూ.2,500 కోట్లు ఖర్చు చేస్తున్నామని తెలిపారు. క్యాన్సర్‌ను నోటిఫైడ్ వ్యాధిగా గుర్తించి, రాష్ట్రంలో రోగుల వివరాలను సేకరించామని చెప్పారు. తెలంగాణ డేటా రిచ్ స్టేట్ అని, ఆరోగ్యశ్రీ ద్వారా సేకరించిన సమాచారాన్ని విశ్లేషిస్తే ఏ ప్రాంతంలో ఎలాంటి ఆరోగ్య సమస్యలు ఉన్నాయో తెలుసుకోవచ్చని వివరించారు.
✅ఫ్లోరైడ్ సమస్యతో పాటు #Musi కాలుష్యం నల్గొండ జిల్లా ప్రజల ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపుతోందని సీఎం ఆందోళన వ్యక్తం చేశారు. మూసీని ప్రక్షాళన చేయాల్సిన అవసరం ఉందని, నల్గొండ ప్రజల ఆరోగ్యాన్ని కాపాడాలంటే మూసీ శుద్ధి తప్పనిసరని స్పష్టం చేశారు.
✅ఈ కార్యక్రమంలో పీహెచ్ఎఫ్ఐ చాన్సలర్ డాక్టర్ కె. శ్రీనాధ్ రెడ్డి గారు, ప్రో-చాన్సెలర్ ప్రొ. సంజయ్ జోడ్పే గారు, అఫీషియేటింగ్ వీసీ డాక్టర్ ఎం. విష్ణువర్ధన్ రావు గారు, పారిశ్రామిక వేత్త శ్రీని రాజు గారు, పీహెచ్ఎఫ్ఐ చైర్మన్ రజత్ గుప్తా గారు, బోర్డు మెంబర్ మధుమోహన్ గారితో పాటు పలువురు వైద్యనిపుణులు, పారిశ్రామిక వేత్తలు పాల్గొన్నారు.
@thePHFI
#TelanganaRising #InvestInTelangana #PublicHealth
దేశ తొలి ప్రధానమంత్రి, ఆధునిక భారత నిర్మాత పండిట్ జవహర్లాల్ నెహ్రూ గారి జయంతి సందర్భంగా ముఖ్యమంత్రి శ్రీ ఎ. రేవంత్ రెడ్డి గారు ఆ మహానేతకు ఘనంగా నివాళులర్పించారు. నెహ్రూ జయంతి రోజున జరుపుకునే ‘బాలల దినోత్సవం’ సందర్భంగా ముఖ్యమంత్రి గారు బాలలందరికీ హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు.
❇️విద్య, విజ్ఞాన, శాస్త్ర సాంకేతిక రంగాల అభివృద్ధికి ఆయన వేసిన పునాదులు భారత ప్రగతికి బాటలు వేశాయని అన్నారు. నెహ్రూ గారి ఆశయాలను ఆదర్శంగా తీసుకొని సమానత్వం, లౌకికవాదం, ప్రజాస్వామ్య స్ఫూర్తితో దేశ అభివృద్ధి కోసం ముందుకు సాగాలని కోరారు.
❇️ప్రతి చిన్నారిలోనూ అపారమైన ప్రతిభ, సృజనాత్మకత, నూతన ఆలోచనలు దాగి ఉంటాయని నెహ్రూ గారు విశ్వసించేవారని గుర్తుచేశారు. బాలల హక్కులను పరిరక్షిస్తూ, వారి ప్రతిభను ప్రోత్సహిస్తూ, భయంలేని బాల్యాన్ని అందించి, వివక్షకు తావులేని సమాజాన్ని నిర్మించాలని అన్నారు. విలువలతో కూడిన విద్యను అందించినప్పుడే నెహ్రూ గారి ఆశయాలకు నిజమైన నివాళి అని ముఖ్యమంత్రి గారు పేర్కొన్నారు.
#JawaharlalNehru #ChildrensDay #CMRevanthReddy
LIVE: Hon'ble Chief Minister Sri A. Revanth Reddy Along with Hon'ble LoP Lok Sabha Sri Rahul Gandhi Participates in Bike Rally with Telangana Gig Workers from Shilparamam to Jayabheri Ground, Madhapur, Hyderabad https://t.co/yAZyMtbvuE
LIVE: Hon'ble Chief Minister Sri A. Revanth Reddy along with Hon'ble Leader of Opposition in the Lok Sabha Sri Rahul Gandhi Participates in the Launch of Telangana Gig Workers Social Security and Welfare Scheme at Jayabheri Ground, Hitech City, Madhapur, Hyderabad
https://t.co/xKZCnKY2fA
తెలంగాణ రాష్ట్రంలో గిగ్, ప్లాట్‌ఫామ్ వర్కర్ల సామాజిక భద్రత, సంక్షేమ విధానాన్ని ముఖ్యమంత్రి శ్రీ ఎ. రేవంత్ రెడ్డి గారు లోక్‌సభ ప్రతిపక్ష నాయకుడు శ్రీ రాహుల్ గాంధీ గారితో కలిసి ఆవిష్కరించారు. గిగ్, ప్లాట్‌ఫామ్ వర్కర్ల నమోదుకు ఆన్లైన్ విధాన్ని ప్రారంభించారు.
✅దేశ తొలి ప్రధానమంత్రి పండిత్ జవహర్లాల్ నెహ్రూ జయంతి సందర్భంగా హైదరాబాద్ హైటెక్ సిటీ సమీపంలోని జయభేరీ గ్రౌండ్స్‌లో ఏర్పాటు చేసిన సభా వేదిక నుంచి గిగ్, ప్లాట్‌ఫామ్ వర్కర్ల సంక్షేమానికి సంబంధించిన చట్టాన్ని అంకితం చేశారు.
✅తెలంగాణ ప్లాట్‌ఫామ్ బేస్డ్ #GigWorkers నిబంధనలపై రూపొందించిన పుస్తకాన్ని ఆవిష్కరించారు. కార్యక్రమం ప్రారంభంలో దేశ తొలి ప్రధానమంత్రి జవహర్లాల్ నెహ్రూ గారి జయంతిని పురస్కరించుకుని ఆ మహనీయుని చిత్రపటానికి పుష్పాంజలి ఘటించారు.
✅అంతకుముందు శిల్పారామం నుంచి జయభేరీ గ్రౌండ్స్ వరకు చేపట్టిన భారీ బైక్ ర్యాలీలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, లోక్‌సభ విపక్ష నేత @RahulGandhi గారితో కలిసి పాల్గొన్నారు. ప్లాట్‌ఫామ్ కార్యకర్తల బైకులపై రేవంత్ రెడ్డి గారు, రాహుల్ గాంధీ గారు, పలువురు మంత్రులు, గిగ్ వర్కర్లతో కలిసి బైక్ ర్యాలీగా జయభేరీ గ్రౌండ్స్‌కు చేరుకున్నారు.
✅ఈ సందర్భంగా ముఖ్యమంత్రి గారు మాట్లాడుతూ, ఇచ్చిన మాట ప్రకారం నెహ్రూ గారి జన్మదినం రోజున గిగ్, ప్లాట్‌ఫామ్ వర్కర్స్ చట్టాన్ని ప్రజలకు అంకితం చేశామని చెప్పారు. ఈ చట్టం నేటి నుంచి అమలులోకి వస్తుందన్నారు.
✅ఈ చట్టం వల్ల ప్రతి గిగ్ వర్కర్‌కు రూ. 5 లక్షల జీవిత బీమా సౌకర్యం లభిస్తుందని, ఆరోగ్య భద్రత కోసం రాజీవ్ ఆరోగ్యశ్రీ ద్వారా రూ. 10 లక్షల అందజేస్తున్నట్టు తెలిపారు. గిగ్ వర్కర్ల సంక్షేమం కోసం ప్రత్యేకంగా బోర్డు ఏర్పాటు చేయడమే కాకుండా వర్కర్లకు ప్రత్యేకంగా గుర్తింపు కార్డు లభిస్తుందని చెప్పారు.
✅గిగ్, ప్లాట్‌ఫామ్ వర్కర్స్ కోసం చట్టం రూపొందించడానికి ఐఐటీ లాంటి సంస్థలతో పాటు సామాజిక కార్యకర్త @nikhilmkss గారు ఏమీ ఆశించకుండా ఎంతో సహకారం అందించారని చెప్పారు. గిగ్ వర్కర్ల నాయకులు, నిపుణులతో అనేక సంప్రదింపులు జరిపిన తర్వాత ఈ చట్టం రూపొందించామని తెలిపారు.
✅గిగ్ వర్కర్ల సంక్షేమం కోసం తెలంగాణ ప్రభుత్వం అన్ని విధాలుగా సహకరిస్తుందని ముఖ్యమంత్రి గారు భరోసా ఇచ్చారు. విధుల్లో ఉండగా ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన ఇద్దరు గిగ్ కార్మికుల కుటుంబాలకు రూ. 5 లక్షల చొప్పున సహాయాన్ని అందించారు.
✅ఈ కార్యక్రమంలో ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క గారు, మంత్రులు దామోదర రాజనర్సింహ గారు, కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి గారు, పొన్నం ప్రభాకర్ గారు, పొంగులేటి శ్రీనివాస రెడ్డి గారు, వివేక్ వెంకటస్వామి గారు, పలువురు ఎంపీలు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, అధికారులు, గిగ్ అండ్ ప్లాట్‌ఫామ్ వర్కర్లు పాల్గొన్నారు.
#TelanganaGigWorkersPolicy #GigWorkersWelfare #Telangana
LIVE: Hon'ble Chief Minister Sri A. Revanth Reddy Participates in the Foundation Laying Ceremony of the PHFI Institute of Public Health Sciences Campus in Hyderabad
https://t.co/xm7IpEnBep
ప్రజల ఆకాంక్షలను నెరవేర్చడానికి ప్రపంచ వ్యాప్తంగా ప్రజాస్వామిక వాదులంతా ఏకమై కలిసికట్టుగా పోరాటం చేయాలని ముఖ్యమంత్రి శ్రీ @revanth_anumula గారు పిలుపునిచ్చారు. ప్రపంచవ్యాప్తంగా చాలా దేశాల్లో ప్రజల్లో వ్యక్తమవుతున్న కలలు, ఆకాంక్షలను అర్థం చేసుకుని, వాటిని నెరవేర్చడానికి మనమంతా చేతులు కలపాలని ప్రజాస్వామ్యవాదులను కోరారు.
✅#Hyderabad హెచ్ఐసీసీలో రెండు రోజుల పాటు జరిగిన #BharatSummit2026 ముగింపు సమావేశంలో ముఖ్యమంత్రి గారు Delivering Global Justice అన్న అంశంపై ప్రసంగించారు.
✅జాతీయ, అంతర్జాతీయ ప్రతినిధులు పాల్గొన్న ఈ సదస్సులో ముఖ్యమంత్రి గారు మాట్లాడుతూ, ప్రపంచవ్యాప్తంగా ఒకే ఆలోచనా ధోరణి కలిగిన ప్రతినిధులు, ప్రభావశీలురు ఒకచోట చేర్చడానికి భారత్ సమ్మిట్ గొప్ప వేదికగా నిలుస్తోందని అన్నారు.
✅“ప్రస్తుతం ప్రపంచంలో ప్రధానంగా రెండు శక్తుల మధ్య పోరాటం సాగుతోంది. ఒక శక్తి ప్రజాస్వామ్య పరిరక్షణ కోరుకుంటే మరో శక్తి ప్రజాస్వామ్యాన్ని ధ్వంసం చేయాలని చూస్తోంది. రాజ్యాంగం, చట్టబద్ధ పాలనకు కట్టుబడి మనముంటే, రాజ్యాంగాన్ని విధ్వంసం చేసి నియంతృత్వాన్ని రుద్దాలని ఆ శక్తులు ప్రయత్నిస్తున్నాయి.
✅ప్రతి పౌరుడికి ఓటుహక్కు ఉండాలని కోరుకుంటే, నియంతృత్వ శక్తులు తమకు నచ్చిన కొన్ని వర్గాలకే ఆ హక్కు కల్పించాలని భావిస్తున్నాయి. మనమంతా పర్యావరణ పరిరక్షణ కోరుకుంటే, ఆ శక్తులు పర్యావరణ వినాశనాన్ని కోరుకుంటున్నాయి.
✅పేదలు, మహిళలు, మైనారిటీలు, రైతులతో సహా ప్రతి ఒక్కరినీ రక్షించాలని మనమంతా భావిస్తుంటే, వాళ్లు మిలియనీర్ మిత్రులను కాపాడుకోవాలన్న తాపత్రయాన్ని ప్రదర్శిస్తున్నారు. అందరికీ సమాన అవకాశాలు కాకుండా అధికారం కొందరి చేతుల్లోనే కేంద్రీకృతం కావాలని ఆశిస్తున్నారు.
✅ఏక పార్టీ, ఏకవ్యక్తి పాలనకు వ్యతిరేకంగా మనమంతా చర్చలు, సంప్రదింపుల పట్ల విశ్వాసంతో పనిచేస్తున్నాం. ఈ పోరాటంలో మనల్ని నిరంతరం నిరోధించాలని భావిస్తున్నారు. మనమంతా ఒక గొప్ప లక్ష్యం కోసం పోరాడుతున్నందున ప్రపంచంలో ఏ శక్తీ మనల్ని నిలువరించలేదు.
✅ప్రపంచీకరణ ప్రభావాలు, కోవిడ్ మహమ్మారి అనంతర పరిణామాల్లో ప్రపంచవ్యాప్తంగా అన్ని దేశాలు దాదాపు ఒకే రకమైన సమస్యలను ఎదుర్కొంటున్నాయి. వ్యక్తుల ప్రాథమిక హక్కులపై దాడులు, విద్య, ఉపాధి, వైద్య సేవలు, ద్రవ్యోల్బణం వంటి సమస్యలతో సతమతమవుతున్నాయి.
✅ప్రపంచంలోని చాలా దేశాల్లో ప్రజల కలలు, ఆకాంక్షలు దాదాపు ఒకే విధంగా ఉన్నాయి. లక్షలాది మంది ప్రజలు తమ ఆకాంక్షలను అర్థం చేసుకోవాలని, వారి సమస్యలను వినాలని, వారి కలలను సాకారం చేయాలని ఆశాభావంతో ఉన్నారు.
✅ఈ పరిస్థితుల్లో మనపై ఎంతో బాధ్యత ఉంది. అందరం కలిసికట్టుగా పోరాడితే విజయం సాధిస్తాం. సంపన్నుల కోసం పనిచేయడం మానుకోవాలి. ప్రభుత్వాలు సామాన్య ప్రజల కోసం పనిచేయాలి” అని ముఖ్యమంత్రి గారు ఉద్ఘాటించారు.
✅“ఈ సదస్సుకు 70 దేశాల నుంచి వెయ్యి మంది ప్రతినిధులను ఆహ్వానించాం. కేంద్ర ప్రభుత్వం కొందరికి వీసాలను నిరాకరించింది. అయినప్పటికీ, ప్రపంచవ్యాప్తంగా ఉన్న వారంతా ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్నారని విశ్వసిస్తున్నాం.
✅భారతదేశ తొలి ప్రధానమంత్రి పండిట్ జవహర్లాల్ నెహ్రూ జయంతి రోజున ఈ సమ్మిట్ నిర్వహించుకోవడం ఎంతో ప్రత్యేకత ఏర్పడింది. దేశంలో రాజ్యాంగబద్ధ ప్రజాస్వామిక వ్యవస్థ బలోపేతం కావడానికి నెహ్రూ దార్శనికత ఎంతో దోహదపడింది” అని వివరించారు.
#BharatSummit #Telangana #GlobalJustice
LIVE: Hon'ble Chief Minister Sri A. Revanth Reddy along with Hon'ble Leader of Opposition in Lok Sabha Sri Rahul Gandhi Participates in Valedictory Session of BHARAT SUMMIT 2026 at HICC, Madhapur, Hyderabad https://t.co/zMF1Kblqx6
Hon'ble Chief Minister Sri A. Revanth Reddy along with Hon’ble LoP Lok Sabha Sri Rahul Gandhi will Participate in *Bike Rally with Telangana Gig Workers from shilparamam to Jayabheri Ground, Hyderabad* today https://t.co/4TVNuEvZOI will be available from 10:30 AM Onwards.
*I&PR Dept,Telangana*
*YouTube Live Link* 🔗
https://t.co/REstsqJyB2
Hon'ble Chief Minister Sri A. Revanth Reddy along with Hon’ble LoP Lok Sabha Sri Rahul Gandhi will Participate in *Launch of the Telangana Gig Workers Social Security and Welfare Scheme at Hitech City, Hyderabad* today https://t.co/4TVNuEvZOI will be available from 11:00 AM Onwards.
*I&PR Dept,Telangana*
*YouTube Live Link* 🔗
https://t.co/XCAloTCfM0