Kudos to Team @isro.
The flawless launch of #LVM3M6 carrying #BlueBirdBlock2 marks another milestone in India’s space journey. It reflects our scientific excellence, relentless effort, and commitment to self-reliance.
A proud moment as India shines on the global space stage.
నిబద్ధతతో కూటమి ప్రభుత్వ లక్ష్యాలను ముందుకు తీసుకువెళ్లాలి
•గిరిజన గ్రామాలకు రహదారి సౌకర్యం ప్రాధాన్యంగా తీసుకున్నాము
•పంచాయతీరాజ్ సిబ్బంది శిక్షణలో దేశంలోనే ప్రథమ స్థానంలో నిలిచాము
•కలెక్టర్ల చొరవతో పల్లె పండుగ 1.0న��� నిర్దేశిత గడువులోగా పూర్తి చేశాము
•5వ కలెక్టర్ల సదస్సులో రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి శ్రీ @PawanKalyan గారు
జిల్లా కలెక్టర్లు నిబద్ధతతో పని చేస్తూ కూటమి ప్రభుత్వ లక్ష్యాలను ముందుకు తీసుకువెళ్లాలని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి, అటవీ పర్యావరణ శాఖల మంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారు దిశా నిర్దేశం చేశారు. గిరిజన గ్రామాలకు రహదారి సౌకర్యం ప్రాధాన్యంగా తీసుకున్నామనీ, అడవ�� తల్లి బాట పేరుతో చేపట్టిన ఈ ప్రాజెక్టును సంబంధిత జిల్లాల కలెక్టర్లు సమర్థంగా అమలు చేస్తున్నారన్నారు. బుధవారం ఉదయం రాష్ట్ర సచివాలయంలో5వ కలెక్టర్ల సదస్సులో గౌరవ ముఖ్యమంత్రి శ్రీ @ncbn గారు, మంత్రివర్గ సహచరులు, ఉన్నతాధ��కారులతో కలిసి పాల్గొన్నారు.
ఈ సందర్భంగా శ్రీ పవన్ కళ్యాణ్ గారు మాట్లాడుతూ “రాష్ట్ర అభివృద్ధికి మీ వంతు సహాయ సహకారాలు అందిస్తున్న కలెక్టర్లకు అభినందనలు. భవిష్యత్తులోనూ కూటమి ప్రభుత్వ లక్ష్యాలకు అనుగుణంగా సేవలందించాలి. పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖలో పల్లె పండగ 1.0 పనులను గడువులోపు పూర్తి చేయగలిగామన్నారు. పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో నరేగా నిధులతో గత ఏడ��ది చేపట్టిన పల్లె పండుగ 1.0 ద్వారా గ్రామాల్లో 4 వేల కిలోమీటర్ల మేర సిమెంటు రోడ్లు నిర్ణీత సమయానికి పూర్తి చేయగలిగాం. రైతులకి అండగా 22,500 మినీ గోకులాలు, 15 వేల నీటి తొట్టెలు, 1.2 లక్షల ఫామ్ పాండ్స్ నిర్మించాం. సకాలంలో పనులు పూర్తి చేయగలిగాము. 2025 – 2026 ఆర్ధిక సంవత్సరానికి 41.12 లక్షల కుటుంబాలకు ఉపాధి కల్పించాం. మొత్తం 15.95 కోట్ల పని దినాల ద్వారా రూ. 4,330 కోట్ల వేతనాల రూపంలో చెల్లించాం. మెటీరియల్ కాంపోనె���ట్ కింద మరో రూ. 1,056.85 కోట్లు బిల్లుల రూపంలో చెల్లించాం. ఇది గ్రామీణ ప్రజలకు ఆర్థిక చేయూతను ఇచ్చింది.
•స్వచ్ఛ రథం సత్ఫలితాలనిస్తోంది
గ్రామ పంచాయతీల స్వయం ఆదాయార్జన మార్గాలపై కూడా దృష్టి సారిస్తాం. టాక్స్, నాన్ టాక్స్ అసైన్మెంట్లు డిజిటలైజ్ చేసే కార్యక్రమంపై జిల్లా అధికార యంత్రాంగం దృష్టిపెట్టాలి. రాష్ట్రీయ గ్రామ స్వరాజ్ అభియాన్ (RGSA) శిక్షణ కార్యక్రమాల్లో దేశంలోనే మొదటి స్థానంలో నిలిచాం. ఉద్యోగుల సామర్థ్యం పెంపుకి ఈ శిక్షణా తరగతులు ఎంతగానో తోడ్పడ్డాయి. గ్రామ స్థాయిలో ఎప్పటికప్పుడు పాలనా సామర్థ్యాల పెంపు కోసం కలెక్టర్లు కృషి చేయాలి. జూన్ నెలలో తీసుకువచ్చిన స్వచ్ఛ రథం కార్యక్రమం సత్ఫలితాలనిస్తోంది. జూన్ లో ఒక యూనిట్ తో ప్రారంభించగా నేటికి ఆ సంఖ్య 25కి చేరింది. పీఎం జన్మన్ పథకం, నరేగా సాయంతో మారుమూల గిరిజన గ్రామాలకు రహదారులు నిర్మించే కార్యక్రమాన్ని చేపట్టాం. రహదారుల నిర్మాణానికి అవసరం అయిన అటవీ అనుమతుల వ్యవహారంలో పార్వతీపురం మన్యం జిల్లా కలెక్టర్ 9కి 9 అనుమతులు పూర్తి చేసి 100 శాతం స్ట్రయిక్ సాధించారు. అల్లూరి జిల్లా కలెక్టర్ 88కి 79 పనులకు అనుమతులు క్లియర్ చేశారు. అడవి తల్లి బాట పనులపై కలెక్టర్లు శ్రద్ధ చూపుతున్నారనడానికి ఇది నిదర్శనం. మరింత ఉత్సాహంగా పని చేస్తూ నిబద్దతతో ప్రజలకు సేవలు అందించాలి” అన్నారు.
పిఠాపురంలో జనసేన కమిటీల కోలాహలం
గౌరవ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత శ్రీ @PawanKalyan గారు MLA గా ప్రాతినిధ్యం వహిస్తున్న పిఠాపురం నియోజకవర్గంలో, క్షేత్రస్థాయిలో పార్టీని మరింత బలోపేతం చేసేలా, ��ార్టీ కోసం ఎన్నో ఏళ్లుగా కష్టపడుతున్న జనసైనికులకు నాయకత్వ బాధ్యతలు అప్పగించి, పార్టీలో నవ నాయకత్వాన్ని నింపేలా నిన్నటి నుండి చేబ్రోలు లోని జనసేన పార్టీ కార్యాలయంలో పార్టీ ప్రధాన కార్యదర్శి శ్రీ @itsRamTalluri గారి ఆధ్వర్యంలో కమిటీల నియామకం ప్రారంభం అయ్యాయి. జనసేన అధినేత శ్రీ పవన్ కళ్యాణ్ ఆదేశాల మేరకు ఆయన సొంత నియోజకవర్గం పిఠాపురంలో వార్డు, బూత్, గ్రామ స్థాయి కమిటీల నియామకం ప్రక్రియలో భాగంగా మంగళవారం నాడు పిఠాపురం రూరల్ మండలంలోని గోకివాడ, కుమారపురం, జల్లూరు, మల్లం గ్రామాలకు కమిటీలను ప్రజాస్వామ్య పద్ధతిలో ఎంపిక చేయడం జరిగింది. తొలిసారిగా పార్టీ కమిటీల నియామకం ఓటింగ్ ప్రక్రియ ద్వారా స్థానిక జనసైనికులచే ఈ ఎంపికలు కొనసాగాయి. ఈ నాలుగు గ్రామాల పరిధిలో 34 వార్డులకు, 12 బూత్ లకు, 4 గ్రామాలకు ఇంచార్జులను ఎన్నుకున్నారు. ఎన్నికైన వారందరికీ పార్టీ ప్రధాన కార్యదర్శి శ్రీ తాళ్లూరి రామ్ గారు నియామక పత్రాలను అందజేసి, వారి చేత ప్రమాణ స్వీకారం చేయించి బాధ్యతలు అప్పగించటం జరిగింది. క్షేత్ర స్థాయిలో పార్టీని బలోపేతం చేసేలా, పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ఆశయాల సాధన కోసం, రాష్ట్ర వ్యాప్తంగా, ముఖ్యంగా పిఠాపుర�� పరిధిలో ఆయన చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లాలని, వారి పరిధిలోని ప్రజల సమస్యలను ఎప్పటికప్పుడు పార్టీ పైస్థాయి నాయకత్వం, సంబంధిత అధికారుల దృష్టికి తీసుకెళ్లి సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని సూచించారు. ఈ సందర్భంగా వందలాది మంది జనసైనికులు ఉత్సాహంగా కమిటీ ఎన్నికల ప్రక్రియలో పాల్గొని సభ్యులను ఎన్నుకున్నారు. కమిటీల ఎంపిక బాధ్యత తమకే ఇచ్చి తమను గౌరవించినందుకు వారు జనసేనాని పవన్ కళ్యాణ్ కు ధన్యవాదాలు తెలిపారు. రేపటి నుండి మరో 4 రోజుల పాటు మిగతా 48 గ్రామాలకు ఇదే తరహాలో కమిటీలను నియమించనున్నట్లు తాళ్లూరి రామ్ గారు తెలిపారు.
#Pithapuram
ఖాకీ… సమాజానికి రక్షణ కవచం
•కానిస్టేబుల్ ఉద్యోగం పోలీస్ వ్యవస్థకు మూల స్థంభం లాంటిది
•మీ గౌరవాన్ని ఎవరి ముందూ తగ్గించుకోవద్దు
•శాంతి భద్రతలను పరిరక్షించే మీరు… రాష్ట్ర ఆర్ధిక వ్యవస్థకు ఓ చోదక శక్తి
•సక్రమంగా విధులు నిర్వర్తిస్తూ మీరంతా రాష్ట్ర అభివృద్ధిలో భాగస్వాములు కావాలి
•గత ప్ర��ుత్వ నిర్వాకంతో మూడున్నరేళ్ల విలువైన కాలాన్ని కోల్పోయారు
•కూటమి ప్రభుత్వం ఒక దృఢ సంకల్పంతో న్యాయపరమైన చిక్కులు తొలగించి నియామకాలు చేపట్టింది
•మాజీ ముఖ్యమంత్రి పోలీసులకు హెచ్చరికలు చేస్తున్నారు
• పోలీసులని బెదిరించేవారిని ఉపేక్షించం
•మీరు ప్రజలకు రక్షణ కల్పించండి.. అండగా మేము ఉంటాం
•కానిస్టేబుళ్ల నియామక పత్రాల ప్రదానం కార్యక్రమంలో ఉప ముఖ్యమంత్రి శ్రీ @PawanKalyan గారు
రాష్ట్ర ఉపముఖ్యమంత్రి @PawanKalyan ను యు.ఎస్. కాన్సుల్ జనరల్ శ్రీమతి లారా విలియమ్స్ మర్యాదపూర్వకంగా కలిశారు. మంగళవారం క్యాంపు కార్యాలయంలో జరిగిన ఈ భేటీలో పలు అంశాలు చర్చకు వచ్చాయి. ఈ సమావేశంలో యు.ఎస్. ఎంబసీకి చెందిన మెరెడిత్ మెట్జలర్, యు.ఎస్ పబ్లిక్ డిప్లమసీ ఆఫీసర్ అబ్దుల్ రెహ్మన్ హబీబ్, పొలిటికల్ స్పెషలిస్ట్ శ్రీమాలి కారి, ఎకనమిక్ స్పెషల���స్ట్ శిబా త్రిపాఠి తదితరులు పాల్గొన్నారు.
వేదికప��� రోడ్డు కోసం విన్నపం… సభ ముగిసేలోగా మంజూరు
- నిమిషాల్లో పని పూర్తి చేసిన ఉప ముఖ్యమంత్రి @PawanKalyan
- అల్లూరి సీతారామరాజు జిల్లా నుంచి కానిస్టేబుల్ గా ఎంపికైన శ్రీ లాకే బాబూరావు తన గ్రామానికి రోడ్డు సౌకర్యం కోరారు.
- రోడ్డు బాధ్యతను ఉప ముఖ్యమంత్రి అప్పగించిన గౌరవ సీఎం శ్రీ @ncbn గారు
- నిమిషాల్లో 2 కిలోమీటర్ల రోడ్డు నిర్మాణానికి పరిపాలనా అనుమతులు
- రూ. 2 కోట్లు మంజూరు చేసిన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్
కానిస్టేబుల్ నియామక పత్రాల ప్రదానం కార్యక్రమం వేదికగా రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ విన్నపం విన్న నిమిషాల వ్యవధిలో రహదారి మంజూరు చేశారు. కానిస్టేబుల్ గా నియమితుడైన గిరిజన యువకుడు శ్రీ లాకే బాబూరావు తన సక్సెస్ స్టోరీ వివరించే క్రమంలో ��న గ్రామానికి రోడ్డు వేయించమని గౌరవ ముఖ్యమంత్రి శ్రీ చంద్రబాబు నాయుడు గారిని కోరారు. శ్రీ బాబూరావు కోరిక మేరకు అతని గ్రామానికి రోడ్డు వేసే బాధ్యతను వేదికపై ఉన్న ఉప ముఖ్యమంత్రి కు అప్పగించారు. అల్లూరి సీతారామరాజు జిల్లా, జీకే వీధి మండలం, దేవరపల్లి పంచాయతీ పరిధిలోని తెనుములబండ గ్రామానికి చెందిన శ్రీ బాబూరావు చెప్పిన వివరాల మేరకు పవన్ కళ్యాణ్ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. తక్షణం రోడ్డు నిర్మాణానికి అవసరమైన అంచనాలు రూపొందించి, అనుమతులు ఇవ్వాలని స్పష్టం చేశారు. ఉపముఖ్యమంత్రివర్యుల ఆదేశాలతో ఆఘమేఘాలపై కదిలిన యంత్రాంగం తెనుములబండ నుంచి ఎలుగురాతిబండ వరకు 2 కిలోమీటర్ల మేర రూ. 2 కోట్లతో బీటీ రోడ్డు నిర్మాణానికి అంచనాలు సిద్ధం చేసి శ్రీ పవన్ కళ్యాణ్ గారి తెలిపారు.
ఉప ముఖ్యమంత్రి ఆదేశాలకు అనుగుణంగా ఏఎస్ఆర్ జిల్లా కలెక్టర్ పరిపాలన అనుమతులు ఇచ్చారు. వేదిక మీద రోడ్డు గురించి విజ్ఞప్తులు చేయగా సభ ముగిసేలోగా రోడ్డు మంజూరు చేశారు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్.
25 లక్షల ఖర్చుతో కంప్యూటర్ ల్యాబ్ తో పాటు విజ్ఞానం, బహుభాషా ప్రావీణ్యం పెంచే పుస్తకాలతో కూడిన లైబ్రరీని చిలకలూరిపేట జిల్లా పరిషత్ హైస్కూల్ పిల్లల కోసం అందించిన గౌరవ ఉప ముఖ్యమంత్రి శ్రీ @PawanKalyan గారు.
#AndhraPradesh#PawanKalyanAneNenu
Heartfelt congratulations to the Indian Squash Team for clinching their maiden World Cup title at the SDAT #SquashWorldCup2025. This historic achievement is a proud moment for the nation and will inspire young athletes, paving the way for a bright future for squash in India.
కేరళ, తమిళనాడుల్లో ఉప్పాడ మత్స్యకారులకు శిక్షణ
•మత్స్య సంపదతో సుస్థిర ఆర్ధికాభివృద్ధి సాధన లక్ష్యంగా అడుగులు
•ఆధునిక, సాంకేతికతలతో కూడిన లాభదాయక పద్ధతులపై అధ్యయనం
•ఉప ముఖ్యమంత్రి @PawanKalyan చొరవతో రెండు బృందాలుగా తరలిన ఉప్పాడ మత్స్యకారులు
•తమిళనాట కేజ్ కల్చర్, రిఫ్ కల్చర్, ఆధునిక మార్కెటింగ్ వ్యవస్థలపై శిక్షణ
•కేరళలో మోడల్ ఫిషింగ్ హార్బర్, అత్యాధునిక వలల తయారీపై అధ్యయనం
•విజయవంతంగా ముగిసిన వారం రోజుల శిక్షణా తరగతులు
ఉప్పాడ తీర ప్రాంత మత్స్యకారుల జీవనోపాధిని మెరుగుపర్చేందుకు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ప్రకటించిన 100 రోజులు ప్రణాళికలో భాగంగా అధ్యయనం, అవగా��న, శిక్షణ కార్యక్రమాలు మొదలయ్యాయి. తమిళనాడు, కేరళ రాష్ట్రాలు అవలంభిస్తున్న సాంకేతికత సాయంతో ఉప్పాడ, కాకినాడ తీర ప్రాంత మత్స్యకారులకు వసతులు కల్పించేందుకు ఉన్న అవకాశాలపై అధ్యయనం చేయాలని ఈ సందర్భంగా ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ మత్స్యశాఖ అధికారులకు సూచించారు. ఇందుకు అనుగుణంగా మత్స్య సంపదతో ఆర్థికాభివృద్ధి సాధించేందుకు అవసరం అయిన అధునాతన పద్దతులపై అధ్యయనం చేసేందుకు ఉప్పాడకు చెందిన మత్స్యకారులను తమిళనాడు, కేరళ రాష్ట్రాలకు పంపారు. ఈ నెల 8వ తేదీన మొత్తం 60 మంది రెండు బృందాలుగా ఆయా రాష్ట్రాలకు వెళ్లారు. స్థిరమైన ఆర్ధికాభివృద్ధి సాధించడం ఎలా అనే అంశంపై రెండు రాష్ట్రాల్లో మూడు రోజుల ��ాటు శిక్షణ ఇప్పించారు. అధునాతన కేజ్ కల్చర్, రిఫ్ కల్చర్, మార్కెటింగ్ వ్యవస్థల ఏర్పాటు, అన్ని హంగులతో నిర్మించిన హార్బర్ల సందర్శన, హ్యాచరీల్లో చేపల గుడ్లు పొదిగించడం, వలల తయారీ తదితర అంశాల్లో సెంట్రల్ సాల్ట్ అండ్ మెరైన్ కెమికల్ రీసెర్చ్ ఇనిస్టిట్యూట్ (CSMCRI), నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ పోస్ట్ హార్వెస్ట్ టెక్నాలజీ (NIPHT)లతో శిక్షణ ఇప్పించారు. మొదట పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా అక్కడ అ��లు చేస్తున్న విధానాలను వివరించారు. తదుపరి క్షేత్ర స్థాయిలో సందర్శనలకు ఏర్పాటు చేశారు.
•మండపం, విల్లుపురంలో మొదటి బృందం అధ్యయనం
తమిళనాడు సందర్శనకు వెళ్లిన ఉప్పాడ మత్స్యకార బృందం చెన్నైలోని మండపం వద్ద ఉన్న సి.ఎస్.ఎం.సి.ఆర్.ఐ.ని సందర్శించారు. అక్కడ మెరైన్ నిపుణులు కృత్రిమ, సహజ పద్దతుల్లో సాగు చేస్తున్న కేజ్ కల్చర్, రిఫ్ కల్చర్ లపై మత్స్యకారులకు శిక్షణ తరగతులు నిర్వహించారు. సముద���ర తీర ప్రాంతంలో జీవ వైవిధ్యాన్ని కాపాడుకునేందుకు తీసుకోవాల్సిన జాగ్రత్తలను వివరించారు. సముద్ర వన���ుల దీర్ఘకాలిక సంరక్షణకు అవలంభించాల్సిన శాస్త్రీయ విధానాలను ఉప్పాడ మత్స్యకారులకు తెలియజేశారు. అనంతరం విల్లుపురంలోని గోల్డెన్ మెరైన్ హార్వెస్ట్ హ్యాచరీని సందర్శించి మత్స్య సంపద సృష్టిలో వస్తున్న నూతన సాంకేతికతపై అధ్యయనం చేశారు. చెన్నై మెరినా బీచ్ సమీపంలోని ఆధునిక మౌలిక వసతులతో కూడిన చేపల మార్కెట్ ని సందర్శించారు. మార్కెట్ వద్ద చేపలు ఎక్కువ రోజులు నిల్వ ఉంచుకునేందుకు ఏర్పాటు చేసిన సౌకర్యాలను అడిగి తెలుసుకున్నారు. ఈ క్షేత్ర స్థాయి పరిశీలనలో పరిశుభ్రమైన వాతావరణంలో చేపల అమ్మకం, కోల్డ్ స్టోరేజ్ వ్యవస్థలు, మత్స్య సంపద గ్రేడింగ్, వేలం నిర్వహణ, వ్యర్ధాల నిర్వహణ విధానాలు, సప్లయి చైన్ తదితర అత్యాధునిక సదుపాయాలపై అవగాహన తెచ్చుకున్నారు. ఈ పర్యటన ద్వారా ఆధునిక సదుపాయాల కల్పన ద్వారా మత్స్యకారుల ఆదాయం ఎలా వృద్ధి చెందుతుంది అనే అంశాన్ని తెలుసుకున్నారు.
•స���ంకేతికత సాయంతో మత్స్య సంపద వృద్ధిపై కేరళలో అధ్యయనం
కేరళ పర్యటనలో భాగంగా ఉప్పాడకు చెందిన రెండో మత్స్యకార బృందం ఎన్.ఐ.పి.హెచ్.టిలో మూడు రోజులపాటు నిపుణుల పర్యవేక్షణలో శిక్షణ తీసుకున్నారు. వేటలో సాంకేతిక మేళవింపు, స్థిరమైన ఆదాయార్జన, ఆర్ధికంగా లాభదాయక విధానాలు అవలంభించడం ఎలా? అనే అంశాలపై వీరు అధ్యయనం చేశారు. మునంబంలోని మోడల్ ఫిషింగ్ హార్బర్ సందర్శించి అక్కడ ఆధునిక పద్దతులలో వలల తయారీ ప్రక్రియ, వారు పాటిస్తున్న నాణ్యతా ప్రమాణాలు, మార్కెటింగ్ విధానాలను తెలుసుకున్నారు. చేపల గుడ్లు పొదిగించడం, రకరకాల జాతుల చేప పిల్లల హ్యాచరీలు సందర్శించారు. మత్స్యకారుల జీవన ప్రమాణాలు మెరుగుపర్చేందుకు అమలు చేస్తున్న అధునాతన విధానాలు, వాటివల్ల కలుగుతున్న లాభాలపై ఉప్పాడ తీర ప్రాంత మత్స్యకారులకు ప్రత్యక్షంగా అధ్యయనం చేసే అవకాశం కలిగింది.
@PMOIndia @AndhraPradeshCM @PIB_India @IPR_AP @pibvijayawada @FisheriesGoI
వరల్డ్ కప్ విజేతలకు ఉప ముఖ్యమంత్రి @PawanKalyan ప్రోత్సాహం
అంధుల మహిళా క్రికెట్ వరల్డ్ కప్ విజేతగా నిలిచిన భారత్ జట్టుకు ₹84 లక్షల రూపాయల ప్రోత్సాహకాన్ని వ్యక్తిగత సంపాదన నుండి అందించిన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్
• ప్రతీ క్రీడాకారిణికి ₹5 లక్షల చొప్పుల చెక్కుల అందచేత
• టీమ్ బృందానికి ప్రత్యేక అభినందనలు తెలిపి నగదు ప్రోత్సాహకం
• ప్రతీ ఒక్కరితో స్వయంగా పలకరిస్తూ వారికి సన్మానం మరియు బహుమతుల ప్రధానం
• వారి సమస్యలు విని వాటి పరిష్కారానికి కృషి చేస్తామని హామీ
• కెప్టెన్ దీపికా తన ఊరికి రోడ్డు మార్గం లేక ఇబ్బంది పడుతున్నామని చెప్పడంతో గంటల వ్యవధిలో మడకశిర నియోజకవర్గం అమరాపురం మండలంలోని హేమవతి పంచాయతీ పరిధిలో ఉన్న తంబలహెట్టి రోడ్లను పరిశీలించారు. హేమావతి నుంచి తంబలహెట్టి వరకూ రోడ్డు నిర్మాణానికి రూ.3.2 కోట్లు, గున్నేహళ్లి నుంచి తంబలహెట్టీ వరకూ 5 కిమీ రోడ్డు నిర్మాణానికి రూ.3 కోట్లు అవసరమని అంచనా వ్యయానికి అనుమతులు మంజూరు చేశారు.
గౌరవ భారత రాష్ట్రపతి, గౌరవ ప్రధాని శ్రీ @narendramodi తరవాత తమను ఇంతలా గౌరవించింది మీరే అంటూ హర్షం వ్యక్తం చేసిన క్రీడాకారిణులు.
@blind_cricket
#WomensBlindCricket
JanaSena Party General secretary Sri @itsRamTalluri Garu, Interacted with the Middle East Region NRI's. Appreciated their continued dedication for their unwavering support from global and elaborated on the forthcoming programs, strategic engagements, and organisational activities
ప్రపంచ కప్ విజేతగా నిలిచిన భారత మహిళల అంధుల క్రికెట్ జట్టుతో భేటీ అయిన ఉప ముఖ్యమంత్రి @PawanKalyan. మంగళగిరిలోని క్యాంపు కార్యాలయంలో క్రికెటర్లు, శిక్షకులు, సహాయక సిబ్బందితో ఈ భేటీ జరిగింది.
• ప్రపంచ కప్ సాధించిన క్రికెటర్లను అభినందించి, ఒక్కో మహిళా క్రికెటర్ కు రూ.5 లక్షల చొప్పున, శిక్షకులకు రూ.2 లక్షలు చొప్పున ₹84 లక్షల విలువైన చెక్కులు అందించిన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్. ప్రతీ మహిళ క్రికెటర్ కు పట్టు చీర, శాలువాతోపాటు జ్ఞాపిక, కొండపల్లి బొమ్మలు, అరకు కాఫీతో కూడిన బహుమతులను అందించి సత్కరించారు
@blind_cricket@IPR_AP@pibvijayawada@PIB_India
#WomensBlindCricket
బస్సు లోయలోపడి ప్రయాణీకుల దుర్మరణం బాధాకరం
అల్లూరి సీతారామ రాజు జిల్లాలో బస్సు లోయలో పడిన దుర్ఘటనలో తొమ్మిది మంది దుర్మరణం పాలయ్యారని తెలిసి చింతిస్తున్నాను. యాత్రికులతో కూడిన బస్సు చింతూరు - మారేడుమిల��లి ఘాట్ రోడ్డులో అదుపు తప్పి లోయలో పడిపోయిందని అధికారుల ద్వారా అందిన సమాచారం. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలియచేస్తున్నాను. ఈ దుర్ఘటనలో 22 మంది గాయపడ్డారు. క్షతగాత్రులకు తక్షణమే మెరుగైన వైద్య సేవలు అందించాలని అధికారులకు సూచించడమైనది. బాధిత కుటుంబాలను ప్రభుత్వం తగిన విధంగా ఆదుకుంటుంది - @PawanKalyan
@AndhraPradeshCM @IPR_AP @pibvijayawada
Thank you, UK and Europe NRI Janasainiks. It was a wonderful interaction with all of you. Your energy, commitment, and dedication truly inspire us. Grateful for your time and support.
@JanaSenaParty
క్యాబినెట్ భేటీ ప్రారంభానికి ముందు ఉప ముఖ్యమంత్రి శ్రీ @PawanKalyan గారిని కలిసిన మంత్రులు
•తమ నియోజకవర్గ గ్రామాల్లోని రోడ్ల నిర్మాణాలకు నిధులు మంజూరు చేయడంపై డిప్యూటీ సీఎం గారికి ధన్యవాదాలు తెలిపిన మంత్రులు
•గత ప్రభుత్వంలో విధ్వంసమైన రోడ్లతో ప్రజలు చాలా అవస్థలు పడ్డారని... ఆ రోడ్లు ఇప్పుడు బాగుపడతాయని, ప్రజల తరపున తాము కృతజ్ఞతల�� తెలుపుతున్నామని డిప్యూటీ సీఎంకు చెప్పిన మంత్రులు
•పవన్ కళ్యాణ్ గారికి కృతజ్ఞతలు తెలిపిన శ్రీ @PayyavulaOffl , శ్రీమతి @Anitha_TDP, శ్రీ @PonguruNarayana , శ్రీ @mnadendla, శ్రీమతి సవిత, శ్రీ డి వి బి స్వామి, శ్రీ @RamanaiduTDP , శ్రీ @SatyaAnagani, శ్రీ రాంప్రసాద్ రెడ్డి, శ్రీ @BCjanardhan ,శ్రీ @kanduladurgesh
•మొదటి విడతగా పంచాయతీ రాజ్ రోడ్ల నిర్మాణలకు నిధులు మంజూరు చేస్తూ ఇప్పటికే జీవో జారీ చేసిన పంచాయతీ రాజ్ శాఖ.
•మొత్తంగా 157 నియోజకవర్గాల్లో 1299 రోడ్ల పటిష్టత చేపట్టనున్న పంచాయతీ రాజ్ శాఖ.
•రూ. 2123 కోట్ల మేర సాస్కీ నిధులను విడుదల చేస్తూ ఉత్తర్వులు జారీ.
•26 జిల్లాల పరిధిలోని 157 నియోజకవర్గాల్లోని 4007 కిలో మీటర్ల మేర రోడ్లను పటిష్టపరిచేలా మొదటి విడతలో కార్యాచరణ.
• పల్లె పండుగ 2.0 ప��రిట చేపట్టే రహదారి నిర్మాణాలకు ఉప ముఖ్యమంత్రివర్యులు ఇటీవలే శంకుస్థాపన చేశారు.
@APDeputyCMO