Happy father’s day nanna 🫂
I know you were proud of me always but i am sure you would be little more proud now..thank you for this life you gave me also for the ethical and moral values you taught me …Forever my HERO…Love you loads ❤️
#mydadmyhero
"ప్రతి వైసీపీ గుండా గాడికి ఆన్ కెమెరా చెప్తున్నా.. నా మాట చాలా శ్రద్ధగా వినండి!"
"మేము బయటకొస్తే కోసేస్తాం, కుత్తుకలు కోస్తాం అని పిచ్చి వేషాలు వేస్తే ఊరుకునేది లేదు. ఒకవేళ మీ ప్రభుత్వమే వస్తే భయపడిపోతామా? తొక్కి నార తీస్తా గుర్తుపెట్టుకోండి. ఇంకా మూడేళ్లు టైం ఉంది.. ఈ మూడేళ్లలో మీకు స్ట్రింజెంట్ యాక్షన్ చూపిస్తా!"
— పవన్ కల్యాణ్
#DeputyCMPawanKalyan #APLawAndOrder #PawanKalyanSpeech
తాడేపల్లిగూడెం జి.వి మాల్ సెంటర్ వద్ద 12 వ అంతర్జాతీయ యోగా దినోత్సవంలోనియోజకవర్గ కూటమి నాయకులు మరియు ప్రభుత్వ అధికారులతో కలిసి పాల్గొనడం జరిగింది.
@JanaSenaParty@JaiTDP@BJP4Andhra
*కాకినాడ మన ఊరు మాటా మంతి కార్యక్రమంలో శ్రీ పవన్ కళ్యాణ్ గారి ప్రసంగంలోని ముఖ్యాంశాలు*
•సమాజంలో నేరస్థులను కేవలం క్రిమినల్స్‌గా మాత్రమే చూడాలి. వారికి కులాలను అంటగట్టడం సరికాదు.
• ఆంధ్రప్రదేశ్ అభివృద్ది చెందాలంటే కులాల దరిద్రం వదిలిపోవాలి
• నేరం చేసిన వాళ్ళకి కులం ఏమిటి
•నేరచరిత్ర కలిగిన వ్యక్తులు పాలకులుగా మారడానికి వీల్లేదు. క్రిమినల్స్ పాలకులైతే ప్రజల భవిష్యత్తు మంటగలుస్తుంది.
• ఎమ్మెల్సీ అనంతబాబు కాపు కులానికి చెందిన వ్యక్తి. అతను డ్రైవర్‌ను దారుణంగా హత్య చేసి, మృతదేహాన్ని డోర్ డెలివరీ చేసినప్పుడు ఎవరికీ కులం గుర్తుకురాదు. ఇప్పుడు నేరస్థులపై చర్యలు తీసుకుంటుంటే మాత్రం గుర్తొస్తుంది.
• రాష్ట్రంలో శాంతిభద్రతల పరిరక్షణ విషయంలో కూటమి ప్రభుత్వం ఎట్టి పరిస్థితుల్లోనూ రాజీపడబోదు. సమాజంలో శాంతికి విఘాతం కలిగిస్తూ, తప్పులకు పాల్పడే వారి పట్ల ప్రభుత్వం అత్యంత కఠినంగా వ్యవహరిస్తుంది.
• కూటమి పాలనలో ఎవరైనా తప్పు చేసి దొరికితే, వారు తమ జీవితంలో మళ్లీ అలాంటి తప్పు చేయాలనే ఆలోచన కూడా చేయలేనంత తీవ్రంగా చర్యలు ఉంటాయి.
•తప్పు చేసే వాడికే కులం ఉంటుందా బాధితురాలుకి కులం ఉండదా.
• పాపం చిన్న వయసులో 23 నేరాలు చేశాడు,
పాపం పసి వయసులో బీరు బాటిల్ తీసుకుని గొంతు కోసేశాడు..తెలిసి తెలియని పసి వయసు అని సమర్థించే వ్యక్తులను ప్రోత్సహిస్తే రాష్ట్ర భవిష్యత్తు అగమ్యగోచరం అవుతుంది.
• ఇదే పెద్దమనిషి తెలంగాణ ప్రభుత్వం దిశ కేసులో చేస్తే అద్భుతంగా చేశారని అంటారు. ఏపీకి వచ్చేసరికి కులం పేరు ఎత్తుతాడు.
• వైసీపీ రౌడీ మూకలకి చెబుతున్నా పిచ్చి వేషాలు వేస్తే క్షమించే పరిస్థితి ఇక్కడ లేదు. పొరపాటున మీ ప్రభుత్వం వచ్చినా సరే తొక్కి నారతీస్తా.
•గతంలో వైసీపీకి సంబంధించిన మూలాలు ఉన్న పోలీసులపై ప్రత్యేకంగా దృష్టి పెడతా. ఒక స్టేషన్ ఎస్సై స్థాయిలో జరగాల్సిన న్యాయం ఎస్పీ డిప్యూటీ సీఎం వరకు రావడం వ్యవస్థలో లోపాలకు అద్దం పడుతోంది.
•తప్పు చేసిన వాడికి, నేరాలకు పాల్పడేవారికి ఎలాంటి కులం, మతం ఉండవు.
• సమాజంలో శాంతిభద్రతలకు విఘాతం కలిగించే అటువంటి నీచమైన శక్తులను ఏ ఒక్కరూ సమర్థించకూడదు. వెనకేసుకు రాకూడదు.
• క్రిమినల్ గ్యాంగ్‌ల సహాయంతో ప్రభుత్వాలను నడపాలని చూడటం, ప్రజలను భయబ్రాంతులకు గురిచేసి అధికారులను తమ గుప్పెట్లో పెట్టుకోవాలని ప్రయత్నించడం ప్రజాస్వామ్య వ్యవస్థకు అత్యంత ప్రమాదకరం.
•నేరపూరిత నేపథ్యం ఉన్న వ్యక్తులు రాజ్యాంగబద్ధమైన ఉన్నత పదవులను అధిష్టించి, ప్రజల జీవితాలను శాసించాలని చూడటం ప్రజాస్వామ్య స్ఫూర్తికే గొడ్డలిపెట్టు. అటువంటి శక్తులపై నిరంతరం తిరగబడటానికి, న్యాయం కోసం పోరాడటానికి సిద్ధంగా ఉంటాం. క్రిమినల్స్ అధికారంలోకి వస్తే మన భవిష్యత్తు మంటగలుస్తుంది.
•కాకినాడలోని చిన్నస్వామి నగర్ లో గతంలో ప్రభుత్వం 63 మందికి ఇళ్లపట్టాలు ఇచ్చింది. అందులో వింతతువులు, దివ్యాంగులు, క్యాన్సర్ బాధితుల పట్టాలను వైసీపీ ఎమ్మెల్యే అనుచరుడు తీసుకొని వేరే పేరు మీదకు మార్చేశారు. మార్వాడి కుటుంబానికి చెందిన ఆస్తులను ఆక్రమించుకున్నారు. వాళ్లు వైసీసీ వాళ్ల టార్చర్ తట్టుకోలేక కాకినాడ వదిలేసి వెళ్లిపోయారు. సివిల్ సొసైటి బలంగా ఉంటే ఇలాంటి క్రిమినల్ రాజ్యాలు ఏలవు. పూర్తిగా భవిష్యత్తు మీ చేతులో ఉంది.
• గతంలో కోనసీమలో జరిగింది. రికరింగ్ పేట్రన్, రిపీటెడ్ బిహేవియర్. పోలీసులకు నేను చెప్పేది ఒకటే. ఎవరైనా ప్రజల ప్రాథమిక హక్కులకు భంగం కలిగిస్తే ... ఊరుకోవద్దు. వాళ్లు భవిష్యత్తులో వస్తారేమోనన్న భయం వద్దు. దేనికంటే క్రిమినల్స్ ను మేము ప్రోత్సహించం.
• సామాజిక మాధ్యమాల్లో భిన్నమైన అభిప్రాయాలు వ్యక్తం చేసిన వారిపై బెదిరింపులకు పాల్పడితే కచ్చితంగా చట్టపరమైన చర్యలు ఉంటాయి. ఇళ్లల్లోకి వస్తామని, ఆడబిడ్డలను వేధిస్తామని బెదిరించే వారిని వదిలిపెట్టేది లేదు.
• మహిళలను, ఆడబిడ్డలను లక్ష్యంగా చేసుకుని వేధింపులకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవు. సామాజిక మాధ్యమాల్లో భావప్రకటన స్వేచ్ఛను గౌరవించాలని, పరిధి దాటి ప్రవర్తిస్తే చట్టం తన పని తాను చేసుకుపోతుందని స్పష్టం చేశారు
•గతంలో కోనసీమలో జరిగిన ఘటనలు పునరావృతమయ్యే నేరపూరిత ప్రవర్తనను ఎట్టిపరిస్థితుల్లోనూ సహించేది లేదు. పౌరుల ప్రాథమిక హక్కులకు భంగం కలిగిస్తే పోలీసులు తక్షణమే కఠిన చర్యలు తీసుకోవాలి.
@APDeputyCMO@PawanKalyan@NagaBabuOffl@itsRamTalluri@mnadendla@JanaSenaParty@JSPShatagniTeam@JSPVeeraMahila
వైసీపీ చెంచా కాపులు బేటీ…
జగన్ చెంచాగిరి వల్ల జనం ఊర్లలోకి రానివ్వట్లేదు అని ఆవేదన…
విజయవాడ మర్డర్ అంశంలో ఒక క్రిమినల్ కి కులం పేరు చెప్పి జగన్ రాజకీయం చేసి కులంలో మొత్తం చులకన అయిపోఏలా చేసాడు,అని ఇంట్లో ఆడవాళ్ళు తిడుతున్నారు అంటూ బాధపడ్డ నాయకులు…
జగన్ కూడా ఉంటే మొత్తం మునిగిపోతాం కాబట్టి జగన్‌ని కేవలం సలహాదారుడిగా పరిమితం చేసి కాపుని ముఖ్యమంత్రి చెయ్యాలని ఏకగ్రీవ తీర్మానం ..
గాదె సాయికృష్ణ అదృశ్యం కేసులో నిష్పక్షపాత విచారణ జరుగుతుంది, బాధ్యులు ఎంతటి వారైనా కఠిన చర్యలు తప్పవు
- ఎన్టీఆర్ జిల్లా జనసేన పార్టీ అధ్యక్షులు శ్రీ సామినేని ఉదయభాను గారు.
గౌరవ ప్రధాని నరేంద్ర మోదీ గారి ‘అమృత్ భారత్’ పథకం కింద దాదాపు రూ.70 కోట్ల కేంద్ర నిధులతో తాడేపల్లిగూడెం రైల్వే స్టేషన్ ఆధునికీకరణ పనులను, నరసాపురం
పార్లమెంట్ సభ్యులు శ్రీ భూపతిరాజు శ్రీనివాస్ వర్మ మరియు రైల్వే ఉన్నతాధికారులతో కలిసి క్షేత్రస్థాయిలో పరిశీలించాను.
ప్రత్తిపాడు, నవాబ్ పాలెం, అరుళ్ల వద్ద 3 కొత్త ROBల నిర్మాణాలను వేగవంతం చేయాలని అధికారులకు సూచించాను.
@JanaSenaParty@JaiTDP@BJP4Andhra
ఉప్పాడ గ్రామంలో ప్రమాదవశాత్తు బోట్లు కోల్పోయిన /పాడైపోయిన మత్స్యకారులకు నష్టపరిహారం అందిస్తున్న ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారు 🙏
@PawanKalyan@APDeputyCMO#ManaOoruMataManthi
తొలి విడత 'అన్నదాత సుఖీభవ – పీఎం కిసాన్' నిధులు విడుదల
కాకినాడ జిల్లా రైతుల ఖాతాల్లోకి జమ చేసిన ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారు
@PawanKalyan@APDeputyCMO
మాది రౌడీలు, గూండాలను వెనకేసుకొచ్చే ప్రభుత్వం కాదు
•అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడే వారి పట్ల కఠినంగా ఉంటాం
•నాయకులకి ఫ్లెక్సీల ఏర్పాటు మీద కంటే పని మీద శ్రద్ధ ఉండాలి
•విద్యార్ధుల ఆలోచనలు, ఆవిష్కరణలు వెలుగులోకి తెచ్చే వేధిక అవసరం
•కాకినాడలో మన ఊరు.. మాటా మంతి కార్యక్రమంలో ప్రజల నుంచి నేరుగా సమస్యలు తెలుసుకున్న రాష్ట్ర ఉపముఖ్యమంత్రివర్యులు శ్రీ @PawanKalyan గారు
‘ఇది కూటమి ప్రభుత్వం. రౌడీలు గూండాలను వెనకేసుకొచ్చే ప్రభుత్వం కాదు. అసాంఘిక కార్యకలాపాలకు ఎవరు పాల్పడినా చర్యలు కఠినంగా ఉంటాయి. 21 ఏళ్ల కసబ్ పాకిస్థాన్ నుంచి వచ్చి ఎంతో మంది ప్రాణాలు తీసేశాడు. వయసు చిన్నది పోనీలే పాపం అనుకోవడానికి వీల్లేదు. యువత బాధ్యతగా వ్యవహరించాలి. మీరు బలంగా ఉంటేనే సమాజంలో నేరాల సంఖ్య తగ్గుతుంద’ని రాష్ట్ర ఉపముఖ్యమంత్రివర్యులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు స్పష్టం చేశారు. కూటమి ప్రభుత్వం శాంతిభద్రతల నిర్వహణను అమలు చేస్తుందని తెలిపారు. శనివారం సాయంత్రం కాకినాడలో నిర్వహించిన మన ఊరు.. మాటా మంతి కార్యక్రమంలో శ్రీ పవన్ కళ్యాణ్ గారు పాల్గొన్నారు. ప్రజల సమస్యలు నేరుగా విన్నారు.
కాకినాడ బాలాజీ చెరువు ప్రాంతానికి చెందిన శ్రీ గంజాల అరవింద్ బాబు అనే వ్యక్తి కాకినాడ పట్టణంలో మితిమీరిన వేగంతో వాహనాలు నడుపుతూ ఇబ్బందిపెడుతున్న ఆకతాయిల వ్యవహారంపై ఫిర్యాదు చేయగా, ఆ అంశంపై స్పందించారు. కనస్ట్రక్షన్ కంపెనీ చేతిలో మోసపోయిన శ్రీమతి భవానీ అనే మహిళ, కాకినాడ సర్వజన ఆసుపత్రి బస్ షెల్టర్ వద్ద ఆక్రమణలపై శ్రీ మహ్మద్ అన్సర్ అనే వ్యక్తి, కళాశాలల్లో గంజాయి, మత్తుపదార్థాల అక్రమ రవాణా, విక్రయాలపై శ్రీనివాస్ అనే ఇంజినీరింగ్ విద్యార్థి, కాకినాడ నగరంలో అనధికారికంగా పెద్ద ఎత్తున ఏర్పాటు చేస్తున్న ఫ్లెక్సీల వల్ల ఇబ్బందులను శ్రీ ఎం. హరీష్ బాబు ఉపముఖ్యమంత్రివర్యుల దృష్టికి తీసుకువచ్చారు.
పిఠాపురం పట్టణంలోని ప్రముఖ పుణ్యక్షేత్రమైన శ్రీ పాదగయ సెంటర్ వద్ద ట్రాఫిక్ సమస్యకు పరిష్కారం చూపాలని శ్రీ యనమండ్ర సూర్యనారాయణ ఫిర్యాదు చేశారు. ప్రతిరోజూ వేలాది మంది భక్తులు, వాహనాలతో ఈ ప్రాంతం అత్యంత రద్దీగా మారుతోంది. దీనివల్ల అత్యవసర సేవల వాహనాలు, అంబులెన్స్ లు సైతం గంటల తరబడి నిలిచిపోతున్నాయి. అత్యంత కీలకమైన ఈ కూడలిలో శాశ్వతంగా ఒక ట్రాఫిక్ సమస్యను పరిష్కరించాలని కోరారు.
కాకినాడ కార్పోరేషన్ లో గత ప్రభుత్వ హయాంలో పనులు చేసి బిల్లులు రాక ఇబ్బందులుపడుతున్న కాంట్రాక్టర్లు,ప్రత్యేక క్లినిక్స్, టాయిలెట్స్ ఏర్పాటు చేయాలని జాహ్నవి అనే ట్రాన్స్ జెండర్, గత ప్రభుత్వ హయాంలో జరిగిన రీసర్వేలో 45 సెంట్ల భూమిని కోల్పోయానిని కిర్లంపూడి మండలానికి చెందిన శ్రీ కాకిలేటి వీర్రాజు అనే వ్యక్తి తమ సమస్యలను శ్రీ పవన్ కళ్యాణ్ గారి దృష్టికి తీసుకువచ్చారు. నూతన ఆవిష్కరణలకు ప్రోత్సాహం కల్పించడంతోపాటు చదువు పూర్తయ్యాక రాష్ట్రంలోనే ఉద్యోగం కోసం ఇతర రాష్ట్రాలకు వలస వెళ్లే దుస్థితి రాకుండా చూడాలని పలువురు విద్యార్ధులు విన్నవించారు.
ఈ సందర్భంగా శ్రీ పవన్ కళ్యాణ్ గారు మాట్లాడుతూ.. ‘రాష్ట్రంలో రాజకీయ నాయకులు ఫ్లెక్సీలు పెట్టేందుకు ఒకరి మీద ఒకరు పోటీపడుతున్నారు. ఆ శ్రద్ధ ఏదో పనిలో చూపిస్తే బాగుంటుంది. విచ్చలవిడిగా ఫ్లెక్సీలు వేసి ప్రజల్ని ఎంత ఇబ్బంది పెడుతున్నామో అర్ధం కావడం లేదు. ఫ్లెక్సీల ఏర్పాటుపై వ్యవస్థల నియంత్రణ ఉండాలి. నిర్ణీత ప్రాంతాల్లో మాత్రమే వేసేలా చర్యలు తీసుకోవాలి. ప్రజలు కూడా ఇష్టారాజ్యంగా ఫ్లెక్సీలు పెట్టే రాజకీయ పార్టీలకు వచ్చే ఎన్నికల్లో ఓట్లు వేయమని చెప్పాలి. పాఠశాలల్లో ఆర్టీఈ యాక్ట్ అమలులో ఉన్న లోపాలపై మంత్రివర్గ సమావేశంలో చర్చిస్తాం. విద్యా సంస్థలతో ఏమైనా సమస్యలు ఉంటే రెండు రోజుల్లో కలెక్టర్ గారికి ఫిర్యాదుల రూపంలో అందజేయండి. విద్యార్థుల ఆలోచనలు, ఆవిష్కరణలను వెలుగులోకి తెచ్చే విధంగా పార్లమెంటు సభ్యులంతా కలసి ఓ ప్రత్యేక వేదిక ఏర్పాటు చేయాల’ని సూచించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర మంత్రులు శ్రీ నాదెండ్ల మనోహర్ గారు, శ్రీ కందుల దుర్గేష్ గారు, కూటమి పార్టీలకు చెందిన ఎంపీలు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, కాకినాడ కలెక్టర్ శ్రీ ఎం.ఎన్. హరీంధ్రప్రసాద్ గారు, ఎస్పీ శ్రీ జి.బిందు మాధవ్ గారు, ఇతర జిల్లా అధికారులు పాల్గొన్నారు. (1/4)
మీకు చేతులెత్తి నమస్కరిస్తున్నా.. నన్ను దయచేసి కులానికి పరిమితం చేయకండి!
"ఎవడో క్రిమినల్ తప్పు చేస్తే దానికి నేను బాధ్యత వహించాలా? 14 ఏళ్ల ఆడబిడ్డను రేప్ చేసినవాడిని నేను వెనకేసుకు రావాలా?! ఇలాంటి వాళ్ళను వెనకేసుకు రావడానికి సిగ్గుండక్కర్లే.
— ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్
#PawanKalyan #AndhraPradesh #NoToCastePolitics #Janasena
#Sujeeth to Meet #PawanKalyan Today for Key Discussions😳
Sujeeth is expected to meet Pawan Kalyan today to officially begin discussions on #OG2. The director has reportedly completed a draft of the script and may soon narrate it to the star.
OG 2 may take some time to begin with Pawan Kalyan busy with political commitments & Sujeeth set to complete #BloodyRomeo first.
పాయకరావుపేట నియోజకవర్గం, నక్కపల్లి మండల పరిధిలోని బోయపాడు గ్రామ తీర ప్రాంతంలో చేపలు మృతి చెందినట్టు వచ్చిన సమాచారంపై రాష్ట్ర ఉప ముఖ్యమంత్రివర్యులు శ్రీ @PawanKalyan గారు విచారణకు ఆదేశించారు. ఈ వ్యవహారంపై విచారణ చేపట్టి సమగ్ర నివేదిక సమర్పించాలని ఆంధ్రప్రదేశ్ కాలుష్య నియంత్రణ మండలి మెంబర్ సెక్రటరీకి స్పష్టం చేశారు.
చేపల మృతికి గల కచ్చితమైన కారణాలను అన్వేషించేందుకు శాస్త్రీయ పరిశోధనలు చేపట్టాలని ఆంధ్రప్రదేశ్ కాలుష్య నియంత్రణ మండలి అధికారులు, మత్స్యశాఖ అధికారులు, మెరైన్ సైంటిస్టులకు తెలిపారు. చేపల మృతికి దారి తీసిన మూల కారణాలను నిపుణులతో క్షుణ్ణంగా అధ్యయనం చేయించి పరిశీలించాలన్నారు.
చేపలు మృతి చెందిన ప్రాంతంలో నీటి నమూనాలు, మృతి చెందిన చేపల శాంపిల్స్ సేకరించి ఇప్పటికే పరీక్షల నిమిత్తం పంపారు. కేంద్ర సముద్ర మత్స్య పరిశోధనా సంస్థ(CMFRI)తోపాటు ప్రముఖ శాస్త్రీయ సంస్థల నిపుణుల అభిప్రాయాలను తీసుకుంటున్నారు. సంబంధిత శాఖలన్నీ పరస్పర సమన్వయంతో దర్యాప్తును వేగవంతంగా పూక్తి చేయాలని ఉప ముఖ్యమంత్రివర్యులు దిశానిర్దేశం చేశారు.
సముద్ర జీవ వైవిధ్యం, పర్యావరణ సమతుల్య పరిరక్షణ, మత్స్యకారుల జీవనోపాధుల సంరక్షణకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత అంశాలుగా ముందుకు తీసుకువెళ్తుందని తెలిపారు. బోయపాడు తీరంలో పరిస్థితిని ప్రభుత్వం నిరంతరం పర్యవేక్షిస్తుందని, శాస్త్రీయ నివేదికలు అందిన వెంటనే తగిన చర్యలు తీసుకుంటామని చెప్పారు.
@AndhraPradeshCM@PIB_India@IPR_AP@pibvijayawada
థాంక్యూ గురూజీ.🙏
మీ ప్రేమ, ఆప్యాయత, ఆశీస్సులకు హృదయపూర్వక ధన్యవాదాలు. మీరు నిండు నూరేళ్లు ఆరోగ్యంగా, ఆనందంగా, చల్లగా ఉండాలని, ఆ తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆశీస్సులు మీకు ఎల్లప్పుడూ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.
మీరు మరెందరో జీవితాల్లో వెలుగులు నింపుతూ, మంచి పేరు ప్రతిష్ఠలు సంపాదిస్తూ, సుఖసంతోషాలతో ముందుకు సాగాలని మనసారా ప్రార్థిస్తున్నాను.
మరొక్కసారి థాంక్యూ గురూజీ. 🙏💐
మీ ప్రేమాభిమానాలకు ఎప్పటికీ రుణపడి ఉంటాను.
మత్స్యకారుల ఆర్థిక ప్రగతికి బలమైన అడుగులు
•100 రోజుల ప్రణాళికతో ఉప్పాడ మత్స్యకారుల జీవితాల్లో వెలుగులు
•అమీనాబాద్ హార్బర్ బాధితులకు చెక్కుల పంపిణీ
•రూ. 10 కోట్లకు పైగా నిధులతో సబ్సిడీ యంత్రపరికరాలు, ప్రత్యామ్నాయ ఆదాయ మార్గాల సృష్టికి చర్యలు
•సీఎస్ఆర్ నిధులతో అంగన్ వాడీల బలోపేతం
•కాకినాడలో మన ఊరు మాట-మంతి కార్యక్రమంలో ఉప ముఖ్యమంత్రి శ్రీ @pawankalyan గారు
కాకినాడ వేదికగా రాష్ట్ర ఉప ముఖ్యమంత్రివర్యులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు ఉప్పాడ తీర ప్రాంత మత్స్యకారుల ఆర్థిక ప్రగతికి బాటలు వేసే దిశగా బలమైన అడుగులు వేశారు. ఇచ్చిన మాట మేరకు అలల తీవ్రత కారణంగా జరిగిన నష్టానికి పరిహారం అందించారు. రూ. 10 కోట్లకు పైగా నిధులు వెచ్చించి సబ్సిడీలో యంత్రపరికరాలు, ప్రత్యామ్నాయ ఆదాయ మార్గాల సృష్టికి చర్యలు చేపట్టారు. శ్రీ పవన్ కళ్యాణ్ గారు గతంలో ఉప్పాడ తీర ప్రాంత మత్స్యకారులకు ఇచ్చిన మాట మేరకు 100 రోజుల ప్రణాళిక కార్యరూపం దాల్చింది. ఇప్పటికే తమిళనాడు, కేరళం రాష్ట్రాల్లో ప్రత్యామ్నాయ ఉపాధి మార్గాలపై శిక్షణ ఇప్పించిన ఉప ముఖ్యమంత్రివర్యులు, శనివారం రాత్రి కాకినాడలో నిర్వహించిన మన ఊరు మాటా - మంతి కార్యక్రమంలో మొదటి అడుగుగా అమీనాబాద్ హార్బర్ డిజైన్ లోపంతో దెబ్బతిన్న సుమారు 29 బోట్లకు పరిహారాన్ని చెక్కుల రూపంలో మత్స్యకారులకి అందించారు. హార్బర్ డిజైన్ లోపాలను సవరించేందుకు మరో రూ. 80 కోట్లు మంజూరుకు ప్రణాళికలు రూపొందిస్తున్నట్టు ప్రకటించారు. ఒకేసారి పరిహారం, సంక్షేమం అందడం, కోత నివారణ చర్యలకు ఉపక్రమించడం పట్ల ఉప్పాడ తీర ప్రాంత మత్స్యకారులు హర్షాతిరేకాలు వ్యక్తం చేస్తున్నారు. *రూ.80 కోట్లతో అమీనాబాద్ ఫిషింగ్ హార్బర్ పనులు*
డిజైన్ లోపాల కారణంగా అమీనాబాద్ ఫిషింగ్ హార్బర్లో అలల తాకిడికి 16 పడవలు పూర్తిగా, 13 పడవలు పాక్షికంగా దెబ్బతిన్నాయి. బాధితులకు తక్షణ ఉపశమనం కలిగిస్తూ మొత్తం 29 పడవలకు గానూ రూ.75,52,800 ఆర్థిక సాయాన్ని చెక్కుల రూపంలో పంపిణీ చేశారు. ఇటీవల జరిగిన ప్రమాదంలో అలాగే హార్బర్ డిజైన్ లోపాలను శాశ్వతంగా సరిచేసేందుకు అదనంగా మరో రూ.80 కోట్లు మంజూరు చేశారు. ఈ నిధులతో హార్బర్‌ను పూర్తిగా పునర్నిర్మించి, భవిష్యత్తులో ఇలాంటి ప్రమాదాలు జరగకుండా మత్స్యకారులకు రక్షణ కల్పించనున్నారు.
*అధునాతన బోటు ఇంజన్లు పంపిణీ*
ప్రధాన మంత్రి మత్స్య సంపద యోజన పథకం కింద యు.కొత్తపల్లి మండలానికి చెందిన వంద మంది మత్స్యకారులకు అధునాతన బోటు ఇంజన్లను పంపిణీ చేశారు. మత్స్యకారుల జీవనోపాధిని మెరుగుపరచడమే ధ్యేయంగా రూ.1.42 కోట్ల విలువైన 10 హెచ్.పి. 20 హెచ్.పి. ఇంజన్లను అందించారు. మత్స్యకారులపై ఎలాంటి అదనపు ఆర్థిక భారం పడకుండా ఈ ఇంజన్లను సమకూర్చారు. ఒక్కో ఇంజన్ ధరపై 40 శాతం రాష్ట్ర ప్రభుత్వ సబ్సిడీ, 10 శాతం లబ్ధిదారుని వాటాగా నిర్ణయించారు. లబ్ధిదారులు చెల్లించాల్సిన మిగిలిన 50 శాతం నిధులను పిఠాపురం నియోజకవర్గం నిధుల నుండి చెల్లించాలని అధికారులకు శ్రీ పవన్ కళ్యాణ్ గారు ఆదేశించారు.
రూ.9.05 కోట్లతో ప్రత్యామ్నాయ ఉపాధి మార్గాలు
కార్పొరేట్ సామాజిక బాధ్యత కింద ఉప్పాడ మత్స్యకారులకు ప్రత్యామ్నాయ జీవనోపాధి కోసం ప్రముఖ ఫార్మా సంస్థలు రూ.9.05 కోట్లకు పైగా భారీ ఆర్థిక సాయాన్ని ప్రకటించాయి. ఈ నిధులతో యు.కొత్తపల్లి మండలంలోని మత్స్యకార కుటుంబాలకు, ముఖ్యంగా మహిళా స్వయం సహాయక సంఘాలకు కొత్త ఆదాయ మార్గాలు చూపనున్నారు. దివీస్ ల్యాబొరేటరీస్ రూ.4.50 కోట్లు, అరబిందో ఫార్మా కంపెనీలు రూ. 4.55 కోట్లు అందించాయి. ఈ నిధులతో సముద్రపు నాచు సాగు, సీవీడ్ ప్రాసెసింగ్ యూనిట్లు, సముద్రంలో కృత్రిమ రీఫ్‌లు, చేప పిల్లల నర్సరీలను ఏర్పాటు చేస్తారు. దీనివల్ల దాదాపు 500 మందికి ప్రత్యక్షంగా, మరో 2000 మందికి పరోక్షంగా ఉపాధి దొరకనుంది. మాటా మంతి సందర్భంగా శ్రీ పవన్ కళ్యాణ్ గారి సమక్షంలో ఆయా సంస్థల ప్రతినిధులు తమ సహాయాన్ని అందజేశారు.
రూ. 2 కోట్లతో 50 అంగన్వాడీ కేంద్రాల అభివృద్ధి
డియాజియో గ్రూప్ — టార్క్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో యు.కొత్తపల్లి మండలంలోని 50 అంగన్వాడీ కేంద్రాలను మోడల్ కేంద్రాలుగా అభివృద్ధి చేయనున్నారు. ఇందుకోసం సుమారు రెండు కోట్ల రూపాయల నిధులను కేటాయించారు. శ్రీ పవన్ కళ్యాణ్ గారి సమక్షంలో ఈ మేరకు జిల్లా కలెక్టర్‌తో సంస్థ ప్రతినిధులు అవగాహనా ఒప్పందం కుదుర్చుకున్నారు. రెండేళ్లపాటు సాగే ఈ ప్రత్యేక కార్యక్రమం ద్వారా అంగన్వాడీ కేంద్రాల్లోని చిన్నారులకు మెరుగైన పౌష్టికాహారం, నాణ్యమైన విద్య, ఆరోగ్య సదుపాయాలను అందించనున్నారు. దీనికంటే ముందే నియోజకవర్గంలోని మరో 110 అంగన్వాడీ కేంద్రాల అభివృద్ధి కోసం జిల్లా కలెక్టర్ తో అపోలో సంస్థ ఎంఓయూ చేసుకుంది. దీని ద్వారా నియోజకవర్గంలోని అంగన్వాడీ కేంద్రాల రూపురేఖలు పూర్తిగా మారనున్నాయి.
#ManaOoruMataManthi
"మేకప్ వేసుకున్నావ్, పౌడర్ రాసుకున్నావ్ అంటూ ఒక హోం మంత్రిని ఉద్దేశించి మాట్లాడుతారా? రేపు ఇదే ప్రేరణతో కాలేజీల్లో అమ్మాయిలను కూడా ఇలాగే కామెంట్ చేస్తే పరిస్థితి ఏంటి? దీని పర్యవసానాలు చాలా దారుణంగా ఉంటాయి.
కూటమి ప్రభుత్వంలో లా అండ్ ఆర్డర్ నా చేతుల్లో లేదు. వ్యవస్థలు బలోపేతం కావాలని, అందరికీ న్యాయం జరగాలని నేను భావిస్తుంటే.. కొందరు మాత్రం ప్రతి విషయాన్ని కులంతో ముడిపెట్టి నన్ను బంధించాలని చూస్తున్నారు. కానీ నన్ను ఎవరూ బంధించలేరు.
— ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్
#PawanKalyan #VangalapudiAnitha #AndhraPradesh #Janasena