Official Twitter handle of the SHO, Jagdevpur Police Station, Siddipet Police Commissionerate, Telanagana State Police.
Emergency please contact Dial 100.
🌱 *వన మహోత్సవం-2026 సందర్భంగా జగదేవపూర్ పోలీస్ స్టేషన్ ఆవరణలో మొక్కలు నాటి పర్యావరణ పరిరక్షణకు మా వంతు కృషి. "ఒక్క మొక్క నేడు... హరిత భవిష్యత్తు రేపు."#siddipetpolice
నిన్న రాత్రి, హాస్టల్లో ఉండి చదువు కోవడం ఇష్టం లేక పారిపోవాలని చూసిన, వట్టిపల్లి గ్రామానికి చెందిన గుగులోత్ రితిక ను పెట్రోలింగ్ చేస్తున్న జగదేపూర్ పోలీస్ సిబ్బంది గుర్తించి తన తల్లిదండ్రులకు అప్పగించడం జరిగింది.
ఈ రోజు (02-06-2026) తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకుని జగదేవ్పూర్ పోలీస్ స్టేషన్ ఆవరణలో జాతీయ పతాకావిష్కరణ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించడం జరిగింది.
జగదేవ్పూర్ పోలీస్ స్టేషన్లో విధులు నిర్వహిస్తూ ASI హోదా నుండి SIగా పదోన్నతి పొందిన శ్రీ BVR రెడ్డి గారికి గజ్వేల్ పోలీస్ స్టేషన్కు పోస్టింగ్ రావడంతో, ఈ రోజు జగదేవ్పూర్ పోలీస్ స్టేషన్ నుండి ఘనంగా వీడ్కోలు పలికారు.#siddipetpolice
తేదీ: 15-05-2026
సిద్దిపేట సురక్ష నేత్ర కార్యక్రమంలో భాగంగా జగదేవ్పూర్ ,కొత్తపేట గ్రామాలలో నూతన సీసీ కెమెరాలను ప్రారంభించిన సీఐ శ్రీ రవి రాజు గారు .
ఈ కార్యక్రమంలో సీఐ గారితో పాటు కొత్త పేట గ్రామ పోలీసు అధికారి జి రమేష్ పాల్గొన్నారు
సిద్దిపేట పోలీసుల ఆధ్వర్యంలో రేపు తేదీ 25-04-2026 నాడు నిర్వహించబడే ఉద్యోగ మేళాలో, మీ అర్హతలకు తగిన ఉద్యోగ అవకాశాలు కలవు.కావున అభ్యర్థులు మీ రెస్యూమ్తో కలిసి రేపు ఉదయం 9:00 గంటలకు సిద్దిపేట పోలీస్ కన్వెన్షన్ సెంటర్ ( హిందూర్ కాలేజీ ) వద్ద హాజరుకావలసిందిగా తెలియజేయడమైనది.
ఈరోజు గౌరవనీయ సిద్దిపేట సిపి సాధన రష్మీ పెరుమల్ మేడం గారు ప్రారంభించిన సిద్దిపేట సురక్ష నేత్ర ప్రోగ్రాం లో భాగంగా జగదేవపూర్ పోలీస్ స్టేషన్ పరిధి లోని కొండ పోచమ్మ గ్రామంలో సర్కిల్ ఇన్స్పెక్టర్ శ్రీ డి. రవి రాజు సార్ గారి చేతుల మీదుగా, ఐదు నూతన సీసీ కెమెరాలు ప్రారంభించడం జరిగింది.
ఈరోజు గౌరవనీయ సిద్దిపేట సిపి సాధన రష్మీ పెరుమల్ మేడం గారు ప్రారంభించిన సిద్దిపేట సురక్ష నేత్ర ప్రోగ్రాం లో భాగంగా జగదేవపూర్ పోలీస్ స్టేషన్ పరిధి లోని కొండ పోచమ్మ గ్రామంలో సర్కిల్ ఇన్స్పెక్టర్ శ్రీ డి. రవి రాజు సార్ గారి చేతుల మీదుగా, ఐదు నూతన సీసీ కెమెరాలు ప్రారంభించడం జరిగింది.
సిద్దిపేట పోలీస్ ఉద్యోగమిత్ర! 📢
సిద్దిపేట పోలీస్ ఆధ్వర్యంలో భారీ 'మెగా జాబ్ మేళా'.
✅ 50+ ప్రముఖ కంపెనీలు
✅ ఏప్రిల్ నెలలో నిర్వహణ
వెంటనే రిజిస్ట్రేషన్ చేసుకోండి: 👇
🔗 https://t.co/rzJmv4n7Ca
#Siddipet#JobMela#Employment#PoliceUdyogaMitra
ఈరోజు నిర్మల్ నగర్ గ్రామంలో ఆరు కొత్త సీసీటీవీ కెమెరాలను ప్రారంభించడం జరిగినది. ఇట్టి కెమెరాలు పెట్టుటకు కృషిచేసిన సర్పంచ్ పద్మారావు గారు, ఉప సర్పంచ్ యాదగిరి గారు మరియు వార్డు మెంబర్లు, కీలక పాత్ర వహించిన బెంజిమెన్ గారిని సత్కరించడం జరిగింది.
మండలం పరిధిలో సమస్యాత్మక ప్రాంతాలుగా గుర్తించబడిన జగదేవ్పూర్, తీగుల్ గ్రామాల్లో సాయుధ బలగాలతో కవాతు నిర్వహించిన జగదేవ్పూర్ పోలీసులు. ఇట్టి కవాతులో గజ్వేల్ ఏసిపి నరసింహులు గారు రూరల్ సీఐ మహేందర్ రెడ్డి , ఎస్సై కృష్ణారెడ్డి, జగదేవ్పూర్ పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.@siddipetcp
పంచాయతీ ఎలక్షన్ల దృష్ట్యా గజ్వేల్ ఏసిపి నరసింహులు గారు గజ్వేలూరు రూరల్ సీఐ మహేందర్ రెడ్డి గారు పోలీస్ స్టేషన్ పరిధిలో గల ట్రబుల్ మాంగర్స్, సస్పెక్ట్స్ కు కౌన్సిలింగ్ నిర్వహించడం జరిగింది.@siddipetcp
రాయవరం, ఎల్లయ్య గూడ గ్రామాలు రెవెన్యూ, పంచాయతీ పరిధి కుకునూరుపల్లి మండలంలోకి వస్తాయి. కావున ఆ గ్రామాల్లో సందర్శించిన ఏసిపి గారు వారి యొక్క గ్రామాలను కుకునూరుపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో కలుపుటకు వారి యొక్క అభిప్రాయాలను తెలుసుకోవడం జరిగింది.@cpsiddipet@siddipetcp
నవంబర్ 15తేదీన స్పెషల్ లోక్ అదాలత్ గురించి - కమిషనరేట్ పరిధిలో పెండింగ్ లో ఉన్న 2230 కాంపౌండబుల్ కేసుల్లో రాజీ పడవచ్చు. పోలీస్ అధికారులు ప్రతి పోలీస్ స్టేషన్లో రాజీ పడ దగిన కేసులను గుర్తించి ఇరువర్గాల వారిని పిలిపించి కౌన్సిలింగ్ నిర్వహించి రాజీ పడేటట్లు అవగాహన కల్పిస్తున్నారు
సోషల్ మీడియా స్నేహితులతో జాగ్రత్తగా ఉండండి. తెలియని వారి మాటలను నమ్మి పెట్టుబడులు అస్సలు పెట్టొద్దు. ఎవరినీ నమ్మి మీ ఫోటోలు, వీడియోలను పంపించొద్దు. తియ్యని మాటల వెనుక మోసం ఉండొచ్చు. ఆన్లైన్ స్నేహాలకు పరిమితులు విధించుకోవడం మంచిది.@siddipetcp