True Teachers Coalition (TTC)
state Co Convinar
Education is the permanent solution for all the social problems. As well as political power is also need
ప్రజా యుద్దనౌక గద్దర్ గారి మరణ వార్త అత్యంత బాధాకరం. మొన్న యాప్రాల్ లో గద్దరన్నతో వేదిక పంచుకునే అవకాశమొచ్చింది. అదే చివరిదని ఊ��ించలేదు.😭 విద్యార్థి దశలో ఊరు మనదిరా, వాడ మనదిరా అన్న పాటను 1987 లో అంబేద్కర్ జయంతి సందర్భంగా గద్దరన్న గొంతు నుండి విన్నాను. ఎన్నో తరాలను ప్రభావితం చేసిన ఈ గొంతుక నేడు మూగబోవడం దేశానికి తీరనిలోటు. ఈ ప్రజాగాయకుడి అంత్యక్రియలను అధికార లాంఛనాలతో జరపాలని తెలంగాణ ప్రభుత్వాన్ని కోరుతున్నాను. #Gaddar
ఈ రోజు నార్కెట్ పల్లి - ఏపీ లింగోటం గ్రామంలో హైవే పై జరిగిన రోడ్డు ప్రమాదం���ో గాయపడ్డ మహిళలను వెంటనే హాస్పిటల్‌కు చేర్చి ప్రాణాలు రక్షించిన #Nakrekal #BSP కార్యకర్తలకు అభినందనలు.
#BSP4Life
@PriyaMedi @ramjigautambsp @Mayawati
వరుస లీకులతో నిరుద్యోగులను నిండా ముంచిన #TSPSC ని సమూలంగా ప్రక్షాళన చేసిన తరువాతనే గ్రూప్-1 సహా అన్ని పరీక్షలను మళ్లీ నిర్వహించాలని డిమాండ్ చేస్తూ, #KCR తలపెట్టిన తెలంగాణ దశాబ్ది ఉత్సవాలను పూర్తిగా బహిష్కరించాలని విద్యార్థులకు, నిరుద్యోగులకు, వారి కుటుంబాలకు, మేధావులు, కవులు, కళాకారులకు #BSP పిలుపునిస్తున్నది. ఎందుకంటే….
1. #TSPSC పేపర్ లీకేజీ కుంభకోణం దేశ��లోనే అతిపెద్ద రిక్రూట్మెంట్ కుంభకోణం. కోట్ల రూపాయలు చేతులు మారినా ఇప్పుడున్న #TSPSC చైర్మన్ జనార్దన్ రెడ్డి, ఇతర సభ్యులపై, #KCR ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం.
2. సిట్,ఈడీ విచారణను ఎదుర్కొంటున్న ప్రస్తుత #TSPSC కమీషన్ మళ్ళీ పరీక్షలను ఆగమేఘాల మీద నిర్వహిస్తామంటున్నది. అసలు సూత్రధారులను ఈ రెండు దర్యాప్తు సంస్థలు ఇంకా అరెస్ట్ చేయలేదు! రాబోయే రోజుల్లో ఇంకా ఎన్ని ఒళ్లు గగుర్పొడిచే న��జాలు వినాల్సివస్తుందోనని అభ్యర్థులు చాలా ఆందోళనతో ఉన్నరు. దీని వల్ల చాలా మంది అభ్యర్థుల్లో ఏకాగ్రత కొరవడడం, అశోక్ నగర్, దిల్సుఖ్ నగర్, అన్ని లైబ్రరీలు చాలా వరకు ఖాళీ గా ఉండడం… నిరుద్యోగ సమాజంలో ఒక నిస్తేజం ఆవరించింది.
3. #TSPSC పేపర్ లీకేజీకి నైతిక బాధ్యత వహిస్తూ చైర్మన్ జనార్దన్ రెడ్డి రాజీనామా చేయకపోవడం! దీని వెనక అధికారపార్టీ నేతల ఒత్తిడా? (లేక) ప్రభుత్వం లోని పెద్దలను కాపాడే కుట్రలో చైర్మన్ పావుగా మారిండా అన్నది తెలవాల్సి ఉంది. ఇప్పుడు మలి దశ పరీక్షలు లీక్ కావు/కాలేదు అని ఛైర్మన్ గ్యారంటీ ఇవ్వగలడా?
4. తెలంగాణ ప్రభుత్వం పేపర్ లీకేజీపై ఎందుకు సిట్టింగ్ జడ్జి/సిబిఐతో విచారణ జరపడం లేదు? సర్కార్ పరువు పోతుందని భయమా? (లేద���) నిందితులకు పరోక్షంగా మద్దతు పలకడమా? దీనిపై గవర్నర్ గారు కూడా స్పందించక పోవడం బాధగా ఉన్నది.
5. తన కళ్ల ముందే 16 పేపర్ల లీకేజీని కనిపెట్టలేని కమీషన్ చైర్మన్, గ్రూప్ -1 తో సహా అన్ని పరీక్షలను రీషెడ్యూల్ చేసి మళ్లీ పకడ్బందీగా నిర్వహిస్తానంటే ఎట్లా నమ్మేది?
6. భవిష్యత్తులో #TSPSC నిర్వహించే పరీక్ష ప్రశ్నపత్రాలు లీక్ కావనే (గ్రూప్ -1 తో సహా) గ్యారంటీ ముఖ్యమంత్రి #KCR కూడా ఇవ్వడం లేదు? ఎందుకు CM ఇ��తవరకు మౌనంగా ఉన్నడు? ఎవరిని కాపాడడం కోసం ముఖ్యమంత్రి మీడియాకు మొఖం చాటేస్తున్నడు???
7. TSPSC పేపర్ లీక్ వ్యవహారంలో SIT అధికారులు, ED ఇంత వరకు ఛైర్మన్ ను, కాన్ఫిడెన్షియల్ రూం ఇంచార్జ్ శంకరలక్ష్మిలను, అసిస్టెంట్ సెక్రటరీ సత్యనారాయణలను అదుపులోకి తీసుకొని ప్రశ్నించకపోవడం. వాళ్ల బంధువులను ఆధారాలున్నా కూడా విచారించకపోవడం.
8. సిట్ విచారణలో రోజు కొత్త కొత్త నిందితులు, హైటెక్ కాపీయింగ్ ఇంకా ఎన్నో కొత్��� విషయాలు బయట పడుతూనే ఉండడం. అయినా అధికారులు ఆదరాబాదరగా మళ్లీ పరీక్షలు నిర్వహించడం.
9. మంత్రి #KTR కనుసన్నల్లో నడిచే TSTS ( Info Tech Dept) TSPSC కంప్యూటర్లను మైంటైన్ చేసింది. వారిలో రాజశేఖర్ రెడ్డి మినహా ఎవ్వరినీ ప్రశ్నించక పోవడం.
10. TSPSC చైర్మన్ గ్రూప్ -1 మెరిట్ జాబితాను కేవలం #KTR కు ఇచ్చారు. కానీ SIT/ED అధికారులకు మాత్రం TSPSC మెరిట్ జాబితాలను ఇవ్వడం లేదు. ఎందుకని?
11. 2022 గ్రూప్-1 టాపర్ ను ముఖ్యమంత్రి ఇంకా ప్రకటించకపోవడం. ఎందుకు?
ఇంకా ఎన్నో కారణాలున్నవి….
మొదటిది, 2022 జూలైలో బహుజనవాదంతో ఏమాత్రం సంబంధం లేని ఒక జర్నలిస్ట్ మిత్రుడు నాకు పంపింది.
రెండవది, పొలిటికల్ ఎలక్షన్ కన్సల్టింగ్ కంపెనీలోని ప్రముఖ వ్యక్తి నుంచి తాజాగా నా మిత్రుడుకి వచ్చిన మెసేజ్.
తెలంగాణలో BSP ఎంతలా ���ాతుకుపోతుందో, రాజకీయంగా ఎంత బలంగా ఉందో ఈ రెండు మెసేజ్‌లు ఒక ఉదహారణ.
ఛాలెంజ్ చేసి చెప్తున్నా.. నవంబరులో జరిగే ఎన్నికల తర్వాత BSP ఈ రా��్ట్ర రాజకీయాల్ని శాసిస్తది.
Dear @narendramodi ji,
When you share joyful moments with wrestlers when they bring laurels to Motherland, you should also stand by them when they are in pain. Politics apart, please meet all these proud daughters of the nation personally and lend them you your ears, Sir.These people should be wrestling on mats in stadiums, but not fighting on the roads for justice!
#SayNo2BJP
.#BSP మొదటినుండీ ఇదే చెబ��తున్నది. 2022 Group-1 టాపర్ ఎవరో CM KCR గారి నోటి నుండే వినాలని ఎదురు చూస్తున్నది. కానీ ఆయన మాత్రం దాన్ని గురించి మాట్లాడకుండా సంబురాలు జరుపుకోండి అంటున్నడు. #KCRFailedTelangana
తెలంగాణలో ప్రాజెక్టుల రీ డిజైన్ పేరుతో వేల కోట్లు దోపిడీ చేస్తున్న #KCR కు రైతుల కష్టాలు,కన్నీళ్లు పట్టవు.
₹50 కోట్లతో ప్రగతి భవన్, ₹1,400 కోట్లతో కొత్త సెక్రటరీయేట్ కట్టిన #KCR కు లక్షల ఎకరాలకు సాగునీరందించే నాగార్జున సాగర్,జూరాల,డిండి,మూసీ, కడెం ప్రాజెక్టుల స్పీల్ వే మరమ్మతులకు నిధులు కేటాయించడానికి చేతులు రావడం లేదు.
అయ్యా #KCR గారూ, మెగా,రాజ్ పుష్ప,షాపూర్జీ వంటి బడా కాంట్రాక్టర్లు తమ చేతికి అడ్వాన్స్ కమీషన్���ు ఇస్తే తప్ప, ఈ ప్రాజెక్టులకు నిధులు కేటాయించరా?
అబ్ కీ బార్- కిసాన్ సర్కార్ కాదు,
ఏక్ బార్- బహుజన్ సర్కార్ రావాలి.👊
తుంగతుర్తి MLA గాదరి కిషోర్ కుమార్ ప్రోద్బలంతోనే BRS గూండాలు కర్రలు,రాళ్లతో నాపై దాడి చేసి కారును ధ్వంసం చేసి హత్యాయత్నం చేశారని బాధితుడు వీడియోలో ��్పష్టంగా చెప్పినా తిరుమలగిరి SI నిందితులను ఇంకా అరెస్టు చేయలేదు.
హత్యాయత్నం ఘటనపై బాధితుని స్టేట్మెంట్ కూడా రికార్డు చేయకుండానే ఓ కానిస్టేబుల్ ఇచ్చిన ఫిర్యాదుతో స్థానిక ఎస్సై FIR నమోదు చేయడం ముమ్మాటికీ బాధితుడి హక్కుల ఉల్లంఘనే. అందులోనూ IPC 307 నమోదు చేయకపోవడం చూస్తే రాష్ట్రంలో పోలీసు వ్యవస్థ ఏ స్థాయికి దిగజారిందో అర్థమైతున్నది.
BRS పార్టీ నేతలు ఆదేశిస్తే ప్రతిపక్ష పార్టీ నేతలను అర్ధరాత్రి అక్రమంగా అరెస్ట్ చేసే తెలంగాణ ఫ్రెండ్లీ పోలీసులు, అడ్వకేట్ యుగంధర్ పై పట్టపగలే హత్యాయత్నానికి పాల్పడిన నిందితులపై అన్ని ఆధారాలున్నప్పటికీ అరెస్టు చేయకపోవడం దారుణం.
మూసీ నదిలో ఇసుక మాఫీయాను ప్రోత్సాహిస్తున్న KCR, మైనింగ్ మంత్రి KTR, వాళ్ల ఏజెంట్ కిషోర్ కుమార్ ల ఒత్తిడి వల్లే పోలీసులు నిందితులను అరెస్టు చేయడం లేదు. ఇన్ని దాడుల కేసులున్న ఈ గూండాలను PD Act కింద జైలుకు పంపించే దాకా పోరాడతాం. ఏక పక్షంగా వ్యవహరిస్తున్న పోలీసులారా, మీచర్యలను ప్రజలు అంతా గమనిస్తున్నరు. అన్ని రోజులు ఒకటే లాగా ఉండవు, గుర్తుంచుకోండి.
వచ్చే ఎన్నికల్లో #BRS అరాచక మూకలను చిత్తుచిత్తుగా ఓడించడమే తెలంగాణ ముందున్న తక్షణ కర్తవ్యం.
మన పొలంలో పనిచేస్తే కూలి రాదు కానీ పంట మన ఇంటికి వస్తుంది. దొరల పొలంలో పనిచేస్తే కూలి వస్తుంది కానీ పంట రాదు. ఇక మనకు కూలి కావాల్నో, పంట కావాల్నో మనమే నిర్ణయించుకోవాల్సిన సమయం వచ్చేసింది-మిలింద�� గడ్పాలే @AllIndiaBSP @BITCELL_BSP @GADUGUMAHENDER @RSPraveenSwaero
గురుకులాలు ఇప్పుడు గుర్తొచ్చాయా?
2016లో కొత్త గురుకులాలు ప్రారంభమైన తర్వాత వాటికి భూమి కేటాయించి,సొంత భవనాలు నిర్మించాలనే ఇంగిత జ్ఞానం ముఖ్యమంత్రి #KCR గారికి లేక పోవడం మన దౌర్భాగ్యం.
చిన్నారి బిడ్డల కష్టాలు చూసి 2018 లో ₹1250 కోట్లతో కనీసం కొన్ని గురుకులాల���ైనా కడదామని డిజైన్లను తయారుచేసి టెండర్లను మేము ఖరారు చేస్తే, తన దగ్గరి వారికి టెండరు దక్కలేదని CM గారు బలవంతంగా అన్ని టెండర్లను రద్దు చేయించిండు.
దీనిపై బహిరంగ చర్చకు నేను సిద్దం. మీరు సిద్దమా?
ఎన్నో ఏళ్లుగా రాష్ట్రంలోని వందలాది గురుకులాలు ప్రైవేట్ అద్దె భవనాల్లో నడుస్తున్నాయి. అద్దె కూడా సరిగా కడ్తలేరని ఓనర్లు అప్పుడప్పుడు కరెంటు, నీళ్లు బందు చేస్తున్నారు. సరిపడ తరగతి గదులు, హాస్టల్ వసతులు, క్రీడా మైదానాలు లేక విద్యార్థులకు కనీస వసతులు కల్పించడంలో ప్రభుత్వం వైఫల్యం చెందింది. ప్రైవేటు యాజమాన్యాలకు ప్రతి నెల కోట్లల్లో అద్దె చెల్లిస్తున్న ప్రభుత్వం గురుకులాలకు మాత్రం సొంత భవనాల నిర్మాణానికి బడ్జెట్ లో నిధులు కేటాయించడం లేదు. తన హంగు, ఆర్భాటాలకోసం,అవసరం లేని సచివాలయాన్ని ₹1400 కోట్లతో ఆగమేఘాల మీద కట్టుకున్నారు.
కానీ…
ప్రైవేటు అద్దె భవనాల్లో కోడి పిల్లల్లా బిక్కుబిక్కుమంటూ బతుకుతున్న బహుజన బిడ్డల గోడు మాత్రం ఈ నయా నియంతలకు పట్టదు.
కానీ మన బహుజన రాజ్యంలో ప్రతి మండలానికి ఒక అంతర్జాతీయ స్థాయి పాఠశాలలు నిర్మించడమే #BSP లక్ష్యం.
#KCRfailedTelangana
This tweet is a longer and an important one. You MUST read this patiently🙏
#KCR పాలనలో తెలంగాణలో కులానికొక న్యాయ���ుండే విచిత్రమైన పరిస్థితి నెలకొన్నది. నేను సర్వీసులో ఉన్నప్పుడు చాలా మంది బహుజన వర్గాలకు చెందిన ఉద్య���గులు ACB దాడులకు గురై జైల్‌కు పోయి జీవితాలు శిధిలమైన స్థితిలో నా దగ్గరికి సహాయం కోసం వచ్చేవారు..
ఇందులో చాలా మంది మీద అక్కసుతో కుట్ర పన్ని ఇరికించిన కేసులే. వీటి వల్ల ప్రమోషన్లను కోల్పోయిన ఉద్యోగులు ఎందరో. కొందరు ఆత్మహత్యలు కూడా చేసుకున్నరు😭
వీళ్ల మీద ACB వాళ్లకు SI యాదగిరిరావు మీద ఉన్న కనికరం కూడా ఉండదు. ఎందుకంటే వీళ్ల వెనక కులం ఉండదు, KCR-KTR-Kavita లు ఉండరు. ఈ పేద వర్గాలకు చెందిన MLA/MLCలు CM దగ్���రికి పోయి అసలు విషయం చెప్పే సాహసం చేయరు. అంత ధమ్మున్నోడిని @BRSparty ల బతకనివ్వరు!
ఇటీవల డిస్మిస్ అయిన TaskForce Inspector Nageshwar Rao గురించి ఎవరూ మాట్లాడలే. ఎందుకంటే అతనిది పేద రజక కులం! నయీం కేసుల్లో దందాలు చేసి కోట్లు సంపాయించుకున్న ఎంతమంది అగ్రవర్ణాలకు చెందిన అధికారులు ఇప్పుడు రాజుల్ల���గా ఫాంహౌసులు కట్టుకొని మంచి పోస్టింగుల్లో లేరు..నా దగ్గర ఆధారాలున్నయి. సరైన సమయంలో బయట పెడతా…
వాళ్ల దగ్గిర (కుల)వాళ్లకు (Sorry to Say this, but it is a fact most of the times) కావాలసిన వాళ్లకు రహస్యంగా జీవోలు తీసి ప్రాసిక్యూషన్‌ను ఉపసంహరించుకుంటది @TelanganaCMO . ఈ విషయాలు పత్రికల్లో కూడా ఎక్కడ రావు, ఎందుకంటే మెజారిటీ పత్రికలు చానల్లు పేద వర్గాల వద్దలేవు, ఉండనివ్వరు కూడా.
ఈ విషయాలు ఓట్లేసే బహుజన ప్రజలకు తెలిసే అవకాశం లేదు. అందుకే డబ్బు చల్లి ఆధిపత్య వర్గాలు మళ్లీ గెలుస్తాయి. మళ్లీ బహుజన వర్గాలు బానిసత్వంలో మగ్గుతాయి. This is a cycle.
అందుకే….
ఉద్యోగులారా, భయం వీడండి. గ్రామాలకు తరలండి. మన రాజ్యం గురించి చెప్పండి. ఈ దోపిడి దొంగలు చేస్తున్న అవినీతి గురించి #BSP #RSP కి చెప్పండి. 🙏మిమ్ముల గుండెల్లో పెట్టి కాపాడుకుంటాం. మన రాజ్యంలో ACB ని బహుజనీకరిస్��ాం. అగ్ర వర్ణ అధికారులతో సహా పేద ఉద్యోగులపై అక్రమంగా పెట్టిన ACB/ Vigilance కేసులను బరాబర్ కొట్టేస్తాం. 👊
This is my promise to all of you. ✊ Pl tell everyone from today itself. Your sacrifices will be remembered.
Jai Bhim. Jai Telangana. Jai Bharat.
అయిజ మండలం నౌరోజీ క్యాంప్-CT పాడు వెళ్లే రోడ్డు అధ్వాన్నంగా తయారైంది. గతుకుల మయమైన రోడ్డుతో ప్రజలు తీవ్ర అవస్థలు పడుతున్నారు.రోడ్డు కనెక్టివిటీ లేక ఊరికి బస్సు లేదు. విద్యార్థులు ఉన్నత విద్య కోసం 4 KM కాలినడకన వెళ్లాల్సిన దుస్థితి. మీ ఫాంహౌసులకు రోడ్లు ఇట్లనే ఉంటయా?
పొట్టకూటి కోసం ���ల్ఫ్ దేశాలకు వెళ్ళిన పేదల గోడు #KCR కు పట్టదు. బాధితుల కోసం ₹500 కోట్లతో సంక్షేమనిధి,ప్రత్యేక బోర్డును ఏర్పాటు చేస్తానన్న హామీలు అటకెక్కాయి. #BSP అధికారంలోకి రాగానే గల్ఫ్ కార్మికుల కోసం ఉద్యోగ,ఆరోగ్య భద్రత, ఏజెంట్ల మోసాలు లేని NRI పాలసీని అమలు చేస్తాం.
తుంగతుర్తిల�� అడ్వకేట్ యుగేందర్ గారు గత కొంత కాలంగా MLA కిషోర్ కుమార్ చేస్తున్న ఇసుక మాఫియా,డబల్ బెడ్రూమ్, దళిత బంధు, మూడు ఎకరాల భూమి కోసం పోరాటం చేస్తున్నడు..దాన్ని జీర్ణించుకోలేని BRS గూండాలు ఈరోజు తిరుమలగిరి అఖిలపక్ష సమావేశానికి హాజరు అయిన యుగంధర్ పై హత్యాయత్నం చేసిండ్రు