@NewsMeter_In@aimim_national@AkbarOwaisi_MIM When speaker openly supporting CM why didn’t you raise your voice sir… There is a reason for there walkout… there was a scam at the time of BRS then y you ppl didn’t raised your voice…
బనకచర్ల ముప్పును ముందుగా పసిగట్టి రణభేరి మోగించిందే బిఆర్ఎస్.
మేము ముల్లుకర్ర కాదు బల్లెం పెట్టి పొడిస్తే గాని ఈ ప్రభుత్వం మొద్దు నిద్ర లేవలేదు.
ఎన్నో ప్రెస్ మీట్లు పెట్టి, ఎప్పటికప్పుడు హెచ్చరించినా ప్రభుత్వం తగిన స్థాయిలో స్పందించలేదు.
బనకచర్ల విషయంలో బీఆర్ఎస్ పోరాటం చేస్తే పాత డేట్లు వేసి లెటర్లు విడుదల చేసిండు ఉత్తం కుమార్ రెడ్డి.
మేం పోరాటం చేస్తున్న సమయంలో ఢిల్లీలో కేంద్ర ప్రభుత్వం ఏపీ, తెలంగాణతో మీటింగ్ పెట్టింది.
పోను పోను అనుకుంటూనే బనకచర్ల మీటింగ్ రేవంత్ రెడ్డి ఉరికిండు.
అపెక్స్ మీటింగ్ కు కాకుండా వేరే ఏ రకమైన సమావేశానికి హాజరు కావొద్దని మేం ఆనాడు గట్టిగా హెచ్చరించినం.
అయినా పోను అనుకుంటూనే పోయి మీటింగ్ లో కూసున్నడు. పెట్ట పెట్ట అనుకుంటనే రేవంత్ రెడ్డి సంతకం పెట్టిండు.
మేం నిలదీస్తే, నిలబెట్టి కడిగేస్తే బనకచర్ల మీటింగ్ ఎజెండాలోనే లేదని, కనుక చర్చ జరిగే ప్రసక్తే లేదని డైలాగులు దంచిండు.
మేం ఎజెండా బయట పెట్టి బట్టలిప్పినం. బట్టబయలు చేసినం.
దాంతో పాటు ఏపీ ఇరిగేషన్ మంత్రి నిమ్మల రామానాయుడు కూడా అసలు బండారం బయట పెట్టిండు.
బనకచర్లపై చర్చ జరిగిందని, బనకచర్ల ప్రాజెక్టు నిర్మాణాన్ని సుసాధ్యం చేసేందుకు కమిటీ ఏర్పాటు అయ్యిందని మీడియా ముఖంగా చెప్పిండు.
బనకచర్ల వలన కృష్ణా నది నీటిలో తెలంగాణ, మహారాష్ట్ర ,కర్ణాటకకు నీటి వాటా దక్కకుండా చేసేందుకు నల్లమల సాగర్ కు చంద్రబాబు తెరలేపిండు.
16 జూలై 2025 న రేవంత్ రెడ్డి ,చంద్రబాబు అంగీకరించిన విధంగా ఏపీ ప్రభుత్వం 15 డిసెంబర్ 2025 న కమిటీ వేస్తే తెలంగాణ ప్రభుత్వం 23 డిసెంబర్ 2025 నాడు వేసింది.
ఇరు రాష్ట్రాలు పంపిన పేర్లతో కేంద్ర ప్రభుత్వ అధికారులను చేర్చి నేడు తెలంగాణ ,ఏపీ ల మధ్య నీటి వాటా పంపిణీ కై కేంద్ర జల శక్తి మంత్రిత్వ శాఖ కమిటీ ఖరారు చేసింది.
ఏపీ కమిటీలో ఇద్దరు ఐ ఏ ఎస్ లు ,ఇద్దరు ఇంజినీర్లు ఉంటే తెలంగాణ కమిటీలో ముగ్గురు ఐ ఏ ఎస్ లు ,ఒక్క ఇంజనీరింగ్ అధికారి మాత్రమే ఉన్నారు.
ఏపీ కమిటీ లో ఐ ఎస్ అండ్ డబ్ల్యూ ఆర్ లో అనుభవం ఉన్న అధికారి ఉంటే తెలంగాణ కమిటీలో ఐ ఎస్ అండ్ డబ్ల్యూ ఆర్ లో అనుభవం లేని అధికారి ఉండటం రాష్ట్ర ప్రయోజనాలకు గొడ్డలి పెట్టుగా మారింది.
ఈ కమిటీ ఇరు రాష్ట్రాల మధ్య నీటి పంపకాలు మూడు నెలల్లో పూర్తి చేయడం అంటే మూడు నెలల్లో నల్లమల సాగర్ కు ఆమోదం తెలపడమే.
ఇది రేవంత్ రెడ్డి ఉద్దేశ పూర్వకంగా తెలంగాణ కు నష్టం చేసి ఏపీ కి మేలు చేసే చర్యే.
ఇక నల్లమల సాగర్ టెండర్ విషయానికి వస్తే ఏపీ ప్రభుత్వం 11 డిసెంబర్ 2025 చివరి తేదీ తో టెండర్ వేస్తే టెండర్ చివరి తేదీ అయిపోయాక 16 డిసెంబర్ 2025 నాడు సుప్రీం కోర్టు కు వెళ్లడమంటే రేవంత్ సర్కార్ నల్లమల సాగర్ ప్రాజెక్టుకు పరోక్షంగా అంగీకారం తెలపడానికే అని స్పష్టమైంది.
టెండర్ ప్రక్రియ ప్రారంభమైన వెంటనే సుప్రీం కోర్టుకు వెళ్లి డీ పీ ఆర్ టెండర్ ప్రక్రియ ను ఆపేందుకు స్టే తెచ్చి ఉంటే టెండర్ ఖరారయ్యేదే కాదు
నేడు టెండర్ ప్రక్రియ ఖరారవ్వడమే కాకుండా ఐ ఐ సి టెక్నాలజి ప్రైవేట్ లిమిటెడ్ అనే సంస్థకు పోలవరం నల్లమల సాగర్ ప్రాజెక్టు కు టెండర్ ఖరారు అయ్యేది కాదు.
ఇది కచ్చితంగా రేవంత్ రెడ్డి కుట్రే. ముమ్మాటికీ తెలంగాణ కు చేసిన ద్రోహమే.
@revanth_anumula@UttamINC
#CongressFailedTelangana
#CongressBetrayedTelangana