#OperationSindoor
With pride, I salute the brave warriors of the Indian Armed Forces for swiftly avenging the Pahalgam terror attack. With their unmatched bravery and precision, they have again demonstrated that our nation will defend itself with iron will. Today, under the leadership of Hon'ble Prime Minister Shri @narendramodi Ji, the world has witnessed our strength and determination. Our country stands united against terror and firmly in support of our Armed Forces. Jai Hind! 🇮🇳@adgpi
Shocked to hear about the fire accident at a school in Singapore in which @PawanKalyan Anna's son, Mark Shankar, sustained injuries. Wishing him a speedy and full recovery. Strength and prayers to the family during this tough time.
జమ్మూ కాశ్మీర్లో ఉగ్రవాదుల కాల్పుల్లో జవాన్లు మృతి చెందడం తీవ్ర విషాదం నింపింది. దేశ రక్షణ కోసం ప్రాణాలర్పించిన సైనికులు డొక్కరి రాజేష్, సనపల జగదీశ్వర రావులకు అశ్రు నివాళులు అర్పిస్తున్నాను. అమర జవాన్ల కుటుంబాలకు రాష్ట్ర ప్రభుత్వం అండగా ఉంటుంది. వారి కుటుంబ సభ్యులకు మా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాం.
రామోజీ గ్రూపు సంస్థల అధినేత రామోజీరావు గారి మృతి తెలుగు సమాజానికి తీరని లోటు. ప్రజా పక్షపాతి, అలుపెరుగని అక్షర యోధుడికి కన్నీటి నివాళులు అర్పిస్తున్నాను. జనహితమే తన అభిమతంగా జీవితాంతం నిబద్ధతతో పనిచేసిన రామోజీరావు గారు మనకు మార్గదర్శి. ప్రజాస్వామ్య పరిరక్షణకు రామోజీరావు ఉద్యమస్ఫూర్తితో పని చేశారు.
ఈనాడు గ్రూపు సంస్థల చైర్మన్ శ్రీ రామోజీరావు అస్తమయం తీవ్ర దిగ్భ్రాంతిని కలిగించింది. ఒక సామాన్య కుటుంబంలో పుట్టి అసామాన్య విజయాలు సాధించిన శ్రీ రామోజీరావు మరణం తీవ్ర ఆవేదనకు గురి చేసింది. అక్షర యోధుడుగా శ్రీ రామోజీ తెలుగు రాష్ట్రాలకు, దేశానికి ఎన్నో సేవలు అందించారు. తెలుగు వారి జీవితాల్లో అత్యంత ప్రభావవంతమైన ముద్రవేసిన శ్రీ రామోజీ తెలుగు ప్రజల ఆస్తి. ఆయన మరణం తెలుగు ప్రజలకే కాదు....దేశానికి కూడా తీరని లోటు. సమాజ హితం కోసం అనుక్షణం పనిచేసిన ఆయన కీర్తి అజరామరం. ఈనాడు గ్రూపు సంస్థల స్థాపనతో వేల మందికి ఉపాధి కల్పించారు. మీడియా రంగంలో శ్రీ రామోజీ గారిది ప్రత్యేకమైన శకం. ఎన్నో సవాళ్లను, సమస్యలను అధిగమించి...ఎక్కడా తలవంచకుండా శ్రీ రామోజీరావు విలువలతో సంస్థలను నడిపిన విధానం ప్రతి ఒక్కరికీ ఆదర్శనీయం. దశాబ్దాల తన ప్రయాణంలో అనుక్షణం ప్రజల మంచి కోసం, సమాజ హితం కోసం శ్రీ రామోజీరావు పనిచేశారు. మీడియా రంగంలో ఆయనొక శిఖరం, ఆయన ఇక లేరు అనే విషయాన్ని జీర్ణించుకోలేకపోతున్నాము.
శ్రీరామోజీరావుతో నాకు 4 దశాబ్దాల అనుబంధం ఉంది. మంచిని మంచి, చెడును చెడు అని చెప్పే ఆయన తీరు... నన్ను ఆయనకు దగ్గర చేసింది. సమస్యలపై పోరాటంలో ఆయన నాకు ఒక స్ఫూర్తి. ప్రజలకు మంచి పాలసీలు అందించే విషయంలో శ్రీరామోజీ సూచనలు, సలహాలు ఎప్పుడూ ఉన్నతంగా ఉండేవి. శ్రీ రామోజీ అస్తమయంపై వారి కుటుంబ సభ్యులకు, ఈనాడు గ్రూపు సంస్థల సిబ్బందికి ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాను. రామోజీరావు గారి ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తున్నాను.
Congratulations to @isroindiaofficial on the successful landing of Chandrayaan on the Moon's South Pole and becoming the only space organization to achieve this feat 🇮🇳 🫡