ఎగువ రాష్ట్రాల్లో కురిసిన భారీ వర్షాలకు నదులు, కాల్వలకు నీరు రావడంతో జిల్లాలో పంటల సాగు విస్తీర్ణం పెరిగిందని వ్యవసాయ శాఖ జేడీ ఠాగూర్ నాయక్ తెలిపారు. మొత్తం 4,74,527 హెక్టార్లలో పంటలు సాగయ్యాయని చెప్పారు.
సమాజానికి కళ్ళకు కట్టినట్లు చూపేది చిత్రమేనని జిల్లాలో మంచి ఫోటోగ్రాఫర్లు ఉన్నారని జిల్లా కలెక్టర్ జి. వీరపాండియన్ అన్నారు. సోమవారం కలెక్టరేట్ ఆవరణలో ప్రపంచ ఫోటోగ్రఫీ దినోత్సవాన్ని పురస్కరించుకొని మీడియా ఫోటోగ్రాఫర్లు ప్రదర్శించిన ఫోటో ఎగ్జిబిషన్ ను జిల్లా యస్పి కె. ఫకీరప్పతో
ఆదోని మార్కెట్ యార్డులో ఇనాం ద్వారా ఆన్లైన్ ట్రేడింగ్ లో రైతుల భాగస్వామ్యం మార్కెటింగ్ లావాదేవీల సమర్ధవంత పనితీరుపై కేంద్ర కేబినెట్ సెక్రెటరీ ప్రదీప్ కుమార్ సిన్హా జిల్లా కలెక్టరు నుండి వివరాలు అడిగి తెలుసుకున్నారు. శనివారం న్యూఢిల్లీ నుండి ఇనాం ఆన్లైన్ ట్రేండింగ్ పై వీడియో
ఈ ఏడాది జిల్లాలోని అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో పాఠ్యపుస్తకాల పంపిణీ త్వరగా పూర్తి చేయడంలో 37 లక్షల పాఠ్యపుస్తకాలు పంపిణీ చేసి కర్నూలు జిల్లా మొదటి స్థానంలో ఉందని కడప ఆర్జేడీ వెంకటకృష్ణారెడ్డి అన్నారు. కలెక్టరటలోని సర్వశిక్షా అభియాన్ సమావేశ భవనంలో డీఈవో తాహెరా సుల్తానా ఆధ్వర్యంలో
కర్నూలు నగరంలో ప్రజలు త్రాగునీటి సమస్యతో ఇబ్బంది పడకుండా నగరపాలక సంస్థ నీటి సరఫరా ఇంజనీర్లు అందరూ ప్రతిరోజూ ఉదయం 5 గంటల నుండి వార్డులలో ఉంది పర్యవేక్షించాలని జిల్లా కలెక్టర్ జి.వీరపాండియన్ ఆదేశించారు. శుక్రవారం ఆయన ఛాంబర్లో నగర త్రాగునీటి సమస్యపై సమావేశం నిర్వహించారు.
భారత ప్రభుత్వం, మినిస్ట్రీ ఆఫ్ మైనారిటీ అఫైర్స్ శాఖ ద్వారా మైనారిటీ విద్యార్థులకు మంజూరు అయ్యే ఉపకార వేతనముల కొరకు జిల్లాలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలు మరియు కళాశాలలు ఈనెల 18 లోపు https://t.co/C6NpecghWk పోర్టల్ నందు నమోదు చేసుకొని, అందుకే సంబంధించిన నోడల్ ఆఫీసర్
ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న గ్రామ, వార్డు సచివాలయ సెక్రెటరీల వ్రాత పరీక్షలను పకడ్బందీగా నిర్వహించేందుకు ప్రత్యేక శ్రద్ద తీసుకోవాలని పంచాయతీరాజ్ ప్రిన్సిపల్ సెక్రటరీ గోపాలకృష్ణ ద్వివేది, పంచాయతీరాజ్ కమీషనర్ గిరిజా శంకర్ లు అన్ని జిల్లాల కలెక్టర్లను వీడియో
గ్రామ, వార్డు సచివాలయ సెక్రెటరీల వ్రాత పరీక్షలకు జిల్లాలో 1,15,531 మంది హాజరవుతున్న నేపథ్యంలో పరీక్షల నిర్వహణకు పటిష్ట ప్రణాళిక రూపొందించుకోవాలని జిల్లా కలెక్టర్ జి.వీరపాండియన్ సంబంధిత అధికారులను ఆదేశించారు. శుక్రవారం కలెక్టరు కార్యాలయ సమావేశ భవనంలో సెరేటరీల వ్రాత పరీక్షల
తుగ్గలి, చాగలమర్రి కస్తూర్బా పాఠశాలల్లో ఇంటర్ కలశాల భవన నిర్మాణాల కోసం రూ.2.60 కోట్లు మంజూరైనట్లు జిల్లా సర్వశిక్షా అభియాన్ ఈఈ తెలిపారు. చాగలమర్రి ఉర్దూ పాఠశాలకు కొత్తగా మూడు భవనాలు మంజూరు చేశామని, పాతవాటి స్థానంలో కొత్త భవనాలు నిర్మిస్తామని ఆయన తెలిపారు.
జిల్లాలోని అన్ని మండలాల్లో గురువారం నుంచి 14,255 మంది గ్రామ వాలంటీర్లు విధుల్లో చేరారు. మండల పరిషత్ కార్యాలయాల్లో వీరికి అధికారులు గుర్తింపు కార్డులు, బాధ్యతలు అప్పగించారు. పల్లె ప్రజలకు మరింత ఉత్తమ సేవాలందించాలని వారికి సూచించారు.
ఆగష్టు15 బానిససంకెళ్ళ నుంచి విముక్తి పొంది దేశ ప్రజలు స్వేచ్చా వాయువు పీల్చుకున్న గొప్పరోజు. దేశఘనతను, మహామహుల చేసిన సేవల్ని స్మరించుకుంటు, వారు రగిలించిన స్పూర్తితో మరింతముందుకు సాగుదాం అని కోరుకుంటూ రాష్ట్ర ప్రజలందరికీ 73వ స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు.
#IndependenceDay2019
తపాలా కార్యాలయాల్లో ఆధార్ నమోదుకు చర్యలు తీసుకుంటున్నట్లు ఆ శాఖ కర్నూలు డివిజన్ పర్యవేక్షకుడు హరికృష్ణ ప్రసాద్ పేర్కొన్నారు. ఆధార్ నమోదు కొత్తగా అయితే ఉచితంగా చేస్తారని, మార్పులకు, చేర్పులకు రూ.50 చెల్లించవలసి ఉంటుందని, వినియోగదారులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు.