ప్రతి మగవాడు సైలెంట్ గా తన ఫ్యూచర్, ఫ్యామిలి హోప్స్ మోస్తూనే ఉంటాడు
ఈ బ్రదర్ ఎంత కరెక్ట్ గా చెప్పాడో 🙏
ఒరిజినల్ క్రియేటర్ 🙏 🙏 🙏
@HiHyderabad@ApnaSecbad
పలమనేరు క్యాంపు నుంచి పార్వతీపురానికి కుంకీ ఏనుగుల తరలింపు
• మార్గమధ్యంలో మంగళగిరి వద్ద స్వాగతం పలికిన ఉప ముఖ్యమంత్���ి శ్రీ @PawanKalyan గారు
• కుంకీలకు స్వయంగా ఆహారం అందించిన ఉప ముఖ్యమంత్రివర్యులు
• జెండా ఊపి గుచ్చిమి క్యాంపుకు సాగనంపిన శ్రీ పవన్ కళ్యాణ్ గారు
పార్వతీపురం మన్యం జిల్లాలో మానవ-ఏనుగు సంఘర్షణల నివారణ చర్యలను బలోపేతం చేసే దిశగా పలమనేరు ముసలమడుగు ఏనుగుల శిబిరం నుంచి గుచ్చిమి ఏనుగుల శిబిరానికి తరలిస్తున్న శిక్షణ పొందిన కుంకీ ఏనుగులు జయంత్, అభిమన్యులకు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రివర్యులు, అ��వీ, ప��్యావరణ శాఖల మంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారు మంగళగిరి క్యాంపు కార్యాలయం వద్ద స్వాగతం పలికారు. గజరాజులకు మార్గమధ్యంలో పూలు చల్లి స్వాగతం పలికిన ఉప ముఖ్యమంత్రివర్యులు, వాటికి స్వయంగా ఆహారం అందజేశారు. అనంతరం గుచ్చిమి శిబిరానికి బయలుదేరిన కుంకీల రెండో అంచె ప్రయాణాన్ని జెండా ఊపి సాగనంపారు.
ఈ సందర్భంగా ప్రయాణంలో కుంకీల భద్రతకు తీసుకోవాల్సిన చర్యలపై అటవీ శాఖ అధికారులకు శ్రీ పవన్ కళ్యాణ్ గారు దిశానిర్దేశం చేశారు. గుచ్చిమి క్యాంపునకు చేరిన అనంతరం నిపుణుల పర్యవేక్షణలో అక్కడి వాతావరణ పరిస్థితులకు అలవాటుపడేందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు. జయంత్, అభిమన్యుల సేవలు పార్వతీపురం పరిసర ప్రాంతాల్లో మానవ-ఏనుగు ఘర్షణల నియంత్రణకు ఎంతో ఉపయోగపడనున్నాయని ఈ సందర్భంగా శ్రీ పవన్ కళ్యాణ్ గారు తెలిపారు. ప్రజల భద్రత, రైతుల పంటల రక్షణ, వన్యప్రాణుల సంరక్షణ లక్ష���యాలను కూటమి ప్రభుత్వం శాస్త్రీయ, మానవీయ విధానాలతో చేపడుతున్న చర్యల్లో భాగంగా కుంకీలను తరలిస్తున్నామని అన్నారు.
- ఒడిశా వైపు నుంచి ఏనుగులు
ఒడిశా సరిహద్దు ప్రాంతాల నుంచి ఏనుగుల గుంపులు తరచూ పార్వతీపురం మన్యం జిల్లాలోకి ప్రవేశిస్తూ పంటలు, ఆస్తులకు నష్టం కలిగిస్తున్న నేపథ్యంలో, మానవ-ఏనుగు ఘర్షణల నివారణకు కూటమి ప్రభుత్వం చేపడుతున్న ప్రత్యేక చర్యల్లో భాగంగా ఈ కుంకీ ఏనుగులను గుచ్చిమి శిబిరానికి తరలిస్తున్నారు. మానవ-ఏనుగు ఘర్షణల నివారణ చర్యల్లో భాగంగా కుంకీ ఏనుగులైన జయంత్, అభిమన్యు���ను వినియోగిస్తారు.
గతంలో పలమనేరు, చిత్తూరు ప్రాంతాల్లో నిర్వహించిన పలు కీలక ఆపరేషన్లలో ఈ రెండు కుంకీ ఏనుగులు కీలక పాత్ర పోషించాయి. అడవి ఏనుగుల గుంపులను సురక్షితంగా అటవీ ప్రాంతాలకు మళ్లించడంలో ఎంతో చురుకుగా వ్యవహరించాయి.
భారత స్వాతంత్ర్యోద్యమ మూలకర్తల్లో ఒకరు, దేశవ్యాప్తంగా సామాన్యప్రజల్ని జాతీయోద్యమంలో పాల్గొనేలా చేసిన భారతజాతీయోద్యమ పిత శ్రీ బాలగంగాధర తిలక్ జయంతి సందర్భంగా జనసేన పార్టీ తరఫున ఘన నివాళులు.
#BalaGangadharThilak
"జనసేన పార్టీ నిర్మాణ సారథుల సమాచార సేకరణ కమిటీ" జనసేన పార్టీలో సేవ చేయాలనే ఔత్సాహికులకు నాయకత్వ దిశగా అవకాశాల కల్పనకు రూపొందించిన కీలక వేదిక.
పార్టీ వివిధ స్థాయిల్లో పనిచేయాలనుకునే వారి దరఖాస్తులు, వివరాలను పారదర్శకంగా సేకరించి పార్టీ అధ్యక్షులు శ్రీ @PawanKalyan గారి దృష్టికి తీసుకెళ్లడం ఈ కమిటీ ముఖ్య బాధ్యత.
#JSPForNewAgePolitics #JSPMembershipToLeadership
#PawanKalyanAneNenu
Leadership beyond Conventional Politics - An exclusive video !
• Getting Kumki Elephants from Karnataka
• Requesting Tigers from Maharashtra
• Seed balls for "HarithaAndhra"
• Great Green Wall of Andhra
• Farm Ponds, Cattle Troughs
• Swach Ratham
• Clearing Pending promotions in Panchayat Raj Department
• Palle Panduga & many more..
Ahead of the Parliament Monsoon Session, JanaSena Party President, Hon'ble Deputy Chief Minister Sri @PawanKalyan advised the party MPs to ensure that the spirit of “Nation First” is strongly reflected in parliamentary discussions.
He also urged them to make use of every opportunity to raise key issues and work towards securing the best possible outcomes for the state.
Had a productive and insightful discussion with Hon'ble Minister for Education, IT & Electronics, Shri @naralokesh Garu at my residence today on Andhra Pradesh's development priorities.
He shared the outcomes of his recent visit to South Korea, the encouraging response from global investors, and the concerted efforts underway to attract high-value investments, cutting-edge technologies, and quality employment opportunities to our State.
Shri Lokesh Garu also enquired about my health following my shoulder surgery and conveyed his warm wishes for my speedy recovery. I deeply appreciate his thoughtful gesture of bringing the sacred prasadam and the portrait of Goddess Kanaka Durgamaa from Vijayawada.
I sincerely thank him for his concern, and warm wishes. I wish him continued success in his efforts towards the progress and prosperity of Andhra Pradesh.
- @PawanKalyan@PIB_India@IPR_AP@pibvijayawada
సార్వత్రిక ఎన్నికల ఫార్ములా స్థానిక సంస్థల ఎన్నికల్లో వర్తించదు
•2024 సార్వత్రిక ఎన్నికల్లో కూటమి విజయం కోసం నాలుగు అడుగులు వెనక్కి తగ్గాం
•కార్యకర్తల ఆవేదన, ఆకాంక్షలు అర్థం చేసుకున్నాం
•క్షేత్రస్థాయిలో బలాబలాలను బేరీజు వేసుకున��� స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేస్తాం
•ఎన్డీఏ గెలుపే ధ్యేయంగా సమాయత్తమవుతాం
•సీట్ల కేటాయింపు, అభ్యర్థుల ఎంపికపై కూటమి పార్టీలు కూర్చుని చర్చించుకుంటాయి.
సనాతన ధర్మ పరిరక్షణ కోసం నిలబడిన నాయకుడు శ్రీ @PawanKalyan గారు
గత ప్రభుత్వ హయాంలో విగ్రహాల విధ్వంసం జరిగినప్పుడు, తిరుమల లో కల్తీ నెయ్యి వినియోగం జర���గినప్పుడు, ధర్మాన్ని అపహాస్యం చేసినప్పుడు కూడా ధర్మ పరిరక్షణ కోసం నిలబడిన నాయకుడు శ్రీ పవన్ కళ్యాణ్ గారు.
#JSPProtectsSanatanDharma
కుడి భుజానికి శస్త్ర చికిత్స చేయించుకున్న ఉప ముఖ్యమంత్రి శ్రీ @PawanKalyan గారిని శుక్రవారం సాయంత్రం ఉప సభాపతి శ్రీ రఘురామ ��ృష్ణం రాజు @KRaghuRaju గారు, పలువురు ఎమ్మెల్యేలు, నాయకులు, నిర్మాతలు, న్యాయవాదులు, మీడియా సంస్థల నిర్వాహకులు కలిసి పరామర్శించారు. శ్రీ పవన్ కళ్యాణ్ గారి ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. శ్రీ పవన్ కళ్యాణ్ గారిని కలిసిన వారిలో శాసనసభ విప్ శ్రీ బొమ్మిడి నాయకర్ @BNayakar_JSP , మాజీ మంత్రి శ్రీ బాలినేని శ్రీనివాసరెడ్డి , ఎమ్మెల్యేలు శ్రీ నిమ్మక జయకృష్ణ , శ్రీ గిడ్డి సత్యనారాయణ , శ్రీ అరవ శ్రీధర్, కడప అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ చైర్మన్ శ్రీ ముక్కా రూపానంద రెడ్డి, జనసేన నేతలు శ్రీ తాతంశెట్టి నాగేంద్ర, శ్రీ గంజి చిరంజీవి, ప్రముఖ నిర్మాత శ్రీ నవీన్ ఎర్నేని, ప్రముఖ న్యాయవాది శ్రీ అశ్విన్ కుమార్, మహా న్యూస్ సీఎండీ శ్రీ మారెళ్ల వంశీకృష్ణ, ప్రైమ్ 9 సీఎండీ శ్రీ బండి రఘువీర్ శ్రీనివాస్, సీఈఓ శ్రీ వెంకటేశ్వర రావు తదితరులు ఉన్నారు.
శ్రీ పవన్ కళ్యాణ్ గారిని పరామర్శించిన గౌరవ గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్ గారు
కుడి భుజానికి శస్త్ర చికిత్స చేయించున్న రాష్ట్ర ఉప ముఖ్యమంత్రివర్యులు శ్రీ @PawanKalyan గారిని ఆంధ్రప్రదేశ్ గౌ��వ గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్ గారు పరామర్శించారు. గవర్నర్ గారు గురువారం ఉదయం హైదరాబాద్ లోని శ్రీ పవన్ కళ్యాణ్ గారి నివాసానికి విచ్చేశారు. ఆయనతో మాట్లాడి శస్త్ర చికిత్స అనంతరం ఆరోగ్య పరిస్థితి గురించి అడిగి తెలుసుకున్నారు. వైద్య నిపుణుల సూచనలు పాటించాలని చెప్పారు. త్వరగా కోలుకుని, సంపూర్ణ ఆరోగ్యంతో విధుల్లోకి రావాలని ఆకాంక్షించారు.
• పవన్ కళ్యాణ్ గారి లైబ్రరీ తిలకించిన జస���టిస్ అబ్దుల్ నజీర్ గారు
శ్రీ పవన్ కళ్యాణ్ గారి స్వగృహంలో ఉన్న లైబ్రరీని గౌరవ గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్ గారు తిలకించారు. లైబ్రరీలోని పలు పుస్తకాలను పరిశీలించారు. ప్రఖ్యాత రచయితలు, స్కాలర్స్, విశ్లేషకులు, పబ్లిక్ పాలసీ మేకర్స్ రాసిన పుస్తకాలు పరిశీలించారు. వాటి గురించి శ్రీ పవన్ కళ్యాణ్ గారితో ఆసక్తిగా చర్చించారు. శ్రీ పవన్ కళ్యాణ్ గారు కోరడంతో ఓ పుస్తకంపై జస్టిస్ అబ్దుల్ నజీర్ గారు ఆటోగ్��ాఫ్ చేశారు.
గౌరవ గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్ గారు ఎంతో ఆప్యాయతతో వచ్చి పరామర్శించినందుకు శ్రీ పవన్ కళ్యాణ్ గారు కృతజ్ఞతలు తెలియజేశారు.
Hon'ble Andhra Pradesh Governor Justice Abdul Nazeer visited Hon'ble Deputy Chief Minister Sri @PawanKalyan at his residence and enquired about his recovery following right shoulder surgery.
Justice Abdul Nazeer Ji wished Sri Pawan Kalyan Garu a speedy recovery and a swift return to public service.
మాజీ మంత్రి శ్రీ ముద్రగడ పద్మనాభం గారి మృతి పట్ల జనసేన సంతాపం.
కైకలూరులో జరిగిన జనసేన పార్టీ కార్యక్రమంలో మాజీ మంత్రి శ్రీ ముద్రగడ పద్మనాభం గారి మృతికి సంతాపం తెలుపుతూ, వారి ఆత్మకు శాంతి కలగాలని జనసేన పార్టీ నాయకులు ఒక నిమిషం మౌనం పాటించారు.
ముంబయి ఆసుపత్రి నుంచి శ్రీ @PawanKalyan గారు డిశ్చార్జ్
•హైదరాబాద్ లోని నివాసానికి చేరుకోనున్న ���ప ముఖ్యమంత్రివర్యులు
•వైద్యుల సూచన మేరకు మూడు వారాల తరువాత నుంచి ఫిజియోథెరపీ
ముంబయిలోని కోకిలాబెన్ ధీరూభాయ్ అంబానీ ఆసుపత్రిలో కుడి భుజానికి శస్త్ర చికిత్స చేయించుకున్న రాష్ట్ర ఉప ముఖ్యమంత్రివర్యులు శ్రీ పవన్ కళ్యణ్ గారు కొద్దిసేపటి క్రితం ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు. శస్త్ర చికిత్స నుంచి కోలుకుంటున్న ఆయన డిశ్చార్జ్ అనంతరం నేరుగా హైదరాబాద్ లోని తన నివాసానికి చేర��కుంటారు. మూడు వారాల తరువాత నుంచి ఫిజియోథెరపీ చేయించుకోవాలని వైద్యులు సూచించారు. ఆపరేషన్ చేసిన భుజం సాధారణ స్థితికి చేరుకోవడానికి నాలుగు నెలల సమయం పడుతుందని వైద్యులు వెల్లడించారు.
మాజీ మంత్రి శ్రీ ముద్రగడ పద్మనాభం గారికి అధికారిక లాంఛనాలతో అంత్యక్రియలు
•గౌరవ ముఖ్యమంత్రి శ్రీ @ncbn గారు, ఉప ముఖ్యమంత్రి శ్రీ @PawanKalyan గారు ఫోన్లో మాట్లాడుకొని నిర్ణయం
•అధికారులకు ఆదేశాలు
మాజీ మంత్రి శ్రీ ముద్రగడ పద్మనాభం గారికి అధికారిక లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించాలని గౌరవ ముఖ్యమంత్రి శ్రీ చంద్రబాబు నాయుడు గారు, ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారు నిర్ణయం తీసుకున్నారు. బుధవారం ఉదయాన్నే శ్రీ చంద్రబాబు నాయుడు గారు, శ్రీ పవన్ కళ్యాణ్ గారు ఫోన్లో మాట్లాడుకున్నారు. నాలుగుసార్లు శాసన సభ్యుడిగా, ఒకసారి లోక్ సభ సభ్యుడిగా, రాష్ట్ర క్యాబినెట్ మంత్రి శ్రీ ముద్రగడ పద్మనాభం గారు సేవలందించారని... అంత్యక్రియలను అధికారిక లాంఛనాలతో చేపట్టాలని నిర్ణయించారు. ఈ మేరకు అధికారులకు ఆదేశాలు ఇచ్చారు.