నందమూరి తారక రామారావు గారి ఆశయమే ఊపిరిగా, 'పేదవాడి సేవయే పరమావధి' అన్న నినాదంతో ప్రారంభమైన మన ఎన్టీఆర్ ట్రస్ట్ నేటితో 29 వసంతాలు పూర్తి చేసుకుంది.
గడచిన ఈ ప్రయాణంలో ఎందరో బిడ్డలకు విద్యను, లక్ష���ాది మందికి ఆరోగ్యాన్ని, ఆపదలో ఉన్నవారికి భరోసాను అందించడం కేవలం ఒక బాధ్యతగా కాకుండా, ఆయన మనకు వదిలి వెళ్ళిన వారసత్వంగా భావిస్తున్నాను. ఈ 29 ఏళ్లలో మనం సాధించిన ప్రతి విజయం, తుడిచిన ప్రతి కన్నీటి చుక్క వెనుక మీ అందరి సహకారం, ఆ మహనీయుని ఆశీస్సులు ఉన్నాయి.
మరింత ఉత్సాహంతో, మరిన్ని పేద గుండెల్లో వెలుగులు నింపే దిశగా మన ప్రయాణం కొనసాగుతుంది.
#NTRTrust #29YearsOfNTRTrust #ServiceToManIsServiceToGod #NTRLegacy #29YearsofService
రికార్డు స్థాయిలో సంక్షేమం అందిస్తున్నాం.
* దేశంలోనే అతి పెద్ద సంక్షేమ కార్యక్రమం, నెలకు రూ.2,750 కోట్లతో "ఎన్టీఆర్ భరోసా పెన్షన్" అందిస్తున్నాం. ఏడాదికి రూ.33 వేల కోట్ల మేర నిధులు వెచ్���ిస్తున్నాం
* "తల్లికి వందనం" ద్వారా కుటుంబంలో ఎంతమంది పిల్లలున్నా అందరికీ ఆర్ధిక సాయం అందించాం
* "స్త్రీశక్తి పథకం" ద్వారా ఇప్పటి వరకూ 43.5 కోట్ల ప్రయాణాలు జరిగాయి
* "దీపం 2.0" ద్వారా ఏడాదికి 3 సిలెండర్లు ఉచితంగా మహిళలకు అందిస్తున్నాం
* "అన్నదాత సుఖీభవ" ద్వారా రూ.20 వేల రూపాయలు మూడు విడతల్లో రైతులకు అందిస్తున్నాం
* "అన్నా క్యాంటీన్లను" అన్ని నియోజకవర్గాల్లోనూ ఏర్పాటు చేస్తున్నాం
#APAssembly
#ChandrababuNaidu
#AndhraPradesh
ముఖ్యమంత్రి గారి తల్లిని అవమానిస్తే చూస్తూ ఉంటామా? ఎమోషనల్ అవుతాం.
రాష్ట్రంలో ఏ తల్లి జోలికి వచ్చినా, ఎవ్వరినీ వదిలిపెట్టం… మార్క్ మై వర్డ్స్.
#APLegislativeCouncil#NaraLokesh#AndhraPradesh
Had the privilege of meeting the Hon’ble Union Home Minister, Shri Amit Shah Ji, in New Delhi today. We discussed key matters pertaining to Andhra Pradesh's progress. @AmitShah
అనకాపల్లి జిల్లా, తాళ్లపాలెంలో ఈరోజు ‘స్వర్ణాంధ్ర- స్వచ్ఛాంధ్ర’ కార్యక్రమంలో పాల్గొన్నాను. ఏ కార��యక్రమం అయినా ప్రజల భాగస్వామ్యం ఉంటేనే అది విజయవంతం అవుతుంది. ఏడాది కాలంగా ప్రతినెలా ఈ కార్యక్రమంలో పాల్గొంటూ పరిశుభ్రత పై అవగాహన పెంచే ప్రయత్నం చేస్తున్నాం. ప్రజల నుంచి ఈ కార్యక్రమానికి వస్తున్న స్పందన, సమాజంలో కనిపిస్తున్న మార్పు ఎంతో సంతృప్తిని కలిగిస్తోంది.
#SwarnaAndhraSwachhAndhra
అనకాపల్లి జిల్లా పర్యటనలో భాగంగా ఈరోజు తాళ్లప��లెం సాంఘిక సంక్షేమశాఖ గురుకుల పాఠశాల విద్యార్థులతో ముఖాముఖి కార్యక్రమంలో పాల్గొన్నాను. విద్యార్థుల్లో క్రమశిక్షణ, పరిశుభ్రత, ఆత్మవిశ్వాసం, నాయకత్వ లక్షణాలను పెంచే వినూత్న కార్యక్రమం '#ముస్తాబు' పై విద్యార్థుల అభిప్రాయాలను కనుక్కున్నాను. బెస్ట్ ప్రాక్టీసెస్ గా ఉన్న ముస్తాబు కార్యక్రమాన్ని రాష్ట్రవ్యాప్తంగా అమలు చేస్తున్నాం.
#TeamAPInAction#CycloneMontha
డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా, అల్లవరం మండలం, ఓడలరే���ులో మొంథా తుఫాను బాధితుల కోసం ఏర్పాటు చేసిన పునరావాస కేంద్రానికి వెళ్లి బాధితుల క్షేమ సమాచారాన్ని అడిగి తెలుసుకున్నాను. నిర్వాసిత కుటుంబాలకు ప్రభుత్వం నుండి నిత్యావసర సరుకులు, 25 కేజీల బియ్యం, ఒక్కో కుటుంబానికి రూ.3 వేల చొప్పున సాయం అందినట్టు వారు చెప్పారు. అనంతరం అరగట్లపాలెం, బెండమూరులంక గ్రామాలకు వెళ్లి రైతులతో మాట్లాడాను. నీట మునిగిన పంట పొలాలను పరిశీలించాను. వీలైనంత త్వరగా పంట నష్టాన్ని అంచనా వేసి ఆదుకుంటామని భరోసా ఇచ్చాను.
#TeamAPInAction#CycloneMontha
నెల్లూరు జిల్లా, సంగం బ్యారేజీ వద్దకు లంగరు తెగిపోయిన 30 టన్నుల బరువున్న ఇసుక బోటు గేట్ల వరకూ వచ్చింది. బ్యారేజీ నీటి నిల���వకు తోడు మొంథా తుఫాన్ వరద పోటెత్తింది. భారీ బోటు బ్యారేజీ గేట్లకు తగిలి ఉంటే భారీ డ్యామేజీ జరిగేది. సమాచారం అంద���కున్న నెల్లూరు కలెక్టర్ హిమాన్షు శుక్లా, ఎస్పీ పరిస్థితిని సమీక్షించి.. బోటు తొలగింపునకు యుద్ధ ప్రాతిపదికన ఏర్పాట్లు చేశారు. NDRF, SDRF , పోలీసులు, కృష్ణపట్నం పోర్టు గస్తీ బృందం, ఫైర్, ఇరిగేషన్ అధికారుల బృందం అంతా కలిసి..30 టన్నుల బోటును బ్యారేజీకి ఎలాంటి నష్టం కలగకుండా ఒడ్డుకు చేర్చారు. టీం వర్క్‌తో అతిపెద్ద జలగండాన్ని తప్పించిన మీ కృషికి హ్యాట్సాఫ్.