జల్ జంగల్ జమీన్ పై ఆదివాసులకు హక్కులు కల్పించడం కోసం అలుపెరుగని పోరాటం చేసి అమరుడైన ఆదివాసి యోధుడు కుమురం భీం కు నిండు హృదయంతో జోహార్లు తెలుపుతున్న. ఆయన స్పూర్తితో ఇప్పుడున్న నయా పెత్తందార్లపై ఓటుతో యుద్దం చేసి మన హక్కులను సాధించుకుందామని పిలుపునిస్తున్న. “మావా నాటే మావా రాజ్.”
#VR99
#KumramBheem
తాను ఇంజనీర్ కాకపోయినా కమిషన్ల కోసం
కెసిఆర్ సర్వే చేసి,
కెసిఆర్ ప్లానింగ్ చేసి,
కెసిఆర్ డిజైన్ చేసి,
కెసిఆర్ కట్టి
కెసిఆర్ ప్రారంభం చేసి
ప్రపంచంలోనే అతిపెద్ద ఎత్తిపోతల పథకమని కేసిఆర్ చేతనే ప్రకటించబడిన కాలేశ్వరం ప్రాజెక్టు దుస్థితి ఇది.
ఈ రోజు మళ్లీ ఇదే కేసీఆర్ గెలవాలని ప్రతి ఎమ్మెల్యే అభ్యర్థికి ₹50 కోట్ల పార్టీ ఫండ్ ఇస్తున్న డబ్బు, దేశంలో బీఆరెస్ కార్యకలాపాలకు ఖర్చు పెడుతున్న డబ్బు, కేసీఆర్ కొన్న విమానం అన్నీ కాళేశ్వరం నుండి వచ్చినవే…!
అందుకే అర్జంటుగా కేసీఆర్, హరీష్ రావు, నాటి ఛీఫ్ ఇంజనీర్లు, కాంట్రాక్టర్లు వీళ్ల పై అర్జంటుగా దేశద్రోహం కేసు నమోదు చేసి జైళ్లో వేసి, వీళ్ల అక్రమ ఆస్తులను తెలంగాణ పరం చేయాలి.
ఇది కేవలం #BSP తోనే సాధ్యం.
#KCRlootedTelangana
Bahujan Bharosa, the road map for inclusive and futuristic Telangana.
తెలంగాణ ప్రజలే ఈ మేనిఫెస్టో నిర్మాతలు. ఈ క్రెడిట్ వాళ్లకే ఇస్తున్నాం. Please scan the QR Code to dive deeper into how we are going to liberate and build a new and futuristic Telangana. #BSP4Future
పధకాల కొరకు ఎదురు చూసే బాధ లేకుండ విద్య,వైద్యం మరియు ఉద్యోగ కల్పనే ప్రధాన ఎజెండాగా దార్శనిక దృష్టికి సాక్షమే బహుజన భరోసా. పాలనలో భాగస్వామ్యం సాధించి కొందరి గుప్పిళ్లలో ఉన్న తెలంగాణను విడిపించి, అందరి తెలంగాణను నిర్మించుకుందాం.
అందరి తెలంగాణకు మన ఏనుగు గుర్తుని గెలిపించుకుందాం.✊
బహుజన భరోసా 2023 : https://t.co/fcF8xHAPS5
సిర్పూర్ నియోజకవర్గం, దాహేగం మండలం, గెర్రె గ్రామంలో తన భార్య చనిపోగా తనని పరామర్శిండానికి వచ్చిన బిఎస్పి రాష్ట్ర అధ్యక్షులు సిర్పూర్ నియోజకవర్గం ఎమ్మెల్యే అభ్యర్థి @RSPraveenSwaero గారితో
ఒక వ్యక్తి.
బెల్లంపల్లి ఏఎస్పిగా డా.ఆర్ఎస్పి గారు చేసిన సేవలను ఇంకా గుర్తు పెట్టుకుని ఆయనే డా.ఆర్ ఎస్ ప్రవీణ్ కుమార్ గారని తెలియక ఆయన ముందే ఆయన చేసిన మేలును తలచుకున్నా వ్యక్తి.
ఒక అధికారిగానే ఇలాంటి సహాయాలు ఆయన జీవితంలో కోట్లలో ఉన్నాయి.
#VR99
#ElephantThisTime
#pravallika Applied for all the Groups exams Group 1,2,3,4 and DAO also. అమ్మాయి ఆత్మహత్య చేసుకోగానే ఆమె ఫోన్ ఛాట్స్ లోకి వెళ్లి, ఆమె ఓ అబ్బాయితో టిఫిన్ చేస్తూ కనిపించిందని సీసీ ఫుటేజీ బయటకు తీసిన తెలంగాణ పోలీసులు DCP వెంకటేశ్వరరావు గారు, బెడ్ కింద లవ్ సింబల్స్ ఉన్న లెటర్ దొరికిందని నిస్సిగ్గుగా బయటకు చెప్పారు. ఆమె ఛాటింగుల కోసం వెతికిన మీరు ఆమె చదివి అలసిపోయిన పుస్తకాల్లో వెతికితే తెలిసేది ఎన్ని పరీక్షలకు అప్లై చేసిందో. ఇప్పటికైనా విక్టిమ్ బ్లేమింగ్ ఆపండి. నిరుద్యోగుల జీవితాలతో చెలగాటం ఆపండి.
77 సం.లు తెలుగు రాష్ట్రాలను ఆధిపత్య కులాల కాంగ్రేసు, తెలుగుదేశం, వైసీపీ, తెరాసలే పరిపాలించినవి. వీళ్లకు అమాయకంగా ఓట్లేసిన ప్రజలు అందరూ బహుజనులే(SC/ST/BC/Minorities). కానీ తెలుగు గడ్డ పై టాప్-20 కుబేరుల లిస్టు ఒకసారి చూడండి. అందరూ రెడ్డి-రాజు-కమ్మ-వెలమ కులాలకు చెందిన ధనికులే. టాప్ 100 చూసినా వాళ్లే ఉంటరు!
మరి ఈ దొరల పాలనలో 99% మనమెక్కడున్నం?
వీళ్ల రూ.500/- రాయితీ, బతుకమ్మ చీరల స్కీంల వద్ద లబ్దిదారులుగా ఉన్నం, అక్రమ కేసుల్లో నిందితులమైనం, స్టేషన్లలో రౌడీ షీటర్లమైనం, జైళ్లలో ఖైధీలమైనం, వీళ్ల కంపెనీల్లో కూలీలమైనం…!
అసలు ఈ కుబేరులకున్నదేంటి? మనకు లేనిది ఏంది??? రోజు రాత్రింబవళ్లు చెమటోడుస్తున్నా మనకు లక్ష్మీ కటాక్షం లేదు! కానీ ఈ దొరలు మనమిచ్చిన అధికారాన్ని అడ్డు పెట్టుకొని తరతరాలు తిన్న తరగని ఆస్తిని సంపాయించుకున్నరు.
అందుకే ఈ అపర కుబేరుల జాబితాల్లో మన బహుజన బిడ్డలుండాలంటే #BSP కి ఒక్క సారి అవకాశమివ్వండి. నేను చేసి చూపిస్తా👊 I have a plan. Pl give us a chance.
Remembering Dadasaheb Manyavar #Kanshiram, the founder of Bahujan Samaj Party today. Under the able leadership of hon’ble #Behenji@Mayawati WE will continue to fight for social justice with renewed vigour in this country.
తెలంగాణ హోం మంత్రి మహ్మూద్ అలీ డ్యూటీలో ఉన్న కానిస్టేబుల్ (PSO/Gunman) ను అందరి ముందు చెంప పై కొట్టడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాను.
Police vaale kya aap ka bangle ka kutte karke samajre, yaa ghar ki noukar samaj re aap log, HM Saab?
అర్జంటుగా ఆయన కాళ్లు పట్టుకొని క్షమాపణ అడుగు. @TelanganaDGP గారూ, అర్జంటుగా హోం మంత్రి మహమూద్ అలీ HM పై IPC 323, 353, 504 సెక్షన్ల కింద కేసు నమోదు చేయాలి. తలసాని శ్రీనివాస్ యాదవ్ ను Witness గా చేర్చాలి. లేకపోతే మీ HM ఆఫీసుకు రావాల్సుంటది👊
పోలీసన్నలారా, ఈ వీడియో చూసి నా రక్తం మరిగిపోతున్నది. మీ మనోభావాలను అర్థం చేసుకోగలను. మన పరిస్థితి ఇంత దిగజారిపోవడానికి కారకులెవరో ఒక్క సారి ఆలోచించండి🙏
#ArrestHomeMinisterMehmoodAli
#VR99
ఇదా అసలు సంగతి! ఇప్పుడు కేసీఆర్-బీఆరెస్ వెంట ఉన్నవాళ్లలో చాలా మందికి ఇదే భయం పెట్టిండ్రు గులాబీ బాసులు. గత నెల సూర్యపేటలో వట్టె జానయ్య యాదవ్, సిద్దిపేటలో చక్రధర్ గౌడు, తుంగతుర్తిలో యుగంధర్ పై దాడి…ఇంకా చాలా చోట్ల ఇలాంటి కుట్రలే @BRSparty పోలీసులతో కుమ్మక్కై చేస్తున్నరు!
భూమి కోసం.. భుక్తి కోసం...
వెట్టి చాకిరీ విముక్తి కోసం…
చిట్యాల (చాకలి) ఐలమ్మ చేసిన
వీరోచిత పోరాటం తెలంగాణలోని
ప్రతీ ఆడ బిడ్డకు స్ఫూర్తి.
తెలంగాణలో బహుజనుల తెగువను,పోరాట స్ఫూర్తిని ప్రపంచానికి చాటిన వీరనారి చాకలి ఐలమ్మ జయంతి సందర్భంగా వారికి ఘన నివాళులు అర్పిస్తున్నాము.
జానాభాలో 99% ఉన్న పేద వర్గాలము రాజకీయంగా ఒక్కటై "దొరల గడీల" పాలనను కూల్చి,బహుజన రాజ్యం నిర్మిస్తేనే
చాకలి ఐలమ్మ పోరాటం,త్యాగానికి అర్దం.
#VR99
#BlueTime
జనాభాలో 99% ఉన్న మనం ఆధిపత్య,దోపిడీ పార్టీలను ఇంకెన్నాళ్లు అసెంబ్లీ,పార్లమెంట్ "సీట్ల" కోసం అడుక్కుందాం?
కాంగ్రెస్ లో ఉన్న బీసీ నేతలారా!
దొరల "గడీ"ల పాలనను అంతమొందించేందుకు తిరుగుబాటు చేసిన సర్దార్ సర్వాయి పాపన్న,పండుగ సాయన్న, దొడ్డి కొమరయ్య, కొండా లక్ష్మణ్ బాపూజీ, మారోజు వీరన్న, వడ్డె ఓబన్న, చిట్యాల ఐలమ్మల పోరాట స్ఫూర్తిని అప్పుడే మరిచారా?
తెలంగాణ రాష్ట్రం కోసం ప్రాణాలు అర్పించిన శ్రీకాంతాచారి,కానిస్టేబుల్ కిష్టయ్య,సిరిపురం యాదయ్య త్యాగాల స్మృతిలో తెలంగాణలో "గడీల" పాలనను కూల్చి తెలంగాణలో బహుజన రాజ్యాన్ని స్థాపిద్దాం.
రండి! #BSP తో చేతులు కలపండి !!
ఏ ఆధిపత్య కుల పార్టీలను "సీట్ల" కోసం అడుక్కోకుండా,ఆత్మగౌరవంతో మన రాజ్యాన్ని మనమే స్థాపించుకుందాం.
#VR99
#LiberateTelangana
డా.బి.అర్.అంబేడ్కర్ గారు రాసిన "భారత రాజ్యాంగం" మన దేశంలో 2 వేల సంవత్సరాలకు పైగా ఉన్న ఒక అసమాన సామాజిక వ్యవస్థను ధ్వంసం చేస్తూ కుల, మత,ప్రాంతాలకు అతీతంగా ప్రజలందరినీ ఒక్కటి చేసి సామాజిక,రాజకీయ,ఆర్థిక విప్లవానికి నాంది పలికింది.
దేశ పౌరులందరీకీ రాజ్యాంగం కల్పించిన సమానత్వపు హక్కులు, భావ ప్రకటన స్వేచ్చ, విశ్వాసం,మతం, ప్రార్థనలు చేసుకునే స్వేచ్ఛ రాజ్యాంగ పీఠికలో లిఖితపూర్వకంగా పేర్కొనబడ్డాయి.
భారత రాజ్యాంగ పీఠికలో 'సోషలిస్టు’ (సామ్యవాద), ‘సెక్యులర్’ (లౌకికవాద) అనే పదాలను తొలగించడమంటే దేశం అనాగరిక వ్యవస్థలోని మతమౌఢ్యంలోకి వెళ్తున్నట్లే!
భారత రాజ్యాంగ స్ఫూర్తిని దెబ్బతియ్యడానికి మతతత్వ శక్తులు పన్నుతున్న కుట్రలను ప్రజాస్వామ్యబద్ధంగా తిప్పికొడదాం! రాజ్యాంగ పీఠికలో ఉన్న 'సోషలిస్టు', ‘సెక్యులర్’ పదాల తొలగింపును #BSP తీవ్రంగా ఖండిస్తుంది.
తెలంగాణ సాయుధ పోరాట యోధురాలు, వీరనారీమణి చాకలి (చిట్యాల) ఐలమ్మ వర్ధంతి నేడు.నాడు దొరల గడీల భూస్వామ్య పాలనకు వ్యతిరేకంగా తిరుగుబాటు చేసి భూమి కోసం,భుక్తి కోసం పోరాడిన ధీరవనిత.
ఐలమ్మ చేసిన పోరాటం, త్యాగం తెలంగాణలోని బహుజనుల ఆత్మగౌరవానికి ప్రతీక,మహిళా చైతన్యానికి,శక్తికి స్ఫూర్తిదాయకం.
ఆమె ప్రజాస్వామిక పోరాట స్ఫూర్తితో తెలంగాణలో వచ్చే ఎన్నికల్లో బహుజనులమంతా రాజకీయంగా ఏకమై దొరల గడీల పాలనను కూల్చి, బహుజన రాజ్యం నిర్మిద్దాం. ఇదే ఆమెకు ఘనమైన నివాళి.
#VR99
99% ఉన్న బహుజనులతో డీల్ కుదుర్చుకున్నారు@RSPraveenSwaero గారు ఎలాంటి డీల్ అంటే ఇన్నాళ్లు అధికారం లేక జండాలు మోస్తూ బానిసత్వoలో మరుగుతున్న బహుజనులకు #BSP ద్వారా ఆత్మగౌరవం ఇచ్చే డీల్,చదువు లేక మందు,మతంకి అడిక్ట్ అయినా పిల్లలకు ప్రపంచ యూనివర్సిటీ లో చదివించే డీల్.
#selfrespect#vr99