శక్తి డిపార్టుమెంట్‌పై నిర్వహించిన సమీక్ష సమావేశంలో ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారు, సంబంధిత శాఖల ఉన్నతాధికారులతో కలిసి పాల్గొన్నాను.
ఈ సందర్భంగా యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీలో అత్యాధునిక రీసెర్చ్ సెంటర్‌ను ఏర్పాటు చేయడంతో పాటు, ప్రభుత్వ ఇంజనీరింగ్ కళాశాలల విద్యార్థులకు పరిశ్రమల్లో ఇంటర్న్‌షిప్ అవకాశాలు కల్పించాలని సూచించాను. అలాగే, ఏటీసీల్లో ఈవీ సర్వీసింగ్, డ్రోన్ టెక్నాలజీ వంటి భవిష్యత్ అవసరాలకు అనుగుణమైన కోర్సులను ప్రవేశపెట్టాలని ప్రతిపాదించాను.
TOMCOMను మరింత బలోపేతం చేసి, విదేశీ భాషల శిక్షణ నుంచి పాస్‌పోర్టు సదుపాయాలు, విదేశీ కంపెనీల్లో ఉద్యోగ అవకాశాల వరకు యువతకు సమగ్ర సహాయాన్ని అందించే వ్యవస్థగా తీర్చిదిద్దాలని సూచించాను.
పరిశ్రమల అవసరాలకు అనుగుణంగా నర్సింగ్ కళాశాలలకు అనుమతులు మంజూరు చేస్తూ, నైపుణ్యాభివృద్ధి ద్వారా తెలంగాణ యువతను ప్రపంచ ఉద్యోగ విపణికి సిద్ధం చేసే దిశగా ప్రభుత్వం కృషి చేస్తోందని పేర్కొన్నాను.
తెలంగాణ యువతకు ప్రపంచ స్థాయి ఉపాధి అవకాశాలు కల్పించే దిశగా స్కిల్ ఎకోసిస్టమ్‌ను మరింత బలోపేతం చేయడమే మా ప్రభుత్వ లక్ష్యం.
@revanth_anumula@TelanganaCMO@INCTelangana
TGSPDCL Enhanced Ex-gratia amount from Rs.5.00 Lakhs to Rs.8.00 Lakhs payable in a Fatal Accident resulting in death of a Non- Departmental persons owing to electrocution, with effect from 01.04.2026 onwards - Amendment - Orders - Issued
Komatireddy Venkat Reddy: ₹2,278.14 Crore Adilabad Joint User Airfield Gets Green Signal, Set to Transform North Telangana
ఉత్తర తెలంగాణకు గేమ్‌చేంజర్.. రూ.2,278.14 కోట్లతో ఆదిలాబాద్ జాయింట్ యూజర్ ఎయిర్‌ఫీల్డ్‌కు గ్రీన్ సిగ్నల్ - మంత్రి కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి
🔹2,009.23 ఎకరాల్లో ఎయిర్‌ఫీల్డ్, సివిల్ ఏవియేషన్, కార్గో, ఎంఆర్ఓ సదుపాయాల ఏర్పాటు
🔹ఉత్తర తెలంగాణలో పారిశ్రామిక, పర్యాటక, కార్గో, రక్షణ రంగాలకు భారీ ఊతం
🔹వేలాది మంది యువతకు ప్రత్యక్ష, పరోక్ష ఉపాధి అవకాశాలు
🔹2026 డిసెంబర్ 31 నాటికి భూసేకరణ, మౌలిక వసతుల మార్పిడి పనులు పూర్తి చేయాలని ఆదేశాలు
🔹సీఎం రేవంత్ రెడ్డి ప్రత్యేక చొరవతో ఉత్తర తెలంగాణ అభివృద్ధిలో మరో చారిత్రక అడుగు: ఆర్ అండ్ బి శాఖమంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి
ఉత్తర తెలంగాణ అభివృద్ధికి మరో కీలక అడుగు పడిందని రాష్ట్ర రోడ్లు భవనాలు,సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి తెలిపారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో రాష్ట్ర ప్రభుత్వం ఆదిలాబాద్‌లో ప్రతిష్ఠాత్మక జాయింట్ యూజర్ ఎయిర్‌ఫీల్డ్ ఏర్పాటుకు రూ.2,278.14 కోట్ల పరిపాలనా అనుమతి మంజూరు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసిందన్నారు.
ఈ ప్రాజెక్టు కోసం మొత్తం 2,009.23 ఎకరాల భూమిని సేకరించనున్నట్లు మంత్రి వెల్లడించారు. ఇందులో 1,609.23 ఎకరాలు భారత వైమానిక దళం (IAF) అవసరాల కోసం, 400 ఎకరాలు సివిల్ ఏవియేషన్ ఎన్క్లేవ్, ఎంఆర్ఓ (MRO), కార్గో టెర్మినల్, హ్యాంగర్లు, భవిష్యత్ విస్తరణ అవసరాల కోసం కేటాయించనున్నట్లు తెలిపారు.
భూసేకరణతో పాటు ఇప్పటికే ఉన్న రహదారుల మళ్లింపు, 765 కేవీ హైటెన్షన్ విద్యుత్ లైన్ల తరలింపు, వాగుల మళ్లింపు, మిషన్ భగీరథ తాగునీటి పైప్లైన్ల మార్పు, విద్యుత్ స్తంభాల తొలగింపు వంటి అన్ని అనుబంధ పనులకు అవసరమైన నిధులను కూడా ఈ పరిపాలనా అనుమతిలో భాగంగా కేటాయించినట్లు మంత్రి వివరించారు.
ఆదిలాబాద్ జాయింట్ యూజర్ ఎయిర్‌ఫీల్డ్ రాష్ట్రానికి వ్యూహాత్మకంగా అత్యంత కీలకమైన ప్రాజెక్టు అని కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి పేర్కొన్నారు. భారత వైమానిక దళం, ఎయిర్‌పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా సంయుక్తంగా అభివృద్ధి చేయనున్న ఈ ఎయిర్‌ఫీల్డ్ వల్ల ఉత్తర తెలంగాణలో పారిశ్రామికాభివృద్ధి, పెట్టుబడులు, కార్గో రవాణా, పర్యాటకం, రక్షణ రంగాలకు విశేష ఊతం లభించడంతో పాటు వేలాది మంది యువతకు ప్రత్యక్ష, పరోక్ష ఉపాధి అవకాశాలు ఏర్పడతాయని అన్నారు.
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రత్యేక చొరవతో కేంద్ర రక్షణ మంత్రిత్వ శాఖ, పౌర విమానయాన మంత్రిత్వ శాఖ, ఎయిర్‌పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియాతో నిరంతర సమన్వయం ఫలితంగానే ఈ ప్రాజెక్టు వేగంగా ముందుకు సాగుతోందని మంత్రి తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం భూసేకరణ వ్యయంతో పాటు అన్ని అడ్డంకుల తొలగింపు ఖర్చును కూడా భరిస్తోందని చెప్పారు.
ప్రభుత్వ ఆదేశాల మేరకు భూసేకరణతో పాటు రహదారులు, విద్యుత్ లైన్లు, ఇతర మౌలిక వసతుల మార్పిడి పనులను 2026 డిసెంబర్ 31 నాటికి పూర్తి చేయాలని జిల్లా యంత్రాంగాన్ని ఆదేశించినట్లు మంత్రి వెల్లడించారు.
ప్రాంతీయ సమతుల అభివృద్ధే సీఎం రేవంత్ రెడ్డి ప్రభుత్వ లక్ష్యమని, ఆదిలాబాద్ జాయింట్ యూజర్ ఎయిర్‌ఫీల్డ్ ఉత్తర తెలంగాణ అభివృద్ధికి గేమ్‌చేంజర్‌గా నిలుస్తుందని మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి స్పష్టం చేశారు.
#Komatireddy #Telangana
The resignation of Union Education Minister Dharmendra Pradhan is a victory for the collective voice of students and youth across the country.
No government can ignore the aspirations of young India forever. This is a triumph of democracy, driven by students' movements, the Congress party's relentless fight, and Shri Rahul Gandhi's unwavering stand for justice.
Congress will continue to stand with students, protect their future, and fight for education, jobs, and democratic rights.
@RahulGandhi@INCIndia@INCTelangana
అణగారిన వర్గాల హక్కుల కోసం నిరంతరం పోరాడుతూ, సామాజిక న్యాయం కోసం అంకితభావంతో సేవలందిస్తున్న ఏఐసీసీ అధ్యక్షులు శ్రీ మల్లికార్జున ఖర్గే గారికి జన్మదిన శుభాకాంక్షలు.
@INCTelangana@TelanganaCMO
247 Staff Nurses Receive Appointment Letters from Deputy CM Bhatti Vikramarka and Minister Vivek Venkataswamy
247 మంది స్టాఫ్ నర్సులకు నియామక పత్రాలు అందజేసిన డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రి వివేక్ వెంకటస్వామి
MHSRB ద్వారా ఎంపికైన 247 మంది స్టాఫ్ నర్సులకు కొమురం భీం ఆదివాసీ భవన్లో నిర్వహించిన కార్యక్రమంలో ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క, మంత్రి డా. వివేక్ వెంకటస్వామి నియామక పత్రాలు అందజేశారు.
Deputy CM Mallu Bhatti Vikramarka and Minister Dr. Vivek Venkataswamy presented appointment letters to 247 staff nurses selected through the MHSRB at a programme held at Komuram Bheem Adivasi Bhavan.
#MHSRB #Telangana
🔹@Bhatti_Mallu 🔹@VivekVenkatswam
కొమరం భీమ్ ఆదివాసీ భవన్ లో కొత్తగా నియమితులైన ESI నర్సింగ్ సిబ్బందికి నియామక పత్రాల పంపిణీ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క గారితో కలిసి, ముఖ్య అతిథిగా పాల్గొనడం జరిగింది.
@INCTelangana@TelanganaCMO