ఒక కథ చెప్తాను.
అనగనగా ఒక డాక్టర్ గారు, ఆయన మా శ్రీమతికి పరిచయం. ఎంతో చదివేవారు రాత్రనక పగలనక పాపం. పొద్దున్న మరిచిపోయేవారు. పీజీ పరీక్షలు ఇంకో రెండు నెలల్లో ఉన్నాయి. ఇక ఫెయిలవుతానని ఆవిడతో వాపోయారు. సాధారణంగా మనకి అర్థం అయ్యేది మరిచిపోము, మీకెందుకిలా అవుతోంది అని ఆవిడ ఆశ్చర్యపడి, ఎందుకైనా మంచిది కేజీహెచ్ ఎదురుగా మా ఆయన ఒక దుకాణం (క్లినిక్) తెరిచి ఖాళీగా ఈగలు దోమల�� తోలుకుంటూ ఇలాంటి కథలు రాస్తుంటాడు, వెళ్లి ఆయన్ని కలవమన్నారు.
అతను సర్లే వస్తే కొండ పోతే ఈక అని అన్నట్లు వార్డు వర్కు పూర్తయ్యాక సాయంకాలం నా దగ్గరికి వచ్చారు. డాక్టరుగారూ మేడమ్ పంపారట ఒక సార్ వచ్చారు అని మా రిసెప్షనిస్టు చెప్పింది. స్వాతి పుస్తకంలో ఎప్పట్న���ంచో ఒక కథ రాద్దామని ఆలోచిస్తున్న నేను మా మేడమ్ పేరు వినగానే అలెర్ట్ అయిపోయి, పంపించమన్నాను.
డాక్టర్ గారు చెప్పింది మొత్తం విన్నాను. విషయం ఏమిటంటే ఆయన ఏ పని చేస్తున్నా ఏదో ఒక పనికిమాలిన ఆలోచన బుర్రలో దూరుతుంది. అది ఉదా, చంద్రబాబు విశాఖపట్నం వస్తారా? సచిన్ మళ్లీ ఆడితే ఎలా ఉంటుంది? ఇలాంటివన్నమాట. అవి ఆలోచనలు ఒక గొలుసుకట్టుగా గ్యాప్ లేకుండా గమ్యం లేకుండా అలా వస్తూనే ఉంటాయి. పాపం పు��్తకం ముందే ఉంటుంది, ఏకాగ్రత ఎక్కడో ఉంటుంది. దాంతో ఆయన చదవలేకపోయేవాళ్ళు. ఎన్నో ప్రయత్నాలు చేశారు ఆయన తన మనసు మళ్లించడానికి. పరీక్షలు దగ్గరపడే కొద్దీ, ఆయన ఆ ఆలోచనలను అడ్డుకునేకొద్దీ అవి తీవ్రం కావడం మొదలయ్యాయి.
మొత్తం విన్నాక ఇది ఓసీడీ అండి అని చెప్పాను. అదేంటి సార్ ఓసీడీ అంటే చేతులు మళ్లీ మళ్లీ కడుక్కోవడం, సర్దినదే మళ్లీ సర్దటం ఇలాంటివి కదా, నాకవేమీ లేవే అని అడిగారు. అవునండీ కానీ మీకు ఉన్నది ప్యూర్లీ అబ్సెషనల్ టైపు. ఇది కూడా ఓసీడీ నే అని చెప్పి కౌన్సిలింగ్ చేసి, మందులు రాసిచ్చాను. నెల రోజుల్లో కొన్ని ఏళ్ళ నుంచీ ఉన్న ఆలోచనలు తొంభై శాతం తగ్గిపోయాయి. చక్కగా పరీక్షలు రాసి పాసయ్యారు.
తర్వాత ఆయన ధన్యవాదాలు చెప్తూ, నాకు ఎంబీబీఎస్ మొదటి ఏడాది నుంచీ ఈ సమస్య ఉంది, నేను అప్పుడే మీలాంటి వాళ్ళని కలిసి ఉంటే నాకు ఇన్నేళ్ల బాధ తప్పి ఉండేది. పీజీ ఎంట్రన్సులో కూడా మంచి ర్యాంకు వచ్చుండేది అని బాధ పడ్డారు.
కాబట్టి చెప్పొచ్చే విషయం ఏమిటంటే ఎక్కువమంది మానసిక రుగ్మతలతో ఉంటూ ఇది రుగ్మత కాదు అనుకుని లేదా నేనింతే అనుకుని లేదా ఈ సమస్యకి చికిత్స లేదనుకుని అలా జీవితం వెళ్లదీస్తారు. కానీ ఈలోగా వాళ్ళ పొ��ెన్షియల్ పడిపోయి జీవితంలో చేరదగిన స్థాయికి చేరకపోవడం, వాళ్ళ బంధాల్లో ఉండాల్సిన సంతృప్తి ఉండకపోవడం వెరసి సగం సగం జీవితం గడుపుతూ ఉంటారు.
ఆయన దగ్గర ఫీజు తీసుకోలేదు. కానీ ఆ మొత్తం వైద్యం నా ఫీజు, మందులతో సహా కలిపి ఐదొందల రూపాయలు అవుతుంది. కాబట్టి మనకి ఉండే బాధకి దానికయ్యే ఖర్చుకి పొంతనే ఉండదు. ఇక మీ ఇష్టం.
చిన్న హారర్ కథ.
అలవాటు లేని వ్యాయామం గట్టిగా మూడు గంటలు చేయడం వలన కండరాలు దెబ్బ తిన్నాయి. దీనినే రాబ్డో మయోలైసిస్ అంటారు.
దెబ్బ తిన్న కండరాలు మయోగ్లోబ��న్ ని రక్తం లోకి విడుదల చేశాయి. ఆ దెబ్బ తిన్న కండరాల వలన నొప్పి వచ్చింది. ఆ మాయోగ్లోబిన్ మూత్రంలో పోవడం వలన అతని మూత్రం ముదురురంగులోకి మారింది.
అలాగే కండరాల్లో ఎక్కువ పొటాషియం ఉంటుంది. ఆ కండరాల్లోకి పొటాషియం కూడా మయోగ్లోబిన్ లాగా రక్తం లోకి వచ్చేసి పొటాషియం స్థాయిలు పెరిగి, గుండెలో విద్యుత్ ప్రవాహం ఆగిపోయి/తగ్గిపోయి గుండె ఆగిపోతుంది. నిద్రలోనే శాశ్వతనిద్రకి వెళ్ళిపోయాడు అతన���.
ఈమె మా అక్క.. ఓర్సు వినోద. వయస్సు: 37 సం.
పెళ్ళైన ఇరవై ఏళ్ళ నాటి నుంచి వరకట్న వేధింపులే. భర్త రమేష్‌తో పాటు అత్తా మామల చేతుల్లో ఎన్నోసార్లు దెబ్బలు కూడా తిన్నది. పెద్ద మనుషుల సమక్షంలో ఎన్నిసార్లు మాట్లాడి పంపినా లాభం లేకపోయింది. మూడేళ్ళ క్రితం వరకు ఆమె దగ్గర కనీసం ఫోన్ కూడా ఉండనివ్వలేదు. భర్త, పిల్లలతోనే కలిసి ఉన్నపటికీ వేరుగా ఒక రూమ్‌లో ఉంటూ ఇరవై ఏళ్ళుగా టైలరింగ్ చేసుకుంటూ నరకవేదన అనుభవించింది. ఎన్నోసార్లు ఆమె మీద హత్యాయత్నాలు జరిగినా తప్పించుకుంటూ వచ్చింది. జూన్ 10, 2025న గుడిమల్కాపూర్ పీఎస్‌లో కంప్లైంట్ కూడా ఇచ్చింది.
ఇటీవల అనేకసార్లు “నిన్ను చంపి, దాన్ని ఆక్సిడెంట్ లాగే చ���పిస్తా” అని అంటున్నాడని వినోద మాతో చెప్పుకుంది. అందుకు సంబంధించిన వీడియోలు మాకు పంపింది. మేము ఇంటికొచ్చెయ్యమని బతిమిలాడినా పిల్లల కోసం రానని చెప్తూ వచ్చింది. వాడు అన్నట్లుగానే మొన్న ఫిబ్రవరి 26న మోత్కూరులో జరిగిన ఒక ఫంక్షన్‌కి తీసుకొచ్చి.. అక్కడినుండి ఆమెను కార్లో కొడుతూ తీసుకెళ్ల��డు. మధ్యలో కారు దిగి మా అక్క పారిపోవడానికి ప్రయత్నించినా.. మళ్ళీ తనను కారులో బంధించి వేగంగా తీసుకెళ్ళి ఒక చెట్టుకు గుద్ది, ఎడమభుజం వైపు మొత్తం భాగం కోల్పోయేలా చేసి ఆమె చావుకు కారణమయ్యాడు.
అక్క యశోద హాస్పిటల్లో చివరగా మాట్లాడిన మాటలు ఇవి – “ముందు నుంచి చెబుతున్నట్టే వాడు నన్ను యాక్సిడెంట్ చేసి చంపడానికి ప్రయత్నించాడు. ఒకవేళ నేను ప్రాణాలతో బతికి బయటపడితే ఇక నేను వాడి దగ్గర ఉండను.”
మోత్కూరు పీ.ఎస్. (యాదాద్రి భువనగిరి జిల్లా)లో ఈ ఘటనకు సంబంధించి ఎఫ్.ఐ.ఆర్. (45/2026) నమోదు అయింది.
నా చేతిలో ఎన్ని సాక్ష్యాలు ఉన్నా, ఎంత తిరుగుతున్నా ఏమీ చేయలేకపోతున్నాను అనిపిస్తోంది. అక్కకి చనిపోయాక కూడా కనీస న్యాయం జరగట్లేదేమో అనిపిస్తోంది. దీన్ని ఎక్కువమందికి షేర్ చేసి పోలీసు అధికారులకు చేరేలా, వాళ్ళకు మా బాధ అర్థ��య్యేలా చూస్తారని కోరుకుంటున్నా.
Please support us in our fight for justice for Vinoda.
@SPyadadri @TelanganaPolice @SajjanarOffice @revanth_anumula @SCWTelangana
ఇది రీసెంట్ వీడియో. ఒక మనిషి ఒక విషయాన్ని అన్ని సార్లు ప్రస్థావిస్తున్నారు అంటే ఆ విషయం వెనుక ఎంతో ఆనందకరమైన విషయం లేదా బరించలేనంత బాధ అయినా ఉండి ఉండాలి. ఇక్కడ చాలా మంది భయాన్ని లోపల పెట్టుకొని arrogance తో బలుపు ప్రదర్శిస్తున్నారు. వారి అధినాయకుడు వారి సామాజిక వర్గాన్ని, వారి ఆస్థులని, వారి వ్యాపారాలని , రాజకీయ నాయకులని కాపాడటానికి ప్రయత్నిస్తా ఉంటే వీళ్ళు మాత్రం బాధ్యతా రహితంగా నోటి దూలతో ప్రత్యర్ధులకి ఎప్పటికపుడు అవకాశాలు ఇస్తానే ఉన్నారు. గత 5 ఏళ్ళలో ఎన్ని వ్యాపారాలు మూసుకుపోయాయో, ఎన్ని వ్యాపారాలు పక్క రాష్ట్రాలకి వెళ్ళిపోయాయో కనీస అవగాహన లేదు వీళ్ళకి.
You may call him a Firestorm.
You may call him a Hungry Cheetah.
But the Box Office has only one name for him - THE DESTRUCTOR 🔥🔥🔥
#BoxOfficeDestructorOG#OG#TheyCallHimOG
"ధైర్యం, నమ్మకం, సహనం ఉండాలి:
వెదు���ు మొక్క మొదటి ఐదు సంవత్సరాలు నేలలోనే వేర్లను బలంగా పెంచుకుంటుంది. కానీ ఆ తర్వాత 6 వారాల్లోనే ఆకాశాన్ని తాకేలా పెరుగుతుంది. జీవితంలో కూడా మన శ్రమ తక్షణ ఫలితాలు ఇవ్వకపోయినా, సరైన సమయంలో అది గొప్ప విజయంగా మారుతుంది. సహనం ఉంటే ఎదుగుదల ఉంటుంది ఖచ్చితంగా"