ఎమ్మిగనూరు పట్టణంలోని 9వ వార్డులో ‘రెండేళ్ల నమ్మకం – అభివృద్ధి – సంక్షేమం’ ఇంటింటికీ ప్రచార కార్యక్రమంలో భాగంగా ఇంటింటికీ వెళ్లి ప్రజలను ఆత్మీయంగా కలిసి వారి అభిప్రాయాలు, సమస్యలు తెలుసుకున్నాను.
కూటమి ప్రభుత్వం రెండేళ్లలో అమలు చేసిన సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలను ప్రతి కుటుంబానికి వివరించడంతో పాటు, వార్డులో కొనసాగుతున్న సీసీ రోడ్లు, డ్రైనేజీలు, వీధి దీపాలు తదితర మౌలిక వసతుల అభివృద్ధి పనులను పరిశీలించి నాణ్యతతో, వేగవంతంగా పూర్తి చేయాలని అధికారులకు సూచించడం జరిగింది.
అనంతరం పార్టీ నాయకులు, క్లస్టర్, యూనిట్, బూత్ కన్వీనర్లు, కార్యకర్తలతో సమావేశమై రానున్న పార్టీ కార్యక్రమాలు, మున్సిపల్ ఎన్నికలపై చర్చించి దిశానిర్దేశం చేయడం జరిగింది.
ప్రజల నమ్మకాన్ని నిలబెట్టుకుంటూ... ప్రతి ఇంటికి అభివృద్ధి, ప్రతి కుటుంబానికి సంక్షేమం చేరేలా నిరంతరం కృషి చేస్తూనే ఉంటాను.
#DrBVJayaNageswaraReddy #RendellaNammakam #Abhivrudhi #Sankshemam #DoorToDoorCampaign #Yemmiganur #TDP #PublicService